Guest appearance
-
కల్కిలో హైలెట్ గా నిలిచిన గెస్ట్ అప్పియరెన్స్ స్..
-
ఒకే సినిమాలో అఖిల్, నాగచైతన్య
మనం సినిమా తరువాత మరోసారి అక్కినేని అందగాళ్లు ఒకే సినిమాలో కలిసి నటించేందుకు రెడీ అవుతున్నారు. మనం సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య, అఖిల్‌లు కూడా ఒకేసారి తెర మీద కనిపించి అక్కినేని అభిమానులకు కనుల విందు చేశారు. ఇప్పుడు మరోసారి వెండితెర మీద ఒకేసారి కనిపించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ సారి నాగ్ లేకుండా వారసులిద్దరూ కలిసి ఓ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇవ్వనున్నారు. అక్కినేని ఫ్యామిలీ నుంచే వచ్చిన మరో యంగ్ హీరో సుశాంత్ సినిమాలో అఖిల్, నాగచైతన్యలు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. నాగచైతన్య చిన్న పాత్రలో నటిస్తుండగా.., అఖిల్ ఓ పాటలో సుశాంత్‌తో కలిసి స్టెప్పేయనున్నాడు. చాలా రోజులుగా హీరోగా ప్రూవ్ చేసుకోవటం కోసం కష్టాలు పడుతున్న బావ కోసం అఖిల్, నాగచైతన్యలు ఈ నిర్ణయం తీసుకున్నారట. మరి అక్కినేని అందగాళ్లు సుశాంత్‌కు సక్సెస్ ఇస్తారో లేదో చూడాలి. -
యంగ్ హీరో తండ్రిగా వెంకీ..?
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో బాబు బంగారం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరో యంగ్ హీరో సినిమాలో అతిథి పాత్రలో నటించాడన్న టాక్ వినిపిస్తోంది. అది కూడా తన అల్లుడు నాగచైతన్య సినిమాలో కావటం మరో విశేషం. టాలీవుడ్లో ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు చేసే మల్టీ స్టారర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండటంతో నాగ చైతన్య, వెంకటేష్‌ల కాంబినేషన్.., సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. నాగ్ చైతన్య, ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ మూమీ ప్రేమమ్ రీమేక్‌లో నటిస్తున్నాడు. కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకీ అతిథి పాత్రలో కనిపించనున్నాడట. కొన్ని కీలక సన్నివేశాల్లో చైతూ తండ్రిగా వెంకీ నటించాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చే సీన్స్, షూట్ కూడా జరిగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. నిజ జీవితంలో మామ అల్లుళ్లు వెండితెర మీద తండ్రీ కొడుకులుగా ఎంతవరకు మెప్పిస్తారో చూడాలి. -
చైతూ సినిమాలో నాగ్?
మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘ప్రేమమ్’ తెలుగులో అదే పేరుతో నాగచైతన్య హీరోగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎస్.రాధాకృష్ణ, ఎస్. నాగవంశి, పీడీవీ ప్రసాద్ సమష్టిగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరో పాత్ర మూడు దశలుగా సాగుతుంది. ఆ మూడు దశల్ని తెర వెనుక నుంచి వ్యాఖ్యాతగా చెప్పడంతో పాటు సినిమాలో అతిథి పాత్రలో నటించమని నాగార్జునను చిత్రదర్శకుడు చందు మొండేటి కోరారట. నాగ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. అదే నిజమైతే ‘మనం’ తరువాత మళ్ళీ తన తండ్రితో కలసి నటించినందుకు నాగచైతన్య ఆనందపడతారని ఊహించవచ్చు. -
అల్లుడి సినిమాలో అతిథిగా..!
గోపాల గోపాల సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంటేష్, ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో బాబు బంగారం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరో యంగ్ హీరో సినిమాలో అతిథి పాత్రలో నటించడానికి రెడీ అవుతున్నాడు. అది కూడా తన అల్లుడు నాగచైతన్య సినిమాలో కావటం మరో విశేషం. టాలీవుడ్లో ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు చేసే మల్టీ స్టారర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండటంతో నాగచైతన్య, వెంకటేష్‌ల కాంబినేషన్.., సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. నాగ్ చైతన్య, ప్రస్తుతం మళయాల సూపర్ హిట్ మూమీ ప్రేమమ్ రీమేక్‌లో నటిస్తున్నాడు. కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకీ అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కీలకమైన కాలేజ్ ప్రిన్సిపాల్ పాత్రలో నటించడానికి వెంకటేష్ ఒకే చెప్పాడు. త్వరలోనే వెంకీ , చైతూల కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
అతిథి పాత్రలో విశ్వనటుడు
విశ్వనటుడు కమలహాసన్ తమిళంలో ఇప్పటి వరకూ అతిథి పాత్రలో మెరిసిన దాఖలాలు లేవు. తాజాగా మీన్‌కూళంబుమ్ మణ్‌పాణైయుమ్ చిత్రంలో అతిథి పాత్రలో దర్శనం ఇవ్వనున్నారు.ఆయన అతిథి పాత్రల్లో నటించడానికి అంగీకరించారంటే కారణం ఏదో ఉండే ఉంటుందని చెప్పనక్కర్లేదు. వివరాల్లోకెళ్లితే దివంగత మహా నటుడు శివాజీగణేశన్ మనవడు దుష్యంత్, అభిరామి దుష్యంత్ నిర్మాతలుగా మారి ఈశన్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం మీన్‌కూళంబుమ్ మణ్‌పాణైయుమ్. ప్రభు,కాళిదాస్ జయరామ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నటి పూజాకుమార్, ఆస్నా జవేరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో ఊర్వశీ, ఎంఎస్.భాస్కర్, సంతాన భారతి, ఆర్ఎస్.శివాజీ నటిస్తున్నారు. నవ దర్శకుడు అముదేశ్వర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రం షూటింగ్‌ను మలేషియాలో పూర్తి చేసుకుని యూనిట్ ఇటీవలే చెన్నైకి తిరిగొచ్చారని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఇందులో కమలహాసన్ నటించడం గురించి వారు తెలుపుతూ నడిగర్ తిలగంపై ప్రేమాభిమానాల కారణంగానే ఆయన అతిథి పాత్రలో నటించడానికి అంగీకరించినట్లు తెలిపారు.దీనికి ఆర్ఎస్.శివాజీ లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. -
జస్ట్ ఝలక్!
రెడీ... స్టార్ట్... కెమెరా...రోలింగ్... యాక్షన్... ఈ మాటలు హీరో చిరంజీవికి కొత్త కాదు. ఇప్పటివరకూ 149 సినిమాలకు ఈ మాటలు విన్నారు. ఒక్కసారి కెమెరా ఆన్ అయ్యిందా... పరిసరాలను మర్చిపోయి పాత్రలో మమేకమవడం ఈ మెగాస్టార్ స్టైల్. అయితే, ‘మగధీర’ తరువాత ఆయన ఈ మాటలకు దూరమయ్యారు. ఆరేళ్ళ పైచిలుకు తరువాత సోమవారం చిరంజీవి తనకిష్టమైన, అలవాటైన బరిలో మరోసారి జూలు విదిలించారు. అతిథి పాత్రతో ప్రేక్షకులకు ఝలక్ ఇవ్వడానికి సోమవారం నుంచి వరుసగా మూడు రోజులు ఈ మెగాస్టార్ సెట్స్‌లో ‘మెగా’ సందడి చేస్తున్నారు. రామ్‌చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ‘బ్రూస్లీ... ది ఫైటర్’లో చిరంజీవి చేస్తున్న అతిథి పాత్రకు సంబంధించిన చిత్రీకరణ మొదలైంది. డి. పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి అతిథి పాత్ర ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనీ, తండ్రినీ, తనయుణ్ణీ ఒకే ఫ్రేమ్‌లో చూడడం అభిమానులకు కనులపండుగనీ నిర్మాత పేర్కొన్నారు. చిరంజీవి ఈ సినిమాలో ఒక పాటతో పాటు ఫైట్ సీక్వెన్స్‌లో కనిపిస్తారని గతంలో విస్తృతంగా ప్రచారమైంది. అయితే, ఈ చిత్రంలో కీలకమైన ఒక ఫైట్‌లో మాత్రమే చిరంజీవి తెరపై కనిపించనున్నారు. అదీ కేవలం... మూడంటే మూడు నిమిషాల వ్యవధి ఉండే పాత్ర. అయితే, చిరంజీవి హీరోగా రానున్న పూర్తిస్థాయి సినిమాకు ఇది జస్ట్ ఒక చిన్న ఝలక్. రామ్ చరణ్ సైతం, ‘‘నాన్న షూటింగ్లో పాల్గొంటున్నారు. ఆయన మా ‘బ్రూస్లీ’లో భాగం కావడం సంతోషంగా ఉంది. హీరోగా ఆయన కమ్‌బ్యాక్ సినిమాకు ఇది జస్ట్ ఓ టీజర్’’ అని తన ఆనందాన్ని పంచుకున్నారు. రామ్‌చరణ్ ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని, ఫైటర్ పాత్ర చేస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయిక. అక్టోబర్ 2న ‘బ్రూస్లీ’ పాటల్నీ, 16న చిత్రాన్నీ విడుదల చేయాలనుకుంటున్నారు. మూడు నిమిషాల అతిథి పాత్ర అయితేనేం, అభిమానులతో పాటు ఇప్పుడు ఫిల్మ్ నగర్ అంతా చిరంజీవి గురించే మాట్లాడుకుంటున్నారు. స్లిమ్‌గా తయారై, అందరినీ ఆకట్టుకొనేలా మారిన చిరు అసలుసిసలు కమ్‌బ్యాక్ ఫిల్మ్ కోసమే ఇప్పుడు అంతా వెయింటింగ్. -
అతిథి పాత్రలో విద్యాబాలన్
బాలీవుడ్ నటి విద్యాబాలన్ మరాఠీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టబోతోంది. దివంగత నటుడు, దర్శకుడు భగవాన్ దాదా జీవిత కథ ఆధారంగా తీస్తున్న సినిమాలో ఆమె అతిథిపాత్ర పోషించనుంది. అలనాటి అందాలనటి గీతా బాలి పాత్రను ఆమె పోషిస్తుంది. ఈ సినిమాలో భగవాన్ దాదా జీవితం, అల్బేలా చిత్రం తీసేటప్పుడు ఆయన ఎదుర్కొన్న కష్టాలు.. ఇవన్నీ అందులో ఉంటాయి. 1951లో విడుదలైన అల్బేలా సినిమాలో భగవాన్ దాదా, గీతా బాలి హీరో హీరోయిన్లుగా నటించారు. చిన్న పాత్ర అయినా.. గీతాబాలి పాత్రలో నటించడం తనకు చాలా పెద్ద గౌరవమని విద్యాబాలన్ చెబుతోంది. ఈ కొత్త సినిమాకు షేఖర్ సర్తాండెల్ దర్శకత్వం వహిస్తున్నారు. -
ఎన్ని వివాదాలు వస్తే అంత మంచిది!
‘‘వర్కింగ్ స్టయిల్ పరంగా నార్త్‌కి, సౌత్‌కి చాలా తేడా ఉంది. దక్షిణాదిన ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఒక నియమం ప్రకారం పని చేస్తూ ఉంటారు. కానీ, ఉత్తరాదిన అలా కాదు... తమకు నచ్చినట్లు పని చేస్తారు’’ అని లక్ష్మీరాయ్ అంటున్నారు. తమిళ చిత్రం ‘మౌన గురు’ హిందీ రీమేక్ ‘అకీరా’ ద్వారా ఆమె బాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సొనాక్షీ సిన్హా కథానాయిక. ఇందులో లక్ష్మీ రాయ్ అతిథి పాత్ర చేస్తున్నారు. బాలీవుడ్ వర్కింగ్ స్టయిల్ కొత్తగా ఉందని, కానీ ఎంజాయబుల్‌గా ఉందని లక్ష్మీ రాయ్ చెబుతూ - ‘‘సౌత్‌లో వివాదాలంటే కంగారుపడతారు. ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భయపడతారు. కానీ, నార్త్‌లో అలా కాదు. వివాదాలను కోరుకుంటారు. ఎన్ని వివాదాలొస్తే అంత మంచిదని, బోల్డంత పాపులార్టీ వస్తుందని భావిస్తారు. కానీ, నేను మాత్రం పాపులార్టీ కోసం వివాదాలు కోరుకోవడంలేదు’’ అన్నారు. ‘అకీరా’లో చేస్తున్నది అతిథి పాత్రే అయినా మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉందని ఆమె తెలిపారు. బాలీవుడ్ నుంచి లక్ష్మీరాయ్‌కి మరికొన్ని అవకాశాలు వస్తున్నాయట. ప్రస్తుతం అవి చర్చల దశలో ఉన్నాయని, అధికారికంగా సైన్ చేసిన తర్వాత ఆ చిత్రాల వివరాలు తెలియజేస్తానని లక్ష్మీ రాయ్ చెప్పారు.