పంజగుట్ట: సెల్ఫ్ జర్నలిజం చేసేవారు నిజాలను తప్పులుగా రాస్తున్నారని సామాజిక మాధ్యమాలపై జర్నలిస్టులు ఆధారపడరాదని అమెరికా టెక్సాస్‌లోని ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయంలో కమ్యునికేషన్స్ అండ్ మీడియా ప్రొఫెసర్ అనంత ఎస్ బొబ్బిలి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం అండ్ మాస్ కమ్యునికేషన్ విభాగం, ప్రెస్‌క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ‘రెప్రజెంటేషన్ అండ్ మిశ్రప్రిజెంటేషన్ ఇన్ జర్నలిజం – కరెంట్ చాలెంజెస్ టు డెమోక్రసీ’ అనే అంశంపై జర్నలిజం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్తలు రాసేముందు రాయబోయే అంశాన్ని ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని, ప్రధానంగానిజాలు తెలుసుకోకుండా రాయకూడదన్నారు. ఓయూ జర్నలిజం విభాగాధిపతి ప్రొఫెసర్ స్టీవెన్సన్, ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి రాజమౌళి చారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment