
సౌత్ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదోవిధంగా వార్తల్లో ఉండడానికి ప్రయత్నించే నటీమణుల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కథానాయకిగా నటిస్తూ ఇండియన్ నటిగా గుర్తింపు పొందిన నటి ఈమె. తెలుగు చిత్రం మగధీరతో కాజల్ అగర్వాల్ లక్ మొదలైందనే చెప్పాలి. అంతకుముందు కొన్ని చిత్రాల్లో నటించినా సరైన బ్రేక్ రాలేదు. అలాంటిది మగధీర చిత్రం తరువాత స్టార్ హీరోయిన్‌ల లిస్టులో చేరిపోయింది. అంతేకాకుండా వరుసగా ప్రముఖ నటుల సరసన నటించే అవకాశాలను సంపాదించుకుంది.
(ఇదీ చదవండి: టాప్ లేకుండా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతారు: అర్చన)
అలా అగ్రకథానాయకిగా నటిస్తుండగానే గౌతమ్ కిచ్లుతో ప్రేమలో పడి 2020లో సైలెంట్‌గా పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి అయిపోవడంతో కాజల్ అగర్వాల్ సినీ కెరియర్‌కు ఫుల్‌స్టాప్ పడినట్టే అనే ప్రచారం జరిగింది. అలాంటిది ఈమెను ఇండియన్–2 చిత్రం కాపాడిందని చెప్పాలి. ఈ చిత్రంలో నటిస్తుండగానే కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది. ఇదంతా జరగడానికి రెండేళ్లు పట్టింది. అయితే అలాంటి పరిస్థితుల్లో ఇండియన్–2 చిత్రం పలు కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది.
(ఇదీ చదవండి: Spy Trailer:యాక్షన్ సీన్లతో నిఖిల్ దుమ్ములేపాడు)
మళ్లీ షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి కాజల్ అగర్వాల్ మళ్లీ నటించడానికి సిద్ధమైంది. అందుకు చాలా కసరత్తులే చేసింది. కాగా ఇండియన్–2 చిత్రం ఇంకా పూర్తి కాలేదు. అంతలోనే కాజల్ అగర్వాల్ తెలుగులో మరో రెండు చిత్రాలలో నటించే అవకాశాలు వరించాయి. దీంతో కాజల్ గ్రాఫ్ మళ్లీ పెరగడం ఖాయమనే వార్తలు వెలువడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment