journlists
-
ఎమర్జెన్సీపై ఇందిరా గాంధీ వ్యాఖ్యలు.. విలేకరుల ముఖంపై చిరునవ్వులు
భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీపై మాయని మచ్చ ఎమర్జెన్సీ. దీని వల్ల భారత ప్రజలకు, ముఖ్యంగా జర్నలిస్టుల ఆగ్రహానికి గురైంది. దీని కారణంగా ఆమె పార్టీ ఘోరంగా తదుపరి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది కూడా. ఆ టైంలో మళ్లీ మీడియా ముందుకుగానీ జర్నలిస్టులను ఎదుర్కొడం గానీ చేయలేక ఏ నాయకుడు లేదా నాయకురాలైనా ఇబ్బంది పడతారు. కానీ తన తప్పును అంగీకరిస్తూ మీడియాను ఎదుర్కొవడమే కాదు జర్నలిస్టులు ఆవేశంతో సంధించే ప్రశ్నల బాణాలకు బెదరకుండా తనదైన శైలిలో సమాధానంచెప్పి వారి కోపాన్ని ఉపశమించేలా చేసింది. వారి ముఖాల్లో నవ్వు తెప్పించి మరో ప్రశ్న తావివ్వకుండా చేసి "దటీజ్ ఇందిరా" అనుపించుకుంది. నేడు ఇందిరాగాంధీ వర్ధంతి(అక్టోబర్ 31) సందర్భంగా ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలు చూద్దాం. నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఏకపక్షంగా విధించిన అత్యవసర పరిస్థితి లేదా ఎమర్జెన్సీని 71 ఏళ్ల ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి కాలంగా అభివర్ణిస్తారు. అప్పటి రాష్ట్రపతి ఫకృదీన్ అలీ "ప్రబలిన అంతర్గత కలవరం" అని పేర్కొంటూ ఉత్తర్వు జారీ చేయడంతో భారతదేశ ప్రజలు ఒక్కసారిగా తమ హక్కులను కోల్పోపయారు. ఈ ఎమర్జెన్సీ 1977 జూన్ 25 అర్థరాత్రి 11.45 నిమిషాల వరకు కొనసాగింది. దీని కారణంగా ఆమె తదుపరి ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలయ్యి పదవినీ కోల్పోయింది. సరిగ్గా ఆ టైంలో ఆగ్రహావేశాలతో విదేశీ జర్నలిస్టులు ఆమె వద్దకు వచ్చి ప్రశ్నల వర్షం కురిపించే యత్నం చేశారు. ఆ సమయంలో తన సంయమనాన్ని, స్థైర్యాన్ని కోల్పోకుండా వారిని ఎదర్కొవడమే గాక ఆమె చేసిన వ్యాఖ్యలు విలేకరులను మరో ప్రశ్న అడగకుండా చేసి తనకు సాటి లేరని నిరూపించింది. ఇంతకీ ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటంటే.. ఆ విదేశీ విలేకరులంతా చాలా ఆగ్రహంగా..మీరు విధించిన ఎమర్జెన్సీతో పొందిన ప్రయోజనం ఏమిటి అని సూటిగా ప్రశ్నించారు. వాళ్లంతా ఆమె ఏం చెబుతుందా అన్నట్లు అందరూ కళ్లు పెద్దవిగా చేసుకుని చెవులు రిక్కరించి మరీ కుతూహులంగా చూస్తున్నారు. ఆమె చాలా స్థైర్యంతో ఓటమిని ఒప్పుకుంటూ..తాము భారతీయ ప్రజలలోని అన్ని వర్గాలను సమగ్రంగా దూరం చేసుకున్నాం లేదా దూరం చేయగలిగాను అని తెలుసుకున్నా అని చెప్పారు ఇందిరా గాంధీ. ఆ వ్యాఖ్యకు ఒక్కసారిగా జర్నలిస్టులంతా పెద్దగా నవ్వారు. ఆ తర్వాత చాలా నిశబ్ధం..అంతా కామ్ అయిపోయి మళ్లీ మరో ప్రశ్న కూడా వేయకుండా వెనుదిరిగారు. ఆమె మాట్లాడిన తీరు విలేకరుల మనసులను ద్రవింపచేసింది. 1978లో జనిగిన ఈ ఆసక్తికర విషయాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2017లో తన వీడ్కోలు ప్రసంగంలో పంచుకున్నారు. ఆవిడ ఆ టైంలో కూడా ధైర్యంగా తన ఓటమిని అంగీకరిస్తూ.. మాట్లాడిన మాటలు జర్నలిస్ట్‌ల ముఖాల్లో నవ్వు తెప్పించినా..వారి ప్రశ్న పరంపరకు అడ్డుకట్ట వేయగలిగిందంటూ నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంలో జవహర్ లాల్ తరుచుగా చెప్పే వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నారు ప్రణబ్. "మార్పు" కొనసాగింపు, సమతుల్యత ఎప్పుడూ ఉంటుందని నెహ్రు తరుచుగా చెప్పేవారని అన్నారు. నాయకురాలిగా ఆమె విధానం.. 1971 నాటికి ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వంపైనా, కాంగ్రెస్ పార్టీపైనా పూర్తి ఆధిక్యతను సాధించింది. అలాగే తన పార్టీలోని తన ప్రత్యర్థులను తీవ్రంగా అణచివేయడంతో 1949లో కాంగ్రెస్ ఓ, ఆర్ అనే రెండు గ్రూప్‌లగా విడిపోయింది. కాంగ్రెస్(ఆర్) అంటే ఇందిరకు అనుకూలమైన మంత్రులని, ఓ అంటే ఆర్గనైజేషన్, సిండికేట్ గా పేరొందిన కాంగ్రెస్ పాతనేతలు కింద విడిపోయింది. ఆలిండియా కాంగ్రెస్ కమిటీలోనూ, పార్టీ ఎంపీల్లోనూ ఎక్కువభాగం ప్రధాని ఇందిర పక్షం వహించారు. అలాగే తన మాట చెల్లించుకునేలా హఠాత్తుగా ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చి ప్రత్యర్థులను షాక్ గురిచేసేది. ఇక 1969లో బ్యాంకుల జాతీయకరణ, 1970లో రాజభరణాల రద్దు వంటి వామపక్ష అనుకూల, ప్రజారంజకమైన కార్యకలాపాలు, గరీబీ హఠావో! వంటి నినాదాలు ఇందిరకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలాగే అగర్భ శత్రువైనా పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించడంతో ఇందిరా గాంధీ తూర్పు పాకిస్తాన్‌గా ఉన్న ప్రాంతాన్ని బంగ్లాదేశ్‌గా ఏర్పరిచి పాకిస్తాన్‌ని చావుదెబ్బ కొట్టింది. అందుకుగానే భారతర్న పురస్కారాన్ని అందుకుంది. అలాగే ఆమెకు మంచి ఎకనమిస్ట్ , భారత సామ్రాజ్ఞి వంటి బిరుదులు అందుకుంది. నియంతలా వ్యవహరిస్తున్నారు అన్న ప్రత్యర్థుల చేతే దుర్గ, చండి వంటి ప్రశంసలు అదుకుంది. ఆమె ప్రధానిగా 1966 నుంచి 1977 వరకు, మళ్లీ 1980 నుంచి 1984లో ఆమె హత్యకు గురయ్యేంత వరకు భారతదేశానికి మూడవ ప్రధానిగా సేవలందించారు. ఆమె దూకుడుగా తీసుకున్న ఎమర్జెన్సీ విధింపు నిర్ణయమే ఆమె జీవితంలో చెరగని మచ్చగా మిగిలిందని చెప్పాలి. (చదవండి: వికీపీడియాలో మహిళా శాస్త్రవేత్తల బయోగ్రఫీ ఉందా? గమనించారా?) -
గాంధీ ఆస్పత్రిలో మనోజ్ పేరుతో వార్డు
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో భాగంగా కరోనా వైరస్ బారిన పడిన జర్నలిస్టులకు ఇకపై ప్రత్యేక వార్డులో చికిత్సలు అందించనున్నట్లు గాంధీ ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు ఆస్పత్రిలోని ఆరో అంతస్తులో ఇటీవల మృతి చెందిన జర్నలిస్ట్ మనోజ్ పేరుతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. వైద్యులు, పోలీసులతో పాటు వార్తా సేకరణలో భాగంగా జర్నలిస్టులు కంటైన్మెంట్ జోన్లలో పర్యటించి, కరోనా వైరస్ వ్యాప్తి, వైద్య సేవలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్న విషయం తెలిసిందే. (పరిస్థితి ఆందోళనకరం: అమిత్ షాతో భేటీ) ఈ క్రమంలో వైద్యులు, పోలీసులతో పాటు జర్నలిస్టులు సైతం వైరస్ బారిన పడ్డారు. ఇలా ఇప్పటికే 16 మందికి వైరస్ సోకగా, వారిలో సకాలంలో వైద్యసేవలు అందక జర్నలిస్టు మనోజ్ మృతి చెందడం, జర్నలిస్టుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం వైద్యులు, పోలీసులతో సమానంగా జర్నలిస్టులకు ప్రత్యేక వైద్యసేవలు అందించాలని నిర్ణయించింది. ఆ మేరకు ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసింది. సచివాలయ బీట్‌ను చూసే జర్నలిస్టులకు ఇప్పటికే టెస్టులను ప్రారంభించారు. పాజిటివ్ వచ్చిన వారికి ఈ ప్రత్యేక వార్డులో వైద్యసేవలు అందించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. -
జర్నలిస్టులు సోషల్ మీడియాపై ఆధారపడరాదు
పంజగుట్ట: సెల్ఫ్ జర్నలిజం చేసేవారు నిజాలను తప్పులుగా రాస్తున్నారని సామాజిక మాధ్యమాలపై జర్నలిస్టులు ఆధారపడరాదని అమెరికా టెక్సాస్‌లోని ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయంలో కమ్యునికేషన్స్ అండ్ మీడియా ప్రొఫెసర్ అనంత ఎస్ బొబ్బిలి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం అండ్ మాస్ కమ్యునికేషన్ విభాగం, ప్రెస్‌క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ‘రెప్రజెంటేషన్ అండ్ మిశ్రప్రిజెంటేషన్ ఇన్ జర్నలిజం – కరెంట్ చాలెంజెస్ టు డెమోక్రసీ’ అనే అంశంపై జర్నలిజం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్తలు రాసేముందు రాయబోయే అంశాన్ని ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని, ప్రధానంగానిజాలు తెలుసుకోకుండా రాయకూడదన్నారు. ఓయూ జర్నలిజం విభాగాధిపతి ప్రొఫెసర్ స్టీవెన్సన్, ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి రాజమౌళి చారి పాల్గొన్నారు. -
పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీహీరో పవన్ కల్యాణ్‌పై కేసు నమోదైంది. కొన్ని న్యూస్ చానళ్ల విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా పవన్ ప్రవర్తించారంటూ జర్నలిస్టు సంఘాల నాయకులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. చానళ్లలో ప్రసారం కానీ వీడియోలను ట్విటర్లో పోస్ట్ చేసి అసత్య ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఈ అంశంపై విచారణ చేపట్టి పలు ఆధారాలు సేకరించారు. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ను పవన్ ట్యాంపరింగ్ చేసినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పవన్ కల్యాణ్‌పై ఐపీసీ 469, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పాత్రికేయులకు పెన్నిధి
సాక్షి,సిటీబ్యూరో: జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వారితో పాటు, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా , ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన జర్నలిస్ట్‌ల హెల్త్‌స్కీమ్(జేహెచ్ఎస్) పాత్రికేయులకు వరంగా మారిందని సీఈవో కె. పద్మ తెలిపారు. ఈ పథకాన్ని ప్రారంభించి 13 నెలలు గడిచిన సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. అర్హులైన జర్నలిస్టులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నగదు రహిత వైద్యం వర్కింగ్ జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యులకు ‘ క్యాస్‌లెస్ ట్రీట్మెంట్’ అందించాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం 2015 జూలై 22న జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ పథకం కింద పాత్రికేయులకు వెల్నెస్ సెంటర్ల ద్వారా ఔట్ పేషెంట్ చికిత్స, నెట్ వర్క్ హాస్పిటల్స్ ద్వారా ఇన్ పేషెంట్ చికిత్స అందజేస్తున్నాం, ఉచితంగా మందులను, వైద్య పరీక్షలు, వైద్యానికి సంబంధించి సౌకర్యాలను కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు 8,100 మంది జర్నలిస్టులు, 25869 మంది జర్నలిస్టుల కుటుంబసభ్యులు ఈ పథకంలో పేర్లు నమోదు చేసుకోగా వారందరికీ హెల్త్‌కార్డులు పంపిణీ చేశాం. ‘వెల్నెస్’ సేవలివీ... వెల్నెస్ సెంటర్లల్లో ల్యాబ్లెటరీ తదితర అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చాం. ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాం. 2016 డిసెంబర్ 19 నుంచి ఇప్పటి వరకు 42,252 మంది ఉద్యోగులు, 44128 మంది పెన్షనర్లు, 1778 మంది జర్నలిస్టులు ఈ పథకం కింద ఆపరేషన్లు చేయించుకున్నారు 22 వేలకుగాను 6 వేల మంది... రాష్ట్రంలో 22 వేల మంది అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఉండగా అందులో 6 వేల మంది మాత్రమే హెల్త్‌కార్డులు పొందారు. కార్డులు పొందిన జర్నలిస్టుల కుటుంబాలకు 20 వేల హెల్త్‌కార్డులు జారీ చేశాం. జర్నలిస్టులంతా హెల్త్‌కార్డులు తీసుకొంటే వారి కుటుంబసభ్యులతో కలుపుకొంటే 50 వేల మందిపైగా ప్రయోజనం కలుగుతుంది. అన్ని రకాల వ్యాధులకూ వర్తింపు.. అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా చికిత్స అందజేస్తున్నాం. జనరల్ చికిత్స, కార్డియాలజీ, చెస్ట్, నెఫ్రాలాజీ, న్యూరో సర్జరీ, కేన్సర్, మెదడుకు సంబంధించిన సమస్యలతో పాటు మహిళలకు సంబంధించిన అన్ని రకాల జబ్బులకు, ముఖ్యంగా దంత సమస్యలకు అధునాతన చికిత్స లభిస్తుంది. ఫిజియోథెరఫీ సేవలు సైతం అందజేస్తున్నాం. వెల్నెస్ సెంటర్లలోనే ఎక్స్‌రే, ఈసీజీ, అల్ట్రా స్కానింగ్‌తో పాటు అన్ని రకాల స్కానింగ్‌లు తీస్తారు. సీఎం ప్రత్యేక శ్రద్ధ: జర్నలిస్టుల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఏదైనా మీటింగ్‌లో తారసపడితే ముఖ్యమంత్రి జర్నలిస్టులందరికీ హెల్త్‌కార్డులు ఇచ్చారా.. వాటి పురోగతిపై ప్రత్యేకంగా అడిగి తెలుసుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి జర్నలిస్టులు ఎప్పుడు సమాజం గురించే ఆలోచిస్తూ, వారి కుటుంబం గురించి పట్టించుకోరు. తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు మాత్రమే వారికి హెల్త్‌కార్డు గుర్తుకు వస్తుంది. చివరి క్షణంలో మాపై హెల్త్‌కార్డుల కోసం ఒత్తిడి చేస్తారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టు సంఘాలు, ప్రెస్క్లబ్స్లు, ప్రెస్ అకాడమీతో చర్చించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అందరూ కార్డులు పొంది ప్రాథమిక దశలోనే వ్యాధులకు చికిత్స చేయించుకుంటే మేలు. రూ. 500 కోట్లతో ప్రాజెక్టు అమలు... ఏ రాష్ట్రంలో కూడా జర్నలిస్టులకు, ఉద్యోగులు ఇలాంటి ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ ప్రాజెక్ట్‌లు అమలు చేయడం లేదు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. ఇది విజయవంతమయ్యేందుకు జర్నలిస్టులు సహకరించాలి. అందుకే ‘ఓ జర్నలిస్టు ఆలోచించు... స్పందించు.. నీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకో’ అని కోరుతున్నాం. పత్రిక యాజమాన్యాలు కూడా అక్రిడిటేషన్లు లేని, హెల్త్‌కార్డులు పొందని వారిని గుర్తించాలి. హెల్త్‌కార్డులు ఉంటేనే ఉద్యోగులుగా కొనసాగిస్తామనే నిబంధన విధించాలి. ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే 12 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. నాన్ అక్రిడిటేషన్ జర్నలిస్టుల కోసం... నాన్ అక్రిడిటేషన్ జర్నలస్టులకు కూడా జేహెచ్ఎస్ కింద హెల్త్‌కార్డులు జారీ చేయాల్సి ఉంది. డెస్కు జర్నలిస్టులు, కాపీ రైటర్స్, పేజ్ మేకర్స్ ఈ విభాగంలోకి వస్తారు. దాదాపు ఆరు వేల మందికి కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తోంది. వెల్నెస్ సెంటర్లు ఇవీ జర్నలిస్టులకు చికిత్స అందించేందుకు ఖైరతాబాద్, వనస్థలిపురం, ఏరియా ఆస్పత్రుల్లో, హన్మకొండ మెటర్నిటీ ఆస్పత్రిలో ఇప్పటికే వెల్నెస్ సెంటర్లు ప్రారంభించాం. సంగారెడ్డిలో అత్యాధునిక వసతులతో కొద్దిరోజుల క్రితమే వెల్నెస్ సెంటర్ ప్రారంభించాం. త్వరలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిద్ధిపేట్, ఖమ్మం, హైదరాబాద్‌లో మరో రెండు ప్రాంతాల్లో కేంద్రాలను ప్రారంభించబోతున్నాం. కూకట్‌పల్లిలో ఒక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో రోజుకు 800 నుంచి 1000 వరకు, వనస్థలిపురంలో 500 నుంచి 600 వరకు ఓపీ వైద్యసేవలు పొందుతున్నారు. ‘సాక్షి’తో హెల్త్‌స్కీమ్ సీఈవో డాక్టర్ పద్మ -
జర్నలిస్టుల కొవ్వొత్తుల ప్రదర్శన
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): విభజన చట్టం హామీ మేరకు వెంటనే ఆధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు టి.అంబన్న డిమాండ్ చేశారు. గురువారం ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జిల్లా పరిషత్‌లోని గాంధీ విగ్రహం ఎదుట కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే నాయకులు హుస్సేన్, రాజు, రాఘవేంద్రారెడ్డి, ధరణి కిశోర్, ఇస్మాయిల్, వీడియో జర్నలిస్టుల సంఘం నాయకులు స్నేహాల్, మౌలాలి, చాంద్‌బాష, మధు, చెన్నయ్య పాల్గొన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర సమితి పిలుపును అందుకొని కర్నూలు జిల్లాలో ప్రత్యేక హోదా కోసం క్యాండిల్ లైట్ల నిరసన కార్యక్రమాలు విజయవంతం అయినట్లు ఆసంఘం కోశాధికారి హుస్సేన్ తెలిపారు. కర్నూలు, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం, కొడుమూరు, నంద్యాల, బనగానిపల్లెలతోపాటు పలు మండలాల్లో నిరసన కార్యక్రమాలు జరిగినట్లు వివరించారు. -
ఏపీ ప్రభుత్వం మీడియా గొంతు నొక్కుతోంది
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేసిన అంశాన్ని జర్నలిస్టులు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ సీకే ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం ఢిల్లీ జర్నలిస్టుల బృందం సీకే ప్రసాద్‌ను కలిసింది. ఏపీ ప్రభుత్వం మీడియా గొంతు నొక్కుతోందని జర్నలిస్టులు విమర్శించారు. ప్రజా ఉద్యమాలను చూపిస్తున్నందుకు సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేశారని జర్నలిస్టులు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ సీకే ప్రసాద్‌కు వివరించారు. చంద్రబాబు ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు.