అతిథి పాత్రలో విశ్వనటుడు | kamal hasan in guest roll | Sakshi
Sakshi News home page

అతిథి పాత్రలో విశ్వనటుడు

Published Sun, Mar 6 2016 2:19 AM | Last Updated on Sun, Sep 3 2017 7:04 PM

అతిథి పాత్రలో విశ్వనటుడు

అతిథి పాత్రలో విశ్వనటుడు

విశ్వనటుడు కమలహాసన్ తమిళంలో ఇప్పటి వరకూ అతిథి పాత్రలో మెరిసిన దాఖలాలు లేవు. తాజాగా మీన్‌కూళంబుమ్ మణ్‌పాణైయుమ్ చిత్రంలో అతిథి పాత్రలో దర్శనం ఇవ్వనున్నారు.ఆయన అతిథి పాత్రల్లో నటించడానికి అంగీకరించారంటే కారణం ఏదో ఉండే ఉంటుందని చెప్పనక్కర్లేదు. వివరాల్లోకెళ్లితే దివంగత మహా నటుడు శివాజీగణేశన్ మనవడు దుష్యంత్, అభిరామి దుష్యంత్ నిర్మాతలుగా మారి ఈశన్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం మీన్‌కూళంబుమ్ మణ్‌పాణైయుమ్. ప్రభు,కాళిదాస్ జయరామ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నటి పూజాకుమార్, ఆస్నా జవేరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇతర ముఖ్య పాత్రల్లో ఊర్వశీ, ఎంఎస్.భాస్కర్, సంతాన భారతి, ఆర్‌ఎస్.శివాజీ నటిస్తున్నారు. నవ దర్శకుడు అముదేశ్వర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రం షూటింగ్‌ను మలేషియాలో పూర్తి చేసుకుని యూనిట్ ఇటీవలే చెన్నైకి తిరిగొచ్చారని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఇందులో కమలహాసన్ నటించడం గురించి వారు తెలుపుతూ నడిగర్ తిలగంపై ప్రేమాభిమానాల కారణంగానే ఆయన అతిథి పాత్రలో నటించడానికి అంగీకరించినట్లు తెలిపారు.దీనికి ఆర్‌ఎస్.శివాజీ లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement