sakshi TV
-
నేడు సాక్షి అవార్డ్స్ స్పెషల్ ఎపిసోడ్
గత పది సంవత్సరాలుగా సాక్షి మీడియా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ టెన్త్ ఎడిషన్’ వేడుక స్పెషల్ ఎపిసోడ్ సాక్షి టీవీలో శనివారం ప్రసారం కానుంది. ఫిబ్రవరి 28 శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకలో వై.ఎస్.భారతి రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. సామాజిక రంగంలో గొప్ప సేవ చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన వారికీ, కళారంగంలో గొప్ప ప్రతిభ చూపిన వారికి 2023–24 సంవత్సరాలకు గాను ఈ ఎక్సెలెన్సీ అవార్డులు బహూకరించారు. జ్యూరీ చైర్‌పర్సన్‌గా శాంతా సిన్హా వ్యవహరించారు. అవార్డులు అందుకున్న వారిలో పర్యావరణ సేవకు గాను దూసర్ల సత్యనారాయణ, సేంద్రియ వ్యవసాయానికి మల్లికార్జున రెడ్డి, అమర సైనికుడు డొక్కరి రాజేష్ (మరణానంతరం అతని తల్లిదండ్రులకు), క్రికెటర్ గొంగడి త్రిష, అథ్లెట్ జీవాంజి దీప్తి తదితరులు ఉన్నారు. సినిమా రంగంలో లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ సీనియర్ నటి రమాప్రభ అందుకున్నారు. ఎక్సెలెన్సీ అవార్డులు అందుకున్న వారిలో దర్శకుడు సాయి రాజేష్, మీనాక్షి చౌదరి, కిరణ్ అబ్బవరం తదితరులు ఉన్నారు. డైరెక్టర్ సుకుమార్ ‘తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం, ఉత్తమ దర్శకుడి పురస్కారం అందుకున్నారు. -
Sakshi TV 16 Years Anniversary: నిజాలను నిర్భయంగా
-
సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం ఆంక్షలు
-
సాక్షి జర్నలిస్టులపై టీడీపీ గుండాల దాడి
-
సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ రీ లాంఛ్
సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ గా రీ లాంఛ్ అయింది. న్యూయార్క్, న్యూజెర్సీ నుండి వాషింగ్టన్ డీసీ, టెక్సాస్, కాలిపోర్నియా, చికాగో, నార్త్ కరోలినా, అట్లాంటా, ఫ్లోరిడా మొదలగు నగరాలతో పాటు నార్త్ అమెరికాకు నలుదిక్కులా విస్తరించి.. పుట్టిన నేల నుంచి పెరిగిన గడ్డ వరకు.. ప్రవాసులకు అండగా.. మరింత చేరువగా.. సరికొత్తగా ఆవిష్కృతం అయింది సాక్షి టీవీ నార్త్ అమెరికా. అమెరికా, చికాగోలో ఈ కార్యక్రమం జరిగింది. భారత జాతీయగీతంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. నేషనల్ ఇండియా హబ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సాక్షి టీవీ నార్త్ అమెరికా హెడ్ కె.కె. రెడ్డి, సాక్షి టీవీ నార్త్ అమెరికా చీఫ్ కరస్పాండెంట్ సింహా, సాక్షి టీవీ స్టాప్, బిజినెస్ ఓనర్స్, కమ్యూనిటీ లీడర్స్, అసోసియేషన్ హెడ్స్, సబ్జెక్టు మేటర్ ఎక్స్పర్ట్స్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్లే చేసిన సాక్షి టీవీ నార్త్ అమెరికా ఏవీని ప్రవాసులు ఎంతో ఆకసక్తిగా తిలకించారు. అనంతరం సాక్షి టీవీ యూఎస్ఏకి ప్రవాసులు తమ శుభాకాంక్షలు తెలిపారు.అమెరికాలో న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్, కాలిపోర్నియా, చికాగో, నార్త్ కరోలినా, అట్లాంటా, ఫ్లోరిడా.. మరెన్నో నగరాలలో.. నార్త్ అమెరికాకు నలుదిక్కుల వ్యాప్తి చెంది.. US లో నెంబర్ 1 నెట్వర్క్ గా రూపాంతరం చెంది.. ప్రవాసుల గొంతుకగా Sakshi TV USA నిలుస్తోందని కె.కె. రెడ్డి పెర్కొన్నారు. సాక్షి టీవీ ఎన్నారై ప్రత్యేక కార్యక్రమాల గురించి సింహా వివరించారు. అమెరికాలో ప్రవాసుల గొంతుకగా నిలుస్తోన్న సాక్షి టీవీని పలువురు ప్రముఖులు కొనియాడారు. సాక్షి ఎన్నారై కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రవాసులు పలు సూచనలు, సలహాలు అందించారు. సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ రీ లాంఛ్ ఈవెంట్ లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కె.కె. రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సాక్షి టీవీ అమెరికాను అందరూ ఆదరించాలని కోరారు.(చదవండి: అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 51% తెలుగు రాష్ట్రాల నుంచే..) -
సాక్షి మీడియా హౌస్ లో..తారే జమీన్ పర్ లిటిల్ స్టార్స్ (ఫొటోలు)
-
న్యూస్ చానళ్లపై నిషేధం ఎత్తేయాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగు న్యూస్ చానళ్లపై మల్టిపుల్ సిస్టమ్ ఆపరేటర్లు (ఎంఎస్‌వోలు) విధించిన అప్రకటిత ఆంక్షలను అంతర్జాతీయ సంస్థలు తప్పుపడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉన్న ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్‌జే) ఈ అప్రకటిత నిషేధం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందన్నారు.రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగిందని, ప్రసారాలు తిరిగి పునరుద్ధరించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బ్రస్సెల్ కేంద్రంగా ఉన్న ఆ సంస్థ సూచించిందని వెల్లడించారు. న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అథారిటీ (ఎన్బీడీఏ) కూడా ఈ అప్రకటిత నిషేధాన్ని ఖండించిందని తెలిపారు. కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి ప్రసారాలు నిలిపివేయడం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిబంధనలకు విరుద్ధమని చెప్పిందన్నారు.రాష్ట్రంలోని పాలకులు ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ చర్యల కారణంగా అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ఇమేజ్ దెబ్బతిందని కృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణలో కొన్ని న్యూస్ చానళ్ల ప్రసారాలను అక్కడి కేబుల్ ఆపరేటర్లు నిలిపివేయడాన్ని చంద్రబాబు తప్పుపట్టారన్నారు. ఆ తప్పు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంటే ఆయన తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఉత్తరప్రదేశ్ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) (ఎ), 19(1) (జి) భావ ప్రకటనా స్వేచ్ఛకు హామీ ఇస్తోందని చెప్పిందని గుర్తు చేశారు. ప్రజాహితానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడానికి , తెలుసుకోవడానికి కూడా ఆ ఆర్టికల్ హామీ ఇస్తోందని తెలిపారు. కాబట్టి సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10టీవీలపై విధించిన అప్రకటిత నిషేధాన్ని వెంటనే తొలగించాలని కోరారు. -
నల్లగొండ జిల్లాలో కాలేజీ ఫీజులపై సాక్షి టీవీ స్ట్రింగ్ ఆపరేషన్
-
సోషల్ మీడియా ట్రోల్స్ పై యాంకర్ శ్యామల రియాక్షన్
-
ఏపీలో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై ట్రాయ్ కి ఫిర్యాదు
-
ఏపీలో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేత.. ట్రాయ్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, ఢిల్లీ: సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై ట్రాయ్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఏపీలో సాక్షి టీవీతో పాటు కొన్ని ఛానళ్ల ప్రసారాలు నిలిపివేతపై ట్రాయ్‌కి వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. కేబుల్ ఆపరేటర్లపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి సాక్షితో పాటు కొన్ని ఛానళ్ల ప్రసారాలు రాకుండా కుట్ర చేస్తోంది.సాక్షి టీవీతో పాటు మరికొన్ని ఛానళ్ల ప్రసారాలను అడ్డుకోవడం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరించడమేనని ఫిర్యాదులో వైఎస్సార్సీపీ పేర్కొంది.మీడియాకు ఆంక్షలు.. కొత్త సర్కార్ విపరీత పోకడఏపీ సీఎం ప్రమాణస్వీకారానికి మీడియా, జర్నలిస్టులకు కొత్త ప్రభుత్వం ఆంక్షలు విధించింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సాక్షి మీడియాతో పాటు మరో రెండు ఛానళ్లకు అనుమతి నిరాకరించింది. కవరేజ్ కోసం మీడియా ప్రతినిధులకు పాస్‌లు ఇవ్వని అధికారులు.. ప్రధాని హాజరవుతున్న కార్యక్రమానికి మీడియా కవరేజ్‌కు ఆంక్షలు విధించడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ప్రధాని పర్యటన వార్తలు కవర్ చేయొద్దన్న ఆంక్షలపై పలువురు మండిపడుతున్నారు. రాష్ట్ర చర్రితలో ఎన్నడూలేని విపరీత పోకడలపై విమర్శలు వస్తున్నాయి. గతంలో ప్రభుత్వ కార్యక్రమాలకు ఎల్లో మీడియాకు ఆహ్వానాలు అందగా, బాబు ప్రభుత్వం కొలువు దీరకముందే ఆంక్షలు విధించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు, రాష్ట్రంలో టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు విధ్వంసం సృష్టిస్తున్నారు. కర్రలు, రాళ్లు, రాడ్లతో వీరంగం చేస్తున్నారు. విగ్రహాలను, శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. వీరు యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల తీరుపై ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.. -
రాజకీయాల్లో గెలుపు ఓటములు శాశ్వతం కాదు
-
ఫ్యాను గాలి వీచింది
సాక్షి, అమరావతి: రాష్ట్రమంతా ఫ్యాను గాలి ఉధృతంగా వీచిందని, ఓటర్లలో అధిక శాతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని, ఆ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ప్రముఖ సెఫాలజిస్టులు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో 50 శాతం కంటే ఎక్కువ ఓట్లతో అత్యధిక శాసన సభ, లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయమని తేల్చి చెప్పారు. ‘సాక్షి’ టీవీ సోమవారం రాత్రి నిర్వహించిన చర్చలో ప్రముఖ సెఫాలజిస్టులు ‘ఆరా’ మస్తాన్, ‘ఆత్మసాక్షి’ మూర్తి, ‘రేస్’ కిషోర్, ‘ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్’ ఇంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సానుకూల ఓటుతో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించి అధికారంలోకి వస్తోందని వారంతా స్పష్టం చేశారు.సీఎం జగన్ పాజిటివ్ ప్రచారానికి ప్రజలు సానుకూలంగా స్పందించారుగత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 142కు పైగా శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పాం. అదే ఫలితాలు వచ్చాయి. 18 రాష్ట్రాల్లో మేం నిర్వహించిన సర్వేలు నిజమయ్యాయి. సైకో పోవాలి.. సైకిల్ రావాలి, ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే నినాదాలతో టీడీపీ నెగెటివ్ ప్రచారం చేసి సెల్ఫ్ గోల్ చేసుకుంది.టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తును ప్రజలు అవకాశవాద పొత్తుగా భావించారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పి ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడంలో టీడీపీ కూటమి విఫలమైంది. ఐదేళ్లు సంక్షేమ పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రజలకు మంచి చేసిన సీఎం వైఎస్ జగన్.. మళ్లీ అధికారంలోకి వస్తే మరింత మంచి చేస్తానంటూ చేసిన పాజిటివ్ ప్రచారం పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించారు. నేను సర్వేలో చెప్పిన 126 స్థానాలకంటే అధిక స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయం. – ‘ఆత్మసాక్షి’ మూర్తివైఎస్సార్సీపీకి 120 సీట్లకంటే ఎక్కువే వస్తాయి..సంక్షేమం అభివృద్ధి పథకాల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచికి కృతజ్ఞ్ఞతలు చెబుతూ ప్రజలు వైఎస్సార్సీపీకి ఓట్లు వేసినట్లు మా సర్వేలో వెల్లడైంది. టీడీపీ కూటమి మొదటి నుంచి నెగెటివ్ ప్రచారానికే పరిమితమైంది. మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో కూడా టీడీపీ కూటమి విఫలమైంది. ఇది కూటమిని తీవ్రంగా దెబ్బతీసింది. సానుకూల ఓటుతో వైఎస్సార్సీపీ 120 స్థానాల కంటే అధిక స్థానాల్లో విజయం సాధించడం ఖాయం. – రేస్ కిశోర్గ్రామీణ, పట్టణ ప్రాంతాలూ వైఎస్సార్సీపీ వైపేముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలంతా వైఎస్సార్సీపీ వైపు నిలబడ్డారు. నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి ఆధునికీకరించి, ఇంగ్లిష్ మీడియంలో పిల్లలకు చదువులు చెప్పడం అగ్రవర్ణాలనూ ఆకట్టుకుంది.సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు సీఎం జగన్ లబ్ధి చేస్తుంటే.. రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చుతున్నారంటూ టీడీపీ, ఇతర విపక్షాలు విమర్శించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకూ పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా ప్రజలు వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపారు. వైఎస్సార్సీపీ 120 స్థానాలకంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి రావడం తథ్యం. – ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఇంద్ర నీల్నేను చెప్పిన 104 స్థానాల కంటే వైఎస్సార్సీపీకి అధికంగా వస్తాయిగత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఐదేళ్లపాటు అధికారంలో ఉంది. ఈసారి కూడా అంతే స్థాయి ఓట్లతో మళ్లీ ఘనవిజయం సాధించి, అధికారంలోకి రాబోతోందన్నది మా సర్వేలో వెల్లడైంది. సీఎం వైఎస్ జగన్ గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి గుమ్మం వద్దకే అందించడం గ్రామీణ ప్రాంతాల ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. వారిపై పెను ప్రభావం చూపింది. అర్హతే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించడం వైఎస్సార్సీపీకి సానుకూలంగా మారింది. సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సాధికారత సాధించిన మహిళలు 56 శాతం వైఎస్సార్సీపీకి మద్దతుగా ఓట్లు వేశారు.టీడీపీ కూటమితో పోల్చితే వైఎస్సార్సీపీకి మహిళలు 13 నుంచి 14 శాతం అధికంగా ఓట్లు వేశారు. మహిళల ఓటింగ్ శాతం పెరగడం వైఎస్సార్సీపీకి సానుకూలంగా మారింది. వృద్ధాప్య పెన్షన్‌ను నాలుగు దశల్లో రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచి ఇవ్వడం, ఇంటి వద్దకే రేషన్ అందించడం ద్వారా వృద్ధులకు సీఎం జగన్ జీవనభద్రత కల్పించారు. ఇది వైఎస్సార్సీపీకి సానుకూలంగా మారింది. ఎన్నికల్లో సీఎం జగన్ తాను చేసింది చెప్పి, అధికారంలోకి వస్తే తాను ఏం చేస్తానో చెబుతూ పాజిటివ్ ప్రచారం చేస్తే.. చంద్రబాబు నెగెటివ్ ప్రచారాన్ని చేశారు.ఇది టీడీపీ కూటమికి ప్రతిబంధకంగా మారింది. సీఎం జగన్ అమలు చేసిన సామాజిక న్యాయం వైఎస్సార్సీపీకి అనుకూలంగా మారింది. నేను చెప్పిన 104 స్థానాలకంటే అత్యధిక స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయం. ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్‌ను సబ్ కాంట్రాక్టుకు ఇచ్చిన సంస్థకు రాజకీయ నేపథ్యం ఉండటం వల్ల అది శాస్త్రీయంగా చేయలేదు. దాని గురించి ఇంతకన్నా చెప్పను. – ‘ఆరా’ మస్తాన్ -
ఈ ఏడాది ఆడియెన్స్ కి పూనకాలే ప్రతి నెలలో ఓ భారీ సినిమా రిలీజ్
-
ప్రభాస్ కల్కి ఖాతాలో కోట్లు జోష్ మాములుగా లేదుగా
-
వాళ్లను బాధపెట్టకూడదనే నేను పెళ్లి చేసుకోలేదు క్లారిటీ ఇఛ్చిన ప్రభాస్
-
టచ్ కూడ చెయ్యలేరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు చైతన్య కృష్ణ మాస్ వార్నింగ్
-
అల్లు అర్జున్ భార్య స్నేహతో కలిసి రోడ్ సైడ్ దాబాలో భోజనం
-
సందీప్ వంగాకు ఒకలా భన్సాలీకి మరోలా ఇదేనా బాలీవుడ్ నీతి
-
రేవ్ పార్టీ అంటే ఏమిటి?
