photo viral
-
అనంత్-రాధిక క్రూయిజ్ పార్టీ : మెరిసిన రాధిక, ఫోటోలు వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన ప్రేయసి రాధికా మర్చంట్‌ను జులైలో పెళ్లి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే మార్చిలో అనంత్-రాధిక తొలి ప్రీవెడ్డింగ్ పార్టీని ఘనంగా నిర్వహించారు. ఆ తరువాత కనీవినీ ఎరుగని రీతిలో ఇటలీలో రెండొ ప్రీ-వెడ్డింగ్ వేడుకను గ్రాండ్ క్రూయిజ్ పార్టీలో నిర్వహించారు. మే 29న ప్రారంభమై జూన్ 1న ఫ్రాన్స్‌లో ముగిసిన ఈ వేడుకలో పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు సందడి చేసిన సంగతి తెలిసిందే.తాజాగా అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ఫోటోలు ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనంత్ రాధికా వివాహం జరగనుంది. మూడు రోజుల పాటు జరిగే వివాహ వేడుకలో మూడు ఈవెంట్లు ఉండ బోతున్నాయి. తొలుత 'శుభ వివాహ' ఆ తర్వాత జూలై 13న 'శుభ్ ఆశీర్వాద్' , 'మంగళ ఉత్సవ్', జూలై 14న వివాహ రిసెప్షన్ ఉంటుంది. అనంత్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్‌ఫారమ్‌లు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్, రిలయన్స్ న్యూ ఎనర్జీ , రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీ బోర్డులలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు -
‘పాపం..దొంగ గారు.. ఏసీ చూడగానే ఫ్లాట్!’ కట్ చేస్తే..!
దేశంలోఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోద వుతున్నాయి. ఏసీ, ఫ్యాన్లు లేనిదే క్షణం కూడా ఉండలేని పరిస్థితి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. చోరీకి వచ్చిన ప్రబుద్ధుడు, ఎంచక్కా ఏసి వేసుకొని ఆదమరిచి నిద్ర పోయిన ఘటన, ఫోటో వైరల్‌గా మారింది.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఉన్న ఇంట్లోకి చోరీకి చొరడ్డాడో వ్యక్తి. అసలే పగలూ రాత్రి తేడా లేకుండా మండే ఎండలు పైగా పూర్తిగా మద్యం మత్తులో ఉన్న అతగాడు, ఏసీ చూడగానే మైమరిచిపోయాడు. ఏసీ ఆన్ చేసుకొని, నేలమీదే ఒక దిండు వేసుకుని హాయిగా గుర్రు కొట్టి నిద్ర పోయాడు. తెల్లవారేక ఇంటి ముందు గేటు తెరిచి ఉండడంతో వారణాసిలో విధులు నిర్వహిస్తున్న సదరు ఇంటి యజమాని డాక్టర్ సునీల్ పాండేకు సమాచారం అందించారు పొరుగువారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి చ్చింది. సంఘటనా చేరుకున్న పోలీసులు కూడా విస్తుపోయారు. చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని అలాగే గాఢనిద్రలోకి జారుకున్నాడు. చిత్రం వైరల్‌గా మారింది. దొంగ తనం చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి నిద్రపోయాడని డీసీపీ నార్త్ జోన్ ఆర్ విజయ్ శంకర్ తెలిపారు. అతణ్ని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి చర్యలకు ఉపక్రమించారు. -
Natarajan Birthday Photos: నటరాజన్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. కేక్ తినిపించిన అజిత్ (ఫోటోలు)
-
సన్నీలియోన్ కానిస్టేబుల్ పరీక్షకు అప్లై చేశారా?
సెలబ్రిటీలకు సంబంధించిన ఫొటోలు పలు ప్రభుత్వ పథకాల దరఖాస్తుల్లో కనిపిస్తూ అందరినీ అశ్చర్యపరుస్తాయి. ఎన్నికల ఐడీ, అధార్ కార్డుల్లో కూడా చాలా మంది సెలబ్రిటీల ఫొటో ప్రక్షత్యమైన సందర్భాలు కూడా చూశాం. అయితే ప్రముఖ బాలీవుడ్ నటీ సన్నీలియోన్‌కు సంబంధించిన ఫొటో సైతం ఓ పోటీపరీక్షల దరఖాస్తులో కనిపించటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని పోలీసు కానిస్టేబుల్ ప్రరీక్ష దరఖాస్తులో ఓ అభ్యర్థి సన్నిలియోన్ ఫొటోతో అప్లై చేశారు. అయితే రిజిస్ట్రషన్ ప్రాసెస్‌లో సన్నీలియోన్ ఫొటోతో అప్లై చేసిన సదరు అప్లికేషన్‌కు అడ్మిట్ కార్డు కూడా జారీ అయింది. ప్రస్తుతం ఈ అడ్మిట్‌కార్డు నెట్టింట హల్చల్ చేస్తోంది. అడ్మిట్‌కార్డు వివరాల ప్రకారం.. న్నౌజ్ తిర్వాలోని శ్రీమతి సోనేశ్రీ మెమోరియల్ బాలికల కళాశాల సన్నీలియోన్‌కు పరీక్ష కేంద్రంగా కేటాయించబడట గమనార్హం. ఫిబ్రవరి 17, 18 రెండు రోజుల పాటు యూపీలో పోలీసు ఉద్యోగాలకు పరీక్షలు జరుగుతున్నాయి. Sunny Leone applied for UP police constable examination....😅😅 pic.twitter.com/YuxYMzGjwt — Simple man (@ArbazAh87590755) February 17, 2024 మరోవైపు.. అభ్యర్థుల సమచారంలో అవకతకలు, అక్రమైన మార్గాల్లో పరీక్ష రాయాలని వేసుకున్న ప్రణాళికను భగ్నం చేస్తూ.. గత రెండు రోజుల్లో సుమారు 120 మంది అభ్యర్థులను అరెస్ట్ చేసినట్టు అక్కడి పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అయితే నెట్టింట్లో వైరల్ అయిన సన్నీలియోన్ అడ్మిట్ కార్డుపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘యూపీ పోలీసు కానిస్టేబుల్ పరీక్షకు సన్నీలియోన్ అప్లై చేశారా?’ అని ఓ ‘ఎక్స్’ (ట్విటర్) హ్యాండిల్ కామెంట్ చేసింది. దీనిపై స్పందించిన యూపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు స్పందిస్తూ... సన్నీలియోన్ పేరు, ఫొటోతో ఉన్న అడ్మిట్‌కార్డు నకిలీది అని స్పష్టం చేసింది. -
వాట్సాప్ స్టేటస్.. ఇద్దర్ని బలిగొంది
మైసూరు: సోషల్ మీడియా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నా, జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలే పోతాయని అనేకసార్లు రుజువైంది. సామాజిక మాధ్యమాల్లో తమ ఇద్దరి ఫోటో వైరల్‌గా మారడంతో ఇరు కుటుంబాల ఘర్షణ పడగా, మనస్తాపానికి గురై గృహిణి, మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని హుణసూరులో జరిగింది. హుణసూరులోని కల్కుణి నివాసి వివాహిత శృతి (28), మురళి (20) ఆత్మహత్య చేసుకున్నవారు. వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఇద్దరు కలసి ఉన్న ఫోటోను మురళి వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోగా ఊళ్లో చాలామంది అది చూశారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. దీంతో భయపడిపోయిన శృతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది తెలిసి మురళి కూడా భయంతో ప్రాణాలు తీసుకున్నాడు. -
ఈ రైల్వే స్టేషన్ పేరు సచిన్!
స్టేడియంల సంగతి ఏమిటోగానీ రైల్వేస్టేషన్లకు క్రికెటర్ల పేర్లు ఊహించలేము. అయితే గుజరాత్‌లోని సూరత్ సమీపంలోని ఒక రైల్వేస్టేషన్ పేరు సచిన్. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఈ రైల్వేస్టేషన్ ముందు దిగిన ఫోటో వైరల్‌గా మారింది. ‘ఈ రైల్వేస్టేషన్‌కు మన ఆల్‌టైమ్ గ్రేట్ క్రికెటర్లలో ఒకరైన నా ఫేవరెట్ క్రికెటర్, నా అభిమాన వ్యక్తి పేరు పెట్టారు. గత శతాబ్దానికి చెందిన పెద్దల ముందు చూపు అబ్బురపరుస్తుంది’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాశాడు సునీల్ గవాస్కర్. ఇది చూసి ‘సచిన్‌లో సన్నీని చూడడం ఆనందంగా ఉంది’ అంటూ స్పందించాడు సచిన్ తెందూల్కర్. నిజానికి ఈ రైల్వేస్టేషన్‌కి ‘సచిన్’ అనే పేరు సచిన్ తెందూల్కర్ తాతముత్తాల కాలంలోనే ఉంది. సచిన్ తెందూల్కర్ పేరుకు, ఈ రైల్వేస్టేషన్ పేరుకు ఎలాంటి సంబంధం లేకపోయినా సరదా కోసం ‘పూర్వీకుల ముందుచూపు అబ్బురపరిచింది’ అని రాశాడు గవాస్కర్. -
స్పోర్ట్స్ ఈవెంట్లో మెరిసిన రణబీర్, అలియా...మరో విశేషమేమంటే..!
న్యూఢిల్లీ: ముంబైలో జరిగిన ఇండియన్ సూపర్ లీగ్ మ్యాచ్‌లో బాలీవుడ్ లవబుల్ కపుల్ సందడి చేశారు. బ్రహ్మాస్త్ర జంట అలియా భట్, రణబీర్ కపూర్ తళుక్కున మెరిసారు. అదీ ISLని నిర్వహించే ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ చైర్పర్సన్ నీతా అంబానీతో కలిసి ఆదివారం సందడి చేశారు. ఇండియన్ సూపర్ లీగ్ (ISL) ముంబై సిటీ FC vs కేరళ బ్లాస్టర్ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు బాలీవుడ్ తారలతో పాటు, నీతా అంబానీ ,అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అలియా, రణబీర్ జంటను నీతా ప్రత్యేకంగా అభినందించారు. ఇండియన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ ముంబై సిటీ FC సహ-యజమాని ఏ దిల్ హై ముష్కిల్ హీరో రణబీర్ తన జట్టుకు మద్దతుగా స్పోర్ట్స్ ఈవెంట్లో, ఇనీషియల్స్‌తో పాటు వెనుక ఎనిమిది నంబర్ ప్రింట్ చేసిన బ్లాక్ జెర్సీలో బ్యూటిఫుల్‌గా ఫ్యాన్స్‌ను అలరించాడు. బ్లాక్ కార్గో-స్టైల్ ప్యాంటు,మ్యాచింగ్ బ్లాక్ క్యాప్‌ను ధరించగా, ప్లస్ వన్ బ్లూ జెర్సీలో అలియా చేతులు పట్టుకుని స్టేడియంలోకి ప్రవేసించారు. అక్కడ ఫ్యాన్స్‌తో, సెల్పీలకు పోజులిచ్చారు. ఈ క్రమంలో ఒలింపిక్ అధ్యక్షురాలు నీతి అంబానీతో కలిసి పోజులివ్వడం విశేషంగా నిలిచింది. రణబీర్, అలియా జంట క్రీడాభిమాన్లు. గత నెలలో న్యూయార్క్‌లో విహారయాత్ర చేస్తున్నప్పుడు, ఈ జంట యూఎస్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో కూడా మెరిసిన సంగతి తెలిసిందే . కాగా అంబానీ నివాసంలో జరిగిన గణేష్ చతుర్థి వేడుకలకు గత నెలలో, అలియా, బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీతో కలిసి హాజరయ్యారు. అయితే ఈ వేడుకుకు భర్త రణ్‌బీర్ ఈవెంట్‌కు మిస్సయ్యాడు. ఇక వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే నేషనల్ అవార్డు విన్నర్ అలియాస్వయంగా నిర్మిస్తున్న జిగ్రా అనే యాక్షన్ చిత్రంలోనూ నటిస్తూ, నిర్మిస్తోంది. రణవీర్ సింగ్‌తో కలిసి బైజు బావ్రా అనే పీరియాడికల్ డ్రామాలో నటిస్తోంది. అలాగే రణబీర్ కపూర్ యానిమల్ కోసం సిద్ధమవుతున్నాడు. బాబీ డియోల్, అనిల్ కపూర్ , నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా నటించిన ఈ మూవీ డిసెంబర్ 1న థియేటర్లలో విడుదల కానుంది. -
మణిపూర్‌లో వెలుగులోకి మరో ఘోరం
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రెండు వర్గాల మధ్య ఘర్షణలతో నాలుగు నెలలుగా అట్టుడుకుతూనే ఉంఇ... ఈ ఏడాది మార్చిలో కుకీ, మైతీ కమ్యూనిటీల మధ్య రాజుకున్న వైరం రానురానూ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఇప్పుడిప్పుడే హింసాకాండ నుంచి రాష్ట్రం కోలుకుంటుండగా మళ్లీ అల్లర్లు తలెత్తాయి. తాజాగా మణిపూర్‌లో మరో అఘాయిత్యం వెలుగుచూసింది. మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థుల అదృశ్యం, హత్య ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జూలైలో కనిపించకుండాపోయిన ఇద్దరు విద్యార్థులు అల్లరిమూకల స్వాధీనంలో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేగాక తప్పిపోయిన విద్యార్థులు అత్యంత దారుణంగా హత్యకు గురైన ఫోటో కూడా నెట్టింట్లో సంచలనంగా మారింది. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన నెటిజన్లు.. ఈ కేసును చేధించడానికి పోలీసులకు ఇంత సమయం ఎందుకు పట్టిందంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అసలేం జరిగిందంటే.. మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు 17 ఏళ్ల హిజామ్ లిన్‌తోఇంగంబి, 20 ఏళ్ల ఫిజామ్ హేమ్‌జిత్ జూలై నుంచి కనిపించకుండా పోయారు. ఈ క్రమంలో తాజాగా వారు అడవిలోని గడ్డి మైదానంలో కూర్చుని, వారి వెనకాల కొంచెం దూరంలో సాయుధ గ్రూప్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్న ఫోటో ఒకటి నెట్టింట్లో ప్రత్యక్షమైంది. చదవండి: నేడు కవిత ఈడీ సమన్ల పిటిషన్ విచారణ ఇందులో లింతోంగంబి తెల్లటి టీ-షర్ట్‌లో ఉండగా, మిస్టర్ హేమ్‌జిత్, బ్యాక్‌ప్యాక్‌ను పట్టుకుని, చెక్డ్ షర్ట్‌లో ఉన్నారు. వారి వెనుక ఇద్దరు సాయుధ వ్యక్తులు తుపాకీలతో స్పష్టంగా కనిపిస్తున్నారు. మరో ఫోటోలో ఇద్దరి మృతదేహాలను నేలపై పడేసినట్లు కనిపిస్తుంది. జూలైలో ఓ షాపుల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో ఇద్దరు విద్యార్థులు కనిపించినా వారి జాడ తెలియలేదు. ఈ ఫోటోలు వైరల్‌గా మారాడంతో మణిపూర్ ప్రభుత్వం స్పందించింది. జూలై నుంచి తప్పిపోయిన ఇద్దరు విద్యార్థుల ఫోటోలు సోషల్ మీడియాలో రావడం తమ దృష్టికి వచ్చినట్లు మణిపూర్ ప్రభుత్వం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కేసును ఇప్పటికే సీబీఐకి అప్పగించినట్లు పేర్కొంది. రాష్ట్ర పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారంతో విచారిస్తున్నట్లు వెల్లడించింది. విద్యార్థులు ఎలా అదృశ్య మయ్యారు? ఎవరు కిడ్నాప్ చేశారు? వారిని హత్య చేసిన నేరస్థులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు ప్రభుత్వం పేర్కొంది. హేమ్‌జిత్, లింతోయింగంబి కిడ్నాప్, హత్యకు కారకులైన వారిపై వేగవంతమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, విచారణాధికారులు తమ పని తాము చేసుకోనివ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ కేసు దర్యాప్తులో అధికారులు అధునాతన సైబర్ ఫోరెన్సిక్స్ సాధనాలను ఉపయోగించనున్నారని వీటి ద్వారా ఫోటోలు మరింత స్పష్టంగా చేసి అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులను గుర్తించేందుకు తోడ్పడనున్నట్లు తెలిపింది. చదవండి: గణేష్ నిమజ్జనం ఊరేగింపులో విషాదం Indian Media has been mediocre at straightforward stories. Bharka got an A+ on her coverage on Covid. Karan did many insightful coverages in the past. How did all of them fail so spectacularly on multi-layered stories in Manipur where they bit hook, line and sinker on what they… pic.twitter.com/7UF1ljvO3o — Skeeper (@Skeeper10) September 25, 2023 -
వైరల్‌గా మారిన అపాయింట్మెంట్ లెటర్.. ధోని నెలజీతం ఎంతంటే?
టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని కొన్నేళ్ల పాటు క్రికెట్లో అత్యంత ధనవంతమైన(Richest Cricketer) ఆటగాడిగా కొనసాగాడు. ఆటకు రిటైర్మెంట్ ఇచ్చినప్పటికి ధోని వార్షిక ఆదాయం ప్రస్తుతం సంవత్సరానికి రూ. 1040 కోట్లు ఉండడం విశేషం. ధోని వార్షిక ఆదాయం.. కోహ్లి కంటే(రూ.1050 కోట్లు) కేవలం పది కోట్లు మాత్రమే తక్కువగా ఉంది. దేశానికి ప్రాతినిధ్యం వహించిన సమయంలో బీసీసీఐ కాంట్రాక్ట్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న క్రికెటర్‌గా ధోని రికార్డులకెక్కాడు. ఇక ఆటను మినహాయిస్తే అడ్వర్టైజ్మెంట్స్, ఎండార్స్మెంట్ల రూపంలో వద్దన్నా కోట్లు వచ్చి పడేవి. అలాంటి ధోని క్రికెట్లోకి రాకముందు రైల్వే శాఖలో ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్‌గా(TTE) విధులు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ధోని పేరిట 2012కు సంబంధించిన పాత అపాయింట్మెంట్ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండియన్ సిమెంట్స్‌లో వైస్ ప్రెసిడెంట్(ఆఫీస్ కేడర్) పోస్టుకు ధోనిని ఎంపిక చేసినట్లుగా అపాయింట్మెంట్ లెటర్లో ఉంది. ఇక ఈ పోస్టు కింద ధోని నెల జీతం రూ. 43వేలు(రూ.12,650-47,650)గా ఉండడం ఆశ్చర్యపరిచింది. నెలజీతంతో పాటు అదనంగా స్పెషల్ పే కింద రూ 20వేలు, ఫిక్స్డ్ అలెవెన్స్ కింద మరో రూ. 21,970 ఉన్నాయి. ఇవీ గాక HRA(హౌస్ రెంటల్ అలెవెన్స్) కింద రూ.20,400.. స్పెషల్ హౌస్ రెంట్ అలెవెన్స్ కింద మరో రూ.8,400..(సబ్ ప్లాంట్స్‌లో పనిచేస్తే అదనంగా మరో రూ.8 వేలు).. ఏ బెనిఫిట్స్ లేని స్పెషల్ అలెవెన్స్ కింద రూ. 60వేలు, న్యూస్‌పేపర్ ఖర్చుల కింద రూ.175 ఇవ్వనున్నట్లు లెటర్లో పేర్కొన్నారు. మొత్తంగా వైస్ ప్రెసిడెంట్ హోదాలో ధోని సుమారు రూ. లక్షా 60వేలకు పైగా నెలజీతం రూపంలో అందుకున్నాడు. ఇక ఈ లెటర్‌ను ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Lalit Modi (@lalitkmodi) కాగా అప్పటికే వేల కోట్లు సంపాదిస్తున్న ధోని ఈ జాబ్ చేశాడా లేదా అన్నది పక్కనబెడితే.. అప్పటికి టీమిండియా కెప్టెన్‌గా ఉన్న ధోని బ్రాండ్‌వాల్యూ ఎంతలా ఉందనేది ఈ లెటర్ చెప్పకనే చెప్పింది. ఇక ఇండియా సిమెంట్స్ ఎవరిదన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఇండియా సిమెంట్స్ అనుబంధ సంస్థ. ఐపీఎల్ ప్రారంభం నుంచి సీఎస్కేతోనే బంధం కొనసాగిస్తే వస్తోన్న ధోని విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు సీఎస్కేకు ఐదు టైటిల్స్ అందించిన ధోని.. రోహిత్‌తో(ముంబై ఇండియన్స్)తో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. 2010, 2011, 201, 2021లో సీఎస్కేను విజేతగా నిలిపిన ధోని తాజాగా 2023లో సీఎస్కేకు ఐదోసారి టైటిల్ అందించాడు. ఇక 2024 ఐపీఎల్లో ధోని ఆడతాడా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. రానున్న తొమ్మిది నెలల్లో వచ్చే సీజన్ ఆడడంపై క్లారిటీ ఇస్తానని(అప్పటివరకు ఫిట్‌గా ఉంటే) ఫైనల్ మ్యాచ్ అనంతరం ధోని పేర్కొన్నాడు. చదవండి: Shaka Hislop Collapsed Video: లైవ్ కామెంట్రీ ఇస్తూ కుప్పకూలాడు.. వీడియో వైరల్ Kohli-Zaheer Khan: 'కోహ్లి వల్లే జహీర్ కెరీర్‌కు ముగింపు'.. మాజీ క్రికెటర్ క్లారిటీ -
మరో వివాదంలో ఓలా ఎలక్ట్రిక్: సోషల్ మీడియాలో ఫోటో వైరల్
Ola Electric Scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించి ఒక వివాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అత్యాధునిక ఫీచర్లతో ఈవీ స్కూటర్లను లాంచ్ చేసి, ఈవీ మార్కెట్లో దూసుకుపోతున్న ఓలా ఎలక్ట్రిక్‌పై తాజాగా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్, బ్యాటరీ చార్జింగ్, క్వాలిటీ దుమారం మరోసారి వెలుగులోకి వచ్చింది. (కాగ్నిజెంట్ సీఈవో కీలక నిర్ణయం: ఉద్యోగుల్లో ఉత్సాహం) 20 శాతం చార్జ్కాగానే ఆగిపోతోందంటూ ఓలా S1 స్కూటర్ వినియోగదారుడు ఆందోళన వ్యక్తం చేసిన ఫొటో ఒకటి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఈ స్కూటర్ సమస్యలను పరిష్కరించడంలో ఓలా టీమ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సంబంధిత కస్టమర్ సర్వీస్ సెంటర్ ముందు ఒక బ్యానర్‌తో సహా స్కూటర్‌ను నిలిపాడు. ఏడాది కాలంగా స్కూటర్‌ను ఉపయోగిస్తున్నాను..ఈ స్కూటర్‌ను వదిలి వెళ్లినప్పటి నుంచి తనకు సర్వీస్ సెంటర్ నుంచి ఎలాంటి కాల్స్ రాలేదని, వారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు స్పందించడం లేదని పేర్కొన్నాడు. అలాగే స్కూటర్లోని అలైన్మెంట్ బుష్ ఐదుసార్లు మార్చానని కూడా పేర్కొన్నాడు. (సాక్షి మనీ మంత్రా: రికార్డు స్థాయిలో మార్కెట్ దూకుడు.. తగ్గేదేలే!) దీనికి సంబంధించి ఫొటోను ఓలా ఎలక్ట్రిక్ పేరడీ అనే ట్విటర్ ఖాతాలో ఇది పోస్టు అయింది. ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీకాదు.. ఇదో అధ్వాన్నమైన సర్వీస్ సెంటర్ అని కమెంట్ చేయడం గమనార్హం. అంతేకాదు ఈ పోస్ట్ క్రింద, తమ కెదురైన అనుభవాలను ఓలా స్కూటర్ కస్టమర్లు ఫోటోలు షేర్ చేయడం గమనార్హం. ఓలాను స్కామ్ కంపెనీ అని మరొకరు పేర్కొన్నారు. అయితే దీనిపై ఓలా అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOP) ప్రకారం వివరాలను కోరినట్టు తెలుస్తోంది. #News #OLAElectricComplaints #OLAElectric #CustomersProtesthttps://t.co/PhFDv1dulT — Ola Electric #Parody (@OlaEV_parody) July 19, 2023 అయితే ఇలాంటి ఫిర్యాదులు రావడం ఇదే తొలిసారి కాదు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిందో అంతే విమర్శలను కూడా ఎదుర్కొంది. గతంలో ఓలా S1 స్కూటర్లపై కొనుగోలు చేసిన కస్టమర్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ స్కూటర్లను రీకాల్ చేసిన సంగతి తెలిసిందే. Calicut ola service center work overload approx 200 scooters work pending Service slot not available now We also need two service centers Please resolve this as soon as possible@bhash @OlaElectric pic.twitter.com/mhT7vD3ltJ — fasil (@fasilfaaaz) July 19, 2023 -
'మిస్టరీ గర్ల్'తో యజ్వేంద్ర చహల్.. ధనశ్రీ చూస్తే అంతే!
టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్‌కు చెస్ గేమ్ అంటే చాలా ఇష్టం. చెస్‌కు చహల్ వీరాభిమాని. గతంలో భారత్‌లో జరిగిన వరల్డ్ యూత్ చెస్ చాంపియన్‌షిప్‌కు ప్రతినిధిగా వ్యవహరించాడు. ఆల్పైన్ వారియర్స్ ఫ్రాంచైజీకి చహల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు ఇటీవలే దుబాయ్ వేదికగా గ్లోబల్ చెస్ లీగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం టీమిండియాకు మ్యాచ్‌లు లేకపోవడంతో అంబాసిడర్ హోదాలో దుబాయ్‌కు వెళ్లాడు. తాజాగా చహల్ ఒక యువతితో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''నేనిప్పుడు దుబాయ్‌లో ఉన్నా. మిస్టరీ గర్ల్ విత్ గ్లోబల్ చెస్ లీగ్''అని క్యాప్షన్ జత చేశాడు. అయితే చహల్ పేర్కొన్న మిస్టరీ గర్ల్ పేరు భలే గమ్మత్తుగా ఉంది. ఆమె పేరు జెస్సీ ఫిబ్రవరి. సౌతాఫ్రికాకు చెందిన జెస్సీ ఫిబ్రవరి.. రెండుసార్లు సౌతాఫ్రికా వుమెన్స్ చెస్ చాంపియన్.. మరోసారి ఆఫ్రికన్ వుమెన్స్ చెస్ చాంపియన్‌గా నిలవడం విశేషం. ఈ సందర్భంగా జెస్సీ తన ట్విటర్లో చహల్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ''మొత్తానికి చహల్‌ను కలుసుకున్నా.. సంతోషంగా ఉంది'' అంటూ పేర్కొంది. కాగా చహల్ ఫోటోపై అభిమానులు స్పందించారు. ''ఎవరు పిల్లా నువ్వు.. పేరే గమ్మత్తుగా ఉంది.. చహల్‌తో ఫోటో దిగావు సరే.. ధనశ్రీ చూస్తే ఊరుకుంటుందా.. అంతే సంగతి'' అంటూ కామెంట్ చేశారు. ఇక సౌతాఫ్రికాలోని పోర్ట్ ఎలిజబెత్‌కు చెందిన జెస్సీ ఫిబ్రవరి 2016లో మహిళల విభాగంలో చెస్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ టైటిల్ గెలుచుకుంది. 2021 మేలో జెస్సీ ఫిబ్రవరి వుమెన్స్ ఆఫ్రికన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని 8 స్కోరుకు గాను ఏడు పాయింట్లు సాధించింది. ఈ పాయింట్లతో 2100 రేటింగ్ సాధించిన జెస్సీ ఫిబ్రవరి గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించింది. ఇక 2021 జూలైలో జరిగిన మహిళల చెస్ వరల్డ్‌కప్‌కు క్వాలిఫై సాధించినప్పటికి తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. Just 2 hardcore cricket fans. pic.twitter.com/UBgN3TTmxy — Jesse February (@Jesse_Feb) June 25, 2023 చదవండి: #PoojaTomar: ఆ గేమ్ అంటేనే చావుతో చెలగాటం.. నిజంగా 'ఆడ'పులే! #Wimbledon2023: 'ఆ రూమ్‌లు మెడిటేషన్‌కు మాత్రమే.. శృంగారం కోసం కాదు' 'చహల్ విషయంలో తప్పు చేస్తున్నారు'.. బీసీసీఐకి గంగూలీ హెచ్చరిక -
అద్భుతం..అంతరిక్షంలో వికసించిన పువ్వు! ఫోటో వైరల్
అనంతమైన విశ్వం పరిశోధకులను, శాస్త్రవేత్తలను ఏదో రకంగా ఆకర్షిస్తుంది. అది కొత్త పరిశోధనలకు నాంది అయ్యి ప్రంపంచానికి సరికొత్త అద్భుతాలను అందించేందుకు దోహదపడుతుంది. అదీగాక అంతరిక్ష శాస్త్రవేత్తలు ఎన్నో కొత్త ప్రయోగాలతో సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికారు కూడా. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో మానవ అవసరాలకు సంబంధించిన ఎన్నో పరిశోధనలు చేశారు. అక్కడ మనం నివశించగలమా? మొక్కలు పెరుగతాయా? తదితరాలన్నింటి గురించి అధ్యయనాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అమెరికాకు చెందిన అంతర్జాతీయ అంతరిక్షసంస్థ అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకుని మొక్కలు పెరుతాయా లేఆదా అనే దానిపై 1970ల నుంచి పరిశోధనలు చేస్తున్నారు. ఆ పరిశోధన ఫలించింది. వారు పెంచిన ఓ మొక్క పెరగడమే గాక షష్పించింది. అత్యంత అసాధారణమైన వాతావరణంలో పుష్పించడం అనేది విస్మయానికి గురిచేసే విషయం. ఇది నాసా విజయానికి ప్రతీక. విశ్వ రహస్యాలను చేధించటానికి ఈ పరిశోధన ఉపకరిస్తుంది. అందుకు సంబంధించిన ఫోటోని నాసా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ జిన్నియా మొక్క అంతరిక్ష కేంద్రంలో వెజ్జీ సదుపాయంలో భాగంగా కక్ష్యలో పెరిగిందని ఓ క్యాప్షన్‌ని కూడా జోడించారు. ఈ మేరకు వ్యోమగామి కెజెల్ లిండ్‌గ్రెన్ మాట్లాడుతూ..మా అంతరిక్ష ఉద్యానవనం కేవలం ప్రదర్శ కోసం పెంచటం లేదని కక్షలో మొక్కలు ఎలా అభివృద్ధి చెందుతాయో తెలుసుకోవడం తోపాటు భూమి నుంచి పంటలు ఎలా పెంచాలో తెలుసుకునేందుకు ఉపకరిస్తుందన్నారు. ఇప్పటి వరకు పాలకూర, టొమాటో, చిల్లీ పిప్పర్ వంటి వాటిని అంతరిక్ష కేంద్రంలో పెంచినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, నాసా షేర్ చేసిన ఫోట్ నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఇది అద్భుతం, పైగా అందమైనది అని ప్రశంసించగా, మరికొందరూ ఈ మొక్క పెరగడానికి ఎంత సమయం తీసుకుందని ప్రశ్నస్తూ పోస్టులు పెట్టారు. ఈ ఫోటోకి ఆర లక్షలకుపైగా లైక్‌లు వచ్చాయి. View this post on Instagram A post shared by NASA (@nasa) (చదవండి: ఐస్ క్రీమ్ తింటున్న కొద్దీ ఇంకా తినాలని ఎందుకు అనిపిస్తుంది?) -
చైకి గుర్తుగా టాటూ అలాగే ఉంచేసుకున్న సమంత.. ఫోటో వైరల్
సమంత-నాగచైతన్య.. ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌గా వీరికి పేరుంది. ఏమాయ చేశావే సినిమాతో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న చై-సామ్‌లు దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకొని 2017లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ మనస్పర్థల కారణంగా 2021లో విడాకులు తీసుకున్నారు. ఇప్పటికీ వీరు కలిసుంటే బావుండు అని కోరుకోని అభిమాని ఉండరు అంటే అతిశయోక్తి కాదు. రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ చై-సామ్‌ల జోడీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇక విడాకుల తర్వాత ఇద్దరూ సినిమాల పరంగా బిజీబిజీగా గడిపేస్తున్నారు. కస్టడీ సినిమాతో చై ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఇప్పటికే సమంత శాకుంతలం సినిమాతో అభిమానులను పలకరించింది. రీసెంట్గా సిటాడెల్ ప్రీమియర్ షో కోసం లండన్ వెళ్లిన సమంత సరికొత్త లుక్‌తో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో అంతకు మించి సమంత ఒంటిపై నాగచైతన్యకు సంబంధించిన టాటూలు కూడా వైరల్ అయ్యాయి. పెళ్లి తర్వాత చై పేరును టాటూ వేయించుకున్న సమంత ఇప్పటికీ ఆ టాటూను చెరపివేయలేదు. 'కొన్ని ఙ్ఞాపకాలను మర్చిపోలేం, టాటూలు కూడా అంతే'.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా సమంత మెడపై YMC అని రాసి ఉంటుంది. చైతో తొలిసారి నటించిన ఏ మాయ చేశావే సినిమాకు గుర్తుగా సామ్ ఆ టాటూ వేయించుకుంది. ఇక మరో టాటూ ఆమె మణికట్టుపై ఉంటుంది. ఈ మూడు టాటూలు చైతూకి సంబంధించినవే కావడం విశేషం. -
RCB Vs LSG: మ్యాచ్ ఓడిపోతే ఇంతలా ఏడుస్తారా!
ఐపీఎల్ 16వ సీజన్లో సోమవారం మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మ్యాచ్ చూస్తున్న అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో జరిగిన హైడ్రామా బహుశా ఇంతకముందు ఐపీఎల్ చరిత్రలో చూసింది లేదనుకుంటా. విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్‌లు మ్యాచ్‌ను దాదాపు వన్‌సైడ్ చేశారు. వీరికి ఆయుష్ బదోని కూడా తోడయ్యాడు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు ఔట్ కావడంతో మ్యాచ్ మళ్లీ ఆర్సీబీవైపు మొగ్గినట్లుగా అనిపించింది. ఇక ఆఖరి ఓవర్లో లక్నోకు ఐదు పరుగులే కావాల్సినప్పటికి హర్షల పటేల్ చక్కగా బౌలింగ్ చేశాడు. రెండు వికెట్లు కూడా తీశాడు. అయితే బిష్ణోయ్‌ను మన్కడింగ్ చేసే క్రమంలో చేసిన పొరపాటు.. దానికి తోడు కీపర్ కార్తిక్ తడబాటుతో ఆర్సీబీ మ్యాచ్‌ను లక్నోకు కోల్పోవాల్సి వచ్చింది. ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది రెండో ఓటమి. మాములుగానే ఆర్సీబీ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది. పైగా సొంత స్టేడియంలో మ్యాచ్ జరుగుతుందంటే ఆర్సీబీ మరింత బలంగా కనిపిస్తుంది. అయితే మ్యాచ్ తమ చేతులోకి వచ్చేసిందని సంబరపడేలోపు లక్నో మ్యాచ్‌ను లాగేసుకోవడంతో ఆర్సీబీ అభిమానులు తట్టుకోలేకపోయారు. అందుకే ఆఖరి బంతికి ఆవేశ్ ఖాన్ సింగిల్ తీసి లక్నోను గెలిపించగానే స్టేడియం ఒక్క నిమిషం పాటు సైలెంట్ అయిపోయింది. ఎవరి మొహాల్లో తొంగి చూసినా దుఃఖమే కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆర్సీబీకి డైహార్డ్ అభిమాని అయిన ఒక యువతి కంటతడి పెట్టడం అందరిని బాధించింది. ఆర్సీబీ ఓడింది ఫైనల్ మ్యాచ్ కానప్పటికి.. అరె గెలిచే మ్యాచ్ ఓడామే అన్న బాధ ఆ యువతిలో కనిపించింది. అందుకే ఎంత ఓదారుస్తున్న యువతి ఏడ్వడం ఆపలేదు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ ''యువతిని చూస్తే జాలేస్తోంది.. లీగ్ మ్యాచ్ ఓడితే ఇంతలా ఏడుస్తారా''.. ''ఒకవేళ ఆర్సీబీకి ఫైనల్ మ్యాచ్‌లో ఇలా జరిగి ఉంటే ఆమె పరిస్థితి ఎలా ఉండేదో'' అంటూ కామెంట్ చేశారు. Virat kolhi is not a player 🤞,he is emotion for the RCB fans🙏💪😭, After the loss RCB match,then fans crying 😭😭😭,@imVkohli pic.twitter.com/cVlfLguqDl — CSK fans ❣️❣️ (@Cskfans34) April 11, 2023 చదవండి: ODI WC 2023: బీసీసీఐ కీలక నిర్ణయం.. హైదరాబాద్ స్టేడియానికి మహర్దశ -
భర్త బాటలోనే నిహారిక.. విడాకులపై క్లారిటీ ఇచ్చిందా?
మెగా డాటర్ నిహారిక విడాకుల వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. 2020లో చైతన్య జొన్నలగడ్డను నిహారిక ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెద్ద సమక్షంలో నిహారిక-చైతన్య పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి అనంతరం ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య విబేధాలు వచ్చాయంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: హౌజ్ కీపర్‌గా, సేల్స్ గర్ల్‌గా చేశా: ప్రముఖ నటి పవిత్ర ఈ వార్తలకు నిహారిక భర్త చైతన్యే ఆజ్యం పోశాడు. పెళ్లి ఫొటోలతో పాటు నిహారికతో కలిసి షికార్లకు, వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ నుంచి తొలిగించాడు. దీంతో మెగా డాటర్ విడాకుల రూమర్స్ ఒక్కసారిగా గుప్పుమన్నాయి. తాజాగా ఈ వార్తలకు మరింత బలాన్ని ఇస్తూ నిహారిక కూడా భర్త బాటలోనే నడిచింది. ఇప్పటి వరకు పెళ్లి ఫొటోలు డిలిట్ చేయని ఆమె ఇన్స్టాగ్రామ్ నుంచి తాజాగా ఆ ఫొటోలు మాయమయ్యాయి. భర్త చైతన్య లాగే నిహారిక కూడా పెళ్లికి సంబంధించిన పోస్ట్స్‌తో పాటు భర్తతో కలిసి వెళ్లిన వెకేషన్ పిక్స్ తొలగించింది. అంతేకాదు చైతన్యకు సంబంధించిన పోస్ట్స్ కూడా డిలిట్ చేసింది. చదవండి: బేబీబంప్‌తో బిగ్‌బాస్ బ్యూటీ పూజా.. ఫొటోలు వైరల్ దీంతో మరోసారి మెగా డాటర్ విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి. నిజంగానే వీరిద్దరు విడిపోయారా? అంటూ నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు డైవర్స్ రూమర్స్‌పై స్పందించని నిహారిక ఇలా తన విడాకులపై క్లారిటీ ఇచ్చిందా? అంటూ అంతా అభిప్రాయపడుతున్నారు. దీంతో వీరి విడాకులు వార్తలు నిజం కాకుండ ఉంటే బాగుండు అంట మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అంతేకాదు విడాకుల అబద్ధం అని చెప్పండి మేడం అంటూ నిహారికి పోస్ట్‌కు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇందులో నిహారిక తన తల్లి చీర కట్టుకుని పెళ్లికూతురిగా ముస్తాబైన ఫొటో మాత్రం డిలిట్ చేయకపోవడం గమనార్హం. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
హైదరాబాద్ రెస్టారెంట్లో నాగ చైతన్య సందడి.. ఫొటో వైరల్
ప్రస్తుతం రంజాన్ సీజన్ నడుస్తోంది. రంజాన్ అనగానే వెంటనే గుర్తొచ్చేది హలీం. మన హైదరాబాద్ హాలీం అంటే ఇష్టపడి వారు ఉండరంటే అతిశయోక్తి లేదు. ఈ రంజాన్ సీజన్ వస్తే చాలు హాలీం షాపుల వద్ద హైదరాబాదీలు క్యూ కడుతుంటారు. అలాగే స్టార్ హీరో నాగచైతన్య కూడా హాలీం కోసం హైదరాబాద్ రోడ్డుపైకి వచ్చారు. మాసబ్ ట్యాంక్‌లోని ఓ రెస్టారెంట్లో సందడి చేశాడు. చదవండి: పిల్లలంటే ఇష్టం.. అందుకే పెళ్లికి ముందే అలా చేశా!: ప్రియాంక చోప్రా అంతేకాదు అక్కడికి వచ్చిన కస్టమర్లతో కూడా చై మాటలు కలిపి వారికి సెల్పీలు ఇచ్చాడు. ఇక నాగ చైతన్య తమ రెస్టారెంట్‌ను విజిట్ చేయడంతో సదరు హోటల్ యాజమాన్యం ఆనందం వ్యక్తం చేసింది. దీంతో తమ ఇన్‌స్టాగ్రామలో చైతో దిగిన ఫొటోలను షేర్ చేసింది. ఈ సందర్భంగా తమ రెస్టారెంట్‌ను సందర్శించినందుకు నాగచైతన్యకు రెస్టారెంట్ వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్న అజిత్ దంపతులు, ఫొటోలు వైరల్
తమ చిత్రాలతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల గల్లాపెట్టెలను నింపే నటుల్లో అజిత్ ఒకరు. అయితే ఈయన ఇతర నటులకు పూర్తిగా భిన్నం. చిత్ర పరిశ్రమకు చెందిన ఏ విషయంలోనూ జోక్యం చేసుకోరు. ఏ చిత్ర వేడుకల్లోనూ పాల్గొనరు. అసలు తన చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండే నటుడు ఎవరైనా ఉన్నారంటే అది అజితే. తనూ, తన వృత్తి, ప్రవృత్తి, తన కుటుంబం అదే ఈయన లోకం. అందుకే విమర్శలు, వదంతులు అజిత్ దరిచేరవు. ఇక ఆయన జీవిత భాగస్వామి శాలిని గురించి చెప్పాలంటే ఈమె బాల్యంలో లిటిల్ సూపర్ స్టార్. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం ఇలా పలు భాషల్లో నటించి తన నటనతో వావ్ అనిపించుకున్నారు. కథానాయకిగా కొన్ని చిత్రాల్లో నటించారు. అలా అద్భుతం అనే చిత్రంలో అజిత్‌తో జతకట్టారు. అప్పుడు వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఆ తర్వాత శాలిని నటనకు స్వస్తి పలికి కుటుంబ బాధ్యతలకే పరిమితం అయ్యారు. కాగా అందరిలాగా అజిత్ శాలిని దంపతులు తరచూ బయట ప్రపంచంలోకి రారు. అది నటుడు అజిత్‌కు ఇష్టం ఉండదు. తనకంటూ ఓ ప్రపంచాన్ని ఏర్పరచుకొని అందులోనే తన సంతోషాన్ని వెతుక్కుంటారాయన. ఈయన నటన తర్వాత ఇష్టపడేది బైక్ రేస్. అలా స్టేట్ లెవెల్ బైక్ రేస్ పోటీల్లో పాల్గొని పథకాలను గెలుచుకున్నారు. ఇక విషయానికి వస్తే.. చాన్నళ్ల తర్వాత అజిత్, శాలిని దంపతులు విహారయాత్రలో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అవును అజిత్ తన భార్య శాలినితో కలిసి ఇటీవల విహారయాత్ర కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడ సముద్రంలో బోట్లో విహరిస్తున్న ఫోటోలు నెటిజన్లను చేతినిండా పని చెబుతున్నాయి. కాగా తుణివు చిత్రంతో భారీ హిట్ కొట్టిన అజిత్ త్వరలో తన 62వ చిత్రంలో నటించడానికి సిద్దమవుతున్నారు. -
ఈ ఫోటోలోని చిన్నారి స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
దక్షిణాది సినిమాల్లో అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు సంపాదించింది. ఉత్తరాదికి చెందిన ఈ బ్యూటీ దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు, తమిళం భాషల్లో స్టార్ హీరోలందరితో జతకట్టింది. కాగా కథానాయకిగా మంచి ఫామ్‌లో ఉండగానే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తల్లి కూడా అయింది. 2020లో పెళ్లి చేసుకున్న ఆమె గతేడాదిలోనే మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టింది. అయితే ఇదంతా రెండేళ్ల లోపే జరిగిపోయింది. తాజాగా ఆమెకు సంబంధించిన చిన్నప్పటి ఫోటోలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. ఆ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సినిమాలో నటిస్తోంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా? అయితే ఈ స్టోరీ చదివేయండి. సాధారణంగా వివాహం అయిన తర్వాత హీరోయిన్గా కొనసాగటం కాస్త కష్టమే. కానీ కాజల్ అగర్వాల్ దాన్ని బ్రేక్ చేశారు. పెళ్లే కాదు బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా ఈ బ్యూటీ హీరోయిన్గా మెప్పిస్తున్నారు. గతంలో పెళ్లి అయిన తర్వాత కూడా గ్లామర్‌గా నటిస్తారా..? అన్న ప్రశ్నకు కాజల్ అగర్వాల్ బదులిస్తూ వైనాట్ అని ఠక్కున చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తాను, తన భర్త చాలా క్లియర్‌గా ఉన్నామని పేర్కొన్నారు. పెళ్లి, చేసే వృత్తి వేరు వేరు అన్నారు. అయితే గ్లామర్ సన్నివేశాలు చిత్ర కథకు ఎంతవరకు అవసరం అన్నది కూడా ముఖ్యమన్నారు. వివాహానంతరం తాను నటించనని ప్రచారం చేశారని.. దాన్ని బ్రేక్ చేశానని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కమల్ హాసన్ ఇండియన్- 2 చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి తెలుగులో బాలకృష్ణ సరసన నటించే లక్కీ చాన్స్ కాజల్‌ను వరించింది. కాగా కోలీవుడ్‌లో నటుడు అజిత్‌కు జంటగా నటించే అవకాశం కూడా ఈమె తలుపు తట్టిందనేది తాజా సమాచారం. అజిత్ 62వ చిత్రంలో కాజల్‌ను హీరోయిన్గా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. -
తొలిసారి జిమ్‌లో అలా.. మహేశ్ బీస్ట్ లుక్ చూశారా?
టాలీవుడ్లో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అభిమానుల్లో ఆయనకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా స్టార్ రేంజ్లో ఆయన దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఇక మహేశ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో వరల్డ్ చిత్రం చేయబోతున్నాడు. చదవండి: ఈ వారం కొత్త కంటెంట్‌తో ఓటీటీలు రెడీ, ఒక్కరోజే 10 సినిమాలు స్ట్రీమింగ్! ప్రస్తుతం SSMB 28 షూటింగ్‌తో బిజీగా ఉన్న మహేశ్ తాజాగా అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. తన ఫిటినెస్ ఫొటో షేర్ చేసి ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చాడు. మహేశ్ ఇప్పటి వరకు కామ్ అండ్ కూల్ చిత్రాలే చేశాడు. తెరపై ఆయన సిక్స్ ప్యాక్‌తో కనిపించింది లేదు. ఇక వెండితెరపై అందరి హీరోల్లా ఆయన బాడీ షో చేసిన దాఖలాలు లేవు. కానీ ఆయన తాజా పోస్ట్ చూస్తుంటే ఇప్పుడు మహేశ్ ఆ రూల్ బ్రేక్ చేయబోతున్నాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చదవండి: మంచు వారి ఇంట పెళ్లి భాజాలు? మనోజ్ పెళ్లి తేదీ ఫిక్స్! జిమ్‌లో వర్క్ అవుట్ చేసిన ఫొటోలు షేర్ చేశాడు. ఇందులో బైసిప్స్ వర్క్ అవుట్ అనంతరం నరాలు కనిపిస్తున్న తన బాడీ పిక్స్‌ని షేర్ చేశాడు. ఇవి చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మహేశ్ బీస్ట్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో తన తదుపరి చిత్రాలపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. త్రివిక్రమ్, జక్కన్నయాక్షన్ అడ్వెంచర్ చిత్రాల కోసమే మహేశ్ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడా? అని అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి. ఈ రెండు చిత్రాలతో మహేశ్ తన బీస్ట్ లుక్‌తో ట్రీట్ ఇవ్వబోతున్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
నటి హేమ కూతురిని చూశారా? ఎంత అందంగా ఉందో!
నటి హేమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అక్కగా, వదినగా, భార్యగా ఎన్నో క్యారెక్టర్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇక ఎక్కువగా కమెడియన్ల సరసన నటించిన ఆమె తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించింది. భర్తను కనుసన్నల్లో పెట్టి ఆడించే భార్యగా హేమ పరకాయ ప్రవేశం చేసి నటించేది. అలా ఇండస్ట్రీలో నటిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హేమ ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఆ మధ్య మా ఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్న ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. బిజినెస్ వ్యవహారాలతో బిజీగా ఉండటం వల్ల నటించేందుకు సమయం లేదని ఇటీవల ఓ కార్యక్రమంలో వెల్లడించింది. ఇక ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకున్న నేపథ్యంలో తన వారసురాలిగా కూతురిని సినిమా రంగంలో దించేందుకు ప్లాన్ చేస్తున్నారా? అనే అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో హేమ కుతురి గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమెను చూసి చాలా అందంగా ఉందని, ఈమెలో హీరోయిన్ కావాల్సిన లక్షణాలు ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే హేమ కూతురు పేరు ఇషా. ఆమె మీడియా, సోషల్ మీడియాకు దూరం అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇషాకు 22 ఏళ్లు. ఇటీవల ఆమె బీబీఏ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక చదువు పూర్తి చేసుకున్న ఇషా సినిమాల్లో వచ్చే అవకాశం లేకపోలేదు. కానీ, తన కూతురిని సినీ రంగంలోకి తీసుకొచ్చే ఆలోచన లేదని గతంలో హేమ చాలాసార్లు వెల్లడించిన విషయం తెలిసిందే. చదవండి: తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం విజయ్ సేతుపతితో చేసిన చాలా సీన్స్ తొలగించారు, బాధగా అనిపించింది: మైఖేల్ హీరోయిన్ -
క్రికెట్ దేవుడితో 'రోలెక్స్'.. ఫోటో వైరల్
తమిళ స్టార్ హీరో సూర్య అంటే తెలియని వారుండరు. స్టార్ ఇమేజ్ అనే చట్రంలో ఇరుక్కోకుండా విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది విడుదలైన కమల్ హాసన్ 'విక్రమ్' సినిమాలో 'రోలెక్స్' పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అందరిని అలరించాడు. కేవలం నాలుగు నిమిషాల పాటు మాత్రమే ఉండే ఆ పాత్ర విక్రమ్ సినిమాలో ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సూర్య అంటే రోలెక్స్.. రోలెక్స్ అంటే సూర్య అనేలాగా విలనిజానికి కొత్త అర్థం చెబుతూ తన నటనతో అభిమానులను భయపెట్టాడు. తాజాగా సూర్య.. టీమిండియా దిగ్గజ క్రికెటర్.. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌తో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. గౌరవం, ప్రేమ @ సచిన్ టెండూల్కర్ అంటూ క్యాప్షన్ జత చేశాడు. అయితే సూర్య సచిన్ తో ఎప్పుడు ఎక్కడ ఫొటో దిగాడనేది మాత్రం తెలియదు. అయితే సూర్య సచిన్ తో ఎప్పుడు ఎక్కడ ఫొటో దిగారనేది మాత్రం తెలియలేదు. సూర్య షేర్ చేసిన ఫోటోపై అభిమానులు స్పందించారు. ''Goat ఆఫ్ సినిమా/క్రికెట్'.. ''ఒకేచోట ఇద్దరు మాస్టర్ బ్లాస్టర్స్''.. ''ఒక పక్క జాతీయ అవార్డు గెలిచిన విజేత.. మరోపక్క అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన క్రికెటర్''.. ''ఇద్దరు దిగ్గజాలు ఎదురుపడిన వేళ'' అంటూ కామెంట్స్ జత చేశారు. ఇదిలా ఉండగా రీసెంట్ గా సచిన్, హైదరాబాద్ లో జరిగిన రేసింగ్ చూసేందుకు వచ్చాడు. మరోవైపు సూర్య, తన 42వ సినిమాతో బిజీగా ఉన్నాడు. పీరియాడికల్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. View this post on Instagram A post shared by Suriya Sivakumar (@actorsuriya) చదవండి: వందో టెస్ట్‌కు ముందు మనసులో మాట బయటపెట్టిన పుజారా స్టార్ కమెడియన్ యోగిబాబుకు ధోని గిఫ్ట్ -
స్టార్ కమెడియన్ యోగిబాబుకు ధోని గిఫ్ట్
టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనికి అభిమానులెక్కువ. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. అభిమానులన్నా ధోనికి అమితమైన ప్రేమ. తన చర్యతో ఎన్నోసార్లు అభిమానులను సంతోషపెట్టిన దాఖలాలు ఉన్నాయి. ప్రముఖ కమెడియన్ యోగిబాబుకు కూడా ధోని అంటే విపరీతమైన అభిమానం. ఐపీఎల్లో సీఎస్కే మ్యాచ్‌లు చెన్నైలో ఉన్నప్పుడల్లా యోగిబాబు క్రమం తప్పకుండా హాజరయ్యేవాడు. కేవలం ధోనిని చూసేందుకే మ్యాచ్‌లకు వచ్చేవాడు. ధోని ఆటోగ్రాఫ్ కోసం యోగిబాబు ట్రై చేసి విఫలమయ్యాడు. అయితే తాజాగా తాను ఆరాధించే ధోని.. స్వయంగా బ్యాట్‌పై ఆటోగ్రాఫ్ చేసి యోగిబాబుకు గిఫ్ట్‌గా ఇవ్వడం అతన్ని సంతోషపెట్టింది. ఆ బ్యాట్‌పై ''బెస్ట్ విషెస్... యోగిబాబు'' అని రాసి ధోని సంతకం చేశాడు. ధోని ఆటోగ్రాఫ్ విషయాన్ని యోగిబాబు ట్విటర్ వేదికగా గర్వంగా చెప్పుకున్నాడు. ధోని సంతకం ఉన్న బ్యాట్‌ను ట్విటర్లో షేర్ చేస్తూ.. ''బ్యాట్ గిఫ్ట్‌గా ఇచ్చినందుకు థాంక్యూ ధోని సార్.. మీ క్రికెట్ జ్ఞాపకాలు నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి.'' అని క్యాప్షన్ జత చేశాడు. ఆ తర్వాత తాను నటిస్తున్న సినిమా టీంతో కలిసి ధోని ఆటోగ్రాఫ్ ఉన్న బ్యాట్‌తో ఫోటోలకు ఫోజిచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ధోనికి.. ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ 2023 చివరిదని ప్రచారం జరగుతుంది. ఆరంభం నుంచి సీఎస్కేతో పాటే ఉన్న ధోని విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. సీఎస్కేను నాలుగుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపాడు. గతేడాది ఐపీఎల్లో ధోని తనంతట తానుగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో జడేజాకు పగ్గాలు అప్పగించారు. అయితే ఒత్తిడిని భరించలేక జడ్డూ సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్నాడు. దీంతో మళ్లీ ధోనినే జట్టును నడిపించాల్సి వచ్చింది. గత సీజన్లో సీఎస్కే 14 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు మాత్రమే నమోదు చేసి తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఇప్పటికే ధోని తన ఐపీఎల్ ప్రాక్టీస్‌ను ఆరంభించిన సంగతి తెలిసిందే. తన స్వస్థలమైన రాంచీ స్టేడియంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన వీడియోలు బయటికొచ్చాయి. ఖాళీగా ఉన్న సమయాల్లో తన వ్యక్తిగత పనులపై కూడా దృష్టి సారించాడు. ఇటీవలే రాంచీ వేదికగా న్యూజిలాండ్, టీమిండియాల మధ్య జరిగిన టి20 మ్యాచ్‌కు ధోని కుటుంబంతో కలిసి హాజరయ్యాడు. pic.twitter.com/nMuQPVvtw8 — Yogi Babu (@iYogiBabu) February 15, 2023 Direct from #MSDhoni hands which he played in nets . Thankyou @msdhoni sir for the bat .... Always cherished with the - your cricket memory as well as cinematic memory #dhonientertainmentprod1 #sakshidhoni . pic.twitter.com/2iDv2e5aBZ — Yogi Babu (@iYogiBabu) February 15, 2023 చదవండి: 'సర్' అనొద్దు.. అలా పిలవడాన్ని అసహ్యించుకుంటా' -
తల్లి కాబోతున్న యాంకర్ అశ్వినీ శర్మ, సీమంతం ఫొటోలు వైరల్
నటి, యాంకర్ అశ్వినీ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో బుల్లితెరపై, వెండితెరపై సందడి చేసిన ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. పలు టీవీ షోలు చేస్తూ మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్ర నటులను ఇంటర్య్వూ చేసి యాంకర్‌గా గుర్తింపు పొందింది ఆమె. ఆ తర్వాత ఛత్రపతి, కొడుకు, పల్లకిలో పెళ్లికూతురు, ధైర్యం, హీరో వంటి చిత్రాల్లో సహనటి పాత్రలు పోషించి మెప్పించింది. ప్రస్తుతం అశ్వినీ శర్మ నటనకు దూరమైన సంగతి తెలిసిందే. నటిగా మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని నటనకు గుడ్‌బై చెప్పింది. చదవండి: ఆ హీరోయిన్ అంటే క్రష్.. తను నన్ను బాగా ఆకట్టుకుంది: రామ్ చరణ్ ప్రతీక్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లాడి అమెరికాలో సెటిలైపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తన అభిమానులతో గుడ్‌న్యూస్ పంచుకుంది. తాను త్వరలోనే తల్లిని కాబోతున్నానంటూ తన సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ‘త్వరలోనే శుభవార్త చెప్పేందుకు రెడీగా ఉన్నాం. మా ఫస్ట్ లిటిల్ బేబీ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’ అంటూ బేబీ షవర్ ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం అశ్వినీ బేబీ బంప్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో అశ్వినీకి పలువురు నటీనటులు, సినీ సెలబ్రిటీ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ నటుడి భార్య View this post on Instagram A post shared by ✨Ashwini sharma✨🧿 (@ashwinisharma_official) -
పొట్టి స్కర్ట్, హై హీల్స్‌తో డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్.. 'మాకేంటీ కర్మ'
జాన్ సీనా(John-Cena).. డబ్ల్యూడబ్ల్యూఈ చూసేవారికి పరిచయం అక్కర్లేని పేరు. తన ఆటతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఈ సూపర్‌స్టార్. 13సార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అయిన దిగ్గజం.. మరో మూడుసార్లు డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌గా నిలిచాడు. సినిమాలతో బిజీ అయిన జాన్ సీనా కొంతకాలంగా రెజ్లింగ్‌కు దూరమయ్యాడు. తాజాగా వ్రెసల్‌మేనియా ద్వారా డబ్ల్యూడబ్ల్యూఈలో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. 20 ఏళ్ల రెజ్లింగ్ కెరీర్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్న జాన్ సీనా ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. ఇక జాన్ సీనా తన రెజ్లింగ్ కెరీర్లో చాలావరకు బ్యాగీ షార్ట్స్, పెద్ద చైన్లు, క్యాప్లతోనే కనిపించాడు. అయితే, తాజాగా అతను తొడల వరకే ఉండే పొట్టి లంగా, హై హీల్స్ చెప్పులతో దర్శనమిచ్చాడు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలు చూసిన ఆయన అభిమానులు ఎలా స్పందించాలో తెలియక.. '' మా సూపర్‌స్టార్‌కు ఇదేం కర్మరా బాబు'' అనుకుంటూ తల పట్టుకున్నారు. అయితే జాన్ సీనా మహిళలా పొట్టి లంగా, ఎత్తు మడమల చెప్పులు, మోకాళ్లదాకా సాక్షులు ఎందుకు ధరించాడని అనుకుంటున్నారా..? ఎందుకంటే ఆయన ప్రస్తుతం ''రికీ స్టానికి'' అనే ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నారు. ఆ కామెడీ సినిమాలో తను పోషించబోయే పాత్ర కోసం జాన్ సినా మూవీ సెట్లో అలా విచిత్ర వేషధారణలో కనిపించాల్సి వచ్చింది. అదీ అసలు విషయం. Beyond excited to help bring these characters to life (both on and off screen) with an incredible cast, our director and producers and partners at @AmazonStudios @primevideo. #RickyStanicky is a best friend to all — can’t wait for you to meet him! https://t.co/DtLAsiwWQa — John Cena (@JohnCena) February 1, 2023 చదవండి: హైదరాబాద్‌లో ముగిసిన ఫార్ములా-ఈ రేసింగ్.. విజేత ఎవరంటే? -
రాజస్తాన్ కోటలో ఘనంగా స్మృతి ఇరానీ కూతురు పెళ్లి
కేంద్ర మంత్రి, మాజీ నటి స్మృతి ఇరానీ కుమార్తె షానెల్లే వివాహం రాజస్తాన్ కోటలో గురువారం ఘనంగా జరిగింది. ఈ మేరకు స్మృతి కూతురు షానెల్లేకి, అర్జున్ భల్లాకి 2021లో నిశ్చితార్థం కాగా, గురువారం రాజస్తాన్‌లో ఖిమ్సర్ కోటలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకలో షానెల్లె ఎరుపు రంగు లెహంగా ధరించగా, వరుడు అర్జున్ తెల్లటి షేర్వాణీలో మెరిసిపోయాడు. వారి వివాహ వేడుకలు ఫిబ్రవరి 7న హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలతో ప్రారంభమయ్యాయి. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ వేడుకలో ఆమె తల్లి స్మృతి కూడా బంగారు అంచుతో కూడిన ఎరుపు రంగ చీరతో కనిపించారు. ఈ సందర్భంగా ఆ వధువరులిద్దరూ భార్యభర్తల్లా కలసి నటించిన తొలి చిత్రాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. A glimpse of Union Minister Smriti Irani's daughter Shanelle and Arjun Bhalla's mehendi and sangeet ceremonies at Khimsar Fort, Rajasthan. pic.twitter.com/FRyJXDRIiS — Tina Arpan Shah 🇮🇳 @tina661014 on #kooapp (@tina661014) February 9, 2023 (చదవండి: పాపం!.. ఆ మంత్రి దురదకు తాళలేక నడిరోడ్డు మీద కుర్తా తీసి..) -
తన బుల్లి ఫ్యాన్ కోరిక తీర్చిన రామ్ చరణ్, హీరోపై ప్రశంసలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ చిన్నారి చివరి కోరిక తీర్చి ఉదారత చాటుకున్నాడు. తొమ్మిదేళ్ల మణి కుశాల్ అనే చిన్నారి రామ్ చరణ్‌కు వీరాభిమాని. అయితే అతడు కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని స్పర్శ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే అతడు హీరో రామ్ చరణ్‌ను కలవాలి అంటూ తన కోరికను తల్లిదండ్రులకు వెల్లడించాడు. దాంతో ‘మేక్ ఏ విష్ ఫౌండేషన్’ వారు ఈ విషయాన్ని రామ్ చరణ్‌కు చేరవేయగా వెంటనే స్పందించాడు. చదవండి: సరిగమప విన్నర్ యశస్వి కొండెపూడి మోసం.. స్పందించిన స్వచ్చంద సంస్థ తన బుల్లి ఫ్యాన్‌ని కలిసేందుకు స్వయంగా చరణ్ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ ఆ బాలుడితో కాసేపు సరదాగా గడిపాడు. అంతేకాదు ఆ బాలుడికి ఓ బహుమతిగా ఇచ్చాడు. అనంతరం అతడిలో ధైర్యం నింపాడు. అలాగే మణి త్వరలోనే కోలుకుంటాడని ఆ బాలుడి తల్లిదండ్రులు చరణ్ భరోసా ఇచ్చాడు. చెర్రి ఆ అభిమానిని కలిసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి చూసి నెటిజన్లు రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా చరణ్ ప్రస్తుతం శంకర్ మూవీ ఆర్సీ15 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. చదవండి: కొత్త పెళ్లి కూతురు కియారాకు అత్తింటి వారి ఘనస్వాగతం, వీడియో వైరల్ Through #MakeaWishFoundation our #ManOfMasses Mega Power Star @AlwaysRamCharan garu met a 9yr old kid ailing from cancer. The kid’s wish of meeting his favourite star was fulfilled with the actor spending quality time with him. #ManOfMassesRamCharan #Ramcharan pic.twitter.com/vAPMAl9VdV — SivaCherry (@sivacherry9) February 9, 2023 -
ఘనంగా ‘స్వామిరారా’ నటి సీమంతం.. ఆకట్టుకుంటున్న ఫొటోలు
ప్రముఖ నటి పూజా రామాచంద్రన్ త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ క్రమంలో ఆమె సీమంత వేడుకను ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పూజా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. కనుల పండుగగా జరిగిన ఈ సీమంత వేడుకలో పూజా దంపతుల ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. కాగా పూజా భర్త జాన్ కూడా నటుడనే విషయం తెలిసిందే. చదవండి: హైటెక్ సిటీ ఆఫీసులో మహేశ్ బాబు .. వీడియో వైరల్ వన్.. నేనొక్కడినే, కేజీఎఫ్ చాప్టర్ 1, బాహుబలి బిగినింగ్ సినిమాల్లో అతడు విలన్ పాత్రలు పోషించాడు. కాగా పూజా తెలుగులో స్వామి రారా, ఎంత మంచివాడవురా సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2లో పాల్గొని మరింత పాపులర్ అయ్యింది. కాగా పూజా రామ చంద్రన్- జాన్ కొకెన్ల వివాహం 2019లో జరిగింది. పూజాకి ఇది రెండో పెళ్లి. అంతకు ముందు 2017లో విజె క్రెగ్‌తో పూజా వివాహం జరిగింది. చదవండి: ‘యశోద’ లైంగిక వేధింపుల కేసు.. యువతి వాంగ్మూలంతో వెలుగులోకి షాకింగ్ విషయాలు! View this post on Instagram A post shared by Pooja Ramachandran (@pooja_ramachandran) View this post on Instagram A post shared by Pooja Ramachandran (@pooja_ramachandran) View this post on Instagram A post shared by John Kokken (@highonkokken) -
సత్య దేవ్ భార్య, కొడుకును చూశారా? ఫ్యామిలీ ఫొటో షేర్ చేసిన హీరో
టాలీవుడ్లో వర్సలైట్ యాక్టింగ్‌తో అతి తక్కువ సమయంలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటీవలె మెగాస్టార్ చిరంజీవి 'గాడ్‌ఫాదర్' చిత్రంలో కీలక పాత్రలో నటించి మెప్పించిన సత్యదేవ్ తాజాగా 'గుర్తుందాదా శీతాకాలం' సినిమాలో హీరోగా అలరించాడు. అయితే సినిమాల్లో రాకముందే సత్యదేవ్‌కు పెళ్లయిన సంగతి తెలిసిందే. చదవండి: ఫేం కోసం తప్పుడు ప్రచారం.. ‘సింగింగ్ ఐకాన్’ యశస్వి మోసం బట్టబయలు! అయితే ఎప్పుడు తన కుటుంబాన్ని మీడియాకు పరిచయం చేయలేదు. దీంతో సత్యదేవ్‌కు పెళ్లయిందనే విషయం చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో రీసెంట్గా గుర్తుందా శీతాకాలం మూవీ ప్రమోషన్ ఈవెంట్లో తన భార్యను పరిచయం చేసిన సత్యదేవ్ తాజాగా తన కొడుకును కూడా పరిచయం చేశాడు. ఈ రోజు తన కొడుకు బర్త్‌డే సందర్భంగా ఫ్యామిలీ ఫొటో షేర్ చేశాడు. సత్య దేవ్ భార్య పేరు దీపికా, కొడుకు పేరు సవర్ణిక్. చదవండి: షణ్ముఖ్‌తో హగ్‌లు, ముద్దులు.. స్టేజ్‌పై శ్రీహాన్ ముందే సిరి కన్నీళ్లు! బుధవారం(ఫిబ్రవరి 8) తనయుడి బర్త్‌డే సందర్భంగా భార్య, కొడుకుతో ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ‘సవర్ణిక్ మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్నాడు. నా ప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ కొడుకు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపాడు. దీంతో సత్య దేవ్ ఫ్యామిలీ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకాలం మీడియాకు దూరంగా ఉంచిన సత్య దేవ్ కొడుకు చాలా క్యూట్‌గా ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు అందమైన ఫ్యామిలీ, చూడముచ్చటైన జంట అంటూ సత్యదేవ్ దంపతులపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Satyadev (@actorsatyadev) -
ప్రియాంక చోప్రా కూతురు మాల్తీని చూశారా? ఫొటోలు వైరల్
-
డేటింగ్ రూమర్స్.. శర్వానంద్ ఎంగేజ్మెంట్లో జంటగా సిద్ధార్థ్, అదితి!
హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరి ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, వెకేషన్స్‌కి వెళ్లడి, సినిమా ఈవెంట్స్‌కి కలిసి హజరవుతుండటంతో తరచూ ఈ జంట వార్తల్లో నిలుస్తుంది. అయితే ఇంత వరకు డేటింగ్ రూమర్స్‌పై ఈజంట క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాజాగా వీరిద్దరు జంటగా ఓ యంగ్ హీరో నిశ్చితార్థం వేడుక సందడి చేశారు. కాగా టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న రక్షితా రెడ్డి అనే అమ్మాయితో నేడు శర్వానంద్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. చదవండి: డాడీ నా వల్ల కావడం లేదు.. ప్లీజ్ తిరిగి రా: రీతూ చౌదరి ఆవేదన ఈ వేడుకలో రామ్ చరణ్, నాగార్జునతో పాటు పలువురు సినీ సెలబ్రెటీలు సతీసమేతంగా హాజరై ఈ కొత్త జంటను ఆశీర్వదించారు. అలాగే హీరో సిద్ధార్థ్ కూడా తన రూమార్డ్ గర్ల్‌ఫ్రెండ్ అదితి రావ్ హైదరితో కలిసి హజరయ్యాడు. ఈ కొత్త జంటతో వీరిద్దరు తీసుకున్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో వీరి డేటింగ్ రూమర్స్ మరోసారి వార్తల్లో నిలిచాయి. కాగా ఇండస్ట్రీలో సిద్ధార్థ్, శర్వానంద్‌లు మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. శర్వా, సిద్ధార్థ్‌ల కాంబినేషన్లో సముంద్రం అనే మూవీ రాగా అందులో అదితి హీరోయిన్గా నటించింది. చదవండి: ఘనంగా శర్వానంద్ ఎంగేజ్మెంట్.. హాజరైన రామ్‌చరణ్ దంపతులు -
టీమిండియాతో జూనియర్ ఎన్టీఆర్.. ఫొటో వైరల్!
గతేడాది ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లిన తారక్ ఇండియాకు తిరిగి వచ్చాడు. క్రిస్మస్ సందర్భంగా విదేశాలకు వెళ్లిన యంగ్ టైగర్ న్యూ ఇయర్‌ను అక్కడే సెలబ్రెట్ చేసుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించిన సందర్భంగా మూవీ టీం, రామ్ చరణ్‌తో పాటు తన భార్య ప్రణతితో కలిసి అమెరికాలో సందడి చేశాడు. ఇక ఈ సందడి అనంతరం ఎన్టీఆర్ ఇండియాకు తిరిగొచ్చాడు. చదవండి: చిరంజీవి మెసేజ్‌లను అవాయిడ్ చేసిన స్టార్ యాంకర్! అసలేం జరిగిందంటే.. అయితే తాజాగా తారక్‌ను టీమిండియా కలిసిన ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం భారత జట్టు హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత జట్టులోని పలువురు క్రికెటర్లు తారక్‌ను కలిసినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలో ఎన్టీఆర్‌తో సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, యుజ్వేంద్ర చాహల్, శార్దుల్, శుభమాన్ గిల్‌తో పాటు పలువురు ఉన్నారు. అయితే వీరు ఎక్కడ కలిశారన్నది మాత్రం క్లారిటీ లేదు. వారి బ్యాక్‌గ్రౌండ్‌లో ఫుల్ లైటింగ్ సెట్, కార్లు ఉన్నాయి. చదవండి: విజయ్ వారసుడు ఓటీటీ స్ట్రీమింగ్ ఇక్కడే! అంతకు ముందే రిలీజ్? చూస్తుంటే ఇది ఓ లగ్జరీ కారు షోరూంలా కనిపిస్తోంది!. కాగా శ్రీలంకతో వన్డే సిరీస్‌ను ఘనంగా ముగించిన టీమిండియా సోమవారం (జనవరి 16న) హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది. తొలుత వన్డే సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా జనవరి18న (బుధవారం) జరగనుంది. ఈ నేపథ్యంలో నిన్న భారత జట్టు హైదరాబాద్ చేరుకుంది. -
ఘనంగా యాంకర్ లాస్య సీమంతం వేడుక, ఫొటోలు వైరల్
యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చీమ ఏనుగు జోక్స్‌తో బాగా పాపులర్ అయిన లాస్య పలు టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరించింది. పెళ్లి తర్వాత కెరీర్‌కు కాస్త గ్యాప్ ఇచ్చిన లాస్య సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే లాస్య మరోసారి తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తాను మరోసారి గర్భవతి అయినట్లు భర్త మంజునాథ్‌తో కలిసి సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తాజాగా ఆమె సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లాస్య సీమంతం వేడుకలో బిగ్‌బాస్ ఫేం గీతూ రాయల్, టీవీ నటి సుష్మ ఇతర బుల్లితెర నటీనటులు సందడి చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by 👑 𝑮𝒆𝒆𝒕𝒖 𝑹𝒐𝒚𝒂𝒍 👑 (@geeturoyal_) -
కాజల్ న్యూలుక్.. వైరల్ అవుతున్న ఫోటోలు
సాధారణంగా హీరోయిన్లు స్లిమ్‌గా, నాజూగ్గా తయారు అవడానికే ఇష్టపడుతుంటారు. అందుకు తగిన కసరత్తు కూడా చేస్తుంటారు. బరువు పెంచడం అన్నది అతి తక్కువ మంది నటీమణులే చేస్తుంటారు. కాజల్ అగర్వాల్ గురించి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. గత ఏడాది ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ నటనకు స్వస్తి చెప్తారని అందరూ భావించారు. ఆమె ఇంతకుముందు నటించడానికి ఒప్పందం కుదుర్చుకున్న ఇండియన్– 2 చిత్రం నుంచి తొలగిస్తున్నట్లు, ఆ పాత్రలో మరో నటిని ఎంపిక చేయడానికి దర్శకుడు శంకర్ సిద్ధమైనట్టు ప్రచారం కూడా జరిగింది. అందరి ఊహలను తలకిందులు చేస్తూ కాజల్ అగర్వాల్ తల్లి అయిన మూడు నాలుగు నెలలకే నటించడానికి సిద్ధమైంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఆమె మరింత అందంగా తయారవ్వడం విశేషం. ఈమె కమలహాసన్ జంటగా ఇండియన్ – 2 చిత్రంలో నటించడానికి సిద్ధమైంది. అందుకు గుర్రపు స్వారీ, కత్తి సాము వంటి విద్యల్లోనూ శిక్షణ పొందింది. తాజాగా కాజల్ అగర్వాల్ కాస్త బరువెక్కింది. ఆ ఫొటోలను తన ట్విట్టర్లో పొందుపరిచింది. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇండియన్– 2 చిత్రంలో కమలహాసన్ 90 ఏళ్ల వృద్ధుడిగా నటిస్తున్నట్లు తాజా సమాచారం. ఇప్పుడు నటి కాజల్ బరువు పెరగడానికి ఈ చిత్ర కథకు సంబంధం ఉందనే ప్రచారం సాగుతోంది. -
ఎయిర్‌పోర్టులో తారక్, మళ్లీ ఫ్యామిలీతో విదేశాలకు! నిరాశలో ప్యాన్స్
జూనియర్ ఎన్టీఆర్ సెట్లో ఎప్పుడెప్పుడు అడుగుపెడతాడా అని ఫ్యాన్స్ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో ఆర్ఆర్ఆర్ మూవీతో అలరించిన తారక్ నెక్ట్స్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరకెక్కబోయే ఈ సినిమాను ప్రకటించి నెలలు గుడుస్తున్నా ఇప్పటికీ సెట్స్‌పై రాలేదు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా నాలుగేళ్లు కేటాయించిన తారక్ మూవీ విడుదల అనంతరం కాస్తా విరామం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో కుటుంబంతో కలిసి విదేశాలు చూట్టేస్తున్నాడు. ఇక రీసెంట్గా ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్లో భాగంగా ఫ్యామిలీతో జపాన్ వెళ్లిన ఎన్టీఆర్ ఇటివలె ఇండియాకు తిరిగి వచ్చాడు. ఇక ఇప్పుడైన షూటింగ్ స్టార్ట్ చేస్తాడు అనుకుంటే మళ్లీ ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేశాడు. తాజాగా భార్య లక్ష్మి ప్రణతి, తనయులు అభయ్ రాం, భార్గవ్ రాంలతో ఎయిర్‌పోర్ట్‌లో దర్శనం ఇచ్చాడు. దాదాపు నెల రోజుల వరకు ఈ వెకేషన్లో ఉండనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఇప్పట్లో తారక్-కొరటాల మూవీ సెట్స్‌పైకి వచ్చేలా లేదంటూ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా అనంతరం భార్యతో కలిసి విదేశాలు చూట్టేసిన చరణ్ ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చాడు. ఆ వెంటనే శంకర్‌తో ఆర్సీ 15 మూవీ సెట్లో అడుగు పెట్టడమే కాకుండా తన మరో ప్రాజెక్ట్‌ను కూడా లైన్లో పెట్టాడు. కానీ తారక్ మాత్రం కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌తో చిత్రాలు ప్రకటించిన ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్స్ సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకు రావడం లేదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడా? అని నందమూరి అభిమానులంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చదవండి: కాంతారపై సంచలన వ్యాఖ్యలు, కేసు నమోదు.. నటుడికి షాకిచ్చిన కోర్టు హీరోయిన్గా పరిచయం కాబోతున్న అజిత్ రీల్ కూతురు బేబీ అనిఖా -
మాల్దీవుల్లో యాంకర్ రష్మీ రచ్చ.. వీడియో వైరల్
బుల్లితెరపై యాంకర్ రష్మీ గౌతమ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందచందాలతో పాటు తనదైన మాటతీరుతో ప్రస్తుతం టాప్ యాకర్స్‌లో ఒకరుగా కొనసాగుతుంది. బుల్లితెరపైనే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తూ అలరిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె మాల్దీవుల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
బిగ్‌బాస్ బ్యూటీ కాళ్లు పట్టుకున్న ఆర్జీవీ!
బిగ్‌బాస్ ఫేం అషురెడ్డి మరోసారి వార్తల్లో నిలిచింది. తరచూ తన బోల్డ్ ఫొటో షూట్‌ను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుంది అషు. అయితే బిగ్‌బాస్ అనంతరం ఆ మధ్య ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్య్వూతో నెట్టింట ట్రెండ్ అయిన ఆమె మరోసారి ఆర్జీవీ కారణంగానే వార్తల్లోకెక్కింది. ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంశమైన తనదైన శైలిలో స్పందించి వివాదానికి తెరలేపుతాడు. ఇక ఆయన సినిమాలు, ప్రమోషన్స్ ఎలా ఉంటాయనేది తెలిసిందే. తాజాగా వర్మ తెరకెక్కించిన మూవీ ‘డేంజరస్’. బోల్డ్ కంటెంట్‌తో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. లెస్బియన్ రొమాన్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నైనా గంగూలీ, అప్సర రాణిలు ప్రధాన పాత్రాలు పోషించారు. మూవీ రిలీజ్ దగ్గరపడుతుండటంతో తనదైన స్టైల్లో ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు. ఇందుకోసం బోల్డ్ బ్యూటీ అషురెడ్డితో వర్మ జతకట్టాడు. డేంజర్ సినిమా ప్రమోషన్స్ కోసం అషుతో ఓ ఇంటర్య్వూ ప్లాన్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంటర్య్వూలో అషురెడ్డి సోఫాలో కూర్చుని ఉండగా వర్మ కింద కూర్చుని ఆమె కాలు పట్టుకున్న ఫొటోను అషు తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ‘ఫేం కోసం ఇంత దిగజారాల’, ‘ఈసారి ఎలాంటి వివాదానికి తెరలేపుతున్నారు సార్’ అంటూ నెటిజన్లు ఈ పోస్ట్‌పై రకరకాలుగా స్పందిస్తున్నారు. View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) చదవండి: వెంకటేశ్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్, థియేటర్లో వచ్చేస్తున్న నారప్ప హీరోయిన్ అయితే అలాంటి పాత్రలు చేయొద్దా?: ట్రోలర్స్‌కు మృణాల్ ఘాటు రిప్లై -
వర్క్ ఫ్రం హోమ్ తెచ్చిన తంటా!..ఆఖరికి పెళ్లి పీటలపై కూడా
వర్క్ ఫ్రం హోమ్ మనుషులను ఎంత దారుణమైన పరిస్థితికి తీసుకువచ్చిందంటే వాళ్ల వ్యక్తిగత విషయాలకు కూడా టైం కేటాయించలేని స్థితికి తీసుకు వచ్చింది. ఈ కరోనా మహమ్మారి కారణంగా 2020 నుంచి చాలా వరకు కార్పోరేట్ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ వెసులబాటు ఇచ్చినట్లు ఇచ్చి గొడ్డు చాకిరీ చేయించుకోవడం ప్రారంభించాయి. ఆఖరికి ఇంటి వద్దనే కదా ఉండేదని వారాంతపు సెలవులను కూడా తగ్గించేశాయి కొన్ని కంపెనీలు. ఆ కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డాక కూడా చాలా కంపెనీలు ఉద్యోగులను ఆఫీసుకి వచ్చేయమని చెప్పాయి. అయినప్పటికీ చాలామంది ఉద్యోగులు దీనికి అలవాటుపడిపోయి ఆఫీసుకు రండి బాబు అని కంపెనీలు బతుమాలుకోవాల్సి వచ్చింది. కానీ కొన్ని కంపెనీలు ఇదే బెటర్ అంటూ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే కొంతమంది దీనికే అలవాటు పడిపోయి తమ వ్యక్తిగత పనులకు కూడా సమయం కేటాయించకుండా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడొక పెళ్లి కొడుకు తన పెళ్లి సమయంలో కూడా ల్యాప్‌టాప్‌పై ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. ఈ ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. అక్కడ కళ్యాణ మండపంలో ఇద్దరు పూజారులు మంత్రాలు చదువుతుండగా సదరు పెళ్లికొడుకు పెళ్లీపీటలపై కూడా ల్యాప్‌టాప్‌లో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ కనిపించాడు. అతను ల్యాప్‌టాప్‌లో ఏం చేస్తున్నాడనేది క్లారిటీ లేకపోయినప్పటికీ ఏదో ఎమర్జెన్సీ వర్కే చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటో నెట్టింట హల్చల్ చేసింది. దీంతో నెటిజన్లు మండిపడుతూ..ఇలాంటిది నేను ఎక్కడ చూడలేదు. ఏ కంపెనీ కూడా ఆఖరికి పెళ్లి సమయంలో కూడా పనిచేయమని అడగరు. ఇతని జీవితాన్ని, కెరియర్ని బ్యాలెన్స్ చేసుకోవడం తెలియడం లేదు అంటూ ఫైర్ అయ్యారు. మరికొందరు అతడికి వచ్చే భార్య ఎవరో ఆమెకు ఆల్ ద బెస్ట్ చెప్పండి అంటూ కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. View this post on Instagram A post shared by Calcutta Instagrammers (@ig_calcutta) (చదవండి: తన జుట్టును తానే తింటున్న బాలిక.. చివరికి ఆహారం....) -
దాడికి ముందు గుత్తికోయలతో ఎఫ్ఆర్వో.. ఫోటో వైరల్
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస రావు హత్యకేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. మడకం తుల(37), మంగ(43) అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు కొత్తగూడెం ఎస్పీ వినీత్ తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. సమగ్ర విచారణ జరిపి కసులో ఎవరెవరు ఉన్నారో అందరిని అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. దోషులను చట్ట ప్రకారం శిక్షిస్తామని తెలిపారు. శ్రీనివాసరావును హత్యచేసిన వారిని ఉపేక్షించేది లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఘటనకు ముందు గుత్తికోయలతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు మాట్లాడుతున్న ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని బెంబాలపాడు అటవీ ప్రాంతంలో ఎఫ్‌ఆర్‌ఓగా పనిచేస్తున్న చెలమల శ్రీనివాసరావును మంగళవారం గొత్తికోయలు హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ప్లాంటేషన్ భూముల్లో పశువులు మేపడాన్ని అడ్డుకున్నందుకే గుత్తికోయలు ఫారెస్ట్ అధికారిని చంపినట్లు తెలుస్తోంది. చదవండి: ఫారెస్ట్ అధికారి మృతిపై అనుమానాలు.. ఆయుధాలు ఇవ్వాల్సిందే.. తెలంగాణ సర్కార్‌కు అల్టిమేటం -
'నీకేం పోయే కాలం'.. రసెల్‌పై అభిమానుల ఆగ్రహం
వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంటిపై దుస్తులు లేకుండా ఫోటో దిగిన రసెల్ దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడం ఆగ్రహాం తెప్పించింది. ప్రైవేట్ లీగ్స్ మోజులో పడి దేశానికి ఆడడం మానేసిన రసెల్‌పై.. ''నీకేం పోయే కాలం.. ఈ సోకులకేం తక్కువ లేదు.. ఇలాంటి వాటిలో కాదు ఆటలో చూపించు నీ ప్రతాపం'' అంటూ మండిపడ్డారు. కాగా భారత అభిమానులు మాత్రం రసెల్‌ను దారుణంగా ట్రోల్ చేశారు. రసెల్ దిగిన న్యూడ్ ఫోటోనూ చాలామంది రణ్వీర్ సింగ్ ఫోటోతో పోలుస్తున్నారు కొన్ని నెలల క్రితం బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ఒక మ్యాగ్జైన్ కోసం ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా ఫోటోషూడ్ ఇచ్చాడు. అప్పట్లో రణ్వీర్ ఫోటోషూట్‌పై పెద్ద వివాదామే నడిచింది. తాజాగా రసెల్‌ను కూడా రణ్వీర్తో పోలుస్తూ కామెంట్స్ చేశారు. ఇక రసెల్ విండీస్ తరపున ఆడి చాలా కాలమైపోయింది. విండీస్ క్రికెట్ బోర్డు సీఈవోతో గొడవ రసెల్‌ను జాతీయ జట్టుకు దూరం చేసింది. గతేడాది టి20 ప్రపంచకప్‌లో చివరి మ్యాచ్ ఆడిన రసెల్ మళ్లీ జాతీయ జట్టు గడప తొక్కలేదు. ఇక ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ ఘోర ప్రదర్శన కనబరిచింది. కనీసం క్వాలిఫయర్ దశ కూడా దాటలేయపోయిన విండీస్ అవమానకర రీతిలో నిష్క్రమించింది. ఇక రసెల్ విండీస్ తరపున 56 వన్డేలు, 67 టి20మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఇటీవలే ఐపీఎల్లో కేకేఆర్ ఆండ్రీ రసెల్‌ను రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2023 మినీవేలంకు ముందు కేకేఆర్ 11 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అదే విధంగా 16 మందిని వేలంలోకి విడిచిపెట్టింది. ప్రస్తుతం కోల్‌కతా పర్స్‌లో రూ. 7.5 కోట్లు ఉన్నాయి. కేకేఆర్ రిటైన్ లిస్ట్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రానా, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, రింకూ సింగ్ కేకేఆర్ రిలీజ్ లిస్ట్: పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, అమన్ ఖాన్, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, అభిజీత్ తోమర్, అజింక్య రహానే, అశోక్ శర్మ, బాబా ఇంద్రజిత్, ప్రథమ్ సింగ్, రమేష్ కుమార్, రసిఖ్ సలామ్, షెల్డన్ జాక్సన్ pic.twitter.com/TXsXnEC0Zy — Out Of Context Cricket (@GemsOfCricket) November 18, 2022 pic.twitter.com/TXsXnEC0Zy — Out Of Context Cricket (@GemsOfCricket) November 18, 2022 pic.twitter.com/TXsXnEC0Zy — Out Of Context Cricket (@GemsOfCricket) November 18, 2022 wtf?! 😭😭😭 — fahad. (@abeeyaaar) November 18, 2022 చదవండి: సెలెక్టర్ల కథ ముగించారు.. రోహిత్ శర్మను ఎప్పుడు? -
మహాలక్ష్మి తల్లి కాబోతుందా? ఫొటో వైరల్
తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్, నటి మహాలక్ష్మి ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం ఈ జంట ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. దీనికి కారణం నిర్మాత రవీందర్ అతి బరువు ఉండటమే. మహాలక్ష్మి మాత్రం పొట్టిగా, నాజుగ్గా ఉంటుంది. దీంతో డబ్బు కోసమే రవీందర్‌ను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందంటూ ఆమెను నెటిజన్లు ట్రోల్ చేశారు. అంతేకాదు రవీందర్ భారీకాయం చూసి అతడిని బాడీ షేమింగ్ చేశారు నెటిజన్లు. అయితే అవేవి తమను బాధించవని, తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నామంటూ ట్రోల్స్‌పై ఈ జంట స్పందించింది. చదవండి: ఆందోళనకరంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం, నడవలేని స్థితిలో.. అంతేకాదు తరచూ ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేస్తూ ట్రోలర్స్ నోరు మూయించే ప్రయత్నం చేస్తోంది ఈ జంట. అయినప్పటికీ వారిపై ట్రోల్స్ ఆగడం లేదు. ఇదిలా ఉంటే ఈ జంట త్వరలోనే గుడ్‌న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది. మహాలక్ష్మి గర్భవతి అయినట్లు సోషల్ మీడియా జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ జంట డిన్నర్ డేట్‌కు వెళ్లిన ఫొటోలను షేర్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోను రవీందర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అయితే ఈ ఫొటోలో మహాలక్ష్మీ కాస్తా లావుగా, పొట్ట భాగం ముందుకు ఉన్నట్లుంది. చూస్తుంటే ఆమె గర్భవతి అన్నట్లుగాకనిపించింది. దీంతో ఆమెను చూసి మహాలక్ష్మి ప్రెగ్నెంటా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు దీనికి రవీందర్ ఇచ్చిన క్యాప్షన్ చూస్తుంటే అదే నిజం అనేట్టుగా ఉంది. చదవండి: అద్దె ఇంట్లో ఉండేవాళ్లం, రెంట్ కట్టలేక 2 నెలలకో ఇల్లు మారేవాళ్లం: రష్మిక ‘ఐ లవ్ యూ చెప్పడంలోనే నా సంతోషం లేదు.. నేను వ్యక్తం చేయకపోయినా నువ్వు నా కోసమే జీవించావంటూ నువ్వు చూపించే నీ నిజమైన ప్రేమ కూడా కారణం’ అంటూ ఈ ఫొటోకి రాసుకొచ్చాడు. దీంతో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెప్టెంబర్ 1న ఈ జంట ఇరువురి కుంటుంబ సభ్యుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండో వివాహం. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరి కుటుంబ సభ్యుల అంగీకారంతో ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. కెరీర్ మధ్యలో, మహాలక్ష్మి అనిల్ నేరేడిమిల్లిని వివాహం చేసుకుంది. మహాలక్ష్మికి తన మొదటి భర్తతో మగబిడ్డ జన్మనిచ్చింది. View this post on Instagram A post shared by Ravindar Chandrasekaran (@ravindarchandrasekaran) View this post on Instagram A post shared by Ravindar Chandrasekaran (@ravindarchandrasekaran) -
‘అక్కడికి వెళ్లే ధైర్యం చేయలేను’.. వైరల్‌గా మారిన ఆనంద్ మహీంద్రా ట్వీట్!
మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆనంద్ మహీంద్రా పేరు సోషల్ మీడియాలో ఎప్పుడూ వినపడుతూనే ఉంటుంది. బిజినెస్ మ్యాన్‌గా ఆయన ఎంత బిజీగా ఉన్న నెట్టింట సమయాన్ని గడుపుతుంటారు. వింతలు, వినోదం, టెక్నాలజీ తదితర అంశాలతో పాటు సామాజిక అవగాహన కల్పించే అంశాలను, వీడియోను ట్విటర్లో షేర్ చేస్తూ నెటిజన్లను పలకరిస్తుంటారు. సోషల్ మీడియాలో అంతగా చురుకుగా ఉంటారు కాబట్టే ఇటీవలే ట్విటర్లో ఏకంగా కోటి మంది ఫాలోయర్లను సంపాదించుకున్నారు. తాజాగా ఆనంద్ మహీంద్రా నెట్టింట ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో ఏముందంటే! అందులో.. అది వాహనాలు ప్రయాణిస్తున్న ఒక రోడ్ ఫోటో. ఆ రోడ్ చూసేందుకు ఎంత అద్భుతంగా ఉందో అంతే ప్రమాదకరంగా ఉంది. ఎత్తైన ప్రాంతానికి వెళ్లే రోడ్లు ఎలా ఉంటాయో తెలుసు కదా. మలుపులు ఎక్కువగా ఉంటాయి. చుట్టూ లోయలు ఉంటాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఏ మాత్రం ఆజాగ్రత్తగా వ్యవహరించినా క్షణాల్లో ప్రమాదాన్ని పలకరించాల్సి వస్తుంది. అటువంటి రోడ్డు మీద ప్రయాణం అంటే సాహసం అనే చెప్పాలి. తన ట్వీట్లో ఆనంద్ మహీంద్రా పర్వత ప్రాంతమైన లడఖ్ రోడ్ని షేర్ చేసి ఈ విధంగా కామెంట్ చేశాడు. ‘ఇంతటి అద్భుతమైన ఫోటోని షేర్ చేసినందుకు @TravelingBharat ధన్యవాదాలు. మీరు పంపిన జాబితా నా లిస్ట్‌లో ఉంచుతాను. కానీ ఆ రహదారిలో వెళ్లే ప్రసక్తే లేదు. ఒప్పకుంటున్నా, నేనంత ధైర్యం చేయలేనని’ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారడంతో నెటిజన్లు పర్వత ప్రాంతంలో వారి వారి ప్రయాణ అనుభవాలను పంచుతూ కామెంట్లు పెడుతున్నారు. Thank you @TravelingBharat for your amazing shares, many of which I RT & put on my bucket list…But there’s no way I’m visiting THIS road…I confess I don’t have the courage! https://t.co/Ujx4AAnK4j — anand mahindra (@anandmahindra) November 11, 2022 చదవండి: ఐటీలో ఫేక్ కలకలం.. యాక్సెంచర్ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే! -
ధనుశ్‌తో నటి దివ్య స్పందన, ఫొటో షేర్ చేసిన హీరోయిన్
నటుడు ధనుష్ తొలి నాళ్లలో మాస్ హీరోగా చూపించిన చిత్రాల్లో పొల్లాదవన్ ఒకటి. అంతకు ముందు ఇదే టైపులతో నటుడు రజనీకాంత్ నటించిన చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ధనుష్ హీరోగా నటించిన పొల్లాదవన్ పేరుతో చిత్రం చేస్తున్నారనగానే చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఇది దర్శకుడు వెట్రి మారన్ తొలి చిత్రం. ధనుష్ పుదుపేట చిత్ర సక్సెస్‌తో మంచి జోరులో ఉన్న ప్పుడు ఆ తరువాత ఆయన హీరోగా వెట్రిమారన్ తెరకెక్కించిన చిత్రం పొల్లాదవన్. చదవండి: తన స్థానంలోకి కొత్త యాంకర్ ఎంట్రీ.. స్పందించిన రష్మీ గౌతమ్ గ్రూప్ కంపెనీ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో ధనుశ్కు జంటగా నటి దివ్య స్పందన నటించారు. కాగా ఈ చిత్రం 2007లో విడుదలైంది. దీంతో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అందులో పని చేసిన నటీనటులు, సాంకేతిక వర్గం మంగళవారం చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో పార్టీ జరుపుకున్నారు. ఇందులో ధనుష్ జంటగా నటించిన నటి దివ్య స్పందన కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ధనుశ్‌తో సెల్ఫీ దిగిన ఫొటోను ఆమె తన ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Ramya|Divya Spandana (@divyaspandana) -
కాబోయే భర్తతో హన్సిక పర్సనల్ ఫొటో లీక్.. స్పందించిన హీరోయిన్
హీరోయిన్ హన్సిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. తన స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సోహెల్ ఖతూరియాతో డిసెంబర్లో ఏడడుగులు వేయబోతోంది. ఇటీవల హన్సిక కాబోయే భర్తను కూడా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ప్యారిస్‌లో ఈఫిల్ టవర్ వద్ద రొమాంటిక్ డేట్లో ప్రియుడు ప్రపోజ్ చేసిన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ షేర్ చేసి తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి హన్సిక, ఆమె కాబోయే భర్త గురించిన పలు ఆసక్తిక విషయాలు వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి హన్సిక ఆమె ప్రియుడు వార్తల్లోకెక్కారు. వీరిద్దరి పర్సనల్ ఫొటో ఒకటి తాజాగా లీకైంది. చదవండి: చివరి రోజుల్లో ‘మహానటి’ సావిత్రికి సెట్లో అవమానం, అన్నం కూడా పెట్టకుండా.. దీంతో ఈ ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ బోట్లో సరదాగా షికారుకు వెళ్తూ కనిపించారు. hansika.officiaal అనే పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ఈ ఫొటోను షేర్ చేశారు. దీనిపై హన్సిక స్పందిస్తూ ఇది తన అకౌంట్ కాదని, ఫేక్ అకౌంట్ అని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు ఈ ఫొటో తను షేర్ చేసింది కాదని కూడా స్పష్టం చేసింది. దీంతో ఆమె ఫాలోవర్స్, నెటిజన్లు హన్సిక, సోహెల్ పిక్‌పై క్యూట్ కపుల్ అంటూ రకరకాల కామెంట్స్‌తో స్పందిస్తున్నారు. కాగా రాజస్థాన్ జైపూర్‌లోని ఓ రాజకోటలో డిసెంబర్ 4న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. డిసెంబర్ 2 నుంచి వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి. చదవండి: రెండు ఓటీటీల్లోకి రానున్న ఊర్వశివో రాక్షసివో, స్ట్రీమింగ్ అప్పుడే View this post on Instagram A post shared by 👑 👑 👑 HANSU IS MY WORLD 👑 👑 👑 (@hansika.officiaal) -
అమెరికాలో కొత్త వ్యక్తితో అనసూయ, నా సంరక్షకుడంటూ పోస్ట్, నెటిజన్ల ఆరా
అనసూయ భరద్వాజ్.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదని పేరు. యాంకర్‌గా, నటిగా తనకంటూ పరిశ్రమంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో తను చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తరచూ హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ గ్లామర్ షో చేస్తుంది. ఈ క్రమంలో ఆమె తీవ్ర స్థాయిలో ట్రోల్స్‌ను కూడా ఎదుర్కుంటుంది. అయితే అవేవి పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటుంది పోతుంది ఈ రంగమ్మత్త. ఇదిలా ఉంటే ప్రస్తుతం అనసూయ తానా వేడుకల నేపథ్యంలో అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. దీపావళి పండగను కూడా కుటుంబానికి దూరంగా ఫ్రెండ్స్‌తో కలిసి సెలబ్రెట్ చేసుకుంది. అక్కడ ఆమె సందడి చేస్తున్న ఫొటోలను ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్డేట్ చేస్తూ వస్తోంది ఈ యాంకరమ్మ. ఈ క్రమంలో తన ఇన్‌స్టా స్టోరీలో ఓ కొత్త వ్యక్తితో క్లోజ్‌గా దిగిన ఫొటో దర్శనం ఇచ్చింది. దీంతో నెటిజన్ల దృష్టి ఆ కొత్త వ్యక్తిపై పడింది. తన పోస్ట్‌లో అనసూయ అతడికి బర్త్‌డే విషెస్ చెబుతూ ఆసక్తికరంగా క్యాప్షన్ ఇవ్వడంతో అతనేవరో తెలుసుకోనుందుకే నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. అనసూయ అతడిని ఉద్దేశిస్తూ.. ‘నా సంరక్షకుడు, స్నేహితుడు.. నేను జెర్రీ అయితే తను టామ్ అవుతాడు’ హ్యాపీ బర్త్‌డే అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు ఈ సందర్భంగా అతడి పేరు ఉజ్వల్ అని కూడా పేర్కొంది. దీంతో ఎవరీ ఉజ్వల్ అంటూ నెటజన్లు ఆరా తీయగా అతడు ఓ నటుడని తెలిసింది. తెలుగులో అతడు నటించింది ఒకేఒక్క సినిమా. అది కూడా రిలీజ్‌కు నోచుకోలేదు. అదేంటంటే అడవి శేష్ స్వీయ దర్శకత్వంలో హీరోగా 2013లో నటించిన మూవీ ‘కిస్’. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఇందులో ఉజ్వల్ ఓ ప్రధాన పాత్ర పోషించాడట. ఈ సినిమా తర్వాత ఉజ్వల్ మరే చిత్రంలో నటించలేదు. ప్రస్తుతం అతడు అమెరికాలో నివసిస్తున్నాడు. అయితే అతడు అనసూయకు అంత క్లోజ్ ఎలా అయ్యాడంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనసూయ అమెరికా వెళ్లినప్పుడు అతడిని కలిసిందట. ఈ క్రమంలో ఇద్దరు మంచి స్నేహితులు అయినట్లు తెలుస్తోంది. చదవండి: ఓటీటీకి వచ్చేస్తోన్న ‘పొన్నియన్ సెల్వన్’! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
నడవలేని స్థితిలో పూజ.. ఫొటో షేర్ చేసిన ‘బుట్టబొమ్మ’
ప్రస్తుతం పుట్టబొమ్మ పూజ హెగ్డే వరుస చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగులో ఎస్ఎస్ఎమ్బీ28 (SSMB28)తో పాటు బాలీవుడ్లో రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే అందులో సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ క జాన్’ చిత్రం ఒకటి. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరపుకుంటుంది. ఇటీవల పూజా షూటింగ్ సెట్లో బర్త్‌డేను కూడా సెలబ్రెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా పూజా గాయపడినట్లు తెలుస్తోంది. తన కాలు లిగ్మెంట్ టియర్ కావడంతో ప్రస్తుతం ఆమె నడవలేని స్థితిలో ఉంది. ఈ విషయాన్ని స్వయంగా పూజనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించిది. కాలుకు పట్టి కట్టుకుని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. లిగ్మెంట్ టియర్ అయ్యిందని ఆమె తెలిపింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తాజాగా ఈ ఫొటోను షేర్ చేసింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే కంగారు పడనవసరం లేదని, తాను ప్రస్తుతం బాగానే ఉన్నానని కూడా తన పోస్ట్‌లో పేర్కొంది. అయితే ఈ గాయం ఎలా అయ్యిందనేది మాత్ర ఆమె క్లారిటీ ఇవ్వలేదు. కానీ, సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ క జాన్’ చిత్రం షూటింగ్లో యాక్షన్ సీన్స్ చేస్తుండగా తను గాయపడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా పూజ ఎస్ఎస్ఎమ్బీ28తో పాటు విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ జనగనమణ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తోంది. హిందీలో ఇప్పటికే రెండు సినిమాలు చేస్తున్న ఆమె రీసెంట్ మరో చిత్రాలనికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇందులో ఆమె రణ్వీర్ సింగ్ సరసన జోడి కట్టనుందట. -
హీరోయిన్ పూనమ్ కౌర్‌కు పెళ్లయిందా? ఆ ఫోటో వైరల్
సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది హీరోయిన్ పూనమ్ కౌర్. గత కొంతకాలంగా వెండితెరకు దూరమైన ఈ పంజాబి ముద్దుగుమ్మ నెట్టింట చేసే రచ్చ అంతా ఇంత కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూనమ్ నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. కర్వాచౌత్ (Karwa Chauth)శుభాకాంక్షలు చెబుతూ చేతిలో జల్లెడను పట్టుకొని చంద్రుడిని చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను పూనమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పడు దీనిపైనే తెగ చర్చ నడుస్తుంది. ఎందుకంటే తమ భర్త క్షేమాన్ని కోరుతూ కర్వాచౌత్‌ను పెళ్లయిన మహిళలే జరుపుకుంటారు. నార్త్‌లో ఈ పండుగను ఎక్కువగా జరుపుకుంటారు. భర్త పేరు మీద ఉపవాసం చేసి… జల్లెడలో చంద్రుడిని చూసిన వెంటనే భర్త ముఖాన్ని చూసి ఆశీర్వాదం తీసుకుంటారు. అలాంటిది పెళ్లికాని పూనమ్ కర్వాచౌత్ ఫోటోను షేర్ చేయడంపై నెటిజన్లు సందేహాలు లేవనెత్తుతున్నారు. మీకు ఇదివరకే పెళ్లయిందా? లేదా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా? అంటూ పూనమ్ పోస్టుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) -
ప్రేమలో పడ్డ పృథ్వీ షా!.. గర్ల్‌ఫ్రెండ్ ఎవరంటే..
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయాడా? అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. పృథ్వీ కొంతకాలంగా నటి నిధి తపాడియాతో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. తాజగా దసరా నవరాత్రులు పురస్కరించుకొని పృథ్వీ షా.. తన గర్ల్‌ఫ్రెండ్ నిధి తపాడియాతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు నిధి తపాడియా వద్ద గర్బా డ్యాన్స్‌కు సంబంధించిన మెళుకువలను నేర్చుకున్నట్లు సమాచారం. తాజాగా అమ్మవారి ముందు పృథ్వీ షా, నిధి తపాడియాలు దిగిన ఫోటో అందరిని ఆకట్టుకుంటుంది. మరి పృథ్వీ మనసు దోచుకున్న నిధి తపాడియా ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలో ఉంది. నిధి తపాడియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సెన్సేషన్.సోషల్ మీడియాలో ఆమెకు దాదాపు 104K ఫాలోవర్స్ ఉండడం విశేషం.స్వతహగా మంచి సింగర్ అయిన ఆమె మోడల్‌గా, నటిగానూ రాణిస్తోంది. తన అందంతో, టాలెంట్‌తో యువత మనసులను దోచుకుంటుంది. ఇక భారతదేశంలో పాపులర్ టీవీ సిరీస్‌ల్లో ఒకటైన సీఐడీలో నిధి తపాడియా నటించింది. కొన్ని ఎపిసోడ్లలో ఆమె తన నటనతో మెప్పించింది. ఇక నిధి తపాడియాకు జట్టా కొకా అనే వీడియో సాంగ్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించింది. ఈ పాటను పంజాబ్ లెజెండరీ సింగర్ కుల్వీందర్ బిల్లా పాడాడు. ఇటీవలే టోనీ కక్కర్ 'కిస్ యూ' అనే వీడియో సాంగ్‌లో మరోసారి తన అందచందాలతో కట్టిపడేసింది. ఇక టీమిండియాలోకి యువ కెరటంలా దూసుకొచ్చిన పృథ్వీ షా ప్రస్తుతం ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో బిజీగా ఉన్నాడు. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన పృథ్వీ షా బ్యాటింగ్‌లో మంచి టెక్నిక్ ఉంటుంది. ఓపెనర్‌గా జట్టుకు దూకుడైన ఆరంభాలను అందించడంలో ముందు వరుసలో ఉంటాడు. టీమిండియా తరపున పృథ్వీ షా 4 టెస్టులు, ఆరు వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఇంతకముందు పృథ్వీ షా ప్రాచిసింగ్ అనే అమ్మాయితోనూ ప్రేమ వ్యవహారం నడిపినట్లు గతంలో వార్తలు వచ్చాయి. చదవండి: బుమ్రా విషయంలో కోచ్ ద్రవిడ్ క్లారిటీ గర్బా డ్యాన్స్‌తో అలరించిన నీరజ్ చోప్రా -
వాట్ ఏ ప్రిస్క్రిప్షన్.. ఈజీగా చదివేయొచ్చు: వైరల్
ఒంట్లో బాగోలేదని డాక్టర్ వద్దకు పోతే పరీక్షలన్ని నిర్వహించి ఏవో మందులు రాసిస్తారు జౌనా!. ఐతే ఆ మందుల చీటి చూస్తే మనకేం అర్థం కాదు. చదువకున్న వాడికైనా కాస్త పరీశీలించి చూస్తే ఏదో కొంచెం అర్థమవుతుందే తప్ప ఒక పట్టాన అర్థమైతే కాదు. కేవలం మందుల షాపు వాడికి మాత్రమే అర్థమవుతుంది. ఐతే ఇక్కడో ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిన మందుల పేర్లు ఎవరైన ఈజీగా చదివేయొచ్చు. ఎందుకంటే అంత నీట్‌గా సులభంగా అర్థమైరీతీలో చాలా క్లియర్‌గా రాశాడు. వివరాల్లెళ్తే...కేరళకు చెందిన డాక్టర్ నితిన్ నారాయణ పాలక్కడ్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పీడియాట్రిక్(చిన్న పిల్లల డాక్టర్)గా పనిచేస్తున్నాడు. ఆయన గత మూడేళ్లుగా అక్కడే వైద్యుడిగా పనిచేస్తున్నాడు. తాను ఎంత బిజీగా ఉన్న ఇలానే బ్లాక్ లెటర్స్(క్యాపిటల్ లెటర్స్)లోనే రాస్తానని అంటున్నాడు. తాను బాల్యం నుంచే గుడ్ హ్యండ్ రైటింగ్ స్కిల్స్‌పై దృష్టిసారించినట్లు చెబుతున్నాడు. మిగతా డాక్టర్లు బిజీగా ఉండటం వల్ల కుదరదని కానీ తనకు చిన్నప్పటి నుంచి ఇలా నీట్‌గా రాయడం అలవాటు కాబట్టి రాయగలుగుతున్నానని తెలిపాడు. ఆ డాక్టర్‌కి సంబంధించి ప్రిస్క్రిప్షన్ చీటి ఫోటో తీసి బెన్సీ అనే వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ ఫోటో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రను కూడా ఆకర్షించింది. ఆయన కూడా ఈ వైరల్ ఫోటోని షేర్ చేస్తూ అతని విభిన్న విద్యా విధానాన్ని తేటతెల్లం చేస్తుంది. స్కూల్ లెవల్ నుంచి దృష్టి సారిస్తేనే ఇలా రాయగలం అంటూ ఆ డాక్టర్ని ట్విట్టర్లో ప్రశంసించారు. (చదవండి: భావోద్వేగ దృశ్యం.. రాహుల్‌ను చూడటంతో వెక్కి వెక్కి ఏడ్చిన యువతి) -
రష్యా చెర నుంచి బయటపడిన ఉక్రెయిన్ సైనికుడి షాకింగ్ ఫోటోలు
కీవ్: రష్యన్ల బంధిఖానా నుంచి బయటపడిన ఉక్రెయిన్ సైనికుడి షాకింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలను ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ మైఖైలో డయానోవ్ అనే ఉక్రెయిన్ సైనికుడి ఫోటోలను ట్విట్టర్లో పంచుకుంది. ఉక్రెయిన్ మంత్రిత్వశాఖ ఆ షాకింగ్ ఫోటోలతోపాటు .. రష్యా జెనివా ఒప్పందాలకు కట్టుబడి దాదాపు 204 మంది ఉక్రెనియన్ యుద్ధ ఖైదీలను విడుదల చేసినట్లు పేర్కొంది. నాజీయిజానికి చెందిన వారసత్వాన్ని రష్యా ఇలా కొనసాగిస్తోంది అనే క్యాప్షన్ జోడించి మరీ ఆ సైనికుడు ఫోటోలను పోస్ట్ చేసింది. అయితే యుద్ధం చేస్తున్నప్పుడు ఉన్న సైనికుడి రూపు చెరలో నుంచి బయటపడిన తర్వాత అత్యంత ఘోరంగా మారిపోయింది. ఆ సైనికుడు ఇతనేనా అనేంత విస్తుపోయేలా దారుణంగా ఉన్నాడు. ఒకరకంగా చెప్పాలంటే డయానోవ్ రష్యా చెర నుంచి సురక్షితంగా ప్రాణాలతో బయటపడినందుకు అదృష్టవంతుడనే చెప్పాలి. కాగా అతను మారయుపోల్లోని అజోవ్‌స్టల్ స్టీల్ వర్క్‌లను రక్షించే నిమిత్తం యుద్ధం చేస్తున్న సమయంలోనే నిర్బంధింపబడ్డాడు. రష్యా విడుదల చేసిన 250 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలలో అతను ఒకడు. ఈ క్రమంలో సదరు యుద్ధ సైనికుడి సోదరి అలోనా నామ్రష్కో మాట్లాడుతూ...అతను ముఖం చేతులపై గాయాలతో కృశించిపోయి ఉన్నాడని తెలిపింది. ప్రస్తుతం డయానోవ్ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పేర్కొంది. పేలుడు పదార్థాలలోని ఒక లోహం అతని చేతిలోకి దిగిపోయిందని, ఐతే దాన్ని వారు ఎలాంటి మత్తుమందు ఇవ్వకుండా తీయడంతో సుమారు 4 సెం.మీ ఎముకను తీసేయాల్సి వచ్చినట్లు వెల్లడించింది. అతని పరిస్థితి చాలా క్రిటకల్‌గా ఉందని, దీర్ఘకాలిక చికిత్స అవసరమని కన్నీటిపర్యంతమయ్యింది. తన సోదరుడు మానసికంగా దృఢంగా ఉన్నందుకు సంతోషంగా ఉందని, ముఖ్యంగా అతను తిరిగొచ్చినందుకు అత్యంత ఆనందంగా ఉందని చెప్పింది. డయానోవ్ కూడా తాను హాయిగా శ్వాస పీల్చుకోగలుగుతున్నాను, నడవగలుగుతున్నందుకు సంతోషంగా ఉందంటూ తన గుండె నిబ్బరాన్ని చాటుకున్నాడు. (చదవండి: దేశం వీడి పారిపోతున్న రష్యన్లు.. లక్షలు వెచ్చించి విమాన టికెట్లు కొనుగోలు) -
బ్రిటన్ రాణి సమాధి ఫోటోలు వైరల్
లండన్: క్విన్ ఎలిజబెత్ ఇకలేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేక పలువురు ఆమెతో గడిపిన మధుర క్షణాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ భావోద్వేగం చెందారు. ఆమెకు అంతిమ వీడ్కోలు ఇచ్చేందుకు ప్రపంచ దిగ్గజ నాయకులు కదలి వచ్చారు. ఎంతో అట్టహాసంగా ఆమె అంత్యక్రియలు జరిగాయి. యావత్తు బ్రిటన్ దేశం ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికింది. ఈ మేరకు బకింగ్‌హామ్ ప్యాలెస్ క్వీన్ ఎలిజబెత్ సమాధి ఫోటోలను విడుదల చేసింది. ఆమె సమాధిని కింగ్ జార్జ్ 6 మెమోరియల్ చాపెల్‌లో ఏర్పాటు చేశారు. మొత్తం సమాధిని బెల్జియన్ బ్లాక్ స్టోన్ రూపొందించిన లెడ్జర్ స్టోన్‌తో నిర్మించారు. అలాగే ఆ సమాధిపై బ్రిటన్ రాణి పేరు, ఆమె భర్త ఫిలిప్ తోపాటు, రాణి తల్లిదండ్రుల పేర్లను కూడా లిఖించారు. అంతేగాదు కింగ్ జార్జ్ 6 ఎవరో కాదు బ్రిటన్ రాణి తండ్రే. ఆయన విశ్రాంతి సమాధి వద్ద ఆమె సమాధిని కూడా ఏర్పాటు చేశారు. 1962లో ఈ మెమోరియల్ చాపెల్లోనే జార్జ్ 6 సమాధి ఏర్పాటు చేశారు. క్వీన్ ఎలిజబెత్ సెప్టెంబర్ 8న 96 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆమె తన ముత్తాతను వెనక్కినెట్టి 70 ఏళ్లపాటు సుదీర్ఘకాలం పాలించిన బ్రిటన్ రాణీగా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం దివగంత బ్రిటన్ రాణి పెద్ద కుమారుడు కింగ్ చార్లెస్ 3 బ్రిటన్ రాజుగా బాధ్యతలు చేపట్టారు. (చదవండి: ఉక్రెయిన్‌కి హ్యాండ్ ఇచ్చిన ఇజ్రాయెల్...షాక్‌లో జెలెన్ స్కీ) -
అలనాటి హీరోయిన్ గౌతమి కూతురిని చూశారా? త్వరలో హీరోయిన్గా ఎంట్రీ!
