సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ గా రీ లాంఛ్ అయింది. న్యూయార్క్, న్యూజెర్సీ నుండి వాషింగ్టన్ డీసీ, టెక్సాస్, కాలిపోర్నియా, చికాగో, నార్త్ కరోలినా, అట్లాంటా, ఫ్లోరిడా మొదలగు నగరాలతో పాటు నార్త్ అమెరికాకు నలుదిక్కులా విస్తరించి.. పుట్టిన నేల నుంచి పెరిగిన గడ్డ వరకు.. ప్రవాసులకు అండగా.. మరింత చేరువగా.. సరికొత్తగా ఆవిష్కృతం అయింది సాక్షి టీవీ నార్త్ అమెరికా.
అమెరికా, చికాగోలో ఈ కార్యక్రమం జరిగింది. భారత జాతీయగీతంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. నేషనల్ ఇండియా హబ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సాక్షి టీవీ నార్త్ అమెరికా హెడ్ కె.కె. రెడ్డి, సాక్షి టీవీ నార్త్ అమెరికా చీఫ్ కరస్పాండెంట్ సింహా, సాక్షి టీవీ స్టాప్, బిజినెస్ ఓనర్స్, కమ్యూనిటీ లీడర్స్, అసోసియేషన్ హెడ్స్, సబ్జెక్టు మేటర్ ఎక్స్పర్ట్స్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్లే చేసిన సాక్షి టీవీ నార్త్ అమెరికా ఏవీని ప్రవాసులు ఎంతో ఆకసక్తిగా తిలకించారు. అనంతరం సాక్షి టీవీ యూఎస్‌ఏకి ప్రవాసులు తమ శుభాకాంక్షలు తెలిపారు.
అమెరికాలో న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్, కాలిపోర్నియా, చికాగో, నార్త్ కరోలినా, అట్లాంటా, ఫ్లోరిడా.. మరెన్నో నగరాలలో.. నార్త్ అమెరికాకు నలుదిక్కుల వ్యాప్తి చెంది.. US లో నెంబర్ 1 నెట్‌వర్క్ గా రూపాంతరం చెంది.. ప్రవాసుల గొంతుకగా Sakshi TV USA నిలుస్తోందని కె.కె. రెడ్డి పెర్కొన్నారు. సాక్షి టీవీ ఎన్నారై ప్రత్యేక కార్యక్రమాల గురించి సింహా వివరించారు. అమెరికాలో ప్రవాసుల గొంతుకగా నిలుస్తోన్న సాక్షి టీవీని పలువురు ప్రముఖులు కొనియాడారు. సాక్షి ఎన్నారై కార్యక్రమాలను ప్రశంసించారు.
ఈ సందర్భంగా ప్రవాసులు పలు సూచనలు, సలహాలు అందించారు. సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ రీ లాంఛ్ ఈవెంట్ లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కె.కె. రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సాక్షి టీవీ అమెరికాను అందరూ ఆదరించాలని కోరారు.
(చదవండి: అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 51% తెలుగు రాష్ట్రాల నుంచే..)
Comments
Please login to add a commentAdd a comment