మంత్రి కుమారుడిపై హత్య కేసు
Published Mon, Jan 9 2017 2:45 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న కుమారుడిపై హత్య కేసు నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన కాంగ్రెస్ కార్యకర్త తిరుపతిరెడ్డి హత్య కేసులో మంత్రి కుమారుడు ప్రేమ్‌చంద్ నిందితుడని ఆరోపణలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు ఆధారంగా ఇతనితోపాటు అదే గ్రామానికి చెందిన మరో తొమ్మిదిమంది టీఆర్‌ఎస్ నాయకులపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఈ హత్యపై రెండు రోజులుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ప్రేమ్‌చంద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement