సెప్టెంబర్‌ 5న జగనన్న విద్యాకానుక | Adimulapu Suresh Comments With Sakshi TV About Nadu Nedu Programme | Sakshi

నాడు-నేడుపై సీఎం జగన్‌ కీలక నిర్ణయాలు

Published Tue, Aug 4 2020 1:12 PM | Last Updated on Tue, Aug 4 2020 2:09 PM

Adimulapu Suresh Comments With Sakshi TV About Nadu Nedu Programme

సాక్షి, తాడేపల్లి : పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ సాక్షి టీవీతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ.. కాగా ముఖ్యమంత్రి జగన్‌ ఈరోజు నాడు-నేడు, జగనన్న విద్యాకానుకపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు పై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారన్నారు. సీఎం ఆదేశాల మేరకు రెండు, మూడు విడతల్లో నాడు నేడు షెడ్యూల్ ఖరారు చేయనున్నట్లు తెలిపారు.ఈనెల నుంచే ఫేజ్ 2 కి శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఫేజ్ 2 లో భాగంగా 14, 538 పాఠశాలలలో నాడు-నేడు చేపడతామన్నారు.జనవరి 14 నుంచి పాఠశాలల్లో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని, వచ్చే ఏడాది జూన్ 30 నాటికి ఫేజ్ 2 పూర్తి చేస్తామని వెల్లడించారు. ఫేజ్ 3 కింద 16,489 పాఠశాలలను పూర్తి చేస్తాం.. వచ్చే జూన్ 30 నుంచి ఫేజ్ 3 నాడు నేడు కి శ్రీకారం చూడతామన్నారు. మొత్తం అన్ని పాఠశాలల్లో నాడు నేడు పనులు 2022 నాటికి పూర్తి చేసేలా రూపకల్పన చేస్తామన్నారు.

ముందుగా అనుకున్న ప్రకారమే సెప్టెంబర్‌ 5న జగనన్న విద్యాకానుక నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు సూళ్ల పునర్‌ ప్రారంభానికి అన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. మరోవైపు మొదటిదశ నాడు-నేడు పనులు దాదాపు పూర్తయ్యాయన్నారు. జగనన్న విద్యాకానుకతో పాటే నాడు-నేడు కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తాం అని తెలిపారు. కాగా విద్యాకానుకకు సంబంధించి విద్యార్థులకు అందించే వస్తువులను సీఎం జగన్‌ పరిశీలించారన్నారు.

పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు మాస్క్‌, బుక్స్‌, స్కూల్‌ యునిఫామ్‌, బ్యాగ్స్‌ ఉండేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాలకు టెస్ట్‌బుక్స్‌ కూడా చేరాయని.. త్వరలోనే విద్యార్థులకు అందిస్తామన్నారు. కరోనా నేపథ్యంలో గైడ్‌లైన్స్‌ ప్రకారమే రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ప్రారంభిస్తామని చెప్పారు. కాగా ముఖ్యమంత్రి జగన్‌ ఈరోజు నాడు-నేడు, జగనన్న విద్యాకానుకపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించారన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ అన్ని విధాల సిద్ధంగా ఉందని ఆదిమూలపు సురేశ్‌ పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement