సోషల్‌ మీడియాలో దూషిస్తున్నారు: శ్రీరెడ్డి  | Actress Sri Reddy file case against movie artists | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాలో దూషిస్తున్నారు: శ్రీరెడ్డి 

Published Mon, May 14 2018 12:31 PM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

Actress Sri Reddy file case against movie artists - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సినీ రంగానికి చెందిన ఆర్టిస్టులు, మా అసోసియేషన్‌ సభ్యులు తనను అసభ్యంగా తిడుతున్నారని నటి శ్రీరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాస్టింగ్‌ కౌచ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు తనను వాట్సాఫ్‌, ఫేస్‌బుక్‌లలో వేధిస్తున్నరని, అసభ్యపదజాలంతో దూషిస్తున్నారని ఆదివారం ఆమె హుమయూన్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌లోపోలీసులకు ఫిర్యాదు చేసింది.

వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా ఆమె ఏసీపీని కోరారు. ఫిర్యాదులోని అంశాలను సైబర్‌ క్రైం సహకారంతో వివరాలు సేకరించి విచారణ చేస్తామని తెలిపారు. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న వారిలో నటి జీవిత, హేతువాది బాబు గోగినేనిలు కూడా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement