
మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్
షాద్‌నగర్ (హైదరాబాద్): రంగారెడ్డి జిల్లా బూర్గులలోని సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో శుక్రవారం జరిగిన పేలుడు ఘటనపై షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈమేరకు పరిశ్రమ యాజమాన్యంపై 304, 336, 337, 338, 287 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు షాద్‌నగర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రామిరెడ్డి తెలిపారు.
మరోవైపు పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై హైదరాబాద్‌కు చెందిన సీనియర్ న్యాయవాది ఇమ్మనేని రామారామా జాతీయ మానవహక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. పరిశ్రమ యాజమాన్యం, రాష్ట్ర పరిశ్రమల డైరెక్టర్‌పై చర్యకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
కాగా, పేలుడు ఘటనపై నిష్ణాతులైన పోలీసు క్లూస్‌టీం పేలుడు సంభవించిన ప్రాంతంలో ఆధారాలను సేకరించి ల్యాబ్‌కు పంపించింది. ల్యాబ్ నివేదిక వచి్చన వెంటనే పోలీస్ స్టేషన్‌కు పంపిస్తామని క్లూస్ టీం సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment