
ఏపీ ప్రభుత్వం మీడియా గొంతు నొక్కుతోంది
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేసిన అంశాన్ని జర్నలిస్టులు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ సీకే ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం ఢిల్లీ జర్నలిస్టుల బృందం సీకే ప్రసాద్ను కలిసింది.
ఏపీ ప్రభుత్వం మీడియా గొంతు నొక్కుతోందని జర్నలిస్టులు విమర్శించారు. ప్రజా ఉద్యమాలను చూపిస్తున్నందుకు సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేశారని జర్నలిస్టులు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ సీకే ప్రసాద్కు వివరించారు. చంద్రబాబు ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు.