'Kajal Aggarwal' Indian 2 New Look Photos Goes Viral - Sakshi
Sakshi News home page

కాజల్‌ న్యూలుక్‌.. వైరల్‌ అవుతున్న ఫోటోలు

Dec 17 2022 8:14 AM | Updated on Dec 17 2022 8:47 AM

Kajal Aggarwal New Look Indian 2 Movie  - Sakshi

సాధారణంగా హీరోయిన్లు స్లిమ్‌గా,  నాజూగ్గా తయారు అవడానికే ఇష్టపడుతుంటారు. అందుకు తగిన కసరత్తు కూడా చేస్తుంటారు. బరువు పెంచడం అన్నది అతి తక్కువ మంది నటీమణులే చేస్తుంటారు. కాజల్‌ అగర్వాల్‌ గురించి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. గత ఏడాది ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ నటనకు స్వస్తి చెప్తారని అందరూ భావించారు.

 ఆమె ఇంతకుముందు నటించడానికి ఒప్పందం కుదుర్చుకున్న ఇండియన్‌– 2 చిత్రం నుంచి తొలగిస్తున్నట్లు, ఆ పాత్రలో మరో నటిని ఎంపిక చేయడానికి దర్శకుడు శంకర్‌ సిద్ధమైనట్టు ప్రచారం కూడా జరిగింది. అందరి ఊహలను తలకిందులు చేస్తూ కాజల్‌ అగర్వాల్‌ తల్లి అయిన మూడు నాలుగు నెలలకే నటించడానికి సిద్ధమైంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఆమె మరింత అందంగా తయారవ్వడం విశేషం. ఈమె కమలహాసన్‌ జంటగా ఇండియన్‌ – 2 చిత్రంలో నటించడానికి సిద్ధమైంది. అందుకు గుర్రపు స్వారీ, కత్తి సాము వంటి విద్యల్లోనూ శిక్షణ పొందింది.

 తాజాగా కాజల్‌ అగర్వాల్‌ కాస్త బరువెక్కింది. ఆ ఫొటోలను తన ట్విట్టర్లో పొందుపరిచింది. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇండియన్‌– 2 చిత్రంలో కమలహాసన్‌ 90 ఏళ్ల వృద్ధుడిగా నటిస్తున్నట్లు తాజా సమాచారం. ఇప్పుడు నటి కాజల్‌ బరువు పెరగడానికి ఈ చిత్ర కథకు సంబంధం ఉందనే ప్రచారం సాగుతోంది.  



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement