ఆంధ్రప్రదేశ్‌లో తమ టీవీ ప్రసారాలను నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ సాక్షి టీవీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు పరిష్కరించింది.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో తమ టీవీ ప్రసారాలను నిలిపివేయడాన్ని సవా లు చేస్తూ సాక్షి టీవీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ టీవీ ప్రసారాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు నిలిపేశారని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ సాక్షి టీవీ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
సోమవారం ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డి.రమేశ్ ఓ అఫిడవిట్‌ను కోర్టు ముందుంచారు. సాక్షి ప్రసారాల నిలుపుదలలో ప్రభుత్వానికి, పోలీసులకు సంబంధం లేదని వివరించారు.సాక్షి తరఫు న్యాయవాది నవీన్‌కుమార్ ఏపీలో సాక్షి ప్రసారాలు పునరుద్ధరించారని తెలిపారు. దీంతో న్యాయమూర్తి పై ఉత్తర్వులు ఇచ్చారు.