సాక్షి, హైదరాబాద్: ఇకపై ఎదుటివారిని ఉద్దేశించి పరుష పదజాలం వాడినా, దూషించినా, బెదిరించినా నేరుగా పోలీసులే రంగంలోకి దిగుతారు. కోర్టు అనుమతి లేకుండానే కేసు నమోదు చేసి విచారణ చేపడతారు. ఈ మేరకు రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీసీ 506, 507 సెక్షన్ల కింద నమోదైన కేసులను కోర్టు అనుమతి లేకుండానే విచారించదగిన (కాగ్నిజబుల్) నేరాలుగా గుర్తించింది. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై సీఎం కేసీఆర్ గురువారం సంతకం చేశారు.
పరుష పదజాలంతో బెదిరించడం, దూషించడం ఈ సెక్షన్ల కింద నేరాలుగా పరిగణిస్తారు. అయితే ఈ నేరాల కింద కేసు నమోదు చేయడానికి కోర్టు అనుమతి తీసుకోవాలా లేదా అనుమతి లేకుండానే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలా అన్న అంశం రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణ కిందకు వస్తుంది. ఆయా రాష్ట్రాలే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతి లేకుండానే కేసు నమోదు చేసి విచారణ చేపట్టే నేరంగా పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంచాయతీ, సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment