కాజల్ అగర్వాల్
బుధవారం రాత్రి చెన్నైలో ‘ఇండియన్ 2’ సెట్లో ఘోర ప్రమాదం జరిగింది. చిత్రీకరణ కోసం ఏర్పాటు చేసిన భారీ క్రేన్ కూలిపోవడంతో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఆ క్రేన్ కూలిన చుట్టుపక్కలే కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ తదితర తారాగణం ఉన్నారట. మరోవైపు దర్శకుడు శంకర్ తన టీమ్‌తో మానిటర్‌లో షాట్ చెక్ చేసుకుంటున్నారట. శంకర్ కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి కమల్ స్పందిస్తూ– ‘‘నేను చాలా ప్రమాదాలను చూశాను కానీ ఇది చాలా తీవ్రమైనది. చనిపోయిన వారి కుటుంబ సభ్యుల బాధను వర్ణించలేం’’ అన్నారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు కోటి రూపాయిల విరాళం ప్రకటించారాయన.
‘‘ఈ ఘటనకు చాలా షాక్ అయ్యాను. ఇంకా తేరుకోలేకపోతున్నా. అంతా క్షణికంలో జరిగిపోయింది. ఆ ప్రమాదంలో ఏమీ జరగకుండా సురక్షితంగా ఉండి, ఈ ట్వీట్ చేస్తున్నందుకు దేవుడికి కృతజ్ఞురాలిని. ఈ ఘటనతో జీవితం విలువ, సమయం విలువ అర్థం అయింది. ఈ ప్రమాదంలో చనిపోయినవారి ఆత్మలకు శాంతి చేకూరాలనుకుంటున్నా’’ అని ట్వీట్ చేశారు కాజల్.
Comments
Please login to add a commentAdd a comment