-
యూట్యూబ్ ను షేక్ చేస్తున్న పుష్ప 2 సెకండ్ సింగల్
-
అన్ని ఈవెంట్లు ఒక లెక్క బుజ్జి ఈవెంట్ మరో లెక్క ఇది ప్రభాస్ రేంజ్
-
లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో కీర్తి సురేష్
-
గ్లామర్ షో, వరుణ్ ధావన్ బేబీ జాన్ తో కీర్తి సురేష్ ఓకే
-
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ హిట్స్
-
పాయల్ రాజ్‌పుత్ రక్షణ మూవీ టీమ్ నుండి వేధింపులను ఎదుర్కొంటుంది
-
నా భార్యను కూడా వేధించారు: పోసాని భావోద్వేగం
తెనాలి మహిళ గీతాంజలి చావుకు టీడీపీ సోషల్ మీడియానే కారణమని విమర్శించారు ఏపీఎఫ్డీఎఫ్ చైర్మన్ పోసాని కృష్ణమురళి. సాధారణ మహిళను వెంటాడి, వేధించడంతో మానసిక వేదనతో గీతాంజలి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె చావుకు చంద్రబాబు, లోకేషే బాద్యత వహించాలన్నారు. ఈ మేరకు పోసాని మంగళవారం సాక్షి టీవీతో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై నిప్పులు చెరిగారు. చంద్రబాబును విమర్శించిన ప్రతి ఒక్కరిపై.. ఆయన వ్యక్తిగత దాడులకు పాల్పడుతుంటాడని మండిపడ్డారు. ప్రధాని మోదీ నుంచి సీఎం జగన్, సాధారణ పౌరులతో సహా ఎవరిని బాబు వదిలిపెట్టడని అన్నారు. మోదీ చంద్రబాబును అవినీతిపరుడని విమర్శిస్తే.. తిరిగి బాబు ప్రధానిని భార్య, కుమారుడు లేడంటూ వ్యక్తిగతంగా దుయ్యబట్టారని అన్నారు. మోదీ కూడా ఆత్మహత్య చేసుకోవాలన్నారు. గీతాంజలిపై కూడా అలాగే వ్యక్తిగతంగా విమర్శలు చేసి ఆమె చావుకు టీడీపీ కారణంగా నిలిచిందని మండిపడ్డారు. వ్యవస్థను ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ బూతులు తిడుతున్నాడు. ఒకవేళ పవన్‌ను ప్రశ్నిస్తే.. వాళ్ల సైకో ఫ్యాన్స్ ఎమ్మెల్యేలను, వారి భార్య పిల్లలను బూతులు తిడతారు. టీడీపీ, జనసేన సైకో అభిమానులు నా భార్యను కూడా వదల్లేదు. తనపై కూడా బూతులు తిట్టారు. నాభార్య గురించి తన మొబైల్‌కే అసభ్యంగా మెసెజ్‌లు పంపారు. గీతాంజలి కంటే ఎక్కువ వేధింపులకు గురిచేశారు. ఇన్ని తిట్టినా నా భార్య ఏడవలేదు. ధైర్యంగా నిలబడింది. నా భార్య కూడా గీతాంజలిలాగా చనిపోయి ఉంటే నాకు దిక్కు ఎవరు ఉంటారు. నా భార్య నవ్వే నాకు ఇన్సిపిరేషన్. నాకు అప్పుడు ఏడుపు రాలే.. ఇప్పుడు మాట్లాడుతుంటే ఏడుపు వస్తుంది. అప్పుడు ఈ వెధవలను బహిరంగంగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నా. అప్పుడే మీడియాతో మీటింగ్ పెట్టి నా భార్యకు వచ్చిన మెసెజ్‌లు అన్నీ చూపించా. వాళ్లు ఎలా తిట్టారో నేను వాళ్లను అలాగే తిట్టిన. దమ్ముంటే ఫేస్ టు ఫేస్ పోరాడాలని సవాల్ విసిరాను. చంద్రబాబు దగ్గర ఉన్న విచ్చలవిడి డబ్బులతోటి దివంగత ఎన్టీఆర్ నుంచి ఎమ్మెల్యేలను లాక్కున్నాడు. ఎన్టీఆర్‌ను చెప్పుతో కొట్టించాడు. వెన్నుపోటు పొడిచి సీఎం పోస్టు లాక్కున్నాడు. సీఎం జగన్ నుంచి 23 ఎమ్మెల్యేలను కొన్నాడు. జైలు కెళ్లి మళ్లీ అదే డబ్బులు వెదజల్లి బయటకు వచ్చాడు. చంద్రబాబు ఓటర్లను ప్రేమిస్తాడు. సీఎం జగన్ ప్రజలను ప్రేమిస్తాడు . అదే ఇద్దరికిఉన్న తేడా కాబట్టే జనం గుండెల్లోఉన్నాడు. సిద్ధం సభకు లక్షల జనాలు వచ్చారు. మహిళలు ఎవరూ ఏడవకండి. అధైర్య పడకండి.. వేధవలు ఉంటారు.. తట్టుకొని ధైర్యంగా ఎదుర్కోండి. మనకేనా కన్నీళ్లు ఉంటాయి.. వాళ్లకు ఉండవా.. ప్రశ్నించి ఎదురుతిరగండి. రేపు మీకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మహిళలు రోడ్డు మీదకు రండి.. గీతాంజలి నా చెల్లె కాదు కదా. నా అక్క కాదు కదా. నా కుంటుబ సభ్యురాలు కాదు కదా.. నా వరకు వస్తే చుద్దాంలే అప్పటి వరకు నారా లోకేష్ ఇంటికి వెళ్లండి.. వాళ్ల భార్య బ్రహ్మిణి దగ్గరకు వెళ్లి చెప్పండి. గీతాంజలి అనే మహిళను సోషల్ మీడియా ట్రోల్సింగ్స్తో చంపించాడు. నీ భర్తను చెప్పుతో కొట్టి బుద్ధి వచ్చేలా చేయ్ అని నిలదీయండి. ఇతడి వల్ల ఇంకెవరూ చనిపోకుండా మీరు వచ్చి నిలదీస్తే ఇలాంటి ఆత్మహత్యకు తగ్గుతాయి’ అని పోసాని పేర్కొన్నారు. గీతాంజలి అనే మహిళ తన సొంత ఇంటి కల నెరవేరిందంటూ సీఎం జగన్‌ను పొగడటం ఆమె పాలిట శాపమైంది. టీడీపీ సోషల్ మీడియా సైకోలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. వెంటాడి వేధించారు. అసభ్య పదజాలంతో దూషించారు. ప్రతిక్షణం నరకం చూపించారు. ఆమె గుండె తట్టుకోలేకపోయింది.ట్రోలింగ్ భరించలేకపోవ్వడంతో చివరకు ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. -
Watch: తండ్రి హత్య కేసులో కూతురు చెప్పని నిజాలివే..
-
Sakshi TV-Big Question: ‘‘దెబ్బకు ఠా.. దొంగల ముఠా
సాక్షి, హైదరాబాద్: జేబుకు తెలియకుండానే పర్సు కొట్టేసే రకం ఆయనది. స్కీమ్ పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసిన స్కామ్ వల్లే ఇప్పుడు కటకటాల పాలయ్యారు. సీమెన్స్ అనే కంపెనీకి తెలియకుండానే వాళ్ల పేరుతో ఒప్పందం చేసుకోవడం ఒక వింత. అయితే అది 100 శాతం ఫ్రాడ్ అని తేల్చేసి బాబు బండారాన్ని బయటపెట్టింది సదరు సీమెన్స్ కంపెనీ. డిజైన్ టెక్ నుంచే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెందిన షెల్ కంపెనీలకు ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు మళ్లాయి. ఆ కంపెనీ ఎండీ వికాస్ ఖన్వేల్కర్ని ఈడీ గతంలోనే అరెస్ట్ చేసింది. రూ. 371 కోట్ల దోపిడీలో స్కిల్ చూపించిన చంద్ర బాబు, వికాస్ ఖన్వేల్కర్. స్కిల్ స్కామ్‌లో పక్కా ఆధారాలతో పట్టుబడ్డ బాబు అండ్ గ్యాంగ్.. ‘‘దెబ్బకు ఠా...దొంగల ముఠా’’ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో దర్యాప్తు సంస్థ ఏపీ సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో బిగ్ క్వశ్చన్ రాత్రి 7 గంటలకు.. మీ సాక్షి టీవీలో.. -
పట్టపగలే ప్రజలకు చుక్కలు చూపిస్తున్న చిరుతలు
-
రచ్చబండ: ఇదే స్ఫూర్తి.. ప్రజల పక్షాన సాక్షి..
ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు.. ప్రజాతీర్పే అంతిమం.. ప్రభుత్వాలైనా.. రాజకీయ పార్టీలైనా ప్రజాభిప్రాయానికి తలవంచాల్సిందే.. ప్రజల అభిమతం తెలుసుకొని మసులుకోవాల్సిందే.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వాల ఎజెండా కావాలి.. ప్రజాభివృద్ధే రాజకీయ పార్టీల జెండాగా ఎగరాలి.. ఇదే స్ఫూర్తితో సాక్షి ప్రజల పక్షాన నిలబడింది. ప్రజా గొంతుకై సాక్షి పోరాడుతోంది.. ప్రజాకోర్టులో నాయకులను నిలబెడుతుంది.. ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంది.. రచ్చబండ వేదికగా ప్రజాభిప్రాయాన్ని వినిపిస్తుంది రచ్చబండ… ప్రతి శనివారం రాత్రి 7.30గంటలకు తిరిగి ఆదివారం మధ్యాహ్నం 12.30గంటలకు -
NATA Convention: సాక్షి ప్రతినిధి సింహాకు శంకర నేత్రాలయ అవార్డు
సాక్షి టీవీ అమెరికా ప్రతినిధి సింహాబలుడు హనుమంతుకు ప్రతిష్టాత్మక శంకర నేత్రాలయ అవార్డు దక్కింది. ఎంతో మంది అభాగ్యులకు కంటి వైద్యం అందించడంతో పాటు.. భారత్ తో పాటు పలు ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తోంది శంకర నేత్రాలయ. నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాటా 2023 తెలుగు మహాసభల సందర్భంగా తమ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించినందుకు గాను సాక్షి టీవీ అమెరికా ప్రతినిధి సింహాబలుడు హనుమంతును సత్కరించింది శంకర నేత్రాలయ. నాటా కన్వెన్షన్ వేదికగా శంకర నేత్రాలయ యూఎస్ఏ ఆధ్వర్యంలో డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో భాగంగా ఈ అవార్డులను అందించారు. డల్లాస్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి చేతుల మీదుగా పలువురిని గుర్తించి అభినందించారు. శంకర నేత్రాలయ కార్యక్రమాలు ప్రేక్షకులకు చేరువ అవడానికి సహాకరించిన సాక్షి టీవీ నార్త్ అమెరికా ప్రతినిధి సింహాబలుడు హనుమంతుకి అవార్డు ప్రదానం చేసి, ఘనంగా సత్కరించారు. శంకర నేత్రాలయ యూఏఎస్ఏ అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా శంకర నేత్రాలయ ద్వారా ప్రెసిడెంట్ బాల రెడ్డి ఇందుర్తి మరియు టీమ్ కంటి వైద్య సేవాలను అందిస్తున్న విషయం విదితమే. తన సహాకారాన్ని ఎల్లప్పుడూ అందిస్తూ.. మద్దతుగా నిలుస్తున్న డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డితో పాటు సహాయసహాకారాలు అందిస్తున్న ప్రతిఒక్కరికీ టీమ్ ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ నిర్వాహకులు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: సారీ... మీ పేరు మరచిపోయాను!) -
ఆర్ధిక ఇబ్బందుల వల్ల అమ్మకానికి పాకిస్థాన్
-
కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షిస్తున్న సినీ గ్లామర్
-
అక్రమ ఆదాయానికి చెక్ పెట్టిన ఏసీబీ సూపర్ రైడ్
-
‘సాక్షి’ పాత్రికేయులకు హైబిజ్ పురస్కారాలు
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి డెస్క్ సాగుబడి’ ఇన్చార్జి పంతంగి రాంబాబు, సాక్షి టీవీ న్యూస్ కాస్టర్ కిషోర్ హైబిజ్ టీవీ మీడియా పురస్కారాలను అందుకున్నారు. హైటెక్స్‌లో బుధవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో హోం మంత్రి మహమూద్ అలీ నుంచి రాంబాబు ఉత్తమ ప్రింట్ అగ్రికల్చరల్ జర్నలిస్ట్ పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఇంటిపంటలు, సిరిధాన్యాల వ్యాప్తి దిశగా ఆయన ప్రతి మంగళవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమయ్యే ‘సాగుబడి’ పేజీని నిర్వహిస్తున్నారు. సాక్షి టీవీ న్యూస్ కాస్టర్ కిషోర్‌తో పాటు వివిధ పత్రికలు, సోషల్ మీడియా సంస్థలు, శాటిలైట్ చానళ్ల పాత్రికేయులు, ఫొటో, వీడియో జర్నలిస్టులు కూడా పురస్కారాలు అందుకున్నారు. కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ మార్కెటింగ్ కేఆర్పీ రెడ్డి, ఈవీ నర్సింహారెడ్డి – ఐఏఎస్ (వీసీ–ఎండీ టీఎస్ ఐఐసీ), నరేంద్ర రామ్ నంబుల (సీఎండీ – లైఫ్ స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్), పి.చక్రధర రావు (ప్రెసిడెంట్–ఐపీఈఎంఏ, పౌల్ట్రీ ఇండియా), ఎం.రవీందర్ రెడ్డి (డైరెక్టర్ మార్కెటింగ్–భారతి సిమెంట్స్),వి.రాజశేఖర్ రెడ్డి (జనరల్ సెక్రటరీ–క్రెడాయ్), ఎం.రాజ్‌గోపాల్ (ఎండీ– హై బిజ్ టీవీ, తెలుగు నౌ), డాక్టర్ జె.సంధ్యారాణి (సీఈవో–హై బిజ్ టీవీ, తెలుగు నౌ) తదితరులు పాల్గొన్నారు. -
బేబీ షవర్ ఈవెంట్ లో బావ,బమరిది సందడి ...!
-
ఫుల్ ఖుషీలో సుకుమార్...
-
ఏజెంట్ ప్రీ రిలేస్ బిజినెస్ ఎన్ని కోట్లో తెలుసా?
-
మహేష్ త్రివిక్రమ్ సినిమా కు బ్రేక్?
-
సినిమా అట్టర్ ప్లాప్.. కలెక్షన్ మాత్రం బీభత్సం
-
పూజ హెగ్డే కొంప ముంచిన సంయుక్త మీనన్?
-
'కలియుగ భీముడు' గా రామ్ చరణ్...!
-
దోస్తులే టార్గెట్..!జాన్వీ కపూర్ భారీ రెమ్యూనరేషన్
-
టాలీవుడ్ పై సీక్వెల్ వర్షాలు
-
సెంటిమెంట్ తో ఏజెంట్ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్!
-
దీపావళి ధమాకా!
-
క్లైమాక్స్ ట్విస్ట్...!
-
హారర్ జానర్ కు మల్లి మంచి రోజులు?
-
కాకి సెంటిమెంట్ తో వండర్స్ క్రీయేట్ చేస్తున్న విరూపాక్ష కలెక్షన్
-
తేజ్ క్రష్ ఆన్ సామ్...!
-
గుజరాత్ హీరోయిన్స్ మధ్య సూపర్ ఫైట్
-
బావ,బామ్మర్దులకు ఒకడే విల్లన్!
-
ఊహించని స్థాయిలో ప్రభాస్ రెమ్యూనరేషన్!
-
శరత్ బాబుకు వెంటిలేటర్ పై కొనసాగుతున్న చికిత్స
-
సుమ నీకు నేను పెద్ద ఫ్యాన్ ని
-
హీరోలపై హీరోయిన్లు పంచులే పంచులు
-
బాహుబలి వల్లే పొన్నియన్ సెల్వన్...!
-
జయం రవి వెటకారం తో నవ్వులతో మోత మోగిన ఆడిటోరియమ్
-
చిరంజీవి,శ్రీముఖి లా మధ్య రొమాంటిక్ నడుము సీన్!
-
రంజాన్ స్పెషల్ షేర్ కుర్మా తయారీ!
-
దాస్ కా ధమ్కీ సీక్వెల్ వచ్చేస్తోంది...హీరో,హీరోయిన్లు ఎవరంటే?
-
పుష్ప యూనివర్స్ పార్ట్ 3 కి లైన్ క్లియర్!
-
ప్రభాస్,బాల కృష్ణ వల్ల రామబాణం దూసుకుపోతుంది
-
నాకు ప్రభాస్ కి ఇలాగే ఉంటుంది బాలయ్యకు స్పెషల్ థాంక్స్
-
మన దాకా వస్తే కానీ ఎన్టీర్,సాయి ధరమ్ తేజ్,చెపింది అర్ధం కాదు
-
రామబాణంలో సీన్ లీక్ చేసి నవ్వులు పూయించిన అలీ
-
భారం అంతా అఖిల్ పైనే...సీన్ లోకి అతను ఎందుకు రావట్లేదు?
-
శాకుంతలం సినిమా పై సమంత షాకింగ్ రియాక్షన్
-
ఆ హీరో తో పూరీ జగన్నాథ్ సినిమా షూటింగ్ ఎప్పుడంటే?
-
టాలీవూడ్ మూవీస్ సీక్వెల్స్ దందా
-
రానా నాయుడు 2 వెంకటేష్ పరిస్థితి ఏంటో?
-
కర్ణాటక ఎన్నికలో ధన ప్రవాహం
-
మహిశ్మతిపై పుష్ప రాజ్ యుద్ధం
-
సమ్మర్ ఎఫెక్ట్ మెట్రోకు భారీగా ప్రయాణికులు
-
సీఐడీ సోదాల్లో కీలక పత్రాలు హార్డ్ డిస్కులు
-
తెలంగాణాలో మండుతున్న ఎండలు
-
కర్ణాటకలో మళ్లీ అధికారం బీజేపీదే..!
-
కేన్ మామకి గాయాలు.. ఐపీఎల్ మోత్తానికి దూరం
-
తండ్రి కాబోతున్న రానా?
-
చెన్నై సూపర్ కింగ్ పేసర్స్కి ధోని స్ట్రాంగ్ వార్నింగ్...
-
వచ్చేశారు..ఇక తగ్గేదేలే..SRHకి గుడ్ న్యూస్
-
అదీ సుమక్క లెక్క
-
నాకు యాక్సిడెంట్ అయిన విషయం ఎప్పుడో మర్చిపోయా.. అది నాకు స్వీట్ మెమోరీ
-
ఒక లక్ష్యంతో పుట్టిన సాక్షి టీవీ
-
చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్: విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను ఎలాగైనా సాధించి, రాష్ట్ర ప్రజల్లో ఆ ఆనందాన్ని చూడాలన్న ప్రధాన ఆశయంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చిన్నట్లు చెప్పారు బీజేపీ నాయకురాలు విజయశాంతి. తెలంగాణ వచ్చినా కూడా కేసీఆర్ దొర వద్ద ప్రజలు బానిసలుగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇంత మంది త్యాగాల వల్ల వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికే లాభం జరిగిందని మండిపడ్డారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి 25 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుతో కేసీఆర్ కుటుంబానికే లాభం జరిగిందని విజయశాంతి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కమిషన్లు తీసుకున్న కేసీఆర్ కుటుంబానికి, వారి బినామీలకే లబ్ది చేకూరిందన్నారు. ప్రాజెక్టుతో ప్రజలకు నీరు మాత్రం రావడం లేదని, రైతులు నష్టపోతున్నారన్నారని అన్నారు. ఒక పనికిమాలిన ప్రాజెక్టు కట్టారని దుయ్యబట్టారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ సర్కార్ 5 లక్షల కోట్ల అప్పులుగా మార్చిందని మండిపడ్డారు.. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలడిగితే చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్‌కు లేదా? ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఎందుకు అని నిలదీశారు ‘బీఆర్ఎస్ దేనికోసం పెట్టావ్. ఎవరికోసం పెట్టావ్.. తెలంగాణ డబ్బుల్ని బీఆర్ఎస్ పేరుతో ఇతర రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్.. కేసీఆర్‌లో కమిట్మెంట్ లేదు. కేసీఆర్‌పై పోరాడానికి తెలంగాణ బీజేపీ సిద్ధంగా ఉంది. కానీ మమ్మల్ని ఇబ్బందిలు పెడుతున్నారు. సభలకు, పాదయాత్రలకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు తొలుత మెదక్ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేశాను. చేయాల్సిన అభివృద్ధి చేశాను. ఇప్పుడు నేను కొత్తగా పోటీ చేయాలి. ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది కేంద్ర డిసైడ్ చేస్తుంది. అసెంబ్లీ, పార్లమెంట్లో దేనికి పోటీ చేసేది త్వరలో తెలుస్తుంది. ఏ పార్టీలో చిన్న చిన్న గొడలు ఉంటాయి. వాటిని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. ఒక టీం వర్క్‌లాగే ముందుకు వెళ్తున్నాం. బీజేపీ చాలా డిసిప్లెన్ పార్టీ’ అని విజయశాంతి వ్యాఖ్యానించారు. ఆమె ఇంకేం మాట్లాడారో తెలుసుకునేందుకు ఈ కింది వీడియో చూడండి. -
Sakshi TV: సాక్షి టీవీపై చంద్రబాబు అక్కసు
సాక్షి, చిత్తూరు జిల్లా: సాక్షి టీవీపై చంద్రబాబు అక్కసు వెళ్లగక్కారు. సాక్షి టీవీనా.. వాడిని లాగి బయట పడేయండన్న చంద్రబాబు.. వారిది అమానుషం, బయట తిరగకుండా చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. కుప్పంలో పోలీసులపై కూడా చంద్రబాబు వీరంగం సృష్టించారు. పోలీసులపై ఆయన రెచ్చిపోయారు. మీ అంతు చూస్తానంటూ పోలీసులను బెదిరించారు. నిబంధనలు పాటించాల్సిందేనని బాబుకు పోలీసులు స్పష్టం చేయగా, ‘నాకే రూల్స్ చెబుతారా’ అంటూ పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం వెళ్లగక్కారు. కాగా, చంద్రబాబు కుప్పం పర్యటనలో ఓవరాక్షన్‌పై ఎమ్మెల్సీ భరత్ ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు వీధి రౌడీల్లా ప్రవర్తించారని మండిపడ్డారు. చంద్రబాబు ఫ్రస్టేషన్ పీక్స్‌కు వెళ్లింది. ఇటీవలే 11 మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు. మళ్లీ చంద్రబాబు ఏం చేద్దామని కుప్పం వచ్చారంటూ ప్రశ్నించారు. అమాయకుల మరణాలకు సంబంధించి పోలీసులపై నెపం నెట్టి ప్రజలను డైవర్ట్ చేయాలన్నదే బాబు ఉద్దేశం. పేద ప్రజల ప్రాణాలంటే చంద్రబాబు విలువలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: అందుకే ఆ జీవో తెచ్చాం: మంత్రి జోగి రమేష్ -
టాప్ 3 టాపిక్స్.. తేల్చేద్దాం గన్‌షాట్‌గా..!
కమలంతో పొత్తు కోసం బాబుగారి వెంపర్లాట.. ఖమ్మంలో కన్నింగ్ ప్లాన్ అదేనా ? గత ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేసిన టీడీపీ చిత్తయ్యింది. కేవలం 23 సీట్లకే పరిమితమై ఘోర పరాభావం చవిచూసింది. అంటే చంద్రబాబును ప్రజలు నమ్మలేదనే విషయం చాలా క్లియర్‌గా అర్థమైంది. మరి ఈసారి కూడా ఒంటిరిగా వెళితే పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోతుందనే భావనలో ఉన్న చంద్రబాబు.. కమలంతో పొత్తుకోసం వెంపర్లాడుతున్నారు. బాబు గారి ఖమ్మం పర్యటన కన్నింగ్ ప్లాన్ అదేనా? విద్యే అత్యంత ప్రాధాన్యమని సీఎం జగన్ భావిస్తున్నారా ? ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. సమాజంలో ఉన్న అంతరాలు తొలగిపోయి.. పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియా, డిజిటల్ విద్య అందకూడదనే పెత్తందారీ భావజాలానికి చెక్ పెట్టే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. విద్యార్థులకు అందించే చదువులో సమానత్వం ఉండాలి. మంచి విద్యా విధానంతో తలరాతలు మార్చాలనే యోచన సీఎం జగన్‌ది. భావి తరాల పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యం. చదువులో సమానత్వం ఉంటేనే ప్రతి కుటుంబంలో అభివృద్ధి ఉంటుందనేది సీఎం జగన్ ఆలోచన. విద్యే అత్యంత ప్రాధాన్యమని సీఎం జగన్ భావిస్తున్నారా? విశాఖ బ్రాండ్ వాల్యూ విశ్వవ్యాప్తం చేస్తున్నారా ? ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధాని (ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్)గా విశాఖపట్నాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి అంతర్జాతీయంగా బ్రాండింగ్ కల్పించేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. వరుస అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా దేశంలోనే అత్యధిక కార్యక్రమాలు జరుగుతున్న (మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ) నగరంగా విశాఖ పేరు మారుమోగేలా చర్యలు చేపట్టింది. వరుసగా ఇక్కడ అంతర్జాతీయ సదస్సులు చేపట్టడానికి విశాఖ బ్రాండ్ వాల్యూనూ విశ్వవ్యాప్తం చేయడానికేనా? తేల్చేద్దాం ...గన్ షాట్‌గా... శనివారం రాత్రి 7 గంటలకు తిరిగి ఆదివారం ఉదయం 7.30 గంటలకు -
టాప్ 3 పొలిటికల్ టాపిక్స్.. తేల్చేద్దాం గన్‌షాట్‌గా..!
బీసీలు, మైనార్టీలను మోసం చేసింది నువ్వే కదా బాబు ? విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జయహో బీసీ మహాసభ విజయవంతం కావడం టీడీపీ సహించలేకపోతోంది. ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క బీసీని రాజ్యసభకు పంపకుండా వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే.. మూడున్నరేళ్లలో రాష్ట్ర కోటాలో 8 స్థానాలు ఖాళీ అయితే అందులో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపి సీఎం వైఎస్ జగన్ వారికి సమున్నత గౌరవం ఇచ్చారు. వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచిందెవరు?. బీసీలు, మైనార్టీలను మోసం చేసింది చంద్రబాబు కాదా?.. బీసీలు, మైనార్టీలను మోసం చేసింది నువ్వే కదా బాబు ? రూల్స్ తెలియని వాడు రూలర్ అవుతాడా ? 2019 ఎన్నికల్లో రెండు చోట్ల అసెంబ్లీకి పోటీచేసి ఓటమి పాలైన పవన్ కల్యాణ్ ఇప్పుడు కనీసం తను అయినా గెలవాలని తంటాలు పడుతున్నారు. రాంగ్ రూట్లో పవన్ వెళ్తున్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు మినహా ఏమీ తెలియని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. వారాహి వాహనానికి మిలటరీ వాహనాలకు మాత్రమే వేసే ఆలీవ్ గ్రీన్ రంగు వేశారు. ఇది చట్ట విరుద్ధం కాదా..? రూల్స్ తెలియని వాడు రూలర్ అవుతాడా ? మోదీ బీజేపీ బాహుబలిగా మారారా ? పోయిన చోటే వెతుక్కోవాలంటారు. గత ఎన్నికల్లో త్రుటిలో కోల్పోయిన స్థానాలపై బాగా దృష్టి పెట్టడంలో, దూరమైన వర్గాలను కలుపుకొని పోవడంలో పక్కా ప్రణాళికతో వ్యవహరించిన బీజేపీ గుజరాత్లో తిరుగులేని విజయాన్ని సాధించింది. సీఎంగా 13 ఏళ్లు గుజరాత్‌లోనూ, పీఎంగా ఎనిమిదేళ్లుగా కేంద్రంలోనూ తిరుగులేని నాయకునిగా మోదీ సాధించిన పేరు ప్రఖ్యాతులు కూడా ఈసారి ఫలితాలను బాగా ప్రభావితం చేశాయి. ఒక్కడే వచ్చాడు..156 సీట్లు పట్టుకుపోయాడు.. మోదీ బీజేపీ బాహుబలిగా మారారా ? తేల్చేద్దాం గన్‌షాట్‌గా.. శనివారం రాత్రి 7 గంటలకు తిరిగి ఆదివారం ఉదయం 7.30 గంటలకు సాక్షి టీవీలో -
రాధా TMT డైరెక్టర్ - అక్షత్ శరఫ్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
అదే భారత్ గొప్పతనం.. ‘సాక్షి’తో సద్గురు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) 17వ మహాసభలు ఘనంగా జరిగాయి. వాల్టర్ ఇ కన్వెన్షన్ సెంటర్లో జూలై 1 నుండి 3 తేదీ వరకు జరిగిన మూడు రోజుల కార్యక్రమాల్లో వివిధ రంగాల ప్రముఖులు, ఆధ్మాతిక వేత్తలు, అమెరికాలోని తెలుగువారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆటా మహా సభల్లో ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, యోగా గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఆయనను పలకరించింది. సద్గురుతో సాక్షి టీవీ రిపోర్టర్ రుచికా శర్మ ఇంటర్వ్యూ... నేటీ టెక్నాలజీ యుగంలో ధనమే పరమావధిగా పరుగులు పెడుతున్న ఈతరం యువత.. ముఖ్యంగా అమెరికా జీవన విధానంలో మునిగి తేలుతున్న మన భారతీయ పిల్లల్లో సంప్రదాయ సంస్కృతులను ఎలా స్థిరంగా నిలబెట్టాలనే దానిపై ‘సాక్షి’ సద్గురు అభిప్రాయాలను తెలుసుకుంది. సద్గురు మాట్లాడుతూ.. ‘అమెరికాలో ఉన్న తెలుగు పిల్లలు ఇండియాలో స్కూలింగ్ చేయడం వీలు కాదు. కాబట్టి స్కూలింగ్ తరువాత పిల్లలను 4, 5 సంవత్సరాల వరకు ఉన్నత చదువులకు ఇండియాకు పంపించడం మంచింది. ఇండియాలో ఉండే మూడు, నాలుగేళ్లు నేర్చుకోవడానికి ఎంతో దోహదపడుతుంది. ముఖ్యంగా అమెరికాకు, ఇండియాకు ఉన్న జీవన విధానంలో తేడాను గమనిస్తారు. ఎన్నో విషయాలపై అవగాహన వస్తుంది. భారతీయ సంప్రదాయాలు, పద్ధతులు తెలుస్తాయి. భారత్ భిన్న సంస్కృతులకు నిలయం. ఇక్కడ జీవించే భిన్న వర్గాల ప్రజలు, వారి అలవాట్లు, జీవన విధానంపై పిల్లలకు అవగాహన ఏర్పడుతుంది. ఇదే ఇండియా గొప్పతనం. విభిన్న వర్గాల మధ్య జీవించడం ద్వారా వారి ఆలోచనలు, మనస్తత్వాలు తెలుస్తాయి. మన సొంత ఉనికి స్వభావాన్ని తెలుసుకోవచ్చు, జీవిత సత్యం బోధపడుతుంది. ఎంతో అద్భుతమైన మానవత్వం గల మనుషులుగా తయారవుతాం. ఓపెన్ మైండ్‌తో ఇండియాలో ట్రావెల్ చేయడం ముఖ్యం. ఇండియాకు, అమెరికాకు మధ్య మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవహారాల్లో వ్యతాసాలు చూడకుండా ఇక్కడి ప్రజల్లోని మానవత్వాన్ని, సంస్కృతిని నేర్చుకోవడం ఎంతో విలువైనది’ అని సద్గురు పేర్కొన్నారు. పూర్తి ఇంటర్వ్యూ కోసం కింది వీడియో చూడండి👇 -
హైదరాబాద్ లో పెరిగిన పబ్ కల్చర్
-
యూపీలో బీజేపీ జైత్రయాత్రకు ఈ రెండు అంశాలు కీలకం
-
సాక్షి టీవీ 13 వార్షికోత్సవ శుభాకాంక్షలు
-
సాక్షి టీవీ చేతిలో దర్భంగా బ్లాస్ట్ కీలక సాక్ష్యం
-
ఇది సెంటిమెంట్ గాలి
-
వెండితెరపై పాటలకు...స్టెప్‌లకే ఆమె పరిమితమా?
-
A1 మహిళా ఎక్స్‌ప్రెస్.. త్వరలో..
