శోభితతో పెళ్లి.. జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్నా: నాగచైతన్య | Naga Chaitanya Interesting Comments About Life After Marrying Sobhita Dhulipala, Deets Inside | Sakshi
Sakshi News home page

Naga Chaitanya: అదే మమ్మల్ని ఒక్కటి చేసింది.. శోభితతో కలిసి సినిమా చేస్తా!

Published Fri, Jan 31 2025 4:16 PM | Last Updated on Fri, Jan 31 2025 5:41 PM

Naga Chaitanya About Life After Marrying Sobhita Dhulipala

లవ్‌స్టోరీ సినిమా తర్వాత నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి మరోసారి జత కట్టిన మూవీ తండేల్‌ (Thandel Movie). కార్తికేయ 2 ఫేం చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీపై నిర్మాత అల్లు అరవింద్‌ ధీమాగా ఉన్నాడు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్నా..
వైజాగ్‌ తనకు స్పెషల్‌ అని.. అక్కడ సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆడాల్సిందే అన్నాడు. వైజాగ్‌ తనకు ఎంత క్లోజ్‌ అంటే వైజాగ్‌ అమ్మాయి (శోభిత)ని ప్రేమించి, పెళ్లి చేసుకున్నానని.. ఇప్పుడు తన ఇంట్లో రూలింగ్‌ పార్టీ వైజాగే ఉందన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చై.. వైజాగ్‌ రూలింగ్‌ పార్టీ గురించి మాట్లాడాడు. వైవాహిక జీవితం చాలా బాగుంది. ప్రస్తుతం లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాను. మా పెళ్లయి కొన్ని నెలలే అవుతోంది. ఈ సమయంలో ఇద్దరం ఓపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క మాకంటూ ప్రత్యేక సమయం కేటాయించుకుంటున్నాం. 

(చదవండి: 93% సినిమాలు ఫ్లాప్‌.. వెయ్యి కోట్ల నష్టం.. నిర్మాతల కంట రక్తకన్నీరు!)

అదే మమ్మల్ని ఒకటిగా..
వర్క్‌ లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేసుకుంటున్నాం. మా ఇద్దరికీ ఉన్న సేమ్‌ లక్షణాల్లో ఇదీ ఒకటి. అలాగే సినిమాపై మాకున్న ప్రేమ మాటల్లో చెప్పలేనిది. జీవితంపైనా మాకు ఎంతో ఆసక్తి ఉంది. అదే మమ్మల్ని ఒకటిగా ముందుకు నడిపించింది. మాకు ట్రావెలింగ్‌ అంటే కూడా ఇష్టం. భవిష్యత్తులో శోభిత, నేను ఒకే సినిమాలో కలిసి నటిస్తామా? లేదా? అన్నది నేనిప్పుడే చెప్పలేను. మంచి స్క్రిప్ట్‌ మమ్మల్ని వెతుక్కుంటూ వస్తే మాత్రం తప్పకుండా చేస్తాం అన్నాడు.

గతంలో నాగచైతన్య.. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత పొరపచ్చాలు రావడంతో ఆమెకు విడాకులు ఇచ్చాడు. గతేడాది హీరోయిన్‌ శోభితను రెండో పెళ్లి చేసుకున్నాడు.

చదవండి: పెళ్లి తర్వాత నా భర్తనే మారిపోయాడు: వరలక్ష్మి శరత్ కుమార్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement