ప్రతి రెస్టారెంట్ మెనూలో కామన్‌గా కనిపించే ఐటమ్.. బర్గర్. చికెన్, మటన్, వెజిటబుల్.. భిన్న రుచుల్లో, నచ్చిన వెరైటీలో దొరుకుతుంది. సాధారణంగా బర్గర్లను ట్రేలలో సర్వ్ చేస్తారు. అదే ట్రేలో సైడ్ డిషెస్‌గా చిప్స్ కానీ, ఫ్రైస్ కానీ ఉంటాయి. ఇది రొటీన్. కానీ వెరైటీగా ట్రై చేద్దామనుకున్నారో ఏమో రెడిట్ రెస్టారెంట్ వాళ్లు బర్గర్‌ను చక్కగా ఒక గ్లాస్‌లో సర్దేశారండీ!! దీనికి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ ఫోటోలో మొత్తం బర్గర్ అంతా ఒక గ్లాస్‌లో స్టఫ్ చేసి ఉండటం మనం చూడొచ్చు. బర్గర్ తయారీకి ఉపయోగించే పదార్థాలు అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ దానిని పేర్చిన విధానం మాత్రం వింతగా ఉంది. గ్లాస్ అడుగుభాగంలో బ్రెడ్ ముక్కలు పేర్చి, ఆపైన చీజ్ సాస్‌లతో వెజిబటుల్స్‌ను అమర్చారు. ఇదే పద్ధతిని గ్లాస్ పై భాగం వరకు అనుసరించారు. అన్నింటికంటే పైన నువ్వులతో ఉన్న బ్రెడ్‌ను పెట్టారు. (చదవండి: రికార్డుల్లోకి బర్గర్.. ధర ఏకంగా రూ. 4.5 లక్షలు, ఎందుకంత ఖరీదు?)
ఇక్కడ బర్గర్‌ని వెరైటీగా సర్వ్ చేస్తుండటంతో కస్టమర్లు సదరు రెస్టారెంట్‌కు క్యూ కట్టారు. ఇలా గ్లాస్‌లో బర్గర్‌ని సర్వ్ చేస్తే ఎలా తినాలని కొందరు కస్టమర్లు ప్రశ్నించగా.. మరికొందరు మామూలు పద్ధతిలో ఎందుకు సర్వ్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా బాగానే ఉందని ఇంకొందరు కామెంట్ చేశారు. తినడం సంగతి ఎలా ఉన్నా ఫోటోతో ఈ బర్గర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment