డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన తాజా చిత్రం ‘డేంజరస్’ (తెలుగులో నా ఇష్టం) మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయనకు గతంలో మెగాస్టార్ చిరంజీవిపై చేసిన ఓ సటైరికల్ ట్వీట్‌పై ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆర్జీవీ స్పందిస్తూ ఓ అభిమానిగ మాత్రమే తాను ఆ ట్వీట్ చేశానని స్పష్టం చేశారు. అలాగే తాను ఓ సామన్యుడిలానే అభిప్రాయం వ్యక్తం చేస్తుంటానని, ట్విటర్ ఉంది అందుకే అన్నారు. సమస్యను దృష్టిలో పెట్టుకునే ట్వీట్ చేస్తానని, వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయనని తెలిపారు.
అలాగే తాను చిరంజీవి కుటుంబంపై ఎప్పుడు ఒక్క సటైర్ కూడా వేయలేదని అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘‘అప్పట్లో చిరంజీవి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇందుకు ఏ సినిమా చేస్తారనేది చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో నేను ఆయనను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాను. చిరంజీవి గారు బాహుబలి లాంటి పెద్ద సినిమా చేయాలని. ఆయన పెద్ద స్టార్ కాబట్టి చిన్న సినిమా కాకుండ పెద్ద సినిమా తీయాలని అడిగా. అది నేను ఓ అభిమానిగా విజ్ఞప్తి చేశాను. అందులో సటైర్ ఏముంది’’ అని వర్మ వివరణ ఇచ్చారు. కాగా వర్మ తెరకెక్కించిన డేంజరస్ మూవీ డిసెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
చదవండి:
బిగ్‌బాస్ బ్యూటీ కాళ్లు పట్టుకున్న ఆర్జీవీ!
తొలిసారి కాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన కీర్తి సురేశ్
Comments
Please login to add a commentAdd a comment