-
పుష్కర సాక్షి
-
జగనన్న బర్త్‌డే సాంగ్ వైరల్..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తమ ప్రియతమ నాయకుడి జన్మదినం పురస్కరించుకుని వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు సోమవారం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా విప్లవాత్మక నిర్ణయాలు, చరిత్రాత్మక పథకాలతో అన్ని వర్గాల ప్రజల ఆదరణ చూరగొన్న సీఎం.. ఏడాదిన్నర కాలంలోనే 90 శాతం హామీలు నెరవేర్చిన విషయం తెలిసిందే. చదవండి: జగనన్నకు పుట్టినరోజు బహుమతి ఇదే: ఆర్కే రోజా అదే విధంగా సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్బంగా ప్రత్యేక పాటను సాక్షి టీవీలో ఆవిష్కరించారు. ‘ఒక నిజం జన్మించిన రోజు.. ఒక తేజం ఉదయించిన రోజు.. పుట్టినరోజు జగనన్న పుట్టినరోజు’ అంటూ సాగే ఈ పాటలో వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టినప్పటి నుంచి నేటి వరకు ఆయన చేపట్టిన కార్యక్రమాలు, అందించిన సంక్షేమ పాలన, సాధించిన ఘనతను కీర్తిస్తూ కొనసాగింది. ప్రస్తుతం ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చదవండి: సీఎం వైఎస్ జగన్‌కు శుభాకాంక్షల వెల్లువ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రానా ఎంత కట్నం తీసుకున్నారు?
కొత్త వరుడు కొంటె పోరడు ► కొత్త పెళ్లికొడుకు రానా ఎంత కట్నం తీసుకున్నారు? పెళ్లయ్యాక వచ్చిన తొలి దీపావళి పండగను ఎలా జరుపుకోబోతున్నారు? ► టపాసుల్లో ప్రభాస్‌ని రానా ఏ బాంబుతో పోల్చారు? అనుష్క గురించి రానా ఏమన్నారు? ► ఇలాంటి విషయాలన్నీ భలే ఆసక్తకిరంగా ఉంటాయి. ఇవి మాత్రమే కాదు.. రానా ఇంకొన్ని విషయాలను ఈ విధంగా షేర్ చేసుకున్నారు. ► పెళ్లి చేసుకునే టైమ్ వస్తే ఎవరూ ఆపలేరు. అది ప్రభాస్‌కైనా, నాకైనా ఎవరికైనా ఒకటే. ప్రభాస్ స్టార్ రాకెట్ లాంటివాడు. అది పేలినప్పుడు ఆకాశమంతా కనపడుతుంది. అనుష్క కూడా ప్రభాస్‌లాంటి రాకెట్ కానీ, ఈమెకు ఇంకా కొన్ని కలర్స్ తోడవుతాయి. అనుష్క చిచ్చుబుడ్డిలాంటిది. కట్టప్ప (సత్యరాజ్) భూచక్రంలాంటివాడు. నేను థౌజండ్‌వాలా లాంటివాణ్ని. ► కోవిడ్ టైమ్‌లో పెళ్లి చేసుకోవటం మంచిదే. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చక్కగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడిప్పుడే మా ఫ్రెండ్స్ అందర్నీ కలుస్తున్నాను. ► కట్నం ఎంత తీసుకున్నారు? అని యాంకర్ బిత్తరి సత్తి అడిగితే.. ‘నువ్వెంత తీసుకున్నావ్’ అని రానా ఎదురు ప్రశ్నించారు. సత్తి ఏం చెప్పారు? రానా తీసుకున్న కట్నం ఎంత? ► ఇప్పుడు మూడు సినిమాలు చేస్తున్నాను. అందులో ‘అరణ్య’ చిత్రం ఒకటి. ఆ సినిమాలో 15 నిజమైన ఏనుగులతో కలిసి నేను పెరుగతాను. థాయ్‌ల్యాండ్‌లోని గాభి ఐల్యాండ్‌లో, కేరళ అడవుల్లో ఈ సినిమా తీశాం. ‘హిరణ్యకశ్యప’ని వచ్చే ఏడాది డిసెంబర్లో ప్రారంభిస్తాం. ‘విరాటపర్వం’ 1990లకు సంబంధించిన నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ప్రేమకథ. ‘గరమ్ సత్తి’తో రానా పంచుకున్న మరెన్నో విషయాలను శనివారం రాత్రి 8.30 గం‘‘లకు, తిరిగి ఆదివారం ఉదయం 8.30 గం‘‘లకు ‘సాక్షి’ టీవీలో చూడండి. పండగ సిరి తండ్రి ‘సిరివెన్నెల’ స్టార్ రైటర్. తనయుడు రాజా మంచి నటుడు. ఇటీవలే వెంకటలక్ష్మీ హిమబిందుతో ఏడడుగులు నడిచారు రాజా. దీపావళి సందర్భంగా సతీసమేతంగా ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు పంచుకున్నారు. ► పెళ్లికాకముందు తనను అందరూ బిందు అని పిలిచేవారట. నాకు ఆ విషయం తెలియక లక్ష్మీ అని పిలుస్తుంటే ఎవర్నో పిలుస్తున్నట్లు వెళ్లిపోయేది. అప్పుడు నేను ‘నీ పేరు లక్ష్మీ హిమబిందు కదా, అందుకే లక్ష్మీ’ అని పిలుస్తాను అన్నాను. మా ఇంట్లో అందరూ లక్ష్మీ అనే పిలవటంతో ఇప్పుడు అలవాటు అయ్యింది. ► లక్ష్మీలో నాకు బాగా నచ్చింది ఆమె కలుపుగోలుతనం అని రాజా అంటే , ‘ఏ చిన్న పని చేసినా క్రిస్టల్ క్లియర్‌గా చేస్తారు. అలాగే ఆయన క్రమశిక్షణ చాలా నచ్చుతుంది’ అని లక్ష్మీ అన్నారు. ► మా అమ్మగారికి కోడల్ని తెద్దామనుకుంటే, అత్తగారికి కూతురయ్యింది. మమ్మల్ని ఎవరు చూసినా కొత్తగా పెళ్లయినవాళ్లలా లేరు అంటున్నారు. అలాగే మా బావ త్రివిక్రమ్‌గారు ‘ఎన్నో ఏళ్లుగా ఒకరికొకరు తెలిసినవాళ్లులా ఉన్నారు మీ ఇద్దరూ’ అన్నారు. మా ఫ్యామిలీ అందరికీ లక్ష్మి నచ్చేసింది. అది అన్నిటికన్నా ఆనందం. త్రివిక్రమ్‌గారు తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్సైక్లోపీడియా. అందుకే నేను ఏదైనా విషయంలో డైలమాలో ఉంటే బావ సలహా తీసుకుంటాను. ప్రస్తుతం ఉన్న టాప్‌టెన్ డైరెక్టర్స్‌తో పని చేయటంతో పాటు కొత్తగా ఏదైనా చేసి నటునిగా నిరూపించుకోవాలనుకుంటున్నా. ► డబ్బు కోసం నేను నటునిగా ప్రయాణం మొదలుపెట్టలేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా బాగానే సంపాదించేవాణ్ని. కానీ, అక్కడ తృప్తిగా అనిపించకపోవటంతో జాబ్ క్విట్ చేశాను. ► నాన్న ఏ సినిమాకైనా పాట రాస్తున్నప్పుడు ఒక వెర్షన్ రాసి దర్శకునికి వినిపిస్తే, చాలా బావుంది పాట ఇచ్చేయండి అంటారు. అప్పుడు నాన్నగారు ‘మీకు నచ్చింది కానీ నాకు కావాల్సింది ఇంకా ఏదో మిస్సయింది. అది రాగానే ఇస్తాను’ అంటారు. నేను వ్యక్తిగతంగా నాన్న దగ్గర నుండి కమిట్మెంట్, వృత్తిపట్ల ప్యాషన్ నేర్చుకుంటే అమ్మదగ్గర క్రమశిక్షణ నేర్చుకున్నాను. ► నాకు యాక్టింగ్ తర్వాత ఫిట్నెస్ ఎంతో ఇష్టం. నాకిష్టమైన పనే చేస్తాను కాబట్టి ఎప్పుడూ సెలక్టివ్ గా ఉంటాను. నేను ఫిట్నెస్ ఫ్రీక్ కాబట్టి ఇలా ఉండాలి, అలా తినాలి అని చెప్తాను. వాటివల్ల ఇంట్లో డిబేట్లు, గొడవలు అన్నీ జరుగుతాయి. ► మా నాన్న లక్ష్మీని వంకాయకూర చేయటం వచ్చా అని అడిగితే వచ్చు అని చెప్పింది. వండటం కాదు, మా అమ్మ వండినట్లు వండాలి అని తనను ఆట పట్టిస్తుంటాను. ఇంకా ఈ జంట చెప్పిన బోలెడన్ని కబుర్లు ‘సాక్షి టీవీ’లో శనివారం రాత్రి 7.30 గం‘‘లకు తిరిగి ఆదివారం ఉదయం 11.30 గం‘‘లకు చూడండి. శ్రీహరి కోట ఏడేళ్ల తర్వాత శ్రీహరి ఇంట దీపావళి పండగకి దీపాలు వెలిగిస్తున్నారు. తమ జీవితంలోని చీకట్లను పారదోలి ఇప్పుడిప్పుడే వెలుగులు నింపుకుంటున్నారు దివంగత నటుడు శ్రీహరి సతీమణి, నటి, నిర్మాత శాంతీశ్రీహరి. 2013లో శ్రీహరి మరణించిన సంగతి తెలిసిందే. శ్రీహరి చిన్న కుమారుడు మేఘాంశ్ హీరోగా చేస్తున్నాడు. మరో తనయుడు శశాంక్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. భర్త దూరం అయిన చేదు నిజం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న శాంతి తన తనయుడు మేఘాంశ్ తో కలసి పండగ వేళ బోలెడన్ని విషయాలు చెప్పారు. ► ప్రస్తుతం నా దృష్టంతా నటనటనపైనే. లవ్, క్రష్‌లాంటివేమీ లేవు. నా వయసిప్పుడు 20 ఏళ్లే. నా దృష్టంతా నటనపైనే ఉంది. నాన్న చేసినట్లుగా సామాజిక అంశాలతో వచ్చే చిత్రాలను అప్పుడే చేయదలచుకోలేదు. మంచి ఎంటర్టైనర్స్ చేసి ప్రేక్షకులకు దగ్గర కావాలనుకుంటున్నాను. కొంచెం పరిణితి వచ్చిన తర్వాత.. ఒకవేళ నాన్న సినిమాల్లో ఏదైనా సినిమా రీమేక్ చేయాలనుకుంటే ‘భద్రాచలం’ సినిమా చేస్తాను. ► నేను షూటింగ్లో ఉన్నప్పుడు మా అమ్మను సెట్స్ లోకి రానివ్వను. నా ఫస్ట్ మూవీ ‘రాజ్‌దూత్’ షూటింగ్‌కి ఓసారి అమ్మ సెట్‌కి వచ్చింది. నేను నటిస్తుంటే ఎదురుగా నిలబడి వెక్కిరించింది. ఆమె ఎదురుగా ఉంటే నేను నటించలేను. ► ఎప్పుడు ఎవరికి కష్టమొచ్చినా ‘నేనున్నాను’ అని ధైర్యం ఇచ్చేవారాయన. ఈ రోజు నేను, నా పిల్లలు ఏ కష్టం లేకుండా బతుకుతున్నామంటే అది ఆయన చలవే. ఆయన చేసిన పుణ్యమే.. ఆయన ఉన్నప్పుడు ఎంతోమందికి డబ్బులు ఇచ్చారు. ఆయన పోయాక వారి దగ్గరికెళ్లి మాకు రావాల్సిన డబ్బు ఇవ్వమంటే మీ ఆయనే మాకు ఇవ్వాలి అన్నారు. ► ఇంకా శాంతీశ్రీహరి ఏ సందర్భంగా కన్నీటి పర్యంతం అయ్యారు? ఆమె మనసులోని బాధ ఏంటి? ఈ తల్లీ తనయుడు మనసువిప్పి పంచుకున్న మరెన్నో విషయాలను శనివారం మధ్యాహ్నం 1.30 గం‘‘లకు తిరిగి ఆదివారం సాయంత్రం 6.30 గం‘‘లకు ‘సాక్షి’ టీవీలో చూడండి. -
సెప్టెంబర్ 5న జగనన్న విద్యాకానుక
-
సెప్టెంబర్ 5న జగనన్న విద్యాకానుక
సాక్షి, తాడేపల్లి : పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆదిమూలపు సురేశ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సాక్షి టీవీతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ.. కాగా ముఖ్యమంత్రి జగన్ ఈరోజు నాడు-నేడు, జగనన్న విద్యాకానుకపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు పై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారన్నారు. సీఎం ఆదేశాల మేరకు రెండు, మూడు విడతల్లో నాడు నేడు షెడ్యూల్ ఖరారు చేయనున్నట్లు తెలిపారు.ఈనెల నుంచే ఫేజ్ 2 కి శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఫేజ్ 2 లో భాగంగా 14, 538 పాఠశాలలలో నాడు-నేడు చేపడతామన్నారు.జనవరి 14 నుంచి పాఠశాలల్లో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని, వచ్చే ఏడాది జూన్ 30 నాటికి ఫేజ్ 2 పూర్తి చేస్తామని వెల్లడించారు. ఫేజ్ 3 కింద 16,489 పాఠశాలలను పూర్తి చేస్తాం.. వచ్చే జూన్ 30 నుంచి ఫేజ్ 3 నాడు నేడు కి శ్రీకారం చూడతామన్నారు. మొత్తం అన్ని పాఠశాలల్లో నాడు నేడు పనులు 2022 నాటికి పూర్తి చేసేలా రూపకల్పన చేస్తామన్నారు. ముందుగా అనుకున్న ప్రకారమే సెప్టెంబర్ 5న జగనన్న విద్యాకానుక నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు సూళ్ల పునర్ ప్రారంభానికి అన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. మరోవైపు మొదటిదశ నాడు-నేడు పనులు దాదాపు పూర్తయ్యాయన్నారు. జగనన్న విద్యాకానుకతో పాటే నాడు-నేడు కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తాం అని తెలిపారు. కాగా విద్యాకానుకకు సంబంధించి విద్యార్థులకు అందించే వస్తువులను సీఎం జగన్ పరిశీలించారన్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు మాస్క్, బుక్స్, స్కూల్ యునిఫామ్, బ్యాగ్స్ ఉండేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాలకు టెస్ట్‌బుక్స్ కూడా చేరాయని.. త్వరలోనే విద్యార్థులకు అందిస్తామన్నారు. కరోనా నేపథ్యంలో గైడ్‌లైన్స్ ప్రకారమే రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ప్రారంభిస్తామని చెప్పారు. కాగా ముఖ్యమంత్రి జగన్ ఈరోజు నాడు-నేడు, జగనన్న విద్యాకానుకపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించారన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ అన్ని విధాల సిద్ధంగా ఉందని ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు. -
గరం గరం వార్తలు నేడే ప్రారంభం
-
గరం గరం ఛాయ్ తాగితే గళా (గొంతు) సాఫైతది..
బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ ప్రత్యేక కార్యక్రమం గరం గరం వార్తలు నేడే ప్రారంభం కానుంది. సాక్షి టీవీలో ప్రతిరోజు రాత్రి 8.30 గంటలకు తిరిగి ఉదయం మళ్లీ అదే సమయానికి ప్రేక్షకులను అలరించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన ప్రోమో తెలుగు రాష్ట్రాల ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది. అలాగే ప్రముఖ నటుడు తనికెళ్ల భరణితో సత్తి జరిపిన సంభాషణ వీడియో సైతం వీక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో తనికెళ్ల భరణి మాట్లాడుతున్న మరో వీడియోను తాజాగా విడుదల చేశారు. (ఎఫ్బీలో సత్తి ‘గరం గరం’ ముచ్చట్లు) అందరికీ దండాలు, నమస్కారాలు పెడుతూనే భరణి సాసర్లో ఛాయ్ పోసుకొని తాగుతున్నాడు. "పొద్దుగాల పొద్దుగాల గరం గరం ఛాయ్ తాగితే గళా(గొంతు) సాఫైతది. ఆ తర్వాత పాటలు, మాటలు, ముచ్చట్లు, ఓ దునియా మాట్లాడచ్చు. అందుకే చెప్పే వార్తలు కూడా గరం గరం ఉండాలని డిసైడ్ చేసినం" అంటూ ఈ కార్యక్రమానికి ఆచితూచి ఆ పేరే ఎందుకు పెట్టాడో చెప్పుకొచ్చాడు. కాగా తెలంగాణ యాసతో విశేషంగా పాపులారిటీ సాధించుకున్న సత్తి తాజాగా సాక్షి టీవీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే గరం గరం వార్తలు ప్రోగ్రాంతో ముందుకు వస్తున్నాడు. -
ఎఫ్బీలో సత్తి ‘గరం గరం’ ముచ్చట్లు
సాక్షి, హైదరాబాద్ : తన మాట, భాష, యాసతో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్న బిత్తిరి సత్తి గురించి తెలియని వారుండరు. రంగు రంగుల పూల చొక్కాతో తనదైన హావభావాలతో అందరిని అలరిస్తుంటాడు. మరి అలాంటి సత్తి ‘సాక్షి’ టీవీలో గరం గరం వార్తలతో మన ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ వేదికగా లైవ్‌లో ముచ్చటించనున్నాడు. ఆదివారం (ఆగస్ట్ 2) సాయంత్రం 5 గంటలకు ‘సాక్షి’ ఫేస్బుక్ ద్వారా లైవ్‌లో తన మాటలను మనతో షేర్ చేసుకోబోతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం చూసి ఆనందించండి. (బిత్తిరి సత్తితో ‘గరం గరం వార్తలు’.. రేపే ప్రారంభం) కాగా, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిత్తిరి సత్తి ‘గరం గరం వార్తలు’ ప్రోగ్రాం ఆదివారం ప్రారంభం కానుంది. సాక్షి టీవీలో ప్రతిరోజూ రాత్రి 8.30 గంటలకు తిరిగి ఉదయం మళ్లీ అదే సమయానికి ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రొమోలకు వీక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సీనియర్ నటుడు, రచయిత తనికెళ్ల భరణితో సత్తి జరిపిన సంభాషణకు సంబంధించిన తాజా ప్రొమో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ‘గరం గరం వార్తలు’ కోసం వీక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు ఈ స్పందనను బట్టి అర్థమవుతోంది. -
సత్తి పూలు పూల అంగీ.. పూలు పూల లాగు..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిత్తిరి సత్తి ‘గరం గరం వార్తలు’ ప్రోగ్రాం ఆదివారం ప్రారంభం కానుంది. సాక్షి టీవీలో ప్రతిరోజూ రాత్రి 8.30 గంటలకు తిరిగి ఉదయం మళ్లీ అదే సమయానికి ప్రేక్షకులను అలరించనుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు తనికెళ్ల భరణితో సత్తి జరిపిన సంభాషణకు సంబంధించిన తాజా వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇందులో.. ‘‘పూలు పూల అంగీ.. పూలు పూల లాగు’’ తో సత్తి తనదైన ఆహార్యంతో ఆకట్టుకుంటున్నాడు. అంతేగాక అతిథికి ‘గరం గరం’ ఛాయ్ ఇచ్చి మర్యాదలు చేస్తూనే.. మహమ్మారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాటించాల్సిన జాగ్రత్తలపై తన మార్కు డైలాగ్ విసిరి ప్రోగ్రాం ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చాడు. ‘‘సత్తీ.. పూల పూల అంగీ.. జబర్దస్త్ కొడుతున్నవ్.. హా’’ అంటూ తనికెళ్ల భరణి పలకరించగా.. ‘‘గరం గరం శాయె దెచ్చిన సార్ తీసుకోండి’’ అంటూ సత్తి ఆయనకు టీ అందించాడు. ఇక తనతో పాటు ఛాయ్‌ను పంచుకోమని తనికెళ్ల భరణి కోరగా..‘‘అమ్మో వద్దు సార్. దినాలు మంచిగ లెవ్వు. ఎవని శాయె ఆడే తాగాలే. తీసుకోండి’’ అంటూ జాగ్రత్తలు సూచించాడు. ఇక సాక్షి టీవీలోకి సత్తి ఆగమనాన్ని చాటుతూ ప్రత్యేకంగా రూపొందించిన వీడియో నెటిజన్లను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ సాక్షి టీవీ ద్వారా ‘గరం గరం వార్తలు’ ప్రోగ్రాంతో మన ముందుకు రానున్న సంగతి తెలిసిందే.(‘గరం గరం వార్తల’తో సరికొత్త స్టైల్లో సత్తి!) -
పాలన సౌలభ్యం కోసమే మూడు రాజధానులు
సాక్షి, విజయవాడ : ఏపీకి మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందడం శుభపరిణామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంపై శుక్రవారం విజయవాడలో సాక్షి టీవీతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో వేర్పాటు ఉద్యమాలు రాకూడదనే ఉదేశ్యం తో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఉత్తరాంధ్ర అందులోనూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ఎంతో వెనకబడ్డాయన్నారు. ఈ నిర్ణయంతో ఉత్తరాంధ్ర అభివృది చెందుతుందని పేర్కొన్నారు. చంద్రబాబుకి గతంలో ఓట్లు వేసిన వారు అమరావతి ప్రజలు ఒక్కరేన లేక 13 జిల్లాల ప్రజలు ఓట్లేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఒక అమరావతికి పరిమితం అవుతారా లేక 13 జిల్లాలకు అందుబాటులో ఉంటారా అన్నది ఆయనే తేల్చుకుంటే బాగుంటుందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్ళు తెరవాలని తాను కోరుకుంటున్నట్లు అవంతి పేర్కొన్నారు. -
‘గరం గరం వార్తల’ తో మీ ముందుకు సత్తి!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆదరాభిమానాలు సొంతం చేసుకున్నాడు బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్. ఇప్పుడు సాక్షి టీవీ ద్వారా ‘గరం గరం వార్తలు’ ప్రోగ్రాంతో మన ముందుకు రానున్నాడు. ప్రతిరోజూ రాత్రి 8.30 గంటలకు తిరిగి ఉదయం మళ్లీ అదే సమయానికి తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమోకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. సత్తి స్టైల్లో అదిరిపోయేలా ఉన్న వీడియోకు ఫిదా అవుతున్న నెటిజన్లు.. బిత్తిరి సత్తి, సాక్షి టీవీకి ఆల్ ది బెస్ట్ చెబుతూ.. ‘గరం గరం వార్తలు’ పెద్ద హిట్ కావాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా సాక్షి టీవీలోకి సత్తి ఆగమనాన్ని సెలబ్రేట్ చేస్తూ విడుదల చేసిన తొలి ప్రోమోకు కూడా మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. -
నా భర్తది ముమ్మాటికీ రాజకీయ హత్యే
-
సాక్షి టీవీ ప్రాపర్టీ షో ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : సామాన్య, మధ్య తరగతి వర్గాలకు ఇళ్లు, ప్లాట్లు అందించాలనే ఉద్ధేశ్యంతో హైదరాబాద్ కూకట్‌పల్లిలోని భ్రమరాంబా మల్లికార్జున ఫంక్షన్హాల్లో సాక్షి టీవీ ప్రత్యేకంగా ప్రాపర్టీ షో 2020 నిర్వహిస్తోంది. క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ గుమ్మిరాంరెడ్డి, ప్రెసిడెంట్ ఆర్వీ రామచంద్రారెడ్డి, కెనరా బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ జీఎం వీరభద్రారెడ్డిలు హాజరై ప్రాపర్టీ షోను ప్రారంభించారు.దాదాపుగా 30మంది డెవలపర్స్, బిల్డర్స్ ఈ ప్రదర్శనలో తమ ప్రాపర్టీలను ప్రదర్శనకు ఉంచారు. ప్లాట్ కానీ ఇళ్ళు కానీ సెలక్ట్ చేసుకున్న వెంటనే వారికి తగిన రుణం ఇచ్చే విధంగా ప్రత్యేకంగా కెనరా బ్యాంక్ స్టాల్‌ను కూడా ఏర్పాటు చేసింది. అంతేకాదు తొలిసారి ప్రాపర్టీ ఎక్స్ పోలో ఈఎమ్ఐల ద్వారా ప్లాట్లు విక్రయించే బృహత్తర కార్యక్రమాన్ని సైతం సాక్షిటివి ఎక్స్పో కల్పిస్తోంది. రెండు రోజుల పాటు ప్రాపర్టీ షో కొనసాగుతుంది. కేవలం రియల్ ఎస్టేట్ సంస్ధలే కాదు ఇంటీరియర్, ఎక్స్టీరియర్ డిజైన్స్ సంస్ధలు కూడా ఎక్స్‌పోలో ఉన్నాయి. -
సాక్షి: సంక్రాంతి స్పెషల్ సాంగ్
-
మహిళల లక్ష్య సాధనకు ‘దిశ’ నిర్దేశం
సాక్షి, ఏలూరు: మహిళలు తమ లక్ష్యాలను సాధించుకునేందుకు ‘దిశ’ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని ఏలూరు సెయింట్ థెరిసా కళాశాల విద్యార్థినులు అన్నారు. దిశ చట్టంపై సాక్షి టీవీ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మహిళల్లో ఎదగాలని ఎంతో తపన ఉన్నప్పటికి అత్యాచార ఘటనల వల్ల అభద్రత భావానికి గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని వెంటనే శిక్షించాలని కోరారు. దిశచట్టం తో మహిళలపై దాడులు తగ్గుతాయనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. దిశ చట్టం దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. దిశ చట్టం తీసుకురావడంతో అమ్మాయిల కన్నా.. అబ్బాయిల తల్లిదండ్రులే ఎక్కువ భయపడుతున్నారని వారు పేర్కొన్నారు. మహిళలందరి తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సెయింట్ థెరిసా కళాశాల విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఇలాంటి రాక్షసుల కోసమా.. పహారా కాసింది?
సాక్షి, హైదరాబాద్ : దేశం నీకు ఏమిచ్చిందన్నది కాదు.. దేశానికి నువ్వు ఏమిచ్చావు అన్నది ముఖ్యం అంటారు పెద్దలు. సైన్యంలో పనిచేసి దేశానికి సేవలందించే వీర జవానుకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఒకవేళ దేశ సేవలో అసువులుబాసితే అతని త్యాగానికి సెల్యూట్ చేస్తాం. అమరుడంటూ కీర్తిస్తాం. దిశ తండ్రి కూడా ఓ వీరసైనికుడే. కానీ ఆయనకు నలుగురు కీచకులు మిగిల్చిందేమిటి? తన గారాలపట్టి, అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని అన్యాయంగా చిదిమేశారు. పైశాచికత్వంగా తెగబడి ప్రాణాలు తీసి కాల్చేశారు. నా గుండె బరువు ఎన్నటికీ దిగదు... దిశ నిందితుల ఎన్కౌంటర్ తరువాత ‘సాక్షి’ఆమె తండ్రి శ్రీధర్‌రెడ్డిని పరామర్శించింది. నలుగురు నిందితులు ఎన్కౌంటర్లో మరణించడాన్ని ఆయన స్వాగతించారు. పోలీసుల పనితీరును అభినందిస్తున్నానని, వారికి కృత జ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నేను దేశంపై ప్రేమతో 1981 లో సైన్యంలో చేరా. అహ్మద్‌నగర్‌లో శిక్షణ తర్వాత అంబాలాలో పోస్టింగ్ ఇచ్చారు. తరువాత పంజాబ్‌లోని కపుడ్తలాలో పోస్టింగ్. అదే సమయంలో ‘ఆపరేషన్ బ్లూస్టార్’కూడా జరిగింది. అప్పుడు పంజాబ్‌లో చాలా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఆపరేషన్ మొదలైందని మాకు సందేశం అందింది. పలు రెజిమెంట్ల నుంచి వెళ్లాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు. సిద్ధంగా ఉండాలని, రిజర్వు ఫోర్సు గా తరువాత వెళ్లాల్సింది మా యూనిట్ సభ్యులేనని ఆదేశాలు వచ్చాయి. నాతోటి వారితో సహా సిద్ధంగా ఉన్నాం. మేము ఆ ఆపరేషన్‌లో నేరుగా పాల్గొనలేదు కానీ రిజర్వు ఫోర్సు కిం ద పని చేశాం. సైన్యంలో ఆరేళ్లపాటు సేవలందించా. ఏ సైనికుడూ ప్రాణాల కోసం ఎప్పుడూ బాధపడడు. నేను కూడా ఎప్పుడూ భయపడలేదు. గుండెనిండా ధైర్యం కలవాడిని. కా నీ నేడు నా గుండె కూడా బరువెక్కింది. ఎన్ని చేసినా ఆ గుండె బరువు దిగదు’’అని అన్నారు. కీచకులకు త్వరగా శిక్షలు పడాలి.. ‘‘మాలాంటి సైనికులు సరిహద్దులో కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ విధులు నిర్వహిస్తారు. దేశం కోసం, దేశ ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెడతారు. మేం అందరి కోసం పాటుపడతాం. మాకు కుల, మత, ప్రాంతీయ భేదాలు ఉండవు. కానీ మాలాంటి సైనికుల గుండెలు కూడా బరువెక్కేలా చేస్తున్న ఇలాం టి పిశాచాలు దేశంలో స్వేచ్ఛగా తిరుతుండ టం బాధాకరం. ఇలాంటి వారి కోసమా మే ము ప్రాణాలు పణంగా పెట్టి పని చేసింది? అన్న ఆలోచన మమ్మల్ని మరింత బాధకు గురిచేస్తోంది. అందుకే ఇలాంటి రాక్షసులకు త్వర గా శిక్షలు పడేలా ప్రస్తుతమున్న చట్టాలను స వరించాలి. కొత్త చట్టాలు తీసుకురావాలి. నిర్భ య కేసులో ఏడేళ్లు గడిచినా నేటికీ దోషులకు శిక్ష పడలేదు. యూపీలోని ఉన్నావ్‌లో అత్యాచార బాధితురాలిని నిందితులు బెయిల్‌పై వచ్చి మరీ చంపడం అత్యంత హేయం. అం దుకే ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని చట్టపరంగా, శీఘ్రంగా శిక్షించేలా చట్టాలను బలోపేతం చేయాలి’’అని దిశ తండ్రి ప్రభుత్వాలను కోరారు. -
నా జీవితంలో ఇదొక అద్భుతమైన రోజు : చిరంజీవి
నా మొట్టమొదటి సినిమా ప్రాణం ఖరీదు సెప్టెంబర్ 22నే విడుదలైందని..అప్పుడు ఎలాంటి ఫీలింగ్ కల్గిందో.. మళ్లీ 41ఏళ్ల తరువాత అప్పటి ఫీలింగే మళ్లీ కలుగుతోంది. దానికి కారణం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అన్నారు. దాదాపు పుష్కర కాలం నుంచి ఈ కథ నా మదిలో మెలుగుతూ ఉండేదంటూ నేటి ప్రీ రిలీజ్ ఈవెంట్ చిరంజీవి మాట్లాడారు. పూర్తి ప్రసంగం కోసం కింది వీడియోను చూడండి. పవన్‌కళ్యాణ్ మట్లాడుతూ.. ‘ఈ ఈవెంట్‌కు నన్ను పిలిచింనందు అదృష్టంగా భావిస్తున్నాను.. ఆయనకు మీలా నేనూ ఓ అభిమానినే. ఆ విధంగానే నేను ఇక్కడకు వచ్చాను. అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి చిరంజీవి. మీ అభిమానుం నాకు దక్కిందటే.. ఆయన నేర్పిన పాఠాలే కారణం. ఆయన అప్పుడు ఇచ్చిన ధైర్యం.. నన్ను ఇప్పుడు మీ ముందు నిలబెట్టింది’అంటూ మాట్లాడారు. రాజమౌళి మాట్లాడుతూ.. ఇంత పెద్ద సినిమా వేడుక జరుగుతుందంటే.. పరుచూరి బ్రదర్స్ గారికిథ్యాంక్స్ చెప్పాలి. బ్రిటీష్ వారిపై మొట్టమొదటగా పోరాడింది మన తెలుగు వాడని అందరికీ తెలిసేలా మా హీరో రామ్ చరణ్ చేశాడు. ఇది మీ డాడీకే గిఫ్ట్ కాదు.. మొత్తం తెలుగు వారికి అందిస్తున్న గిఫ్ట్’అని అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ... ‘అందరికీ నమస్కారం.. వర్షం ఇంత కురుస్తున్నా మీరు ఇలా ఉంటూ.. మెగాస్టార్‌పై మీకున్నా అభిమానాన్ని చూపిస్తున్నారు.. సమయం లేనందున.. అందరి గురించి చెప్పలేకపోతున్నాను. ఎవరికీ తెలియని ఓ విషయాన్ని చెబుతాను. పవర్స్టార్కూడా తెలియనిది చెబుతాను. నేను సైరాను చూశాను.. నేను మొట్టమొదటి ప్రేక్షకుడిని. సినిమా చూసి కింద పడిపోయాను.. ఈ మూవీ సూపర్‌హిట్’ అని అన్నారు. . చిత్ర నిర్మాత, హీరో రాంచరణ్ మాట్లాడుతూ.. ‘ఇక్కడకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. సినిమాకు పనిచేసిన అన్ని శాఖల వారికి థ్యాంక్యూ. షూటింగ్ చేసిన ప్రతి రోజు వారందరికీ థ్యాంక్స్ చెబుతూనే ఉన్నాను. వారంతా సహకరించడం వల్లే ఈ సినిమా పూర్తి చేయగలిగాం. ఎక్కువసేపు నాన్నగారిని, బాబాయ్‌ని వెయిట్ చేయించి మాట్లాడలేను. అందుకే ముగించేస్తున్నాను. అంతేకాకుండా వర్షం వచ్చేలా కూడా ఉంది కాబట్టి మరోసారి అందరికి ధన్యవాదాలు చెబుతూ ముగించేస్తున్నాను’ అని తెలిపాడు. హైదరాబాద్‌లో సముద్రం లేదని ఎవరు చెప్పారు..? తరలిరాదా తనే వసంతం తనదరికి రాని వనాల కోసం అంటూ రుద్రవీణ పాట పాడాడు మాటల రచయిత సాయి మాధవ్‌బుర్రా. చిరంజీవి పిలిస్తే.. వసంతాలు కాదు సముద్రాలే తరలివస్తాయన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. మా అమ్మమ్మకు 80లో ఉన్న హీరోలు ఎవరూ తెలీదు. ఒక్క చిరంజీవి తప్పా.. ఆయన పాటను వింటూనే ఉంటుంది. నేను సినిమా ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు చిరంజీవికి మాటలు రాయమని మా అమ్మమ్మ అనేది. ఆకాశాన్ని అందుకోమని అంటే ఎలా అది కుదరని పని అంటూ చెప్పేవాడ్ని కానీ ఆయన సినిమాకు ఇప్పుడు మాటలు రాశాను. ఆయనకు ఒక్క మాట రాసినా చాలు అనుకునే వాడిని.. ఖైదీ నెం.150కు డైలాగ్స్రాయమని పిలిచారు. ఆయన డైలాగ్చెబితే.. ఆయన మాత్రమే చెప్పేలా ఉండాలి.. అందుకే ఓ డైలాగ్రాశానని.. పొగరు నా ఒంట్లో ఉంటది.. హీరోయిజం నా ఇంట్లో ఉంటది అనే మాటలు రాశాను. అది ఆయనకు తప్పా ఇంకెవరికి సెట్ కాదు. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ టెక్నీషియన్‌ను రామ్ చరణ్ బాగా చూసుకున్నాడు. అతనొక గొప్ప హీరో మాత్రమే కాదు.. గొప్ప ప్రొడ్యూసర్. ఈ సినిమాలో డైలాగ్స్ బాగున్నాయంటే.. నా ఒక్కడి కృషి కాదు.. అది అందరి సమష్టి కృషి. ఈ సినిమా ద్వారా సురేందర్ రెడ్డి ఓ మంచి స్నేహితుడయ్యాడు. ఈ సినిమా తమకు పదేళ్ల కల అని.. కల ఎపపుడు చెదిరపోదని పరుచూరి వెంటేశ్వర్రావు అన్నారు. ఈ కథను చిరంజీవి కోసమే ఎంతోమంది పెద్దొళ్లు వదిలేశారని అనిపిస్తుంది. అందుకే పదేళ్ల తరువాత కూడా చిరు కోసమే ఈ సినిమా ముందుకు కదల్లేదు. ఆయన ఇప్పుడు కూడా ఆలానే కనిపిస్తున్నాడు. తన తండ్రి కోసం రామ్ చరణ్.. ఈ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించాడు. తండ్రిని ఎక్కడో కూర్చోబెట్టాలని ఈ చిత్రాన్ని తీశాడు. సినిమాలోని ఓ డైలాగ్ చెప్పి అభిమానులను అలరించారు. తన గురువైన గోసాయి వెంకన్న దగ్గరికి ఉయ్యాల వాడ నరసింహారెడ్డి వెళ్లి.. భార్యాబిడ్డల్నీ వదిలేసి యుద్దానికి వెళ్తున్నా ఆశీర్వందించండి అనే చెప్పే సందర్భంలో వచ్చే ఈ డైలాగ్‌ను స్టేజ్‌పై చెప్పాడు. ‘భార్య కోసం యుద్దం చేస్తే పురాణం అవుతుంది.. భూమి కోసం యుద్దం చేస్తే ఇతిహాసం అవుతుంది.. జాతి కోసం యుద్దం చేస్తే చరిత్ర అవుతుంది’ అంటూ అమితాబ్ చెప్పే అద్భుతమైన డైలాగ్‌ను ఆయన స్టేజ్‌పైనే చెప్పారు. తన తండ్రి అచ్చం నరసింహారెడ్డిలా కనిపించాలని దగ్గరుండి మరీ సుష్మిత క్యాస్టూమ్స్‌ను డిజైన్ చేసిందని కొనియాడారు. ఎవరిని ఎంతగా వాడుకోవాలో.. ఎవరి చేత ఎంతగా నటింపజేయాలో సురేందర్ రెడ్డికి బాగా తెలుసంటూ.. ఈ సినిమా హిట్ కాబోతోన్నందుక ముందుగానే అతని కంగ్రాట్స్ చెప్పారు. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటించారు. ఆల్రెడీ విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుక ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో మొదలైంది. ఈ వేడుక కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. అభిమానుల మధ్య ‘సైరా’ ప్రీ–రిలీజ్ వేడుక కన్నుల పండవగా జరుగనుంది. రెండు రాష్ట్రాల్లోని మెగా అభిమానులు ఈ వేడుకకు భారీగా హాజరయ్యారు. ముందుగా చిరంజీవి నటించిన హిట్ చిత్రాలలోని పాటలను గాయనీ,గాయకులు ఆలపిస్తూ, అభిమానులను అలరిస్తున్నారు. కాగా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో అక్టోబరు 2న ‘సైరా’ చిత్రం విడుదల కానుంది. సాయంత్రం 6 గంటల నుంచి సాక్షి టీవీలో ప్రత్యక్ష ప్రసారం -
రోడ్డు ప్రమాదంలో సాక్షి టీవీ ఉద్యోగి మృతి
కీసర: రోడ్డు ప్రమాదంలో సాక్షి టీవీలో పనిచేసే యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన ఆదివారం ఉదయం కీసర పోలీస్‌స్టేషన్ పరి«ధిలోని చీర్యాల ఓట్టాగు సమీపంలో జరిగింది. కీసర సీఐ నరేందర్‌గౌడ్ తెలిపిన మేరకు.. భోగారం గ్రామానికి చెందిన చుంచు రాహుల్(21) నగరంలోని ఇందిరా టెలివిజన్(సాక్షి టీవీ)లో ఈవెంట్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి కార్యాలయంలో విధులు ముగించుకొని నగరంలో ఉన్న తన మిత్రుల వద్దకు వెళ్లాడు. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో బైక్‌పై భోగారంలోని తమ ఇంటికి తిరిగి వస్తుండగా చీర్యాల ఓట్టాగు వద్దకు వాహనం అదుపు తప్పి రోడ్డుడివైడర్‌ను ఢీకొంది. దీంతో తలకు , మెడ వద్ద, తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది రాహుల్‌ను చికిత్స నిమిత్తం నగరంలోని యశోద ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో అందరితో కలిసి మెలిసి ఉండే రాహుల్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడన్న విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు , మిత్రులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. జడ్పీ వైస్ చైర్మెన్ వెంకటేష్, కాంగ్రెస్ సీనియర్ నేత మూడు చింతలపల్లి జెడ్పీటీసీ సింగిరెడ్డి హరివర్థన్‌రెడ్డి తదితర నాయకులు నివాళులర్పించారు. -
సాక్షి టీవీ పదేళ్ల వార్షికోత్సవం వేడుకలు
-
జనమే సాక్షి
-
కేరళ నుంచి ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు
-
వాచ్: కేరళ నుంచి ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు
కేరళలో ప్రకృతి విలయతాండవం చేసింది. భారీ వర్షాలు, వరదలతో మలబారు తీరం అల్లకల్లోలంగా మారింది. ప్రకృతి అందాలకు చిరునామా అయిన మలయాళ రాష్ట్రంలో మరణమృదంగం మోగింది. ఎటుచూసినా నీరే... ఎక్కడచూసినా సాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులే. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందలమంది దుర్మరణం పాలయ్యారు. లక్షలాదిమంది గూడులేక నిరాశ్రయులయ్యారు. గడచిన వందేళ్లలో కేరళ ఇలాంటి జలప్రళయాన్ని కనీవినీ ఎరుగదు. సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నా.. ఇంకా వేలాదిమందికి సాయం అందని పరిస్థితి. జలవిలయంతో తల్లడిల్లుతున్న కేరళ నుంచి ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్ ఇది.. వాచ్ : కేరళలో పర్యటిస్తున్న ‘సాక్షి’ బృందం ప్రకృతి వైపరీత్యంతో కేరళలో కల్లోలం కొనసాగుతోంది. వరద బీభత్సంతో రాష్ట్రం అల్లాడిపోతోంది. ఎడతెగని వర్షాలు సహాయ కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నాయి. పథనంతిట్ట, ఎర్నాకుళం జిల్లాల్లో ఇవాళ కుడా వాన పడింది. కొన్నిచోట్ల పునరావాస శిబిరాల్లోకి వరదనీరు చేరింది. జలవిలయంతో శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 33మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 350 దాటిపోయింది. 10లక్షలమంది పునరావాస శిబిరాల్లో ఉన్నారని కేంద్రమంత్రి కేజే ఆల్ఫోన్స్ తెలిపారు. 2లక్షల కోట్ల ఆస్తినష్టం వాటిల్లినట్టు అంచనా. కాగా, కేరళలోని అన్ని జిల్లాల్లో విధించిన రెడ్అలర్ట్ను వాతావరణ విభాగం ఉపసంహరించుకోవడం కాస్త ఊరట కలిగించే విషయం. అల్పపీడనం ఏర్పడినా, రేపటికి వర్షాల తీవ్రత తగ్గుతుందని అధికారులు ప్రకటించడంతో ప్రజలు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. ఘోరంగా నష్టపోయిన జిల్లాలు! అలువా, చాలక్కుడి, చెంగన్నూర్, అలపుఝ, పథనంతిట్ట ప్రాంతాలు ఘోరంగా నష్టపోయాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు కేరళలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. పాలక్కాడ్, ఇడుక్కి జల్లాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. రాష్ట్రంలో సగభాగానికి విద్యుత్తు సౌకర్యం లేదు. 80శాతం గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడంతో ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా సమీక్ష జరిపారు. టెలికమ్మూనికేషన్స్ వ్యవస్థ ఘోరంగా దెబ్బతినడంతో.. అన్ని ప్రాంతాలకు సమాచార సౌకర్యాలు అందేలా సంసెల్యులార్ ఆన్ వీల్స్ ఏర్పాటయ్యాయి. టెలికాం కంపెనీలు శుక్రవారం నుంచే ఉచిత డాటా, ఎస్ఎంఎస్ సౌకర్యాలను ఇంట్రాసర్కిల్ రోమింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఛార్జీలను అదుపుచేయాలని విమానయాన సంస్థలను కేంద్రం ఆదేశించింది. ముమ్మరంగా సహాయక చర్యలు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తోపాటు త్రివిధ దళాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నాయి. 42 నేవీ, 16 ఆర్మీ, 28 కోస్ట్‌గార్డ్, 39 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. 38 హెలికాఫ్టర్లు, వందలాది బోట్లతో.. సిబ్బంది వరదల్లో చిక్కుకున్నవారికి భోజనం, నీరు, ఔషధాలు సరఫరా చేస్తున్నారు. ఇండియన్ నేవీ ‘ఆపరేషన్ మదద్’ పేరుతో సేవలు అందిస్తోంది. ఎర్నాకుళం జిల్లాకే 42 బృందాలు వెళ్లాయి. 72 మంది గజ ఈతగాళ్లు ఈ బృందాల్లో ఉన్నారు. నేవల్ బేస్‌లను సహాయ శిబిరాలుగా మార్చి భోజన సదుపాయాలు కల్పిస్తోంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మూతపడడంతో.. కోచి నావల్ బేస్ నుంచి సాధారణ విమానాలు నడిపేందుకు నేవీ అవకాశం కల్పించింది. కేరళకు చెందిన 600మంది మత్స్యకారులు నిరంతరాయంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. -
కౌన్సిలర్లే అవినీతి పరులు
ఎమ్మెల్యే కురుగొండ్ల వివాదాస్పద వ్యాఖ్యలు వెంకటగిరి: వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో జరిగిన అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్లు ఇచ్చిన కమీషన్లు తమ పార్టీ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్లకే అందాయని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. శనివారం ఆయన పట్టణంలోని పాలకేంద్రం సెంటర్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పత్రికలు, టీవీ చానళ్లలో తనను అవినీతి పరుడిగా చిత్రిస్తూ వచ్చిన కథనాలపై ఆయన ఘాటుగా స్పందించారు. నాలుగేళ్లలో వెంకటగిరిలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని, వీటికి సంబంధించి కాంట్రాక్టర్ల నుంచి తానేమీ తీసుకోలేదన్నా రు. అనంతరం అక్కడే ఉన్న మున్సిపల్ కాంట్రాక్టర్ సుబ్రహ్మణ్యంనాయుడుతో కమీషన్లు తీసుకున్న వ్యక్తుల పేర్ల చెప్పాలని హుకుం జారీ చేశారు. దీంతో సుబ్రహ్మణ్యంనాయుడు తటపటాయిస్తూ కౌన్సిల ర్లు, చైర్పర్సన్లకు కమీషన్లు ఇచ్చానని వెల్లడించారు. కాగా ఎవరెంత తీసుకున్న విషయాన్ని త్వరలో తేల్చేస్తానని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడే ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. అయితే అక్కడే ఉన్న మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు, పలువురు కౌన్సిలర్లు మిన్నకుండిపోయారు. ‘సాక్షి’పై అక్కసు ‘సాక్షి’ టీవీలో గురువారం ప్రసారమైన ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ కథనం, ‘సాక్షి’ దినపత్రికలో నీరు–చెట్టు పథకంలో జరి గిన అవినీతిపై వస్తున్న కథనాలపై ఎమ్మె ల్యే అక్కసు వెళ్లగక్కారు. తప్పు జరిగి ఉంటే తనను ప్రశ్నించాలన్నారు. కార్యక్రమంలో వెంకటగిరి ఏఎంసీ చైర్మన్ పులి కొల్లు రాజేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ సి.గంగాప్రసాద్, కౌన్సిలర్ పి.విశ్వనాథ్, ఆవుల ప్రహ్లాద, కె.చెంగారావ్, కె.రమేష్, ఎం.బాబు పాల్గొన్నారు. -
మహిళా సాధికారతతోనే నవ సమాజ నిర్మాణం
చందానగర్: మహిళా సాధికారతతోనే నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పలువురు మహిళలు అభిప్రాయపడ్డారు. చందానగర్ జనప్రియ 9 వ్యాలీలో శుక్రవారం ‘సాక్షి టీవీ’ ఆధ్వర్యంలో ‘నేను శక్తి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మన దేశంలో 99 శాతం మంది మహిళలు ఎక్కడో ఒకచోట ఏదో ఒక రూపంలో వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బయటకు రావాలి.. సమాజంలో ప్రతి చోట మహిళలు వేధింపులకు గురవుతున్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు బయటకొచ్చి తమ బాధలు చెప్పుకోవాలి. అందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. – సుజాత త్రిపాఠి చర్చ జరగాలి.. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరగాలి. ఇంట్లో, బయట ఎక్కడైనా మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు. చాలామంది తమ సమస్యలను బయటకు చెప్పుకోవడం లేదు. దీంతో ఒత్తిడికి గురై అనారోగ్యం పాలవుతున్నారు. – పూనం పారిక్ చైతన్యం వస్తుంది.. ఇలాంటి కార్యక్రమాలతో మహిళల్లో చైతన్యం వస్తుంది. సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. వాటిని అధిగమించి నవ సమాజ నిర్మాణం కోసం పోరాడతారు. – మృణాల్ అభినందనీయం.. అందరూ మనకెందుకులే అని ఊర్కొంటే మహిళల్లో చైతన్యం రాదు. వేధింపులకు గురవుతున్న సమాజంలో కుటుంబ పరువు పోతుందనే భయంతో ఎందరో నిశ్శబ్దంగా బతుకుతున్నారు. ‘సాక్షి’ ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం. – జయశ్రీ ప్రశ్నించాలి.. వేధింపులకు తలవంచకుండా ప్రతి మహిళ ప్రశ్నించాలి. అన్ని రంగాల్లో పురుషులకు సమానంగా ఎదగాలి. అప్పుడే మహిళా శక్తి ప్రపంచానికి తెలుస్తుంది. – రజిని ఈ కార్యక్రమం నేడు ఉదయం 10గంటలకు ‘సాక్షి టీవీ’లో ప్రసారమవుతుంది. -
హోదాకోసం... విజయనగర్జన
సాక్షిప్రతినిధి, విజయనగరం: విజయనగరం పట్టణంలోని నాయుడు ఫంక్షన్ హాల్. శనివారం ఉదయం పదిగంటలయింది. ఎక్కడెక్కడినుంచో... విద్యార్థులు... మేధావులు... వివిధ ప్రజా సంఘాల నాయకులు... రాజకీయ ప్రతినిధులు... ఒక్కరొక్కరుగా చేరుకున్నారు. కాసేపట్లోనే హాల్ మొత్తం ఆహూతులతో నిండిపోయింది. సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిండైన సభలో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ‘హోదాకోసం ఎందాకైనా’ నేతృత్వంలో సాగిన చర్చావేదిక కూల్‌గా మొదలైంది. వాదోపవాదా లు వినిపించారు. తమ ఆవేదనను వెలిబుచ్చారు. చివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాయే సంజీవని అని గొంతులన్నీ ముక్త కంఠంతో తేల్చిచెప్పాయి. కార్యక్రమంలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీతోపాటు సీపీఐ, ఆమ్ఆద్మీ, లోక్‌సత్తా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకుల్లో బీజేపీ మినహా మిగిలిన పార్టీల నాయకులు హోదా సాధనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేయటంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ద్వంద్వ వైఖరితో ఆంధ్రులను మోసం చేసిన వైనాన్ని అంతా వివరించారు. ముఖ్యంగా జిల్లా నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ప్రసంగాల్లో హోదా వల్ల కలిగే లాభాలను వివరిస్తూ హోదా కోసం వైఎస్ జగన్ చేస్తున్న పోరాట పటిమ కోసం ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేంద్ర మంత్రికి పౌరుషం ఉంటే రాజీనామా చేయాలి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి, రాజపౌరుషం ఉంటే తన పదవికి రాజీనామా చేసి ప్రత్యేక హోదా కోసం పోరాడాలి. పార్టీ ఫిరాయింపులకు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు. బడ్జెట్ అధ్యయనం పేరిట ఆయన రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడం సరికాదు. దేశంలో అభివృద్ధి చెందిన అన్ని రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన తెలుగుదేశం, బీజేపీలు ఇప్పుడు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాయి. – పి.కామేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి, ప్రత్యేక హోదా సాధన సమితి జిల్లా కన్వీనర్ ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ అనలేదు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని భారతీయ జనతా పార్టీ ఏనాడూ హామీ ఇవ్వలేదు. సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా రాష్ట్రానికి వేలాది కోట్ల రూపాయలు కేంద్రం అందిస్తోంది. ఆ విషయాన్ని టీడీపీ నేతలు తొక్కిపెడుతున్నారు. – పి.అశోక్, బీజేపీ స్వచ్ఛభారత్ మిషన్ జిల్లా కన్వీనర్ -
సాక్షి టీవీ జర్నలిస్ట్‌కు అరుణ్‌సాగర్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్
-
సాక్షి టీవి కథనంతో స్పందించిన దాతలు
-
సాక్షి టీవీపై కక్ష గట్టిన టీడీపీ
సాక్షి, నంద్యాల: సాక్షి టీవీపై తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఆగష్టు 3వ తేదీ నుంచి నంద్యాలలో సాక్షి టీవీ ప్రసారాలకు టీడీపీ తరచూ అంతరాయలను కల్పించింది. భూమా నాగిరెడ్డి కుటుంబానికి చెందిన 'నంద్యాల డిజిటల్ కేబుల్' పట్టణంలో ఎన్నికల వేళ ఓట్లర ముందుకు సాక్షి టీవీ ప్రసారాలను రాకుండా నిలిపేసింది. సాక్షి టీవీ ప్రత్యక్ష ప్రసారాలను www.sakshi.com సైట్లో వీక్షించొచ్చు. యూట్యూబ్‌లో www.youtube.com/sakshitvlive సాక్షి టీవీని చూడొచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్లలో సాక్షి యాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలను తిలకించొచ్చు. -
సింధూతో ఫేస్ టూ ఫేస్
-
సాక్షితో ఇండియన్ ఐడల్ రేవంత్
-
సాక్షి టీవీ 8వ వార్షికోత్సవం
-
‘సాక్షి’ టీవీకి యూనిసెఫ్ అవార్డు
-
'సాక్షి టీవి ప్రోమో ఆలోచింప చేసేలాఉంది'
-
‘సాక్షి’ టీవీకి యూనిసెఫ్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: సాక్షి టెలివిజన్ చానల్లో ప్రసారమైన సందేశాత్మక కథనానికి ప్రతిష్టా త్మక యునిసెఫ్ అవార్డు దక్కింది. ఆడపిల్లను కడుపులోనే కడతేరిస్తే పండుగలన్నీ వెలవెల బోతాయనే ఇతివృత్తంతో ‘ఆడపిల్లలను కాపాడుకుందాం... బతుకమ్మ సాక్షిగా వారిని బతకనిద్దాం’ అనే సందేశంతో ‘సాక్షి’ టీవీలో ప్రసారమైన రెండు నిమిషాల నిడివి గల కథనం ఉత్తమ సందేశం విభాగంలో యునిసెఫ్ అవార్డుకు ఎంపికైంది. బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఈ కథనం ప్రసార మైంది. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన యునిసెఫ్ మీడియా అవార్డుల ప్రదానోత్సవంలో సాక్షి చానల్ ఫీచర్స్ ఎడిటర్ పూడి శ్రీనివాస్‌రావు, డిప్యూటీ న్యూస్ ఎడిటర్ పైడి శ్రీనివాస్, ప్రొడ్యూసర్ మూర్తి అవార్డును అందుకున్నారు. అవార్డు కమిటీ చైర్పర్సన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేచల్ చటర్జీ, ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, యునిసెఫ్ తెలుగు రాష్ట్రాల ఇన్చార్జి సోని కుట్టి జార్జ్ అతిథులుగా హాజరయ్యారు.అవార్డుల కోసం పలు టీవీ చానళ్ల నుంచి 187 ఎంట్రీలు, పత్రికల నుంచి 172 కథనాలు వచ్చాయి. -
సాక్షి టవర్స్‌లో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం
-
సాక్షి టీవీ పిటిషన్‌ను పరిష్కరించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో తమ టీవీ ప్రసారాలను నిలిపివేయడాన్ని సవా లు చేస్తూ సాక్షి టీవీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ టీవీ ప్రసారాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు నిలిపేశారని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ సాక్షి టీవీ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సోమవారం ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డి.రమేశ్ ఓ అఫిడవిట్‌ను కోర్టు ముందుంచారు. సాక్షి ప్రసారాల నిలుపుదలలో ప్రభుత్వానికి, పోలీసులకు సంబంధం లేదని వివరించారు.సాక్షి తరఫు న్యాయవాది నవీన్‌కుమార్ ఏపీలో సాక్షి ప్రసారాలు పునరుద్ధరించారని తెలిపారు. దీంతో న్యాయమూర్తి పై ఉత్తర్వులు ఇచ్చారు. -
ప్రభుత్వం నిరంకుశ ధోరణి వీడాలి
చింతలపూడి : ‘సాక్షి’ ఛానల్‌పై సీఎం చంద్రబాబు ప్రభుత్వం అవలంభిస్తున్న నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా చింతలపూడిలో అఖిలపక్ష పార్టీల నేతలు ధ్వజమెత్తారు. సాక్షిపై వేధింపులు మానాలని, సాక్షి ఛానల్ ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ మంగళవారం పట్టణంలో కదం తొక్కారు. స్థానిక పాతబస్టాండ్ సెంటర్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అక్కడి నుంచి ప్రదర్శనగా బోసుబొమ్మ సెంటర్ చేరుకుని రాస్తారోకో చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి బొడ్డు వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యు డు ఎం.వసంతరావు, మండల కార్యదర్శి జంగా రామచంద్రారెడ్డి, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.థామస్, సీపీఎం డివిజన్ కార్యదర్శి ఆర్వీ సత్యనారాయణ, రైతు సంఘం నాయకులు కె.చంద్రశేఖర్‌రెడ్డి, పౌరహక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పిడపర్తి ముత్తారెడ్డి మాట్లాడుతూ మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వేధింపులకు పాల్పడుతోందని విమర్శించారు. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని చెప్పారు. ప్రభుత్వ నిరంకుశ ధోరణి నశించాలని నినాదాలు చేశారు. వైఎస్సార్ సీపీ మండల మహిళా అధ్యక్షురాలు సాదరబోయిన వరలక్ష్మి, ఎంపీటీసీ యండ్రపాటి కుమారి, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ మండల అధ్యక్షులు ఎం.ఇమ్మానియేలు, జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యదర్శి బొల్లం రామారావు, వెంకటాద్రిగూడెం సర్పంచ్ మేడి రాములు, వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు ఎస్.కాంతారావు, వార్డు సభ్యులు, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
‘సాక్షి’ ఆపేయాలని మేం చెప్పలేదు: ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి టీవీ చానల్ ప్రసారాలను నిలిపివేయాలంటూ తాము ఏమీ చెప్పలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టులో తెలిపారు. ఎంఎస్‌వోలకు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని వివరించారు. ప్రభుత్వం గానీ, పోలీసులు గానీ.. సాక్షి టీవీ ప్రసారాలు ఆపేయాలంటూ ఎలాంటి ఉత్తర్వులు, సూచనలు ఇవ్వలేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఇదే విషయాన్ని అఫిడవిట్ రూపంలో తమకు సమర్పించాలని జడ్జి ఆదేశించారు. అందుకోసం గడువు ఇస్తూ కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. -
నిరంకుశ పాలనపై నిరసన వెల్లువ
శ్రీకాకుళం: మీడియా స్వేచ్ఛను హరిస్తున్న టీడీపీ ప్రభుత్వం నిరంకుశ పాలనపై నిరసన వెల్లువెత్తింది. ‘సాక్షి’ ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ జలుమూరు, లావేరు, ఆమదాలవలస మండలాల్లో ధర్నాలు, ఆందోళనలు, కొవ్వొత్తుల ర్యాలీలు సోమవారం నిర్వహించారు. ప్రభుత్వ తీరును వివిధ రాజకీయ పార్టీలు, అఖిల పక్షాల నాయకులు, ప్రజాసంఘాల సభ్యులు తప్పుబట్టారు. ప్రభుత్వ దమన నీతిని ఖండించారు. జలుమూరు మండలంలో జరిగిన ఆందోళనలో వైఎస్సార్ సీపీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ తక్షణమే మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అవినీతిని వెలికితీస్తుందనే అక్కసుతో ప్రసారాలు నిలిపివేయడం తగదన్నారు. చంద్రబాబు పాలనంతా జన్మభూమి కమిటీలకే పరిమితమైందన్న విషయం ప్రజలకు అర్థమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ మండల కన్వీనర్ ఎం.శ్యామలరావు, జెడ్పీటీసీ ప్రతినిధి మెండ రాంబాబూలు మాట్లాడుతూ మీడియాను నియంత్రించే ఏ ప్రభుత్వాలు ఇప్పటివరకు మనుగడ సాగించలేదన్నారు. అనంతరం ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలంటూ తహశీల్దార్ ప్రవళ్లికాప్రియకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కొయ్యాన సూర్యం, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు తంగి మురళీకృష్ణ, మండల విప్ బుక్కా లక్ష్మణరావు, ప్రజాప్రతినిధులు, నాయకులు కె. దామోదరావు, పైడి విఠలరావు, పొన్నాడ విజయ్, వెలమల అసిరినాయడు, బగ్గు లక్ష్మణరావు, కనుసు రవి, పంచిరెడ్డి రాజారావు, సోమినేని కృష్ణ, లోక్‌సత్తా నాయకులు మామిడి సత్యనారాయణ, పాత్రికేయుడు ఎస్.శాంత భాస్కరరావు పాల్గొన్నారు. కక్ష సాదింపు చర్యే లావేరు: సాక్షి టీవీ ప్రసారాలును నిలిపివేయడం కక్ష సాధింపు చర్యేనని వైఎస్సార్ సీపీ సాంసృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు రొక్కం బాలకృష్ణ, మండలాధ్యక్షుడు దన్నాన రాజినాయుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజాపంతుల ప్రకాశరావులు అన్నారు. సాక్షి టీవీ ప్రసారాలు వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ తహశీల్దార్ పి .వేణుగోపాలరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గొర్లె అప్పలనాయుడు, లుకలాపు అప్పలనాయుడు, మండల ప్రధాన కార్యదర్శి దేశెట్టి తిరుపతిరావు, మండల యువజన విభాగం అధ్యక్షుడు దంగుడుబియ్యపు మురళీ, మాజీ మండలాధ్యక్షుడు వట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కొవ్వొత్తుల ర్యాలీ ఆమదాలవలస: సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలని కోరుతూ ఆమదాలవలస పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ దుంపల శ్యామలరావు, పార్టీ నాయకులు సైలాడ దాసునాయుడు, యండా విశ్వనాథం, కూన రామకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ ధనుంజయరావు, సాక్షి టీవీ ప్రతినిధి దుంపల నందికేశ్వరరావులు పాల్గొన్నారు. -
ఏపీ ప్రభుత్వం మీడియా గొంతు నొక్కుతోంది
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేసిన అంశాన్ని జర్నలిస్టులు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ సీకే ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం ఢిల్లీ జర్నలిస్టుల బృందం సీకే ప్రసాద్‌ను కలిసింది. ఏపీ ప్రభుత్వం మీడియా గొంతు నొక్కుతోందని జర్నలిస్టులు విమర్శించారు. ప్రజా ఉద్యమాలను చూపిస్తున్నందుకు సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేశారని జర్నలిస్టులు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ సీకే ప్రసాద్‌కు వివరించారు. చంద్రబాబు ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు. -
సాక్షి టీవీకి మద్దతుగా చైనాలో విద్యార్థుల ప్రదర్శన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి టీవీ ప్రసారాల నిలుపుదలపై చైనాలోని లయోనింగ్ రాష్ట్రంలో వైద్య విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. జిన్ఝౌ మెడికల్ యూనివర్సిటీ విద్యార్థులు యూనివర్సిటీ ప్రాంగణంలో తమ నిరసనను వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం తమ అవినీతిని కప్పిపుచ్చుకోడానికి, చంద్రబాబు నాయుడు ఇచ్చిన అడ్డగోలు హామీల నుంచి తప్పించుకోడానికే సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేశారని చైనా వైఎస్ఆర్సీపీ మెడికల్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు కొనకళ్ల పవన్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆయన ఆధ్వర్యంలో మెడికల్ యూనివర్సిటీ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. -
సాక్షి ప్రసారాల నిలుపుదలపై కౌంటర్ కు ఆదేశం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై దాఖలైన కేసు విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా పడింది. దీనిపై ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. సాక్షి టీవీ ప్రసారాల విషయంలో ఎంఎస్‌వోలకు ఏ రకమైన ఆటంకాలు కలిగించకుండా ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను నియంత్రించాలని కోరుతూ సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. కేబుల్ టీవీ చట్టం సెక్షన్ 19 ప్రకారం ఉత్తర్వులు ఇవ్వకుండా కేబుల్ టీవీ ప్రసారాల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ పిటిషన్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి అర్హమైన కేసుగా ఆయన స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు. కాగా తమ టీవీ చానల్ ప్రసారాల నిలుపుదల విషయంలో న్యాయపోరాటానికి దిగిన సాక్షి టెలివిజన్ ... ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి, టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) చైర్మన్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎంఎస్‌వోల ఫెడరేషన్లను ప్రతివాదులుగా పేర్కొంది. అన్ని జిల్లాల్లోనూ సాక్షి టీవీ ప్రసారాలు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్లను ఆదేశించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. సాక్షి ప్రసారాలను నిలిపేయాలని ఎంఎస్‌వోలకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలు ఇచ్చిన ఆదేశాలను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరింది. -
మీడియా స్వేచ్ఛకు సంకెళ్లా..?
శ్రీకాకుళం అర్బన్: మీడియాపై ఆంక్షలు ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడమేనని పలువురు ప్రజా ప్ర తినిధులు, మీడియా ప్రతినిధులు ధ్వజమెత్తారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేసినందుకు నిరసనగా పలువురు ప్రజా ప్రతినిధులు, మీడియా ప్రతినిధులతో శ్రీకాకుళంలోని అంబేడ్కర్ కూడలి వద్ద బుధవారం సాయంత్రం కొవ్వొత్తులతో ర్యా లీ, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ సాక్షి ఛానల్ ప్రసారాలను నిలిపివేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలు సాక్షి చానల్ ద్వారా ప్రసారం చేస్తే ఎక్కడ ప్రజలకు తెలిసిపోతుందోనని భయపడి సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేసిం దన్నారు. ఇలా ఒక చానల్‌పై కక్షపూరితంగా వ్యవహరించి అగౌరవపరచడం పత్రికా స్వేచ్ఛకు భం గం కలిగించడమేనన్నారు. ఏపీయూడబ్ల్యుజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంక్యాణ వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే మీడియా స్వేచ్ఛ ఎంతో అవసరమన్నారు. టీడీపీ ప్రభుత్వం మీడియా, పాత్రికేయులపై దాడులు చేయిస్తోందని విమర్శించారు. మీడియా ప్రతినిధి ఎస్.జోగినాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఆటవిక పాలన సాగుతోందని విమర్శించారు. మేధావులంతా చంద్రబాబు పాలనను నిశితంగా గమనిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ నేత టి.కామేశ్వరి మాట్లాడుతూ మీడియాపై ఆం క్షలు తక్షణమే ఎత్తివేయాలన్నారు. కేవలం ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలు బయటపెడుతుందనే అక్కసుతోనే సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేసిందన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులు, మీడియా ప్రతినిధు లు, ప్రజాప్రతినిధులంతా కొవ్వొత్తులతో అంబేద్కర్ కూడలి వద్ద నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా అంబేద్కర్ కూడలి వద్దనుంచి కాంప్లెక్స్, మళ్లీ కాంప్లెక్స్ కూడలి వద్దనుంచి అంబేద్కర్ కూడలి వరకూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు సాధు వైకుంఠరావు, కోరాడ రమేష్, గుడ్ల మల్లేశ్వరరావు, బిడ్డిక లక్ష్మి, పొందల విశ్వేశ్వరరావు, ఎం.మాధవరావు, మీడి యా ప్రతినిధులు సీహెచ్.నాగభూషణరావు, డోల అప్పన్న, లక్షమణరావు, పి.భీమారావు, బగాది నారాయణరావు, కె.రాజు, పి.శ్రీనుబాబు, అధిక సంఖ్య లో మీడియా ప్రతినిదులు, పాత్రికేయులు పాల్గొన్నారు. ఆ ధైర్యం ఎవరికీ లేదు... రాజాం/రాజాంరూరల్: ప్రజాస్వామ్య దేశంలో మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేసే ధైర్యం ఎవరూ చేయలేరని, అలా చేసిన వారు కాలగర్భంలో కలిసిపోక తప్పదని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. సాక్షి చానల్ పై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ రాజాం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఒకప్పుడు ఇందిరా గాంధీ ఇలాంటి ప్రవర్తనతోనే ప్రజలకు క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చిందని, చంద్రబాబును మాత్రం ప్రజలు క్షమాపణలతో వదిలిపెట్టరని అన్నారు. కాపు రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్న ముద్రగడ పద్మనాభం దీక్షను చూపించకూడదనే ఉద్దేశంతో సాక్షిపై నిషేధాజ్ఞలు విధించడం దారుణమన్నారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు గుడబండి సూర్యనారాయణ, ఉపాధ్యక్షుడు భీం పల్లి తిరుపతి, జాతీయ కౌన్సిల్ మాజీ సభ్యులు ఉల్లాకుల నీలకంఠేశ్వరయాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు కల్లేపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరి గిన ఈ కార్యక్రమంలో ముందుగా రాజాం ప్రెస్‌క్లబ్ నుంచి పాలకొండ జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించి అక్కడ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మానవ హారం చేపట్టి అక్కడ నుంచి ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి తహశీల్దార్ వై.శ్రీనివాసరావుకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో రాజాం, రేగిడి, సంతకవిటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ విలేకరులతో పాటు సీఐటీయూ డివిజన్ కార్యదర్శి సీహెచ్ రామ్మూర్తినాయడు, బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు అంది వీరభద్రయ్య, జాతీయ యువజన అవార్గు గ్రహీత పెంకి చైతన్యకుమార్, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ బూరాడ అప్పలనాయుడు, పాలవలస శ్రీనివాసరావు, పారంకోటి సుధ, వెంపల లక్ష్మణరావు, సీనియర్ పాత్రికేయులు ఉరిటి శశిభూషణరావు, టంకాల సత్యంనాయుడు తదితరులు పాల్గొన్నారు. వీరిలో వైఎస్ఆర్ సీపీ నాయకులు అప్పలనాయుడు, సుధ, లక్ష్మణరావులు మాట్లాడుతూ చంద్రబాబుకు రోజులు దగ్గరపడ్డాయని చెప్పారు. నిషేధాజ్ఞలతో ప్రజల్లో విలువ కోల్పోతున్నారని అన్నారు. ప్రసారాలపై అభ్యంతరాలు ఉంటే కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలని సూచించారు. -
కేంద్ర మంత్రి దృష్టికి సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేత అంశం
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేసిన విషయాన్ని జర్నలిస్టులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌ను బుధవారం జర్నలిస్టులు కలిసి ఈ అంశాన్ని వివరించారు. ఏపీ ప్రభుత్వం ఎంఎస్‌వోలను బెదిరించి సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేసిందని జర్నలిస్టులు కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. సాక్షి టీవీ ప్రసారాలను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర మంత్రి స్పందిస్తూ ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. -
బాబు సర్కారు తీరుపై జర్నలిస్టు సంఘాల ఆగ్రహం
-
బాబు సర్కారు తీరుపై జర్నలిస్టు సంఘాల ఆగ్రహం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి టీవీ చానెల్ ప్రసారాలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిలుపుదల చేయడంపై జర్నలిస్టు సంఘాల ఫిర్యాదుపై రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సానుకూలంగా స్పందించారు. గత కొద్ది రోజులుగా ఏపీలో సాక్షి చానెల్ ప్రసారం కాకుండా ఎంఎస్‌వోలపై ఒత్తిడి తెచ్చి అడ్డుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వంపై హైదరాబాద్ లో బుధవారం జర్నలిస్టు సంఘాల నేతృత్వంలో పెద్దఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నుంచి వందలాదిగా జర్నలిస్టులు చంద్రబాబు ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ రాజ్ భవన్‌కు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయా సంఘాల ప్రతినిధులు గవర్నర్‌ను కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలపై ఫిర్యాదుచేశారు. ఆ మేరకు ఒక వినతిపత్రాన్ని గవర్నర్‌కు సమర్పించారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కాపు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌పై ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్ష కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నామన్న కారణంగా సాక్షి చానెల్‌పై చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఫిర్యాదుచేశారు. గత జూన్ 9వ తేదీ నుంచి సాక్షి ప్రసారాలను అడ్డుకుంటున్నారని, ఆ మేరకు రాష్ట్రంలోని ఎంఎస్‌వోలపై ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెచ్చి సాక్షి ప్రసారాలను నిలిపివేసిందని ప్రతినిధి బృందం గవర్నర్‌కు వివరించింది. సాక్షితో పాటు మరికొన్ని టీవీ చానెళ్ల ప్రసారాలను నిలిపివేయాలని ఆదేశాలిచ్చినట్టు స్వయంగా ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించిన విషయాన్ని వారు గవర్నర్‌కు వివరించారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని, ఈ విషయంలో తక్షణం జోక్యం చేసుకుని తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రతినిధులు చెప్పిన వివరాలను శ్రద్ధగా విన్న గవర్నర్ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని సమావేశం అనంతరం సీనియర్ పాత్రికేయులు వివరించారు. అంతకుముందు ప్రెస్ క్లబ్ నుంచి రాజభవన్ వరకు జర్నలిస్టులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ చర్యను ఖండిస్తూ కదం తొక్కారు. గవర్నర్ కలిసిన ప్రతినిధుల బృందంలో సీనియర్ పాత్రికేయులు జీఎస్ వరదాచారి, కె.శ్రీనివాసరెడ్డి, ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు అమర్ నాథ్, ఏపీయూడబ్ల్యూజే నాయకులు నరేందర్ రెడ్డి, ఏపీయూడబ్ల్యూజేఎఫ్ నాయకులు ఆంజనేయులు, సీనియర్ పాత్రికేయులు నగేష్ కుమార్, సయ్యద్ హష్మీలతో పాటు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ఎడిటర్ వి.మురళి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆర్ దిలీప్ రెడ్డి, కొమ్మినేని శ్రీనివాసరావు, శైలేష్ రెడ్డి, భండారు శ్రీనివాసరావు, ప్రియా చౌదరి, గోపీనాథ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రవికాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు. వీరంతా గవర్నర్‌ను కలిసి జరుగుతున్న పరిణామాలను వివరించి వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, తక్షణం సాక్షి చానెల్ ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
'సాక్షి' ప్రసారాలు పునరుద్దరించాలి
తిరుపతి : సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతకు నిరసనగా చిత్తూరు జిల్లాలో ఆదివారం జర్నలిస్టులు, వైఎస్సార్సీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం 28 మండలాల్లో నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది జర్నలిస్టులు నగర వీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్లోని బాపూజీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. చిత్తూరు నగరంలో వైఎస్సార్సీపీ, బీజేపీ, వామపక్ష పార్టీల నేతలతో పాటు వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకులు నగర వీధుల్లో మానవహారం నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తిరుపతి ఎస్వీయూ విద్యార్థులు జర్నలిస్టులకు సంఘీభావంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జిల్లాలోని శ్రీకాళహస్తి, సత్యవేడు, పుంగనూరు, పలమనేరు, నాగలాపురం, మదనపల్లి, పెనుమూరు, కార్వేటినగరం, పాలసముద్రం, వెదురుకుప్పం మండలాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు నిరసన ర్యాలీలు నిర్వహించారు. -
'ముద్రగడను కసబ్ కంటే దారుణంగా..'
హైదరాబాద్: అక్రమంగా సాక్షి చానెల్ ప్రసారాలు నిలిపేసే ఏపీ ప్రభుత్వానికి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. తొలుత 21 రోజులపాటు నోటీసులు ఇచ్చిన తర్వాతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఏ ముఖ్యమంత్రి చెప్పాడనో, లోకేశ్ చెప్పాడనో లేక హోంమంత్రి చెప్పాడనో అలా చేయకూడదని చెప్పారు. అధికారాలు శాశ్వతం కాదని అంబటి గుర్తు చేశారు. ప్రభుత్వాలు చెప్పినట్లు చానెళ్లు ప్రచారం చేయడం సాధ్యం కాదనే విషయం అని అన్నారు. నాయకులు మారినప్పుడల్లా చానెల్ ప్రసారం చేసే తీరు మార్చుకోవాలా? పరిపాలకులకు అనుకూలంగా చానెల్ ప్రసారం చేయాలా అని నిలదీశారు. నాలుగురోజుల పాటు సాక్షి చానెల్ ఎందుకు నిలిపేశారని ప్రశ్నించారు. వెంటనే వెంటనే సాక్షి చానెల్ ప్రసారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ముద్రగడ విషయంలో స్పందిస్తూ ఆయనను పరామర్శించేందుకు వెళ్లిన తమను అరెస్టు చేసి పోలీసులు కోరుకొండ స్టేషన్ కు తరలించారని చెప్పారు. రాజమండ్రిలో వందలమంది పోలీసులు ఉన్నారని, పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. అక్కడ చూస్తుంటే రాజమండ్రిలో ఉన్నామా.. లేక పాకిస్థాన్‌లో ఉన్నామా అనే అనుమానం కలుగుతుందని అంబటి చెప్పారు. ముద్రగడ విషయంలో ఉగ్రవాది కసబ్ కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు దౌర్జన్య పాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంద్ చేసే వాళ్లను కొడుతూ పోలీసులు బంద్ విఫలానికి ప్రయత్నించారని, సాధారణ పోలీసు అఫీసర్ నుంచి ఐపీఎస్ వరకు ఇలాగే వ్యవహరించారని, అసలు పోలీసుల విధులు ఇవేనా అని ప్రశ్నించారు. ముద్రగడను ఎవరు చూడాలనకుంటే వారు చూసేందుకు అనుమతించాలని, ఆయనతో ప్రెస్ మీట్ పెట్టించాలని డిమాండ్ చేశారు. ఏం జరుగుతుందో తెలియక ఆంధ్ర కాపు సోదరులంతా ఆందోళన చెందుతున్నారని, వెంటనే ముద్రగడతో చర్చలు జరిపి దీక్షను విరమింపజేయించి, వారి సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని అంబటి డిమాండ్ చేశారు. -
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే..
హైదరాబాద్: ప్రభుత్వ వైఫల్యలను ఎండగడుతున్న సాక్షి టీవీ ప్రసపారాలను ముద్రగడ దీక్షను సాకుగా చూపి నిలిపివేయడానికి నిరసనగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నిరంకుశత్వ ధోరణికి నిరసనగా పలు జిల్లాల్లో ప్రజా సంఘాలు, జర్నలిస్టులు.. ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో సాక్షి ప్రాసారాల నిలిపివేతపై బీజేపీ, వామపక్షాలు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గాంధీ సర్కిల్లో సాక్షి ప్రసారాలను పునరుద్దరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ వైఖరిపై శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని.. సాక్షి టీవీ ప్రసారాలను వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ప్రసారాలను నిలిపివేయటం దారుణమని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కుమార్ అన్నారు. కర్నూలులో సాక్షి ప్రసారాల నిలిపివేతపై తీవ్ర నిరసన వ్యక్తమౌతుంది. జర్నలిస్టు సంఘం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సాక్షి ప్రసారాలను వెంటనే ప్రారంభించాలన్న డిమాండ్‌తో అర్థనగ్న ప్రదర్శనకు దిగారు. జిల్లాలోని బనగానపల్లె పట్టణంలో సాక్షి ప్రసారాలను నిలిపివేయటంపై ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. నందికొట్కూరులో ప్రజాసంఘాలు, జర్నలిస్టులు సాక్షిపై ప్రభుత్వ ప్రతీకార చర్యలకు నిరసనగా ఆందోళన నిర్వహించారు. సాక్షి ప్రసారాల నిలిపివేతకు నిరసనగా వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందులలో జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీని నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా జర్నలిస్టులకు మద్దతు ప్రకటించారు. సాక్షిటీవీ ప్రసారాలను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే ప్రభుత్వం ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చంద్రబాబుది నియంత పోక డ: చెన్నయ్య
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ‘సాక్షి’ టీవీ ప్రసారాలను నిలిపివేయడం సీఎం చంద్రబాబు నియంత పోకడలకు నిదర్శనమని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ధ్వజమెత్తారు. మీడియాను అణగదొక్కాలనుకోవడం అప్రజాస్వామికమని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోందని ‘సాక్షి’ ప్రసారాలను నిలిపివేయడం భావప్రకటనా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛను కాలరాయడమేనన్నారు. ఈ చర్యను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని కోరారు. ప్రతిపక్ష నేతను రాజకీయంగా ఎదగకుండా చేయాలనే సాక్షి ప్రసారాలను నిలిపివేశారన్నారు. ఈ ప్రసారాలను పునరుద్ధరించకపోతే ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలతో మాలమహానాడు ఆందోళనలకు సిద్ధమవుతుందని ఆయన హెచ్చరించారు. -
'తుని ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలి'
అనంతపురం: రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేయడం దుర్మార్గమన్నారు. తుని ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు వెళుతున్న వైఎస్ఆర్ సీపీ నేతలను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ సీపీ నేతలు మండిపడ్డారు. అలాగే సాక్షి ఛానల్ ప్రసారాలు నిలిపివేయడం అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. చంద్రబాబు తన చెప్పిందే రాసి, తాను మాట్లాడిందే చూపించాలని కొన్ని ఛానల్స్, పేపర్లను నియంత్రిస్తున్నారని మండిపడ్డారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అడ్డుకోవాలనుకోవడం అవివేకమన్నారు. కాగా సాక్షి ప్రసారాలు నిలిపివేయటాన్ని నిరసిస్తూ.. అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర జర్నలిస్టులు నిరసన తెలిపారు. ధర్నాలో జర్నలిస్టులతోపాటు సాక్షి అభిమానులు, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వార్తలను వార్తగా ప్రసారం చేస్తున్న సాక్షి ప్రసారాలను రాష్ట్రవ్యాప్తంగా నిలిపి వేయటం ఎంత వరకు సమంజసమని ఆందోళనకారులు ప్రశ్నించారు. సాక్షి ప్రసారాలను వెంటనే పునరుద్దరించకపోతే... జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేస్తామంటూ జర్నలిస్ట్ సంఘాలు హెచ్చరించాయి. -
'సాక్షి' ప్రసారాల నిలిపివేతను ఖండించిన బీజేపీ
ఢిల్లీ: సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతను బీజేపీ శాసన సభా పక్షనేత విష్ణు కుమార్ రాజు ఖండించారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడ సమంజసం కాదని ఆయన తెలిపారు. సాక్షి టీవీ ప్రసారాలను వెంటనే పునరుద్దరించాలని విష్ణుకుమార్ రాజు తెలిపారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దీక్షను విరమించి పోరాడాలని ఆయన సూచించారు.