నటి గౌతమి వారసురాలిని చూశారా? నేటి హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని విధంగా తయారైంది. నటి గౌతమి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. పదహారణాల తెలుగు అమ్మాయి అయిన ఈమె 1990 ప్రాంతంలో అగ్ర కథనాయకిగా వెలిగిపోయారు. తమిళం, తెలుగు తదితర దక్షిణాది భాషల్లో కథానాయికిగా నటించిన గౌతమి మంచి ఫామ్‌లో ఉండగానే 1998లో సందీప్ భాటియా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలో స్థిరపడ్డారు. అయితే వీరి పెళ్లి కథ ఏడాదికే ముగిసిపోయింది. మనస్పర్థల కారణంగా భర్త నుంచి విడిపోయి విడాకులు తీసుకున్నారు. అప్పటికే వీరికి కూతురు పుట్టింది. ఆ పాపకు సుబ్బులక్ష్మి అని పేరు పెట్టారు. కొన్నాళ్ల తరువాత గౌతమి నటుడు కమలహాసన్‌తో సహజీవనం చేశారు. అలా పదేళ్లపాటు జరిగిన వారి సహజీవనంలో మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో గౌతమి కమలహాసన్ నుంచి దూరంగా వచ్చేసి కూతురుతో ఒంటరిగా జీవిస్తున్నారు. ఆ తరువాత సామాజిక సేవ, రాజకీయ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న గౌతమి అప్పట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిశారు. అయితే ప్రస్తుతం వాటికి కూడా దూరంగా ఉంటున్నట్టు సమాచారం. కాగా ఆమె వారసురాలు సుబ్బలక్ష్మి ఇప్పుడు వార్తల్లోకి నిలుస్తోంది. కొద్ది రోజులుగా సుబ్బులక్ష్మి తన అందమైన ఫొటోలను తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తోంది. దీంతో అవి ప్రస్తుతం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నాయి. ఇదంతా ‘హీరోయిన్గా అవకాశాల కోసమేనా?’, త్వరలోనే హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతుందా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆమెది సినీ నేపథ్య కుటుంబమే కాబట్టి సుబ్బలక్ష్మికి హీరోయిన్గా అవకాశాలు రావడం పెద్ద కష్టమేమి కాదు. ఇక త్వరలో ఆమెను హీరోయిన్గా చూసే అవకాశం లేకపోలేదు అంటున్నారు నెటిజన్లు. -
అలనాటి హీరోయిన్ల మధ్య మీనా బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
హీరోయిన్ మీనా తాజాగా తన 46వ పుట్టిన రోజును సెలబ్రెటీ స్నేహితులు మధ్య జరుపుకున్నారు. శుక్రవారం(సెప్టెంబర్ 16న) మీనా బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె తన ఇండస్ట్రీ స్నేహితులు, అలనాటి స్టార్ హీరోయిన్లు సంగీత, సంఘవి, రంభలతో కలిసి పుట్టిన రోజును జరుపుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీనాకు ఇండస్ట్రీలో చాలామంది సన్నిహితులు ఉన్నారు. సంగీత, రమ్యకృష్ణ, సంఘవి, శ్రీదేవి విజయ్ కుమార్, రంభ, స్నేహ ఇలా చాలామంది తనకు ఆప్తమిత్రులని మీనా పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల భర్తను కొల్పోయి విషాదంలో ఉన్న మీనాకు వారంతా అండగా నిలుస్తున్నారు. చదవండి: కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పిన విష్ణుప్రియ, నన్ను కూడా అలా అడిగారు.. సందర్భం వచ్చినప్పుడల్లా వారంత మీనాను కలిసి కాసేపు ఆమెతో గడుపుతున్నారు. ఈ క్రమంలో నిన్న తన పుట్టిన రోజు కావడంతో రంభ, సంగీత, సంఘవిలు కలిసి ఆమె బర్త్‌డేను సెలబ్రెట్ చేశారు. మీనాతో కేక్ కట్ చేయించి తనతో కాసేపు సరదగా గడిపారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫొటోలను మీనా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇలాటి కఠిన సమయంలో మీనాకు అండగా నిలుస్తున్న ఈ తారలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ‘నిజమైన స్నేహం అంటే మీది’, ‘మీనా గారు ఇండస్ట్రీలో మంచి స్నేహితులను పొందారు’ అంటూ ఆమె పోస్ట్‌పై ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న తారక్ భార్య, ఫొటోలు వైరల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మీడియాకు, తెరకు దూరంగా ఉండే ఆమె అందం, అభియానికి ఎంతో మంది అభిమానులున్నారు. ఎన్టీఆర్ భార్యగా ప్రణతికి నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడూ నీరాజనాలు పడుతుంటారు. ఇక భార్య గురించి పలు సందర్భాల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఆమెపై ప్రేమను చాటుకుంటుంటాడు తారక్. పెద్దగా కెమెరా ముందుకు రాని ప్రణతికి సంబంధించిన ట్రెడిషనల్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతోంది. చదవండి: ‘లైగర్’ ఫ్లాప్‌తో పారితోషికంలో భారీ మొత్తం వెనక్కిచ్చేసిన విజయ్! ఎంతంటే.. ఈ ఫొటోల్లో ప్రణతి పట్టు చీరలో డైమండ్ నగలతో కుందనపు బొమ్మలో మెరిపోతోంది. ఆమె ట్రెడిషనల్ లుక్స్‌కి నందమూరి అభిమానులు ఫిదా అవుతున్నారు. దీంతో ఆమె ఫొటోలను ఫ్యాన్స్ పేజీలో షేర్ చేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. దీంతో ట్విటర్లో ప్రణతి ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి. ఓ పెళ్లి కార్యక్రమంలో భాగంగా ప్రణతి అచ్చమైన తెలుగుంటి ఆడపడుచులా సాంప్రదాయం ఉట్టిపడేలా ముస్తాబైన ప్రణతి లేటెస్ట్ ఫొటోలపై మీరు ఓ లుక్కేయండి. చదవండి: బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్ ఈవెంట్, షాకిచ్చిన హైదరాబాద్ పోలీసులు -
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న నటి స్నేహ ఫ్యామిలీ ఫోటోలు
తన సహజ నటనతో దక్షిణాదిలో మంచి పేరు తెచ్చుకున్న నటి స్నేహ. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం అచ్చముండు అచ్చముండు చిత్రంలో నటుడు ప్రసన్నతో జత కట్టి, ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఆయన్నే జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. అలా వారి ప్రేమ పెళ్లికి ప్రతిఫలం ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, ఒక కూతురు. పిల్లల విషయంలో స్నేహ, ప్రసన్న స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) పిల్లలకు సంబంధించి ప్రతి విషయాన్ని అందమైన వేడుకగా నిర్వహించి వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటారు. అదే విధంగా సంసార జీవితంలో దశాబ్ద కాలాన్ని పూర్తి చేసుకున్నారు. కాగా గురువారం ప్రసన్న, స్నేహ కొడుకు పుట్టిన రోజు. ఈ బాబుకు ఇప్పుడు ఏడేళ్లు. దీంతో పిల్లలను రెడీ చేసే పనిలో భాగంగా స్నేహ తన ఇద్దరు పిల్లలతో స్విమ్మింగ్ పూల్‌లో కాసేపు జలకాలాడారు. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) చదవండి: (తెలుగు పరిశ్రమ అలా ముందుకెళ్లాలి) -
ఆనంద్ మహింద్ర మనసు దోచిన 'కప్పు': ఫోటో వైరల్
ప్రముఖ పారిశ్రామికవేత్త సోషల్ మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ తరుచుగా మంచి మంచి వైరల్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ వీడియోల నుంచి మంచి మంచి సందేశాలను కూడా ఇస్తుంటారు కూడా. అదే తరహాలో ఒక వైరల్ ఫోటో సోషల్ మాధ్యమంలో తెగ చక్కెర్లు కొడుతుంది. ఆ ఫోటో ఆనంద్ మహింద్ర మనసును దోచింది. ఇంతకీ ఆ ఫోటోలో ఏముందంటే...ఒక తెల్లటి కప్పు పై టిక్‌టాక్ గేమ్ ఒకటి ఉంది. అదేలా ఉందంటే... ఆ కాఫీ కప్పుపై 'థింక్ అవుట్ బాక్స్' అని ఉండి కింద గేమ్ అనుసంధానించి ఉంది. అది బాక్స్ అనే పదంలోని ఎక్స్‌తో అనుసంధానమయ్యి బాక్స్ నుంచి బయటపడే మార్గం చూపుతుంది. ఇది ఒక మంచి చక్కని సందేశాన్ని ఇచ్చిందంటూ... ఆనంద్ మహింద్ర ఆ కప్పును తెగ మెచ్చకుంటూ ఆ విషయాన్ని వివరించారు. ఈ మేరకు ఆయన ఆ సందేశం వివరిస్తూ...ఇది ఒక రకంగా మనం మన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియజేస్తోంది. నిజానికి మనం సమస్య లోనే ఉండిపోయి కాకుండా బయటగా ఉండి ఎలా బయటపడాలో అన్వేషించాలి అనే ఒక చక్కని సందేశాన్ని ఇస్తోంది. గెలిచే మార్గాలను అన్వేషించడం తోపాటు సమస్య నుంచి బయటపడే పరిష్కార మార్గాలు గురించి తెలియజేస్తోంది. అన్నారు. అంతేకాదు ఇది అద్భుతమైన కప్పు, వెంటనే తాను ఆ కప్పును తెచ్చుకుంటానంటూ ట్వీట్ చేశారు. నెటిజన్లు కూడా ఆయనతో ఏకభవిస్తూ ఔను ఇది మంచి సందేశాన్ని ఇచ్చింది. ఎలా తెలివిగా సమస్యలు పరిష్కరించుకోవాలో తెలియజేస్తోంది అంటూ ట్వీట్ చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. I’m going to get this mug. Clever. The solution to a problem often lies by joining the dots with something OUTSIDE your own ecosystem… pic.twitter.com/SedGrDN8B9 — anand mahindra (@anandmahindra) August 10, 2022 (చదవండి: Viral Video: ఆహా! కోటు వేసుకోవడం ఎంత కష్టమో... బైడెన్ చూస్తే తెలుస్తుంది) -
భార్య ప్రణతితో జూనియర్ ఎన్టీఆర్ కబుర్లు.. ఫొటో వైరల్
Jr NTR Shares Photo With Wife Lakshmi Pranathi: దర్శక ధీరుడు రాజమౌళి చెక్కిన కళాఖండం 'ఆర్ఆర్ఆర్' మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో కొమురం భీమ్‌గా నటించిన నందమూరి నట వారసత్వం జూనియర్ ఎన్టీఆర్‌కు ఎన్నో ప్రశంసలు దక్కాయి. సినిమాలతో ఎంత బిజిగా ఉన్న ఫ్యామిలీ కూడా సమయం కేటాయిస్తాడు తారక్. అప్పుడప్పుడు తన వ్యక్తిగత ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో వదులుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. తాజాగా సోషల్ మీడియాలో తారక్ పెట్టిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల కల్యాణ్ రామ్ నటించిన 'బింబిసార' ప్రీరిలీజ్ ఈవెంట్లో దర్శనమిచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. సోమవారం (ఆగస్టు 1) తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి దిగిన ఫొటోను నెట్టింట వదిలాడు తారక్. ఓ బల్లపై వీరిద్దరూ ఎదురెదురుగా కూర్చొని కబుర్లు చెప్పుకోవడం చూడముచ్చటగా ఉంది. అలాగే చేతిలో కాఫీ కప్పుతో మాట్లాడుకుంటూ ఆస్వాదిస్తున్న వీరి ఫొటోను షేర్ చేస్తూ 'ఇలాంటి క్షణాలు' అని రాసుకొచ్చాడు తారక్. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. చదవండి: నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన బికినీలో గ్లామర్ ఒలకబోస్తున్న హీరోయిన్ వేదిక.. View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) -
జాలరికి చిక్కిన బాహుబలి చేప.. చూసేందుకు ఎగబడుతున్న జనం!
సాధారణంగా జీవనోపాధికోసం వేటకు వెళ్లే జాలర్లు ఎంతో కష్ట పడితే తప్ప.. వారి శ్రమకు తగ్గ ఫలితం దొరకదు. ఒక్కోసారి రోజులు గడిచిన ఒడ్డుకు రాలేని పరిస్థితి. ఎక్కువగా చేపలు వలకు చిక్కితేనే వారు తమ కుటుంబాలను పోషించగలరు, లేదంటే పిండి కొద్ది రొట్టేలా వారి జీవనం సాగిపోతుంటుంది. అందుకే జాలర్ల జీవితం నిత్య పోరాటమని అంటుంటారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారునికి ఊహించని అనుభవం ఎదురయ్యింది. ఏకంగా భారీ బరువు గల చేపనే ఓ జాలరికి చిక్కింది. ఈ చేప బరువు అక్షరాలా 20 కిలోలు. ఇది చేపల్లో బాహుబలి. వంశధార రిజర్వాయర్‌లో మంగళవారం జాలరులకు చిక్కింది. ఈ చేపను చూడడంతో పాటు కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపారు. చివరికి ఎల్‌ఎన్‌పేట మండలం చింతలబడవంజకు చెందిన చేపల వ్యాపారి రామారావు రూ.3 వేలు చెల్లించి సొంతం చేసుకున్నారు. చదవండి: చికెన్ ఖీమా దోసె.. తిన్నారంటే.. మామూలుగా ఉండదు మరి.. -
హైదరాబాద్ మెట్రో స్టేషన్లో బిగ్‌బి సందడి, ఫొటో వైరల్
బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం పలు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. బ్రహ్మస్త్రం, ప్రాజెక్ట్ కె వంటి చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు. ఇటీవల బ్రహ్మాస్త్రం పార్ట్ 1 షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం ఆయన ప్రాజెక్ట్ కె షూటింగ్లో పాల్గొన్నాడు. ఈ మూవీ షూటింగ్ కోసం బిగ్‌బి గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఆయన రాయదుర్గం మేట్రో స్టేషన్లో సందడి చేసిన ఫొటోలు, వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. చదవండి: టాలీవుడ్లో సాయి పల్లవి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? ఓ నెటిజన్ బిగ్‌బి ఫొటోను షేర్ చేస్తూ.. ‘సాయంత్రం సమయంలో అత్యంత రద్ధిగా ఉండే మెట్రో స్టెషన్ ఇవాళ ఖాళీగా ఉంది. కేవలం కెమెరామెన్స్, ఇతర చిత్ర బృందంతో పాటు అమితాబ్ బచ్చన్ మాత్రమే ఉన్నారు’ అంటూ రాసుకొచ్చారు. నాగ్ అశ్విన్ దర్శకత్తంలో ప్రభాస్, దీపికా పదుకొనె హీరోహీరోయిన్లుగా ఈ మూవీ తెరకెక్కుతోంది. వైజయంతి మూవీస్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవల దీపికా హైదరాబాద్‌లో తన షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. చదవండి: Shruti Haasan: ప్రస్తుతం నేను ఆ సమస్యతో పోరాటం చేస్తున్నా -
శిథిలాల నడుమ.. గుండెల్ని పిండేస్తున్న ఫొటో
వైరల్: ఎటు చూసినా శిథిలాలు.. కన్నీళ్లతో అయినవాళ్ల కోసం ఎదురు చూపులు. అద్భుతం జరిగి.. ప్రాణాలతో బయటపడతారేమోననే ఒక ఆశ. కనీసం మృతదేహాలైనా దక్కుతాయని కొందరు.. భూకంపంతో కుదేలైన అఫ్గన్ గడ్డపై ప్రస్తుతం కనిపిస్తున్న ఫొటోలు ఇవి. ఈ పరిస్థితుల మధ్య గుండెల్ని పిండేస్తున్న ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. ఓ పెంపుడు కుక్క తన ఓనర్ల కోసం పడిగాపులు కాస్తోంది. పాక్టికా గ్యాన్లోని ఓచ్కీ గ్రామంలో ఓ కుటుంబం భూకంపంలో సజీవ సమాధి అయ్యింది. అయితే వాళ్ల పెంపుడు కుక్క మాత్రం ప్రాణాలతో బయటపడింది. చుట్టుపక్కల వాళ్లు తీసుకెళ్లి.. దానికి అన్నం పెడుతున్నారు. అయినా అది ధ్వంసమైన ఆ ఇంటి దగ్గరే కాపలా పుంటోంది. నాశనమైన గోడల వంక చూస్తూ.. తన యజమాని కుటుంబం కోసం పడిగాపులు కాస్తోంది. Every person in the house this dog belongs to was killed in the earthquake. Neighbours said they took him with them to feed/take care of. He keeps coming back to the destroyed house and wails. Ochki village in Gayan, Paktika.#AfghanistanEarthquake #Afghanistan pic.twitter.com/A7oCoGIn2V — Samira SR (@SSamiraSR) June 26, 2022 వారం కిందట అఫ్గనిస్థాన్‌లో సంభవించిన భారీ భూకంపం.. పదిహేను వందల మందికిపైగా పొట్టనపెట్టుకోగా.. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. భారత్ సహా ఎన్నో దేశాలు అఫ్గన్‌కు అండగా నిల్చుంటాయి. -
నీటి అడుగున తేలియాడుతూ.. చావు అంచుల వరకు
అమెరికాకు చెందిన స్విమ్మర్ అనితా అల్వరేజ్ చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది. కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న అనితా అల్వరేజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటన బుడాపెస్ట్‌లో జరుగుతున్న వరల్డ్ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్‌లో జరిగింది. 25 ఏళ్ల స్విమ్మర్ అనిత.. పూల్ దిగువ భాగంలోకి వెళ్లిన తర్వాత శ్వాస తీసుకోలేకపోయింది. సోలో ఫ్రీ ఈవెంట్లో తన రొటీన్ పూర్తి చేసిన తర్వాత అనితా సొమ్మసిల్లీ పూల్ అడుగుభాగంలోకి వెళ్లిపోయింది. అప్పటికే సృహ కోల్పోయిన అనితా నీటి అడుగున శవంలా తేలియాడుతూ కనిపించింది. ఇది గమనించిన కోచ్ ఆండ్రియా వెంటనే పూల్‌లోకి దూకి.. స్విమ్మర్ అల్వరేజ్‌ను రక్షించింది.దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అమెరికా స్విమ్మింగ్ టీమ్ దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది. గత ఏడాది బార్సిలోనాలో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్లోనూ అనితా అల్వరేజ్ పోటీల్లో పాల్గొంటూనే సొమ్మసిల్లి సృహ కోల్పోయిందని పేర్కొంది. Rapid rescue.@AFP photographers Oli Scarff and Peter Kohalmi capture the dramatic rescue of USA's Anita Alvarez from the bottom of the pool when she fainted during the women's solo free artistic swimming finals at the Budapest 2022 World Aquatics Championships pic.twitter.com/8Y0wo6lSUn — AFP News Agency (@AFP) June 23, 2022 చదవండి: మారడోనా మృతి వెనుక నిర్లక్ష్యం.. పాతికేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం విషాదం.. 25 ఏళ్లకే మృత్యు ఒడిలోకి బాస్కెట్‌బాల్ ప్లేయర్ -
కొడుకు ఫొటోను షేర్ చేసిన కాజల్.. ఈసారి ముఖం కనిపించేలా
Kajal Agarwal Shares Her Son Photo Goes Viral: ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న క్రమంలోనే 2020లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లాడింది. ఇటీవలె మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. బాబుకి నీల్ కిచ్లూ అని పేరు కూడా పెట్టేశారు. ఇక ఈ చిన్నారి రాకతో కాజల్ కుటుంబం సంతోషంలో మునిగితేలుతోంది. అయితే ఇప్పటివరకు కాజల్ తన కుమారుడిని చూపించలేదు. కొడుకుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసినప్పటికీ ముఖం మాత్రం ఎక్కడా కనిపించకుండా పోస్ట్ చేసింది. తాజాగా మరో ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది కాజల్. ఈ ఫొటోలో మాత్రం ఆ చిన్నారి ముఖం కూడా కనిపిస్తూ ఉంది. ఈ ఫొటోలో బాబును కాజల్ ఒకవైపుకు ఎత్తుకుని బెడ్‌పై పడుకుని ఉండగా, చిన్నారి ఫేస్‌కు అతని చేయి కొంచెం అడ్డంగా రావడం మనం చూడొచ్చు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అయిన ఈ ఫొటోను కాజల్ అభిమానులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. చాలా క్యూట్ అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు తమ పిల్లల ఫొటోలను పూర్తిగా చూపించకుండ ఉండేందుకుక రకరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కూడా తమ కూతురు ఫొటో ఎక్కడా లీక్ కాకుండా జాగ్రత్తపడిన విషయం తెలిసిందే. చదవండి: డ్రగ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు.. పార్టీ లోపలి వీడియో వైరల్.. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
ఇటలీలో ఫ్యామిలీతో మహేశ్ బాబు.. ఫొటో వైరల్..
Mahesh Babu Shares Selfie With Family In Italy Photo Viral: సమయం దొరికితే ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడతానని అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. సినిమా కంప్లీట్ అయితే చాలు భార్యపిల్లలతో కలిసి విదేశాలకు చెక్కేస్తాడు. ఇటీవల మహేశ్ బాబు హీరోగా నటించిన 'సర్కారు వారి పాట' ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే కాకుండా తాను నిర్మాతగా వ్యవహరించిన 'మేజర్' మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న మహేశ్ బాబు ఫ్యామిలీతో కలిసి టూర్‌కు వెళ్లారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. నమ్రతా శిరోద్కర్, గౌతమ్, సితారతో కలిసి దిగిన ఫొటోటను షేర్ చేశాడు మహేశ్ బాబు. ఈ పోస్ట్‌కు 'ఇది రోడ్ ట్రిప్. నెక్ట్స్ స్టాప్ ఇటలీ. లంచ్ విత్ ది క్రేజీస్' అంటూ మహేశ్ బాబు రాసుకొచ్చాడు. ఈ ఫొటోలో లైట్ బియర్డ్‌తో చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు మహేశ్ బాబు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో మహేశ్ లుక్ నెటిజన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చదవండి: సినిమా టికెట్ల కోసం క్యూలో మహేశ్ బాబు.. వీడియో వైరల్ సితార సోఫాలో నుంచి కిందపడిపోయింది: మహేశ్ బాబు View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
సీఎంను కలిసిన నయనతార.. పెళ్లిపై లవ్‌బర్డ్స్ క్లారిటీ
Nayanthara Vignesh Wedding: సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా కీర్తి గడించింది నయనతార. ఆమె ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారన్న వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. దక్షిణాదిన వీరిద్దరి పెళ్లి హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ పెళ్లి వార్తలు నిజమేనని ఈ జంట తాజాగా స్పష్టం చేసింది. శుక్రవారం (జూన్ 3) సాయంత్రం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసిన ఈ లవ్ బర్డ్స్ తమ వెడ్డింగ్ ఇన్విటేషన్‌కు అందజేసింది. తమ వివాహానికి హాజరు కావల్సిందిగా కోరారు. వారిని అభినందించిన సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. స్టాలిన్‌తో పాటు ఆయన కుమారుడు హీరో, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్నాడు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేష్ శివన్‌ల నిశ్చితార్తం కుటుంబసభ్యుల సమక్షంలో గతేడాది జరిగింది. తాజాగా మహాబలిపురంలోని మహబ్ హోటల్లో జూన్ 9న వీరి పెళ్లి వేడుక జరగనుంది. ఈ వివాహానికి బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు గెస్ట్‌లకు 'డిజిటల్ వీడియో ఇన్విటేషన్ కార్డ్' పంపించినట్లు తెలుస్తోంది. కాగా వీరి పెళ్లి తిరుమలలో జరగుతుందని అంతా అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో మహాబలిపురంలోని మహబ్ హోటల్లో హిందూ సాంప్రదాయాల ప్రకారం నయన్, విఘ్నేష్ వివాహం జరగనుంది. అయితే ఇదే వేదికపై జూన్ 8న సాయంత్రం సౌత్ ఇండియా సినీ పరిశ్రమలోని ప్రముఖులు, రాజకీయవేత్తల మధ్య రిసెప్షన్ గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ రిసెప్షన్‌కు రజనీ కాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, కార్తీ, శివకార్తికేయన్, విజయ్ సేతుపతికి ఆహ్వానం అందినట్లు టాక్. చదవండి: కాస్ట్లీ గిఫ్ట్‌తో సమంతను సర్ప్రైజ్ చేసిన నయనతార -
మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడిన వ్యక్తితో ఫోటో అవసరమా.. యువీకి చురకలు
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రస్తుతం అమెరికాలో బిజీబిజీగా గడుపుతున్నాడు. వర్జీనియా వేదికగా జరగనున్న యునిటీ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా పాల్గొనే యువ క్రికెటర్లకు యువీ తన సలహాలు అందించనున్నాడు. ఇదే టోర్నీకి పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆసిఫ్ కూడా వచ్చాడు. చాలాకాలం తర్వాత ఈ ఇద్దరు ఎదురుపడడంతో ఒకరినొకరు పలకరించుకొని ఫోటోకు ఫోజిచ్చారు. కాగా ఈ ఫోటోను మహ్మద్ ఆసిఫ్ తన ట్విటర్లో షేర్ చేస్తూ.. ''స్నేహానికి ఎలాంటి హద్దులు ఉండవు'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఆసిఫ్ షేర్ చేసిన ఫోటో కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. అయితే యువరాజ్ ఆసిఫ్‌తో ఫోటో దిగడంపై క్రికెట్ ఫ్యాన్స్ రెండుగా చీలిపోయారు. చిరకాల ప్రత్యర్థులుగా కనిపించే రెండు దేశాల నుంచి ఇద్దరు క్రికెటర్లు ఒకేచోట కలిసి ఫోటో దిగడం ఆనందంగా అనిపించిదని కొందరు కామెంట్స్ చేయగా.. మరికొందరు మాత్రం మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డ ఒక ఆటగాడితో ఎలా ఫోటో దిగుతావు అంటూ మరికొందరు యువరాజ్‌ను తప్పుబట్టారు. అయితే యువరాజ్ తనంతట తానుగా ఈ ఫోటోను ట్విటర్లో షేర్ చేయలేదని.. పాక్ క్రికెటర్ ఆసిఫ్ మాత్రమే షేర్ చేసుకున్నాడని.. ఇందులో యువరాజ్ తప్పేమి లేదని పేర్కొన్నారు. కాగా మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం పక్కనబెడితే మహ్మద్ ఆసిఫ్ స్వతహాగా సూపర్ బౌలర్. ఫాస్ట్ బౌలింగ్‌కు పెట్టింది పేరైన ఆసిఫ్ మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టేవాడు. పాకిస్తాన్ తరపున 72 మ్యాచ్‌లాడిన ఆసిఫ్ 168 వికెట్లు తీశాడు. అయితే 2005లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మహ్మద్ ఆసిఫ్ ఆది నుంచి వివాదాలే చుట్టుముట్టాయి. నిషేధిత డ్రగ్స్ వాడి ఒకసారి సస్పెండ్ అయిన ఆసిఫ్.. 2010లో ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగా ప్రీ ప్లాన్‌గా ఫ్రంట్ ఫుట్ నోబాల్స్ వేశాడు. ఫిక్సింగ్ ఆరోపణలు నిజమని తేలడంతో మహ్మద్ ఆసిఫ్‌పై ఐసీసీ ఏడేళ్ల నిషేధం విధించింది. ఆసిఫ్‌తో పాటు సల్మాన్ భట్, మహ్మద్ ఆమిర్‌లపై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది. అయితే 2015లో ఐసీసీ ఆసిఫ్‌పై విధించిన నిషేధాన్ని వెనక్కి తీసుకొని అన్ని ఫార్మాట్లలో ఆడొచ్చంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆసిఫ్ కొద్దిరోజులకే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. చదవండి: Chris Lynn: ఆ బ్యాటర్ పని అయిపోందన్నారు.. సెంచరీతో నోరు మూయించాడు Friendship have no limits. #YuvrajSingh #ICC #USA #dc #unitycup2022 pic.twitter.com/VJ0u5U7z3Z — Muhammad Asif (@MuhammadAsif_26) May 30, 2022 -
భారీ సిక్సర్.. బర్గర్ వ్యాన్‌లోకి దూసుకెళ్లిన బంతి
టి20 క్రికెట్ అంటేనే హిట్టింగ్‌కు మారుపేరు. క్రీజులో ఉన్నంతసేపు బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లు బాదడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. పనిలో పనిగా బ్యాటర్లు కొట్టే సిక్సర్లు ఒకసారి స్టేడియం అవతల పడితే.. మరికొన్ని సార్లు మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రేక్షకుల తలల పగిలేలా చేశాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిక్సర్ మాత్రం కాస్త విచిత్ర పద్దతిలో వెళ్లింది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టి20 బ్లాస్ట్ టోర్నమెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో బ్యాట్స్మెన్లు అవలీలగా భారీ సిక్సర్లు బాదుతున్నారు. తాజాగా మే 30న హాంప్‌షైర్, సోమర్సెట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హాంప్‌షైర్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో జేమ్స్ ఫుల్లర్ వాండర్‌మెర్వ్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. భారీ ఎత్తులో వెళ్లిన సిక్స్ నేరుగా స్టాండ్స్‌లో బర్గర్ వ్యాన్‌లోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ ప్రేక్షకులు ఎక్కువ లేకపోవడంతో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కాగా బర్గర్ సర్వ్ చేస్తున్న వ్యక్తి వ్యాన్‌లోకి దూసుకొచ్చిన బంతిని చేతిలోకి తీసుకొని ఒక స్టిల్ ఇవ్వడం మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే జేమ్స్ ఫుల్లర్ 42 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికి హాంప్‌షైర్ 123 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ 25 బంతులు మిగిలిఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. చదవండి: 'అవమానాలు తట్టుకుని నా భర్త విజయం సాధించాడు.. అందుకే' ఐదేళ్ల స్నేహం! వివాహ బంధంతో ఒక్కటైన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు James Fuller gets hold of this 😳@James_Fuller246 | @hantscricket | #Blast22 pic.twitter.com/jB2ke5mRuT — Vitality Blast (@VitalityBlast) May 31, 2022 Guess which player hit the match ball into a burger van at the Ageas Bowl tonight? 😆#Blast22 pic.twitter.com/YXBICflW3J — Vitality Blast (@VitalityBlast) May 30, 2022 -
న్యూలుక్స్తో దుమ్మురేపుతున్న టీమిండియా మాజీ కోచ్
టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి శుక్రవారం కొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు. ఈ మధ్య కాలంలో క్రికెట్ అంశాలు తప్ప రవిశాస్త్రి గురించి పెద్దగా చర్చించుకోవాల్సింది ఏం లేదు. అయితే తాజాగా ట్విటర్ వేదికగా రవిశాస్త్రి రిలీజ్ చేసిన రెండు ఫోటోలు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. క్రికెటర్ రవిశాస్త్రిలా కాకుండా స్వాగ్లుక్తో అదరగొడుతున్నాడు. తొలి ఫోటోలో ఫ్లాషీ జాకెట్‌తో.. మెడల్ గోల్డ్ చైన్.. కూలింగ్ గ్లాసెస్.. ఎవరికో చేతులు ఊపుతూ రస్టిక్ లుక్‌లో కనిపించాడు. ''నా ఫ్యామిలీ ముంబైలో ఉంది.. నేను ఈ క్షణంతో గడుపుతున్నా'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక రెండో ఫోటోలో గుడ్‌మార్నింగ్ చెబుతూ.. ''నిద్రపోని వారికి గుడ్ మార్నింగ్ అనేది ఆప్షనల్‌గా కనిపిస్తుంది.'' అని పేర్కొన్నాడు. ఇక చివరగా మూడో ఫోటోను రిలీజ్ చేశాడు. ఆ ఫోటోలో ఒకావిడతో చాట్ చేస్తూ కనిపించిన రవిశాస్త్రి.. ''నేను ఆమె కలలో ఉన్నాను.. అయితే ఆమె మాత్రం నా వీఐపీ గెస్ట్లిస్ట్లో ఒకరు'' అంటూ క్యాప్షన్ పేర్కొన్నాడు. రవిశాస్త్రి ప్రస్తుతం ఐపీఎల్ 2022(ఇండియన్ ప్రీమియర్ లీగ్) బ్రాడ్కాస్ట్ డ్యూటీ నిర్వహిస్తున్నాడు. ఆటగాళ్ల బ్యాటింగ్, ఆటతీరు, ఫామ్ తదితర అంశాలపై చర్చలు జరుపుతూ బిజీబిజీగా ఉన్నాడు. కాగా గతేడాది టి20 ప్రపంచకప్ వరకు రవిశాస్త్రి టీమిండియా హెడ్‌కోచ్‌గా వ్యవహరించాడు. అయితేఘా టోర్నీలో టీమిండియా సూపర్-12 దశను దాటలేక చతికిలపడింది. అందునా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో భారత ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కాగా అతని హయాంలో టీమిండియా మేజర్ టోర్నీల్లో గెలవనప్పటికి స్వదేశంలో, విదేశాల్లో చారిత్రాక సిరీస్‌లు గెలిచింది. ఇక టీమిండియా తరపున మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన రవిశాస్త్రి టీమిండియా తరపున 80 టెస్టులు, 150 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: Babar Azam: నిబంధన తుంగలో తొక్కిన పాక్ కెప్టెన్.. పీసీబీ సీరియస్ My family lives in Mumbai and I live in the moment. pic.twitter.com/22BBncYoDL — Ravi Shastri (@RaviShastriOfc) May 20, 2022 ‘Good mornings’ are optional if you haven’t slept at all. pic.twitter.com/4OhSYEg3Ln — Ravi Shastri (@RaviShastriOfc) May 20, 2022 You’re in her DMs. She’s on my VIP guestlist. pic.twitter.com/eJTzoVKMz3 — Ravi Shastri (@RaviShastriOfc) May 20, 2022 -
భర్తతో నిహారిక రొమాంటిక్ ఫోటో లీక్
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన నిహారిక ప్రస్తుతం ప్రొడ్యూసర్‌గా రాణిస్తుంది. ఈ మధ్యకాలంలో వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్న నిహారిక పేరు మరోసారి హాట్‌టిపిక్‌గా మారింది. భర్తతో నిహారిక లిప్‌లాక్ ఫోటో ఒకటి బయటికొచ్చింది. విడిపోని బంధం అంటూ నిహారిక భర్తతో దిగిన రొమాంటిక్ ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. గత కొంతకాలంగా నిహారిక పర్సనల్ లైఫ్‌కి సంబంధించి రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి చెక్ పెట్టేందుకే నిహారిక ఇలాంటి ఫోటోతో సమాధానమిచ్చిందంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. ఇంత బోల్డ్ అవసరమా అంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఈ ఫోటోను నిహారిక షేర్ చేయలేదు. అంతేకాకుండా ఇది లేటెస్ట్ పిక్ కూడా కాదు. నిహారిక కొణిదెల పేరుతో ఎవరో ఓ అకౌంట్‌ను క్రియేట్ చేసి ఈ బోల్డ్ పిక్‌ను షేర్ చేశారు. కాసేపట్లో ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. -
క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న కేజీయఫ్ బ్యూటీ శ్రీనిధి
కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసిన కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన కేజీయప్ చాప్టర్ 1కు సీక్వెల్‌గా వచ్చిన కేజీయఫ్ చాప్టర్ 2 ఇటీవలె రిలీజ్ అయి మరోసారి కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ చిత్రంలో యశ్‌కు జోడీగా నటించిన శ్రీనిధి పాత్రకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. తొలి సినిమాతోనే స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న శ్రీనిధికి వరస అవకాశాలు క్యూ కడుతున్నాయి. త్వరలోనే కోబ్రా అనే సినిమాతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక ఈ సినిమా రిలీజ్ అనంతరం తెలుగు సినిమాలపై దృష్టి పెడతానంటోంది ఈ బ్యూటీ. ఇప్పటికే తెలుగు భాషపై పట్టు సాధించానని, త్వరలోనే టాలీవుడ్ తప్పకుండా సినిమా చేస్తానని ఇటీవల ఓ ఇంటర్య్వూలో చెప్పింది. మోడల్‌గా కేరీర్‌ను ప్రారంభించిన శ్రీనిధి కేజీయఫ్ తొలి సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కేజీయఫ్ చాప్టర్ 1 పాన్ ఇండియా సినిమాగా సత్తా చాటింది. దీంతో కేజీయఫ్ చాప్టర్ 2పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ 14న వచ్చిన కేజీయఫ్ 2 అంచనాలను మించి సూపర్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. విడుదలైన 12 రోజుల్లోనే ఈ మూవీ రూ. 900 కోట్లకు పైగా వసూళు చేసి 1000 కోట్ట క్లబ్‌లోకి చేరువలో ఉంది. ఇక ప్రస్తుతం కేజీఎఫ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ వరసగా ఫొటోషూట్లకు ఫోజులు ఇస్తోంది. దీంతో ఆమె బ్యూటీఫుల్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
కరీంనగర్లో మరో ‘పుష్ప’ భన్వర్‌సింగ్.. వైరల్
సాక్షి,కరీంనగర్‌క్రైం: మలయాళ నటుడు ఫహాద్ పాసిల్ పుష్ప సినిమాలో భన్వర్‌సింగ్ షెకావత్ పేరుతో పోలీస్ క్యారెక్టర్ చేశారు. కరీంనగర్లో అచ్చు ఆయనలాగే ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ఉన్నారు. దీంతో ఆయనతో ఫొటోలు దిగేందుకు చాలామంది పోటీ పడుతున్నారు. ఈ విషయం కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరో ఘటనలో.. బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభం సాక్షి,కరీంనగర్: నాణ్యమైన విద్యనందించడమే బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ లక్ష్యమని మేనేజింగ్ డైరెక్టర్ నిర్వన్ బిర్లా అన్నారు. కరీంనగర్ పట్టణంలో మొట్టమొదటిసారిగా ట్రినిటి విద్యాసంస్థల అధినేత దాసరి ప్రశాంత్ రెడ్డిచే స్థాపించబడిన ఇంటర్నేషనల్ స్కూల్‌ను బుధవారం ఆయన ప్రార ంభించారు. ట్రినిటి విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణలో నాణ్యమైన విద్యనందించడాని కి కరీంనగర్‌కు బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్‌ను తీసుకువచ్చామని పేర్కొన్నారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ప్రమోటర్ బీవోఎంఐఎస్ డాక్టర్ జి.బాలసుబ్రహ్మణ్యం, ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ వీబీఎస్సీ ఎలమంచిలి సందీప్, డైరెక్టర్ ఆఫ్ సౌత్ మాస్టర్ బీవోఎంఐఎస్ ఎల్బీ నగర్ విష్ణువర్దన్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ భవిత విశ్వచేతన్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ప్చ్.. వీళ్లింతే.! -
బేబీ బంప్‌తో షాకిచ్చిన అనుపమ.. కంగ్రాట్స్ అంటూ కామెంట్స్
Anupama Parameswaran Shares Baby Bump Photos Goes Viral: 'ప్రేమమ్' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అనుపమ తాజాగా రౌడీ బాయ్స్ చిత్రంతో ఆకట్టుకుంది. ఇక ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా కనిపిస్తుంటుంది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. తాజాగా అనుపమ షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. బేబీ బంప్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ చిరునవ్వులు చిందించింది. అనుపమకు పెళ్లి ఎప్పుడు అయ్యింది? ఈ బేబీ బంప్ ఏంటి అన్నదే కదా మీ డౌటు. నిజానికి ఇది రియల్ బేబీ బంప్ కాదు. 2019లో ఓ మలయాళ చిత్రం షూటింగ్లో భాగంగా తీసుకున్న ఫోటో. ఇందులో అనుపమ తండ్రి కూడా ఉన్నారు. కాగా అనుపమ ఈ త్రోబ్యాక్ పిక్చర్‌ని షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది. నటి, లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ సైతం ఈ ఫోటోకు స్పందిస్తూ.. 'బేబ్..ఒక్కక్షణం నేను కంగ్రాట్స్ అని టైప్ చేయబోతున్నాను' అంటూ కామెంట్ చేయగా.. దీనికి అనుపమ ఊప్స్ అంటూ ఫన్నీగా బదులిచ్చింది. పలువురు నెటిజన్లు సైతం అనుపమ ఫోటోను చూసి మీరు నిజంగానే ప్రెగ్నెంట్ అనుకున్నా అంటూ కామెంట్స్ చేశారు. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
ప్రేయసిని పెళ్లాడిన ప్రముఖ కమెడియన్, ఆకట్టుకుంటున్నపెళ్లి ఫొటోలు
ప్రముఖ స్టాండప్ కమెడియన్ బెన్నీ స్టెబస్టియన్ ఓ ఇంటి వాడయ్యాడు. అతడి చిరకాల స్నేహితురాలు, గర్ల్‌ఫ్రెండ్ ట్రాసి అలిసోన్తో ఆదివారం ఏడడుగులు వేశాడు. ఆదివారం కొద్ది మంది బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో గోవాలో వీరి వివాహ వేడుక జరిగింది. కాగా బెన్నీ స్టాండప్ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకోగా, ట్రాసి అలిసోన్ డెంటిస్ట్‌గా పని చేస్తుంది. కాగా గోవాలో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది. వీరి డ్రీమ్ వైట్ ప్రైవేటు వెడ్డింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఈ జంట స్నేహితులు, సన్నిహితులు సోషల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు. మిస్టర్ హ్యాండ్సమ్ సెబాస్టియన్ అంటూ కమెడియన్ ఆకాశ్ గుప్తా ఈ ఫొటోలను షేర్ చేశాడు. స్టెబాస్టియన్ వైట్ షూట్ ధరించగా, అతడి గర్ల్‌ఫ్రెండ్ వైట్ ఫ్రాంక్‌లో మెరిసిపోయారు. మరో ఫొటోలు హిందు సంప్రాదాయం ప్రకారం బెన్నీ శర్వానీ ధరించి కనిపించాడు. రెండు విభిన్న సంప్రదాయాల్లో జరిగివన ఈ జంట వెడ్డింగ్ ఫొటోలను నెటిజన్లు బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by highonkennysebastian (@highonkennethsebastian) -
తొలిసారి బేబీ బంప్ ఫోటో షేర్ చేసిన కాజల్ అగర్వాల్
Kajal Aggarwal Shares First Photo With Baby Bump, Pic Goes Viral: అందాల చందమామ కాజల్ అగర్వాల్ త్వరలోనే తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. న్యూ ఇయర్ సందర్భంగా కౌజల్ భర్త గౌతమ్ కిచ్లు ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు. ఈ కొత్త సంవత్సరంలో నీ రాక కోసం ఎదురు చూస్తున్నామంటూ గర్భవతి మహిళ ఎమోజీని క్యాప్షన్‌తో ఓ ఫొటోను షేర్ చేశాడు. దీంతో కాజల్ దంపతులకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక భర్త ప్రకటన అనంతరం కాజల్ తొలిసారిగా బేబీ బంప్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇది వరకే ప్రెగ్నీన్సీపై వార్తలు వచ్చినా కాజల్ మాత్రం తన బేబీ బంప్‌ను కవర్ చేస్తుండేది. కానీ తాజాగా భర్తతో దిగిన ఓ ఫోటోను షేర్చేస్తూ 2022 అంటూ లవ్ సింబల్‌ను యాడ్ చేసింది. ఈ ఫోటోలో కాజల్ బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
సార్.. ఫోజులు తర్వాత.. ముందు గ్యాస్ వెలిగించు
లక్నో: సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. చాలా మంది సెలబ్రిటీ స్టేటస్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగా శ్రమించిన వారు విన్ అవుతుంటే.. ఏం లేకపోయినా.. హడావుడి చేసే బాపతు బ్యాచ్ మాత్రం తుస్సుమంటున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు.. సార్ చాలా శ్రమ పడి ఫోజులిచ్చారు కానీ.. మీ ప్రయత్నం వృథా అయ్యింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆ వివరాలు.. కాన్పూర్ కమిషనర్, ఐఏఎస్ అధికారి రాజ్ శేఖర్ ఆదివారం వంటింట్లో గరిటె పట్టిన ఫోటోని ఒకదాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి.. వంటలో నా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాను.. ఉదయం టిఫిన్ కోసం పోహా తయారు చేస్తున్నాను.. అది కూడా హోం మినిస్టర్ అధ్వర్యంలో’’ అనే క్యాప్షన్‌తో ఫోటోని షేర్ చేశారు. (చదవండి: ఒమిక్రాన్ అందరిని చంపేస్తుందంటూ హత్యలు చేసిన డాక్టర్!) Please wish me Good Luck. Trying my luck in Cooking…😊 Preparing the Poha for the Breakfast under guidance of Home Minister…😊 pic.twitter.com/y607j5Yzr1 — Raj Shekhar IAS (@rajiasup) December 19, 2021 ఇక దీనిలో రాజ్ శేఖర్.. నీటుగా సూటు బూటు వేసుకుని తయారయి ఉన్నారు. అన్నింటికంటే.. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. వంట చేస్తున్నానని చెప్పారు.. కానీ గ్యాస్ వెలిగించి లేదు. ఇది గమనించుకోకుండా.. ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కానీ నెటిజనులు ఎంత జాగ్రత్తగా గమనిస్తారో తెలుసు కదా.. దాంతో కమిషనర్ పరువు పొగొట్టుకునే పరిస్థితి తలెత్తింది. (చదవండి: వివాహం అయిన ఐదు నెలలకే తన భార్యకు మళ్లీ పెళ్లి) ఈ ఫోటో చూసిన నెటిజనులు.. ‘‘సార్.. వంట బాగా చేశావ్.. స్టవ్ వెలిగిస్తే.. ఇంకా బాగుండేదేమో’’.. ‘‘సూటు బూటు వేసుకుని వంట చేస్తారా ఎవరైనా’’.. ‘‘గ్యాస్ ధర చుక్కలనంటుతుంది.. మీరేమో మంటతో పని లేకుండా వంట చేశారు.. ఆ టెక్నిక్ మాకు కూడా చెప్పండి’’.. ‘‘ఈ ఫోటోని గనక ఐక్యరాజ్యసమితి చూస్తే.. దెబ్బకు మూర్ఛపోతుంది.. మీ ఐడియాను తెగ ప్రశంసిస్తుంది.. గ్లోబల్ వార్మింగ్ కూడా సగానికి సగం తగ్గుతుంది’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. Cooking without fire while dressed in a suit ...yeah you do need help. Help in staging social media pics https://t.co/XQsfY2RpvQ — Lady Andolan Jeevi 🏳️🌈 (@LadyDramadragon) December 20, 2021 చదవండి: మినీ విమానం వచ్చేసింది.. ఎగిరిపోవడానికి రెడీనా? -
మాజీ భర్తతో ఎయిర్‌పోర్ట్‌లో మలైకా.. ఫోటోలు వైరల్
Malaika Arora Reunites With Ex Husband Arbaaz Khan Photo Viral: బాలీవుడ్ నటి మలైకా అరోరా, మాజీ భర్త అర్బాజ్ ఖాన్‌తో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. మాజీ భార్యభర్తలిద్దరూ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. వీరి కుమారుడు అర్హాన్‌ను రిసీవ్ చేసుకోవడం కోసం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. చదువు నిమిత్తం విదేశాలకు వెళ్లిన అర్హాన్.. క్రిస్టమస్ సెలవుల సందర్భంగా ఇండియా వచ్చాడు. కుమారుడిని రిసీవ్ చేసుకోవడం కోసం మలైకా-అర్బాజ్ ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. (చదవండి: ఎంతోసేపటిదాకా ఏడుస్తూనే ఉండిపోయా: హీరోయిన్) అర్హాన్ని చూసి మలైకా భావోద్వేగానికి గురయ్యారు. కుమారుడిని కౌగిలించుకుని కంట తడిపెట్టారు. అర్బాజ్ కూడా అర్హాన్‌ను కౌగిలించుకుని ఆనందం వ్యక్తం చేశాడు. వీరు ముగ్గురు కలిసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. గతంలో కూడా ఓ సారి మలైకా మాజీ భర్త అర్బాజ్‌తో కలిసి కనిపించారు. అర్హాన్‌తో కలిసి మాజీ దంపతులిద్దరూ లంచ్ కోసం బయటకు వెళ్లారు. (చదవండి: మలైకతో అర్జున్ డేటింగ్, తన గతాన్ని గౌరవిస్తున్నాను) మలైకా-అర్బాజ్‌లకు 1998లో వివాహం అయ్యింది. 18 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత 2017లో వీరు విడాకులు తీసుకున్నారు. కుమారుడు అర్హాన్ కోసం అప్పుడప్పుడు కలుస్తుంటారు. ప్రస్తుతం మలైకా హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తుండగా.. అర్బాజ్ ఇటాలియన్ మోడల్‌తో రిలేషన్లో ఉన్నారు. చదవండి: రేర్ వీడియో: పార్టీలో సల్మాన్ సోదరుల జోష్, వీడియో వైరల్! -
Samantha-Katrina: సమంత బాటలో కత్రీనా.. సేమ్ సీన్ రిపీట్
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్తాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో.. అత్యంత సన్నిహితులు సమక్షంలో గురువారం అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం విక్ట్రీనా పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. పెళ్లి దుస్తుల్లో అందంగా.. మేడ్ ఫర్ ఇచ్ అదర్‌లా ఉన్నారు ఇద్దరు. ముఖ్యంగా కత్రీనా సబ్యసాచి డిజైన్ చేసిన ఎరుపు లెహంగాలో అందంగా మెరిసిపోయింది. వివాహ తంతు జరుగుతున్న సమయంలో కత్రిన భావోద్వేగానికి గురయ్యారు. సంతోషంతో కన్నీరు పెట్టుకున్నారు. ప్రేమించిన వాడిని జీవిత భాగస్వామిగా పొందుతున్న వేళ.. పట్టరాని సంతోషంతో కత్రినా ఉద్వేగానికి గురయ్యారు. ఇక విక్కీ జీవితాంతం ఆమె చేతిని వీడనంటూ.. గట్టిగా పట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో తెగ వైరలవుతోంది. (చదవండి: భార్యభర్తలుగా కత్రినా కైఫ్, విక్కీ కౌశల్.. వైరలవుతోన్న వెడ్డింగ్ ఫోటోలు..) దీన్ని చూసిన నెటిజనులు సమంతను గుర్తు చేసుకున్నారు. చైతూతో వివాహం జరుగుతున్న వేళ సమంత కూడా ఇలానే పట్టరాని సంతోషంతో కన్నీరు పెట్టుకున్నారు. విక్ట్రీనా వివాహంలో కూడా ఇదే సీన్ రిపీట్ కావడం నెటిజనుల దృష్టిని ఆకర్షించింది. (చదవండి: పెళ్లికి సిద్ధమవుతున్న మరో స్టార్ హీరోయిన్, ఇదిగో ప్రూఫ్..) ఇక నూతన దంపతులకు బాలీవుడ్ సెలబ్రిటీలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జీవితాంతం సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. చదవండి: విక్కీ-కత్రినాల వివాహం.. సల్మాన్ రియాక్షన్ ఇలా ఉంటుందా..! (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పడుచు కుర్రాడనుకుంటున్నారా.. అసలు వయసు తెలిస్తే.. షాకవుతారు
సామాన్యంగా జనాలకు ముఖ్యంగా సెలబ్రిటీలకు వృద్ధాప్యం అంటే చాలా భయం. వయసు మీదపడుతున్న కొద్ది.. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. డైటింగ్, ఎక్సర్సైజ్, సర్జరీలు, స్టెరాయిడ్స్ వాడటం వంటివి చేస్తుంటారు. ఎన్ని చేసినా ఓ వయసు వచ్చే వరకు మాత్రమే. ఆ తర్వాత ఆటోమెటిగ్గా మనకు ఇంట్రెస్ట్ తగ్గుతుంది. కానీ కొందరు మాత్రం వ్యాయమాన్ని తమ జీవితంలో భాగం చేసుకుంటారు. ఏళ్ల తరబడి దాన్ని అలానే కొనసాగిస్తారు. దాని ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే ఇది చదవాల్సిందే. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో తెగ వైరలవుతోంది. ఇది చూసిన జనాలు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడుతున్నారు. ఇదేలా సాధ్యం అయ్యింది అని ప్రశ్నిస్తున్నారు. ఆ వివరాలు తెలుసుకునేముందు ఓ సారి పైన ఉన్న ఫోటోను జాగ్రత్తగా పరిశీలించండి. అతడిని చూడగానే మంచి బాడీబిల్డర్‌లా ఉన్నాడు.. ఏవైనా పోటీలకు సిద్ధం అవుతున్నాడేమో అనిపిస్తుంది. వయసు అంటే మహా అయితే 30-35 మధ్యన ఉంటుంది అనిపిస్తుంది కదా. (చదవండి: Science Facts: ఎక్సర్సైజ్ చేస్తే దేహాకృతి మారుతుందా? ఎంతవరకు నిజం..) అదుగో అక్కడే మీరు తప్పులో కాలేశారు. అతడి అసలు వయసు తెలిస్తే మీరు ఓ నిమిషం పాటు షాక్‌కు గురవుతారు. ఎందుకంటే అతడు 72 ఏళ్ల వ్యక్తి. కానీ చూడ్డానికి మాత్రం 30 ఏళ్ల పడుచు కుర్రాడిలా ఉన్నాడు. వామ్మో ఫించను తీసుకోవాల్సిన వయసులో ఈ బాడీ బిల్డింగ్ ఏంట్రా సామీ అనిపిస్తుంది కదా. ఫోటోలోని వ్యక్తి పేరు జిన్మిన్ యాంగ్. గత 30 ఏళ్ల నుంచి క్రమం బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు. 2019లో ఇతడికి సంబంధించిన ఓ వీడియో కూడా తెగ వైరలయ్యింది. దానిలో అతడు తన వయసు 30 సంవత్సరాలు అని చెప్తే జనాలు ఈజీగా నమ్మేశారు. మరి జిన్మిన్ ఇంత యవ్వనంగా కనిపించడానికి ఏం చేస్తున్నాడంటే.. (చదవండి: దేహంలో చెత్త లేకుండా చూసుకోవాలి: రకుల్) జిన్మిన్ గత 30 ఏళ్లుగా క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేస్తూ.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు.. మంచి జీవన విధానాలు పాటిస్తాడు. బాడీబిల్డింగ్ కోసం ప్రతి రోజు 6-8 గుడ్లు, దోసకాయలు, చికెన్, టమాటాలు, ఓట్మీల్ తీసుకుంటాడు. ఇతడి ఫిట్నెస్కి ఇటు సామాన్యులతో పాటు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఫిదా అయ్యాయి. తమ ఉత్పత్తులకు అతడిని ప్రచారకర్తగా నియమించుకుంటున్నారు. చదవండి: డాక్టర్లు హెచ్చరించినా సిద్ధార్థ్ శుక్లా పట్టించుకోలేదా? -
షాకింగ్ లుక్‌లో సహజనటి జయసుధ.. ఇంతగా మారిపోయారేంటి?
Actress Jayasudha Shocking Look Photo Goes Viral: పద్నాగేళ్ల వయసులో స్క్రీన్‌పై కనిపించి, ‘సహజనటి’గా గుర్తింపు పొందారు జయసుధ. 45 ఏళ్లకు పైగా సాగుతున్న సినీ ప్రస్థానంలో భిన్న రకాల పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు. అయితే గత కొన్నిరోజులుగా ఆమె వెండితెరకు దూరమయ్యారు. సూపర్ స్టార్ మహేష్‌బాబు ‘మహర్షి’, బాలకృష్ణ ‘రూలర్’ తర్వాత జయసుధ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఈ మధ్య ఆమె ఎక్కువగా విదేశాల్లోనే ఉంటున్నారు. చదవండి: నిక్‌తో ప్రియాంక విడాకులు? తల్లి మధు చోప్రా క్లారిటీ కొంతకాలంగా ఆమె ఆరోగ్యం బాగుండటం లేదని, అనారోగ్యం కారణంగా చికిత్స కోసం విదేశాలకు వెళ్లినట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. అయితే దీనిపై కచ్చితమైన సమాచారం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫొటో చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. నిండు మొహంతో కాస్తా లావుగా ఉండే జయసుధ, ఈ ఫొటోలో పీక్కుపోయి కనిపించారు. అంతేకాదు చాలా డిఫరెంట్‌గా కూడా ఉన్నారు. తన ట్విటర్లో ఫొటో షేర్ చేస్తూ.. ‘స్మైల్.. ఇట్స్ ఫ్రీ థెరపీ’ అంటూ జయసుధ ట్వీట్ చేసింది. దీంతో ఫ్యాన్స్, నెటిజన్స్ ఆమెను చూసి షాకవుతున్నారు. చదవండి: హ్యాపీ మూడ్‌లో చై, ఆకట్టుకుంటున్న లుక్ ఇదేంటి ఇలా మారిపోయారు, ముఖంలో మునుపటి కళ లేదు. సహజనటికి నిజంగా ఆనారోగ్య సమస్యలు తలెత్తినంటున్నాయంటూ అంటూ ఆమె ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు నెటిజన్లు. అయితే ఆమెకు ఏమైంది, విదేశాలకు ఎందుకు వెళ్లారనేది స్వయంగా ఆమె స్పందించే వరకు వేచి చూడాలి. జయసుధగా ప్రేక్షకుల మదిలో గూడుకట్టుకున్న సహజనటి అసలు పేరు సుజాత. ఆమె భర్త నితిన్ కపూర్ 2017లో మరణించిన విషయం విదితమే. ప్రస్తుతం ఆమె తన ఇద్దరు కుమారులతో కలిసి ఉంటున్నారు. పెద్ద కుమారుడు నిహార్ వివాహం గతేడాది వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. Smile 😃 🙂 It's free therapy 😌 pic.twitter.com/1okOqATZKX — Dr Jayasudha Kapoor (@JSKapoor1234) November 22, 2021 -
'మై రాక్'.. వైరలవుతున్న కోహ్లి, అనుష్క ఫోటో
Virat Kohli Shares Adorable Photo With Anushka Sharma.. టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లి న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కోహ్లి తన భార్య అనుష్క శర్మతో సరదాగా గడుపుతున్నాడు. తాజాగా ఆదివారం కావడంతో విరుష్క జోడి ఒక ఫోటోను కూయాప్‌లో పంచుకున్నారు. మార్నింగ్ వైబ్స్ పేరుతో.. ఇద్దరు సేమ్ టీషర్ట్ వేసుకొని ఫోటోకు ఫోజిస్తూ.. ''మై రాక్..'' అంటూ హార్ట్ ఎమోజీని ట్యాగ్ చేస్తూ క్యాప్షన్ జత చేశారు. కాగా షేర్ చేసిన 45 నిమిషాల్లోనే 600 మంది లైక్ చేయడం విశేషం. ఇక అంతకముందు ఏబీ డివిలియర్స్ అన్ని రకాల ఫార్మాట్స్ నుంచి తప్పుకోవడంతో కోహ్లి స్పందించిన విషయం తెలిసిందే. ఐ లవ్ యూ ఏబీ.. నా గుండె ముక్కలయ్యింది'' అంటూ పోస్ట్ షేర్ చేశాడు. కివీస్‌తో టి20 సిరీస్‌కు దూరంగా ఉన్న కోహ్లి.. న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చదవండి: Tim Paine scandal: క్రికెట్‌కు తప్పని రాసలీలల చెదలు.. సెక్స్ స్కాండల్‌లో నలిగిన ఆటగాళ్లు IND vs NZ: హోటల్ రూంకు టీమిండియా ఆటగాళ్లు.. ద్రవిడ్ మాత్రం -
ఇదేం వింత.. పడవ గాల్లో ఎగరడం ఏంటి..!?
Meghalaya Cleanest Umngot River Images: ఇక్కడ ఉన్న ఫోటో చూడగానే ఏమనిపిస్తుంది.. పడవ ఏంటి గాల్లో ఎగురుతుంది.. ఇదేలా సాధ్యం అని ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కసారి బాహుబలి చిత్రం గుర్తుకు వస్తుంది. కాసేపు పరీక్షగా చూస్తే.. ఆశ్చర్యంతో మన కళ్లు పెద్దవి అవుతాయి. అబ్బ నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో కదా.. ఎక్కడబ్బా.. ఇంత పరిశుభ్రమైన.. స్వచ్ఛమైన నది.. ఓ సారి వెళ్లి చూసి వస్తే బాగుండు అనిపిస్తుంది. నది అడుగు భాగంలో ఉన్న ప్రతి అంశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత స్వచ్ఛంగా ఉందంటే.. పడవ ఏదో అద్దం మీద ఉన్నట్లుంది. ఇంత స్వచ్ఛమైన నది ఏ దేశంలో ఉందో కదా అని ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే ఇంత అందమైన, పరిశుభ్రమైన, స్వచ్ఛమైన నది మన దేశంలోనే ఉంది. ఈ ఫోటోని కేంద్ర జలశక్తి వనరుల శాఖ ట్విట్టర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. (చదవండి: లారీ ఎక్కిన పడవ.. ఆశ్చర్యంగా ఉందే!) కేంద్ర జలశక్తి శాఖ మంగళవారం తన ట్విటర్లో ఈ నది ఫోటో షేర్ చేసింది. ‘‘ప్రపంచలోని అత్యంత స్వచ్ఛమైన నదుల్లో ఇది ఒకటి. భారతదేశంలోనే ఉంది. మేఘాలయ రాష్ట్రం, షిల్లాంగ్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది ఉంగోట్ నది. నదిలో పడవ మీద వెళ్తున్న ఫోటో చూస్తే.. అది గాల్లో తేలుతుందేమో అనిపిస్తుంది. ఈ నదిలో నీరు చాలా స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉంటాయి. దేశంలోని నదులన్ని ఇలా ఉండాలని ఆశిస్తున్నాను. హ్యాట్సాఫ్ మేఘలయ ప్రజలు’’ అంటూ ట్వీట్ చేసిన ఈ ఫోటో గంటల వ్యవధిలోనే వైరలయ్యింది. (చదవండి: దుర్గం చెరువు: విదేశాల్లో ఉన్నామా అనే ఫీలింగ్!) ఇది చూసిన నెటిజనులు.. ‘‘భారత దేశంలో ఇంత స్వచ్ఛమైన నది ఉందంటే నమ్మబుద్ది కావడం లేదు.. యమునా నది ఎప్పుడు ఇంత సుందరంగా మారుతుంది... గంగా నది మాట ఏంటి.. ఏది ఏమైనా నదిని పదిలంగా కాపాడుకుంటున్న మేఘలాయ ప్రజలకు ధన్యవాదాలు’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. ఇప్పటి వరకు ఈ ఫోటోకి 19 వేలకు పైగా లైక్‌లు, 3 వేల రీట్వీట్లు వచ్చాయి. One of the cleanest rivers in the world. It is in India. River Umngot, 100 Kms from Shillong, in Meghalaya state. It seems as if the boat is in air; water is so clean and transparent. Wish all our rivers were as clean. Hats off to the people of Meghalaya. pic.twitter.com/pvVsSdrGQE — Ministry of Jal Shakti 🇮🇳 #AmritMahotsav (@MoJSDoWRRDGR) November 16, 2021 చదవండి: సినిమా సెట్టింగో.. స్పెషల్ ఎఫెక్టో అనుకుంటున్నారా..! -
వెలకట్టలేని సెల్యూట్.. కోట్లు పెట్టినా దొరకని సంతోషం
లక్నో: పుత్రడు పుట్టినప్పటి కంటే.. అతడు వృద్ధిలోకి వచ్చి.. పదిమంది చేత ప్రశంసలు పొందిన నాడు తండ్రికి నిజమైన పుత్రోత్సాహం లభిస్తుంది. అయితే కాలంతో పాటు సమాజం తీరు కూడా మారుతోంది. కొడుకైనా, కూతురైనా ఒకటే.. అనుకుంటున్నారు కొందరు తల్లిదండ్రులు. ఆడపిల్లపై వివక్ష చూపకుండా.. ఆమె ఆశయాలకు, ఆలోచనలకు గౌరవం ఇస్తూ.. వారికి నచ్చిన రంగంలో రాణించేందుకు తోడ్పడుతున్నారు. ఇక వారి అభివృద్ధి చూసి మురిసిపోతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఐటీబీపీ ఉన్నతాధికారి కుమార్తె ఒకరు అదే రంగంలో ప్రవేశించింది. ఐటీబీపీ ఉద్యోగంలో చేరింది. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత జరిగే పాసింగ్ ఔట్ పరేడ్కి ముఖ్య అతిథిగా హాజరైన తండ్రికి సెల్యూట్ చేసింది. ఆ క్షణం ఆ తండ్రి పొందిన ఆనందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఎన్ని కోట్లు పెట్టినా అలాంటి అపురూప క్షణాలను తీసుకురాలేం. తండ్రి, కుమార్తెలిద్దరూ ఒకరికొకరు సెల్యూట్ చేసుకుంటున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. తండ్రి, కుమార్తెలకు అభినందనలు తెలుపుతున్నారు నెటిజనులు. ఆ వివరాలు.. (చదవండి: బుడ్డోడి సెల్యూట్‌కు గొప్ప బహుమతి!) ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆపేక్షా నింబాడియా ఇండో టిబిటెన్ పోలీస్ యూనిఫామ్ ధరించి.. తన పైఅధికారి ఐటీబీపీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఏపీఎస్ నింబాడియాకి సెల్యూట్ చేయగా.. ఆయన తిరిగి సెల్యూట్ చేశారు. ఇలా ఒకరినొకరు సెల్యూట్ చేసుకున్నది తండ్రి, కుమార్తె కావడం గమనార్హం. ఇలా వారిద్దరూ పరేడ్‌లో సెల్యూట్ చేసుకునే సమయంలో.. ఫోటో క్లిక్ మనిపించారు. (చదవండి: డ్రాగన్ దుశ్చర్య.. 55 గుర్రాలపై భారతీయ భూభాగంలోకి.. ) ఈ ఫొటోని ఐటీబీపీ విభాగం తన సోషల్ మీడియా షేర్ చేసింది. దీనికి ‘‘కుమార్తె సెల్యూట్ చేయడంతో.. తండ్రి గర్వంతో ఉప్పొంగిపోతున్నాడు’’ అని క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను ఇప్పటివరకు 22వేల మందికిపైగా లైక్ చేశారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు.. ‘‘తనయోత్సాహం.. ఆ తండ్రి పొందే మధురానుభూతిని వర్ణించడానికి మాటలు చాలవు.. అపురూప క్షణాలు’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆపేక్షా నింబాడియా సివిల్ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణత సాధించి.. ఉత్తరప్రదేశ్‌లో డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. వీరి కుటుంబం నుంచి మూడోతరం వారు కూడా పోలీస్ విభాగంలో సేవ చేయడం విశేషం. చదవండి: భయపెట్టమంటే.. భయానికే భయం పుట్టించాడు! View this post on Instagram A post shared by ITBP (@itbp_official) -
మాల్దీవులకు టీడీపీ నేత పట్టాభి..!?
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసి జైలుకెళ్లి.. బెయిల్ మీద విడుదలైన టీడీపీ నేత పట్టాభి మాల్దీవులకు వెళ్లినట్లు సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. వీటికి బలం చేకూరుస్తూ.. పట్టాభి విమానంలో కూర్చుని ఉన్న ఫోటోలు, ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న చిత్రాలు వైరలవుతున్నాయి. చదవండి: చంద్రబాబు డైరెక్షన్లోనే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు: సజ్జల హైదరాబాద్ నుంచి పట్టాభి మాల్దీవ్స్ వెళ్లినట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో పట్టాభి ఎక్కడ అనే చర్చ జోరుగా సాగుతుంది. దేశం వదిలి పారిపోతున్న పట్టాభి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరలవుతున్నాయి. సీఎం జగన్‌ను బూతులు తిట్టిన కేసులో పట్టాభి అరెస్టయిన సంగతి తెలిసిందే. పట్టాభి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు జనాగ్రహ దీక్షలు చేపట్టారు. చదవండి: ప్రజాస్వామ్యంపై యుద్ధ ప్రకటన -
మాల్దీవ్స్‌కు టీడీపీ నేత పట్టాభి..!?
-
ఆలుమగల బంధానికి అర్థం చెప్పారు.. ‘ఇదీ బంధమంటే..!’
కామారెడ్డి: వృద్ధాప్యం శరీరానికే. మనసుకు కాదు. పరస్పరం అవగాహన, స్నేహంగా సాగితే ఆ బంధం పునాదులు చెదరవు. ఈ చిత్రం భార్యాభర్తల అనుబంధానికి నిదర్శనంగా నిలుస్తుంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాలకు చెందిన దంపతులు మాద్యం పోచమ్మ, గంగారాం బతుకమ్మ పండుగ కోసం భిక్కనూరులోని కుమార్తె గడ్డం మణెమ్మ ఇంటికి వచ్చారు. సాయంత్రం వేళ పోచమ్మ కాలిగోర్లు తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే, నేనున్నా కదా! అంటూ భార్యకు గోర్లు తీస్తూ గంగారాం ఇలా కనిపించాడు. క్షణికావేశంతో తీక్షణ నిర్ణయాలు తీసుకునే యువ జంటలు ఆలోచన చేయాలనే సందేశానికి వారు ప్రతిరూపంగా నిలిచారు. – భిక్కనూరు -
వైరల్ అవుతున్న కృతిశెట్టి లేటెస్ట్ ఫొటోలు
ఒకే ఒక్క సినిమాతో ఎక్కడలేని క్రేజీ సంపాదించుకుంది ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి. ఆకర్షించే ఆందంతో పాటు కుర్రకారును ఆకట్టుకుంటోంది. ఇక సాంప్రదాయ లుక్‌తో తెలుగు ప్రేక్షకులకు తక్కువ కాలంలోనే ఎక్కువ దగ్గరైంది. తొలి సినిమానే సూపర్, డూపర్ హిట్ అవ్వడంతో ఈ ‘బేబమ్మ’కు ఆఫర్లు వెల్లువెత్తున్నాయి. దీంతో ఆమె చేతిలో అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తాజాగా ఓ ఫొటోషూట్‌కు ఫొజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రెడ్ కలర్ చూడిదార్లో మెరిసి పోతున్న బేబమ్మ ఫొటోలకు ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతున్నారు. కాగా కృతి శెట్టి ఇప్పటికే ‘నాని శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలతో పాటు లింగుస్వామి, రామ్ పోతినేని కాంబోలో రాబోతున్న చిత్రంలోనూ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే నాగార్జున ‘బంగార్రాజు’లో కూడా చైతన్యకు జోడిగా అలరించబోతుంది. -
Viral: అచ్చం పుల్ల ఐస్ రూపంలో ఇడ్లీలు!
దక్షిణ భారతదేశంలో ఇడ్లీ బ్రేక్‌ఫాస్ట్ చాలా ఫేమస్. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇడ్లీలను సాంబార్‌తో తింటే రుచికరంగా ఉంటుందని నమ్ముతారు. అయితే సాధారంగా ఇడ్లీలు గుండ్రంగా ఉంటాయి. తాజాగా ఐస్ క్రీమ్ స్టిక్ రూపంలో ఉన్న ఇడ్లీలకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో ఓ ఇడ్లీ ఐస్ క్రీమ్ స్టిక్ రూపంలో ఉండి.. సాంబారులో ముంచబడి ఉంది. పక్కనే మరో చిన్న గిన్నేలో చట్నీ కూడా ఉంది. చదవండి: Viral Food Challenge: రండి.. 20 నిమిషాల్లో తినండి 20 వేలు గెలవండి ఈ ఫోటోను మైక్రో అంబీషియస్ అనే ఓ ట్విటర్ ఖాతా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే విధంగా ‘ఒక్క ప్రశ్న, ఎందుకు??’ అని కాప్షన్ జతచేశారు. అయితే ఈ ఫోటోను చూసిన నెటిజన్లు స్పందిస్తూ.. ‘వావ్ అచ్చం ఐస్ క్రీమ్‌లా ఉన్నాయి ఇడ్లీలు’, ‘చిన్న పిల్లలు తినడానికి బాగుంటుంది’ అని కామెంట్లు చేస్తున్నారు. Just one question, why?? pic.twitter.com/lH6lAA7r39 — Micro-ambitious (@pal36) September 30, 2021 -
గ్లాసులో బర్గర్.. ఎలా తినాలి గురూ..
ప్రతి రెస్టారెంట్ మెనూలో కామన్‌గా కనిపించే ఐటమ్.. బర్గర్. చికెన్, మటన్, వెజిటబుల్.. భిన్న రుచుల్లో, నచ్చిన వెరైటీలో దొరుకుతుంది. సాధారణంగా బర్గర్లను ట్రేలలో సర్వ్ చేస్తారు. అదే ట్రేలో సైడ్ డిషెస్గా చిప్స్ కానీ, ఫ్రైస్ కానీ ఉంటాయి. ఇది రొటీన్. కానీ వెరైటీగా ట్రై చేద్దామనుకున్నారో ఏమో రెడిట్ రెస్టారెంట్ వాళ్లు బర్గర్‌ను చక్కగా ఒక గ్లాస్లో సర్దేశారండీ!! దీనికి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోలో మొత్తం బర్గర్ అంతా ఒక గ్లాస్లో స్టఫ్ చేసి ఉండటం మనం చూడొచ్చు. బర్గర్ తయారీకి ఉపయోగించే పదార్థాలు అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ దానిని పేర్చిన విధానం మాత్రం వింతగా ఉంది. గ్లాస్ అడుగుభాగంలో బ్రెడ్ ముక్కలు పేర్చి, ఆపైన చీజ్ సాస్‌లతో వెజిబటుల్స్ను అమర్చారు. ఇదే పద్ధతిని గ్లాస్ పై భాగం వరకు అనుసరించారు. అన్నింటికంటే పైన నువ్వులతో ఉన్న బ్రెడ్‌ను పెట్టారు. (చదవండి: రికార్డుల్లోకి బర్గర్.. ధర ఏకంగా రూ. 4.5 లక్షలు, ఎందుకంత ఖరీదు?) ఇక్కడ బర్గర్‌ని వెరైటీగా సర్వ్ చేస్తుండటంతో కస్టమర్లు సదరు రెస్టారెంట్‌కు క్యూ కట్టారు. ఇలా గ్లాస్లో బర్గర్‌ని సర్వ్ చేస్తే ఎలా తినాలని కొందరు కస్టమర్లు ప్రశ్నించగా.. మరికొందరు మామూలు పద్ధతిలో ఎందుకు సర్వ్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా బాగానే ఉందని ఇంకొందరు కామెంట్ చేశారు. తినడం సంగతి ఎలా ఉన్నా ఫోటోతో ఈ బర్గర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చదవండి: వైరల్: వాటిని తినకుండా 17 ఏళ్లు దాచింది! -
సీక్రెట్‌గా హీరో కార్తికేయ ఎంగేజ్మెంట్.. ఫోటో వైరల్
Karthikeya Got Engaged: ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఆయన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన కొందరు సెలబ్రిటీలు సైతం ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తుంది. కార్తికేయ ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే కార్తికేయ పెళ్లాడనున్న అమ్మాయి వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె కార్తికేయ కుటుంబానికి దగ్గరి బంధువు అని సమాచారం. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని తెలుస్తుంది. పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు కాలేదు. కాగా కార్తికేయ సినిమాల సంగతి చూస్తే… ఇటీవల ‘చావు కబురు చల్లగా’ సినిమాతో ప్రేక్షకులు ముందుకొచ్చి మెప్పించాడు. ప్రస్తుతం అజిత్ ‘వాలిమై’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇవి కాకుండా ‘రాజా విక్రమార్క’ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. చదవండి : వైరల్ : చిరంజీవి ఇంట్లో గ్రాండ్‌గా రాఖీ సెలబ్రేషన్స్ Rakul: ఓబులమ్మగా రకుల్ ప్రీత్‌సింగ్..ఫస్ట్‌లుక్ రిలీజ్ -
బోల్డ్ ఫోటో షేర్ చేసిన షమీ భార్య.. దారుణమైన ట్రోలింగ్
న్యూఢిల్లీ: టీమిండియా పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. ఇక తాజాగా హసీన్ జహాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బోల్డ్ ఫోటో షేర్ చేశారు. ఇది చూసిన వారు కొందరు అందంగా ఉన్నావని పొగడగా.. చాలామంది మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో హసీన్ జహాన్‌కు లక్షమందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలో హసీన్ బుధవారం ఇన్‌స్టాలో ఓ బోల్డ్ ఫోటో షేర్ చేశారు. దీనిలో హసీన్ తెలుపు రంగు రగ్గడ్ జీన్స్, బ్లాక్ టాప్ ధరించి ఉన్నారు. ఈ క్లోజప్ ఫోటోలో హసీన్ కాస్త బోల్డ్‌గా దర్శనిమిచ్చారు. ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. ఇక ఈ ఫోటో చూసిన కొందరు హసీన్ చాలా అందంగా ఉన్నారు అని ప్రశంసించగా.. చాలా మంది మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పెళ్లై ఓ బిడ్డకు తల్లివి అయ్యావ్.. అయినా కూడా ఇంత ఎక్స్పోజింగ్ అవసరమా అంటూ మండిపడుతున్నారు. View this post on Instagram A post shared by hasin jahan (@hasinjahanofficial) ఇక షమీ-హసీన్ చాలా కాలం నుంచి విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల విడివిడిగా జీవిస్తున్నప్పటికి.. ఇంకా వీరు విడాకులు తీసుకోలేదు. కొన్నేళ్ల క్రితం హసీన్ షమీపై సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తకు వేరే మహిళతో సంబంధ ఉందని ఆరోపించారు. కానీ వాటిని నిరూపించలేకపోయారు. కోల్‌కతాకు చెందిన హసీన్ జహాన్, షమీ 2014, ఏప్రిల్ 7 న వివాహం చేసుకున్నారు. -
అమ్మో ‘గౌను’.. వైరల్ అవుతున్న హీరోయిన్ ఫొటో.. రీజన్ ఇదే!
ఓ హీరోయిన్ గౌను ధరించి ఫోటో దిగితే అది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఆమె ఓ స్టార్ హీరోయిన్ అయితే... ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ ఆమె ప్రస్తుతం ఓచిన్న హీరోయిన్. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుంది. మరి ఆ చిన్న హీరోయిన్‌కి అప్పుడే అంత క్రేజా అనేగా మీ డౌటనుమానం? ఆమెకు ప్రస్తుతం అంత క్రేజ్ లేదు కానీ.. ఆమె ధరించిన గౌను వల్ల ఆ ఫోటో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన దృశ్యం సినిమా గుర్తుందా? అందులో వెంకటేశ్ చిన్న కూతురిగా నటించిన చైల్డ్ ఆరిస్ట్ పేరు ఎస్తర్ అనిల్. ఇప్పుడు ఆ చిన్నారి పెద్దదై హీరోయిన్గా మారేందుకు ప్రయత్నిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ స్పెషల్ గౌనుతో ఫొటో షూట్ నిర్వహించింది. ఆ గౌను స్పెషల్ ఏంటంటే.. దాని బరువు.. ఆమె బరువు కంటే ఎక్కువ. ఎస్తర్ బరువు 44 కేజీలు. కానీ, ఆమె ధరించిన గౌను బరువు 58 కేజీలు. తన ఫోటోషూట్ పై ఎస్తర్ స్పందిస్తూ.. గౌను చూడగానే నచ్చిందని.. ఆ తర్వాత దానిని వేసుకున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. ఆ గౌను తయారీకి దాదాపు 30 రోజులు కష్టపడ్డారని తెలిపింది View this post on Instagram A post shared by Esther Anil (@_estheranil) -
అరెరె అచ్చం బండ్లన్నలాగే ఉన్నాడే.. జూనియర్ బండ్ల ఫోటో వైరల్
బండ్ల గణేశ్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అటు కమెడియన్‌గా, ఇటు నిర్మాతగా టాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సినిమాలతో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో అంతకంటే ఎక్కువ గుర్తింపు తన మాటలు, చేష్టలతో తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో బండ్ల ఒక సెన్సేషన్. ఆయన పెట్టే పోస్టులు ప్రతిసారి నెట్టింట వైరల్ అవుతుంటాయి. అందుకు కారణం యూత్‌లో బండ్లన్న ఉన్న క్రేజీయే. తాజాగా బండ్ల గణేశ్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటో మరెవరిదో కాదు.. మన బండ్లన్న పెద్ద కుమారుడు హితేష్ నాగన్ బండ్లది. అచ్చ అచ్చుగుద్దినట్లు బండ్ల గణేశ్‌లా ఉన్న ఈ ఫోటోని ఆయన షేర్ చేస్తూ.. ‘ఇతను నా పెద్ద కొడుకు హితేష్ నాగన్ బండ్ల’.. అంటూ నెటిజన్స్‌కి పరిచయం చేశాడు. దీంతో ఈ ఫొటో వైరల్ అవుతోంది. బండ్ల గణేశ్ కుర్రాడిగా ఉన్నప్పుడు దిగిన ఫొటోలాగే ఇది ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు.‘అచ్చు మీ జిరాక్స్‌లా ఉన్నాడు. డిట్టో దిగిపోయాడు. హీరోని చేస్తారా..?’ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ‘హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తారా’ అనే ప్రశ్నకి ‘అంతా దేవుడి దయ’ అంటూ రిప్లై ఇచ్చారు బండ్ల గణేశ్. My elder son Hitesh Nagan bandla 🙌🏻 pic.twitter.com/RV3CvznC4F — BANDLA GANESH. (@ganeshbandla) August 2, 2021 -
భార్య అనుష్కతో కోహ్లి లంచ్.. ఫోటో వైరల్
నాటింగ్హమ్: టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 4 నుంచి నాటింగ్హమ్ వేదికగా జరగనున్న తొలి టెస్టు ఆడేందుకు టీమిండియా ఇప్పటికే చేరుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లి తన భార్య అనుష్క శర్మతో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. తాను ఉంటున్న హోటల్ రూంలో అనుష్కతో కలిసి లంచ్ చేశాడు. దానికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. ఇక కోహ్లికి నాటింగ్హమ్లోని ట్రెంట్‌బ్రిడ్జి మైదానంలో మంచి రికార్డు ఉంది. ఆడిన రెండు టెస్టు మ్యాచ్‌లు కలిపి కోహ్లి 209 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉండడం విశేషం. ఆగస్టు 4న మొదలుకానున్న తొలి టెస్టులో కోహ్లి ఇదే ప్రదర్శనను పునరావృతం చేయాలని జట్టు మేనేజ్మెంట్ ఆశిస్తుంది. కాగా కౌంటీ ఎలెవెన్‌తో మూడు రోజలు ప్రాక్టీస్ మ్యాచ్.. డర్హమ్‌లో ప్రాక్టీస్ సెషన్ అనంతరం టీమిండియా కొత్త ఉత్సాహంతో కనిపిస్తుంది. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
60 ఏళ్ల వయసులో నటుడి బాక్సింగ్ ప్రాక్టీస్
కథ నచ్చితే తన పాత్ర కోసం ఎంతైనా శ్రమిస్తారు మోహన్‌లాల్. తాజాగా ఆయనకు బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ స్క్రిప్ట్ ఒకటి నచ్చిందట. అంతే.. చేతికి గ్లౌజ్‌లు తొడిగి బాక్సింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఈ ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇందులో మోహన్‌లాల్ బాక్సింగ్ ఛాంపియన్‌గా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆరుపదుల వయసులో ఉన్నారు మోహన్‌లాల్. ఈ వయసులో ఓ స్పోర్ట్స్ ఫిల్మ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అది కూడా బాక్సింగ్ క్యారెక్టర్ చేయడానికి రెడీ కావడం అంటే గొప్ప విషయమే. -
వెంటిలేటర్‌పై బిగ్‌బాస్ బ్యూటీ అరియానా.. ఫోటో వైరల్
Ariyana on Ventilator : బిగ్‌బాస్ షో అనంతరం అరియానా గ్లోరీ క్రేజ్ అమాంతం పెరిగిపోయిందన్న సంగతి తెలిసిందే. హౌజ్ నుంచి బయటకు వచ్చాక కూడా అరియానా పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు. రీసెంట్గా ఆర్టీజీవో చేసిన ఇంటర్వ్యూతో అరియానా పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్‌పై ఫోకస్ చేసిన అరియానా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఫోటో అభిమానులను షాక్‌కి గురిచేసింది. వెంటిలేటర్‌పై అరియానాను చూసి ఆమె ఫ్యాన్స్‌కి గుండె ఆగినంత పని అయ్యింది. అయితే ఇది రియల్ లైఫ్‌లో జరిగింది కాదు. సినిమా షూటింగ్లో భాగంగా అరియానా అలా వెంటిలేటర్‌పై కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా అరియానా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. మెగాస్టార్ అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా చేస్తున్న సినిమాలో అరియానా ఓ రోల్లో కనిపించనున్నట్లు తెలిసిందే. షూట్లో భాగంగా వెంటిలేటర్‌పై కనిపించి అరియానా షాకిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. -
వైరల్: కరీనా కపూర్ రెండో కుమారుడి ఫోటో లీక్!
బాలీవుడ్ స్టార్స్ కరీనా కపూర్-సైఫ్ అలీఖాన్ జంట ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తొలి సంతానం తైమూర్ కాగా, రెండో బిడ్డకు ‘జెహ్’ అని నామకరణం చేశారు. అయితే ఇప్పటివరకు జెహ్‌కు సంబంధించి ఫోటోను చూపించలేదు. తైమూర్ అడపాదపడా మీడియా కంటికి చిక్కినా.. రెండో కుమారుడు ‘జెహ్’ను మీడియా కంటికి చిక్కకుండా కరీనా జంట జాగ్రత్త పడుతూ వచ్చారు. తాజాగా జెహ్ ఫోటో ఒకటి బయటికొచ్చింది. ఇటీవలీ కరీనా తన ప్రగ్నెన్సీ అనుభవాన్ని పుస్తకం రూపంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ బుక్కు ఆమె ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రగ్నెన్సీ బైబిల్’ అనే టైటిల్‌తో విడుదల చేసింది. ఈ పుస్తకంలోని ఒక పేజీలో కరీనా చిన్నారిని ముద్దుచేస్తున్నట్లు ఒక ఫోటో ఉంది. అయితే ఇందులో కనిపిస్తుంది కరీనా రెండో కుమారుడు 'జెహ్' అని ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీనిపై పటౌడీ ఫ్యామిలీ మాత్రం ఇంకా స్పందించలేదు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఇది జెహ్ ఫోటోనే అని ఫిక్సయిపోయి ఈ ఫోటోను తెగ షేర్ చేసేస్తున్నారు. ఇదిలా ఉండగా నటుడు సైఫ్ అలీఖాన్ గతంలో అమృత సింగ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరి సంతానమే సారా అలీఖాన్, ఇబ్రహీమ్ అలీఖాన్. అయితే ఆమెతో విడిపోయిన తర్వాత సైఫ్ 2012లో కరీనాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి 2016 డిసెంబర్లో తైమూర్ జన్మించగా, సుమారు ఐదేళ్ల గ్యాప్ తర్వాత జెహ్ పుట్టాడు. View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) -
బండ్ల గణేష్‌కు వార్నింగ్ ఇచ్చిన పవన్ ఫ్యాన్స్
కమెడియన్‌గా తెలుగు తెరకు పరిచయం అయిన బండ్ల గణేష్.. ఆ తర్వాత నిర్మాతగా మారాడు. బ్లాక్ బస్టర్ సినిమాలు సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు సంపాదించుకున్నాడు. అయితే టెంపర్ మూవీ అనంతరం తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన బండ్ల గణేష్ మళ్లీ నిర్మాతగా ట్రాక్‌లోకి వచ్చాడు. పవన్ కల్యాణ్‌తో ఓ సినిమాను నిర్మిస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశాడు. ఇక పవన్ కల్యాణ్‌కు బండ్ల గణేశ్ ఎంతటి వీరాభిమానో ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. ఏ కార్యక్రమంలో అయినా ఆయన మాట్లాడేటప్పుడు తప్పనిసరి పవన్ ప్రస్తావన తీసుకొచ్చి ఆయన తన దేవుడంటూ కొనియాడుతుంటాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే ఫ్యాన్స్‌లోనూ అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. ఇది వరకే పవన్ నటించిన గబ్బర్‌సింగ్, తీన్మార్ సినిమాలకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబో మరోసారి వస్తున్న నేపథ్యంలో.. బండ్ల గణేష్‌కు పవన్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌కు హిట్ ఇవ్వకపోతే బండ్ల గణేష్‌పై పవన్ కత్తి పెట్టినట్లు కాటమరాయుడులోని ఓ ఫోటోను ఎడిట్ చేశారు. హిట్ ఇవ్వకపోతే రిజల్ట్ ఇలానే ఉంటుందంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనికి బండ్ల గణేశ్.. ఓకే అంటూ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం పవన్‌కల్యాణ్ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, హరిహర వీరమల్లు సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. Ok 👍 https://t.co/2Nxo91d5AP — BANDLA GANESH. (@ganeshbandla) July 11, 2021 -
అల్లు స్నేహ విన్యాసాలు మాములుగా లేవుగా..ఫోటొ వైరల్
అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఆమె ఎంత యాక్టీవ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. బన్నీతో పాటు తన పిల్లలు అయాన్, అర్హలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. అలాగే అల్లు అర్జున్ న్ కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా స్నేహ రెడ్డి తనలోని కొత్త టాలెంట్‌ను అందరికీ పరిచయం చేశారు. స్నేహా రెడ్డి కొన్నాళ్లుగా యోగాలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే తలకిందకు పెట్టి గాల్లో వేలాడుతూ చేసే యోగాసనంపై కొన్నాళ్లుగా కసరత్తులు చేస్తున్నారు. ఎట్టకేలకు స్నేహా ఆ ఫీట్ సాధించారు. తన సోషల్ మీడియాలో ఈ ఫీట్‌కు సంబంధించిన ఫొటో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది వైరల్ అయింది. స్నేహ విన్యాసనాలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
మేకప్ లేకుండా నాగార్జున ఇలా? ఫోటో వైరల్
ఆరు పదుల వయసులోనూ నవ మన్మథుడిగానే కనిపిస్తూ ఉంటాడు అక్కినేని నాగార్జున. గ్లామర్ విషయంలో ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా నిలిస్తుంటాడు. ఆయన ఎంచుకునే సినిమాలు కూడా అలాగే ఉంటాయి. కుర్ర హీరోలు కూడా అంత ఎనర్జిటిగ్గా నటించరేమో అన్నట్లుగా నాగ్ యాక్టింగ్ ఉంటుంది. ఆయన ఎనర్జీ, అందం రహస్యం ఏంటో ఇప్పటికీ మిస్టరీగానే మిలిగిపోయింది. అయితే ఇదంతా గతం. ఇప్పుడు నాగార్జున పూర్తిగా మారిపోయాడు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోనే ఇందుకు నిదర్శనం. అందులో నాగ్ పూర్తిగా నెరిసిన జుట్టు, మీసకట్టుతో కనిపించడం అందరిని షాక్‌కు గురిచేస్తుంది. మేకప్ లేకుండా కింగ్ ఇలా ఉంటారా ? అనే సందేహం వ్యక్తమవుతుంది. ప్రస్తుతం నాగ్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండా.. రా ఏజెంట్ పాత్రలో నాగ్ కనిపించబోతున్నాడు. అలాగే బంగార్రాజు అనే చిత్రంలోనూ నటించబోతున్నాడు. -
ఒకే బెడ్‌పై ముగ్గురు మెగా హీరోలు..వరుణ్ దొంగ చూపులు.. ఫోటో వైరల్
ఇంట్లో ముగ్గురు, నలుగురు పిల్లలు ఉంటే ఆ సందడే వేరు. ముఖ్యంగా నిద్రపోయే సమయంలో బెడ్‌పై ఒకే చోటు కోసం పిల్లలు కొట్టుకోవడం సర్వసాధారణం. ఎంత తిట్టుకున్న, కొట్టుకున్న సరే రాత్రి అయితే చాలు అంతా ఒకే చోట నిద్రపోతారు. అలా తాము కూడా వరుణ్, వైష్ణవ్లతో కలిసి ఒకే బెడ్‌పై నిద్రపోయేవాడినని చెబుతున్నాడు మెగా మేనల్లుడు సాయి తేజ్. ఇప్పటికి కూడా ఆ అలవాటు పోలేదంటూ బెడ్‌పై వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లతో కలిసి నిద్రపోతున్న ఫోటోని తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశాడు . అందులో వైష్ణవ్ అర్దనగ్నంగా పడుకొని ఉండగా, వరుణ్ దొంగచూపులు చూస్తున్నాడు. ‘కొన్ని ఎప్పటికి మారువు’అంటూ సాయితేజ్ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. కాగా, మెగా హీరోలు రామ్ చరణ్, వరుణ్, బన్నీ, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ అంతా ఒకే ఏజ్ గ్రూపు వాళ్లు. చిన్నప్పటి నుంచి కలిసిపెరిగారు. అందుకే వీళ్లు కజిన్స్‌లా కాకుండా ఫ్రెండ్స్‌గా ఉంటారు. ఈ గ్యాంగ్‌లో నిహారిక కూడా ఉంటుంది. ఆమెను మరదల్లా కాకుండా చెల్లిగానే చూసేవాళ్లమని గతంలో కొన్ని ఇంటర్యూల్లో సాయితేజ్, అల్లు అర్జున్ చెప్పారు. View this post on Instagram A post shared by Sai Dharam Tej (@jetpanja) -
స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో వైరల్, ఎవరో గుర్తు పట్టారా?
సోఫాపై నవ్వుతూ ఫోటోకి ఫోజులు ఇస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? కష్టం అంటారా? సరే మీకోసం ఈ ఫోటోకి సంబంధించి క్లూ ఇస్తే గుర్తు పట్టగలరేమో చెక్ చేసుకోండి. ఆమె ఓ స్టార్ హీరోయిన్. ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’చేసింది. సౌందర్య తరువాత గ్లామర్ తో కాకుండా తన నటన, డ్యాన్స్‌తో ఆకట్టుకుంటూ నేచురల్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది. ఈ క్లూతో అయినా ఆమెను గుర్తించారా? ఓకే.. మీరనుకుంటున్నట్లు ఈ ఫోటో నేచురల్ బ్యూటీ సాయి పల్లవిదే. ఈ హైబ్రీడ్ పిల్ల చిన్నప్పుడు మస్తు అల్లరి చేసేదట .కాలేజీ రోజుల్లో అయితే తోటి స్నేహితులను ఆటపట్టిస్తూ.. రచ్చ రచ్చ చేసేదట. సాయి పల్లవి ఉంటే చాలు ఎంటర్టైన్మెంట్కి కొదవే ఉండేదికాదట. ప్రస్తుతం ఆమె చిన్నప్పటి ఫోటోతో పాటు కాలేజీ పిక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాయి పల్లవి కాలేజీ ఫోటో ఇక సాయిపల్లవి సినిమా విషయాలకొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సరసన లవ్ స్టోరీ సినిమా లో నటిస్తోంది. అలాగే రానా ‘విరాటపర్వం , నాని ‘శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా నటిస్తోంది. ఈ మూడు చిత్రాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. -
పీఏతో మంత్రి రాసలీలలు.. ఫొటోలు లీక్
కరోనా టైం.. అందులో కఠిన ఆంక్షలు అమలులో ఉన్నవేళ. సోయి మరిచి తన అనుచరురాలితో ఆఫీసులోనే రాసలీలలు సాగించాడు ఓ మంత్రి. ఆ మంత్రి రొమాంటిక్ యాంగిల్ఫొటోలు మీడియా ద్వారా జనాల్లోకి లీక్ అయ్యాయి. ఇంకేం ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. రాజకీయ విమర్శలు చుట్టు ముట్టాయి. చివరికి యూకే ఆరోగ్యశాఖా మంత్రి మ్యాట్ హాంకాక్ రాజీనామా చేయాల్సి వచ్చింది. లండన్: ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శి మ్యాట్ హాంకాక్ యవ్వారం.. వారం నుంచి యూకే రాజకీయాలను కుదేలు చేస్తోంది. వివాహితుడైన హాంకాక్.. ఓ మహిళను ఏరికోరి తన అసిస్టెంట్‌గా నియమించుకున్నాడు. ఆమెతో తన కార్యాలయంలోనే రాసలీలు కొనసాగించాడు. ఆమెను ముద్దులు పెట్టుకున్నట్లుగా ఓ ఫొటోతో ‘పీఏతో హాంకాక్ రాసలీలలు’ పేరుతో ది సన్ టాబ్లాయిడ్ ప్రముఖంగా ప్రచురించింది. పైగా కరోనా నిబంధనలు అమలులో ఉన్న టైంలో ఆ పని చేశాడంటూ కథనం ప్రచురించింది. ఇంకేం విమర్శలు మొదలయ్యాయి. ఈ బంధం ఏనాటిదో.. కాగా, ఆ ఫొటోలు మే 6 నుంచి 11 మధ్య కాలంలో, అది కూడా మ్యాట్ కార్యాలయంలోనే తీసినవని సమాచారం. అయితే ఆ ఫొటోల్ని ఎలా సంపాదించింది మాత్రం సన్ వెల్లడించలేదు. అప్పటికీ ఇంకా లాక్డౌన్ కఠిన నిబంధనల్ని, ఆంక్షల్ని ఎత్తివేయలేదని మాత్రం పేర్కొంది. ఇంట్లో వ్యక్తులతో తప్ప బయటివారిని కౌగిలించుకోవడం, వారితో శారీరక సంబంధం పెట్టుకోవడానికి అనుమతించని రోజుల్లో ఈ ఘటన జరిగిందని తెలిపింది. అంతేకాకుండా ఆ ఫొటోలో ఉన్న మహిళను హాంకాక్.. 2000 సంవత్సరంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కలిశాడని, పోయిన నెలలోనే ఆమెను ఇన్‌కంటాక్స్ విభాగంలో తన సహాయకురాలిగా నియమించుకున్నాడని తేలింది. ఎట్టకేలకు రాజీనామా కరోనా టైంలో మాస్క్‌లు లేకుండా తిరగొద్దని హాంకాక్ విస్తృతంగా ప్రచారం చేశాడు. పైగా భావోద్వేగంగా ఉపన్యాసాలు దంచాడు. అలాంటి వ్యక్తే.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై విమర్శలు వెలువెత్తాయి. ఈ మేరకు శనివారం ప్రధాని బోరిస్ జాన్సన్‌కు, మాట్ హాంకాక్‌కు ఓ క్షమాపణ లేఖ రాశాడు. నేనే మార్గదర్శకాల్ని ఉల్లంఘించా.. అందుకే రాజీనామా చేస్తున్నా అని తెలిపాడు. ఇక విమర్శల నేపథ్యంలో హాన్కాక్ రాజీనామాను ఆమోదించిన బోరిస్.. అప్పటిదాకా ఆయన అందించిన సేవలను కొనియాడాడు. చదవండి: పార్లమెంట్లో పొంగుతున్న బీర్లు -
అక్షయ్ బ్యాటింగ్,షారుఖ్ వికెట్ కీపింగ్.. ఫోటో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, అక్షయ్‌కుమార్‌లు క్రికెట్ ఆడుతున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీళ్లిద్దరు కలిసి క్రికెట్ ఎప్పుడు ఆడారబ్బా? అని నెటిజన్లలో సందేహాలు మొదలయ్యాయి. ఇది పాతికేళ్ల క్రితం నాటి ఫోటో. షారుఖ్ హీరోగా ‘దిల్ తో పాగల్ హై’ సీనిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అక్షయ్ కీలకపాత్రలో నటించారు. ఈ సందర్భంలో ఓ రోజు షూటింగ్ సమయంలో విరామం లభించడంతో అక్షయ్, షారుఖ్ క్రికెటర్లుగా అవతారం ఎత్తారు. అక్షయ్ బ్యాటింగ్ చేయగా షారుఖ్ కీపింగ్ చేస్తూ ఆ ఫొటోలో కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక 1997లో వచ్చిన ‘దిల్ తో పాగల్ హై’ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. ట్రైయాంగిల్ లవ్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో మాధురి దీక్షిత్, కరిష్మాకపూర్ హీరోయిన్లుగా నటించారు. ఇక సినిమాల విషయానికి వస్తే 2018లో ‘జీరో’తో అలరించిన షారుఖ్ చాలా కాలం గ్యాప్ అనంతరం ‘పఠాన్’ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్‌కు జోడీగా దీపికి పదుకొణె నటించనుంది. మరోవైపు అక్షయ్‌కుమార్ బెల్‌బాటమ్, పృథ్వీరాజ్ చౌహాన్, బచ్చన్‌పాండే సహా ఆత్రంగి రే సినిమాల్లో నటిస్తున్నారు. చదవండి : 'నా గర్ల్‌ఫ్రెండ్ ఐఫోన్ అడుగుతుంది.. సోనూభాయ్ హెల్ప్ చేస్తారా'? అప్పట్లో షారుక్ ఇచ్చింది ఇంకా నా పర్సులోనే ఉంది: ప్రియమణి -
జిమ్‌లో తెగ కష్టపడుతున్న నాగశౌర్య.. ఫోటో వైరల్
ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ర్టీలో సత్తా చాటుతున్న యంగ్ హీరోల్లో నాగశౌర్య ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సంపాదిచుకున్నాడు. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించడంతో అతడు వెనుదిరిగి చూసుకోలేదు. వైవిధ్యభరితమైన కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇటీవలే హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ అనౌన్స్ చేసిన మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2020లో నాగశౌర్య 5వ స్థానాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ యంగ్ హీరో జిమ్ వర్కవుట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో నాగ శౌర్య మాచో రిప్డ్ లుక్‌లో కండలు కండలు తిరిగిన దేహదారుఢ్యంతో కనిపిస్తున్నాడు. ఇక గతంలోనూ లక్ష్య సినిమా కోసం 8 ప్యాక్ బాడీతో పాటు పోనీ టెయిల్‌తో ఉన్న శౌర్య లుక్ ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. పాత్రకు తగ్గట్లు శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు జిమ్‌లో తెగ కసరత్తులే చేస్తున్నాడు నాగశౌర్య. ప్రస్తుతం ఈ యంగ్ హీరో వరుడు కావలెను, లక్ష్య, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రాల్లో నటిస్తున్నాడు. చదవండి : రెమ్యునరేషన్ బీభత్సంగా పెంచిన యంగ్ హీరో నితిన్ డేరింగ్ స్టెప్: షూటింగ్ మొదలు -
షాకిస్తున్న దర్శకుడు అనురాగ్ కొత్తలుక్, ఏమైందంటే..
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ షాకింగ్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఛాతీ నొప్పితో హాస్పిటల్లో చేరిన ఆయన చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇస్తూ కశ్యప్ కూతరు అలియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలతో పాటు వీడియో షేర్ చేసింది. ఆయన పూర్తిగా కోలుకున్నారని, ఎప్పటి లాగే తమతో సరదాగా ఉంటున్నారంటూ ఆయన కూతురు తెలిపింది. అయితే ఈ ఫోటోల్లో అనురాగ్ గుండు చేయించుకుని, ఒత్తైన కను బొమ్మలు, గడ్డంతో దర్శనమిచ్చారు. ఆయనను అలా చూసి అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘ఏమైంది.. సార్ బాగానే ఉన్నారు కదా’ అంటు కామెంట్స్ చేస్తున్నారు. కాగా కొద్ది రోజుల కిందట అనురాగ్ కశ్యప్‌కు ఛాతిలో స్వల్పంగా నొప్పిరావడంతో ఆయనను ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వైద్యలు ఆయనకు ఆంజియోప్లాస్టి సర్జరీ చేయాలని సూచించినట్లు కశ్యప్ టీం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇంటికి వచ్చిన ఆయన ప్రస్తుతం మెడికేషన్లు ఉన్నారని.. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో పూర్తిగా కోలుకున్న ఆయన తాజా ఫొటోలు, వీడియోను అలియా షేర్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. కాగా తాప్సీ పన్ను లీడ్ రోల్లో ఆయన దర్శకత్వంలో వస్తున్న మూవీ ‘దోబారా’. మార్చిలో షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. -
16 గంటల పాటు స్నానం:. బాత్రూంలో నిద్రపోయావా ఏంటి?
మాములుగా స్నానం చేయడానికి ఎంత టైం తీసుకుంటారు. మహా అయితే 5, 10నిమిషాలు.. కాస్త అతిశుభ్రత పాటించేవారైతే ఓ అరగంట. అంతకు మించి ఎక్కువసేపు ఎవరు బాత్రూంలో ఉండరు. అలా కాకుండా ఏకంగా 16 గంటల పాటు స్నానం చేసిన వారి గురించి ఎప్పుడైనా విన్నారా.. అన్నేసి గంటలు నీటిలో నానితే ఏమవుతుందో తెలుసా.. లేదా. అయితే ఈ వార్త చదవండి.. టిక్‌టాక్ యూజర్ అయిన ఓ మహిళ ఏకంగా 16 గంటల పాటు స్నానం చేసిందట. ఫలితంగా ఆమె కాళ్లు, చేతుల మీద చర్మం ముడుచుకుపోయింది. రక్తం పీల్చేసినట్లుగా పాలిపోయాయి. దాంతో బయపడిన సదరు మహిళ.. ‘‘యాక్సిడెంటల్‌గా 16 గంటల పాటు స్నానం చేశాను. ఫలితంగా నా కాళ్లు, చేతులు ఇలా మారిపోయాయి. వీటిని పూర్వ స్థితిలోకి తీసుకు రావాలంటే ఏం చేయాలి.. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి’’ అంటూ ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు, పోస్ట్ చూసిన వారిలో ఎక్కువ మంది అడిగిన ప్రశ్న ఒక్కటే. 16 గంటల పాటు స్నానం చేశావా.. ఎలా సాధ్యమయ్యింది.. అసలు అన్ని గంటలు బాత్రూంలో ఎలా గడిపావ్.. కొంపతీసి.. స్నానం చేయడం మర్చిపోయి నిద్రపోయావా ఏంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనికి సదరు మహిళ నుంచి ఎలాంటి సమాధానం లేదు. మరికొందరు మాత్రం తమకు తెలిసిన చిట్కాలు చెప్తుండగా.. కొందరు త్వరగా హాస్పిటల్‌కు వెళ్లు అని సూచిస్తున్నారు. చదవండి: బాత్‌టబ్‌లో ఐఫోన్ చార్జింగ్.. షాకింగ్ -
71వ ఏట రెండో పెళ్లి.. కూతురు కామెంట్స్ వైరల్
ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో.. తోడుగా మరో మనిషి ఉంటే బాగుండు అనిపిస్తుంది. ముఖ్యంగా జీవిత చరమాంకంలో మనిషికి తోడు ఎంతో అవసరం. బాధ్యతలు తీరి.. సంతానం వారి జీవితాల్లో బిజీగా ఉన్న వేళ భార్యభర్తలిద్దరు ఒకరికి ఒకరు తోడునీడగా నిలుస్తారు. మలి సంధ్యవేళ దంపతుల్లో ఎవరు ముందుగా ఈ లోకం వీడినా మిగతా వారి జీవితం శూన్యం అయిపోతుంది. ఆ వెలితిని ఎవరూ పూడ్చలేరు.. ఒక్క జీవిత భాగస్వామి తప్ప. ఒకప్పుడు అంటే మధ్యవయసులో పునర్వివాహం గురించి ఆలోచించాలంటే సమాజానికి జడిసి ఊరుకునేవారు. కానీ నేడు పరిస్థితులు మారాయి. వయసుతో సంబంధం లేకుండా రెండో వివాహానికి సిద్ధపడుతున్నారు. సమాజం సంగతి ఎలా ఉన్న కుటుంబ సభ్యులు మాత్రం వీరికి మద్దతిస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. భార్య చనిపోయిన 71 ఏళ్ల వృద్ధుడు.. ఓ వితంతు మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోని సదరు వృద్దుడి కుమార్తె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరలవుతోంది. నెటిజనులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సదరు వృద్ధుడి భార్య ఐదు సంవత్సరాల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి అతడు ఒంటరిగానే జీవిస్తున్నాడు. ఈ క్రమంలో వృద్ధుడి కుమార్తె అదితి తన తండ్రిని మళ్లీ పెళ్లి చేసుకోమని చాలా సార్లు కోరింది. మొదట్లో దాటవేస్తూ వచ్చిన సదరు వృద్ధుడు చివరకు ఐదు సంవత్సరాల తర్వాత రెండో వివాహానికి అంగీకరించాడు. మరో వితంతు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఈ నెల 27న వీరి వివాహం జరిగింది. ఈ సందర్భంగా అదితి తన తండ్రి రెండో వివాహానికి సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ.. ‘‘ఇది చాలా క్లిష్టమైన అంశం. పునర్విహానికి సంబంధించి మన దేశంలో నిర్దుష్ట చట్టాలు ఏం లేవు. కొందరు మహిళలు మా నాన్న వెంట పడి డబ్బు కోసం దెయ్యాలాగా పీడించడం చూశాను. చివరకు ఆయన పునర్వివాహం చేసుకున్నారు. సమాజం వారిని ఆశీర్వదించి.. అక్కున చేర్చుకుంటుందా.. లేదా అనేది తెలియదు. కానీ నా తండ్రి ఒంటరిగా ఉండటం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు’’ అంటూ ట్వీట్ చేసింది. దీనిపై నెటిజనలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘‘చివరి దశలో ఉన్నప్పుడు తోడు చాలా అవసరం. మీరు చాలా మంచి పని చేశారు. కంగ్రాట్స్’’.. ‘‘ఇంత మంచి న్యూస్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు’’.. ‘‘కొత్త ఇంటికి మీ అమ్మను ఆహ్వానించండి. వారిద్దరు ఒకరికొకరు కొత్త జీవితాన్ని ఇచ్చుకున్నారు. భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రకారం వివాహం అంటే కేవలం శృంగారం మాత్రమే కాదు.. అంతకు మించి ఎంతో విలువైనది. వీరిద్దరు ఒకరినొకరు చూసుకుంటారు.. తోడు, నీడగా నిలుస్తారు’’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజనులు. చదవండి: తండ్రి రెండో పెళ్లిని కూతురు ప్రశ్నించొచ్చు: హై కోర్టు -
వైరల్: ఈమె మనిషా.. దెయ్యామా?!
జాగ్రెబ్(క్రొయేషియా): దెయ్యాలు, భూతాలు అంటే నమ్మకం లేని వారు ఎందరు ఉన్నారో.. వాటి ఉనికిని విశ్వసించే వారు కూడా అంతకంటే ఎక్కువ మందే ఉంటారు లోకంలో. దెయ్యాలకు సంబంధించిన వార్తలు, వీడియోలకు చాలా క్రేజ్. చాలా మంది భయపడుతూ మరి వాటిని చూస్తారు. ఇక నెట్టింట్లో దెయ్యాల ఉనికికి సంబంధించిన వీడియోలు కోకొల్లలు. వీటిలో చాలా మటుకు ట్రిక్స్ ఉపయోగించి క్రియేట్ చేసిన వీడియోలే. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే తాజాగా ఓ మహిళ ఫోటో ఇంటర్నెట్‌ని హడలెత్తిస్తుంది. చాలా మంది ఇమె మనిషి కాదు దెయ్యం అంటుండగా.. కొందరు మాత్రం.. కెమరా ట్రిక్ అని కొట్టి పారేస్తున్నారు. ఇంతకు ఈ ఫోటో కథ ఏంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే.. క్రొయేషియాకు చెందిన ఇవాన్ రుబిల్ టూర్ గైడ్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం జాగ్రేబ్ బస్టాప్ వద్ద నిలుచున్న ప్రయాణికులను తన ఫోన్ కెమేరాతో ఫొటో తీశాడు. ఆ ఫొటో చూసేందుకు చాలా సాధారణంగానే ఉంది. దీనిలో ఇద్దరు నన్‌లు, బ్రౌన్ కలర్ కోటు ధరించిన ఓ మహిళ ఉన్నారు. ఇక ఈ ఫోటోని పరిశీలనగా చూస్తే.. అందులో బ్రౌన్ కోటు వేసుకున్న మహిళ కాళ్లను చూడగానే ఒక్కసారిగా వెన్నులో వణకు పుడుతుంది. ఎందుకంటే.. ఈ ఫోటోలో ఆమె కాళ్లు పారదర్శకంగా ఉన్నాయి. బస్టాప్‌లో ఉన్న తెల్ల గీత సైతం ఆమె కాళ్ల నుంచి వెళ్లినట్లు కనిపిస్తోంది. దాంతో ఇవాన్ ఆ ఫొటోను రెండు మూడుసార్లు పరిశీలనగా చూశాడు. ఈ ఫొటోను అతడి స్నేహితులకు షేర్ చేశాడట. వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు మాత్రం ‘‘అది నీ కెమేరా ట్రిక్ కాబోలు’’ అని కొట్టిపడేశారట. అనంతరం ఆ ఫొటోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్టు చేశాడు ఇవాన్. ఇక ఈ ఫోటో చూసిన వాళ్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ‘‘నీ ఫొటోలో దెయ్యం ఉంది’’ అంటే.. చాలామంది మాత్రం ‘‘నీ కెమేరాలో ఏదో సమస్య ఉంది చెక్ చేసుకో’’ అంటూ కామెంట్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఇవాన్ మాట్లాడుతూ.. ‘‘నా ఫోన్ కెమేరాలో ఏదైనా సమస్య ఉందేమోనని భావించి మిగతా ఫొటోలను కూడా చెక్ చేశాను. కానీ, ఆ ఫొటో మాత్రమే అలా వచ్చింది. బహుశా వారు చెప్పేది కూడా నిజమే కావచ్చు. నా కెమేరాలో సమస్య వల్లే ఆ ఫొటో అలా వచ్చిందేమో’’ అని తెలిపాడు. ఏది ఏమైనా ఈ ఫోటో మరోసారి దెయ్యాల ప్రస్తావను తెరమీదకు తెచ్చింది. చిత్రం ఏమిటంటే ఇవాన్‌కు హాంటెడ్ సిటీలంటే ఇష్టమట. అతడు చాలాసార్లు ఆయా ప్రాంతాలను సందర్శించాడు. కానీ, ఎక్కడా అతడికి దెయ్యం జాడ కనిపించలేదట. అందుకే ఆ ఫొటోను చూడగానే అతడు అంత ఆశ్చర్యపోయాడు. ఇక సదరు మహిళ కాళ్లు అంత పారదర్శకంగా కనిపించడానికి కారణం ఏమిటో ఎవరు చెప్పలేకపోతున్నారు. చదవండి: ప్రాంక్ కాదు, అక్కడ నిజంగానే దెయ్యం! -
వైరల్: చావోరేవో అన్నట్లు.. గట్టిగా అరుస్తూ హంగామా
బుల్లి హమ్మింగ్ బర్డ్ పాముకు సమఉజ్జీ కానేకాదు.. కానీ.. గుండె ధైర్యం ఎక్కువలాగుంది.. అందుకే తన గూటి జోలికి.. అందులో ఉన్న పిల్లల జోలికి రావడానికి ప్రయత్నిస్తున్న ఈ గ్రీన్ పిట్ వైపర్‌కు ఎదురెళ్లింది.. చావోరేవో అన్నట్లు తెగించింది.. గట్టిగా అరుస్తూ.. దాని చుట్టూ తిరుగుతూ హంగామా చేసింది.. ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించింది.. ఏమనుకుందో ఏమో.. చివరికి ఈ పాము వెనక్కి తగ్గింది. పిట్టదే పైచేయి అయింది.. ఈ చిత్రాన్ని బెన్స్మేట్ అనే ఫొటోగ్రాఫర్ తీశారు. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం.. ఇది మనకు తెలిసిందేగా.. అయితే.. ఇక్కడ విడవలేదు.. అలాగని కరవనూలేదు.. ఇదో చాలా చిత్రమైన పరిస్థితి. ఫొటో చూస్తున్నారుగా.. తనను కరవడానికి వచ్చిన పాము గొంతును ఈ కప్ప ఎలా పట్టుకుందో.. ఈ ట్రీ స్నేక్ కప్పను అమాంతం మింగేద్దామని వచ్చినా.. అది తెలివిగా పక్కకు తప్పుకోవడంతో ఈ మాత్రమే నోటికి చిక్కింది. దీంతో కప్ప విజృంభించేసింది.. పట్టు బిగించింది.. ఇలా ఇవి కొన్ని గంటలపాటు ఉండిపోయాయట. అలా ఉండిఉండి నీరసించి.. చివరికి దేనిదారిన అవి వెళ్లిపోయాయట. ఈ చిత్రాన్ని బెలీజ్ దేశ అడవుల్లో డేవిడ్ మైట్‌ల్యాండ్ అనే ఫొటోగ్రాఫర్ క్లిక్‌మనిపించారు. చదవండి: ఈ హెరిటేజ్ సైట్స్‌లోకి వెళ్లలేం.. ఇదొకటే దారి! -
షాకింగ్: ఒంటి నిండా కట్లు.. షార్ట్ మీద వచ్చిన వరుడు
జకర్తా: వివాహం.. ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన వేడుక. లైఫ్‌లో ఒక్కసారే జరిగే ఈ వేడుకని (అఫ్కోర్స్.. కొందిరి జీవితంలో రెండు, మూడు పెళ్లిల్లు కూడా ఉంటాయి)మరపురాని మధుర జ్ఞాపకంగా మలుచుకోవాలని భావిస్తారు చాలా మంది. అందుకే శక్తికి మించి ఖర్చు చేస్తారు. పెళ్లి మంటపం.. నుంచి తినే భోజనాల వరకు ప్రతీది ప్రత్యేకంగా ఉండాలని చూస్తారు. ఇక వివాహ సమయంలో ధరించే వస్త్రాల పట్ల చాలా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. వేలు, లక్షలు ఖర్చు చేసి మరి ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటారు. వివాహ సమయంలో ప్రతి ఒక్కరి దృష్టి తమ మీద ఉండాలని ఆశిస్తారు. సాధారణంగా ఏ పెళ్లిలో అయినా కనిపించే దృశ్యాలు ఇవి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబేయే వార్త ఇందుకు భిన్నం. ఇక్కడ ఓ వరుడు చేతికి కట్టుతో.. ఒంటి మీద చొక్కా లేకుండా కేవలం షార్ట్ ధరించి పెళ్లికి హాజరయ్యారు. కాళ్లు, చేతులకు కట్లు కట్టి ఉన్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ సంఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది. ఈ పెళ్లి వేడుకలో వరుడి శరీరం మీద కట్లతో.. ఒంటి మీద చొక్కా కూడా లేకుండా హాజరైతే.. వధువు మాత్రం బుట్టబొమ్మలా తయారయి వచ్చి పెళ్లి కుమారిడి పక్కన కూర్చుంది. ఈ వేడుకకు బంధువులు కూడా బాగానే హాజరయ్యారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పస్తుతం ఇవి తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన వారంతా ‘‘పాపం ఆ యువకుడికి పెళ్లి అంటే ఇష్టం లేదేమో.. కొట్టి మరి ఇలా పెళ్లి చేస్తున్నారు’’ అని కామెంట్ చేస్తుండగా.. మరి కొందరు మాత్రం ‘‘ప్లీజ్ ఈ ఫోటోల వెనక స్టోరీ షేర్ చేయండి’’ అని కామెంట్ చేస్తున్నారు. ఈ కామెంట్లపై సదరు పెళ్లి కుమార్తె స్పందించింది. ‘‘మా ఇద్దరికి ఈ వివామం ఇష్టమే. అయితే పెళ్లికి కొద్ది రోజుల ముందు నా భర్తకు యాక్సిడెంట్ అయ్యింది. పెట్రోల్ తీసుకురావడం కోసం వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. దాంతో ఇలా ఒళ్లంతా గాయాలయ్యాయి. బట్టలు వేసుకోవడానికి రావడం లేదు. అందుకే ఇలా షార్ట్ మీద వచ్చాడు’’ అని తెలిపింది. చదవండి: పెళ్లిలో భర్త పర్మిషన్తో లవర్ని.. -
కదిలించే ఫోటో: ‘వారికి బదులు నన్ను చంపండి’
యాంగాన్: మయన్మార్‌లో అధికారం సైన్యం చేతిల్లోకి వెళ్లింది. అధ్యక్షురాలు అంగ్ సాన్ సూకిని సైన్యం నిర్భంధించి.. అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిలటరీకి వ్యతిరేకంగా దేశంలో ఆందోళనలు అంతకంతకూ ఎక్కువైపోతున్నాయి. ప్రజల నిరసనని అణచివేయడానికి భద్రతా దళాలు ప్రయత్నిస్తూ ఉండడంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా సైన్యం అరాచకాలను కళ్లకు కట్టే ఫోటో ఒకటి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరలవుతోంది. కచిన్ రాష్ట్రంలో మైత్‌క్వీనా నగరంలో సోమవారం నాడు తీసిన ఫోటో ఇది. ఆ వివరాలు... కచిన్ రాష్ట్రంలో సోమవారం కొందరు బయటకు వచ్చి దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని నినాదాలు చేస్తున్నారు. ఇంతలో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఆందోళనకారులను అరెస్ట్ చేయడం.. మాట వినకపోతే తూటాకు పనిచెప్పడమే వారి లక్ష్యం. పోలీసులను చూసి అక్కడి యువకులు పరుగులు పెడుతున్నారు. అప్పటికే అధికారులు తుపాకులకు పని చెప్పడంతో ఓ యువకుడు మరణించాడు. మరి కొందరి ప్రాణాలు తీసేందుకు సిద్ధంగా ఉన్నారు అధికారులు. ఈ విపత్కర పరిస్థితిని గ్రహించిన ఓ మహిళ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అధికారులకు అడ్డు నిలబడింది. తెల్లటి దుస్తులు ధరించి శాంతికి మారుపేరుగా ఉన్న ఆ నన్ పోలీసులకు ఎదురెళ్లింది. నిగ్రహం పాటించండి అంటూ వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు ఆమె మాట వినలేదు. దాంతో ఆమె వెంటనే మోకాళ్లపై కూర్చొని ‘ఆందోళనకారులను ఏమీ చేయొద్దు.. కావాలంటే నా ప్రాణం తీసుకోండి’ అంటూ వేడుకుంది. ఆమెలోని తెగువ, మానవత్వానికి చలించిన అధికారులు ఆమెకు ప్రతి నమస్కారం చేశారు. మయన్మార్‌లో ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్న ఈ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మైత్‌క్వీనాలో సోమవారం నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో పోలీసులకు నచ్చజెప్పేందుకు సిస్టర్ అన్న్ రోజ్ ను తవాంగ్ ప్రయత్నించారు. వారిని అరెస్ట్ చేసేందుకు వెళ్తున్న పోలీసులను అడ్డుగా నిలిచారు. వారినేమీ చేయొద్దంటూ మోకాలిపై నిలబడి వేడుకున్నారు. ఆ సమయంలో తీసిన ఫొటోనే ఇది. ఇద్దరు పోలీసులు సైతం ఆమెకు చేతులు జోడించి నమస్కరించడం కనిపించింది. ఫిబ్రవరి 28న సైతం నిరసనకారులపై ప్రతాపం చూపేందుకు వచ్చిన పోలీసులను ఇలానే అడ్డుకున్నారు సిస్టర్ తవాంగ్. ఈ ఘటనపై సిస్టర్ తవాంగ్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం మయన్మార్ దుఃఖంలో ఉంది. నా కళ్ల ముందు ప్రజలకు ఏమైనా జరిగితే తట్టుకోలేను. చూస్తూ ఊరుకోలేను. ప్రజల కోసమే నా జీవితాన్ని అంకితం చేశాను. వారి కోసం చావడానికి నేను భయపడను’’ అన్నారు. చదవండి: ప్రజలు ఎన్నుకున్నా పవర్లో లేరెందుకు! బయటికొస్తే అరెస్ట్ చేస్తాం... -
విరుష్కా: నెంబర్ 11 వెనుకున్న రహస్యం!
ముంబై : విరుష్క దంపతులకు నెంబర్11తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎలా అంటే.. విరాట్ కోహ్లీ పుట్టిన నెల, పెళ్లి రోజు, తండ్రైన రోజు, కెరీర్లో సాధించిన ఘనతలన్నింటీ 11తో సంబంధం ఉండటం ఇప్పడు చర్చనీయాంశమైంది. విరాట్ పుట్టినరోజు 11వ నెలలోనే వస్తుంది. అనుష్కతో పెళ్లి కూడా డిసెంబర్11న జరిగింది. ఇక విరాట్ కోహ్లి, నటి అనుష్క శర్మ దంపతులకు జనవరి 11న పండంటి పాప జన్మనిచ్చింది. అప్పటి నుంచి కూతురుకి సంబంధించిన ఏ విషయాన్ని అభిమానులతో విరుష్క జోడీ పంచుకోలేదు. అంతేకాకుండా.. ప్రైవసీ పేరు చెప్పిన విరాట్ కోహ్లీ.. కుటుంబ సభ్యుల్ని మినహా ఎవరినీ ఆసుపత్రిలో పాపని చూసేందుకు అనుమతించలేదు. (తొలిసారి కూతురి ఫొటో షేర్ చేసిన ‘విరుష్క’) తాజాగా తమ గారాలపట్టిని ఇన్స్టాగ్రామ్ వేదికగా అనుష్క ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా తమ ముద్దుల కుమార్తె పేరును వెల్లడించారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ పేర్లు కలిసేలా 'వామికా' అని నామకరణం చేశారు. ఇంతకీ ఈ పేరు ఎలా పెట్టారో తెలుసా..ఆంగ్ల అక్షరం వి అంటే విరాట్, ఎ అంటే అనుష్కలను కలగలిపితే వా..దానికి 'మిక'ను జతచేయడం ద్వారా అమ్మవారి పేరువచ్చింది. వామిక అంటే కనకదుర్గ అని అర్థం. చిన్నారి వామికను అనుష్క పరిచయం చేసిన కొన్ని నిమిషాలకే ఆమె ఇన్‌స్టాగగ్రామ్ మొత్తం అభినందనలు, శుభాకాంక్షలతో నిండిపోయింది. పలువురు ప్రముఖులు చిన్నారిని ఆశీర్వదిస్తూ పోస్టులు పెట్టారు. ఇక న్యూమరాలజీ ప్రకారం అనుష్క అదృష్ట సంఖ్య 3కాగా, విరాట్‌కు 7గా ఉంది. చిన్నారి వామికా లక్కీ నెంబర్ 3గా ఉంది. అయితే 11 అనే నెంబర్‌తో కోహ్లీ, అనుష్కకు ఏదో అనుంబంధం ఉందని, ఆ సంఖ్య వారికి కలిసొస్తుందని వారి సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అయితే దాని వెనుకున్న రహస్యం మాత్రం ఎవరికీ తెలీదు. (కోహ్లి వీరాభిమాని కూతురు పేరు తెలుసా?) -
స్ట్రాంగ్ ఎవ్రీడే.. నో ఎక్స్క్యూజెస్
అనిల్ కపూర్‌కు ఇప్పుడు 64 వయసు. ఫొటోలో కనిపిస్తున్నది ఆయన భుజబలమే. 60 దాటినా ఆరోగ్యాన్ని ఫిట్‌గా ఉంచుకోవడంలో అనిల్ కపూర్ ఎప్పుడూ అశ్రద్ధ చేయక చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ముంబైలో ఉన్నా ఔట్‌డోర్ షూటింగ్లో ఉన్నా వ్యాయామం తప్పనిసరి. ‘స్ట్రాంగ్ ఎవ్రీడే’... ‘నో ఎక్స్క్యూజెస్’ అనేది ఆయన నినాదం. అంటే ప్రతిరోజూ మనం శక్తితో ఉండాలి. వ్యాయామం చేయకుండా ఉండేందుకు సాకులు చెప్పడం మానుకోవాలి అని ఆయన ఉద్దేశ్యం. ఇక్కడ కనిపిస్తున్న ఫొటో మొన్న ఆయన ట్విటర్లో, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘ఉదయ్‌పూర్‌లో షూటింగ్లో ఉన్నా’ అని క్యాప్షన్ పెట్టారు. హోటల్ రూమ్‌లో తన బైసెప్స్‌ను చెక్ చేసుకుంటూ ఉన్నారాయన ఈ ఫొటోలో. (చదవండి: సీన్ తొలగించాల్సిందే) అనిల్ కపూర్ తాజాగా ‘ఏకె వెర్సస్ ఏకె’ సినిమాలో నటించారు. ఆ సినిమా మంచి రివ్యూలు పొందింది. ప్రస్తుతం ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘జుగ్ జుగ్ జియో’ సినిమాలో నటిస్తున్నారు. దాని కోసమే ఉదయ్‌పూర్‌లో ఉన్నారు. ఇందులో నీతూ కపూర్, వరుణ్ ధావన్ నటిస్తున్నారు. దీని తర్వాత ఆయన రణ్‌బీర్ కపూర్ హీరోగా చేస్తున్న ‘యానిమల్’లో నటించనున్నారు. బాలీవుడ్లో అనిల్ కపూర్ నేటికీ స్టార్డమ్ తగ్గని హీరో. ఆ స్టార్డమ్ వెనుక ఆయన ఫిట్నెస్ ఉందని వేరే చెప్పాలా? -
వైరలవుతోన్న ‘కుట్టి థలా’ ఫోటోలు
తమిళ స్టార్ హీరో అజిత్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వివాదాలకు దూరంగా.. తన పనేంటో తాను చూసుకుంటారు అజిత్. ఇక తన అభిమానులు కూడా అలానే ఉండాలని కోరుకుంటారు. ఇక అజిత్‌కు ఎంత క్రేజ్ ఉందో ఆయన కుమారుడికి కూడా అదే రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆరేళ్ల అజిత్ కుమారుడు ఆద్విక్ అజిత్ బయట కనిపిస్తే.. చాలు సోషల్ మీడియాలో కుట్టి థలా ఫోటోలు తెగ వైరలవుతాయి. తాజాగా బుధవారం ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. తల్లి షాలినితో కలిసి ఆద్విక్ ఓ పెళ్లికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. (చదవండి: హ్యూమాకి భయమా?) ఈ ఫోటోల్లో షాలిని, ఆద్విక్తో పాటు షామిలి కూడా ఉన్నారు. బాల నటులుగా కోట్లాది మంది హృదాయాలను కొల్లగొట్టిన షాలిని సిస్టర్స్ ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. కుట్టి థలా వెరీ క్యూట్ అంటూ అజిత్ ఫ్యాన్స్ ఆద్విక్ని తెగ పొగుడుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అజిత్ వలిమై చిత్రంలో నటిస్తున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నీరవ్ షా సినిమాటోగ్రఫి అందిస్తుండగా..హ్యుమా ఖురేషి, కార్తికేయ గుమ్మకొండ, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
బైడెన్ ప్రమాణ స్వీకారం.. క్లింటన్ కునికిపాట్లు
వాషింగ్టన్: అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇక బైడెన్‌తో పాటు అమెరికా 49వ ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేశారు. రెండు వారాల క్రితం ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన క్యాపిటల్ భవనంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్.. బైడెన్‌తో దేశ నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేయించారు. అధ్యక్షుడుగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు, దేశ 49వ ఉపాధ్యక్షురాలిగా మన తమిళనాడు మూలాలున్న ఇండో–ఆఫ్రో అమెరికన్ మహిళ కమలా హారిస్(56) ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్ ప్రమాణ స్వీకారం చేయించారు. (చదవండి: మళ్లీ వస్తా: డొనాల్డ్ ట్రంప్) ఇక బైడెన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుండగా.. వీటిలో ఒకటి మాత్రం నవ్వులు పూయిస్తోంది. ఈ ఫోటో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కి సంబంధించినది. ఇక దీనిలో ఆయన కునికిపాట్లు పడుతున్నట్లు ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. భార్య హిల్లరీ క్లింటన్‌తో కలిసి బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన బిల్ క్లింటన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్, మాజీ అధ్యక్షుడు జార్జి డబ్లూ.బుష్ వెనక వరుసలో కూర్చోని ఉన్నారు. ఇక ఈ ఫోటోపై నెటిజనులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వృద్ధుడు అయ్యాడు కదా.. పాపం వదిలేయండి’’.. ‘‘జో బైడెన్ ప్రభుత్వం కల్పించిన నమ్మకం ఇది. ఇక మనం బహిరంగా కార్యక్రమాల్లో ప్రశాంతంగా నిద్ర పోవచ్చు.. నా దిండు పంపిస్తాను’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక డొనాల్డ్ ట్రంప్, బైడెన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరుకాలేదు. (చదవండి: బైడెన్ టీం: మనకే అగ్ర తాంబులం) ఇక కార్యక్రమంలో లేడీ గాగా జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం 2017లో తొలి యువ కవయిత్రి పురస్కారాన్ని పొందిన అమండా గార్మన్.. తాను రాసిన ఒక కవితను చదివి వినిపించారు. ఆ తరువాత, నటి, గాయని జెన్నిఫర్ లోపెజ్ ఒక పాటను ఆలపించారు. -
వైరలవుతోన్న రతన్ టాటా ఫోటో
ముంబై: టాటా గ్రూపు అంటేనే విలువలకు పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు విస్తరించినప్పటికి వీసమెత్తు గర్వం కనపడదు. ఇక ఉద్యోగుల పట్ల టాటా సంస్థలు చూపే శ్రద్ధ గురించి అందులో పని చేసే వారిని అడిగితే తెలుస్తుంది. టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా సింప్లిసిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. దేశం పట్ల, సమాజం పట్ల టాటా కుటుంబానికి ఎంతో ప్రేమ, బాధ్యత. ఇక ఏదైనా విపత్తు వచ్చిందంటే చాలు సాయం చేయడంలో టాటా సంస్థలు ముందు వరుసలో ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే గత నాలుగైదు రోజులుగా రతన్ టాటాకు సంబధించిన ఓ వార్త సోషల్ మీడియా తెగ వైరలవుతోంది. తమ కంపెనీలో పని చేసిన ఓ మాజీ ఉద్యోగిని కలవడం కోసం రతన్ టాటా స్వయంగా ముంబై నుంచి పుణె వెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. యోగేష్ దేశాయ్ అనే వ్యక్తి తన ట్విట్టర్లో రతన్ టాటా సదరు ఉద్యోగి పిల్లలతో మాట్లాడుతున్న ఫోటోని షేర్ చేశారు. (చదవండి: పరిగెత్తండిరా!.. శబ్ధం చేయకండయ్యా!!) Ratan Tata,83, living legend, greatest businessman alive in India visited the friends society in Pune to meet his Ex Emoloyee all the way from Mumbai who is ailing for last 2 years. This is how legends are made of. No media, no bouncers only commitment towards loyal employees. pic.twitter.com/5xktAH2CUX — No Robert Elekes - AnKuVa (@SuspendedAkount) January 4, 2021 ఇక ‘రతన్ టాటా లివింగ్ లెజెండ్.. భారతదేశంలో ఉన్న అతి గొప్ప వ్యాపారవేత్తల్లో ఆయన ఒకరు. తమ సంస్థలో పని చేసిన ఓ మాజీ ఉద్యోగి గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతన్నారని రతన్ టాటాకు తెలిసింది. దాంతో అతడిని పరామర్శించడానికి ముంబై నుంచి పుణె వెళ్లారు. ఆయన వెంట బౌన్సర్లు లేరు.. మీడియా హడావుడి లేదు. నమ్మకంగా పని చేసిన ఉద్యోగి పట్ల ఆయన చూపిన ఈ సానుభూతి ఎంతో గొప్పది. డబ్బు మాత్రమే జీవితం కాదని అందరు వ్యాపారవేత్తలు తెలుసుకోవాలి. గొప్ప మనిషిగా బతకడం అనేది ముఖ్యం. సర్ మీరు చేసిన ఈ పనికి గౌరవంగా నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను’ అంటూ షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. లివింగ్ లెజెండ్ రతన్ టాటా.. అంటూ ప్రశంసిస్తున్నారు నెటిజనులు. -
హీరో అజిత్‌కి ఏమైంది? షూటింగ్ ఫోటో వైరల్
హైదరాబాద్ : తమిళ స్టార్ అజిత్ నటిస్తున్న వలిమై చిత్రంలోని ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మరింది. షూటింగ్లో భాగంగా కుటంబంతో కలిసి దిగినట్లుగా ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ ఫోటోలో అజిత్ కనిపిస్తున్న తీరు ఆయన అభిమానులను ఆందోళన కలిగిస్తుంది. ఈ ఫోటో కాస్త అస్పష్టంగా ఉండటంతో వెంటనే క్లారిటీగా ఉన్న ఫోటోను రిలీజ్ చేయాల్సిందిగా అజిత్ అభిమానులు చిత్ర బృందాన్ని కోరారు. ఈ లేటెస్ట్ ఫోటోకి సంబంధించి ఏదైనా అప్డేట్ ఇవ్వాల్సిందిగా విఙ్ఞప్తి చేస్తున్నారు. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతుంది. (అజిత్‌తో ఉన్నది ఎవరో తెలుసా? ) ఈ ఏడాది మార్చిలోనే షూటింగ్ ప్రారంభమైనా కరోనా కారణంగా బ్రేక్ పడింది. తిరిగి ఎనిమిది నెలల అనంతరం అన్ని జాగ్రత్తల నడుమ శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. శంకర్ రాజా ఈ చితత్రానికి సంగీతం అందిస్తుండగా బోనికపూర్ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా అప్డేట్స్కి సంబంధించి ఫ్యాన్స్ నుంచి వస్తున్న వినతులపై బోనీ స్పందించారు. వలిమై సినిమా సెట్లో అజిత్ గాయపడ్డాడని, అయినప్పటికీ షూటింగ్ ఆలస్యం చేయకుండా షాట్ పూర్తిచేశాడని చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే అప్డేట్ ప్రకటిస్తామని, అప్పటిదాకా వేచి ఉండాల్సిందిగా అజిత్ ఫ్యాన్స్‌ను కోరారు. నీరవ్ షా సినిమాటోగ్రఫి అందించిన ఈ సినిమాలో హుమా ఖురేషి, కార్తికేయ గుమ్మకొండ, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. (జాంబిరెడ్డి ట్రైలర్ రిలీజ్ చేయనున్న ప్రభాస్ ) -
భర్తను ఎత్తుకున్న నటి.. ఫోటో వైరల్
బాలీవుడ్ నటి, హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ గౌహర్ ఖాన్, కొరియెగ్రాఫర్ జైద్ దర్బార్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబరు 25న అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి నిఖా జరిగింది. ఇక వివాహం అయిన నాటి నుంచి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులను ఖుషి చేస్తున్నారు గౌహర్ జంట. ఇక తాజాగా నేడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. ‘ఇంతవరకు ఇలాంటి ఫీట్ ఎవ్వరు చేయలేదు మేడం.. మీరు సూపర్బ్’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. ఇంతకు ఆ ఫీట్ ఏంటో తెలియాలంటే ఇది చదవండి. సాధారణంగా సినిమాల్లో, రియల్‌గా కూడా అబ్బాయి.. అమ్మాయిని చేతలతో ఎత్తుకుంటాడు. ఫోటోలకు ఫోజులు ఇస్తాడు. (చదవండి: ‘మా లవ్‌స్టోరీని గుండెలపై లిఖించుకుంటున్నాం’) ఇక సినిమాలో అప్పుడప్పుడు హీరోయిన్, హీరోను ఎత్తుకునే సన్నివేశాలు వచ్చినా.. అవి గ్రాఫిక్స్ తప్ప రియల్ కాదనే విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో గౌహర్ ఓ సాహసోపేతమైన ఫీట్ చేశారు. భర్తను చేతుల్లోకి ఎత్తుకుని ఫోటోలకు ఫోజిచ్చారు. పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్లో భాగంగా గౌహర్ తన భర్త జైద్‌ను ఎత్తుకున్నారు. మంచి-చెడు, బలం-బలహీనం అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. ఇక ప్రస్తుతం గౌహర్, తాండవ్ సినిమాతో బిజీగా ఉన్నారు. View this post on Instagram A post shared by GAUAHAR KHAN (@gauaharkhan) -
పాకిస్తాన్ తింగరి పని.. ఫోటోలు వైరల్
ఇస్లామాబాద్: దేశానికి ఎనలేని సేవ చేసి ప్రజల్లో హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తిని జాతిపితగా గుర్తిస్తారు. ఆయన పట్ల యావత్‌దేశ ప్రజలు ఎంతో గౌరవ మర్యాదలు ప్రదర్శిస్తారు. మన జాతిపిత మహాత్మా గాంధీ. ఆయనను మనతో పాటు ప్రపంచ దేశాలన్ని అపారంగా గౌరవిస్తాయి. గాంధీ అంటే ఇండియా అనేంతగా ఆయన ప్రసిద్ధి చెందారు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే మన దాయాది దేశం పాకిస్తాన్ ఓ తింగరి పని చేసి పాపం ఆ దేశ జాతిపిత పరువు తీసింది. కరెన్సీ నోట్లు, కాలేజీలు, ఆస్పత్రులు వంటి ముఖ్యమైన వాటికి జాతిపిత పేరు పెడతాం. అయితే పాక్ ఏకంగా వారి జాతిపిత మహ్మద్ అలీ జిన్నా పేరిట ఓ మద్యం బాటిల్‌ని విడుదల చేసి ఆయన పరువు మంట గలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. జిన్నా, జిన్ల కాంబినేషన్‌తో ఈ మద్యం తయారయ్యిందనే ఉద్ధేశంతో ఈ పేరు పెట్టినట్లు దీని తయారీదారులు పేర్కొన్నారు. ‘మ్యాన్ ఆఫ్ ప్లెజర్ జిన్నా స్మృతిలో’ అంటూ జిన్ బాటిల్‌ని విడుదల చేశారు. ఇక జిన్నా ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారో.. పాకిస్తాన్ పట్ల ఆయన వైఖరి ఏలాంటిదో.. చివరకు అమెరికా వల్ల ఆ దేశం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది వంటి వివరాలు బాటిల్ లేబుల్‌పై ముద్రించారు. 1977 లో యుద్ధ చట్టాన్ని ప్రకటించిన తరువాత అప్పటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో నుంచి అధికారాన్ని కొల్లగొట్టిన పాకిస్తాన్ ఫోర్ స్టార్ జనరల్ ముహమ్మద్ జియా-ఉల్-హక్ గురించి కూడా ఈ లేబుల్ మీద ఉంది. జియా-ఉల్-హక్ మార్గాలను జిన్నా ఎలా వ్యతిరేకించేవాడో లేబుల్ మీద పేర్కొన్నారు. ఎందుకంటే జిన్నా పూల్ బిలియర్డ్, సిగార్లు, సాసేజ్లు, చక్కటి స్కాచ్ విస్కీలను ఆస్వాదించే వ్యక్తి అని లేబుల్ మీద పేర్కొన్నారు. (చదవండి: యువ నేతతో దావుద్ ప్రేయసి వివాహం..!) 'In the memory of the man of pleasure': Alcoholic drink named after Pak founder Jinnah Read @ANI Story | https://t.co/qiuEs1LYdc pic.twitter.com/sYIgKZlyZc — ANI Digital (@ani_digital) December 1, 2020 తమ జాతిపిత జిన్నా పేరు మీద ఆల్కహాల్ డ్రింక్ ఉందని నెటిజన్లు ఆశ్చర్యపోయారు. మద్యం సేవించడం హానికరం. అలాంటిది దానికి ఏకంగా జాతిపిత పేరు పెట్టడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సముద్రంలో కాజల్ దంపతుల అడ్వెంచర్స్..
కొత్త జంట కాజల్ అగర్వాల్-గౌతమ్ కిచ్లు మాల్దీవుల్లో హనీమూన్‌ని ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలను షేర్ చేస్తూ... అభిమానుల చేత వావ్ అనిపిస్తున్నారు కాజల్. తాజాగా సముద్రంలో తాము చేసిన అడ్వెంచర్లకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు కాజల్. అద్భుతమైన కోట్స్‌తో మూడు పోస్టుల్లో స్నార్కెలింగ్ సెషన్‌కు సంబంధించి మొత్తం ఆరు ఫోటోలని షేర్ చేశారు కాజల్. మొదటి పోస్ట్‌లో దంపతులిద్దరూ స్విమ్ చేస్తున్న ఫోటోలని.. ‘ప్రపంచం ఒక సముద్రం. అందులో మనం అలలం. కొందరు సర్ఫ్ చేయాలనుకుంటారు.. కొందరు డైవ్ చేయాలనుకుంటారు’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు. (చదవండి: మజా మాల్దీవ్స్) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) మరో పోస్ట్‌లో ‘ఒంటరిగా సముద్రం ఒడ్డున ఉండండి. అక్కడ మీకు మీ ఉనికిలో లేని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి’ అంటూ రెండు ఫోటోలని షేర్ చేయగా.. చివరి పోస్ట్‌లో ‘సముద్రం అంటే నాకు ఎంతో ప్రేమ. నీలం వర్ణం అంటే నాకు ఎప్పుడు ఇష్టమే. ఎంతో ప్రశాంతంగా.. ప్రకాశవంతంగా.. జారిపోతూ ఉంటుంది. కొద్దిగా భయం కూడా’ అంటూ మరో రెండు ఫోటోలని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ అండర్ వాటర్ స్కూబా డైవింగ్, స్విమ్మింగ్ ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. ఇవే కాక కొద్ది రోజుల క్రితం భర్తతో అండర్ వాటర్, చేపల మధ్య హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్న పలు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: హనీమూన్‌కు వెళుతున్న కొత్త జంట) View this post on Instagram A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) తన చిరకాల స్నేహితుడు, ముంబై వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లూను అక్టోబర్ 30వ తేదీన కాజల్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైలో ఓ ఖరీదైన హోటల్లో కేవలం కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితుల మద్య వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరింగింది.ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కాజల్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’లో మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తున్నారు. ‘ఆచార్య’తో పాటు ‘పారిస్ పారిస్’, ‘భారతీయుడు 2’, ‘ముంబై సాగా’ వంటి పలు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. కాజల్ మాల్దీవుల నుంచి తిరిగి రాగానే కొద్దిరోజుల క్వారంటైన్ అనంతరం షూటింగ్లో పాల్గొననున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. -
కాజల్ పెళ్లి ఫోటోలు వైరల్...
అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూసిన కాజల్ అగర్వాల్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా ముగిసింది. ‘చందమామ’ పెళ్లి అయిపోయింది. చిరకాల స్నేహితుడు గౌతమ్ కిచ్లుతో కలిసి ఏడడుగులు వేశారు. మూడు ముళ్ల బంధంతో సరికొత్త ప్రయాణానికి నాంది పలికారు. ప్రస్తుతం ఇంటర్నెట్లో కాజల్ పెళ్లి ఫోటోలు వైరల్‌గా మారాయి. ముంబైలోని ఓ ఖరీదైన హోటల్ని తమ బిగ్డేకి వేదికగా ఎన్నుకున్నారు. ఇక కోవిడ్ నిబంధనల నేపథ్యంలో అన్ని నియమాలను పాటిస్తూ.. అత్యంత సన్నిహితుల మద్య ‘చందమామ’ మిసెస్‌గా మారిపోయారు. ఇక వివాహ వేడుకకి గౌతమ్ కిచ్లు ఆఫ్-వైట్ అండ్ సిల్వర్ కలర్ షెర్వానీని ఎంచుకోగా, కాజల్ అగర్వాల్ ప్రకాశవంతమైన ఎరుపు రంగు లెహంగాలో తళుక్కుమన్నారు. ఈ జంటను చూసిన వారంతా ‘మేడ్ ఫర్ ఇచ్ అదర్’ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇక వివాహానికి ముందు ఈ జంట సంగీత్, హల్దీ వేడుకలను నిర్వహించారు. నిషా అగర్వాల్, గౌతమ్‌తో పాటు మరి కొందరు స్నేహితులతో కలిసి కాజల్ ఈ వేడుకలో ఫుల్ ఎంజాయ్ చేశారు. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా తెగ వైరలయ్యాయి. (చదవండి: వేడుకల వేళ... ఆనందాల హేల) కొత్త ఇంట్లో.. కొత్త జీవితం.. వివాహం అనంతరం కాజల్, గౌతమ్ కిచ్లులు కొత్త ఇంట్లోకి వెళ్లనున్నారు. ఇందుకు గాను ఈ జంట ఇప్పటికే ముంబైలో కొత్త ఇంటిని సిద్ధం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడమే కాక ఎనీ సజేషన్స్ అంటూ అభిమానులను సలహా కోరిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం గౌతమ్ కిచ్లు తమ కొత్త ఇంటి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.అతను తమ బెడ్రూం బిఫోర్ అండ్ ఆఫ్టర్’' ఫోటోను షేర్ చేశాడు. దీనిలో పెద్ద టీవీ సెట్ కొన్ని అందమైన నైట్ లాంప్స్ ఉన్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైరల్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి వెళ్లిపోయాడు
బిగ్‌బాస్ సీజన్ 13 విజేత సిధార్థ్ శుక్లాకు ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకుని అతడిని మరో సారి బిగ్‌బాస్ హౌజ్‌లోకి తీసుకొచ్చారు. అతడితో పాటు గతంలో బిగ్‌బాస్ విజేతలుగా నిలిచిన హీనా ఖాన్, గౌహర్ ఖాన్‌లను కూడా, సిధార్థ్ శుక్లాతో పాటు రెండు వారాల కోసం బిగ్‌బాస్ 14 హౌజ్‌లోకి పంపించారు. అయితే తాజాగా సిధార్థ్ శుక్లా బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బిగ్‌బాస్ 14 ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. సిధార్థ్ బిగ్‌బాస్ ఇంటి నుంచి వైదొలిగాడు, కానీ బిగ్ బాస్ 14 సెట్ ఉన్న ఫిల్మ్ సిటీలో ఉన్నాడు. దీని వెనుక కారణం ఇంకా తెలియదు. బిగ్ బాస్ 14 ఇంట్లో సిధార్థ్ మరికొన్ని రోజులు కొనసాగుతాడనే వార్తల నేపథ్యంలో ఈ ఫోటోలు షేర్ చేయడం గమనార్హం. (చదవండి: బిగ్‌బాస్ జంట ఫోటోలు మళ్లీ వైరల్!) ఈ క్రమంలో కోయిమోయిలోని ఒక నివేదిక సిధార్థ్ మరికొంత కాలం హౌస్‌లో కొనసాగుతాడని వెల్లడిస్తుంది. " బిగ్‌బాస్ నిర్వహకులు సిధార్థ్ శుక్లా నుంచి ఏమి ఆశించారో అతడు దానిని పూర్తిగా అందిస్తున్నాడు. అతని అభిమానుల నుంచే కాక, ఇంట్లో అతని సమీకరణాలతో బిగ్ బాస్ 14 మేకర్స్ వెతుకుతున్న క్రేజ్‌ని అందిస్తున్నాడు. ప్రారంభంలో, అతను హీనా, గౌహార్ మాదిరిగానే ఉండాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం సిధార్థ్ని మరి కొంత కాలం హౌజ్‌లో ఉంచి టీఆర్పీ పెంచాలని చూస్తున్నారు’ అని తెలిపింది. -
‘ఒక్క ఫోటో.. నీ కష్టం ఏంటో తెలుపుతోంది’
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. దాదాపు ఆరు నెలల విరామం తర్వతా తాజాగా ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం ఎన్టీఆర్ షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. మూవీ కోసం ఆయన పడుతున్న కష్టం ఈ ఒక్క ఫోటోతో అర్థమవుతోంది. ఫోటోగ్రాఫర్ డాబూ రత్నానితో కలిసి ఎన్టీఆర్ దిగిన ఈ ఫోటో ప్రస్తుతం అభిమానులతో పాటు నెటిజనులను తెగ ఆకర్షిస్తుంది. ‘భీమ్ పాత్ర కోసం ఎన్టీఆర్ ఎంతలా కష్ట పడ్డాడో ఈ షర్ట్‌లెస్ ఫోటో తెలియజేస్తుంది. కొమరం భీమ్ పాత్రపై అంచనాలను మరింత పెంచుతోంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. కానీ కరోనా కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో అది కుదరలేదు. (చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ మరో పోస్టర్.. దేశభక్తి మూవీ కాదు) అయితే ఆరు నెలల విరామం తర్వాత మళ్లీ ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 22న ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్‌ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. దీనికి రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. ఎన్టీఆర్‌కి జోడీగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్, రామ్ చరణ్‌కి జోడీగా హిందీ నటి ఆలియా భట్ కనిపించనున్నారు. శ్రియ, అజయ్ దేవగన్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. -
వైరలవుతోన్న ప్రియాంక కుమారుడి పోస్ట్
ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల చాలెంజ్‌లు వైరలవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సవాలు తెర మీదకు వచ్చింది. అయితే ఈ సారి చాలెంజ్‌కి ఓ ప్రత్యేకత ఉంది. ఏంటంటే.. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ కుమారుడి షేర్ చేసిన ఫోటోకు సంబంధించిన చాలెంజ్ ఇది. దాంతో ఇది ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తోంది. వివరాలు.. ప్రియాంక గాంధీ కుమారుడు రియ్హాన్ రాజీవ్ వాద్రా ప్రస్తుతం రణతంబోర్ నేషనల్ పార్కులో వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా బిజీ బిజీగా గడుపుతున్నారు. పార్కు అందాలను, వన్య ప్రాణులను తన కెమరాలో బంధించి అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం రియ్హాన్ ట్వీట్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆకుపచ్చ ఆకుల మధ్య ఓ పులి కన్ను కనిపిస్తోంది. ప్రకృతి వర్ణాల మధ్య పులి కన్ను కూడా ఆ రంగులోనే కనిపిస్తుంది. (చదవండి: వైరల్ అవుతున్నపెళ్లి ప్రకటన) Eye Spy T-101, Zone - 6, Ranthambore National Park, 06/10/20. pic.twitter.com/nQ5g2RV9Wp — Raihan Rajiv Vadra (@raihanrvadra) October 7, 2020 దాంతో నెటిజనులు ఇందులో పులి కన్నుని కనుక్కొండి అంటూ ఈ ఫోటోని రీట్వీట్, షేర్ చేస్తున్నారు. అంతేకాక అద్భుతమైన ఫోటోలు తీశారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా రియ్హాన్ వన్యప్రాణులు.. ముఖ్యంగా పులులకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ.. అభిమానులను ఆకట్టుకుంటున్నారు. -
కుమార్తెని పరిచయం చేసిన నటి
కుటుంబ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు నటి స్నేహ. చెరగని చిరునవ్వుకి కెరాఫ్ అడ్రస్‌గా నిలుస్తారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కథానాయకిగా రాణించారు. నటిగా ఫుల్ క్రేజ్‌లో వుండగానే నటుడు ప్రసన్నను ప్రేమించి, పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో రెండో సంతానంగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు స్నేహ. పాప పుట్టి ఏడు నెలలకు పైనే అవుతున్నా ఇంతవరకు చిట్టితల్లి ఫోటోలు ఎక్కడా షేర్ చేయలేదు. ఈ క్రమంలో భర్త, నటడు ప్రసన్న 38వ పుట్టిన రోజు సందర్భంగా కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేశారు స్నేహ. పాప పేరు ఆద్యంత. తల్లిదండ్రులు, అన్న విహాన్‌తో కలిసి ఉన్న చిన్నారి ఆద్యంత ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు స్నేహ. (చదవండి: స్నేహలోని కొత్త కోణం) ‘హ్యాపీ బర్త్‌డే టూ మై సోల్ మేట్.. మై లవర్ బాయ్.. గార్డియన్ ఏంజిల్.. సూపర్ డాడా. ఈ లడ్డులతో(పిల్లలు) నా జీవితాన్ని అందంగా మలిచినందుకు ధన్యవాదాలు. సదా మనం ఉన్నతంగా ఉండాలని దీవించి.. శుభాకాంక్షలు తెలిపే వారికి ఈ రోజు నా చిట్టితల్లి ఆద్యంతను పరిచయం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ కుమార్తె ఫోటోలు షేర్ చేశారు స్నేహ. ప్రస్తుతం ఇవి తెగ వైరలవుతున్నాయి. View this post on Instagram Happy birthday to my soul mate my lover boy my guardian angel 😇 n my super dada. Thanx for making my life beautiful with these laddos. Love you somuch. And very happy to introduce our little laddo #Aadhyantaa to all the lovely people who have always blessed us and wished us the best. @prasanna_actor @mommyshotsbyamrita @perfektmakeover A post shared by Sneha Prasanna (@realactress_sneha) on Aug 27, 2020 at 8:50pm PDT -
సమంతకు క్రేజ్.. 10 లక్షల లైకులు
సినీ ప్రపంచం, ఫ్యాషన్ వరల్డ్‌లో కొత్తదనానికే మొదటి ప్రాధన్యత. దాంతో సినీ జనాలు, మోడళ్లు ఫ్యాషన్ విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటారు. కొత్త ట్రెండ్స్‌ను పరిచయం చేస్తారు. ఈ విషయంలో అక్కినేని వారి కోడలు సమంత ఓ అడుగు ముందే ఉంటారని చెప్పవచ్చు. దుస్తుల విషయంలో గానీ, ఆభరణాల విషయలో గానీ ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేస్తుంటారు సమంత. (సమంత బ్యూటీ థెరపీ వీడియో ) View this post on Instagram New piercings 😎 A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on Aug 17, 2020 at 11:24pm PDT తాజాగా సమంత ఇయర్ రింగ్స్ తెగ ట్రెండ్ అవ్వడమే కాక యువతులును విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. వీటిలో సమంత ఏకంగా ఐదు చిన్న చిన్న చెవి దుద్దులు ధరించారు. డైమండ్, ఇతర మెటల్స్‌తో తయారు చేసిన ఈ చిన్న చిన్న స్టడ్స్ యువతులను తెగ ఆకర్షిస్తున్నాయి. ‘న్యూ పియర్సింగ్స్’ క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటోను ఇప్పటికే 10 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ‘సూపర్బ్.. ఫ్యాషన్‌లో మీకు మీరే సాటి’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. మీరు చూసి.. నచ్చితే ఫాలో అవ్వండి. -
నిహారిక నిశ్చితార్థం.. ‘భార్యంటే ఎంత ప్రేమో’
కొణిదెల నాగబాబు కుమార్తె నిహారిక - చైతన్యల నిశ్చితార్థం గురువారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో చాలా ఆడంబరంగా ఈ వేడుక జరిగింది. ఫంక్షన్‌కి చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ సతీసమేతంగా హాజరు కాగా.. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, శ్రీజ,సుస్మిత, కళ్యాణ్ దేవ్, వరుణ్ తేజ్ తదితరులు సందడి చేశారు. (భావోద్వేగానికి లోనయిన అల్లు అర్జున్) View this post on Instagram The Power couple @alluarjunonline @allusnehareddy in @manishmalhotra05 @manishmalhotraworld for @niharikakonidela ‘s engagement ⚡️ Photographer - @indraneelrathod Sneha’s MUA - @afsharangila_makeupartist . . . #styledbyharmann #celebritystylist #fashion #celebrity #stylist #celebritystyle #fashionstylist #celebrityfashion #manishmalhotra #manishmalhotramenswear A post shared by Harmann Kaur (@harmann_kaur_2.0) on Aug 13, 2020 at 9:23pm PDT ఈ వేడుకలో అల్లు అర్జున్ తన సతీమణి స్నేహా రెడ్డితో కలిసి స్టైలిష్ లుక్‌లో మెరవడంతో పాటు ఫంక్షన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బన్నీ స్టైలిస్ట్ హర్మాన్ కౌర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. అల్లు అర్జున్, స్నేహ ఇద్దరు మనీష్ మల్హోత్రా డిజైన్ చేసి దుస్తులు ధరించి వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బ్లాక్ కలర్ డ్రెస్‌లో డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో బన్నీని చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘ఈ జంట ఫ్యాషన్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు’.. ‘అల్లు అర్జున్‌కు భార్య స్నేహ మీద ఉన్న ప్రేమను చూసి.. జనాలు వారితో ప్రేమలో పడుతున్నారు’.. ‘మేడ్ ఫర్ ఇచ్ అదర్’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన లుక్ ఇప్పటికే విడుదలవ్వడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. -
యూవీ పోస్ట్: అందరి కళ్లు భువీ పైనే!
న్యూఢిల్లీ: జెండర్-స్వాప్ ఫేస్ యాప్ ద్వారా టీమిండియా ఆటగాళ్లను అమ్మాయిలుగా మార్చిన ఫొటోలను మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘మీ స్నేహితురాలిగా వీరిలో ఎవరిని ఎంచుకుంటారు?’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తుంది. ప్రత్యేకించి పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కు మంచి స్పందన లభిస్తోంది. అమ్మాయిగా భువీ చాలా అందరంగా ఉన్నాడంటు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘నా స్నేహితురాలిగా భువీని ఎంచుకుంటాను’ అంటూ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కామెంట్ చేయగా.. మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా భార్య రష్మా తాను కూడా అంటూ భజ్జీతో ఏకిభవించారు. (రోహిత్.. నువ్వు చాలా క్యూట్: చహల్) View this post on Instagram Who will you select as your 👯♀️ girlfriend’? 🤔🤣 I will reply tomorrow 🤪 A post shared by Yuvraj Singh (@yuvisofficial) on Jun 22, 2020 at 7:28am PDT అంతేగాక బాలీవుడ్ నటుడు ఆశిష్ చౌదరి ‘భువీ హాటెస్ట్’ అంటూ కామెంటు చేయగా, కరణ్ వాహి ‘నా ఓటు భువనేశ్వర్ కే’ అంటూ కామెంట్ చేశాడు. ‘నేను భువీని ఎంచుకుంటాను’ అంటూ భువనేశ్వర్ కూడా తనకు తానే ఎంచుకున్నాడు. టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ స్పందిస్తూ ‘‘ఈ జాబితాలో మీది కూడా ఉండాలని కోరుకుంటున్నాను యూవీ పా’’ అంటూ ఫన్నీగా కామెంట్ పెట్టాడు. కాగా పొడవాటి లీవ్ హేర్‌స్టైల్, స్టైలిష్ లుక్‌లో ఆటగాళ్లంతా అమ్మాయిలుగా చాలా అందంగా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా ఇంతకు ముందు చహాల్ కూడా ఈ యాప్ ద్వారా హిట్ మ్యాన్ రోహిత్ శర్మను అమ్మాయిగా మార్చి ‘‘మీరు చాలా అందంగా ఉన్నారు రోహితా శర్మా భయ్యా’’ అంటూ షేర్ చేయడంతో అది వైరల్ అయిన విషయం తెలిసిందే. (‘యువీ.. నువ్వు ఇంకా ఆడతావనుకున్నా’) -
మృతదేహం వద్ద ఫోటోలా?
కర్ణాటక, తుమకూరు: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు మృతదేహం వద్ద ఫోటో తీయించుకున్న ఎమ్మెల్యేపై ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. శిర తాలూకా దేవరహళ్లి గ్రామానికి చెందిన రైతు గంగాధర్ (60) సేద్యం కోసం రూ.రూ.4.50 లక్షల వరకూ అప్పు చేశాడు. పంటలు పండక అప్పులు తీర్చే మార్గం కనిపించక బుధవారం రాత్రి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎమ్మెల్యే సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకొని రైతు మృతదేహం చెట్టుకు వేలాడుతుండగానే ఫోటోలకు ఫోజులివ్వడం అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వైరల్: ఆ ఫొటో బాలిక జీవితాన్నే మార్చేసింది
లోకంలో పట్టెడన్నం కోసం పడిగాపులు కాచేవారు ఎందరో.. ఇక్కడ మనం చెప్పుకునే ఈ చిన్నారి కూడా ఆ కోవకు చెందిందే. మోతి దివ్య ఉండేది మురికివాడలో. బాలిక తల్లిదండ్రులు చెత్త ఏరుకోడానికి వెళ్తే.. ఆకలితో పల్లెం పట్టుకుని తన ఈడు పిల్లలుండే చోటుకు వడివడిగా అడుగులు వేసేది. పట్టెడు మెతుకులు దొరక్కపోతాయా అని గంపెడాశతో మధ్యాహ్న భోజన సమయానికి బడి మెట్లెక్కేది. మధ్యాహ్నం బడి గంట ఎప్పుడు కొడతారా అని చేతిలో ఖాళీ గిన్నెతో ఆతృతగా ఎదురు చూసేది. ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు.. ప్రతిరోజూ ఇదే తంతు. లోపల మిగతా పిల్లలందరూ స్కూలు బట్టలు ధరించి పాఠాలు వింటుంటే అక్కడే ఉన్న వారి వంక ఓసారి, వారి బ్యాగుల వంక తరచి తరచి చూస్తుండేది.. పిడికెడు మెతుకులైనా దొరక్కపోతాయా అని. ఈ హృదయ విదారక దృశ్యాన్ని ఓ జర్నలిస్ట్ క్లిక్‌మనిపించగా కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అన్న విషయాన్ని అక్షరాలా పాటించాడో వ్యక్తి. వెంకట్ రెడ్డి అనే సామాజిక కార్యకర్త ఎవరైనా ఆమెకు సహాయం చేస్తే బాగుండు అనుకోలేదు. నేనే ఎందుకు ముందడుగు వేయకూడదు అనుకున్నాడు. వెంటనే మరి కొంతమంది సహాయంతో ఆమె ఆచూకీ కనుగొన్నాడు. ఎక్కడైతే వేయిచూపులతో అంటరానిదానిలా ఆకలి తీర్చుకోడానికి నిరీక్షగా ఎదురు చూసిందో అదే పాఠశాలలో ఆమెను జాయిన్ చేశారు. దీంతో ఆమెకు తిండితో పాటు చదువు కూడా సొంతం అయింది. ఇప్పుడామె హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో ఉన్న దేవల్ ఝామ్ సింగ్ ప్రభుత్వోన్నత పాఠశాలలో విద్యార్థి. అందరు పిల్లల్లాగే ఆమె కూడా స్కూలు దుస్తులను వేసుకుంది. తన తల్లిదండ్రుల సమక్షంలో మొదటిసారిగా బడిలోకి విద్యార్థిగా అడుగుపెట్టింది. ఈ ఘటన.. మనుషుల్లో మానవత్వం ఇంకా మిగిలే ఉందని నిరూపించిందని పలువురు నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
సూపర్ ఆఫీసర్
ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ షూటింగ్ లొకేషన్లోని ఫొటోలు బయటకు రాకుండా చిత్రబృందం ఆపలేకపోతోంది. అధికారికంగా విడుదల చేయకముందే హీరోల లుక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం ఆయా చిత్రబృందాలను కలవరపెడుతోంది. తాజాగా మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’కి సంబంధించిన ఓ ఫొటో బయటికొచ్చింది. ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు మహేశ్‌బాబు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కశ్మీర్లో జరుగుతోంది. అక్కడి లొకేషన్లోంచి బయటకు వచ్చిన ఫొటోను చూసి మహేశ్ ఫ్యాన్స్ సూపర్ ఆఫీసర్ అని సంబరపడుతున్నారు. ఈ కశ్మీర్ షెడ్యూల్ ముగిసిన తర్వాత హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు టీమ్. విజయశాంతి, రాజేంద్రప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ స్వరకర్త. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
వైరలవుతున్న వజ్రాల విమానం..!?
రెండు రోజుల క్రితం ఎమిరేట్స్ విమానయాన సంస్థ పోస్ట్ చేసిన ఓ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ ఫోటో చూసిన దగ్గర నుంచి నెటిజన్లలో ఒకటే అనుమానం.. ‘ఇది నిజమేనా’.. ‘ఇంత ఖరీదైన విమానమా’.. ‘ఎంత ఖర్చు చేశారు’ అనే ప్రశ్నలు క్యూ కట్టాయి. ఇంతలా ఆకర్షించడానికి ఏముందా ఫోటోలో అని ఆలోచిస్తున్నారా.. ఎందుకంటే ఆ విమానం వేల వజ్రాల కాంతితో మిరిమిట్లుగొలుపుతోంది. దాంతో చూసిన వారికి ఇది వజ్రాలు పొదిగిన విమానమేమో అనే అనుమానం వచ్చింది. కానీ ఇది నిజంగా వజ్రాలు పొదిగిన విమానం కాదు. కేవలం ఫోటో మాత్రమే. ఈ విషయాన్ని ఎమిరేట్స్ సంస్థనే ప్రకటించింది. Presenting the Emirates ‘Bling’ 777. Image created by Sara Shakeel 💎💎💎 pic.twitter.com/zDYnUZtIOS — Emirates Airline (@emirates) December 4, 2018 విమానం ఫోటోను పోస్ట్ చేస్తూ ‘‘బ్లింగ్’ 777 ఇమేజ్ క్రియేటెడ్ బై సారా షకీల్’ అంటూ ఎమిరేట్స్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అంటే ఇది కేవలం ఫోటో మాత్రమే అని ఎమిరేట్సే స్వయంగా ప్రకటించింది. అయితే నెటిజన్లు అంతా ఫోటోను మాత్రమే చూశారు. పక్కనే ఉన్న క్యాప్షన్‌ని చూడకపోవడంతో ఈ అనుమానాలు బయలు దేరాయి. చివరకు ఎమిరేట్స్ అధికారి ఒకరు ఇది సారా షకీల్ రూపొందించిన చిత్రం అంటూ వివరణ ఇచ్చారు. ‘ఆమె సృష్టించిన ఈ కళాఖండాన్ని మాత్రమే మేం పోస్టు చేశాం. ఇది నిజం కాదు’ అంటూ సదరు అధికారి మీడియాకు స్పష్టం చేశారు. ప్రముఖ క్రిస్టల్ ఆర్టిస్ట్ అయిన సారా షకీల్.. ఈ అద్భుత చిత్రాన్ని రూపొందించి.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అది కాస్తా ఎమిరేట్స్ సంస్థను ఆకర్షించింది. వెంటనే వారు ఆమె అనుమతితో ఈ ఫొటోను రీపోస్టు చేశారు. -
ప్రభామున్నీతో కేజ్రీవాల్ ఫోటో కలకలం..
సాక్షి, న్యూఢిల్లీ : మానవ అక్రమ రవాణా రాకెట్ నిందితురాలు ప్రభా మున్నీతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కలిసున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశ రాజధానిలోని పంజాబి బాగ్ ప్రాంతంలో ప్రభా మున్నీని పోలీసులు అరెస్ట్ చేసిన మరుసటి రోజే ఆమె పక్కన కూర్చుని ఉన్న కేజ్రీవాల్ ఫోటో నెట్టింట్లో దుమారం రేపుతోంది. ఐదేళ్లుగా పరారీలో ఉన్న ప్రభా మున్నీని సోమవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్జీవో పేరిట ప్లేస్మెంట్ ఏజెన్సీని నిర్వహించే ప్రభామున్నీ జార్ఖండ్ యువతులకు ఉద్యోగాలను ఎరవేసి వారిని ఢిల్లీకి పిలిపించి మానవ అక్రమ రవాణా రాకెట్లో భాగంగా వారిని విక్రయిస్తుందని పోలీసులు ఆరోపిస్తున్నారు. జార్ఖండ్‌లో ఆమెపై పలు కేసులున్నాయని పోలీసులు చెప్పారు. 2013 నుంచి పరారీలో ఉన్న ప్రభా మున్నీ ఎంతమంది యువతులను ఈ రాకెట్లో బాగంగా వంచించిందనే వివరాలు తెలియాల్సి ఉంది. ప్రభా మున్నీ ప్రస్తుతం జార్ఖండ్ పోలీసుల రిమాండ్‌లో ఉందని విచారణలో భాగంగా ఆమెను ప్రశ్నించిన మీదట మరిన్ని వాస్తవాలు వెలుగుచూడనున్నాయి. -
వైరలవుతోన్న పోలీసాఫీసర్ ఫోటో
బ్యూనస్ ఎయిర్స్ : కంటేనే అమ్మా అవుతుందా.. కాదు, బిడ్డ ఆకలి గుర్తించి స్పందించే ప్రతి స్త్రీ కూడా మాతృమూర్తే. ఇందుకు నిదర్శనంగా నిలిచారు అర్జెంటీనాకు చెందిన ఓ మహిళా పోలీసు అధికారి. ఆకలితో గుక్కపట్టిన చిన్నారికి స్తన్యమిచ్చి అమ్మ ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. వివరాల ప్రకారం.. అర్జెంటీనాకు చెందిన సెలెస్ట్ జాక్వెలిన్ అయాలా ఒక పిల్లల ఆస్పత్రి వద్ద గార్డ్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం పోషాకాహార లోపంతో బాధపడుతోన్న ఒక పసివాణ్ణి ఆ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఒక రోజు జాక్వెలిన్ విధుల్లో ఉన్న సమయంలో ఆ బాలుడు గుక్కపట్టి ఏడ్వడం ప్రారంభించాడు. ఆ పసివాడి ఏడుపు జాక్వెలిన్ మాతృహృదయాన్ని కదిలించింది. దాంతో వెంటనే జాక్వెలిన్ ఆస్పత్రి సిబ్బందిని అడిగి ఆ పసివాడికి పాలిచ్చింది. జాక్వెలిన్ చూపిన మాతృప్రేమ అక్కడ ఉన్న వారి మనసులను కదిలించింది. వెంటనే ఆ అపురూప దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించారు. ఇంటర్నెట్లో షేర్ చేసిన ఈ ఫోటో జాక్వెలిన్‌ని ఓవర్ నైట్ స్టార్‌గా మార్చేసింది. ఈ ఫోటోను ఇప్పటికే ఒక లక్ష మంది షేర్ చేయగా, ఫేస్బుక్లో ప్రశంసలు వెల్లువ కొనసాగుతోంది. ట్విటర్లో అయితే జాక్వెలిన్ పేరే ఒక హాష్ట్యాగ్గా మారిపోయింది. జాక్వెలిన్ గురించి తెలుసుకున్న అర్జెంటీనా వైస్ ప్రెసిడెంట్ క్రిస్టియాన్ రిటోండో.. ఆమెను ప్రత్యేకంగా అభినందించడమే కాక, పోలీస్ అధికారి స్థాయి నుంచి సార్జంట్‌గా పదోన్నతి కల్పించారు. Hoy recibimos a Celeste, la oficial que amamantó a un bebé en el Hospital de Niños de #LaPlata para notificarle su ascenso. Queríamos agradecerle en persona ese gesto de amor espontáneo que logró calmar el llanto del bebé. La policía que nos enorgullece, la policía que queremos. pic.twitter.com/8aBp0Xj4Zj — Cristian Ritondo (@cristianritondo) August 17, 2018 -
తండ్రికి తగ్గ తనయ, ఏం చేసిందో చూశారా?
కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని ముద్దుల కుమార్తె జీవా ధోని ఇప్పటికే సోషల్‌మీడియాలో ఓ సెన్సెషన్. జీవా పలు సార్లు తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. క్యూట్ క్యూట్‌గా డ్యాన్స్‌లు వేయడం, తండ్రి మ్యాచ్ మధ్యలో అలసిపోతే మంచినీళ్లు తీసుకెళ్లి ఇవ్వడం, ధోనితో పాటు గ్రౌండ్లో డ్యాన్స్‌లు వేయడం వంటివి చేస్తూ... జీవా ధోని నెటిజన్లను ఫిదా చేస్తోంది. తాజాగా తండ్రికూతుర్ల ఓ క్యూటెస్ట్ పిక్చర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిలో కూడా జీవా.. మరోసారి తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. ధోని, కూతురు జీవా ఇద్దరూ కూడా తమ తమ గాడ్జెట్లలో మునిగిపోయిన పిక్చర్ అది. ఓ హోటల్లో కూర్చుని ఉన్న వీరిద్దరూ.. చుట్టుపక్కల పరిసరాలన్నింటిన్నీ పట్టించుకోకుండా గాడ్జెట్లకు అతుకుపోయారు. ధోని తన ఐప్యాడ్‌ను వాడుతుండగా.. ఈ బుల్లి జీవా కూడా తన చిన్న ఐప్యాడ్‌ను తీసుకుని ఎంతో శ్రద్ధగా గమనిస్తూ కనిపించింది. ఈ పిక్చర్లో ధోని తన ట్రైనింగ్ జెర్సీ వేసుకుని కనిపించాడు. అంటే ఈ పిక్చర్ ఇటీవల సిరీస్ మ్యాచ్‌ల సమయంలో తీసిందేనని తెలిసింది. వారి టేబుల్‌పై టీ కప్పులు, సూప్ బౌల్స్ వంటివి ఉన్నాయి. ట్విటర్లో షేర్ అయిన ఈ పిక్చర్ ఇప్పుడు సోషల్ మీడియా యూజర్ల హృదయాలను కొల్లగొడుతోంది.ఇటీవల కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ కుమార్తె పూర్ణ పటేల్ వివాహంలో కూడా జీవా తన డ్యాన్స్‌తో నెటిజన్లను ఫిదా చేసింది. ముద్దుముద్దుగా జీవా వేసిన స్టెపులపై అభిమానులు పొగడ్తల వర్షం కురిపించారు. గతంలో కూడా జీవాకి సంబంధించిన వీడియోలని ధోని, సాక్షిలు ట్విట్టర్లో పోస్ట్ చేయడం, అవి కొద్ది నిమిషాలలోనే వైరల్‌గా మారడం సంగతి తెలిసిందే. Like father, like daughter. MS Dhoni and Ziva busy on their gadgets. pic.twitter.com/oxEKeMDeUQ — Circle of Cricket (@circleofcricket) August 15, 2018 -
ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ఫొటోలు మళ్లీ లీక్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’. అయితే వరుస లీకులతో ఈ మూవీ యూనిట్ ఆందోళనకు చెందుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న మూవీ స్టిల్ ఒకటి ఇటీవల లీక్ కాగా, తాజాగా అదే సీన్‌కు సంబంధించి మరిన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ వైపు అంచనాలు పెరుగుతున్న మూవీకి లీకుల బెడద తలనొప్పిగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. లీకులు ఎవరు చేస్తున్నారన్న దానిపై మూవీ యూనిట్ దృష్టిసారించినట్లు సమాచారం. ఇటీవల లీకైన ఫొటోలో ఎన్టీఆర్ సీరియస్‌గా ఉండగా.. ఆయన తండ్రిగా నటిస్తున్న నాగబాబు ఎదో ప్రమాదంలో ఉన్నట్లు కనిపించింది. తాజాగా లీకైన ఫొటోల్లో ఆ సీన్‌కు సంబంధించిన మరిన్ని ఫొటోలు ఉన్నాయి. జూన్ 21న షూటింగ్ జరిగినట్లు ఫొటోలపై మనం గమనించవచ్చు. దీంతో ఈ సినిమాలో యాక్షన్ సీన్లు ఉంటాయనిపిస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. జగపతిబాబు, నాగబాబులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు ఆగస్ట్ 15న ‘అరవింద సమేత..’ టీజర్‌ను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. అక్టోబర్ 10న మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
‘అరవింద సమేత’ స్టిల్ లీక్.. వైరల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రానికి సంబంధించిన ప్రతీ విషయం టాక్ ఆఫ్‌ది టౌన్‌గా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఏ విషయమైన సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి లీకైన స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫొటోలో ఎన్టీఆర్ సీరియస్‌గా ఉండగా.. ఆయన తండ్రిగా నటిస్తున్న నాగబాబు ఎదో ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫొటోను బట్టి ఈ సినిమాలో ఎంతో ఎమోషన్ ఉండబోతుందనేది అర్థమవుతోంది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా.. జగపతిబాబు, నాగబాబులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్ట్ 15న ‘అరవింద సమేత..’ టీజర్‌ను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
ధోని క్లీన్ షేవ్.. ఫ్యాన్స్ రియాక్షన్..!
ఇంగ్లండ్ సిరీస్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తెల్ల గడ్డంతో కనిపించాడు. కానీ, వన్డే సిరీస్ అనంతరం ధోని క్లీన్ షేవ్‌తో ఉన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భారత స్పీనర్ అక్షర్ పటేల్ ధోనితో కలిసి దిగిన ఫొటోను తన ట్వీటర్ అకౌంట్లో పోస్టు చేశాడు. కానీ, ధోని తెల్లగడ్డం మాత్రం అభిమానులకు అంతగా నచ్చలేదని చెప్పవచ్చు. ఈ విషయంపై క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా ధోని గడ్డంపై మాట్లాడిన విషయం తెలిసిందే. అంతేకాక తెల్లగడ్డాన్ని తొలగించండి అని ఇటీవల సలహా ఇచ్చాడు గౌతమ్. టీ20, వన్డే సిరీస్ తర్వాత ధోని ఇండియాకు చేరుకున్నాడు. గతంలోనే ధోని టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చిన విషయం విదితమే. సెలక్షన్ కమిషన్ ఎంపిక చేసిన టెస్టు జట్టులో అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, శార్దూల్‌లకు స్థానం దక్కకపోవడంతో వారు కూడా ఇండియాకు వచ్చేశారు. ఈ సందర్భంగా యువ ఆటగాళ్లు ధోనితో కలిసి ఫొటోలు దిగారు. ఈ ఫొటోలో ధోని క్లీన్ షేవ్‌తో ఉన్నాడు. దీంతో అభిమానులు సంతోషంతో తెల్లగడ్డం తీసేశాడని కామెంట్స్ పెడుతున్నారు. గుడ్ లుక్.. నైస్ ఫోటో అని ఫ్యాన్స్ ఫొటోపై స్పందించారు. ఇటీవల ధోనికి సంబంధించిన రిటైర్మెంట్ ఊహగానాలకు తెరదీస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో హాల్చల్ చేసింది. Taking all the positivity and happiness shared with these beautiful people along with me. Adios England, until next time 👋 pic.twitter.com/boRrriKB0w — Akshar patel (@akshar2026) July 18, 2018 -
ఆట మధ్యలో మైదానంలోకి అభిమానులు
-
వైరల్: ఫిఫా ఫైనల్లో ఆసక్తికర సన్నివేశం!
మాస్కో : ఫిఫా తుది సమరం ఆద్యంతం ఆకసక్తికరంగా సాగింది. ఫ్రాన్స్-క్రోయేషియా మధ్య ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తొలి అర్థబాగం వరకు 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు ఓ వైపు గోల్స్ కోసం పోటీ పడుతుండగా.. మరోవైపు మ్యాచ్ 53వ నిమిషంలో ఓ నలుగురు అభిమానులు ఆకస్మాత్తుగా మైదానంలోకి దూసుకొచ్చారు. దీంతో కొద్దిసేపు ఆటకు అంతరాయం కలిగింది. అయితే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. మైదానమంతా పరుగెత్తారు. అంతటితో ఆగకుండా అభిమాన ఆటగాళ్లకు హైఫై ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం ఓ లేడీ అభిమానికి ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ ఎంబాపే హైఫై ఇచ్చిన పిక్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. అతనిపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఎంబాపే అక్రమంగా మైదానంలోకి వచ్చిన అభిమానికి హైఫై ఇస్తే.. క్రొయేషియా ఢిఫెండర్ డేజన్ లోవెరన్ ఆ ప్రేక్షకులను పట్టుకోని సెక్యూరిటి సిబ్బందికి అప్పగించాడు. ఎంబాపెను ప్రశంసిస్తున్న అభిమానులు.. డేజన్ లోవెరన్పై మండిపడుతున్నారు. ఇక మైదానంలోకి దూసుకొచ్చిన ఆ నలుగురు ఒకే డ్రెస్‌కోడ్ ధరించడం విషేశం. ఆ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: అదరగొడుతున్న వలస ఆటగాళ్లు! ‘నిద్రపోతున్న దిగ్గజం’ లేచేది ఎప్పుడు? అప్పుడు కెప్టెన్‌గా.. ఇప్పుడు కోచ్‌గా! Was this the best #WolrdCup final? Lots of goals, lots of craziness, both teams with plenty to be proud of, Mbappe high fiving a Pussy Riot pitch invader. A beautiful game. pic.twitter.com/MK91bZGpdJ — Lincoln Michel (@TheLincoln) July 15, 2018 Dejan Lovren X Pitch Invader X Mbappe. #CRO #WorldCup #FRA pic.twitter.com/BeAzJvv3CG — Clattenbeurg mesut (@hakemmesut) July 15, 2018 -
ట్రాఫిక్ సిగ్నల్‌పై హీరో సెటైర్.. వైరల్..
ట్రాఫిక్ సిగ్నల్‌పై హీరో నవదీప్ సెటైర్ వేశాడు. గత రాత్రి ఓ ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్ ఫొటోను తీశాడు. దాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. ‘స్టాప్ బ్లేమింగ్ మి ఫర్ నాట్ హవింగ్ ఎ డైరెక్షన్ ఇన్ లైఫ్’ అని పోస్టు చేశాడు. అంతేకాక ఓ పిక్‌ను కూడా జత చేశాడు. నవదీప్ పెట్టిన పిక్‌లో రెడ్‌లైట్ ఆన్‌లో ఉంది. దాంతోపాటు స్ట్రెయిట్, లెఫ్ట్ సిగ్నల్స్‌ను కూడా చూపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు కూడా సరదా కామెంట్స్ పెడుతున్నారు. ‘ఏ ప్రాంతం’ అని ఒకరు.. ‘భయంకరం’ అని మరొకరు సరదాగా ఆ ఫొటోపై స్పందించారు. -
ఎక్కడికి పోతారు సార్?
సాక్షి, చెన్నై: సింపుల్ గ్రే కలర్ షర్ట్, గ్రే కలర్ ప్యాంట్ వేసుకున్న ఓ వ్యక్తి. స్కూల్ గేట్ దాటి ముందుకు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ముందుకొచ్చిన విద్యార్థులు.. అతన్ని చుట్టు ముట్టేసి ఎటూ కదలనీయకుండా అడ్డుకున్నారు. మిమల్ని వెళ్లనివ్వం సార్.. అంటూ ఏడుపు అందుకున్నారు. అంతే వారిని చూసి అతను కూడా ఏడవటం ప్రారంభించాడు. తిరువల్లూర్‌లోని వెలైగారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోని దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 28 ఏళ్ల భగవాన్ ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు. 2014లో వెలైగారం ప్రభుత్వ పాఠశాలకు జీటీగా అతన్ని ప్రభుత్వం నియమించింది. ఈ నాలుగేళ్లలో అతనికి విద్యార్థులకు మధ్య మంచి బంధం ఏర్పడింది. అయితే ఈ మధ్య ఉద్యోగ బదిలీల్లో భాగంగా ప్రభుత్వం కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహించారు. స్టాఫ్ తక్కువగా ఉన్న తిరుత్తణి ప్రభుత్వ పాఠశాలకు అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు భగవాన్ను వదలకుండా పట్టుకుని అడ్డగించి ఏడవటం ప్రారంభించారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు మద్ధతుగా భగవాన్ను స్కూల్ వదలి వెళ్లకండని ప్రాధేయపడ్డారు. వారి ఆప్యాయతకు కరిగిన భగవాన్ కూడా కన్నీళ్లు కార్చాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు స్థానిక మీడియా ఛానెళ్లలో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. దీంతో అధికారుల్లో కూడా కదలిక వచ్చింది. అయితే ఏడుస్తున్న చిన్నారులను పక్కకు తీసుకెళ్లిన భగవాన్.. వారిని సముదాయించే యత్నం చేశాడు. తిరిగి కొన్నిరోజులకు మళ్లీ వస్తానని చెప్పటంతో వారు శాంతించారు. ‘పాఠశాలను సినిమా కథల్లాగా అతను బోధించేవాడు. పైగా వారి కుటుంబ సభ్యుల్లో ఒకడిగా భగవాన్ మెదిలేవాడు. అందుకే అతనితో వారికి అంత బంధం ఏర్పడింది. ఆయన బదిలీ వార్త తెలియగానే కొందరు విద్యార్థులు.. ఆ కోపాన్ని మాపై ప్రదర్శించారు. కానీ, మేమేం చేయలేమన్న విషయం వారికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో ఆ టైంలో మాకు తోచలేదు’ అని హెడ్ మాస్టర్ అరవింద్ మీడియాకు తెలిపారు. -
ఆటోలో మోదీ తల్లి.. అభాసుపాలైన మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఆటోలో ప్రయాణిస్తున్న ఫోటో ఒకటి ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. కేంద్ర మంత్రి విజయ్ సంపాలా తన ట్వీటర్లో ఆ ఫోటోను పోస్టు చేసి అభాసుపాలయ్యారు. ‘మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీగారి తల్లి ఇప్పటికీ ఆటోలోనే ప్రయాణిస్తున్నారు. కానీ, రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ ప్రపంచంలోనే ధనిక నేతల్లో నాలుగో స్థానంలో ఉన్నారు’ అంటూ ఆ ఫోటోను ఉంచారు. కానీ, ఆ ఫోటోలో నిశితంగా పరిశీలిస్తే హీరాబెన్ మోదీ కుడి మోచేతిని పట్టుకున్నట్లు ఓ చెయ్యి ఉంది. అది గమనించిన కొందరు అది మార్ఫింగ్ ఫోటో అంటూ కేంద్ర మంత్రిపై విమర్శలు గుప్పించారు. నాలుగేళ్ల క్రితం ఫోటోను మార్ఫ్ చేసి దానిని ఇప్పుడు ఈ విధంగా వైరల్ చేస్తున్నారంటూ కొందరు మండిపడుతున్నారు. ఒకవేళ మంత్రి చెప్పినట్లు ఆ ఫోటో నిజమే అయితే తల్లి బాగోగులు పట్టించుకునే పరిస్థితిలో మన ప్రధాని లేరేమో అంటూ ఇంకొందరు విమర్శిస్తున్నారు. మొత్తానికి కేంద్ర మంత్రి అత్యుత్సాహంతో పోస్టు చేసిన ఆ మార్ఫింగ్ ఫోటోపై తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. Our Beloved PM Shri @narendramodi 's Mother is still travelling in Auto, While @RahulGandhi 's Mother is the World's 4th Wealthiest Politician!#NarendraModi pic.twitter.com/HsLuTBYUaI — Vijay Sampla MoS (@vijay_sampla) 4 May 2018 -
ఎన్టీఆర్.. అది ఫేక్ అని తేల్చేశాడు
సాక్షి, సినిమా : యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు సంబంధించి తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జిమ్‌లో షర్ట్‌లెస్‌గా వర్కువుట్లు చేస్తున్న ఫోటో అది. అది అభిమానులు వావ్ అంటూ కామెంట్లు చేశారు. అయితే అది ఫేక్ అని తేల్చేశాడు తారక్ పర్సనల్ ట్రైనర్ ల్లాయిడ్ స్టీవెన్స్. ‘అది ఫేక్ ఫోటో.. ఎవరు క్రియేట్ చేశారోగానీ వారికి హ్యాట్సాఫ్’ అంటూ ల్లాయిడ్ ట్వీట్ చేశాడు. కాగా, కొన్నిరోజుల క్రితం తారక్ వర్కవుట్లతో కష్టపడుతున్న ఫోటో ఒకదానిని ల్లాయిడ్ పోస్ట్ చేసింది తెలిసిందే. ప్రస్తుతం రామారావు.. త్రివిక్రమ్ సినిమా కోసం షూటింగ్‌కు సిద్ధమవుతుండగా.. మరోవైపు రాజమౌళి తీయబోయే మల్టీస్టారర్ ప్రకటన వెలువడింది తెలిసిందే. Please kindly note this is a “FAKE” picture which someone has created ... hats off to their creativity though 😄 pic.twitter.com/KkYUKOjlvG — Lloyd Stevens (@lloydstevenspt) 23 March 2018 -
కోహ్లితో అభిమాని ఫొటో.. వైరల్ !
విరాట్ కోహ్లి-అనుష్కల వివాహం ఇటీవల చాలా హాట్ టాఫిక్ మారిన విషయం తెలిసిందే. సఫారీ పర్యటనకు బయలుదేరే ముందు కోహ్లి తనకు క్రికెట్‌పై ఉన్న ఇష్టాన్ని తెలిపారు. క్రికెట్ అంటే తనకు రక్తంతో సమానం అన్నారు. అంతేకాక పెళ్లి తనలో ఏ విధమైన మార్పు తేలేదని కోహ్లి అన్నారు. విరాట్ కేప్ టౌన్లో ప్రాక్టీస్ సెషన్ అనంతరం ఓ అభిమానితో కలిసి ఫొటో దిగారు. ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పెళ్లిలో అనుష్క విరాట్ కోహ్లి వేలికి ఉంగరం తొడిగింది. ఆ రింగ్‌ను మన కెప్టెన్ ఒక గొలుసుతో కలిపి మెడలో వేసుకున్నట్లు ఆ ఫొటోలో కనిపిస్తోంది. సఫారీ పర్యటనలో టీమిండియా మూడు టెస్టు మ్యాచ్‌లు, 6 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. రేపు (జనవరి 5న) కేప్ టౌన్ లో తొలి టెస్టు ప్రారంభకానున్న విషయం తెలిసిందే. -
బీజేపీ అభ్యర్థి వ్యక్తిగత చిత్రాలు వైరల్
సాక్షి, ఛండీగఢ్ : పంజాబ్‌లోని గురదాస్‌పూర్ నియోజక వర్గ ఉపఎన్నిక బీజేపీ అభ్యర్ధి స్వరణ్ సలారియా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఓ మహిళ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి 32 ఏళ్లు లైంగికంగా అనుభవించాడంటూ అత్యాచారం కేసు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆ మహిళతో స్వరణ్ సలారియా సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. వెంటనే స్వరణ్ సలారియా నామినేషన్ రద్దు చేయాలని జాతీయ ఎలక్షన్ కమిషన్‌ను కోరింది. కాగా నటుడు వినోద్ ఖన్నా మరణంతో ఖాళీ అయిన గురుదాస్‌పూర్ నియోజక వర్గానికి ఎన్నికల సంఘం అక్టోబర్ 11 ఉప ఎన్నిక నిర్వహించబోతుంది. మరో ఆరురోజుల్లో ఎన్నికలు ఉండగా ఈ ఫోటోలు వైరల్ అవ్వడం బీజేపీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. -
సాక్షి కథనాలతో ఉలిక్కిపడ్డ టీడీపి
-
నెట్‌ను కుదిపేస్తున్న మిషెల్లీ ఫొటో!
ఆమె అందరినీ ప్రేమిస్తుంది. ఆమెను అందరూ ప్రేమిస్తారు.. ఆమె ఎవరంటే అమెరికా ప్రథమ పౌరురాలు.. ఫ్లోటస్ మిషెల్లీ ఒబామా. ఆమె ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. వాషింగ్టన్లో ఆఫ్రికన్-అమెరికన్ చరిత్ర, సంస్కృతి జాతీయ మ్యూజియం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ అరుదైన కలయిక తటస్థించింది. ఈ సందర్భంగా మిషెల్లీ బుష్‌ను ఆలింగనం చేసుకుంటున్న ఫొటో సహజంగానే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. అమెరికా చరిత్రలో నల్లజాతీయుల ప్రాధాన్యాన్ని వివరిస్తూ సాగిన ఈ కార్యక్రమంలో బుష్, ఒబామా సైతం ఒకే ధోరణిలో ప్రసంగించారు. ఒక దేశ చరిత్రలోని వాస్తవాలను మరుగన పరచడం సరికాదని, అమెరికా చరిత్రలో నల్లజాతీయుల ప్రాధాన్యాన్ని గుర్తించాలని వారు పేర్కొన్నారు. వారి ప్రసంగం ఎలా ఉన్నా నెటిజన్ల దృష్టి మాత్రం మిషెల్లీ-బుష్ ఫొటోపై పెట్టారు. ఈ ఫొటోపై చిత్రవిచిత్రమైన వ్యాఖ్యలు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. పోస్టులు పెట్టారు. తమ ఫొటోషాప్ పైత్యమంతా ఈ ఫొటోపై చూపించారు. వారి విన్యాసాలు కావాలంటే మీరు కూడా చూడొచ్చు. -
ఆ ఒక్క ఫొటోను హైలైట్ చేశారు : సీఎం
మధ్యప్రదేశ్‌లో వరదలు సంభవించిన నేపథ్యంలో పలు గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర విమర్శలపాలయ్యారు. సోషల్ మీడియా వెబ్ సైట్లు ట్విట్టర్, ఫేస్ బుక్ లలో కూడా ఆయనపై కొంతమంది తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిబ్బంది మోస్తుండగా శివరాజ్ దర్జాగా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు కనిపించే ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆయనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ విమర్శలపై ఎట్టకేలకు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. రాష్ట్రంలో వరదలు సంభవించిన పలు ప్రాంతాలలో తాను పర్యటించి అక్కడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. అయితే కేవలం ఓ ప్రాంతంలో తప్పనిసరి పరిస్థితులలో సిబ్బంది తమ చేతులతో తనను మోయాల్సి వచ్చిందన్నారు. కేవలం ఇలాంటి ఒక్క ఫొటో దొరికిందన్న కారణంగా తనను విమర్శించడం తగదని సూచించారు. బ్రిటన్ ప్రధానిగా ఉన్నప్పుడు డేవిడ్ కామెరాన్ స్వయంగా నడిచి వెళ్లి వరద ప్రాంతాల్లోని బాధితులను పరామర్శించారని శివరాజ్ నుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. సీఎం స్థాయి వ్యక్తి ఇలా చేయడం సమంజసమేనా అని మరికొందరు నేరుగా శివరాజ్ చర్యను తప్పుపడుతున్నారు. మీరు కేవలం ఈ ఒక్క ఫొటోను చూసి తనను అంచనా వేయకూడదన్నారు.