RGV Interview With Ashu Reddy For Danger Movie Promotion - Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: బిగ్‌బాస్‌ బ్యూటీ కాళ్లు పట్టుకున్న ఆర్జీవీ!

Published Wed, Dec 7 2022 10:33 AM | Last Updated on Thu, Dec 8 2022 4:11 PM

Ram Gopal Varma Interview With Ashu Reddy For Danger Movie Promotion - Sakshi

బిగ్‌బాస్ ఫేం అషురెడ్డి మరోసారి వార్తల్లో నిలిచింది. తరచూ తన బోల్డ్‌ ఫొటో షూట్‌ను షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ ఉంటుంది అషు. అయితే బిగ్‌బాస్‌ అనంతరం ఆ మధ్య ఆర్జీవీతో బోల్డ్‌ ఇంటర్య్వూతో నెట్టింట ట్రెండ్‌ అయిన ఆమె మరోసారి ఆర్జీవీ కారణంగానే వార్తల్లోకెక్కింది. ఇక  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంశమైన తనదైన శైలిలో స్పందించి వివాదానికి తెరలేపుతాడు.

ఇక ఆయన సినిమాలు, ప్రమోషన్స్‌ ఎలా ఉంటాయనేది తెలిసిందే. తాజాగా వర్మ తెరకెక్కించిన మూవీ ‘డేంజరస్‌’. బోల్డ్‌ కంటెంట్‌తో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్‌ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. లెస్బియన్ రొమాన్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నైనా గంగూలీ, అప్సర రాణిలు ప్రధాన పాత్రాలు పోషించారు. మూవీ రిలీజ్‌ దగ్గరపడుతుండటంతో తనదైన స్టైల్లో ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేశాడు.

ఇందుకోసం బోల్డ్‌ బ్యూటీ అషురెడ్డితో వర్మ జతకట్టాడు. డేంజర్‌ సినిమా ప్రమోషన్స్‌ కోసం అషుతో ఓ ఇంటర్య్వూ ప్లాన్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇంటర్య్వూలో అషురెడ్డి సోఫాలో కూర్చుని ఉండగా వర్మ కింద కూర్చుని ఆమె కాలు పట్టుకున్న ఫొటోను అషు తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతున్నాయి. ‘ఫేం కోసం ఇంత దిగజారాల’, ‘ఈసారి ఎలాంటి వివాదానికి తెరలేపుతున్నారు సార్‌’ అంటూ నెటిజన్లు ఈ పోస్ట్‌పై రకరకాలుగా స్పందిస్తున్నారు.

చదవండి: 
వెంకటేశ్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌, థియేటర్లో వచ్చేస్తున్న నారప్ప
హీరోయిన్‌ అయితే అలాంటి పాత్రలు చేయొద్దా?: ట్రోలర్స్‌కు మృణాల్‌ ఘాటు రిప్లై

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement