ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి టీవీ ప్రసారాల నిలుపుదలపై చైనాలోని లయోనింగ్ రాష్ట్రంలో వైద్య విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. జిన్‌ఝౌ మెడికల్ యూనివర్సిటీ విద్యార్థులు యూనివర్సిటీ ప్రాంగణంలో తమ నిరసనను వ్యక్తం చేశారు.
టీడీపీ ప్రభుత్వం తమ అవినీతిని కప్పిపుచ్చుకోడానికి, చంద్రబాబు నాయుడు ఇచ్చిన అడ్డగోలు హామీల నుంచి తప్పించుకోడానికే సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేశారని చైనా వైఎస్ఆర్‌సీపీ మెడికల్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు కొనకళ్ల పవన్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆయన ఆధ్వర్యంలో మెడికల్ యూనివర్సిటీ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు.
సాక్షి టీవీకి మద్దతుగా చైనాలో విద్యార్థుల ప్రదర్శన
Published Thu, Jun 16 2016 1:58 PM | Last Updated on Wed, Apr 3 2019 4:10 PM
Advertisement
Advertisement