case file
-
Karnataka: బీజేపీ నేతపై లైంగిక వేధింపుల కేసు
బెంగళూరు: కర్ణాటక బీజేపీ నేత అరుణ్ కుమార్ పుతిల పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. 47 ఏళ్ల మహిళ ఫిర్యాదు మేరకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.పోలీసులు వివరాల ప్రకారం.. 2023 జూన్‌లో బెంగళూరు హోటల్లో బీజేపీ నాయకుడు అరుణ్ కుమార్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో ఫొటోలు, సెల్ఫీలు, వీడియోలు తీసి వాటిని అడ్డుపెట్టుకొని బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపించారు.మహిళ ఫిర్యాదు మేరకు దక్షిణ కన్నడ జిల్లాలో అరుణ్ కుమార్‌పై లైంగిక వేధింపులు, బ్లాక్మెయిల్, బెదిరింపులు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. కాగా పుత్తూరు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసిన పుతిల మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయన కాషాయ పార్టీలో చేరారు. -
పూణే తరహాలో మరో హిట్ అండ్ రన్.. బైకర్ మృతి
ముంబై: మహారాష్ట్రలో హిట్ అండ్ రన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఓ మైనర్ బాలుడు మద్యం సేవించి కారు నడిపి.. బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ప్రమాద ఘటనలో కారు నడిపిన మైనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున మైనర్(17) ఎస్యూవీ కారును రాంగ్ రూట్లో నడుపుతూ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టాడు. ఈ క్రమంలో బైక్‌పై ఉన్న నవీన్ వైష్ణవ్(24) తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం, కారు పక్కనే ఉన్న కరెంట్ స్థంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న మైనర్ గాయపడటంతో కిందపడిపోయాడు. ప్రమాదం జరిగిన తర్వాత మైనర్ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయడంతో స్థానికులు అతడిని పట్టుకున్నారు.స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని నవీన్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే నవీన్ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా, నవీన్ వైష్ణవ్ ఆ ఏరియాలో పాలు అమ్మే వ్యక్తిగా గుర్తింంచారు. ఇక, ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మైనర్‌ను అరెస్ట్ చేశారు. మైనర్‌ను ముంబైకి చెందిన ఇక్బాల్ జివానీ కుమారుడిగా గుర్తించారు. ఈ సందర్భంగా ఇక్బాల్‌పై కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు.. ప్రమాదం సమయంలో నిందితుడు మద్యం సేవించి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
ఆర్జీ కార్ ఆస్పత్రి.. మాజీ ప్రిన్సిపల్ సందీష్ ఘోష్‌పై కేసు నమోదు
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీకార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై కేసు నమోదైంది. ఆర్జీ కార్ ఆస్పత్రి హత్యోదంతంలో సందీష్ ఘోష్ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా సందీష్ ఘోష్ ప్రిన్సిపల్‌గా ఉన్న సమయంలో ఆర్థిక అవకతవకలు జరిగాయా? అన్న కోణంలో కోల్‌కతా పోలీసులు దృష్టి సారించారు. అయితే ఆస్పత్రిలో సందీష్ ఘోష్ తన అధికారాన్ని ఉపయోగించి అవినీతికి పాల్పడ్డారంటూ ఈ ఏడాది జూన్‌లో పలువురు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈ అంశం పరిశీలనలో ఉండగా.. తాజాగా కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. సందీష్ ఘోష్ 2021లో ఆర్జీకార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో అవినీతి జరుగుతుందంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సిట్‌ను ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు. ఇన్స్పెక్టర్ జనరల్ ప్రణబ్ కుమార్ నేతృత్వంలోని సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఈ తరుణంలో ఆగస్టు 9న ఆర్జీ కార్లో జరిగిన దారుణంతో సందీప్ ఘోష్ వ్యవహరించిన తీరు మరింత వివాదాస్పదంగా మారింది. దుర్ఘటన జరిగిన రెండు రోజులకే ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేయడం.. ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోల్‌కతా హైకోర్టు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు గత నాలుగు రోజులుగా సందీప్ ఘోష్‌ను 53 గంటల పాటు విచారించారు. దర్యాప్తు కొనసాగుతుండగానే కోల్‌కతా పోలీసులు సందీప్ ఘోష్ అవినీతికి పాల్పడ్డారంటూ కేసు నమోదు చేయడం మరింత ఉత్కంఠగా మారింది. సందీష్ ఘోష్ ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేసినప్పటికీ అతని చుట్టూ ఉన్న వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తదుపరి నోటీసు వచ్చేవరకు ఘోష్‌ను మరే ఇతర వైద్య కళాశాలలో నియమించవద్దని రాష్ట్ర ఆరోగ్య శాఖను కోల్కత్తా హైకోర్టు ఆదేశించింది. -
మేడిగడ్డ బ్యారేజ్ డ్రోన్ వీడియోపై కేసు నమోదు
-
ఎవరి సంతోషం కోసం మూడేళ్లకు అక్రమ కేసు?
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పక్కా పన్నాగంతో తప్పుడు కేసు నమోదు చేశారని మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, వ్యక్తిగత ద్వేషంతోనే రఘురామకృష్ణరాజు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. అరెస్ట్ చేసిన తరువాత ఆయన్ను కస్టడీలో వేధించినట్లు చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు.ఆయన అరెస్ట్ విషయంలో, ఆ తరువాత కూడా సీఐడీ అధికారులు నిబంధనల మేరకే వ్యవహరించారని స్పష్టం చేశారు. ఎవరి సంతోషం కోసమో మూడేళ్ల తర్వాత తప్పుడు కేసు నమోదు చేసి పోలీసులు ఓ సాంప్రదాయానికి తెర తీశారని చెప్పారు. ఈ చర్యకు భవిష్యత్తులో వారే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరినో సంతోషపెట్టడం.. మరెవరినో ఇబ్బంది పెట్టడం కోసమే 2021 మే 14న అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు కాగా ఆయన్ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి సంబంధిత జ్యూరిస్ డిక్షన్ పరిధిలోని గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారని పొన్నవోలు చెప్పారు. ‘పోలీస్ కస్టడీలో తనను టార్చర్ చేశారంటూ రఘురామకృష్ణరాజు విచిత్రంగా మూడేళ్ల తర్వాత.. గత నెల 11న గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈనెల 11న కేసు నమోదు చేశారు. ఆ ఫిర్యాదుపై నెల రోజుల తరవాత పోలీసులు స్పందించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు కొందరు పోలీస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి 307 సెక్షన్ కింద కేసు పెట్టారు. ఎవరినో సంతోషపెట్టడం, మరెవరినో ఇబ్బంది పెట్టడం కోసమే ఈ కేసు నమోదు చేసినట్లు స్పష్టమవుతోంది’ అని పేర్కొన్నారు. వాంగ్మూలం ఒకటి.. ఫిర్యాదు మరొకటి 2021లో రఘురామకృష్ణరాజును గుంటూరు కోర్టులో హాజరు పర్చినప్పుడు ఆయన చెప్పిన మాటలకు, ఇప్పుడు ఫిర్యాదులో చేసిన ఆరోపణలకు ఏమాత్రం పొంతన లేదు. ముఖానికి రుమాలు కట్టుకున్న గుర్తు తెలియని వ్యక్తులు పోలీసు కస్టడీలో తనను టార్చర్ చేశారని నాడు మేజిస్ట్రేట్ ఎదుట ఆయన వాంగ్మూలం ఇచ్చారు. కానీ గత నెలలో చేసిన ఫిర్యాదులో మాత్రం విచిత్రంగా పోలీసు ఉన్నతాధికారుల పేర్లు చెప్పారు. సీనియర్ ఐపీఎస్ అధికారులు సునీల్, సీతారామాంజనేయుల పేర్లు ప్రస్తావించారు. తనను హింసిస్తున్న వీడియోను వైఎస్ జగన్ చూశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంతకన్నా తప్పుడు కేసు ఉండదు మూడేళ్ల తర్వాత ఫిర్యాదు చేస్తే.. అందులో ప్రస్తావించిన వారందరిపైనా ఇప్పుడు కేసు నమోదు చేయడం పూర్తిగా అసమంజసం. అసలు ఈ కేసులో వైఎస్ జగన్ ఎలా నిందితుడు అవుతారు? ఇంతకన్నా తప్పుడు కేసు మరొకటి ఉండదు. కేవలం దురుద్దే«శం, ద్వేషంతో రఘురామరాజు ఫిర్యాదు చేస్తే పోలీసులు అత్యుత్సాహంగా స్పందించారు. నాడు మెజి్రస్టేట్ ఎదుట రఘురామ చెప్పిందేమిటి? మూడేళ్ల తర్వాత ఫిర్యాదు చేయడం ఏమిటి? అని పోలీసులు కనీసం ఆలోచించరా? టార్చర్ చేయనేలేదు రఘురామరాజును నాడు సీఐడీ కస్టడీలో ఏమాత్రం టార్చర్ చేయలేదు. ఆయన కోరడంతో కోర్టు ఆదేశాల మేరకు వైద్య బృందం పరీక్షించి రఘురామ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని నివేదిక ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో జైలు నుంచి విడుదల అయిన తరువాత రఘురామరాజు ఒక్కరే తన సొంత వాహనంలో హైదరాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి వెళ్లారు. పోలీసుల సూచనను బేఖాతర్ చేస్తూ అలా వెళ్లిన రఘురామరాజు ఆర్మీ ఆస్పత్రిలో తన శరీరంపై గాయాలు చూపారు. దాన్నిబట్టి ఆయన ప్రయాణంలో ఏం జరిగి ఉంటుందన్నది అందరూ అర్థం చేసుకోవాలి. ముందే కల గన్నారా? రఘురామరాజు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి వైఎస్ జగన్‌ను, డాక్టర్‌ను కూడా ముద్దాయిలుగా చేర్చడం సరికాదు. పాలించే వ్యక్తి మారితే చట్టం మారుతుందా? ఆ వ్యక్తికి వంత పాడుతుందా? అసలు చట్టం, న్యాయం, ప్రాథమిక సూత్రాలు ఏం చెబుతున్నాయో పట్టించుకోరా? 77 రోజుల తర్వాత సాక్షులను విచారించడమే సరికాదని సుప్రీంకోర్టు గతంలో చెప్పిన విషయం తెలియదా? అలాంటప్పుడు మూడేళ్ల తర్వాత విచారిస్తే ఏం జరుగుతుంది? రఘురామ గత నెల 11న ఈ – మెయిల్ ద్వారా గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేస్తే అంతకు ఒక రోజు ముందే అంటే జూన్ 10వ తేదీనే పోలీసులు లీగల్ ఒపీనియన్ ఎలా పొందారో చెప్పాలి. రఘురామ ఫిర్యాదు చేస్తారని పోలీసులు ముందుగానే కల గన్నారా? చట్టపరంగానే ఎదుర్కొంటాం ఈ తప్పుడు కేసును చట్టపరంగా, న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఈ కేసు విషయంలో పోలీసులు వ్యవహరించిన విధానం సరికాదు. ఇదో సంప్రదాయంగా మారితే భవిష్యత్తులో పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోతుంది. ఈ పరిణామం ప్రజాస్వామ్య వ్యవస్ధకే కళంకం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుపై గత ప్రభుత్వ హయాంలో కేసు నమోదు చేయలేదు. 2015లోనే టీడీపీ హయాంలోనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఆ కేసు నమోదు చేసింది. -
భూ కుంభకోణం.. సీఎం సిద్దరామయ్య భార్యపై కేసు
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి, ఆమె సోదరుడు మల్లికార్జున్, మరొకరిపై పోలీసులకు కేసు నమోదైంది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంలో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. భూకేటాయింపుల కుంభకోణంలో సిద్ధరామయ్య, ఆయన సతీమణి పార్వతి, ముడా అధికారులతోపాటు మైసూరు జిల్లా కలెక్టర్, ఇతర ప్రభుత్వ అధికారులు ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ ఈ ఫిర్యాదు చేశారు. ఈ వివాదంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కృష్ణ కర్ణాటక గవర్నర్, చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ కూడా రాశారు.స్నేహమయి కృష్ణ ఫిర్యాదు మేరకు.. సిద్ధరామయ్య బావమరిది మల్లికార్జున్ ఇతర ప్రభుత్వ, దేవాదాయ శాఖ అధికారుల సహకారంతో 2004లో అక్రమంగా భూమిని సేకరించి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. సీఎం సతీమణి పార్వతి, మల్లికార్జున్, మరో వ్యక్తి ఈ పత్రాలను ఉపయోగించి ముడాకు చెందిన కోట్లాది రూపాయలను మోసం చేశారని ఆరోపించారు.తన ఫిర్యాదుపై పోలీసులు అంగీకారపత్రం అందించారని, కానీ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసినందున ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆమె చెప్పారు.తన ఫిర్యాదు మేరకు ఏడు రోజుల్లోగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త పోలీసులను కోరారు.కాగా 2021లో రాష్ట్రంలో బీజేపీ హయాంలో సిద్దరామయ్య భార్య ముడా ఆర్డర్‌కు లబ్ధిదారుగా ఉన్నందున భూ కేటాయింపుల కుంభకోణం వార్తల్లో నిలిచింది. ఆ సమయంలో ఆమెకు సంబంధించిన 3.16 ఎకరాల భూమిని అక్రమంగా సేకరించినందుకు పరిహారంగా... మైసూరులోని ప్రధాన ప్రదేశాలలో 38,284 చదరపు అడుగుల భూమిని తనకు కేటాయిచారు. మైసూరులోని కేసరే గ్రామంలోని 3.16 ఎకరాల భూమిని సోదరుడు మల్లికార్జున్ ఆమెకు బహుమతిగా ఇచ్చారు. అయితే ఈ భూమిని అభివృద్ధి కోసం ముడా స్వాధీనం చేసుకోగా.. పార్వతికి 2021లో బీజేపీ దక్షిణ మైసూర్‌లోని ప్రధాన ప్రాంతమైన విజయనగర్ 3, 4వ దశ లేఅవుట్లలోని సైట్లను ఆమెకు పరిహారం చెల్లించింది, ఇది కేసరే గ్రామంలోని అసలు భూమి కంటే చాలా ఎక్కువగా ఉందని ఆరోపణలు వచ్చాయి.అయితే, ఈ కేటాయింపును గత బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని పేర్కొంటూ సిద్ధరామయ్య సమర్థించారు. కేసరెలోని దేవనూరు 3వ స్టేజీ లేఅవుట్లో స్థలాలు అందుబాటులో లేకపోవడంతో విజయనగరంలో ఉన్న స్థలాలకు పరిహారం చెల్లించాలని ముడా నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. -
తిరువూరు: కొలికపూడి అరాచకం.. కేసు నమోదు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదైంది. నిన్న(మంగళవారం) జరిగిన కంభంపాడు ఘటనపై వైఎస్సార్సీపీ ఎంపీపీ నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి, టీడీపీ నాయకులు దౌర్జన్యంగా తన ఇల్లు ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి, మరికొందరిపై కేసు నమోదు చేసిన ఏ.కొండూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిన్నటి ఘటనలో వీడియోల ఆధారంగా ఇప్పటివరకు 60 మందికిపైగా పోలీసులు గుర్తించారు.తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కంభంపాడులో అరాచకం సృష్టించారు. ఎన్నికల సమయంలో జరిగిన ఓ సంఘటనను దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్సీపీకి చెందిన ఎ.కొండూరు ఎంపీపీపై కక్షసాధింపు చర్యలకు దిగారు. జేసీబీతో ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి ఇంటిని ధ్వంసం చేయించి, కంభంపాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని కంభంపాడు పోలింగ్ కేంద్రంలోకి తన అనుచరులతో కలిసి అక్రమంగా ప్రవేశించబోయారు. అనుచరులతో కలిసి వెళ్లడాన్ని ఎంపీపీ నాగలక్ష్మి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతలు ఎంపీపీపై కక్షకట్టారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మంగళవారం ఉదయమే మందీ మార్బలంతో కంభంపాడు వచ్చారు. ఎంపీపీ నిర్మిస్తున్న భవనం ఆక్రమిత స్థలంలో ఉందంటూ అధికారులపై వత్తిడి తెచ్చారు. దానిని కూల్చివేయాలంటూ అధికారులకు హుకుం జారీ చేశారు.ఎమ్మెల్యే ఆదేశాలతో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులు, రెవెన్యూ సిబ్బంది కంభంపాడు చేరుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భవనం కూల్చివేతకు చేసిన హంగామా స్థానికుల్ని భయాందోళనలకు గురి చేసింది. ఎమ్మెల్యే వర్గీయులే పొక్లయిన్‌ను తీసుకొచ్చి పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలోనే ఎంపీపీ భవనాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. -
సౌత్ గ్లాస్ కంపెనీపై కేసు
షాద్‌నగర్ (హైదరాబాద్): రంగారెడ్డి జిల్లా బూర్గులలోని సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో శుక్రవారం జరిగిన పేలుడు ఘటనపై షాద్‌నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈమేరకు పరిశ్రమ యాజమాన్యంపై 304, 336, 337, 338, 287 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు షాద్‌నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డి తెలిపారు. మరోవైపు పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై హైదరాబాద్‌కు చెందిన సీనియర్ న్యాయవాది ఇమ్మనేని రామారామా జాతీయ మానవహక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. పరిశ్రమ యాజమాన్యం, రాష్ట్ర పరిశ్రమల డైరెక్టర్‌పై చర్యకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, పేలుడు ఘటనపై నిష్ణాతులైన పోలీసు క్లూస్‌టీం పేలుడు సంభవించిన ప్రాంతంలో ఆధారాలను సేకరించి ల్యాబ్‌కు పంపించింది. ల్యాబ్ నివేదిక వచి్చన వెంటనే పోలీస్ స్టేషన్‌కు పంపిస్తామని క్లూస్ టీం సభ్యులు తెలిపారు. -
యడ్యూరప్పపై కేసు పెట్టిన మహిళ మృతి
బెంగళూరు: బీజేపీ సీనియర్‌నేత, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పపై లైంగిక దాడి కేసు పెట్టిన మహిళ మరణించింది. దీర్ఘకాలిక అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించిందని సమాచారం. బెంగళూరు డాలర్‌సిటీలోని యడ్యూరప్ప ఇంటికి ఈ ఏడాది ఫిబ్రవరి2న తన కూతురుతో కలిసి వెళ్లానని, ఈ సందర్భంగా తన కూతురిపై యడ్యూరప్ప లైంగికదాడి చేశారని మహిళ కేసు పెట్టింది. దీంతో మార్చి 14న బెంగళూరు సదాశివనగర్ పోలీస్‌స్టేషన్‌లో యడ్యూరప్పపై పోక్సో చట్టంలోని సెక్షన్ 8తో పాటు ఐపీసీ 354ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది.అనారోగ్యంతో బాధపడుతున్న ఆ మహిళకు శ్వాససంబంధ సమస్య రావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చించారని, చికిత్స పొందుతూ ఆమె మరణించిందని పోలీసులు తెలిపారు. యడ్యూరప్పపై లైంగికదాడి కేసును ప్రస్తుతం కర్ణాటక సీఐడీ దర్యాప్తు చేస్తోంది. కేసు పెట్టిన యువతి తల్లి మరణించినప్పటికీ ఆమె స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగుతుందని సీఐడీ అధికారులు తెలిపారు. అయితే లైంగికదాడి ఆరోపణలను యడ్యూరప్ప అప్పట్లో ఖండించారు. -
ఎంపీ నవనీత్ కౌర్‌పై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్‌పై షాద్‌నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల షాద్‌నగర్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ఆమె రోడ్ షోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే పాకిస్తాన్‌కు వేసినట్టేనంటూ వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలపై ఎన్నికల అధికారులు అభ్యతరం వ్యక్తంచేశారు. ఈసీ అధికారుల ఫిర్యాదుతో ఐపీసీ 188 సెక్షన్ కింద ఆమెపై ఐపీసీ 188 సెక్షన్ కింద నమోదుచేశారు. -
అడ్డంగా దొరికిన ‘మార్గదర్శి’.. కేసు నమోదు
సాక్షి,విశాఖపట్నం: మార్గదర్శి చిట్‌ఫండ్స్ కంపెనీపై కేసు నమోదైంది. విశాఖ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో 188 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల అధికారులు, ప్లయింగ్ స్క్వాడ్ టీం ఫిర్యాదు మేరకు మార్గదర్శి సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మార్గదర్శి సీతంపేట అకౌట్ అసిస్టెంట్ వీ లక్షణ్‌రావు, ఆఫీస్ బాయ్‌శ్రీనులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కాగా మంగళవారం తనిఖీల్లో మార్గదర్శి సీతంపేట బ్రాంచి నుంచి రూ. 52 లక్షలు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు మార్గదర్శి సిబ్బంది ఇద్దరి వద్ద రూ.51,99,800 నగదుతో పాటు రూ.36,88,675 విలువైన 51 చెక్కులు పట్టుబడ్డాయి. దీనిపై వారు పొంతన లేని సమాధానాలు చెప్పడం, ఆధారాలు చూపకపోవడంతో ఆ సొమ్మును, చెక్కులు పోలీసులు ఎన్నికల అధికారులకు అప్పగించారు. -
టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై కేసు నమోదు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై కేసు నమోదు అయింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టిన వ్యవహారంలో సాంబశివరావుపై కేసు నమోదుకు కోర్టు అనుమతి ఇచ్చింది. సాంబశివరావుతోపాటు మరో ఐదుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1 ముద్దాయిగా ఎమ్మెల్యే సాంబశివరావు ఉన్నారు. చదవండి: దొంగ ఓట్లు... ‘పచ్చ’ నోట్లు -
కూతురు ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. జరిగింది ఇదే!
సాక్షి, జనగామ: తనపై ఫిర్యాదు నమోదవ్వడంపై జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పందించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తన కూతురు తుల్జాభవాని సంతకం ఫోర్జరీ చేయలేదని పేర్కొన్నారు. కూతురు పేరు మీదనున్న ఫ్లాట్ ఆమె పేరుతోనే ఉందని స్పష్టం చేశారు. చేర్యాలలో సర్వే నెం 1402లో 1200 గజాల ల్యాండ్ తన బిడ్డ పేరు మీదే రిజిస్టర్ చేసి ఉందని, ఇందులో ఎలాంటి అవినీతి, ఫోర్జరీ జరగలేదని తెలిపారు. ఉప్పల్ పీఎస్ పరిధిలో తుల్జాభవాని పేరుపై 125 నుంచి 150 గజాల వరకు భూమి ఉందని, అందులోనూ ఎలాంటి ఫోర్జరీ జరగలేదన్నారు. అయితే దీనిని తన కుమారుడు నామమాత్రంగా కిరాయికి ఇచ్చారని అది కూడా తనకు తెలియకుండానే జరిగిందని తెలిపారు. అంతేగాని ఎలాంటి ప్రాపర్టీ బదలాయింపు జరగలేదని చెప్పారు. సదరు ఆస్తి కూతురు పేరు మీదే ఉండటం వల్ల కిరాయి కూడా ఆమెకే వెళ్తుందని తెలిపారు. ఇది కుటుంబ సమస్య అని.. ఏ కుంటుంబంలో అయినా చిన్న చిన్న సమస్యలు సహజమేనని తెలిపారు. కూతురిని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులు తనపై ఉసిగొలుపుతున్నారని విమర్శించారు. రాజకీయంగా గిట్టనివారు దీనిని వివాదంగా మార్చారని ఆరోపించారు. ఒకవేళ తాను తప్పు చేస్తే ప్రజలు శిక్ష వేస్తారని, తమ అధినేత సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నంత వరకు నియోజకవర్గంలో ఉంటానని పేర్కొన్నారు. వివాదలు సృష్టించే వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేర్కొన్నారు. చదవండి: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి! కాగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఆయన కూతురు తుల్జాభవని ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన విషయం తెలిసిందే 159 గజాల నాచారం ల్యాండ్ కమర్షియల్ బిల్డింగ్ విషయంలో ఆమె ఫిర్యాదు చేశారు. కినారా గ్రాండ్‌కు తన తండ్రి అక్రమ అగ్రిమెంట్ చేశారని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
వలంటీర్‌పై టీడీపీ కార్యకర్తల దాడి..
వినుకొండ (నూజెండ్ల): ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడని కక్షగట్టిన టీడీపీ కార్యకర్తలు వలంటీర్‌పై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో అప్రమత్తంగా ఉండటంతో వలంటీర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా వినుకొండలో జరిగింది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినుకొండ 5వ వార్డులో వలంటీర్ షేక్ అష్రాఫ్ æరాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దీన్ని సహించలేని టీడీపీ కార్యకర్తలు సీఎంను కించపరుస్తూ పోస్టులు పెట్టారు. ఇలా చేయడం మంచి పద్ధతి కాదని వలంటీర్ అష్రాఫ్ టీడీపీ కార్యకర్తలకు సూచించాడు. దీంతో టీడీపీ కార్యకర్తలు అతడితో సోషల్ మీడియాలోనే వాగ్వాదానికి దిగారు. ఆదివారం రాత్రి వలంటీర్ అష్రాఫ్, అతడి మిత్రుడు ఇమ్రాన్‌ఖాన్ మసీదుకు వెళ్లి వస్తుండగా టీడీపీ కార్యకర్తలు.. ఇమ్రాన్, షఫీ, సిద్ధు, ఫారూఖ్, ఫరీద్, ఖాజాలు అష్రాఫ్æపై దాడికి దిగారు. షఫీ కత్తితో దాడి చేయడంతో వలంటీర్‌కు గాయాలయ్యాయి. అతడి మిత్రులు అష్రాఫ్‌ను వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. -
‘ప్రజలను చంపుకొని తినే క్రూరమైన ప్రభుత్వమిది’.. సంజయ్ రౌత్‌పై కేసు
సాక్షి, ముబై: ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసిన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్‌పై శుక్రవారం మెరైన్‌లైన్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. శిందే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యేలు సంజయ్ శిర్సాట్, భరత్ గోగవావలే కిరణ్ పావస్కర్ మెరైన్ లైన్స్ పోలీసు స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ నీలేశ్ బాగుల్‌కు ఫిర్యాదు చేశారు. రౌత్ చేసిన ఆరోపణలు సమాజంలో విభేదాలు సృష్టించే విధంగా ఉన్నాయంటూ ఫిర్యాదుదారులు ఆరోపించారు. న్యూ ముంబై ఖార్ఘర్లో గత ఆదివారం జరిగిన మహారాష్ట్ర భూషణ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో వడదెబ్బ తగలి చనిపోయిన వారు 14 మంది కాదని దాదాపు 50-75 మంది ఉన్నారని గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రౌత్ ఆరోపించారు. అంతేగాకుండా మృతుల సంఖ్యను తక్కువ చూపించేందుకు మృతుల కుటుంబ సభ్యులు, బందువుల ఇళ్లకు వెళ్లి లక్షల్లో డబ్బులు ఎరచూసాన విమర్శించారు. శిందే నోటికి తాళం పడిందా? అసలు మృతుల సంఖ్య ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. మననుషల ప్రాణాలకు విలువలేదు. డబ్బుతో వెల కడుతున్నారని దుయ్యబట్టారు. నిర్వాహకుల నిర్లక్ష్యంవల్లే ఇంతమంది చనిపోయారని, మృతులకు కారకులైన శిందే, ఫడ్నవీస్ పదవుల్లో కొనసాగే అధికారం లేదని, కింటనే రాజీనామా చేయలని డిమాండ్ చేశారు. ప్రజలను చంపుకు తినే క్రూరమైన ప్రభుత్వమిదని మండిపడ్డారు. మొత్తం 14 మంది మృతుల్లో 12 మంది ఏడు గంటలకుపైగా ఎండతో ఉపవాసంతో ఉండటంవల్ల మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. దీంతో రౌత్ చేసిన ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లైంది. కాగా, శిందే, ఫడ్నవీస్‌లపై మనుష్యవథ కేసు నమోదు చేయాలని సంఘటన జరిగిన తరువాత అదే రోజు అజిత్‌పవార్, సంజయ్ రౌత్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. కానీ గురువారం విలేకరుల ఎదుట సంజయ్ చేసిన విమర్శలు సమాజంలో విభేదాలు సృష్టించేలు ఉన్నాయంటూ కేసు నమోదు చేశారు. -
టీడీపీ నేత దౌర్జన్యం.. ఛానల్ రిపోర్టర్‌పై దాడి!
సాక్షి, నెల్లూరు: వెంకటాచలంలో టీడీపీ నేత రాజేంద్ర దౌర్జన్యానికి దిగారు. ప్రభుత్వ కార్యక్రమ ఫ్లెక్సీలు కడుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఇదేంటని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేశారు. వివరాల ప్రకారం.. వడ్డిపాలెంలో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి వైఎస్సార్సీపీ శ్రేణులు ఫ్లెక్సీలు కడుతున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న టీడీపీ కార్యకర్త రాజేంద్ర అనే వ్యక్తి వారికి అడ్డుకుని వాగ్వాదానికి దిగాడు. దీంతో, ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం, ఇది కవర్ చేయడానికి వెళ్లిన ఓ ఛానల్ రిపోర్టర్ వెళ్లడంతో అతడిపై రాజేంద్ర కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో రాజేంద్రను వైఎస్సార్సీపీ శ్రేణులు పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ, రాజేంద్ర దొరక్కపోవడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు, బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అయితే, టీడీపీ నేత సోమిరెడ్డి ఆదేశాలతోనే టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. -
కేరళ హైకోర్టులో మోహన్ లాల్‌కు చుక్కెదురు!
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్‌కు కోర్టులో చుక్కెదురైంది. కొంతకాలంగా ఆయనను ఏనుగు దంతాల కేసు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో పెరుంబవూరు మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మోహన్ లాల్ కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. బుధవారం ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు తనపై వేసిన ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకోవాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన పెరుంబవూరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును కొట్టివేయాలని కోరుతూ నటుడు మోహన్‌లాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. వివరాలు.. గతంలో ఐటీ శాఖ అధికారులు మోహన్ లాల్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో రెండు ఏనుగు దంతాలను గుర్తించారు. దాంతో వన్యప్రాణుల చట్టం ప్రకారం మోహన్ లాల్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్రమంగా ఏనుగు దంతాలను ఇంట్లో అలంకరణకు పెట్టుకొని చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. అయితే తాను చట్టప్రకారమే అనుమతులు తీసుకుని ఏనుగు దంతాలను ఇంట్లో పెట్టుకున్నట్లు ఇప్పటికే మోహన్ లాల్ కోర్టుకు వివరణ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసులో తమ అభిప్రాయాన్ని వెల్లడిచింది. ఆయన చట్టాన్ని ఉల్లంఘించలేదని, ఆయన ఇంట్లో ఉన్నవి చనిపోయిన ఏనుగు దంతాలని చెప్పింది. ఆయన వాటిని చట్టప్రకారమే ఇంట్లో పెట్టుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం విచారణలో వెల్లడించింది. అయితే ప్రభుత్వ వైఖరిని మేజిస్ట్రేట్ కోర్టు తప్పుబట్టింది. అదే ఓ సామన్యుడు ఏనుగు దంతాలను కోనుగులు చేసి ఉంటే అతడికీ ఇలాంటి మినహాయింపే ఇస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మరోసారి వివరణ ఇవ్వాలని మేజిస్ట్రేట్ కోర్టును ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మేజిస్ట్రేట్ కోర్టుకు వ్యతిరేకంగా మోహన్ లాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. చదవండి: మరోసారి ఆ డైరెక్టర్‌కు అనుష్క గ్రీన్ సిగ్నల్? విశ్వనాథ్‌గారు నాపై అలిగారు, చాలా రోజులు మాట్లాడలేదు: జయసుధ -
డేటింగ్ చేయమని రోజు పది సార్లు కాల్ చేసేది.. నటిపై సంచలన ఆరోపణలు
సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరును కూడా ఈడీ చేర్చింది. అయి తే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ ఈడీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో పలు కీలక విషయాలను వివరించాడు. మరో నటి నోరా ఫతేహిపై సంచలన ఆరోపణలు చేశాడు. నోరా నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై ఎప్పుడూ అసూయపడేదని సుకేశ్ విచారణలో తెలిపాడు. తాను జాక్వెలిన్‌తో రిలేషన్లో ఉండగా.. తనను బ్రెయిన్‌వాష్ చేయడానికి ప్రయత్నించేదని సుకేష్ చంద్రశేఖర్ పేర్కొన్నాడు. నేను జాక్వెలిన్‌ను విడిచిపెట్టి ఆమెతో డేటింగ్ చేయాలని కోరిందని సుకేశ్ వివరించారు. నోరా నాకు రోజుకు కనీసం 10 సార్లు కాల్ చేసేదని ఇటీవల విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. నోరా ఫతేహి ఈడీ ముందు తప్పుడు వాంగ్మూలాన్ని ఇచ్చిందని ఆరోపించారు. ఆమె దుర్మార్గపు ఆలోచనలతో తమను మోసం చేసిందని పేర్కొన్నాడు. అయితే జాక్వెలిన్ ఇచ్చిన వాంగ్మూలంపై తాను మాట్లాడదలచుకోలేదని అన్నారు. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించిన వివరాలతో దిల్లీ పోలీసులు అనుబంధ ఛార్జిషీట్లో దాఖలు చేసినట్లు తెలుస్తోంది. జాక్వెలిన్ గురించి సుకేశ్ ప్రస్తావిస్తూ.. 'ఆమె నేను గౌరవించే వ్యక్తి. ఆమె ఎల్లప్పుడూ నా జీవితంలో భాగం. ఆమెతో నాతో ఉంటే సంతోషం. ఈ కేసు ఆమెను ఎలా ప్రభావితం చేసిందో నాకు తెలుసు. జాక్వెలిన్‌ను చూసుకోవడం నా బాధ్యత. ఆమెకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు.' అని అన్నారు. కాగా.. బాలీవుడ్ నటి జాక్వెలిన్ మధ్యంతర బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. -
వివాదంలో బండి సంజయ్ కుమారుడు.. తోటి విద్యార్థిపై..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడిపై దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తోటి విద్యార్థిని దుర్భాషలా డుతూ దాడిచేసిన దృశ్యాలు సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టడంతో కలకలం రేగింది. కుత్బు ల్లాపూర్ నియోజకవర్గం బహదూర్‌పల్లిలోని మహేంద్ర వర్సిటీలో బీటెక్ చదువుతున్న సంజయ్ కుమారుడు తోటి విద్యార్థిని అసభ్య పదజాలంతో తిట్టడమే కాకుండా, చంపేస్తానంటూ బెదిరిస్తూ తీవ్రంగా కొట్టాడు. దీంతో వర్సిటీకి చెందిన స్టూడెంట్ అపెక్స్ కోఆర్డినేటర్ మంగళవారం దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ రమణారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అందుకే కొట్టాడు: కాగా బండి కుమారుడిపై కేసు నమోదైన విషయం తెలిశాక...అతని చేతిలో దెబ్బలు తిన్న విద్యార్థి మంగళవారం రాత్రి 11 గంటలకు ఒక వీడియో విడుదల చేశాడు. బండి సంజయ్ కుమారుడు స్నేహితుడి చెల్లెల్ని తాను ఇబ్బంది పెట్టానని, ఆ కారణంతోనే తనపై చేయిచేసుకున్నాడని వీడియోలో పేర్కొన్నాడు. ఇప్పుడు తామంతా మంచిగానే ఉన్నామని చెప్పాడు. -
పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు
సాక్షి, ఆత్మకూరు: మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌పై ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మండలంలోని సింగంపల్లి, వై.కొత్తపల్లి, పి.యాలేరు, ఆత్మకూరు మీదుగా పరిటాల శ్రీరామ్ గురువారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు సభలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రజల మధ్య గొడవలు ప్రేరేపించేలా మాట్లాడారు. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పరిటాల శ్రీరామ్‌తో పాటు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరశురామ్‌పై ఐపీసీ సెక్షన్ 153 ఏ, 505 (2) కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
నెల్లూరు: కందుకూరు తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు
సాక్షి, కందుకూరు: నెల్లూరు జిల్లా కందుకూరు చంద్రబాబాబు సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కేసు నమోదయింది. సెక్షన్ 174 కింద కందుకూరు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. ఈ ఘటనలో 8 మంది మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు విచారణ అనంతరం నిందితుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చనున్నారు. ఇదిలా ఉంటే, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి ప్రచార యావ చాలా ఎక్కువ. ఈ విషయం ఇప్పటికే అనేక సందర్భాల్లో రుజువైంది. నాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చూపించుకునే తాపత్రయంలో ఎవరు ఎన్ని ఇబ్బందులు పడినా ఆయన పట్టించుకోడు. ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తాడు. ఈ వ్యవహారశైలే మరోసారి ప్రజల ప్రాణాలపైకి తెచ్చింది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి యాత్ర సందర్భంగా కందుకూరులో నిర్వహించిన బహిరంగసభ అనేక మంది కుటుంబాల్లో పెను విషాదన్ని మిగిల్చింది. చదవండి: (‘షో’క సంద్రం.. చంద్రబాబు రోడ్ షోలో 8 మంది దుర్మరణం) -
సీబీఐ అధికారినంటూ విశాఖవాసి మోసాలు.. ఏకంగా ఏడీజీపీగా నటన.. చివరకు
న్యూఢిల్లీ: సీబీఐ అధికారినంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి బాగోతం బట్టబయలైంది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లో సీనియర్ ఆఫీసర్ని అని చెప్పుకుంటూ అనేక మంది వ్యక్తుల నుంచి డబ్బు వసూలు చేసిన కొవ్విరెడ్డి శ్రీనివాసరావును సీబీఐ అరెస్టు చేసి కేసు నమోదు చేసింది. ఈ నకిలీ అధికారి విశాఖపట్నం చిన్నవాల్తేరుకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. సీబీఐలో సీనియర్ ఐపీఎస్ అధికారిగా నటిస్తూ అతను భారీగా కూడబెట్టినట్టు తెలిసింది. నిందితుడిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు అతని ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.21లక్షల నగదు, గోల్డ్ స్టోన్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఢిల్లీలోని తమిళనాడు హౌస్‌లో ఉంటున్నాడు. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ)గా అందరినీ నమ్మించాడు. శ్రీనివాసరావును అరెస్ట్ అనంతరం ఢిల్లీలోని కాంపిటెంట్ కోర్టు ముందు హాజరుపరచగా, రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది. -
మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్.. ఇలాంటి రైడ్స్ నా జీవితంలో చూడలేదు
సాక్షి, హైదరాబాద్: సోదాల సందర్భంగా విధులకు ఆటంకం కలిగించారన్న ఐటీ అధికారుల వ్యాఖ్యలపై తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తాను సంతకం చేసిన తర్వాతే అధికారులు బయటకు వెళ్లారని.. ఎవరి విధులకు అడ్డుపడలేదని చెప్పారు. వందకోట్లు బ్లాక్‌మనీ ఉన్నట్లు రాసి నా కొడుకుతో బలవంతంగా సంతకం చేయించారని ఆరోపించారు. కొడుకు సంతకం పెట్టిన ఫైల్స్ చూపించడం లేదన్నారు. ఇలాంటి రైడ్‌ను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఇంతమంది సీఆర్పీఎఫ్ బలగాలను ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలన్నారు. 'తప్పులు చూపిస్తే ఫైన్ కడతాం.. మేము దొంగలమా? ఇంత అరాచకమా?. నాకొడుకును ఆస్పత్రిలో చేర్చినట్లు కూడా మాకు చెప్పలేదు. ఇంకా చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలపై రైడ్స్ ఉంటాయి. ఎన్నిరైడ్స్ జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం' అని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మల్లారెడ్డిపై కేసు నమోదు అంతకుముందు, మల్లారెడ్డిపై బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఐటీ అధికారి ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్తో ఈ కేసును దుండిగల్ పీఎస్‌కు బదిలీ చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారని ఐటీ అధికారి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో 342, 353, 201, 203, 504, 506, 353, 379 రెడ్‌విత్ R/W 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐటీ అధికారులపై భద్రారెడ్డి ఫిర్యాదు ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో తమపై ఐటీ అధికారులు దౌర్జన్యం చేశారని పేర్కొన్నారు. దీంతో ఐటీ అధికారులపై 384 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. చదవండి: (మల్లారెడ్డిపై ఐటీ దాడులు: సంచలనం రేపుతున్న ‘రూ.100 కోట్లు’) -
ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ కేసులో మరో ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: గత నెల 25న భర్తను ఏమార్చి ప్రియుడితో వెళ్లిపోయిన సాయిప్రియపై 3వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. గత జులై 25న పెళ్లిరోజు కావడంతో భర్త శ్రీనివాస్‌తో కలిసి ఆమె ఆర్కేబీచ్కు విహారానికి వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు భర్త ఏమరపాటుగా వున్న సమయంలో ప్రియుడు రవితో కలిసి సాయిప్రియ పరారైన విషయం తెలిసిందే. అయితే సాయిప్రియ కోసం జిల్లా యత్రాంగం పెద్ద ఎత్తున బీచ్‌లో గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం సాయిప్రియ ప్రియుడితో కలిసి వెళ్లిపోయినట్లు బయటపడటంతో అంతా అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలో సాయిప్రియ భర్త శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. తనని ఉద్దేశపూర్వకంగా మోసం చేయడంతోపాటు జిల్లా యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుతో సాయిప్రియపై కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ సీఐ రామారావు వెల్లడించారు. చదవండి: (నేను రవితోనే ఉంటా..సాయిప్రియ) -
జనసేన పీఏసీ చైర్మన్, నాయకులపై కేసు నమోదు
సిద్దవటం (కడప జిల్లా): కోనేటి వెంకటరమణ అలియాస్ హరిరాయల్పై ఈ నెల 19న జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోమర్ సమక్షంలో జరిగిన దాడికి సంబంధించి.. నాదెండ్ల మనోమర్ సహా తాతంశెట్టి నాగేంద్ర, మణి, పగిడాల వెంకటేష్‌తోపాటు నాగేంద్ర అనుచరులైన మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తులసీ నాగ ప్రసాద్ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆయన ఆదివారం వివరాలు వెల్లడించారు. ఈనెల 19న సిద్దవటంలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కౌలు రైతుభరోసా యాత్ర సందర్భంగా జనసేన సీనియర్ నాయకులు కోనేటి వెంకటరమణ అలియాస్ హరిరాయల్ ఏర్పాట్లను పరిశీలిస్తుండగా.. పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో తాతంశెట్టి నాగేంద్ర అనుచరులు దాడి చేసి చొక్కా చింపి చెప్పుతో కొట్టి అవమాన పరిచారన్నారు. బా«ధితుడి ఫిర్యాదు మేరకు నాదెండ్ల మనోహర్, తాతంశెట్టి నాగేంద్ర, మణి, పగిడాల వెంకటేష్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: (YSR Kdapa-Renigunta: వడివడిగా హైవే.. రూ.4వేల కోట్లతో రోడ్డు నిర్మాణం)