Glass
-
నేను అద్దాల మేడ కట్టుకోలేదు
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘నేను అద్దాల మేడ(శీష్ మహల్) కట్టుకోలేదు. కానీ, పదేళ్లలో నాలుగు కోట్ల మందిపైగా పేదల సొంతింటి కల నెరవేర్చాను. వారికి ఇళ్లు నిర్మించి ఇచ్చాను’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తన కోసం విలాసవంతమైనæభవనం కాకుండా పేదలకు శాశ్వత నివాసం ఉండాలన్నదే తన స్వప్నం అని వివరించారు. ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ కేజ్రీవాల్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ శుక్రవారం ఢిల్లీలో పర్యటించారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అశోక్ విహార్‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం నిర్మించిన 1,675 ఇళ్లను ప్రారంభించారు. లబ్దిదారులకు ఇంటి తాళాలు అందజేశారు. వారితో ముచ్చటించారు. నౌరోజీ నగర్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్, సరోజినీ నగర్లో జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ (జీపీఆర్ఏ)టైప్–2 క్వార్టర్స్ ప్రాజెక్టులను ప్రారంభించారు. ద్వారకలో రూ.300 కోట్లతో నిర్మించిన సీబీఎస్ఈ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ఢిల్లీ యూనివర్సిటీలో రూ.600 కోట్ల విలువైన మూడు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్)పై నిప్పులు చెరిగారు. అది ఆప్ కాదు, ఆపద అంటూ మండిపడ్డారు. ప్రధానమంత్రి ఏం మాట్లాడారంటే... ఢిల్లీని ఆపదలో పడేశారు ‘‘మోదీ ఎప్పుడూ తన కోసం ఇల్లు నిర్మించుకోలేదన్న విషయం దేశానికి తెలుసు. గడచిన పదేళ్లలో నాలుగు కోట్ల కంటే ఎక్కువగా ఇళ్లు నిర్మించి పేదల కలను సాకారం చేశాం. నేను కూడా శీష్ మహల్(అద్దాల మేడ) నిర్మించుకొనేవాడినే. కానీ, అది నాకు ఇష్టం లేదు. నా దేశ ప్రజలకు పక్కా ఇళ్లు ఉండాలన్నదే నా కల. కొందరు వ్యక్తులు(కేజ్రీవాల్) అబద్ధపు ప్రమాణాలు చేసి ప్రజల సొమ్ముతో అద్దాల మేడలు నిర్మించుకున్నారు. గత పదేళ్లలో ఢిల్లీ పెద్ద ఆపదలో పడిపోయింది. అన్నా హజారేను ముందు పెట్టి పోరాటాలు చేసిన కొందరు కరడుగట్టిన అవినీతిపరులు ఢిల్లీని ఆపదలో పడేశారు. మద్యం, పాఠశాలలు, వైద్య చికిత్స, కాలుష్య నియంత్రణ, ఉద్యోగ నియామకాల్లో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. వీళ్లా ఢిల్లీ అభివృద్ధి గురించి మాట్లాడేది? ముంచుకొచ్చిన ఆపదకు వ్యతిరేకంగా ఢిల్లీ ప్రజలు యుద్ధం చేయాలి. ఆపద నుంచి విముక్తి పొందాలని ఢిల్లీ ప్రజలు సంకల్పించారు. ఆదపను సహించం.. మార్చి చూపిస్తాం అని ఢిల్లీలోని ప్రతి గల్లీలో ప్రతి ఒక్కరూ అంటున్నారు. యమునా నది శుద్ధి చేస్తే ఓట్లు పడవని అంటున్నారు. ఓట్ల కోసం యమునను వదిలేస్తామా? యమునను శుద్ధి చేయకపోతే ఢిల్లీ ప్రజలకు తాగునీరు ఎలా వస్తుంది? అవినీతిపరుల కారణంగా ప్రజలకు కలుషితమైన నీరు అందుతోంది. ఈ ఆపద తెచ్చిపెట్టిన వ్యక్తులు ఢిల్లీ ప్రజల జీవితాలను వాటర్ ట్యాంకర్ల మాఫియాకు వదిలేశారు. ఈ ఆపద ఇలాగే కొనసాగితే మరిన్ని కష్టాలు తప్పవు. ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకుండా వాళ్లు అడ్డుకుంటున్నారు. ఈ ప«థకం కింద ప్రజలకు ప్రయోజనం అందకపోవడానికి కారణం ఆ వ్యక్తులే. ప్రజల జీవితాల కంటే తమ స్వార్థం, విజయం, అహంకారమే ప్రధానంగా భావిస్తున్నారు. జాతీయ పథకాల ప్రయోజనాలు ఢిల్లీ ప్రజలకు చేరేలా చేయడమే మా లక్ష్యం. ఆపద నుంచి తప్పించుకోవాంటే బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. -
సౌత్ గ్లాస్ కంపెనీపై కేసు
షాద్‌నగర్ (హైదరాబాద్): రంగారెడ్డి జిల్లా బూర్గులలోని సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో శుక్రవారం జరిగిన పేలుడు ఘటనపై షాద్‌నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈమేరకు పరిశ్రమ యాజమాన్యంపై 304, 336, 337, 338, 287 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు షాద్‌నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డి తెలిపారు. మరోవైపు పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై హైదరాబాద్‌కు చెందిన సీనియర్ న్యాయవాది ఇమ్మనేని రామారామా జాతీయ మానవహక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. పరిశ్రమ యాజమాన్యం, రాష్ట్ర పరిశ్రమల డైరెక్టర్‌పై చర్యకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, పేలుడు ఘటనపై నిష్ణాతులైన పోలీసు క్లూస్‌టీం పేలుడు సంభవించిన ప్రాంతంలో ఆధారాలను సేకరించి ల్యాబ్‌కు పంపించింది. ల్యాబ్ నివేదిక వచి్చన వెంటనే పోలీస్ స్టేషన్‌కు పంపిస్తామని క్లూస్ టీం సభ్యులు తెలిపారు. -
గ్లాస్ తయారీ పరిశ్రమలో ఘోర ప్రమాదం
షాద్‌నగర్: గ్లాస్ తయారీ పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, 13 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని బూర్గుల గ్రామశివారులో వాహనాలకు సంబంధించిన గ్లాస్ అద్దాలను తయారుచేసే సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమలో వివిధ రాష్ట్రాలకు చెందిన 200 మంది కార్మికులు పని చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం పరిశ్రమలోని ఆటో క్లేవ్ యూనిట్లో అద్దాలను గ్యాస్, వేడితో అతికించి, బాయిలర్ నుంచి బయటకు తీసే క్రమంలో ప్రమాదం జరిగింది.ప్రమాద సమయంలో ఆటో క్లేవ్ యూనిట్ వద్ద ఐదుగురు కార్మికులు పనిచేస్తున్నారు. యూనిట్లో తయారైన గ్లాస్‌ను బయటకు తీసే క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో కార్మికులు తీవ్రంగా గాయపడి మృత్యువాత పడ్డారు. ఈ పేలుడుతో మృతుల శరీరభాగాలు చెల్లాచెదురుగా సుమారు వంద మీటర్ల దూరం వరకు ఎగిరి పడ్డాయి. ఓ కార్మికుడి మృతదేహం పరిశ్రమ షెడ్డు రేకులను చీల్చుకొని బయటకు ఎగిరిపడింది. మరో కార్మికుడి మృతదేహం పూర్తిగా యంత్రంలో ఇరుక్కుపోయింది. ముగ్గురి మృతదేహాలు ఏమాత్రం గుర్తుపట్టలేని విధంగా సుమారు వంద మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి.శరీరాల నుంచి కాళ్లు, చేతులు, తల, తదితర భాగాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. మృతి చెందినవారిలో బిహార్ రాష్ట్రానికి చెందిన చిత్తరంజన్ (25), రాంఆశిష్ (18), రవుకాంత్ (25), రోషన్ (36), రతన్ దేవరియా (30) ఉన్నారు. వీరితోపాటు బిహార్‌కు చెందిన గోవింద్, మంటు, సమీద్కుమార్, రోషన్‌కుమార్, సురేంద్ర పాశ్వాన్, జార్ఖండ్‌కు చెందిన మైకేల్ ఎంబ్రామ్, కార్తీక్, సు¿ోద్, బూర్గుల గ్రామానికి చెందిన పుల్లని సుజాత, కాశిరెడ్డిగూడకు చెందిన నీలమ్మ, మమత, ఒడిశాకు చెందిన రేతికాంత్, రాజేశ్‌లు తీవ్రంగా గాయపడినట్టు అధికారులు తెలిపారు. కేటీఆర్ దిగ్భ్రాంతిబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా బాధిత కుటుంబాలకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని అన్ని కర్మాగారాల్లో భద్రత తీరుపై పరిశీలన చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు: హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పలు పరిశ్రమల్లో ప్రమా దాలు జరుగుతున్నాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పరిశ్రమల్లో వరుసగా ప్రమా దాలు జరుగుతున్నా, భద్రతా చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందన్నారు.ప్రమాద ఘటనపై సీఎం ఆరా ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. ఢిల్లీలో ఉన్న ఆయన వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి తగిన వైద్య చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు, అగి్నమాపక శాఖ, కార్మిక, పరిశ్రమల శాఖ అధికారులు, వైద్య బృందాలు ఘటనాస్థలిలోనే ఉండి సమన్వయంతో సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. దీంతో కలెక్టర్ శశాంక, శంషాబాద్ డీసీపీ రాజేష్, అడిషనల్ డీసీపీ రాంకుమార్, ఆర్డీఓ వెంకటమాధవరావులు ఘటనా స్ధలాన్ని సందర్శించి సహాయక చర్యలు చేపట్టారు. -
వెదురు సారంతో కొరియన్ గ్లాస్ చర్మం..!
కొరియన్ చర్మానికి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. పైగా అందుకు సంబంధించిన బ్యూటీ ప్రొడక్ట్స్ మార్కెట్లోకి ఇబ్బడి ముబ్బడిగా వచ్చేస్తున్నాయి కూడా. అయితే అవన్నీ ఆ బ్రాండ్లకు తగ్గ రేంజ్ ధరల్లోనే ఉంటాయనేది తెలిసిందే. అలా కాకుండా మనకున్న అందుబాటులోని వనరులతో కూడా కొరియన్ గ్లాస్ చర్మాన్ని పొందొచ్చు. అదెలాగో చూద్దామా..!వెదుర రసంతో కొరియన్ల లాంటి గ్లాస్ సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. చక్కగా వారిలా ప్రకాశవంతమైన మచ్చలేని చర్మాన్ని సొంతం చేసుకోవచ్చట. వెదురు సారం ముఖాన్ని కాంతివంతంగా ఉండేలా చేస్తుందట. ఇందులో ఉండే సిలికాన్ కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించే ఖనిజంలా పనిచేస్తుంది. చర్మాన్ని దృఢంగా, మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్ది వచ్చే సిలికా స్థాయిలు తగ్గుతాయి.ముడతలు వచ్చి చర్మం ఆకృతి మారిపోయి, వృధాప్య సంకేచ్చేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాంటివి రాకూడదంటే చర్మ సంరక్షణలో భాగంగా వెదురు సారాన్ని ముఖానికి అప్లై చేస్తే సిలికా స్థాయిలు పెరగడమే గాక యవ్వనవంతమైన మెరిసే చర్మ మీ సొంతం అవుతుంది. దీనిలో ఉండే హైడ్రేటింగ్, మాయిశ్చరైజింగ్ కారకాలు చర్మాన్ని బొద్దుగా , మృదువుగా చేస్తాయి. ఇందులో అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది చర్మంలోని తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. చర్మాన్ని ముడతలు, గీతలు వంటివి పడకుండా ఉండేలా రిపేర్ చేస్తుంది. పొడి చర్మం వారికి ఈ వెదురుసారం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే చర్మంపై ఉండే మంట, చికాకులను దూరం చేస్తుంది. వెదురుసారం శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలను కలిగి ఉంది. అకాల వృద్ధాప్యం, నీరసానికి దారితీసే కాలుష్యం, యూవీ కిరణాలు వంటి పర్యావరణ నష్టం నుంచి చర్మాన్ని రక్షించే యాంటీఆక్సిడిడెంట్లు దీనిలో పుష్కలంగా ఉన్నాయి. ఇది సహజ నిరోధక లక్షణాలను కలిగి ఉంది. ఎర్రటి మెటిమలు, చికాకు వంటి సమస్యలను దూరం చేస్తుంది. అంతేగాదు వెదురుసారంలో ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్లు ఉన్నాయి. ఇవి నిస్తేజంగా అయిపోయిన చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి, కోమలంగా మారుస్తుంది. ఈ వెదురుసారానికి హైలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్, కలబంద వంటి ఇతర హైడ్రేటింగ్ పదార్థాలను జోడిస్తే మరింత తొందరగా కొరియన్ గ్లాస్ చర్మాన్ని పొందగలరని చర్మ నిపుణులు చెబుతున్నారు. ఈ వెదురు సారం పొడిగా లేదా ద్రవ రూపంలో వినియోగించవచ్చు. దీన్ని మీకు ఇష్టమైన చర్మ సంరక్షణ ఉత్పత్తులకు జోడించడం వల్ల మంచి ఫలితాన్ని పొందగలుగుతారని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: అంతుపట్టని ఆ వ్యాధిని పది సెకన్లలో నిర్థారించిన పనిమనిషి..! షాక్‌లో వైద్యుడు) -
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
సాక్షి, అమరావతి: గాజుగ్లాసు గుర్తు విషయంలో తెలుగుదేశం పార్టీ వెనక్కితగ్గింది. తమ పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా త్వరలో జరిగే ఎన్నికల్లో పోటీచేస్తున్నాయని, అందువల్ల రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో గాజుగ్లాసు గుర్తును జనసేన పార్టీకే రిజర్వ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను టీడీపీ ఉపసంహరించుకుంది. ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ మొదలైందని, ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి రాజ్యాంగం అంగీకరించదంటూ ఎన్నికల సంఘం నివేదించడంతో హైకోర్టు ఆ దిశగా ఉత్తర్వులివ్వడానికి సిద్ధమైంది. దీంతో టీడీపీకి పరిస్థితి అర్థమైంది. తమ పిటిషన్‌ను కొట్టేయడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చింది. దీంతో పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించి, హైకోర్టు అనుమతి కోరింది. వెంటనే హైకోర్టు పిటిషన్ ఉపసంహరణకు అనుమతినిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ ఉత్తర్వులిచ్చారు. పొత్తు నేపథ్యంలో గాజుగ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకుగానీ, గుర్తింపులేని రిజిస్టర్డ్ పార్టీలకుగానీ కేటాయించకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలంటూ టీడీపీ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.రు. -
గ్లాసుతో సైకిల్‌కు గుబులు
వరుస షాకులతో కొట్టుమిట్టాడుతున్న టీడీపీకి కావలిలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రెబల్ అభ్యర్థిగా, ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచిన పసుపులేటి సుధాకర్ పక్కలో బల్లెంలా తయారయ్యారు. పోటీలో ఆయన ఉండటంతో ఓట్లు భారీగా చీలుతాయనే ఆందోళనతో ఉన్న కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి తాజా పరిణామం అశనిపాతంలా పరిణమించింది. సుధాకర్‌కు అనూహ్యంగా జనసేన గాజు గ్లాస్ గుర్తు లభించడంతో కావ్య శిబిరం ఒక్కసారిగా డీలాపడిపోయింది.కావలి: టీడీపీ రెబల్‌గా, స్వతంత్య్ర అభ్యర్థిగా కావలి నుంచి రంగంలోకి దిగిన పసుపులేటి సుధాకర్‌కు ఎన్నికల కమిషన్ గ్లాస్ గుర్తును కేటాయించడంతో టీడీపీ శిబిరంలో కలకలం రేగింది. ఈ పరిణామంతో ఓట్లు భారీగా చీలిపోతాయనే భయంతో కావ్య శిబిరం ఒక్కసారిగా కుదుపునకు గురైంది. బీసీల ప్రతినిధిగా రాజకీయాల్లోకి.. బీసీల ప్రతినిధిగా.. పీఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కావలి రాజకీయాల్లో పసుపులేటి సుధాకర్ అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున గ్లాస్ గుర్తుపై పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం బీజేపీలో చేరి కొంతకాలం రాష్ట్ర పదవిలో కొనసాగారు. ఈ క్రమంలో ఆయన్ను టీడీపీ అధినేత చంద్రబాబు పిలిపించుకొని కావలిలో పార్టీ కోసం పనిచేయాలని కోరారు. ఈ తరుణంలో బీజేపీకి రాజీనామా చేసి టీడీపీ కోసం పనిచేశారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో సుధాకర్ తన వర్గీయులతో నిరసన ప్రదర్శనలతో పాటు రాజమహేంద్రవరంలో ర్యాలీలను చేపట్టారు. దీంతో కావలి టీడీపీ టికెట్ సుధాకర్కేనని అందరూ భావించారు. అప్పటి వరకు కావలి ఇన్చార్జిగా ఉన్న మాలేపాటి సుబ్బానాయుడు సైతం సుధాకర్ అభ్యరి్థత్వాన్ని బలపర్చారు. రెబల్‌గా పోటీకి సై.. ఈ తరుణంలో కావ్య కృష్ణారెడ్డి ఆర్థిక బలంతో కావలి టికెట్‌ను దక్కించుకున్నారు. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు, కేడర్ తీవ్రంగా వ్యతిరేకించినా, ఆయనవైపే చంద్రబాబు మొగ్గు చూపారు. దీంతో కంగుతిన్న పసుపులేటి సుధాకర్ కావలిలో రెబల్‌గా పోటీ చేసేందుకు డిసైడయ్యారు. ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలు, టీడీపీ, జనసేన కేడర్ అండగా నిలుస్తుందనే నమ్మకంతో సొంత మేనిఫెస్టోను రూపొందించుకొని బరిలోకి దిగారు. దీంతో టీడీపీ, జనసేన నేతలు, పవన్ కల్యాణ్ అభిమానులు సైతం పసుపులేటికి మద్దతు తెలిపి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో సుధాకర్‌కు గ్లాస్ గుర్తు కేటాయించడంతో ఆయన వర్గీయుల్లో హర్షం వ్యక్తమవుతోంది. భగ్గుమంటున్న కావ్య పసుపులేటి సుధాకర్‌కు గ్లాస్ గుర్తు కేటాయించడంతో కావ్య కృష్ణారెడ్డికి మైండ్ బ్లాౖకైంది. ప్రెస్‌మీట్ పెట్టి మరీ పసుపులేటిపై తిట్ల దండకం అందుకున్నారు. ఆయనపై ఎనిమిది కేసులున్నాయని, 420 అంటూ నోరుపారేసుకున్నారు. ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పసుపులేటి సుధాకర్ ఇద్దరూ కలిసి తనపై పోటీకి దిగారని ఆరోపించారు. రామనారాయణరెడ్డికి గ్లాస్ గుర్తు ఆత్మకూరు: అదేంది.. రామనారాయణరెడ్డికి గ్లాసు గుర్తు కేటాయించారా.. ఈ మతలబేమిటబ్బాననే సందేహం కలగక మానదు. అయితే దీన్ని కేటాయించింది ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డికి కాదండోయ్. అక్కడే స్వతంత్ర అభ్యరి్థగా పోటీలో నిలిచిన ధనిరెడ్డి రామనారాయణరెడ్డికి గ్లాసు గుర్తు కేటాయించడంతో ఓట్లు ఎక్కడ చీలుతాయోననే ఆందోళన తమ్ముళ్లలో నెలకొంది. -
గ్లాసు ముక్కలైంది.. సేనానినే గుచ్చుతోంది
ఏయ్ జగన్. నువ్వెంత.. నీ బతుకెంత అని అరిచి గగ్గోలు పెట్టాడు.. నాకు మోడీ తెలుసు.. అమిత్ షా తెలుసు.. వాళ్ళ ఫోన్ నంబర్ల తెలుసు.. నాకు కేంద్ర నిఘా వర్గాల సమాచారం ఉంది.. ఒక్కటి గుర్తెట్టుకో.. గ్లాసు పగిలేకొద్ది పదునెక్కుతుంది. ఇన్ని కబుర్లు చెప్పాడు.. ఇప్పుడు చూస్తే చివరకు సేనాని గాజు గ్లాసును కాపాడుకోలేకపోయారు. జనసేనా పోటీ చేస్తున్న 21 చోట్ల మాత్రం గాజుగ్లాసు ఆ అభ్యర్థులకు కేటాయించారు. అలా జనసేన పోటీలో లేని చోట్ల మాత్రం ఆ గ్లాసు గుర్తును ఓపెన్ సింబల్‌గా ఉంచేసి స్వాతంత్ర అభ్యర్థులకు ఆ గుర్తు కేటాయించారు. దీంతో ఈ పరిణామం చూస్తుంటే రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ నియోజకవర్గాల ఈవీఎంల్లోనూ గాజుగ్లాసు ఉంటుందన్నమాట. ఇదివరకు జరిగిన పలు ఎన్నికల్లో జనసేన పార్టీ ఉనికి చాటుకోలేకపోవడం, అసలు ఎన్నికల్లో పోటీ చేసి నిబంధనల మేరకు ఓట్లు సాదించకపోవడం వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకున్న ఎన్నికల సంఘం ఇప్పుడు గాజు గ్లాసును ఫ్రీ సింబల్ చేసేసి అందరికీ పంచేసింది. ఇదిప్పుడు కూటమి అభ్యర్థులపాలిట పెనుముప్పుగా మారిందిఅసలు పార్టీని సీరియస్‌గా నడిపే ఉద్దేశ్యం లేని పవన్ కేవలం చంద్రబాబుకు మద్దతుదారుగా ఉండడానికే మొగ్గు చూపి చివరకు పార్టీ ఉనికికి ముప్పు తెచ్చారు. అసలు పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున ఎన్ని చోట్ల, ఎన్ని నియోజకవర్గాల్లో ఒరిజినల్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇంకెన్ని చోట్ల టీడీపీ నుంచి అరువు తెచ్చుకున్న గెస్ట్ అభ్యర్థులు బరిలో ఉన్నారన్నది కూడా పవన్‌కు తెలీనట్లె ఉంది. ప్రజలకు అయితే అసలు ఎక్కడెక్కడ జనసేనా బరిలో ఉందో తెలీదు. అయితే అధికారికంగా మాత్రం కేవలం 21 అసెంబ్లీ, మచిలీపట్నం కాకినాడ రెండు ఎంపీ సీట్లలో జనసేన అధికారికంగా పోటీ చేస్తూ మిగతా చోట్ల టీడీపీ-బిజెపి అభ్యర్థులకు మద్దతు ఇస్తోంది. అంటే జానసేన పోటీలో లోని చోట్ల జనసేన నాయకులు, కార్యకర్తలు ఓటర్లు అటు కూటమి అభ్యర్థులకు ఓట్లు వేస్తారు. వేయిస్తారు అన్నమాట. మరి ఇప్పుడు అన్నిచోట్లా స్వాతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం గ్లాసు గుర్తు కేటాయించేయడంతో జనసేనకు, టీడీపీ అభ్యర్థులకు పెద్ద చిక్కొచ్చి పడింది. మా ఊళ్ళో మాకు రావాల్సిన జనసేన ఓట్లు గాజు గ్లాసు గుర్తు పొందిన ఇండిపెండెంట్ అభ్యర్థికి పోలైతే.. ఆ మేరకు తమకు నష్టం కలుగుతుందని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. 2014లో మంగళగిరి నుంచి వైసిపి తరఫున గెలిచిన ఆళ్ళ రామకృష్ణా రెడ్డి కేవలం 12ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. ఇంకా 2019లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కేవలం పాతిక ఓట్ల మెజారిటీతో బొండా ఉమాను ఓడించి మల్లాది విష్ణు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక విశాఖ జిల్లాలో టీడీపీ తరఫున గంటా శ్రీనివాస్ 1944 ఓట్ల మెజారిటీతో గెలిచారు. రాజోలులో జనసేన తరఫున గెలిచిన రాపాక వరప్రసాద్ మెజారిటీ కేవలం 814 ఓట్లు.. అంటే ఇలా తక్కువ మెజారిటీ ఉన్నచోట మూడునాలుగు వేల జనసేన ఓట్లు కానీ గాజు గ్లాసు గుర్తు పొందిన ఇండిపెండెంట్లు పట్టుకుపోతే తమ పరిస్థితి ఏమిటని కూటమి కలవరపడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో గాజు గ్లాసు గుర్తు పొందిన కొందరు స్వాతంత్ర అభ్యర్థులు జాబితా ఇదిగో.. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు... జనసేన పోటీ చేయని ప్రాంతాల్లో... గ్లాస్ టంబ్లర్ గుర్తు కేటాయించబడిన అభ్యర్ధులు...విజయనగరం మాజీ ఎమ్మెల్యే, స్వతంత్ర అభ్యర్ధగా నామినేషన్ వేసిన మీసాల గీతమైలవరం లో స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని నాగ పవన్ కుమార్విజయవాడ సెంట్రల్ లో ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి అభ్యర్థి గొల్లపల్లి ఫణిరాజ్టెక్కలిలో స్వతంత్రం అభ్యర్థి అట్టాడ రాజేష్కాకినాడ జిల్లా: జగ్గంపేట నియోజక వర్గంలో స్వతంత్ర అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్రపెదకూరపాడు లో కుట్ర కోణం: ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కుమారుడు, స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేసిన నంబూరు కళ్యాణ్ బాబుకు గ్లాస్ టంబ్లర్ గుర్తును కేటాయింపుగన్నవరంలో స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని వంశీమోహన కృష్ణమంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్ధి రావుసుబ్రహ్మణ్యం కి గాజుగ్లాసు గుర్తు కేటాయించిన రిటర్నింగ్ అధికారిమదనపల్లె లో ఇండిపెండెంట్ గా బరిలో ఉన్న షాజహాన్అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న దళిత బహుజన పార్టీకి చెందిన వడ్లమూరి కృష్ణ స్వరూప్విజయవాడ పార్లమెంట్ అభ్యర్ధి.. నవతరం పార్టీ అభ్యర్ధి కృష్ణ కిషోర్రాజమండ్రి సిటీ అసెంబ్లీ మరియు పార్లమెంట్ కు పోటీ చేస్తున్న, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) పార్టీ అభ్యర్థి మేడా శ్రీనివాసరావు గాజు గ్లాసు గుర్తు పై కోర్టులో విజయం సాధించిన హైకోర్టు అడ్వకేట్ మెడా శ్రీనివాసరావు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ తరుపున గాజు గ్లాసు గుర్తు తో రాష్ట్రంలో ఇంకా కొంతమంది పోటీలో ఉన్నారు.:::: సిమ్మాదిరప్పన్న -
స్వతంత్ర అభ్యర్థులు ‘గ్లాస్’ గుర్తును ఎంచుకోవచ్చు: ఈసీ వర్గాలు
సాక్షి, అమరావతి: ఏపీ ఎన్నికల్లో గుర్తులకు సంబంధించి ఈసీ వర్గాలు కీలక ప్రకటన చేశాయి. రాష్ట్రంలో జనసేన పోటీలో లేనిచోట గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్‌గా వాడుకోవచ్చని ఈసీ వర్గాలు తెలిపాయి.ఈ సందర్భంగా ఈసీ వర్గాలు.. జనసేన లేని చోట స్వతంత్ర అభ్యర్థులు కోరుకుంటే గ్లాస్ గుర్తును ఎంపిక చేసుకోవచ్చు. గ్లాస్ గుర్తు కామన్ సింబల్ అంటూ ఓ వర్గం మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవం అని ధృవీకరించాయి. -
#Janasena: పవన్‌కు చుక్కెదురు.. ఫ్రీ సింబల్‌గా గాజు గ్లాసు
సాక్షి, విజయవాడ: ఏపీలో ఎన్నికల్లో జనసేన పార్టీకి చుక్కెదురైంది. ఎన్నికల కమిషన్ జనసేన పార్టీని కేవలం రిజిస్టర్డ్ పార్టీగానే గుర్తించింది. ఈ క్రమంలో జనసేనకు ఫ్రీ సింబల్‌గా గ్లాస్ గుర్తును కేటాయించింది. ఈ మేరకు తాజాగా గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కాగా, ఏపీలో ఎన్నికల నేపథ్యంలో గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపు లేని పార్టీల జాబితాలను మంగళవారం ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం ఏపీ సీఈవో గెజిట్ నోటిషికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్బంగా గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో వైఎస్సార్సీపీ, టీడీపీ ఉన్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీకి ఫ్యాన్ గుర్తు, టీడీపీకి సైకిల్ గుర్తును ఈసీ ప్రకటించింది. ఇదే సమయంలో జనసేనను ఈసీ ప్రాంతీయ పార్టీగా గుర్తించకపోవడం విశేషం. దీంతో, జనసేనను కేవలం రిజిస్టర్డ్ పార్టీగానే గుర్తించి.. ఎన్నికల్లో ఫ్రీ సింబల్ గ్లాసు గుర్తును కేటాయించింది. -
డైట్లో ఈ వంటకాన్ని చేరిస్తే..మెరిసే గ్లాస్ స్కిన్ మీ సొంతం!
కొరియన్ గ్లాస్ స్కిన్‌లా చర్మం ఉండాలని చాలామంది కోరుకుంటారు. అందుకోసం అని కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్‌లను ట్రై చేస్తుంటారు. వాటన్నింటి కంటే కూడా ఈ కొరియన్ వంటకాన్ని మీ డైట్లో చేర్చుకుంటే చక్కటి మచ్చలేని మెరిసే చర్మాన్ని పొందొచ్చు. అకాల వృద్ధాప్యా ఛాయలను కూడా దూరం చేస్తుంది. ఏంటా వంటకం అంటే.. కొరియన్ కిమ్చి అనే ప్రసిద్ధ వంటకం మీ చర్మాన్ని ఆరోగ్యంగా కాంతిమంతంగా చేయడమే గాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కిమ్చి అనేది సాంప్రదాయ కొరియన్ పులియబెట్టిన ఆహారం. దీన్ని కొరియన్లు ప్రతిరోజు తమ ఆహరంలో భాగం చేసుకుంటారు. ఇది సాధారణంగా చక్కెర, ఉప్పు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, మిరపకాయ మసాల వంటి వాటిని జోడింది పులియబెట్టిన క్యాబేజీతో తయారు చేస్తారు. ఈ కిమ్చిని కావాలంటే ముల్లంగా, సెలెరీ, క్యారెట్, దోసకాయ, బచ్చలి కూర వంటి ఇతర కూరగాయలను ఉపయోగించి కూడా తయారు చేయవచ్చు. ఇది పులియబెట్టడం వల్ల ఉబ్బినట్లుగా ఉండి, పుల్లని రుచిని కలిగి ఉంటుంది. దీన్నీ మన రోజువారీ డైట్లో భాగం చేసుకుంటే కొరియన్లలాంటి గ్లాస్ స్కిన్‌ని సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. మెటిమలు లేని, మృదువైన హైడ్రేటెడ్ చర్మాన్ని పొందొచ్చని చెబుతున్నారు కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ నీతి గౌర్. ఈ వంటకం చర్మాన్ని ఏవిధంగా మేలు చేస్తుందా సవివరంగా చూద్దాం. ప్రోబయోటిక్స్: కిమ్చిలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి పేగు ఆరోగ్యానికి తోడ్పడే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా. ఇందులో ఉండే గట్ మైక్రోబయోమ్ చర్మ సంరక్షణ తోపాటు మంచి ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది . శరీరంలో ప్రోబయోటిక్స్ సమతుల్య గట్ వాతావరణాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. తద్వారా సంభావ్యంగా చర్మం మంటను తగ్గించి..మొటిమలు, తామర వంటి వాటిని రాకుండా చేస్తుంది యాంటీఆక్సిడెంట్లు: కిమ్చిలో వివిధ యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. వీటిలో విటమిన్లు ఏ, సీ ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి కీలకమైనవి. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్, పర్యావరణ ఒత్తిళ్లు, యూవీ రేడియేషన్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ఇందులో ఉన్న యాంటీ ఆక్సీడెంట్లు ఒత్తిడిని తగ్గించి..ముఖాన్ని యవ్వనంగా నిగనిగలాడేలా చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్: కిమ్చీని తయారీలో కిణ్వ ప్రక్రియ కారణంగా ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్స్ వంటి బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉత్పత్తి అవుతాయి, ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. మొటిమలు, రోసేసియా, అకాల వృద్ధాప్యం వంటివి దూరం చేస్తుంది. అలాగే ఎక్కువగా చర్మ పరిస్థితులలో వచ్చే వాపు వంటివి రానియ్యదు. విటమిన్లు, మినరల్ కంటెంట్: కిమ్చిలో విటమిన్లు ఏ,సీ, కే వంటి పోషకాలకు మంచి మూలం. అలాగే కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. ఈ పోషకాలు చర్మ ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తాయి. కొల్లాజెన్ సంశ్లేషణ, గాయం వంటి వాటి నుంచి సంరక్షిస్తుంది. (చదవండి: నాజూగ్గా ఉండే శిల్పాశెట్టి ఇంతలా ఫుడ్‌ని లాగించేస్తుందా..!) -
లిటిల్ స్టార్స్ ఇన్ ఫైవ్‌స్టార్
ఒక వ్యక్తి కొంత మంది పిల్లలను ఫైవ్‌స్టార్ హోటల్‌కు తీసుకువెళ్లి వారికి ఇష్టమైన పదార్థాలు తినిపించిన వీడియో వైరల్ అయింది. ఆ పిల్లలకు ఈయన తండ్రి కాదు. కనీసం దూరపుచుట్టం కాదు. వీరు వీధిబాలలు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో 39 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. కవల్చాబ్ర అనే వ్యక్తి కారు ట్రాఫిక్ జామ్‌లో నిలిచిపోయినప్పుడు కొందరు పిల్లలు కారు అద్దాలను తుడవడం మొదలు పెట్టారు. వారిని చూడగానే చాబ్రకు ‘అయ్యో!’ అనిపించింది. వెంటనే పిల్లలను కారులో కూర్చోబెట్టుకొని ఫైస్టార్ హోటల్‌కు తీసుకువెళ్లాడు. ఈ వైరల్ వీడియో ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తోంది. -
జనసేనకు మళ్లీ గాజు గ్లాసు గుర్తు కేటాయింపు
సాక్షి, న్యూఢిల్లీ: జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి గ్లాస్ గాజు గుర్తును కేటాయించింది. ఈ ఏడాది మే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తును తొలగించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గుర్తును మళ్లీ కేటాయించింది. దీంతో ఎన్నికల సంఘానికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. "జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా మరోసారి గ్లాస్‌ను కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు’’ అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల వివరాలను ప్రకటించిన సందర్భంలో జనసేన గ్లాస్ గుర్తును కోల్పోయింది. అప్పుడు గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ చేసింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. గ్లాస్ గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు - JanaSena Chief Shri @PawanKalyan #VoteForGlass pic.twitter.com/yxWjWbbAXp — JanaSena Party (@JanaSenaParty) September 19, 2023 -
కార్నింగ్’ పెట్టుబడి రూ.934 కోట్లు
సాక్షి, హైదరాబాద్: మెటీరియల్స్ సైన్స్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కార్నింగ్ సంస్థ తెలంగాణలో రూ. 934 కోట్ల భారీ పెట్టుబడితో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబోయే ఈ ప్లాంట్ ద్వారా మొబైల్ ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్ పరికరాలకు అవసరమైన గొరిల్లా గ్లాస్‌లను కార్నింగ్ తయారు చేయనుంది. 172 ఏళ్ల చరిత్రగల కార్నింగ్ తన తయారీ కేంద్రం ఏర్పాటు ద్వారా భారత్‌లో అడుగుపెట్టనుంది. ఈ భారీ పెట్టుబడితో 800 మందికిపైగా ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో కార్నింగ్ సంస్థ సీనియర్ ఉపాధ్యక్షుడు జాన్ బెయిని ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా ఎల్రక్టానిక్స్, అనుబంధ రంగాలకు తెలంగాణ హబ్‌గా మారుతున్న తీరును కేటీఆర్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం గత 9 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలను తెలియజేశారు. యాపిల్ ఐఫోన్లను తయారు చేసే ఫాక్స్‌కాన్ సంస్థ భారీ ఎత్తున తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న విషయాన్ని, ప్రభుత్వ పాలసీలను ఆ సంస్థ ప్రశంసించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ అంశాలపై సానుకూలంగా స్పందించిన కార్నింగ్ ప్రతినిధి బృందం.. తెలంగాణలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూలతలతోపాటు ఎల్రక్టానిక్స్, అనుబంధ రంగాల్లో తయారీరంగ పెట్టుబడుల కోసం తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న చొరవ, ప్రోత్సాహాన్ని దృష్టిలో ఉంచుకొని ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్రాన్ని ఎంచుకున్నట్లు కార్నింగ్ సంస్థ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. దీంతో కార్నింగ్ సంస్థకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సంస్థ కార్యకలాపాల ప్రారంభానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఎల్రక్టానిక్స్ తయారీ రంగంలో పెట్టుబడుల ద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, తెలంగాణ యువతకు ఈ రంగంలో ఉద్యోగావకాశాలు రావడం తనకు అత్యంత సంతోషాన్ని ఇస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ భేటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పెట్టుబడుల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, ఐటీ శాఖ ఎల్రక్టానిక్స్ డైరెక్టర్ సుజయ్ కారంపురి తదితరులు పాల్గొన్నారు. -
గూగుల్ డూడుల్‌లో ఆ ఐ ఫ్రేమ్ ఏంటి? ఆమె ఎవరూ..?
గూగుల్ డూడుల్ చారిత్రక ఘట్టల రోజును, ప్రముఖులను, సెలబ్రెటీలను తన లోగో పేజితో సత్కరిస్తుంది. అందరికీ తెలిసిందే. కానీ ఈ రోజు గుగూల్ ఏకంగా ఐ ఫ్రేమ్‌తో సహా ఓ మహిళతో కూడిన డూడిల్‌ని రూపొందించింది. అసలు ఏంటీ ఆ ఐ ఫ్రేమ్? ఆ మహిళెవరూ? గూగుల్ ఈ రోజు చాలా వినూత్న రీతిలో డూడిల్‌ని రూపొందించింది. ఐ ఫ్రేమ్ చుట్టూ బాణాలు మధ్యలో ఓ మహిళ రూపు ఉండేలా రూపొందించింది. ఆమె నూయర్క్కి చెందిన ఆల్టినా షినాసి. ఈ రోజ ఆ మహిళ 116వ పుట్టిన రోజు సందర్భంగా ఇలా డూడుల్‌తో ఘనంగా సత్కరించింది. ఆమె క్యాట్ ఐ ఫ్రేమ్ సృష్టికర్త. షినాసి ఆగస్టు4, 1907లో న్యూయార్క్ మాన్‌హట్టన్‌లో జన్మించింది. ఉన్నత పాఠశాల విద్య అనంతంర చిత్రేఖనం అభ్యసించేందుకు పారిస్ వెళ్లింది. అప్పుడే ఆమెకు కళలపై ఆసక్తి ఏర్పడటం మొదలైంది. ఆమె యూఎస్‌కి తిరిగి వచ్చిన తర్వాత పీటర్ కోప్‌ల్యాండ్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించింది. ఒక రోజు వీధుల గుండా నడుచుకుంటూ వెళ్తుండగా..హఠాత్తుగా అక్కడ ఉన్న గాజు ఫ్రేమ్లవైపు దృష్టి మళ్లింది. అక్కడ ఉన్నవన్నీ గుండ్రటి ఆకారంలో పెద్ద ఆసక్తికరంగా లేకపోవటాన్ని గమనించింది. ఆ కాలంలో మహిళలు ధరించే కళ్ల జోడులు కేవలం గుండ్రటి ఫ్రేమ్ ఆకారంలోనే ఉండేవి. దీంతో షినాస్ మహిళలకి సరికొత్త స్టయిల్ గ్లాస్‌లతో.. తమ గ్లామర్‌ని మరింత పెంచేలా చేసేవి రూపొందించాలని అనుకుంది. అందుకోసం తన సృజనాత్మకతకు పదును పెట్టింది. కోణాల అంచులతో కూడిన ఫ్రేమ్‌లు మహిళ లుక్‌ని మరింత అందంగా కనిపించేలా చేస్తుందని షినాసి విశ్వసించింది. అందుకోసం తయారీదారులు వద్దకు కాగితపు ముక్కలో ఫ్రేమ్ డిజైన్ డెమోలు ఇచ్చింది. అయితే వాళ్లంతా ఇందులో ప్రత్యేకత ఏమిలేదని కొట్టిపారేశారు. అయినా వెనక్కి తగ్గక తన ప్రయత్నాలు చేసుకుంటూనే పోతూ ఉంది. ఎవరో ఒకరికి నచ్చావా! అన్న ఆశతో ధైర్యంగా ముందుకు వెళ్లింది. చివరి ప్రయత్నంగా స్థానిక దుకాణ యజమానులను ఆశ్రయించి.. వారికి తన కాగితపు ఫ్రేమ్ డిజైన్ గురించి వివరించింది. వారు ఆమె నైపుణ్యాన్ని గుర్తించి మార్కెట్లోకి ఆమె తయారు చేసిన ఫ్రేమ్‌లని 'హర్లెక్విన్ గ్లాసెస్' పేరుతో తీసుకువచ్చారు. అది విజయవంతమైంది. దీంతో షినాసి పేరు యూఎస్ అంతటా నలుదిశలా వ్యాపించింది. అలా ఆమె సినీరంగంలోకి కూడా ప్రవేశించింది. అంతేగాదు 1960లో తన గురువు, మాజీ టీచర్ జార్జ్ గ్రోజ్తో కలిసి ఒక డాక్యుమెంటరీని నిర్మించింది. షినాసి 1995లో 'ది రోడ్ ఐ హావ్ ట్రావెల్డ్' అనే పేరుతో తన జ్ఞాపకాలకు సంబంధించి ఓ పుస్తకాన్ని ప్రచురించింది. ఆమె ఆగస్టు 19, 1999న మరణించారు. (చదవండి: ఆపిల్ మ్యాప్‌లో వినిపించే వాయిస్..ఏ మహిళదో తెలుసా!) -
కొట్టేశానోచ్! అని పరిగెత్తి... బొక్క బోర్లాపడ్డ దొంగ!
ఒక దొంగ మంచి ఖరీదైన వస్తువు కొట్టేశానన్న ఆనందంలో ముందు వెనుక చూడకుండా పారిపోయేందుకు యత్నించి బొక్క బోర్లాపడి అడ్డంగా దొరికి పోయాడు. ఈ ఘటన యూఎస్‌లోని వాషింగ్టన్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....వాషింగ్టన్‌లోని బెల్లేవ్‌లో లూయిస్ విట్టన్ స్టోర్ అనే లగ్జరీ షాపుకి ఒక దొంగ వచ్చాడు. అతను ఆ షాపులో సుమారు రూ. 14 లక్షలు ఖరీదు చేసే వస్తువుని దొంగలించి పారిపోయేందుకు యత్నించాడు. ఐతే ఆ షాపుకి బయటవైపుగా క్లీన్‌గా ఉన్న అద్దాన్ని గమనించకుండా బయటకు దారి అదే అనుకుని ఆ అద్దం గుండా వెళ్లిపోవాలనుకున్నాడు. అంతే ఆ దొంగ ఆ అద్దానికి గుద్దుకుని ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఇంతలో సెక్యూరిటీ గార్డు వెంటనే అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించాడు. అతను 17 ఏళ్ల యువకుడని పోలీసులు చెప్పారు. ఈ బెల్లేవ్ నగరంలో ఇటీవల 50కి పైగా ఇలాంటి రిటైల్ దోపిడి, షాప్ చోరి కేసులు జరిగాయని పోలీసులు చెబుతున్నారు. వారంతా తమను గుర్తుపట్టరన్న ధైర్యంతో చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు పోలీసులు బెల్లేవ్ నగరానికి వచ్చి ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే మరిన్ని కేసులు పెట్టి అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. (చదవండి: ఆవకాయబద్ద గొంతులో ఇరుక్కుని మహిళ పాట్లు! ఆశ్చర్యపోయిన వైద్యులు) -
కస్టమర్‌కు చేదు అనుభవం.. పిజ్జాలో గాజు ముక్కలు రావడంతో..
ప్రస్తుత జనరేషన్ దాదాపు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసి తినేందుకే ఎక్కువ ప్రిపరెన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక, పిజ్జా, బర్గర్ వంటివి స్పెషల్‌గా ఆర్డర్ ఇస్తుంటారు. తాజాగా డోమినోస్ నుండి పిజ్జా ఆర్డర్ చేసిన ఓ కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. పిజ్జాలో ఏకంగా గాజు ముక్కలు ఉండటంతో కస్టమర్ షాకయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఓ కస్టమర్ డోమినోస్ నుండి పిజ్జా ఆర్డర్ పెట్టాడు. దీంతో, జొమాటో నుంచి సదరు కస్టర్ పిజ్జాను అందుకున్నాడు. అనంతరం, ఎంతో ఇష్టంగా పిజ్జా తినడానికి రెడీ అయిపోయాడు. కవర్ ఓపెన్ చేసి పిజ్జా తింటున్న క్రమంలో మొదట ఒక గాజు ముక్క తగిలింది. ఒక్కటే కదా మిస్టేక్ అనుకొని లైట్ తీసుకున్నాడు. ఇంతలో మరో రెండు గాజు ముక్కలు తగలడంతో చిర్రెత్తుకుపోయాడు. కోపంతో వెంటనే ఫోన్ తీసి పిజ్జాలో వచ్చిన గాజుముక్కలను ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అనంతరం, తనకు జరిగిన చేదు అనుభవం గురించి పోలీసులను ఆశ్రయించాడు. ట్విట్టర్ వేదికగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుపై పోలీసులు స్పందిస్తూ.. ముందుగా కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేయండి. ఒకవేళ వారు స్పందించకపోతే అప్పుడు లీగల్‌గా ప్రొసీడ్ అవ్వండి అంటూ సలహా ఇచ్చారు. ఇక, ఈ ఘటనపై డొమినోస్ సంస్థ స్పందించింది. డొమినోస్ తరఫున కస్టమర్‌కు క్షమాపణలు తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టినట్టు తెలిపారు. ఫుడ్ నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. కాగా, తమ తనిఖీల్లో రెస్టారెంట్లో ఎలాంటి గాజు సామాగ్రిని కనుగొనలేదని స్పష్టం చేశారు. 2 to 3 pieces of glass found in @dominos_india This speaks volume about global brand food that we are getting @dominos @jagograhakjago @fssaiindia Not sure of ordering ever from Domino's @MumbaiPolice @timesofindia pic.twitter.com/Ir1r05pDQk — AK (@kolluri_arun) October 8, 2022 -
మద్యం మత్తులో దారుణం.. స్నేహితుడి శరీరంలోకి గ్లాస్ చొప్పించి..!
భువనేశ్వర్: అప్పటి వరకు అంతా కలిసి సరదాగా గడిపారు. ఫూటగా మద్యం సేవించారు. మద్యం మత్తులో అందులోని ఓ స్నేహితుడి పట్ల అరాచకంగా ప్రవర్తించారు. అతడి శరీరం వెనుకభాగంలో స్టీల్ గ్లాస్‌ను చొప్పించారు. ఎవరికైనా చెబితే ఏమనుకుంటారోనని ఎవరికీ చెప్పలేదు బాధితుడు. చివరకు నొప్పి తీవ్రం కావటంతో ఆసుపత్రికి వెళ్లగా శాస్త్రచికిత్స చేసి గ్లాస్‌ను బయటకు తీశారు వైద్యులు. ఈ అరాచక చర్య గుజరాత్‌లోని సూరత్‌లో జరగగా.. ఒడిశాలోని గంజాం జిల్లా వైద్యులు బాధితుడికి ఉపశమనం కల్పించారు. ఇంతకి ఏం జరిగిందంటే? ఒడిశా, గంజాం జిల్లాలోని బుగుడ బ్లాక్ బలిపదార్ గ్రామానికి చెందిన బాధితుడు కృష్ణ చంద్రా రౌత్(45).. కొద్ది రోజుల క్రితం గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లి అక్కడి టెక్స్టైల్ మిల్లో పని చేస్తున్నాడు. దాదాపు 10 రోజుల క్రితం స్నేహితులతో కలిసి దావత్ చేసుకున్నారు. అంతా కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో బాధితుడు కృష్ణ చంద్ర శరీరం వెనుకభాగంలో స్టీల్ గ్లాస్ చొప్పించారు కీచకులు. ఆ తర్వాత రోజు నుంచి అతడికి నొప్పి మొదలైంది. కానీ, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. నొప్పి తీవ్రం కావడం వల్ల సూరత్ నుంచి అతడి సొంతూరికి వచ్చేశాడు. ఆ తర్వాత మలవిసర్జన కాకపోవటం వల్ల పొట్ట ఉబ్బిపోయింది. నొప్పి భరించలేని స్థితికి చేరటంతో బెర్హమ్పుర్లోని ఎంకేసీజీ వైద్య కళాశాల, ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అక్కడ సైతం గ్లాస్ విషయం వైద్యులకు తెలపలేదు బాధితుడు. పరీక్షలు నిర్వహించి అసలు విషయం వెల్లడించారు డాక్టర్లు. శరీరం వెనుకభాగంలో చిక్కుకుపోయిన స్టీల్ గ్లాస్‌ను ఆపరేషన్ లేకుండానే బయటకు తీసేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో సర్జరీ చేసుకోవాల్సిందిగా బాధితుడికి సూచించారు. దానికి అంగీకరించటంతో సుమారు 2.5 గంటల పాటు శ్రమించి శాస్త్ర చికిత్స పూర్తి చేసి గ్లాసును బయటకు తీశారు. బాధితుడు ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిపారు. మరో నాలుగైదు రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: ప్లాస్టిక్‌లా మారిపోయిన యువతి చర్మం.. అదే కారణమా? -
కౌన్సిలర్ కుమారుడి వీరంగం.. గ్యారేజీ యజమానితో గొడవపడి..
సాక్షి,జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని తులసీనగర్ ప్రాంతానికి చెందిన కౌన్సిలర్ కుమారుడు సోమవారం సాయంత్రం వీరంగం సృష్టించాడు. తులసీనగర్ ప్రాంతంలో ప్రశాంత్ అనే వ్యక్తి కార్ల రిపేరు సెంటర్ నిర్వహిస్తున్నాడు. రిపేరు కోసం వచ్చిన 11 కార్లను అక్కడ పార్కింగ్ చేసి ఉంచాడు. అయితే, అదే ప్రాంతానికి చెందిన అరుముల్ల నర్సమ్మ (25వ వార్డు కౌన్సిలర్) కుమారుడు అరుముల్ల పవన్.. సోమవారం గ్యారేజీ యజమాని ప్రశాంత్‌తో గొడవ పడ్డాడు. తర్వాత ఆగ్రహంతో అక్కడే ఉన్న 11 కార్ల అద్దాలను ధ్వంసం చేశాడు. బాధితులు పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా.. పవన్ అక్కడకు కూడా వెళ్లి ఫిర్యాదుదారులను భయాందోళనకు గురిచేశాడు. గ్యారేజీ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కిశోర్ తెలిపారు. కౌన్సిలర్ కుమారుడి తీరు కలకలం రేపింది. మరో ఘటనలో.. వ్యక్తి అదృశ్యం జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట గ్రామానికి చెందిన గాదం స్వామి (41) అదృశ్యమైనట్లు రూరల్ ఎస్సై అనిల్ తెలిపారు. స్వామి గతనెల 27న ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. స్వామి భార్య విజయ సోమవారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. చదవండి: ‘కొడుకా.. ఎంత పని జేత్తివి బిడ్డా.. ’ -
కారులో చిన్నారి.. అద్దాలు పగులకొట్టిన పోలీసు.. ట్విస్ట్ ఏంటంటే
లండన్: ప్రస్తుతం మార్కెట్లో రకరకాల బొమ్మలు ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. వాటిని చూస్తుంటూ.. నిజమైనవేవో, టెడ్డీ బొమ్మలేవో గుర్తుపట్టలేనంతగా ఒకేలా ఉంటున్నాయి.. తాజాగా జరిగిన ఒక ఘటన ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. వివరాలు.. ఈ ఘటన యూకేలోని క్లీవ్ ల్యాండ్ జరిగింది. అమీ క్విల్లెన్ అనే మహిళ.. తన కూతురు డార్సితో కలిసి షాపింగ్ చేయడానికి వెళ్లింది. డార్సి తాను.. ఆడుకుంటున్న చిన్న బొమ్మను కారు ముందటి సీటులో పెట్టింది. అది అచ్చం చిన్నారిని పోలి ఉంది. అమీ క్విల్లెన్ షాప్‌లోపలికి వెళ్లిపోయారు. అప్పుడు మరోక వ్యక్తి తన కారును పార్క్ చేయడానికి అక్కడికి చేరుకున్నాడు. అతను కారులో ఒక చిన్నారి ఉండటాన్ని గమనించాడు. దానికి సీటు బెల్టు కూడా ఉంది. వెంటనే ఆశ్చర్యపోయాడు. అతను.. చుట్టుపక్కల ఉన్నవారిని అప్రమత్తం చేశాడు. కారు యజమాని కోసం వెతికారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. అక్కడికి చేరుకున్న పోలీసులు కారులో చిన్నారిని చూశారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కారు అద్దాలను పగులగొట్టారు. అప్పుడు వారు కారు సీటులో ఉన్న చిన్నారిని చూసి షాకింగ్‌కు గురయ్యారు. కారులో ఉన్నది.. నిజమైన చిన్నారి కాదు.. కేవలం బొమ్మమాత్రమే. పాపం.. ఆ బొమ్మ.. అచ్చం చిన్నారిని పోలీ ఉండటం వలన స్థానికులతో పాటు.. పోలీసులు కూడా గందరగోళానికి గురయ్యారు. ఆ తర్వాత.. అక్కడికి చేరుకున్న అమీ క్విల్లెన్కు, పోలీసులు జరిగిన విషయం తెలిపారు. ఆ బొమ్మ.. తన కూతురికి ఎంతో ఇష్టమని తెలిపారు. క్రిస్టమస్‌కు గిఫ్ట్‌గా ఇచ్చామని తెలిపారు. కాగా, దీనిపై పోలీసులు వివరణ ఇచ్చారు. ఆ తర్వాత , కారు మరమ్మత్తుల కోసం డబ్బులు చెల్లిస్తామని ప్రకటించారు. చదవండి: ‘కొందరు మనుషుల కన్నా.. నోరు లేని జీవాలే నయం’ . వైరల్ వీడియో -
‘బీరు’బలి.. ఒక్కపనితో హీరో అయ్యాడు
నెదర్లాండ్స్: మనం మన చేతుతలతో వాటర్ గ్లాస్‌లని ఒకేసారి రెండూ, మూడో మహా అయితే నాలుగు కూడా పట్టుకోవచ్చు. ఇంకా మరింత ప్రయత్నం చేసి ట్రై ఉపయోగించో లేక మరో విధంగానైనా తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తాం. కానీ ఒకేసారి ఎక్కవ గాజు గ్లాస్‌లతో వాటర్ లేదా కూల్ డ్రింక్ లాంటి వాటిని తీసుకువెళ్లడం అసాధ్యం. కానీ ఇక్కడొక వ్యక్తి హీరో మాదిరి ఏకంగా 48 బీర్ గ్లాస్‌లను తీసుకొచ్చేశాడు. (చదవండి: అక్టోబర్ 20 ప్రపంచ గణాంకాల దినోత్సవం) నెదర్లాండ్స్‌కి చెందిన క్రిస్టియాన్ రోట్గెరింగ్ ఫుట్‌బాట్ అభిమాని. అతను తన కుటుంబ సభ్యులు, స్నేహిలతులతో కలసి ఫుట్‌బాట్ స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చాడు. ఆ తర్వాత అతను తనవాళ్ల కోసం బీర్‌ను కొనుగొలు చేసి తీసుకువెళ్తున్నాడు. ఎవరైనా డిస్పాజుబుల్ గ్లాస్‌తో ప్యాక్ చేసి ఉంటే సులభంగా తీసుకెళ్లగలం. కానీ క్రిస్టియాన్ ఓకేసారి ఐదు ట్రైలో బీరుగ్లాస్లను ఒకదానిపై ఒకటి పెట్టి మొత్తం 48 గ్లాస్‌లను ఒకేసారి హీరోలా తీసుకువెళ్లడంతో అక్కడ ఉన్న స్టేడియంలోని ప్రేక్షక్షుల అందర్ని ఆశ్చర్యపరిచాడు. దీంతో అతను ఒక్కసారిగా సెలబ్రిటీ స్టేటస్ పొందాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్ వావ్ యు ఆర్ సో గ్రేట్ అంటూ రకరకాలు ట్వీట్ చేశారు. (చదవండి: అదో వింతైన రంగురంగుల బల్లి.. ప్లీజ్ కాపాడండి) View this post on Instagram A post shared by Veronica Inside (@veronica.inside) -
గ్లాసులో బర్గర్.. ఎలా తినాలి గురూ..
ప్రతి రెస్టారెంట్ మెనూలో కామన్‌గా కనిపించే ఐటమ్.. బర్గర్. చికెన్, మటన్, వెజిటబుల్.. భిన్న రుచుల్లో, నచ్చిన వెరైటీలో దొరుకుతుంది. సాధారణంగా బర్గర్లను ట్రేలలో సర్వ్ చేస్తారు. అదే ట్రేలో సైడ్ డిషెస్గా చిప్స్ కానీ, ఫ్రైస్ కానీ ఉంటాయి. ఇది రొటీన్. కానీ వెరైటీగా ట్రై చేద్దామనుకున్నారో ఏమో రెడిట్ రెస్టారెంట్ వాళ్లు బర్గర్‌ను చక్కగా ఒక గ్లాస్లో సర్దేశారండీ!! దీనికి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోలో మొత్తం బర్గర్ అంతా ఒక గ్లాస్లో స్టఫ్ చేసి ఉండటం మనం చూడొచ్చు. బర్గర్ తయారీకి ఉపయోగించే పదార్థాలు అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ దానిని పేర్చిన విధానం మాత్రం వింతగా ఉంది. గ్లాస్ అడుగుభాగంలో బ్రెడ్ ముక్కలు పేర్చి, ఆపైన చీజ్ సాస్‌లతో వెజిబటుల్స్ను అమర్చారు. ఇదే పద్ధతిని గ్లాస్ పై భాగం వరకు అనుసరించారు. అన్నింటికంటే పైన నువ్వులతో ఉన్న బ్రెడ్‌ను పెట్టారు. (చదవండి: రికార్డుల్లోకి బర్గర్.. ధర ఏకంగా రూ. 4.5 లక్షలు, ఎందుకంత ఖరీదు?) ఇక్కడ బర్గర్‌ని వెరైటీగా సర్వ్ చేస్తుండటంతో కస్టమర్లు సదరు రెస్టారెంట్‌కు క్యూ కట్టారు. ఇలా గ్లాస్లో బర్గర్‌ని సర్వ్ చేస్తే ఎలా తినాలని కొందరు కస్టమర్లు ప్రశ్నించగా.. మరికొందరు మామూలు పద్ధతిలో ఎందుకు సర్వ్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా బాగానే ఉందని ఇంకొందరు కామెంట్ చేశారు. తినడం సంగతి ఎలా ఉన్నా ఫోటోతో ఈ బర్గర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చదవండి: వైరల్: వాటిని తినకుండా 17 ఏళ్లు దాచింది! -
గాజుతో వజ్రాన్నీ కోయవచ్చు!
వజ్రాన్ని వజ్రంతోనే కోయగలమని అంటుంటారు కదా! కానీ, ఇప్పుడు గాజుతోనూ వజ్రంపై గాట్లు పెట్టవచ్చంటున్నారు చైనాలోని మెటీరియల్స్ సైంటిస్ట్‌లు. అంతేకాదు.. వజ్రం కంటే దృఢంగా ఉండే ఈ సరికొత్త గాజు సిలికాన్ మాదిరిగా అర్ధ వాహకం కూడా. ఏఎం–3 అని పిలుస్తున్న ఈ పదార్థం సౌరశక్తి ఘటకాల తయారీలో ఇప్పటివరకూ అసాధ్యమనుకున్న ఎన్నో పనులను సుసాధ్యం చేస్తుందని అంచనా. సహజ, మానవ నిర్మిత వజ్రాలతో కొన్ని పోలికలు ఉన్నప్పటికీ ఏఎం–3లో అణువులు, పరమాణువుల అమరిక వజ్రాల మాదిరిగా స్పష్టంగా ఉండదు. ఇలా నిర్మాణంలో తేడాలున్న వాటిని అమార్ఫస్ అని పిలుస్తుంటారు. ప్లాస్టిక్‌తోపాటు జెల్, గాజు కూడా ఈ కోవలోనివే. కానీ, గాజు మాత్రం దృఢంగా ఉండదన్నది మనకు తెలిసిన విషయమే. అయితే చైనాలోని యన్శాన్ వర్సిటీ శాస్త్రవేత్తలు గాజుకు కూడా ఈ దృఢత్వాన్ని అందించేందుకు కొన్ని ప్రయత్నాలు చేశారు. బంతి ఆకారంలో ఉండే కర్బన అణువుల సాయంతో గాజు అణు నిర్మితిని మార్చే ప్రయత్నం చేసి విజయం సాధించారు. పదార్థపు దృఢత్వాన్ని లెక్కించే వికర్స్ హార్డ్నెస్ టెస్ట్‌లో ఏఎం–3 113 జీపీఏ కలిగి ఉందని పరీక్షల్లో తేలింది. ఉక్కు వికర్స్ సూచీ కేవలం తొమ్మిది మాత్రమే. అంటే.. దీనికి కనీసం 13 రెట్లు ఎక్కువ దృఢమైన గాజు తయారైందన్నమాట. సహజసిద్ధమైన వజ్రాల వికర్స్ సూచీ 70 – 100 వరకూ ఉంటుంది. కానీ, శాస్త్రవేత్తలు ఏఎం–3తో వజ్రాన్ని కోసే ప్రయత్నం చేస్తే గాట్లు పడినట్లు స్పష్టమైంది. అంతేకాకుండా.. ఏఎం–3 గాజు 1.5 – 2.2 ఎలక్ట్రాన్ వోల్టుల బ్యాండ్ గ్యాప్‌లో అర్ధవాహకంగా పనిచేస్తున్నట్లు తెలిసింది. మైక్రోప్రాసెసర్ల తయారీకి ఉపయోగించే సిలికాన్ కూడా ఈ బ్యాండ్గ్యాప్లోనే పనిచేస్తుండటం విశేషం. ఇలాంటి పదార్థం అందుబాటులో ఉంటే.. కాంతిని నేరుగా విద్యుత్తుగా మార్చవచ్చని అంచనా. పరిశోధన వివరాలు నేషనల్ సైన్స్ రివ్యూ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
జనసేనకు షాక్: ‘గాజుగ్లాసు’ పోయింది
సాక్షి, హైదరాబాద్: రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికల పోటీలో జనసేన (గాజుగ్లాసు), ఎంసీపీఐ (యూ)-( గ్యాస్ సిలిండర్), ఇండియన్ ప్రజా పార్టీ (ఈల), ప్రజాబంధు పార్టీ (ట్రంపెట్), హిందుస్థాన్ జనతా పార్టీ (కొబ్బరి తోట) కామన్ గుర్తులను కోల్పోయాయి. గతేడాది జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో కనీసం 10 శాతం సీట్లకు పోటీచేయని నేపథ్యంలో ఈ పార్టీలు కామన్ గుర్తులను కోల్పోయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగా ఓట్ల చీలిక నివారణకు పోటీ నుంచి ఉపసంహరించుకున్నట్లు ఎస్ఈసీకి పంపించిన లేఖలో జనసేన అధ్యక్షుడు పేర్కొన్నారు. ఇప్పుడు జరగనున్న ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, ఇతర మున్సిపాలిటీల్లో తాము పోటీచేయాలని నిర్ణయించడంతో తమ అభ్యర్థులకు ‘గాజుగ్లాసు’ కామన్ సింబల్‌ను కొనసాగించాలని ఎస్ఈసీని కోరారు. అయితే ఆయా అంశాలను తాము పరిశీలించామని, జనసేన సమర్పించిన వినతిపత్రంలోని అంశాలు సంతృప్తికరంగా లేకపోవడంతో ఈ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్లు అశోక్‌కుమార్ స్పష్టం చేశారు. దీంతో 2025 నవంబర్ 18 వరకు జనసేన, ఇతర పార్టీలు కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా అర్హత లేదని స్పష్టం చేశారు. -
వైరల్ : గాజు ముక్కలను పరపరా నమిలేస్తాడు
దిందోరీ : కొందరికి తరచూ టీ తాగడం, మరికొందరికి సిగరేట్ తాగడం.. ఇంకొందరికి మద్యం సేవించడం... ఇలాంటి అలవాటు ఉంటాయి. కానీ గాజు ముక్కలు తినడం ఎవరికైనా అలవాటు ఉంటుందా? నాకు ఉందని చెబుతున్నాడు మధ్య ప్రదేశ్‌కు చెందిన దయారాం. దిందోరీ ప్రాంతంలో నివసిస్తున్న న్యాయవాది దయారాం సాహుకు గాజు పెంకులంటే ప్రాణం. బాటిల్ కనిపిస్తే చాలు.. అతడికి నోరూరుతుంది. వెంటనే దాన్ని ఖాళీ చేసి పరపరా నమిలేయాలనేంత ఆశ పుడుతుంది. అందుకే ఇంట్లో వాళ్లు ఆయనకు గాజు సీసాలను దూరంగా పెడతారు. దయారాం 40 ఏళ్లుగా గాజు పెంకులు తింటున్నట్లు జాతీయ వార్త సంస్థకు తెలిపాడు. ‘ఇది నాకు ఒక వ్యసనం. దీనివల్ల నా పళ్లు దెబ్బతిన్నాయి. చిన్నప్పటి నుంచి ఏదైనా భిన్నంగా చేయాలని అనిపించేది. మొదటగా గాజు తిన్నప్పుడు కొంచెం రుచిగా అనిపించింది. నేను గాజు తింటున్నానని తెలియడంలో ప్రజలు ఆశ్చర్యపోయారు. నన్ను ప్రత్యేకంగా చూశారు. దీంతో నేను ఇంకా ఎక్కువ గాజులు తినడం మొదలెట్టాను. ఇప్పుడు ఇది నాకు అలవాటుగా మారిపోయింది. ఇలా గాజు పెంకులు తినాలని నేను ఎవరూ సూచించను. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. నేను కూడా వీటిని తినడం బాగా తగ్గించాను’అని దయారాం సాహు తెలిపారు. -
వైరల్ : గాజు ముక్కలను పరపరా నమిలేస్తాడు
-
మువ్వల నగలు
మువ్వలు సవ్వడి కాలికే అనేది నిన్నటి మాట. నేడు.. మెడలో హారంలా, చెవులకు జాకాల్లా, చేతికి గాజుల్లా.. నవ్వులతో పోటీ పడుతూ చేసే మువ్వల సందడి ఇంతంత కాదు. ఇది వివాహ వేడుకల సమయం. మెడ నిండుగా కళ్లకు పండగలా మువ్వల హారాలు సందడి చేస్తున్నాయి. -
గాజులతో బ్రాస్లెట్
కావల్సినవి : పలచగా ఉండే 4 పాత బ్యాంగిల్స్, 2 చిన్న క్లాంప్స్(షూ లేసుల చివర్లలో ఉండేలాటివి), పట్టుకార, లెదర్ లేస్ తగినంత. తయారీ : ∙4 గాజులను సమానంగా పట్టుకోవాలి. ∙లెదర్ లేస్‌ని చిత్రంలో చూపిన విధంగా ఒక గాజు కిందనుంచి, మరో గాజు మీద నుంచి తీసుకురావాలి. ∙అల్లిక అంతా పూర్తి అయ్యాక చివర్లో మిగిలిన లెదర్‌ని కత్తింరించేయాలి. ∙చివరలను గాజులకు సెట్ చేసి, క్రింప్స్ను పెట్టి, పట్టుకారతో దగ్గరగాకు ఒత్తాలి. మెడ్రన్ డ్రెస్ మీదకు ధరించడానికి బ్రాస్లెట్ రెడీ. -
సెయింట్ గోబెయిన్ మరో ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గ్లాస్ తయారీ దిగ్గజం సెయింట్ గోబెయిన్ మరో ప్లాంటును ఏర్పాటు చేయనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేదా మహారాష్ట్రలో ఇది రానుంది. ఈ మూడు రాష్ట్ర ప్రభుత్వాలతో ప్లాంటు విషయమై చర్చిస్తున్నట్టు సెయింట్ గోబెయిన్ ఇండియా ఫ్లాట్ గ్లాస్ ఎండీ బి.సంతానం చెప్పారు. బుధవారమిక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ యూనిట్‌కు రూ.1,000 కోట్లు వెచ్చిస్తామన్నారు. ‘రెండేళ్లలో తొలి దశ నిర్మాణం పూర్తి చేస్తాం. 600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. దశలవారీగా విస్తరణ చేపడతాం. ప్రభుత్వ సహకారం, ఆగ్నేయ భారత మార్కెట్‌కు అనువైన ప్రాంతం, ముడి సరుకు లభ్యత వంటి అంశాలను బేరీజు వేసుకుని తుది నిర్ణయం తీసుకుంటాం’ అని తెలియజేశారు. రూ.5,200 కోట్ల పెట్టుబడి..: భారత మార్కెట్లో 1996లో ప్రవేశించిన సెయింట్ గోబెయిన్ ఇప్పటి వరకు రూ.4,200 కోట్లు వెచ్చించింది. మరో రూ.1,000 కోట్లతో చెన్నైలో కొత్త ప్లాంటు నెలకొల్పుతోంది. చెన్నై ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా 3,000 మందికి ఉపాధి లభించనుంది. కంపెనీకి వార్షికంగా 14 కోట్ల చదరపు అడుగుల సెలెక్టివ్ హై పెర్ఫార్మెన్స్ కోటెడ్ గ్లాస్ తయారీ సామర్థ్యం ఉంది. 19 తయారీ ప్లాంట్లున్నాయి. రూ.10,000 కోట్ల టర్నోవర్‌తో గ్లాస్ ఇండస్ట్రీలో సెయింట్ గోబెయిన్ అగ్ర స్థానంలో ఉంది. బుల్లెట్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ గ్లాస్‌ను భారత ప్లాంట్ల నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తోంది. -
తలపై గ్లాస్ పగలకొట్టుకున్న ప్రియాంక చోప్రా
-
ప్రియాంక నీకు పిచ్చిపట్టిందా..?
సాక్షి, హైదరాబాద్ : బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓవీడియో సంచలనం కలిగిస్తోంది. ఆ వీడియోలో వైన్ గ్లాస్లో డ్రింక్ తాగేశాక... గ్లాస్‌ను నెత్తికేసి కొట్టుకుంది. దీంతో చేతిలోని గ్లాస్ ముక్కముక్కలుగా పగిలిపోయింది. అదృష్టవశాత్తూ ఆమెకు గాయాలు తగల్లేదు. తాను తీవ్రవత్తడిలో ఉన్నట్లు, అలుపెరగక పనిచేసినట్టు అర్థం వచ్చేలా ఆ రోజును ఒక బ్యాడ్ డే అని ప్రస్తావిస్తూ ఈ వీడియో పోస్టు చేశారు. ఆ వీడియో చూసిన అభిమానులు మాత్రం షాక్‌కు గురయ్యారు. ఇలాంటి పనులు చేయొద్దంటూ కొందరు అభిమానులు హితవు పలికారు. అందరికి రోల్ మోడల్‌గా ఉండాల్సిన ప్రియాంక ఇలాంటి పనులకు దూరంగా ఉండాలంటూ సూచించారు. మరి కొందరు ప్రియాంక నువ్వు పిచ్చి దానివైపోయావా అంటూ మండిపడ్డారు. మరి కొందరు అభిమానులు ప్రియాంకకు ఏమైనా జరిగితే తట్టుకోలేము అనే విధంగా కామెంట్లుపెట్టారు. మీరు బాగానే ఉన్నారా మేడమ్ అంటూ క్షేమసమాచారాలు ఆరాతీశారు. ఏదేమైనా ప్రియాంక చోప్రా హాలీవుడ్‌కు వెళ్లాక చాలా కఠినంగా తయారైనట్టు కనిపిస్తోంది. రోజువారి షూటింగ్‌లతో తీవ్ర వత్తిడి ఎదర్కొంటోందని అభిమానులు అందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రియాంక క్వాంటికో సిరీస్ చేస్తోంది. ఇందులో యాక్షన్ సీన్లు చేసి అలవాటు అయిపోయిందో ఏమో గ్లాస్‌ను అవలీలగా పగలకొట్టేసింది. అయితే ఈ వీడియోపై మరికొందరు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. -
వినూత్న ఫీచర్లతో ఐఫోన్ 7ఎస్!
శాన్ఫ్రాన్సిస్కో: త్వరలో యాపిల్ అభిమానులను పలకరించనున్న ఐఫోన్ 7ఎస్, 7ఎస్ ప్లస్‌తోపాటు ఐఫోన్8 మోడళ్లలో వినూత్న ఫీచర్లు దర్శనమివ్వనున్నాయి. వీటికి సంబంధించి ఇవే ఫొటోలు అంటూ ఆన్లైన్లో కొన్ని దర్శనమిస్తున్నాయి. ఫోన్ల వెనుక భాగం గ్లాస్‌తోపాటు వీటిలో వైర్లెస్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉండనుందని తెలుస్తోంది. ఈ 3 మోడళ్లను యాపిల్ వచ్చే నెలలో విడుదల చేయనుందన్న వార్తలు రాగా, 2018 ప్రారంభం వరకు రాకపోవచ్చన్న విరుద్ధ వార్తలు కూడా వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ వీటి విడుదలకు సంబంధించి సెప్టెంబర్ నాటికి స్పష్టత వస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
సిల్క్ గాజులు
ఆభరణం దారాలతో బట్టలు కుట్టవచ్చు, పూసలు గుచ్చవచ్చు. అంతేనా.. ఇలా అందమైన గాజులను, హారాలను, చెవి లోలాకులనూ సులువుగా తయారుచేసుకోవచ్చు. సంప్రదాయ వస్త్రాలంకరణలో ఈ ఆభరణాలను ధరించవచ్చు. డ్రెస్‌కు తగిన మ్యాచింగ్ సిల్క్ దారాలను ఎంచుకోవాలి. గట్టి అట్టముక్క లేదా ప్లాస్టిక్, మెటల్ గాజును ఇందుకు ఉపయోగించాలి. గ్లూతో పాటు ఎంపిక చేసుకున్న పూసలు, స్టోన్స్ తీసుకోవాలి. ఒక చెక్కకు ముందుగా దారాన్ని వరుసలుగా చుట్టాలి. తర్వాత దారాలను తీసి, చివరలను గ్లూతో అతికించాలి. ఒకవైపు దారంతో గాజుకు చుట్టాలి. ఎక్కడా దారం పైకి రాకుండా నీటుగా ఉండేలా చూసుకోవాలి. చివరలను గ్లూతో అతికించేయాలి. ఎంచుకున్న డిజైన్ స్టోన్ పీస్‌ని తీసుకొని, గాజుపై గ్లూ రాసి అతికించాలి. తగినంత తీసుకొని, మిగతాది కట్ చేసి పూర్తిగా అతికించాలి. అందమైన సిల్క్ దారాల గాజులు సిద్ధం. ఇలాగే చెవిరింగులు, హారాలు తయారుచేసుకోవచ్చు. ఉమ వనస్థలిపురం హైదరాబాద్ -
గొరిల్లా గ్లాస్-5 వచ్చేసింది!
న్యూయార్క్ః మార్కెట్లో లభ్యమవుతున్న వివిధ మోడళ్ళ స్మార్ట్ ఫోన్ లు అధునాతన గొరిల్లా గ్లాస్ స్క్రీన్ లను కలిగి ఉంటున్నాయి. ఇలా గొరిల్లా గ్లాస్ ఉన్న ఫోన్లు ఎత్తునుంచీ కింద పడినా స్ర్నీన్ దెబ్బతినదన్న విషయం చాలామందికి ఇప్పటికే తెలిసిన విషయం. ఈ గ్లాస్ గీతలు పడకుండా కూడా నిరోధిస్తుంది. అయితే ఇప్పుడు గొరిల్లా గ్లాస్ 5 మరింత మన్నికతో, ధృఢంగా మార్కెట్లోకి ప్రవేశించింది. గ్లాస్ మేకర్ కార్నింగ్.. కొత్త గొరిల్లా గ్లాస్ 5 ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు, ఎలక్ట్రానిక్స్ తయారీదారులు తమ పరికరాల్లో ఉపయోగించే ఈ సూపర్ గ్లాస్ ను ఇప్పుడు రసాయనికంగా మరింత ధృఢంగా, బలంగా ఉండేట్టు రూపొందించారు. ఈ కొత్త గ్లాస్.. 1.6 మీటర్ల ఎత్తునుంచీ కిందపడినా 80 శాతం వరకూ పగిలే అవకాశమే ఉండదని ఉత్పత్తిదారులు చెప్తున్నారు. ముఖ్యంగా గాడ్జెట్ల పనితీరును మెరుగు పరిచేందుకు వీలుగా ఈ కొత్త గొరిల్లా గ్లాస్ 5 ను రూపొందించారు. భుజం లేదా నడుము ఎత్తునుంచీ గట్టిగా ఉండే ఉపరితలంపై పడినా స్మార్ట్ ఫోన్లు, గాడ్జెట్లకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా, గ్లాస్ పగలకుండా ఉండేట్టు తయారు చేసినట్లు పేర్కొన్నారు. 2014 లో కార్నింగ్... గొరిల్లా గ్లాస్ 4 ను ప్రవేశ పెట్టింది. అప్పట్లో ఆ గ్లాస్ ను 1 మీటర్ ఎత్తునుంచి పడినా పగలకుండా, దెబ్బతినకుండా ఉండేట్లు రూపొందించింది. ఇప్పుడు ఈ కొత్త గొరిల్లా గ్లాస్ 5 ను మునుపటికంటే రెండు రెట్లు దృఢంగా రూపొందించినట్లు కార్నింగ్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ జాన్ బేన్ తెలిపారు. గొరిల్లా గ్లాస్ ను మొట్టమొదట 2007 లో ఎలెక్ట్రానిక్ పరికరాల్లో వినియోగించడం ప్రారంభించారు. అప్పట్నుంచీ మరింత మన్నిక పెరిగేలా, గీతల్ని నిరోధించేలా, మరింత పలుచగా తయారు చేసేందుకు కార్నింగ్ సంస్థ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పటివరకూ సుమారు 4.5 బిలియన్ల పరికరాల యూనిట్లకు గొరిల్లా గ్లాస్ రవాణా జరిగినట్లు కంపెనీ చెప్తోంది. శాంసంగ్, హెచ్‌టీసీ, హెవావే, ఎల్జీ, హెచ్‌పీ, ఆసుస్ వంటి పేరు పొందిన తయారీదారులతోపాటు.. మరెందరో పేరులేని పరికరాల ఉత్పత్తిదారులు కూడా కార్నింగ్ గ్లాస్ ను ఉపయోగించి పరికరాలు చేస్తున్నట్లు జాన్ తెలిపారు. -
ఇంటికి వెలుగునిచ్చే గాజులాంటి చెక్క!
లండన్: ఇంటిని అందంగా తీర్చి దిద్దడంలోనూ, అలంకరణ కోసమేకాక ఇంట్లో వెలుతురు నింపేందుకు గాజు పదార్థాన్నివినియోగించడం ఇప్పటి దాకా చూస్తున్నాం. అలా అమర్చిన గ్లాస్ పగిలి పోకుండా ఎంతో సున్నితంగా చూసుకుంటున్నాం. అయితే ఇప్పుడిక ఆ భయం లేదంటున్నారు పరిశోధకులు. గృహ నిర్మాణాల్లో గోడలకు, కిటికీలకు వాడే అద్దానికి బదులుగా గాజును పోలి ఉండే పారదర్శకమైన చెక్కను అందుబాటులోకి తెస్తున్నారు. భవన నిర్మాణం చేపట్టేవారు ఇక ఇంట్లో వెలుతురుతోపాటు, అందాన్ని తెచ్చుకునేందుకు గాజుకంటే బలమైన చెక్కను వాడి డబ్బును ఆదా చేసుకోవచ్చంటున్నారు. ఇంటి గోడల గుండా కాంతి ప్రసరించి ఇల్లు ప్రకాశవంతంగా ఉండేందుకు గృహ నిర్మాణంలో అద్దాలను వాడటం జరుగుతోంది. అయితే ఇప్పుడు అదే స్థానంలో ఎంతో ధృఢంగా ఉండి.. గాజులాంటి పారదర్శకంగా ఉండే చెక్కను వాడొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. కొత్తగా అందుబాటులోకి తెస్తున్న ఈ పదార్థాన్ని సోలార్ సెల్ విండోగా కూడ వినియోగించవచ్చని బయోమాక్రోమోలెక్యూల్స్ జర్నల్ లో వివరించారు. నిజానికి ఇంటిని ప్రకాశవంతంగా ఉంచుకునేందుకు, విద్యుత్తును ఆదా చేసేందుకు లేత రంగు అద్దాలను పైకప్పులకు అమర్చుకోవడం, దీపాలను ఆశ్రయించడం చేస్తుంటారు. అయితే ఈ పారదర్శకంగా ఉండే చెక్క తో అటువంటి సమస్యను తీర్చవచ్చని పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు. ముఖ్యంగా గోడలు పారదర్శకంగా ఉంటే కృత్రిమ వెలుగుల అవసరాన్ని తగ్గిస్తాయి. ఇప్పటికే చెక్కనుంచి పారదర్శకమైన కాగితాన్ని తయారు చేస్తుండగా, ప్రస్తుత పరిశోధనల్లో అదే కాగితాన్ని ధృఢంగా, బలమైన పదార్థంగా తయారు చేయడం సాధ్యమని కనుగొన్నారు. స్వీడన్ లోని స్టాకోట్ కెటిహెచ్ రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన బెర్గ్ లండ్, అతడి సహచరులు జరిపిన పరిశోధనల్లో ఈ కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఇందుకోసం ముందుగా వాణిజ్య బాల్సా చెక్క నమూనాలనుంచి పరిశోధకులు లైనిన్ తొలగించారు. సాధారణంగా మొక్కల్లో ఉండే లైనిన్ చెక్కనుంచి కాంతిని ప్రసరించకుండా చేస్తుంది. అయితే దీన్ని తొలగించడం వల్ల పూర్తి శాతం పారదర్శకత చేకూరదు. అందుకే చెక్కనుంచీ నేరుగా కాంతి లోపలకు ప్రసరించేందుకు వీలుగా యాక్రిలిక్ ను ఉపయోగిస్తున్నారు. దీంతో రెండు రెట్లు బలమైన గాజులాంటి చెక్క తయారవుతుందని చెప్తున్నారు. -
పూసలు గుసగుసలాడే...
రాతికి ప్రాణం పోసే సుగుణం... లోహాలకు లాలిత్యం అద్దే నేర్పు అతివకు సొంతం. గాజు, ప్లాస్టిక్, ముత్యం... పూసలేవైనా.. రంగులెన్నయినా... పడతుల మెడలో చేరితే అవి చెప్పే ఊసులెన్నో..! చెప్పకుండానే ఒలికే భాషలెన్నో..! వర్ణాలన్నీ ఒద్దికగా జట్టు కట్టి... శంఖమంటి మెడలో హారమై రూపుకడితే దివిలోన తారకలను మించిన మెరుపులతో పూసలు నిత్యం తళుక్కుమంటూనే ఉంటాయి. గిరిజన స్త్రీ నుండి ఆధునిక యువతి వరకు పూసల హారాలను ధరించడం తెలిసిందే! పూసలను ఎక్కువగా గాజు, ప్లాస్టిక్, రాళ్లతో తయారుచేస్తారు. కొన్ని పూసలు ఎముక, కొమ్ము, దంతం, లోహాలు, ముత్యాలు, మట్టి, పింగాణీ, లక్క, కర్ర, విత్తనాలతోనూ తయారుచేస్తారు. పూసలను గుచ్చడానికి నైలాన్ లేదా ప్లాస్టిక్ దారాన్ని ఉపయోగించి గుచ్చుతారు. ఆభరణాలలో అయితే బంగారు లోహపు తీగతో గుచ్చి రాలిపోకుండా ముడివేస్తారు. బంగారు తీగ స్థానంలో రాగి, ఇత్తడి.. కట్టు తీగలను కూడా ఉపయోగిస్తుంటారు. దుస్తులకు తగిన ఎంపిక: డ్రెస్ కలర్, ప్రింట్, పాశ్చాత్యం, సంప్రదాయం.. ఇలా అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బీడ్స్‌ను ఎంచుకోవాలి ప్లెయిన్ రంగుల దుస్తుల మీదకు మల్టీకలర్ బీడ్స్ బాగా కనిపిస్తాయి ఎక్కువ ప్రింట్లున్న దుస్తుల మీదకు మల్టీకలర్ కాకుండా, దుస్తుల్లోని ఏదో ఒక సెంటర్ కలర్ బీడ్స్ తీసుకొని హారాలను, లోలాకులను తయారుచేసుకోవచ్చు టెంపుల్ జువెల్రీ అయితే కంచిపట్టు, ఉప్పాడ.. వంటి సంప్రదాయ తరహా దుస్తుల మీదకు బాగుంటాయి కెంపులు, ముత్యాలు సాధారణంగా అన్ని రకాల దుస్తుల మీదకు బాగా నప్పుతాయి పచ్చలు మాత్రం మ్యాచింగ్ డ్రెస్సుల మీదకు బాగుంటాయి జీన్స్ వంటి ఆధునిక వస్త్రాలంకరణకు పూసలు ఎక్కువగా ఉన్న ఆభరణాలను ఎంచుకోవద్దు. పూసలు లేకుండా ఒక పెద్ద లాకెట్ ఉన్న చైన్స్, లోలాకులు బాగుంటాయి. సాయంకాలపు వేడుకలకు ముత్యాలు సంద ర్భోచితంగా ఉంటాయి లాకెట్లో ఉన్న రంగును పోలిన పూసలను హారం తయారీకి ఉపయోగిస్తే మరింత ఆకర్షణీయంగా ఆభరణం కనిపిస్తుంది చెక్క పూసలు, రాయి, స్ఫటికం.. ఇతర పెద్ద పెద్ద పూసలు మోడ్రన్ దుస్తుల మీదకు బాగా నప్పుతాయి. పూసల నాణ్యతను బట్టి ఖరీదు ఉంటుంది. తగినవి: నచ్చిన పూసలు(బీడ్స్), బాల్స్, లోహపు తీగ /దారం/ నైలాన్ వైర్, రౌండ్నోస్ ప్లైర్, కటర్, ప్లాట్ ప్లైర్. తయారీ: పూసల బరువును బట్టి లోహపు తీగ(సన్నం/లావు) ను తగినంత కట్ చేసి, తీసుకోవాలి. తీగ చివరల్లో రౌండ్నోస్ ప్లైర్తో ఒక రౌండ్ మెలితిప్పి, పూసకు గుచ్చి, పై భాగంలోనూ ముడిలా తిప్పాలి. ఇలాగే తీగకు ఒక్కో పూసను గుచ్చుతూ, తగినంత పరిమాణంలో హారాన్ని తయారుచేసుకోవాలి. ఇలాగే జూకాలనూ తయారుచేసుకోవచ్చు. ఎప్పటికీ...: సాధారణంగా చెమట, ఉప్పునీరు ఆభరణం అందాన్ని దెబ్బతీస్తాయి. కొనుగోలు చేసినదైనా, సొంతంగా తయారుచేసుకున్నదైనా.. ఆభరణం ఎప్పటికీ ఆకర్షణను కోల్పోకుండా ఉండాలంటే... ప్లాస్టిక్, గాజు, చెక్క.. పూసలు, గవ్వలు, శంఖులు, నవరత్నాలు.. ఏ తరహా ఆభరణం అయినా ధరించిన తర్వాత దూది ఉండతో లేదా కాటన్ క్లాత్‌తో తుడిచి, గాలి చొరబడని ప్లాస్టిక్ బ్యాగ్/బాక్స్‌లలో భద్రపరుచుకోవాలి. పెర్ఫ్యూమ్స్, రసాయనాలు ఆభరణాలకు తగలకూడదు. సుధా రెడ్డి ఆభరణాల నిపుణురాలు, హైదరాబాద్ www.facebook.com/jewelpatterns మోడల్: సంధ్య; ఫొటోలు: శివ మల్లాల -
ఆ ‘ఊరి’ కూరగాయలు...
ప్రత్యేకం ప్రతి ఇంటికీ నాలుగు కాయగూర మొక్కలుంటే వంటకు తడుముకోవక్కర్లేదు. రోజురోజుకీ పెరిగిపోతున్న కాయగూరధరల కారణంగా పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టాలనుకున్నారు కేరళలోని పడమటి కనుమల్లో మారుమూల ప్రాంతానికి చెందిన లిక్కనానమ్ గ్రామస్తులు. అధిక పెట్టుబడుల కారణంగా ఆ ఊళ్లో రైతులు కాయగూరలు పండించడానికి ముందుకు రాకపోవడంతో దూరంగా ఉన్న మార్కెట్‌కి వెళితేగాని నాలుగు రకాల కాయగూరలు కళ్లచూడని దుస్థితి. ఎలాగైనా ఈ గడ్డు పరిస్థితి నుంచి బయటపడాలనుకున్నారు ఆ గ్రామంలోని స్వయం ఉపాధి సంఘాలకు చెందిన మహిళలు. వారు ఓ స్వచ్ఛంద సంస్థతో ఒప్పందం పెట్టుకుని రకరకాల కాయగూరల మొక్కల్ని ఇంటింటికీ పంచాలనుకున్నారు. మంచి నీళ్లు తాగే ప్లాస్టిక్ గ్లాసుల్లో మొలకలు పెట్టి మహిళలందరికీ పంచారు. ఇంటికి ఐదు రకాల మొక్కల చొప్పున అందరిళ్లలో మొక్కలు నాటేవరకూ వాళ్లు నిద్రపోలేదు. అంతేకాదు... అప్పుడప్పుడు వాటిని పర్యవేక్షించే పనికూడా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఓ రోజుతో వదిలేయకుండా విడతలవారీగా కాయగూర మొక్కల్ని పంచే అక్కడి మహిళల పథకాన్ని చుట్టుపక్కల గ్రామాల వరకూ విస్తరించడానికి ప్రయత్నించడం విశేషం. ఇలా పెంచే మొక్కలకు రసాయనిక ఎరువులు వాడకూడదనేది అక్కడి మహిళలు పెట్టిన నిబంధన. కేవలం సేంద్రియ ఎరువులతోనే ఆ మొక్కల్ని పెంచాలి. ఎంచక్కా పెరట్లో నాలుగు రకాల కాయగూరలు అందుబాటులో ఉంటే ఆదాతో పాటు ఆరోగ్యం కూడా వుంటుందంటున్నారు లిక్కనానమ్ గ్రామ మహిళలు.