అతిథి పాత్రలో విద్యాబాలన్ | Vidya Balan to make guest appearance in Marathi film | Sakshi
Sakshi News home page

అతిథి పాత్రలో విద్యాబాలన్

Published Sat, Sep 12 2015 3:07 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM

అతిథి పాత్రలో విద్యాబాలన్

అతిథి పాత్రలో విద్యాబాలన్

బాలీవుడ్ నటి విద్యాబాలన్ మరాఠీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టబోతోంది. దివంగత నటుడు, దర్శకుడు భగవాన్ దాదా జీవిత కథ ఆధారంగా తీస్తున్న సినిమాలో ఆమె అతిథిపాత్ర పోషించనుంది. అలనాటి అందాలనటి గీతా బాలి పాత్రను ఆమె పోషిస్తుంది. ఈ సినిమాలో భగవాన్ దాదా జీవితం, అల్బేలా చిత్రం తీసేటప్పుడు ఆయన ఎదుర్కొన్న కష్టాలు.. ఇవన్నీ అందులో ఉంటాయి.

1951లో విడుదలైన అల్బేలా సినిమాలో భగవాన్ దాదా, గీతా బాలి హీరో హీరోయిన్లుగా నటించారు. చిన్న పాత్ర అయినా.. గీతాబాలి పాత్రలో నటించడం తనకు చాలా పెద్ద గౌరవమని విద్యాబాలన్ చెబుతోంది. ఈ కొత్త సినిమాకు షేఖర్ సర్తాండెల్ దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement