Dangarous
-
అభిమానిగానే చిరంజీవికి ఆనాడు విజ్ఞప్తి చేశా: వర్మ క్లారిటీ
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన తాజా చిత్రం ‘డేంజరస్’ (తెలుగులో నా ఇష్టం) మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయనకు గతంలో మెగాస్టార్ చిరంజీవిపై చేసిన ఓ సటైరికల్ ట్వీట్‌పై ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆర్జీవీ స్పందిస్తూ ఓ అభిమానిగ మాత్రమే తాను ఆ ట్వీట్ చేశానని స్పష్టం చేశారు. అలాగే తాను ఓ సామన్యుడిలానే అభిప్రాయం వ్యక్తం చేస్తుంటానని, ట్విటర్ ఉంది అందుకే అన్నారు. సమస్యను దృష్టిలో పెట్టుకునే ట్వీట్ చేస్తానని, వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయనని తెలిపారు. అలాగే తాను చిరంజీవి కుటుంబంపై ఎప్పుడు ఒక్క సటైర్ కూడా వేయలేదని అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘‘అప్పట్లో చిరంజీవి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇందుకు ఏ సినిమా చేస్తారనేది చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో నేను ఆయనను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాను. చిరంజీవి గారు బాహుబలి లాంటి పెద్ద సినిమా చేయాలని. ఆయన పెద్ద స్టార్ కాబట్టి చిన్న సినిమా కాకుండ పెద్ద సినిమా తీయాలని అడిగా. అది నేను ఓ అభిమానిగా విజ్ఞప్తి చేశాను. అందులో సటైర్ ఏముంది’’ అని వర్మ వివరణ ఇచ్చారు. కాగా వర్మ తెరకెక్కించిన డేంజరస్ మూవీ డిసెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. చదవండి: బిగ్‌బాస్ బ్యూటీ కాళ్లు పట్టుకున్న ఆర్జీవీ! తొలిసారి కాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన కీర్తి సురేశ్ -
బిగ్‌బాస్ బ్యూటీ కాళ్లు పట్టుకున్న ఆర్జీవీ!
బిగ్‌బాస్ ఫేం అషురెడ్డి మరోసారి వార్తల్లో నిలిచింది. తరచూ తన బోల్డ్ ఫొటో షూట్‌ను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుంది అషు. అయితే బిగ్‌బాస్ అనంతరం ఆ మధ్య ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్య్వూతో నెట్టింట ట్రెండ్ అయిన ఆమె మరోసారి ఆర్జీవీ కారణంగానే వార్తల్లోకెక్కింది. ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంశమైన తనదైన శైలిలో స్పందించి వివాదానికి తెరలేపుతాడు. ఇక ఆయన సినిమాలు, ప్రమోషన్స్ ఎలా ఉంటాయనేది తెలిసిందే. తాజాగా వర్మ తెరకెక్కించిన మూవీ ‘డేంజరస్’. బోల్డ్ కంటెంట్‌తో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. లెస్బియన్ రొమాన్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నైనా గంగూలీ, అప్సర రాణిలు ప్రధాన పాత్రాలు పోషించారు. మూవీ రిలీజ్ దగ్గరపడుతుండటంతో తనదైన స్టైల్లో ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు. ఇందుకోసం బోల్డ్ బ్యూటీ అషురెడ్డితో వర్మ జతకట్టాడు. డేంజర్ సినిమా ప్రమోషన్స్ కోసం అషుతో ఓ ఇంటర్య్వూ ప్లాన్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంటర్య్వూలో అషురెడ్డి సోఫాలో కూర్చుని ఉండగా వర్మ కింద కూర్చుని ఆమె కాలు పట్టుకున్న ఫొటోను అషు తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ‘ఫేం కోసం ఇంత దిగజారాల’, ‘ఈసారి ఎలాంటి వివాదానికి తెరలేపుతున్నారు సార్’ అంటూ నెటిజన్లు ఈ పోస్ట్‌పై రకరకాలుగా స్పందిస్తున్నారు. View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) చదవండి: వెంకటేశ్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్, థియేటర్లో వచ్చేస్తున్న నారప్ప హీరోయిన్ అయితే అలాంటి పాత్రలు చేయొద్దా?: ట్రోలర్స్‌కు మృణాల్ ఘాటు రిప్లై -
రామ్ గోపాల్ వర్మకు చేదు అనుభవం, స్పందించిన ఆర్జీవీ
Ram Gopal Varma Slams PVR, INOX: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన తాజా చిత్రం డేంజరస్ ఏప్రిల్ 8న దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ అవ్వబోతుంది. ఈ నేపథ్యంలో తన మూవీని ప్రదర్శించేందుకు పీవీఆర్, ఐనాక్స్ థియేటర్లు అభ్యంతరం వ్యకం చేశాయి. డేంజరస్ చిత్రాన్ని తమ థియేటర్లో ప్రదర్శించబోమంటూ వర్మకు షాకిచ్చాయి. ఈ విషయాన్ని స్యయంగా ఆర్జీవీ సోషల్ మీడియా వేదిక వెల్లడించాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. పీవీఆర్, ఐనాక్స్ డెంజరస్ సినిమాను ప్రదర్శించడానికి నిరాకరించినట్లు తెలిపాడు. అంతేకాదు ఈ మూవీ పట్ల వారు వ్యవహరించిన తీరు సుప్రీం కోర్టు తీర్పునే వ్యతిరేకించేలా ఉందన్నాడు. చదవండి: రామ్ చరణ్‌కి జోడిగా అంజలి!, ఏ సినిమాలో అంటే.. కాగా ‘నా సినిమా డేంజరస్ లెస్బియన్ కథాంశం అని దాన్ని ప్రదర్శించడానికి నిరాకరించడం సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకించడమే. సెన్సార్ బోర్డు ఆమోదించిన తర్వాత కూడా వ్యతిరేకించడం ఎల్జీబీటీ(LGBT) కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఉన్నట్టే. అంటే పీవీఆర్, ఐనాక్స్ యాజమాన్యాలు ఎల్జీబీటీని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ కమ్యూనిటీ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ వారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారని ఆశిస్తున్నా’ అంటూ వర్మ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వివాదం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. మరి వర్మ ట్వీట్‌పై పీవీఆర్, ఐనాక్స్ యాజమాన్యాలు ఏవిధంగా స్పందిస్తాయో చూడాలి. కాగా ఇద్దరు యువుతుల మధ్య స్వలింగ సంపర్కం నేపథ్యంలో వర్మ డేంజరస్ చిత్రాన్ని రూపొందించాడు. చదవండి: చైతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సమంత.. పోస్ట్ వైరల్ -
దినదిన గండం
పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసిత గ్రామాలతో పాటు గోదావరి నది ఒడ్డున ఉన్న గ్రామాల ప్రజలను ముంపు భయం వెంటాడుతోంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా గోదావరి నదిలో పలుచోట్ల అడ్డుకట్టలు వేయడమే ఇందుకు కారణం. ఈ ఏడాది వరదొస్తే తమ పరిస్థితి ఏంటని 19 నిర్వాసిత గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నీటిమట్టం పెరిగిందని, స్టోరేజ్ ఉందని నిర్వాసితులు చెబుతున్నారు. ప్రహసనం.. పునరావాసం : 2019 జూన్ నాటికి కాఫర్‌డ్యామ్ నిర్మించి గ్రా విటీ ద్వారా నీటిని విడుదల చేస్తామని, నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని గత టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే కాఫర్‌డ్యామ్ నిర్మాణ పనులు పూర్తికాలే దు. అలాగే స్పిల్‌వే పనులు కూడా నెమ్మదిగా సాగుతున్నాయి. పోలవరం మండలంలో రెండో విడత 19 గ్రామాల్లో 3,300 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. వీరికి ఇప్పటివరకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు కాలేదు. పునరావాస గ్రామాల్లో నిర్వాసితులకు గృహనిర్మాణాలు పూర్తి కాలేదు. పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, గోపాలపురం మండలాల్లో గృహనిర్మాణ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. జూన్ నాటికి గృహనిర్మాణాలు పూర్తిచేసి నిర్వాసితులను తరలించకపోవడంతో పాత గ్రామాల్లోనే నిర్వాసితులు ఉంటున్నారు. వరదలు వస్తే ఆయా గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గం వరద ముంపునకు గురవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి పోలవరం రావాలంటే తా మంతా నానా అవస్థలు పడాల్సిన పరిస్థితులు ఉంటాయని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. మార్గాలున్నాయి వరదలు వచ్చినా కాఫర్‌డ్యామ్ పైనుంచి దిగువకు యథావిధిగా వరదనీరు వెళుతుందని, మరోవైపు స్పిల్‌వే మీదుగా కూడా వరదనీరు వెళ్లేందుకు మార్గం ఏర్పాటు చేస్తామని, ఎప్పటికప్పుడు నీరు దిగువకు వెళ్లిపోవడం వల్ల పెద్దగా ముంపు ఉండే అవకాశాలు తక్కువ అని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. రాకపోకలకూ ఇబ్బందే.. వరదలు వస్తే పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో కాఫర్‌డ్యామ్ నిర్మాణం వల్ల ఎగువన ఉన్న చీడూరు గ్రామం ముంపునకు గురయ్యే పరిస్థితి ఉంది. మా ఊరికి చెందిన నిర్వాసితులకు పునరావాసంలో భాగంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులు పూర్తికాలేదు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు చేయలేదు. వరదలు వస్తే ఏం చేయాలో తెలియని పరిస్థితి. రోడ్డు మార్గం పూర్తిగా వరద ముంపునకు గురవుతుంది. రాకపోకలు సాగే పరిస్థితి ఉండదు. దీంతో ఇబ్బందులు తప్పవు. – మామిడి సురేష్‌రెడ్డి, చీడూరు గోదావరి నీటి మట్టం పెరిగింది జూన్ నాటికి ఇళ్ల నిర్మాణ పనులు పూర్తిచేసి పునరావాస కేంద్రాలకు తరలిస్తామని అధికారులు చెప్పారు. ఇప్పటివరకూ ఇళ్ల నిర్మాణాలు పూర్తికాలేదు. గోదావరికి వరదల సమయం వచ్చేసింది. వరదలు వస్తే మా గ్రామాలు ముంపునకు గురవుతాయనే భయం వెంటాడుతోంది. మా గ్రామాలకు రోడ్డు మార్గాలు కూడా ఉండవు. ఇప్పటికే గోదావరి నీటిమట్టం కూడా పెరిగింది. – ఇండెల రామ్‌గోపాల్‌రెడ్డి, కొరుటూరు -
ప్రయోగం ప్రాణం మీదకు వచ్చే..
నడిమిచెర్ల(కలకడ): బాలుడి ప్రయోగం వికటించి–తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలైన సంఘటన కలకడ మండలం నడిమిచెర్ల గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి . జింకల.క్రిష్ణయ్య, సరస్వతిల కుమారుడు గణేష్ స్థానిక జిల్లాపరిషత్ఉన్నతపాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఇతనికి చిన్నతనం నుంచి ప్రతి పనిలో ప్రయోగాలు ఎక్కువగా చేసేవాడు. వేసవి సెలవుల్లో ఇంటివద్ద ఉండి ప్రయోగాలలో బాగంగా శుక్రవారం ఉదయం టపాకాయల నుంచి నల్లమందును సేకరించి, పాకెట్లు చేసి అందులో వత్తిని ఏర్పాటు చేశాడు. ఆ వత్తికి నిప్పుపెట్టి ఆకాశంలోకి వదులుతున్నట్లు తన మిత్రులకు తెలియజేశారు. అయితే అంతలో నిప్పు అంటించిన నల్లమందు ఒక్క సారిగా చేతిలోనే పేలిపోయింది. దీంతో పెద్ద శబ్దం వచ్చి విద్యార్థి కిందపడిపోయాడు. ఆశబ్దానికి వీధిలోకి వచ్చిన పెద్దలకు చిన్నారి గణేష్ కుడి చెయ్యి నుంచి రక్తం అధికంగా రావడం గమనించి అదుపు చేయడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆనొప్పికి చేతిని విదిలించగా గాయపడ్డ కుడి చేతిలోని మూడు వేళ్ళు వీధిలోనే రాలిపోయాయి. వెంటనే ద్విచక్రవాహణంలో మదనపల్లెకు తరలించారు. ఇక్కడ బాంబులు తయారు చేస్తున్నట్లు పోలీసులు సైతం అక్కడికి చేరుకున్నారు. అక్కడ విచారించగా బాంబులు కాదని చిన్నారి ప్రయోగం వికటించిందని తెలియజేయడంతో చిన్నారులు ఆటలు ఆడుకోవడం తప్పు కాదని, అయితే తెలియని ప్రయోగాలతో ప్రమాదాలు కొని తెచ్చుకోవడం మంచిది కాదని హితవు పలికారు. చిన్నారులు చేసే పనులు పెద్దలు గమనించాలని కోరారు. ఈకార్యక్రమంలో పోలీసులు, స్థానికులు పాల్గొన్నారు.