Chicago
-
చికాగోలో నాట్స్ వింటర్ క్లాత్ డ్రైవ్
భాషే రమ్యం.. సేవే గమ్యం నినాదం తో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. చికాగోలో పేదవారి కోసం ముందడుగు వేసింది. గడ్డ కట్టే చలిలో పేదలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వారి కోసం వింటర్ క్లాత్ డ్రైవ్ నిర్వహించింది. ఈ డ్రైవ్ ద్వారా చలికాలంలో వేసుకునే స్వెట్టర్లు, కోట్లు సేకరించింది. చిన్ననాటి నుంచే విద్యార్ధుల్లో సామాజిక సేవ అనేది అలవాటు చేసేందుకు ఈ వింటర్ డ్రైవ్‌ని నాట్స్ ఎంచుకుంది. చికాగో నాట్స్ సభ్యులు, తెలుగు కుటుంబాలకు చెందిన వారు ఈ వింటర్ క్లాత్ డ్రైవ్‌లో స్వెట్టర్లు, కోటులు, బూట్లు విరాళంగా ఇచ్చారు.. నాట్స్ చికాగో బృందం ఇలా సేకరించిన వాటిని చికాగోలోని అరోరా ఇల్లినాయిస్లో ఉన్న గుడ్ విల్ సంస్థకు విరాళంగా అందించింది. గుడ్‌విల్ సంస్థ నిరాశ్రయులకు, పేదలకు చలికాలంలో వారికి కావాల్సన సాయం చేస్తుంటుంది. నాట్స్ నిర్వహించిన వింటర్ క్లాత్ డ్రైవ్‌లో పాల్గొన్న చిన్నారులను నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అభినందించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సేవా పథం వైపు నడిపిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు. థ్యాంక్స్ గివిండే సందర్భంగా నాట్స్ చికాగో విభాగం చేపట్టిన వింటర్ క్లాత్ డ్రైవ్ సామాజిక సేవలో నాట్స్ వేసిన మరో ముందడుగు అని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. ఈ డ్రైవ్‌లో పాల్గొన్న నాట్స్ చికాగో బృంద సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.నాట్స్ వింటర్ క్లాత్ డ్రైవ్ కార్యక్రమాన్ని నాట్స్ చాప్టర్ కోఆర్డినేటర్లు హవేల మద్దెల, బిందు వీడులమూడి, లక్ష్మి బొజ్జ, రోజా సీలంశెట్టి, చంద్రిమ దాడి, సిరిప్రియ బాచు, భారతి కేశనకుర్తి, భారతి పుట్ట, సింధు కాంతంనేని, ప్రియాంకా పొన్నూరు, వీర తక్కెలపాటి, అంజయ్య వేలూరు, ఈశ్వర్ వడ్లమన్నాటి తదితరులు చక్కటి ప్రణాళిక, సమన్వయంతో నిర్వహించారు. వింటర్ క్లాత్ డ్రైవ్ విజయంలో కీలక పాత్ర పోషించిన వాలంటీర్లు సుమతి నెప్పలాలి, రాధ పిడికిటి, బిందు బాలినేని, రామ్ కేశనకుర్తి, పాండు చెంగలశెట్టి, ప్రదీప్ బాచు, బాల వడ్లమన్నాటి, వీర ఆదిమూలం, రాజేష్ వీడులమూడి, శ్రీకాంత్ బొజ్జ, గోపీ ఉలవ, గిరి మారిని, వినోత్ కన్నన్, అరవింద్ కోగంటిలకి చికాగో నాట్స్ చాప్టర్ కోఆర్డినేటర్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులు శ్రీనివాస్ పిడికిటి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్కే బాలినేని, హరీష్ జమ్ముల, ఎమాన్యూల్ నీల, కిరణ్ మందాడి, రవి తుమ్మల, కిషోర్ నారె, మురళి మేడిచర్ల, రాజేష్ కాండ్రు మరియు బోర్డ్ సభ్యులుగా ఉన్న ముర్తి కోప్పాక, మహేశ్ కాకర్ల, శ్రీనివాస్ అరసాడ , శ్రీనివాస్ బొప్పాన, డా. పాల్ దేవరపల్లిలు ఈ వింటర్ క్లాత్ డ్రైవ్‌కు తమ మద్దతు, సహకారం అందించినందుకు నాట్స్ చికాగో విభాగం ధన్యవాదాలు తెలిపింది.(చదవండి: టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'' 209 వ సాహిత్య సదస్సు) -
చికాగోలో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు
అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రతి ఏటా బాలల సంబరాలను ఘనంగా నిర్వహిస్తూ వస్తోంది. తాజాగా చికాగోలో బాలల సంబరాలను విజయవంతంగా నిర్వహించింది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు పుట్టిన రోజు సందర్భంగా ప్రతియేటా ఈ బాలల సంబరాలను ఓ సంప్రదాయంలా నాట్స్ వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తూ వస్తోంది.బాలల సంబరాల్లో భాగంగా తెలుగు విద్యార్ధులకు అనేక పోటీలు నిర్వహిస్తోంది. బాలల్లో సృజనాత్మకతను, ప్రతిభను వెలికి తీసేలా నిర్వహించిన ఈ పోటీల్లో 150 మందికి పైగా చిన్నారులు సంస్కృతి, సృజనాత్మకతతో కూడిన ప్రదర్శనలతో తమ ప్రతిభ చూపించారు. బాలల సంబరాల పోటీల్లో తెలుగులో ఉపన్యాస పోటీలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మ్యాథ్ బౌల్, ఆర్ట్ పోటీలు, ఫ్యాన్సీ డ్రస్ ప్రదర్శనలు, ఆకట్టుకునే నృత్య ప్రదర్శనలతో ఆద్యంతం ఉత్సాహభరితంగా కొనసాగింది. బాలల సంబరాలకు వివిధ తెలుగు సంస్థల నుండి ప్రతినిధులు ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. ప్రతి విభాగంలో విజేతలుగా నిలిచిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. చిన్నారుల ప్రతిభను ప్రశంసించారు. బాలల సంబరాలను విజయవంతం చేయడంలో తోడ్పడిన సలహాదారులు, స్వచ్ఛంద సేవకులు, న్యాయనిర్ణేతలు, తల్లిదండ్రులు, ముఖ్యంగా చిన్నారులకు చికాగో చాప్టర్ కోఆర్డినేటర్ వీర తక్కెళ్లపాటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారం, కృషి, అంకితభావం వల్ల నాట్స్ బాలల సంబరాలు దిగ్విజయంగా జరిగాయని అన్నారు.చిన్నారుల్లో ప్రతిభను ప్రోత్సాహించేందుకు నాట్స్ బాలల సంబరాల పోటీలు దోహద పడతాయని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. పిల్లలను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులని అభినందించారు. బాలల సంబరాలను దిగ్విజయం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరిని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అభినందించారు.పోటీల్లో మహిళా జట్టు చేసిన విశేష కృషిని నాట్స్ నిర్వాహకులు ప్రశంసించారు. తెలుగు ఉపన్యాస పోటీ నిర్వహణలో హవేళ, సిరి ప్రియ, భారతి కేశనకుర్తి మ్యాథ్ బౌల్ నిర్వహణలో చంద్రిమ దాది, ఆర్ట్ పోటీకి కిరణ్మయి గుడపాటి నృత్య ప్రదర్శనలకు బిందు, లక్ష్మి ఫ్యాన్సీ డ్రస్ పోటీల నిర్వహణ కోసం రోజా చేసిన కృషికి నాట్స్ చికాగో టీం ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. చికాగో చాప్టర్ కోఆర్డినేటర్లు-నరేంద్ర కడియాల, అంజయ్య వేలూరు, శ్రీనివాస్ ఎక్కుర్తి, ఈశ్వర్ వడ్లమన్నాటి, మహేష్ కిలారుతో పాటు అంకితభావంతో పనిచేసిన వాలంటీర్ల మాధురి పాటిబండ్ల, బిందు బాలినేని, రవి బాలినేని, రామ్ కేశనకుర్తి, శ్రీనివాస్ పిల్ల, పాండు చెంగలశెట్టి, నవాజ్, గోపిలకు నాట్స్ జాతీయ నాయకత్వం ధన్యవాదాలు తెలిపింది.బాలల సంబరాలకు సహకరించిన నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్కె బాలినేని, హరీష్ జమ్ముల, ఇమ్మాన్యుయేల్ నీల, కిరణ్ మందాడి, రవి తుమ్మల, కిషోర్ నారే, మురళి మేడిచెర్ల, రాజేష్ కాండ్రు, నాట్స్ బోర్డ్ మాజీ సభ్యులు మూర్తి కొప్పాక, మహేష్ కాకర్ల, శ్రీనివాస్ అరసాడ, శ్రీనివాస్ బొప్పన తదితరులకు చికాగో నాట్స్ బోర్డు చాప్టర్ జట్టు కృతజ్ఞతలు తెలిపారు.బాలల సంబరాలకు ప్రాథమిక స్పాన్సర్ గా వ్యవహరించి, అందరికీ ఎంతో రుచికరమైన భోజనం అందించిన బౌల్ ఓ బిర్యానీ వారికి నిర్వాహకులు చికాగో నాట్స్ టీం ధన్యవాదాలు తెలిపింది.(చదవండి: ఓమహాలో నాట్స్ ప్రస్థానానికి శ్రీకారం) -
చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. అమెరికన్ సమాజంలో సామాజిక బాధ్యతను విద్యార్ధులకు అలవర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ హైవే దత్తత కార్యక్రమాన్ని చేపట్టింది. నాట్స్ చికాగో విభాగం నిర్వహించిన ఈ హైవే దత్త కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, వాలంటీర్లు, విద్యార్ధులు పాల్గొని హైవేను శుభ్రం చేశారు. అమెరికాలో సామాజిక సంస్థలు రోడ్లను, పబ్లిక్ ప్లేస్‌లను దత్తత తీసుకుని వాటిని శుభ్రం చేస్తుంటాయి. నాట్స్ కూడా ఇందులో నేనుసైతం అంటూ రంగంలోకి దిగింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అడాప్ట్ హైవే కార్యక్రమాన్ని నాట్స్ నిర్వహిస్తూ వస్తుంది. చికాగోలో నిర్వహించిన ఈ హైవే దత్తత కార్యక్రమంలో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు పాల్కని సమాజం కోసం స్వచ్ఛందంగా పనిచేసేలా భావితరాన్ని ప్రోత్సాహించారు. ఇలా సమాజం కోసం విద్యార్ధులు వెచ్చించిన సమయాన్ని అక్కడ కాలేజీలు కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. నాట్స్ హైవే దత్తత కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలరందని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అభినందించారు. చికాగో చాప్టర్ కోఆర్డినేటర్లు నరేంద్ర కడియాల, అంజయ్య వేలూరు, వీర తక్కెళ్లపాటిలు చక్కటి ప్రణాళిక, సమన్వయంతో హైవేను పరిశుభ్రం చేయడంలో కీలక పాత్ర పోషించారు. చికాగో చాప్టర్ సభ్యులు ఈశ్వర్ వడ్లమన్నాటి, మహేష్ కిలారు, శ్రీనివాస్ ఎక్కుర్తి, రమేష్ జంగాల, దివాకర్ ప్రతాపుల, సునీల్ ఎస్, నిపున్ శర్మలు ఈ హైవే దత్తతకు చక్కటి మద్దతు, సహకారం అందించారు.భావితరాలకు ఎంతో ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమం కోసం చికాగో చాప్టర్‌కి దిశా నిర్థేశం చేసిన నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్కే బాలినేని, హరీష్ జమ్ముల, ఇమ్మాన్యుయేల్ నీల, మాజీ బోర్డు సభ్యులు మూర్తి కొప్పాక, శ్రీని అరసాడ, శ్రీనివాస్ బొప్పనలకు నాట్స్ చికాగో విభాగం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచే ఎంతో ఉపయుక్తమైన హైవే దత్తత కార్యక్రమాన్ని చేపట్టిన నాట్స్ చికాగో విభాగాన్ని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేకంగా అభినందించారు.(చదవండి: -
సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ రీ లాంఛ్
సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ గా రీ లాంఛ్ అయింది. న్యూయార్క్, న్యూజెర్సీ నుండి వాషింగ్టన్ డీసీ, టెక్సాస్, కాలిపోర్నియా, చికాగో, నార్త్ కరోలినా, అట్లాంటా, ఫ్లోరిడా మొదలగు నగరాలతో పాటు నార్త్ అమెరికాకు నలుదిక్కులా విస్తరించి.. పుట్టిన నేల నుంచి పెరిగిన గడ్డ వరకు.. ప్రవాసులకు అండగా.. మరింత చేరువగా.. సరికొత్తగా ఆవిష్కృతం అయింది సాక్షి టీవీ నార్త్ అమెరికా. అమెరికా, చికాగోలో ఈ కార్యక్రమం జరిగింది. భారత జాతీయగీతంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. నేషనల్ ఇండియా హబ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సాక్షి టీవీ నార్త్ అమెరికా హెడ్ కె.కె. రెడ్డి, సాక్షి టీవీ నార్త్ అమెరికా చీఫ్ కరస్పాండెంట్ సింహా, సాక్షి టీవీ స్టాప్, బిజినెస్ ఓనర్స్, కమ్యూనిటీ లీడర్స్, అసోసియేషన్ హెడ్స్, సబ్జెక్టు మేటర్ ఎక్స్పర్ట్స్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్లే చేసిన సాక్షి టీవీ నార్త్ అమెరికా ఏవీని ప్రవాసులు ఎంతో ఆకసక్తిగా తిలకించారు. అనంతరం సాక్షి టీవీ యూఎస్ఏకి ప్రవాసులు తమ శుభాకాంక్షలు తెలిపారు.అమెరికాలో న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్, కాలిపోర్నియా, చికాగో, నార్త్ కరోలినా, అట్లాంటా, ఫ్లోరిడా.. మరెన్నో నగరాలలో.. నార్త్ అమెరికాకు నలుదిక్కుల వ్యాప్తి చెంది.. US లో నెంబర్ 1 నెట్వర్క్ గా రూపాంతరం చెంది.. ప్రవాసుల గొంతుకగా Sakshi TV USA నిలుస్తోందని కె.కె. రెడ్డి పెర్కొన్నారు. సాక్షి టీవీ ఎన్నారై ప్రత్యేక కార్యక్రమాల గురించి సింహా వివరించారు. అమెరికాలో ప్రవాసుల గొంతుకగా నిలుస్తోన్న సాక్షి టీవీని పలువురు ప్రముఖులు కొనియాడారు. సాక్షి ఎన్నారై కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రవాసులు పలు సూచనలు, సలహాలు అందించారు. సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ రీ లాంఛ్ ఈవెంట్ లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కె.కె. రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సాక్షి టీవీ అమెరికాను అందరూ ఆదరించాలని కోరారు.(చదవండి: అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 51% తెలుగు రాష్ట్రాల నుంచే..) -
ఏం ట్విస్ట్..?: కన్నతల్లి పక్కనే ఉన్నా..! పాపం ఆ కొడుకు..
కొన్ని కథల్లో భలే గమ్మత్తైన ట్విస్ట్ ఉంటుంది. ఊహకే అతీతంగా ఉంటుంది. తీరా అసలు విషయం తెలిశాక అబ్బా.. పక్కపక్కనే ఉంటూ గుర్తించలేకపోయామా..! అనిపిస్తుంది. అలాంటి విచిత్రమైన పరిస్థితే.. ఓ తల్లి కొడుకులకు ఎదురయ్యింది. ఇద్దరూ ఎదురుపడుతున్నా..ఒకరికి.. ఒకరూ.. ఏమవుతారో తెలియని స్థితి. ఏ విధి అయితే ఆ తల్లి బిడ్డలు వేరయ్యేలా చేసిందే.. అదే మళ్లీ అత్యంత విచిత్రంగా.. సరైన సమయంలో వారిని కలిపింది. ఆ తల్లికి స్వాంతన కల్పించింది. ఇంతకీ వారిద్దరి మధ్య విధి ఆడిన గమత్తైన కథ ఏంటంటే..అమెరికాలోని చికాగోకి చెందిన 50 ఏళ్ల వామర్ హంటర్ తన ఇంటి సమీపంలో ఉండే 'గివ్ మీ సమ్ సుగా' అనే బేకరీ వద్దకు తరుచుగా వెళ్తుండేవాడు. అది ఆయనకు ఎంతో ఇష్టమైన బేకరీ. కానీ సరదాకి కూడా హంటర్ ఈ బేకరీ తనదవుతుందని, త్వరలో తానే నడుపనున్నానని ఎప్పుడూ ఊహించలేదు హంటర్. ఇక హంటర్‌కి చిన్నతనం నుంచి ఇంట్లోని వాళ్లు తనవాళ్లు కారనే ఫీలింగ్ మనసులో బలంగా ఉంటుండేది. అయితే తనకు 35 ఏళ్ల వయసు వచ్చినప్పుడే.. తనని దత్తత తీసుకున్నారని, వాళ్లంతా తన కుటుంబసభ్యులు కారని తెలుసుకుంటాడు. ఇక అప్పటి నుంచి తన కన్నతల్లి గురించి అన్వేషించడం ప్రారంభించాడు. ఈ విషయంలో కాలిఫోర్నియాకు చెందిన జన్యు శాస్త్రవేత్త గాబ్రియెల్లా వర్గాస్ హంటర్‌కి సహాయం చేశారు. అతడి కన్నతల్లి 'గివ్ మీ సమ్ సుగా' బేకరీ యజమాని 67 ఏళ్ల లెనోర్ లిండ్సే అని కనిపెట్టడమే గాక ఆమెకు హంటర్ వివరాలు తోసహా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. సరిగ్గా ఆ సమయంలో లిండ్సే బ్రెస్ట్ కేన్సర్‌కి చికిత్స తీసుకుంటోంది. చెప్పాలంటే కీమోథెరపీ చేయించుకోవడానికి సిద్ధమవుతోంది. తన పరిస్థితి ఎలా ఉన్నా లెక్కచేయక..వెంటనే ఆ జన్యు శాస్త్రవేత్త ఇచ్చిన ఫోన్నెంబర్కి కాల్ చేసి హంటర్‌తో మాట్లాడుతుంది. అయితే ఆ ఫోన్లో తాను తరచుగా విన్న.. కస్టమర్ గొంతులా ఉండటంతో ఆశ్యర్యపోతుంది. ఆ తర్వాత ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నాక..లిండ్సే హంటర్ తన కొడుకేనని నిర్ధారించుకుని.. తనను ఎందుకు దత్తతకు ఇవ్వాల్సి వచ్చిందో హంటర్‌కి విరిస్తుంది. నిజానికి 1974లో హంటర్‌కి జన్మనిచ్చే సమయానికి లిండ్సేకి 17 ఏళ్లు. కుటుంబం తీవ్ర దారిద్య బాధల్లో కొట్టుమిట్టాడటంతో గత్యంతర లేక హంటర్ని దత్తతకు ఇవ్వాల్సి వస్తుంది. ఇన్నాళ్లు పక్కపక్కనే ఉండి..అదికూడా తన తరుచుగా వెళ్లే బేకరీ.. యజమానే తన తల్లి అని తెలుసుకుని హంటర్ ఆనందానికి అవధులు లేవనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఆ తల్లి కొడుకులిద్దరూ కలిసి ఆ బేకరిని నడుపుతున్నారు. పరిస్థితులు ఆ తల్లి కొడుకులిని వేరే చేస్తే..విధి ఇద్దరిని పక్కపక్కనే ఉంచి.. సరైన సమయానికి చిత్రంగా కలిపింది కదూ..!. ఒకరకంగా ఆ తల్లికి ఈ వయసులో కొడుకు ఆసరా ఎంతో అవసరం కూడా.(చదవండి: మోడలింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో..డిజిటల్ స్టార్‌గా ఫోర్బ్స్‌లో చోటు!) -
చికాగో ఫ్యాన్స్ మీట్లో శృతిహాసన్ సందడి
శృతి హాసన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లోక నాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచియం అయిన శృతి హాసన్.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీతో పాటు పలు భాషల్లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. సింగర్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. లోకనాయకుడు కమల్‌హాసన్ గారాలపట్టిగా బోల్డెంత పేరు ఉన్నప్పటికి ..తన సొంత టాలెంట్, గ్లామర్‌తో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ.. టాప్ హీరోయిన్గా వెలుగుతోంది. పలు సేవా కార్యక్రమంలో పాలుపంచుకునే శృతిహాసన్ రీసెంట్గా అమెరికాలో పర్యటించారు. చికాగోలోని ఫ్యాన్స్ మీట్లో పాల్గొని..సందడి చేశారు.సాక్షి, HR PUNDITS పార్టనర్షిప్ గా.. పక్కాలోకల్ పేరుతో నిర్వహించిన ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ ఈవెంట్ లో శృతి హాసన్ బార్బీ డాల్‌గా మెరిసిపోతూ.. అభిమానులను కుష్ చేశారు. ప్రముఖ ఎన్నారై కె.కె. రెడ్డి.. శృతిహాసన్ ను వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు. వేదికపై శృతిహాసన్ అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. అంతేకాకుండా వారి కోరిక మేరకు సాంగ్స్ కూడా పాడారు. అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఫ్యాన్స్ తో కలిసి సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా నిర్వహకులు ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. శృతి హాసన్ తన సినీ కెరీర్ కు సంబంధించి ఎన్నో విశేషాలను పంచుకున్నారు. చికాగో తనకు ఎంతో నచ్చిందని పేర్కొన్నారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైనా స్టయిల్ లో సమాధానం ఇచ్చారు.ఈ ఈవెంట్ లో శృతి హాసన్ సినిమాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్బంగా ఆమె సినిమాలకు సంబంధించి పలు ప్రశ్నలను అభిమానులను అడిగారు. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వారికి శృతిహాసన్ ఆటోగ్రాప్ చేసిన టీషర్ట్లను అందజేశారు. ఇక ప్రముఖ ఎన్నారై కె.కె. రెడ్డి.. శృతిహాన్కు సర్ప్రైజ్ గిప్ట్ ఇచ్చారు. ఇక అందమైన ఫోటో ఫ్రేమ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ గా నిర్వహించిన నిర్వహకులకు.. శృతిహాసన్ కృతజ్ఞతలు తెలిపారు. -
T10 League: ఊతప్ప ఊచకోత.. కేవలం 27 బంతుల్లోనే!
నేషనల్ క్రికెట్ టీ10 లీగ్-2024లో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 27 బాల్స్ ఎదుర్కొని ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 66 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడి స్ట్రైక్‌రేటు 244.44గా నమోదైంది.చికాగో జట్టుకు కెప్టెన్గాఅమెరికా వేదికగా జరుగుతున్న ఈ టీ10 లీగ్‌లో యాక్టివ్ క్రికెటర్లతో పాటు రిటైర్డ్ ప్లేయర్లు కూడా పాల్గొంటున్నారు. టైటిల్ కోసం ఆరు జట్లు పోటీపడుతున్న ఈ పొట్టి లీగ్‌లో రాబిన్ ఊతప్ప చికాగో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం టెక్సాస్ గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా పరుగుల వర్షం కురిపించాడు.క్రిస్ లిన్ ధనాధన్ ఇన్నింగ్స్ఓపెనర్గా బరిలోకి దిగిన ఊతప్ప ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. మరో ఓపెనర్ క్రిస్ లిన్ సైతం 23 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్స్‌ల సాయంతో 60 పరుగలోత అజేయంగా నిలిచాడు. వీరితో పాటు మైక్ లూయీస్ 10 బంతుల్లోనే 34 రన్స్‌తో నాటౌట్‌గా నిలవగా.. నిర్ణీత 10 ఓవర్లలో చికాగో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది. 41 పరుగుల తేడాతో జయభేరిలక్ష్య ఛేదనలో టెక్సాస్ గ్లాడియేటర్‌కు డేవిడ్ మలన్ శుభారంభమే అందించాడు. 16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. మిగిలిన వాళ్లలో జేమ్స్ ఫుల్లర్ 13 బంతుల్లో 37 పరుగులతో మెరవగా.. ఇతరుల నుంచి సహకారం లభించలేదు. దీంతో పది ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి టెక్సాస్ కేవలం 132 పరుగులే చేయగలిగింది. ఫలితంగా చికాగో 41 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.అమెరికా నేషనల్ క్రికెట్ టీ10లీగ్‌లో ఆరుజట్లున్యూయార్క్ లయన్స్, టెక్సాస్ గ్లాడియేటర్స్, చికాగో సీసీ, డల్లాస్ లోన్స్టార్స్, లాస్ ఏంజెలిస్ వేవ్స్, అట్లాంటా కింగ్స్. టీమిండియా మాజీ క్రికెటర్లలో సురేశ్ రైనా న్యూయార్క్‌కు సారథిగా ఉండగా.. చికాగోకు ఊతప్ప నాయకుడు. మిగిలిన జట్లలో టెక్సాస్‌కు షాహిద్ ఆఫ్రిది, డల్లాస్‌కు దినేశ్ కార్తిక్, లాస్ ఏంజెలిస్‌కు షకీబ్ అల్ హసన్, అట్లాంటాకు ఏంజెలో మాథ్యూస్ కెప్టెన్లుగా ఉన్నారు.చదవండి: జైశంకర్‌తో భేటీ కానున్న పీసీబీ చీఫ్?.. టీమిండియా ఇక్కడకు రావాల్సిందే!Begin your morning with some sumptuous Robin Uthappa sixes! 🫶Uthappa and Lynn got Chicago off to a flying start by putting on 112 from just 38 balls.🔥#NCLonFanCode pic.twitter.com/gLVq6E5H4v— FanCode (@FanCode) October 8, 2024 -
చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం!
అమెరికాలో తెలుగువారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా తెలుగు వారిలో సామాజిక బాధ్యత పెంచేలా హైవే దత్తత కార్యక్రమాన్ని చేపట్టింది. నాట్స్ చికాగో విభాగం చేపట్టిన ఈ కార్యక్రమంలో నాట్స్ దత్తత తీసుకున్న హైవే (రూట్.59 స్ట్రీట్) లో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించింది. హైవే పక్కన చెత్త చెదారాన్ని తొలగించడంతో పాటు అక్కడ పచ్చదనాన్ని పరిరక్షించే చర్యలు చేపట్టింది. అమెరికాలో విద్యార్ధుల్లో సేవా భావాన్ని పెంచేందుకు హైవే దత్తత లాంటి కార్యక్రమాలు చేపడుతుంటారు. నాట్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని అక్కడ ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది. విద్యార్థుల సేవా సమయానికి గుర్తింపు ఇస్తుంది. విద్యార్థి దశ నుంచే సేవ చేయాలనే సంకల్పాన్ని కలిగించేందుకు నాట్స్ చికాగోలో హైవే దత్తత కార్యక్రమాన్ని తీసుకుందని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పనిచేసిన విద్యార్ధులను, నాట్స్ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసిన చికాగో చాప్టర్ సమన్వయకర్తలు నరేందర్ కడియాల, వీర తక్కెళ్లపాటి లను అందరూ ప్రశంసించారు. ఇంకా ఈ కార్యక్రమంలో చికాగో చాప్టర్ సభ్యులు హవిల మద్దెల, చంద్రిమ దాడి, చెన్నయ్య కంబల, పాండు చెంగలశెట్టి, అంజయ్య వేలూరు, వినోత్ కన్నన్, దివాకర్ ప్రతాపుల మరియు ఇతర చాప్టర్ సభ్యులు తదితరులు కీలక పాత్ర పోషించారు. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్కే బలినేని, హరీష్ జమ్ముల, ఎమాన్యుయేల్ నీలాతో పాటు నాట్స్ బోర్డు మాజీ సభ్యులు మూర్తి కొప్పాక, శ్రీని అరసాడ, శ్రీనివాస్ బోపన్నలు వాలంటీర్లకు విలువైన సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సామాజిక బాధ్యతను పెంచే అడాప్ట్ ఏ హైవే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: సివిల్ సర్వీసెస్ వ్రాసే పేద విద్యార్ధులకు నాట్స్ చేయూత!) -
Lael Wilcox: 4 ఖండాలు 21 దేశాలు ...ఓ సైకిల్!
విల్కాక్స్ ‘సైకిల్ సెటప్’పై ఒక లుక్కు వేస్తే... ‘ఈ సైకిల్‌పై కొన్ని ఊళ్లు చుట్టి రావచ్చు’ అనిపిస్తుంది. ఇంకాస్త ఉత్సాహ పడితే... ‘జిల్లాలు చుట్టి రావచ్చు’ అనిపించవచ్చు. ‘ఈ సైకిల్‌తో ఎన్నో దేశాలకు వెళ్లవచ్చు’ అని మాత్రం అనిపించదు. మనం అనుకోవడం, అనుకోక పోవడం మాట ఎలా ఉన్నా ఈ సైకిల్ పైనే విల్కాక్స్ ఎన్నో దేశాలు చుట్టి వచ్చి ప్రపంచ రికార్డును సృష్టించింది.మే 26న షికాగోలోని గ్రాంట్ ΄ార్క్ నుండి బయలుదేరిన లాయెల్ విల్కాక్స్ నాలుగు ఖండాలు, 21 దేశాల మీదుగా 29,169 కిలోమీటర్ల సైకిల్ యాత్రను పూర్తి చేసింది. యాత్ర పూర్తి చేయడానికి పట్టిన కాలం... 108 రోజులు, 12 గంటల 12 నిమిషాలు.ఎన్నో దేశాలు చుట్టి వచ్చి తిరిగి షికాగోకు వచ్చిన విల్కాక్స్కు కుటుంబసభ్యులు, స్నేహితులు, షికాగో సైకిల్ సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికారు.తన లేటెస్ట్ రికార్డ్‌తో స్కాట్లాండ్కు చెందిన జెన్నీ గ్రాహం గత రికార్ట్ (124 రోజుల 10 గంటల 50 నిమిషాలు)ను విల్కాక్స్ బ్రేక్ చేసింది.‘ఇదొక అద్భుత రికార్డ్’ అనడంతో΄ాటు ‘ఇప్పుడు నేను విల్కాక్స్ కు అభిమానిగా మారి΄ోయాను’ అంటుంది జెన్నీ గ్రాహం.విల్కాక్స్ ‘ప్రపంచ సైకిల్ యాత్ర’ విషయానికి వస్తే...రోజుకు 14 గంటల ΄ాటు రైడ్ చేసేది. ప్రయాణానికి ముందు రకరకాల జాగ్రత్తలు తీసుకుంది. అందులో బరువు తగ్గడం కూడా ఒకటి. ‘ఈ యాత్రలో ఆహ్లాదమే తప్ప కష్టమని ఎప్పుడూ అనిపించలేదు’ అంటుంది విల్కాక్స్. ‘ఆహ్లాదంగా అనిపించింది’ అనేది ఆమె మనసు మాట అయినప్పటికీ భౌతిక పరిస్థితులు వేరు. ఎన్నోసార్లు ప్రతికూల వాతావరణం వల్ల విల్కాక్స్ ఇబ్బంది పడింది. ప్రయాణం మొదలు పెట్టిన 4వ రోజే వర్షంలో చిక్కుకు΄ోయింది. సైకిల్ టైర్ ఎన్నోసార్లు పంక్చర్ అయింది. కొన్నిసార్లు అనారోగ్యానికి గురైనప్పటికీ అంతలోనే కోలుకొని సైకిల్ చేతిలోకి తీసుకునేది. తాను ఏ రోజు ఎక్కడ ప్రయాణిస్తున్నాను అనేది సోషల్ మీడియా ద్వారా ప్రకటించేది. దీనివల్ల వందలాది మంది ఆమెను అనుసరిస్తూ ఉత్సాహపరిచేవారు. ఇది తనని ఒంటరితనం నుంచి దూరం చేసేది.‘అద్భుతమైన శారీరక, మానసిక దృఢత్వం ఆమె సొంతం’ అంటూ సైక్లింగ్ వీక్లి మ్యాగజైన్ ఎడిటర్ మారిజ్ రూక్ విల్కాక్స్ను ప్రశంసించారు.ఒక లక్ష్యం నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడే మరో కల కనడం విల్కాక్స్ అలవాటు. మరి నెక్ట్స్ ఏమిటి? అనే విషయానికి వస్తే... ఆమె ట్రాక్ రికార్డ్‌ను బట్టి చూస్తే అది పెద్ద లక్ష్యమే అనడంలో సందేహం లేదు. ఎవరీ వేదంగి కులకర్ణి?విల్కాక్స్ తాజా రికార్డ్ సందర్భంగా బాగా వినిపిస్తున్న పేరు వేదంగి కులకర్ణి. మన దేశానికి చెందిన ఆల్ట్రా సైకిలిస్ట్ వేదంగి కులకర్ణి ఇరవై ఏళ్ల వయసులో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డ్ సృష్టించింది. పుణెకు చెందిన కులకర్ణీ యూకేలో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ చదువుకుంది. దాదాపు ఆరేళ్ల తరువాత కులకర్ణీ మళ్లీ తెరపైకి వచ్చింది. దీనికి కారణం...ఆమె ప్రపంచ సైకిల్ యాత్ర. కులకర్ణీ కూడా తన రైడ్‌ను 108 రోజులలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆమె గత రికార్డ్ చూస్తే అదేమీ అసాధ్యం కాదు అనిపిస్తుంది. అందుకే విల్కాక్స్ తాజా రికార్డ్‌కు వేదంగి కులకర్ణీ నుంచి గట్టి ΄ోటీ ఉందని విశ్లేషకులు అంటున్నారు. -
చికాగోలో దిగ్విజయంగా నాట్స్ క్రికెట్ టోర్నమెంట్
చికాగో: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) చికాగోలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది. ఈ టోర్నమెంట్లో దాదాపు 150 మందికి పైగా క్రికెటర్లు తమ ప్రతిభను చాటేందుకు పోటీపడ్డారు. ఇక ఈ టోర్నీలో ఎస్ఆర్కె జట్టు చాంపియన్‌గా నిలిచింది. టోర్నమెంట్ ఆసాంతం అద్భుతంగా ఆడిన ఆటగాళ్లను, రన్నరప్‌గా నిలిచిన లయన్స్ టీంను నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి అభినందించారు.అదే విధంగా.. నాట్స్ చికాగో విభాగం ఈ క్రికెట్ టోర్నమెంట్‌ను చక్కగా నిర్వహించినందుకు నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేనికి, ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ కార్యవర్గ సభ్యుడు శ్రీహరీష్ జమ్ముల, చికాగో చాప్టర్ సమన్వయకర్త వీర తక్కెళ్లపాటి లు చక్కటి ప్రణాళిక, సమన్వయంతో ఈ టోర్నమెంట్ నిర్వహించారని స్థానిక తెలుగు వారి నుంచి ప్రశంసలు లభించాయి.కాగా ఈ టోర్నమెంట్ నిర్వహణలో చికాగో చాప్టర్ టీమ్ నుంచి నరేంద్ర కడియాల, అంజయ్య వేలూరు, చెన్నయ్య కంబాల, నవీన్ జరుగుల, సింధు కంఠంనేని, గ్రహిత బొమ్మిరెడ్డి, ప్రియాంక పొన్నూరు తదితరులు కీలక పాత్ర పోషించినందుకు నాట్స్ నాయకత్వం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ కార్యవర్గ సభ్యులు ఆర్కే బాలినేని, ఇమ్మాన్యుయేల్ నీల, నాట్స్ మాజీ కార్యవర్గ సభ్యుడు కృష్ణ నిమ్మగడ్డ, నాట్స్ మాజీ బోర్డ్ డైరెక్టర్లు మూర్తి కొప్పాక, శ్రీనివాస్ అరసాడ, శ్రీనివాస్ బొప్పన లు ఈ టోర్నమెంట్ విజయానికి తమ వంతు సహకారం అందించారు.సతీష్ త్రిపురనేని, పాండు చెంగలశెట్టి, అరవింద్ కోగంటి, సంతోష్ పిండి, సునీల్ ఆకులూరి, సునీల్ ఆరుమిల్లి, అరుల్ బాబు, వినోద్ బాలగురు, గోపి ఉలవ, శ్రీనివాస్ పిల్ల, సుమంత్ పోపూరి, సాయి, హరి, నాగ తదితర వాలంటీర్లు ఈ టోర్నమెంట్ విజయానికి కృషి చేసినందుకు నాట్స్ వారిని ప్రత్యేకంగా అభినందించింది. ఈ టోర్నమెంట్లో విజేతలకు నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి, నాట్స్ మాజీ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ అరసాడ టోర్నమెంట్ విజేతలకు, రన్నర్లకు ట్రోఫీలను అందజేశారు. -
Michelle Obama: అత్యంత అర్హురాలు హారిసే
షికాగో: ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకు నేతృత్వం వహించేందుకు అత్యంత అర్హురాలు, సమర్థురాలు కమలా హారిసేనని దేశ మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా అభిప్రాయపడ్డారు. ‘‘చాలామంది సగటు అమెరికన్ల మాదిరిగానే కమలా హారిస్‌ది కూడా మధ్యతరగతి నేపథ్యం. అక్కడినుంచి ప్రతి దశలోనూ నిరంతరం కష్టించి ఎదిగారు. తనను తాను మలచుకుంటూ ఉపాధ్యక్షురాలి స్థాయికి చేరుకున్నారు. అందుకే ఆమె కథ మీ కథ. నా కథ. మెరుగైన జీవితం కోసం కలలుగంటున్న అమెరికన్లందరి కథ!’’ అంటూ కొనియాడారు. షికాగోలో జరుగుతున్న డెమొక్రాట్ల జాతీయ కన్వెన్షన్‌లో మంగళవారం ఆమె ఆద్యంతం స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. హారిస్ రాకతో అమెరికాకు మెరుగైన భవితపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ‘‘అమెరికన్లందరికీ ఎదుగుదలకు అవకాశాలు దక్కేలా కమల నిరంతరం కృషి చేశారు. దేశం పట్ల తన నిబద్ధతను అలా చాటుకున్నారు. అంతే తప్ప ట్రంప్ మాదిరిగా జాతులపై విద్వేషం చిమ్మడం ద్వారానో, వ్యక్తులపై బురదజల్లడం ద్వారానో కాదు’’ అని రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యరి్థపై మిషెల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ట్రంప్ ప్రపంచం పట్ల విశాల దృష్టి లేని కురచ వ్యక్తి. బాగా చదువుకున్న, నిరంతరం కష్టించే స్వభావమున్న నల్లజాతీయులను చూస్తే ఆయనకు భయం’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘నన్ను, నా భర్త (మాజీ అధ్యక్షుడు) ఒరాక్ ఒబామాను ట్రంప్ ఎప్పుడూ ఆయన రాజకీయ మనుగడకే పెను ముప్పుగానే చూశారు. మేం అత్యంత విజయవంతమైన నల్లజాతి వ్యక్తులం కావడమే అందుకు కారణం’’ అని చెప్పుకొచ్చారు. కనుక హారిస్‌పై కూడా ట్రంప్ జాతి విమర్శలు, తప్పుడు ప్రచారాలు చేయడం ఖాయమన్నారు. వాటన్నింటినీ అమెరికన్లు తిప్పికొడతారని, హారిస్‌ను ప్రెసిడెంట్‌గా ఎన్నుకుని చరిత్ర సృష్టిస్తారని జోస్యం చెప్పారు. అయితే, ‘‘ఈసారి అధ్యక్ష ఎన్నిక అత్యంత హోరాహోరీగా సాగడం ఖాయం. చాలా రాష్ట్రాల్లో అతి తక్కువ ఓట్ల తేడాతో ఫలితాలు తారుమారు కావచ్చు. అందుకే భారీ సంఖ్యలో తరలిరండి. పార్టీ అభిమానాలను, రాగద్వేషాలను పక్కన పెట్టి కేవలం మీ మనస్సాక్షి ప్రకారం నడచుకోండి. అమెరికన్లు ప్రాణప్రదంగా భావించే స్వేచ్ఛను, మానవత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, హుందాతనాన్ని నిలబెట్టే హారిస్‌కే ఓటేయండి’’ అని అమెరికన్లకు పిలుపునిచ్చారు. ట్రంప్ రూపంలో మరో నాలుగేళ్ల అస్తవ్యస్త పాలనను నెత్తిన రుద్దుకునేందుకు అమెరికన్లు సిద్ధంగా లేరని, హారిస్‌ను ప్రెసిడెంట్‌గా ఎన్నుకుని కొత్త చరిత్ర సృష్టించనున్నారని బరాక్ ఒబామా అన్నారు. నల్లవాళ్లంటే ట్రంప్‌కు చులకన నల్లవాళ్లంటే ట్రంప్‌కు బాగా చిన్నచూపంటూ మిషెల్ మండిపడ్డారు. అసహ్యకరమైన స్త్రీ విద్వేష, జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం ఆయన నైజమన్నారు. ‘‘అందుకే ఆయన అమెరికా అధ్యక్షునిగా ఉన్న నాలుగేళ్ల కాలంలో నల్లజాతీయులంటే అందరికీ భయం కలిగించేందుకు ఎంతగానో ప్రయతి్నంచారు. నల్లజాతీయులు చేసే ఉద్యోగాలను బ్లాక్ జాబ్స్ అంటూ చులకనగా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ అర్రులుచాస్తున్న అమెరికా అధ్యక్ష పదవి కూడా బ్లాక్ జాబేనని ఆయనకు ఎవరు చెప్పాలి!’’ అంటూ ఎద్దేవా చేశారు. అమెరికా చరిత్రలో తొలి నల్లజాతి అధ్యక్షునిగా బరాక్ ఒబామా చరిత్ర సృష్టించడం తెలిసిందే.మా తల్లులు నేరి్పందదే ‘‘హారిస్ తల్లి, నా తల్లి సప్త సముద్రాలకు చెరోవైపున పుట్టి ఉండొచ్చు. కానీ వాళ్లు నిత్యం విశ్వసించిందీ, మాకు నిరంతరం నేరి్పంది ఒక్కటే. వ్యవస్థను విమర్శించే బదులు దాన్ని సరిచేసేందుకు మన వంతుగా శక్తివంచన లేకుండా కృషి చేయాలని’’ అని మిషెల్ అన్నారు. మిషెల్ ప్రసంగానికి డెమొక్రాట్ ప్రతినిధులంతా మంత్రముగ్ధులయ్యారు. ఆమె మాట్లాడటం ముగించిన చాలాసేపటిదాకా చప్పట్లతో అభినందించారు.హారిస్, నేను అలా కలిశాం: డగ్లస్ అమెరికన్లందరూ గరి్వంచేంత గొప్ప ప్రెసిడెంట్‌గా హారిస్ చరిత్రలో నిలిచిపోతారని ఆమె భర్త డగ్లస్ ఎమోఫ్ అభిప్రాయపడ్డారు. తనను తాను అమెరికా చరిత్రలో తొలి ‘సెకండ్ జంటిల్మన్ (ఉపాధ్యక్షురాలి భర్త)’గా సభకు పరిచయం చేసుకుని ఆకట్టుకున్నారు! 2013లో ఒక క్లయింట్ మీటింగ్ సందర్భంగా కమలతో తాను బ్లైండ్ డేట్‌కు వెళ్లడం, అది ప్రేమగా మారి, పెళ్లిగా పరిణమించిన వైనాన్ని ఆసక్తికరంగా వివరించారు. తొలి భార్యతో తనకు కలిగిన సంతానం కూడా కమలను ప్రేమగా మొమలా అని పిలుస్తారని డగ్లస్ వివరించారు. -
రానా గొప్ప మనసు.. అభిమాని కోసం ఏకంగా!
టాలీవుడ్ హీరో రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి చిత్రం భల్లాలదేవుని పాత్రలో ప్రేక్షకుల స్థిరస్థాయిగా నిలిచిపోయారు. ప్రస్తుతం రానా కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ మూవీ వెట్టయాన్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ తర్వాత రానా నాయుడు సీజన్-2లోనూ కనిపించనున్నారు. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్‌కు రీమేక్‌గా దీనిని రూపొందిస్తున్నారు.ప్రస్తుతం రానా అమెరికాలోని చికాగోలో పర్యటిస్తున్నారు. అక్కడే ఆయన బాక్సింగ్ షో ఈవెంట్లకు కామెంటేటర్‌గా వ్యవహరించనున్నారు. తాజాగా ఆయన ఓ అభిమాని కోసం ఏకంగా కారును ఆపి మరి పలకరించారు. తన కారు వెంట అభిమాని ఫ్యామిలీతో రావడం గమనించిన రానా.. రోడ్డు పక్కన కారు నిలిపి వారికి సర్ప్రైజ్ ఇచ్చారు. అక్కడే అతని ఫ్యామిలీతో, అభిమానులతో సరదాగా మాట్లాడుతూ ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Rana Daggubati ❤️ Diehard Fans (@ranadaggubatif) -
NRI: ఘనంగా.. 'నేషనల్ ఇండియా హబ్' ప్రారంభోత్సవం!
ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ కమ్యూనిటీ సెంటర్ గా నేషనల్ ఇండియా హబ్ ప్రారంభమైంది. అమెరికాలోని చికాగోలో పలువురు ప్రముఖుల సమక్షంలో నేషనల్ ఇండియా హబ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కాన్సుల్ జనరల్ సోమనాథ్ ఘోష్ ముఖ్య అతిథిగా హాజరై.. ప్రసంగించారు. ఇంద్రాణి ఫేమ్ అంకిత ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. తెలుగువారు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.నేషనల్ ఇండియా హబ్ గురించి వ్యవస్థాపకులు హరీష్ కొలసాని, వ్యవస్థాపక సభ్యులు కేకే రెడ్డి వివరించారు. అలాగే ఈ హబ్ ను స్థాపించటానికి గల కారణాలు కూడా వెల్లడించారు. 'Unite, Celebrate, Help Each Other' ప్రధాన సూత్రాలుగా ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు వివరించారు. నేషనల్ ఇండియా హబ్ ద్వారా అన్ని సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ లను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.ఇలా ఎక్కువ ఆర్గనైజేషన్స్ ఒకే రూఫ్ కిందకు రావటం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు చేసుకునే విషయం అన్నారు. ఈ సందర్భంగా సంస్థ చేపట్టే పలు సేవా కార్యక్రమాలను వివరించారు. ఎడ్యూకేషన్, హెల్త్ కేర్, CPR ట్రైనింగ్, ఇమిగ్రేషన్ వంటి ఎన్నో రకాల సేవ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.ఈ సంస్థను ప్రారంభించటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ కమ్యూనిటీ సెంటర్ గా నేషనల్ ఇండియా హబ్ ను ఏర్పాటు చేయటం పట్ల పలు సంఘాల నాయకులు, ప్రవాసులు అభినందించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.ఇవి చదవండి: -
చికాగోలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం ఆందోళనలో తల్లిదండ్రులు
అమెరికాలో తెలుగు విద్యార్థి అదృశ్యం కావడం కలకల రేపుతోంది. ఉన్నత విద్య కోసం చికాగో వెళ్లిన తెలంగాణకు చెందిన 25 ఏళ్ల రూపేష్ చంద్ర చింతకింది అదృశ్యం అయ్యాడు. అతని అచూకీ కోసం కుటుంబ సభ్యులు భారత రాయబార వర్గాలను సంప్రదించారు. చికాగోలోని ఎన్ షెరిడాన్ రోడ్ 4300 బ్లాక్ నుంచి అతను తప్పిపోయినట్లు తెలుస్తోంది. టెక్సాస్ నుండి కలవడానికి వచ్చిన ఒకరిని కలవబోతున్నాడని చెప్పినట్లు సమాచారం.‘‘మే 2 మధ్యాహ్నం వాట్సాప్‌లో మాట్లాడాను. ఏదో పని మీద ఉన్నా అని చెప్పాడు. అంతే అప్పటినుంచి ఆఫ్‌లైన్‌లో ఉన్నాడు" రూపేష్ తండ్రి సదానందం తెలంగాణలోని హన్మకొండకు చెందిన రూపేశ్ విస్కాన్సిన్ లోని కాంకార్డియా యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. వారం రోజులుగా రూపేశ్ ఆచూకీ లభించకపోవడంతో హైదరాబాద్‌లోఉంటున్న అతని తల్లిదండ్రలు ఆందోళనకు గురయ్యారు. తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలంటూ భారత విదేశాంగా శాఖను కోరింది. త్వరలోనే రూపేశ్ అచూకీ తెలుస్తుందని ఆశిస్తున్నామని చికాగోలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.The Consulate is deeply concerned learning that Indian student Rupesh Chandra Chintakindi is incommunicado since 2nd May. Consulate is in touch with the police and the Indian diaspora hoping to locate/reestablish contact with Rupesh.@IndianEmbassyUS @MEAIndia— India in Chicago (@IndiainChicago) May 8, 2024మే 2 నుంచి రూపేశ్ మిస్సయినట్లు చికాగోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపింది. అతడి ఆచూకి కోసం పోలీసులు ప్రవాస భారతీయులతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. రూపేష్ ఆచూకీ తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని స్థానిక పోలీసులు ప్రకటన విడుదల చేశారు. -
చికాగోలో ఘనంగా ఉగాది, శ్రీరామ నవమి వేడుకలు!
అమెరికా ఇల్లినాయిస్లోని చికాగోలో చికాగో తెలుగు అసోసీయేషన్(సీటీఏ) ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం చికాగోలోని బాలాజీ టెంపుల్ ఆడిటోరియంలో జరిగిది. ఈ వేడకలకు దాదాపు 500 మందికి పైగా హాజరయ్యారు. సీటీఏ కల్చరల్ డైరెక్టర్ శ్రీమతి సుజనా ఆచంట, ఈ కార్యక్రమానికి హాజరైన వారికి స్వాగతం పలకి, వేడుకను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ముఖ్యంగా కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య రూపాలు, శాస్త్రీయ సంగీతం, తెలుగు భాష స్కిట్లు ఎంతగానో అరించాయి. అలాగే ఉగాది పచ్చడి పోటీలు కూడా నిర్వహించారు. శోభా తమ్మన, జానకి నాయర్, ఆశా అడిగా, వనిత వీరవల్లి వంటి గౌరవనీయ గురువులు ఆధ్వర్యంలో దాదాపు వందమందికి పైగా పిల్లలు శాస్త్రీయ నృత్యాలు, సంగీతంతో అలరించారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో గురు రమ్య ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శించిన అనతి నీయారాతో సహా..ముగింపులో రవిశంకర్ మరియు అతని బృందం పాడిన 'భో శంభో', 'బ్రహ్మ ఒకటే' వంటి భక్తి పాటలు హైలెట్‌గా నిలిచాయి. ఈ ఈవెంట్‌కి అతిధులుగా సత్య, ఏటీఏకు చెందిన కడిమళ్ల, కరుణాకర్ మాధవరం తదితరులు విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో సీటీఏ కల్చరల్ కమిటీ సభ్యులు రాణి వేగే, సుజనా ఆచంట, అనిత గోలి, శ్రీ, చిట్టినేని, మధు ఆచంట, అనూష విడపలపాటి, ప్రత్యేక వాలంటీర్ల బృందం, సాయిచంద్ మేకల, భవానీ సరస్వతి, మాధవి తిప్పిశెట్టి, రత్న చోడ, వెంకట్ తొక్కాల,నాగభూషణ్ భీమిశెట్టి, పృద్వి సెట్టిపల్లి, సునీల్, రమేష్, నరేంద్ర, బాల, చక్రధర్, వివేక్ కిలారు, రామానుజం, శశిధర్, రమేష్, మృదుల, సీటీఏ బోర్డు సభ్యులు ప్రవీణ్ మోటూరు, రావు ఆచంట, శేషు ఉప్పలపాటి, అశోక్ పగడాల, ప్రసాద్ తాళ్లూరు, వేణు ఉప్పలపాటి, రాహుల్ విరాటపు, రమేష్ మర్యాల, తదితరులు కీలకపాత్ర పోషించారు. కాగా, సీటీఏ అధ్యక్షుడు నాగేంద్ర వేగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి, జయప్రదం చేయడంలో సహాయసహకరాలు అందించిన సీటీఏ బోర్డు సభ్యులకు వాలంటీర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: అమెరికా వాతావరణం కన్నా మేరా భారత్ మహాన్ !) -
చికాగో ఆంధ్ర అసోసియేషన్ పల్లె సంబరాలు!
చికాగో ఆంధ్ర అసోసియేషన్-సీఏఏ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. హిందు టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో ఆడిటోరియంలో జరిగిన పల్లె సంబరాలకు విశేష స్పందన వచ్చింది. సంస్థ అధ్యక్షురాలు శ్వేత, చైర్మన్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శ్రీ కృష్ణ, సంస్థ సభ్యుల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా పాల్గొని విజయవంతం చేశారు. కాన్సలేట్ జనరల్ ఆఫ్ ఇండియా సోమ్నాధ్ ఘోష్ ముఖ్య అతిధిగా విచ్చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించారు. విందు భోజనాన్నిఆహూతులందరికీ ఎంతో ఆప్యాయంగా వడ్డించారు. పిల్లలు-పెద్దలు పోటీలు పడి మరీ భోజనం వడ్డించారు. చిన్నారులకు తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను పరిచయం చేస్తూ వేడకలను ఘనంగా నిర్వహించారని పలువురు ప్రశంసించారు. (చదవండి: టెక్సాస్‌లో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్!) -
చికాగోలో ఘనంగా సంక్రాంతి, రిపబ్లిక్ డే వేడుకలు!
అమెరికాలోని చికాగోలో తెలుగువారు సంక్రాంతి, రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ‘ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్’ స్థానిక హిందూ టెంపుల్ ఆఫ్ లేక్ కౌంటీ ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ సంబరాలు అంబరాన్నంటాయి. సంస్థ అధ్యక్షుడు హేమంత్ పప్పు ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక అందంగా అలంకరించిన వేదిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించిన సంగీత, నాట్య కార్యక్రమాలు అలరించాయి. సంస్థ ప్రతినిధులు, సభ్యులు, వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం వినోదాత్మకంగా నడిపించారు. ఈ వేడుకల్లో 300 మందికిపైగా పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో వచ్చిన సభ్యుల నడుమ నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ వేడుకలను పురస్కరించుకుని స్థానిక కళాకారులచే ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమాలు ఆహుతులను ఉర్రూతలూగించాయి. ఇక ఈ వేడుకల్లో పాల్గొన్న పార్టిసిపెంట్స్‌కు పలువురు ప్రముఖులు సర్టిఫికెట్లు అందజేసి, ప్రోత్సహించారు. పలు సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ నిర్వహించిన ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ సభ్యులను పలువురు కొనియాడారు. ఇక ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల సంస్థ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సంస్థకు అండగా ఉంటూ సహాయసహాకారాలు అందిస్తున్న ప్రతిఒక్కరికీ నిర్వహకులు ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: ఫ్లోరిడాలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు) -
Chicago: ఉన్మాది కాల్పుల్లో ఏడుగురి మృతి!
స్ప్రింగ్ఫీల్డ్: తుపాకీ సంస్కృతి తమకు వద్దే వద్దంటూ అమెరికన్లు గళమెత్తుతున్నా.. యువత మాత్రం వదలడం లేదు. తాజాగా మరోసారి గన్‌కల్చర్ పంజా విసింది. సోమవారం చికాగో నగరంలో ఓ దుండగుడు రెండు వేర్వేరు చోట్ల జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు. ఆయుధాలతో పరారీలో ఉన్న ఆ ఉన్మాది కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇల్లానాయిస్ స్టేట్ చికాగో జోలియట్ ప్రాంతంలోని 2200 block of West Acres Roadలో సోమవారం ఈ ఘోరం జరిగింది. బాధిత కుటుంబాల ఇళ్లలోకి చొరబడి మరీ ఆ వ్యక్తి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఘటనల్లో రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానిక మీడియా ఛానెల్స్ చెబుతుండగా.. స్థానిక పోలీసులు మాత్రం మృతుల సంఖ్యపై స్పష్టత ఇవ్వలేదు. ACTIVE INCIDENT (UPDATED) JANUARY 22, 2024 3:00 PM At this moment, Detectives and Officers are conducting an active homicide investigation after Officers located multiple deceased individuals who had sustained gunshot wounds in two homes in the 2200 block of West Acres Road. pic.twitter.com/zOTKSjs0RC — Joliet Police Department (@JolietPolice) January 22, 2024 మరోవైపు నిందితుడిని 23 ఏళ్ల రోమియో నాన్స్‌గా ప్రకటించిన పోలీసులు.. బాధిత కుటుంబాలకు అతనికి పరిచయం ఉందని భావిస్తున్నారు. ఘటన తర్వాత కారులో ఆ యువకుడు పరారు అయ్యాడు. మరింత నరమేధం జరపకమునుపే అతన్ని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు ప్రయతిస్తున్నారు. స్థానిక పోలీసులతో పాటు ఎఫ్‌బీఐ సంబంధిత టాస్క్‌ఫోర్స్ ఆ ఉన్మాది కోసం గాలింపు చేపట్టాయి. -
అమెరికాలో విజయవాడ మెడికో మృతి
విజయవాడ: అమెరికాలో విజయవాడకు చెందిన ఓ యువతి దుర్మరణం చెందింది. ఉన్నత విద్య అభ్యసించడానికి వెళ్లిన ఆమె కారులో ప్రయాణిస్తూ అనూహ్యంగా ప్రాణాలు పొగొట్టుకున్నట్లు తెలుస్తోంది. విజయవాడ రూరల్ ప్రసాదంపాడుకు చెందిన షేక్ జహీరా నాజ్ (22) నగరంలోని ఓ కళాశాలలో ఫిజియోథెరపీ డిగ్రీ చేశారు. ఈ ఏడాది ఆగస్టులో ఎంఎస్ చేయడానికి అమెరికాలోని షికాగోకు వెళ్లారు. బుధవారం కారులో ప్రయాణిస్తుండగా గ్యాస్ లీకవడంతో డ్రైవర్‌తో పాటు జహీరా నాజ్ స్పృహ తప్పారు. వెంటనే వాళ్లను ఆసుపత్రికి తరలించగా.. జహీరా మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆమె మృతికి సంబంధించి వైద్య నివేదికపై స్పష్టత రావాల్సి ఉంది. -
మాట చికాగో చాప్టర్ కిక్ ఆఫ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్
-
తప్పనిసరి పరిస్థితుల్లో అతడికి బ్రెస్ట్ ఇంప్లాంట్..!
ఇంతవరకు మహిళలు తమ అందం కోసం లేదా ఇతర కారణాల వల్ల బ్రెస్ట్ ఇంప్లాంట్ చేయాల్సి వస్తుంటుంది. కానీ ఇలా ఓ మనిషి ప్రాణాన్ని రక్షించడానికి కూడా ఓ వ్యక్తికి బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ చేయాల్సి వచ్చింది. వైద్య చరిత్రలోనే తొలిసారిగా ఇలాంటి ప్రక్రియను నిర్వహించారు. ఇంతకీ ఎందువల్ల ఇలా చేశారు ఏంటీ ? తదితరాల గురించి చూద్దాం! అమెరికాలో సెయింట్ లూయిస్‌కు చెందిన 34 ఏళ్ల డేవీ బాయర్ తనకున్న చెడు అలవాట్ల కారణంగా రెండు ఊపిరితిత్తులు దారుణంగా పాడైపోయాయి. ఎంతలా అంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్కి గురై చీముతో నిండి ఉన్నాయి. అతడు 21 ఏళ్ల వయసు నుంచే రోజూకి ఒక సిగరెట్ ప్యాకెట్ తాగేసేవాడు. ఆ దురఅలవాటే అతడి ఊపిరితిత్తులను పూర్తిగా హరించేశాయి. చివరికి తీవ్రమైన ఫ్ల్యూతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు. పలు వైద్య పరీక్షలు చేయగా అతని ఊపిరితిత్తులు దారుణంగా పాడైనట్లు గుర్తించారు. దీంతో ఎంత వరకు ఇన్ఫెక్షన్కు గురయ్యాయని ఎక్స్‌రే తీసి చూడగా..ఇంకేమి మిగిలి లేదని తేలింది. ఆ ఊపిరితిత్తులు పూర్తిగా ద్రవంలా మారిపోవడం ప్రారంభించాయని గుర్తించారు. దీంతో అతడికి తక్షణమే ఊపిరితిత్తుల మార్పిడి చేయక తప్పదని నిర్ణయించారు వైద్యులు. ఇదొక్కటే మార్గమని లేకపోతే ప్రాణాలతో రక్షించటం అసాధ్యమని అతనికి తెలిపారు. అతని ఇన్ఫెక్షన్ క్లియర్ చేసేలా రెండు ఊపిరితిత్తులను తొలగించి కృత్రిమ ఊపిరితిత్తులను (ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ లేదా ECMO, అవసరమైన వారికి శ్వాసకోశ మద్దతులో భాగంగా) ఉపయోగించారు. అదే టైంలో అతని గుండె పదిలంగా ఉండి సజీవంగా ఉండాలంటే..ఛాతీ కుహరంలో డీడీ బ్రెస్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయక తప్పలేదు. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..అతని ప్రాణాలను రక్షించడం కోసం వైద్య సదుపాయంలోనే తొలిసారిగా ఇలాంటి ప్రక్రియ నిర్వహించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. (చదవండి: పేషెంట్‌కి చికిత్స అందిస్తూ..అంతలో వైద్యుడు..) -
చికాగోలో బతుకమ్మ, దసరా సంబరాలు
-
బిల్డింగ్‌ను ఢీకొని 1000 పక్షులు ఎందుకు మృతిచెందాయి? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
అమెరికాలోని చికాగోలో ఇటీవల ఒక్కరోజులో 1000 పక్షులు మృతి చెందడం సంచలనం కలిగించింది. ఆ పక్షులు శీతాకాలపు వలస కోసం దక్షిణ అమెరికా మైదానాలకు తరలివెళ్లాయి. అక్కడి నుండి ఉత్తర అమెరికాకు తిరిగి వస్తుండగా, చికాగోలోని మెక్కార్మిక్ ప్లేస్ సమీపంలో ఒకటిన్నర మైళ్ల వ్యాసార్థంలో పక్షులు చనిపోయి కుప్పలుగా పడిపోయాయి. స్థానికులు ఆ పక్షులకు ఆసుపత్రులకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు వాటి మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. పక్షులు ఇలా చనిపోవడానికి కారణం అవి భవనాన్ని ఢీకొని కింద పడిపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా చికాగో బర్డ్ కొలిజన్ మానిటర్స్ డైరెక్టర్ అన్నెట్ ప్రిన్స్ మాట్లాడుతూ భవనం సమీపంలో పక్షులు నేలకొరిగాయని తెలిపారు. వీటిలో మృతిచెందిన, గాయపడిన పక్షులు ఉన్నాయి. దాదాపు 1.5 మిలియన్ పక్షులు ఇక్కడి నుంచి వలస వెళుతుంటాయి. వీటిలో టేనస్సీ వార్బ్లెర్స్, హెర్మిట్ థ్రష్‌లు, అమెరికన్ వుడ్‌కాక్స్, ఇతర రకాల సాంగ్‌బర్డ్‌లు ఉంటాయి. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ అంటారియోలో కిటికీలకు తగిలి చనిపోయే పక్షులపై పరిశోధన చేసిన బ్రెండన్ శామ్యూల్స్.. కిటికీకి తగిలిన ప్రతి పక్షి చనిపోదని చెప్పారు. పక్షుల మరణాలకు గాలి, వర్షం, పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు కారణం కావచ్చన్నారు. అమెరికన్ బర్డ్ కన్జర్వెన్సీకి చెందిన బ్రియాన్ లెంజ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఒక బిలియన్ పక్షులు గాజు కిటికీలను ఢీకొనడంతో చనిపోతున్నాయన్నారు. పక్షులు అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూసినప్పుడు, భయపడి కిందపడి చనిపోతాయన్నారు. ఇటువంటి సందర్భాల్లో కొన్ని పక్షులు గాయపడతాయన్నారు. భవనాల లైట్లు స్విచ్ ఆఫ్ చేయడం పక్షుల మరణాలను తగ్గించడానికి ఒక మార్గంమని పేర్కొన్నారు చికాగోలో పక్షుల మరణాలపై 2021లో జరిపిన ఒక అధ్యయనంలో పెద్ద భవనాల్లో సగం లైట్లు ఆఫ్ చేయడం వల్ల పక్షుల ఢీకొనడం 6 నుంచి 11 రెట్లు తగ్గుతుందని తేలింది. ఇది కూడా చదవండి: బ్రిటన్ ధూమపాన రహితదేశం కానుందా? -
చికాగోలో రోడ్లపై తిరుగుతున్న హైదరాబాదీ మహిళకు ఉపశమనం
వాషింగ్టన్: గతనెల చికాగో వీధుల్లో అత్యంత దయనీయ పరిస్థితుల్లో కనిపించిన హైదరాబాదీ యువతికి వైద్య సదుపాయాన్ని కల్పించడం తోపాటు ఆమెను తిరిగి భారత దేశానికి పంపడానికి తగిన ఏర్పాట్లు చేసింది చికాగోలోని భారత ఎంబసీ. ఈ విషయాన్ని బాధితురాలి తల్లికి తెలియజేశామని ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపింది. హైదరాబాద్‌కు చెందిన సైదా లులు మిన్హాజ్ జైదీ డెట్రాయిట్‌లోని ట్రైనీ (TRINE) విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించడానికి అమెరికా వెళ్లింది. కానీ అక్కడ ఆమె వస్తువులను దుండగులు దొంగిలించడంతో దిక్కుతోచని స్థితిలో చికాగో వీధుల్లో తిరుగాడుతూ కనిపించింది. అత్యంత దీనావస్థలో తినడానికి తిండిలేక దయనీయ స్థితిలో ఉండిపోయిన ఆమెను గురించి తెలంగాణలోని మజ్లీస్ బచావో తెహ్రీక్ పార్టీ నేత అజ్మద్ ఉల్లా ఖాన్ బాధితురాలి తల్లి రాతపూర్వకంగా చేసిన విజ్ఞప్తిని ట్విట్టర్ ద్వారా కేంద్ర విదేశాంగ శాఖ దృష్టికి తీసుకొచ్చారు. అజ్మద్ ఉల్లా ఖాన్ ట్వీట్‌కు స్పందిస్తూ కేంద్ర విదేశాంగమంత్రి జైశంకర్ వెంటనే విషయాన్ని చికాగోలోని భారత ఎంబసీ దృష్టికి తీసుకుని వెళ్ళగా అక్కడివారు ఆమెను కనుగొని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రయాణించే పరిస్థితుల్లో లేదని ముందు తనకు వైద్యం అవసరమని తెలిపిన యూఎస్ ఎంబసీ ట్రీట్మెంట్ పూర్తైన తర్వాత ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడిందని తెలిపింది. దీంతో సైదాను తిరిగి భారత్ పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతూ అనే తల్లికి సమాచారమందించారు ఎంబసీ అధికారులు. ఇది కూడా చదవండి: యూట్యూబర్ నిర్వాకం.. రణరంగంగా మారిన న్యూయార్క్ వీధులు.. -
హృదయ విదారకం.. చికాగో రోడ్లపై దీనస్థితిలో హైదరాబాద్ మహిళ
ఉన్న ఊరు, దేశం విడిచి విదేశాల్లో సెటిల్ కావాలనే కోరిక కలిగిన వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉన్నత చదువుల కోసం, బెటర్ లైఫ్, లగ్జరీగా బతకాడనికి చాలా మంది విదేశాల బాటపడుతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, దుబాయ్, యూకే, సింగపూర్ అంటూ ఎంచక్కా ఎగిరిపోతున్నారు. అయితే పుట్టి పెరిగిన ప్రాంతాన్ని కాదని ముక్కు ముహం తెలియని దేశంలో జీవించడం అంత సులభం కాదు. ఏ ఆపద, కష్టం, విపత్తు ఎదురైనా అండగా నిలిచేందుకు ఎవరూ ఉండరు. తాజాగా అలాంటి ఓ దుర్భర పరిస్థితే హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లిన మహిళకు ఎదురైంది. ఎంఎస్ చదవడానికి యూఎస్ వెళ్లిన యువతి చికాగో రోడ్లపై దీనస్థీతిలో కనిపించింది. హైదరాబాద్‌కు చెందిన ‘సైదా లులు మిన్హాజ్ జైదీ’ మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ ట్రైనీ (TRINE) విశ్వవిద్యాలయంలో ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లింది. అయితే ఆమె వస్తువులన్నీ ఎవరో దుండగులు దొంగిలించారు. దీంతో ప్రస్తుతం ఆమె చికాగోలోని రోడ్లపై ఆకలికి అలమటిస్తూ దయనీయ స్థితిలో తిరుగుతోంది. ఆమె పరిస్థితిని తెలంగాణకు చెందిన మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) పార్టీ అధికార ప్రతినిధి అమ్జెద్ ఉల్లా ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్టులో యువతి తన పేరు, వివరాలు తెలియజేస్తున్న వీడియో కూడా ఉంది. అయితే ఆమె బక్కచిక్కిపోయి, తినడానికి ఏమి లేని పరిస్థితుల్లో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లి వహాజ్ ఫాతిమా తీవ్రంగా విలపిస్తున్నారు. ఈ మేరకు విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ రాశారు. కూతురుని తిరిగి ఇండియాకు తీసుకొచ్చేందుకు తమకు సాయం చేయాలని అర్థించారు. చదవండి: మొబైల్ చూస్తూ జారిపడ్డ ప్రధాని.. తలకు తీవ్ర గాయం Syeda Lulu Minhaj Zaidi from Hyd went to persue MS from TRINE University, Detroit was found in a very bad condition in Chicago, her mother appealed @DrSJaishankar to bring back her daughter.@HelplinePBSK @IndiainChicago @IndianEmbassyUS @sushilrTOI @meaMADAD pic.twitter.com/GIhJGaBA7a — Amjed Ullah Khan MBT (@amjedmbt) July 25, 2023 తల్లి రాసిన లేఖలో.. ‘హైదరాబాద్‌లోని మౌలాలీకి చెందిన మిన్హాజ్ జైదీ ఆగస్టు 2021లో డెట్రాయిట్‌లోని ట్రైనీ( TRINE) యూనివర్సిటీలో మాస్టర్స్ చేసేందుకు యూఎస్ వెళ్లింది. తరుచూ మాతో టచ్‌లోనే ఉంది. కానీ గత రెండు నెలలుగా తనతో సంబంధాలు తెగిపోయాయి. అయితే నా కూతురు డిప్రెషన్లో ఉందని, ఆమె సామాన్లు ఎవరో దొంగిలించారని ఇద్దరు హైదరాబాద్ యువకుల ద్వారా మాకు తెలిసింది. చికాగో రోడ్లపై నిరాశ్రయురాలిగా నా కూతురు కనిపించింది. దయచేసి తక్షణమే జోక్యం చేసుకుని, నా కుమార్తెను వీలైనంత త్వరగా తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని యూఎస్‌లోని భారత రాయబార కార్యాలయం, చికాగోలేని ఇండియన్ కాన్సులేట్‌ను కోరుతున్నాను’ అని పేర్కొంది. మహిళ విజ్ఞప్తిపై చికాగోలోని భారత కాన్సులేట్ స్పందించింది. సయ్యద్ లులు మిన్హాజ్ కేసు గురించి ఇప్పుడే తెలుసుకున్నామని, దీనిపై వివరాలు తెలుసుకుంటున్నామని తెలిపింది. కాగా మదద్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదైందని, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. -
తుపాకి పేలడంతో భార్య మృతి.. అతనేం చేశాడంటే..
వాషింగ్టన్: అమెరికాలో ఒకే నెలలో ఒకే తరహా మరణాలు రెండు చోటుచేసుకున్నాయి. ఇదే నెలలో తుపాకీతో ఆడుకుంటూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కి మూడేళ్ళ తన చిట్టి చెల్లిని చేజేతులా చంపుకున్నాడు ఓ బుడతడు. ఆ సంఘటన ఇంకా మరువక ముందే అచ్చంగా అలాగే తన తుపాకీని తుడుచుకుంటూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కి తన భార్యను హతమార్చాడు మరో అభాగ్యుడు. వెంటనే అచేతన స్థితికి వెళ్ళిపోయిన అతడు స్పృహలోకి వచ్చిన తర్వాత తాను ఎంతటి దారుణానికి ఒడిగట్టాడో అర్ధం చేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డాడు. చికాగోకు చెందిన సిమియోన్ హెన్డ్రిక్సన్(61) తుపాకులు కాల్చడంలో శిక్షణనిస్తూ ఉంటాడు. జులై 15న తీరిక దొరికడంతో ఇంటిలోని తుపాకులను శుభ్రం చేసే పనికి ఉపక్రమించాడు. కానీ దురదృష్టవశాతూ ఒక తుపాకి తన చేతిలోనే పేలిపోయింది. ఆ తుపాకీ లోంచి వెళ్లిన బుల్లెట్ అక్కడే ఉన్న అతని భార్య లారీ హెన్డ్రిక్సన్(60) తలకు తగలడంతో ఆమె ఉన్నచోటనే కుప్పకూలింది. విభ్రాంతికి గురైన సిమియోన్ కొద్దీ సేపటికి తేరుకుని జరిగిన దారుణాన్ని తలచుకుని కుమిలిపోయి తుపాకిని తనవైపు ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు. తుపాకీ పేలుళ్ల చప్పుడుకి చుట్టుపక్కలవారు సమాచారమిచ్చారో లేక స్వయంగా సిమియోనే చెప్పాడో స్పష్టత లేదని చెప్పిన పోలీసులు విషయం తెలియగానే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు. సిమియోన్ అక్కడికక్కడే చనిపోగా అతని భార్య లారీ మాత్రం కోన ఊపిరితో ఉండగా ఆసుపత్రికి తరలించగా ఆమె అక్కడ చికిత్స పొందుతూ చనిపోయినట్లు తెలిపారు చికాగో పోలీసులు. తల్లిదండ్రులను ఒకేసారి కోల్పోవంతో వారి ఒక్కగానొక్క కుమారుడు డెరెక్ హెన్డ్రిక్సన్ శోకతప్త హృదయంతో పేస్ బుక్ లో విచారాన్ని వ్యక్తం చేస్తూ.. "వారిని అందరూ ఎంతగానో ప్రేమించి, అభిమానించేవారు. వారు ఎప్పటికీ గొప్ప తల్లిదండ్రులుగా మిగిలిపోతారు." అని రాశాడు. ఇది కూడా చదవండి: కంపెనీ డబ్బులు రూ.21 లక్షలు కొట్టేసి ఏం చేశాడో తెలుసా? -
14న చికాగోలో ఓయూ ఫౌండేషన్ డే
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని చికాగో నగరంలో ఈ నెల 14న ఉస్మానియా యూనివర్సిటీ ఫౌండేషన్ డే నిర్వహించనున్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు. ఓయూ అలూమ్ని ఆఫ్ చికాగో ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి అమెరికా పర్యటనలో ఉన్న వీసీ ప్రొఫెసర్ రవీందర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. శనివారం ఉత్తర అమెరికా ఉస్మానియా అలూమ్ని బోస్టన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీసీ రవీందర్ పాల్గొని 21 అంశాలతో ఓయూలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించినట్లు అధికారులు విడుదల చేసి ప్రకటనలో పేర్కొన్నారు. (క్లిక్: పంచతత్వ పార్కు.. ఆకర్షణ, ఆరోగ్యం దీని ప్రత్యేకత) -
ఆటా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
షికాగో: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా), షికాగో టీం ఆధ్వర్యంలో అరోరా బాలాజీ టెంపుల్ ప్రాంగణంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఇల్లినాయిస్ 11 వ డిస్ట్రిక్ట్ కాంగ్రెసు మాన్ బిల్ ఫాస్టర్ ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో ౩5౦ మందికి పైగా తెలుగు వారు పాల్గొన్నారు. మంగళ వాయిద్యాల మధ్యన కాంగ్రెస్ మాన్ బిల్ ఫాస్టర్ జ్యోతి ప్రజ్వాలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాలో ఇంజనీరింగ్, మెడికల్, వ్యాపార రoగాలలో తెలుగు వారు ఎంతో ప్రాముఖ్యాన్ని సాధించారన్నారు. మిలియన్‌కి పైగా జనాభా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో ఉత్సాహంతో తమ సంస్కృతి, పండుగలు అమెరికాలో నిర్వహించడం శ్లాఘనీయమన్నారు. బతుకమ్మ, దసరా వేడుకలను పురస్కరించుకుని మహిళలు, పిల్లలు సంద్రయాద దుస్తులు ధరించి బతుకమ్మ ఆట పాటలతో సందడి చేసారు. కోలాటం, డోలు వాయిద్యాల హోరు మధ్య వేడుకలు ఘనంగా జరిగాయి. జమ్మి పూజ నిర్వహించి అందరికి ప్రసాదాలు అందించారు. ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ మధు బొమ్మినేని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకి దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియచేసారు. ఆటా బోర్డు అఫ్ ట్రస్టీ డాక్టర్ మెహర్ మేడవరం, ఆటా ట్రెజరర్, ట్రస్టీ సాయినాథ్ రెడ్డి బోయపల్లి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆటా ఆఫీస్ కోఆర్డినేటర్ మహీధర్ ముస్కుల తోడ్పాటుని అందించారు. రీజినల్ కోఆర్డినేటర్స్ వెంకట్రామిరెడ్డి రావి, వెంకటేశ్వర రామిరెడ్డి, సుచిత్ర రెడ్డిలు సహకారం అందించారు. వీరితో పాటు చల్మారెడ్డి బండారు, వెంకట్ థుడి, మహిపాల్ వంఛ, భాను స్వర్గం, నరసింహ చిత్తలూరి, లక్ష్మి బోయపల్లి, కరుణాకర్ దొడ్డం, అమరేంద్ర నెట్టం, రమణ అబ్బరాజు, సతీష్ యెల్లమిల్లి, విశ్వనాధ్ చిత్ర, హరి రైని, జగన్ బుక్కరాజు, భీమి రెడ్డిలు కూడా తమ వంతు కృషిని అందించారు. -
షికాగోలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
-
యాంకర్ సుమకు అమెరికాలో అరుదైన సత్కారం
చికాగో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చికాగోలోని ట్రై-స్టేట్ తెలుగు అసోసియేషన్(టీటీఏ) ఆధ్వర్యంలో యాంకర్ సుమ కనకాలతో ‘సుమతో సందడి’ అనే కార్యక్రమాన్ని అమెరికాలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అమెరికా నలుమూలలా ఉన్న మహిళలతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీటీఏ సంస్థ అధ్యక్షురాలు అపర్ణ అయ్యలరాజు ఈ కార్యక్రమ ప్రారంభోపన్యాసం చేస్తూ సంస్థ భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. దాదాపు రెండు వందల మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో మహిళలు కూడా తమ మాటల్లో, పాటల్లో, చేతల్లో ఎంతో సృజనాత్మకతను చూపారు. మూడు గంటల పాటు జరిగిన ‘సుమతో సందడి’ లో ప్రశ్నలు-సమాధానాలు అనే పోటీ కార్యక్రమాన్ని యాంకర్ సుమ తనదైన శైలి, సమయస్ఫూర్తితో ఆద్యంతం రక్తికట్టించారు. ఈ సందర్భంగా ట్రై-స్టేట్ అసోసియేషన్ తెలుగు ప్రజల తరఫున సుమకు ‘సకల కళాభినేత్రి’ అనే బిరుదు ఇచ్చి సత్కరించారు. అరవై నాలుగు కళల్లో వినోదం ఒక కళ అయితే, వినోద పరచడంలో అరవై నాలుగు కళలను ప్రదర్శించే సుమకు ఈ బిరుదు ఇవ్వటం గౌరవ ప్రదంగా భావిస్తున్నామని సంస్థ సమన్వయకర్త ప్రణతి కలిగోట్ల అన్నారు. చివరలో సంస్థ తరపున, ప్రణతి కలిగోట్ల వందన సమర్పణ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రవి వేమూరి, రాధిక గరిమెళ్ళ, రాజేంద్ర రెడ్డి, దిలీప్ రాయలపూడి, రామకృష్ణ కొర్రపోలు, 13 ఏళ్ల వేమూరి రిషి కార్తీక్‌లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: సందీప్ వంగ డైరెక్షన్లో మహేష్! జో బైడెన్‌కు కిమ్ సోదరి స్ట్రాంగ్ వార్నింగ్ -
ఇప్పుడు మహారాజుల్లా తిరిగేస్తున్నాయి
-
‘తెలుగు భాష విదేశాల్లోనే వెలుగు చూస్తోంది’
చికాగో: వర్తమాన ఆంధ్ర దేశంలో రాజకీయ వేత్తగా, ప్రభుత్వ ఉద్యోగిగా, ప్రజాసేవకుడు, గాంధీతత్త్వ ప్రచారకునిగా, రచయిత, సంపాదకునిగా సమున్నత స్థానాన్ని సంపాదించుకున్న మండలి బుద్ధ ప్రసాద్‌ను చికాగోలోని భారతీ తీర్థ సంస్థ ఘనంగా సన్మానించింది. సేవా భారతి బిరుదను ప్రదానం చేసింది. అక్టోబర్ 2 మహత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయన చికాగోలో జరుగుతున్న పలు సభలలో పాల్గొన్నారు. ఈ క్రమంలో చికాగోలోని భారతీ తీర్థ సంస్థ ఆయనను ఆహ్వానించింది. సంగీత సాహిత్య రంగాలలో పేరు పొందిన చికాగో వాసి డాక్టర్ శొంఠి శారదా పూర్ణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా.. అమెరికాలో వివిధ రంగాల్లో సేవలందిస్తూ పేరు పొందిన డా. తాతా ప్రకాశం ‘సేవా భారతి’ బిరుదును ఆయనకు అందించారు. అనంతరం ప్రముఖ భాషావేత్త కోరాడ రామకృష్ణయ్య, ప్రపంచ భాషావేత్తలలో ఉత్తమ స్థానం పొందిన ప్రొఫెసర్ డా. కోరాడ మహాదేవ శాస్త్రి, గాంధేయవాది, సంఘ సంస్కర్త, స్వాతంత్రోద్యమవాది ఆనంద మార్గ అధ్యక్షులు డా సుసర్ల గోపాల శాస్త్రి, ప్రముఖ సాహితీవేత్త విజయనగర విఖ్యాత తాతా సుబ్బరాయ శాస్త్రి తదితరులు ఈ సన్మాన సభలో ప్రసంగించారు. అనంతరం మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ.. అమెరికాలో తెలుగు వారు చేస్తున్న సాంఘిక, రాజకీయ, సాహిత్య సేవలను ఆయన అభినందించారు. తెలుగు భాష విదేశాల్లోనే వెలుగు చూస్తోందని పేర్కొన్నారు. కాగా ఆంధ్ర దేశానికి చెందిన ‘నియోగి’ 111మంది విశిష్ఠ వ్యక్తుల గురించి రాసిన ‘అక్షర నక్షత్రాలు’గ్రంథాన్ని ఈ కార్యాక్రమంలో ఆవిష్కరించారు. గ్రంథ ఆవిష్కరణ తర్వాత తాజా మాజీ అధ్యక్షులు డా. జంపాల చౌదరి, చికాగో తెలుగు సాహితీ అధ్యక్షులు జయదేవ రెడ్డి, స్వప్నా వ్యవస్థాపక అధ్యక్షులు డా. శొంఠితో పాటు ప్రముఖులు ప్రసంగించారు. అనంతరం మిస్ జూడిత్ మండలి బుద్ధ ప్రసాద్‌కు ప్రత్యేక గుర్తింపు ప్రశంస పత్రాన్ని అందించగా. నేపర్విల్ అక్టోబర్ 26, 2019ని ప్రత్యేక రోజుగా గుర్తిస్తూ ఆయన పేరు మీద గుర్తింపు పంత్రాన్ని అందజేశారు. -
గడ్డకట్టిన అమెరికా సూపర్ ఫోటోలు చూడండి
-
చికాగోలో ఘనంగా 'కళా ఉత్సవ్' వేడుకలు
చికాగో : కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 'కళా ఉత్సవ్' ఐదో సాంస్కృతిక వార్షికోత్సవ వేడుకలు చికాగోలో ఘనంగా జరిగాయి. 205 ఈస్ట్ రాన్‌డాల్ఫ్ వీధిలోని హారిస్ థియేటర్లో భారతీయ వారసత్వ కళలు, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా కళా ఉత్సవ్ కార్యక్రమం జరిగింది. అమెరికాలోని వివిధ ప్రాంతాల్లోని డ్యాన్స్ స్కూల్లకు చెందిన భారతీయ కళాకారులు తమ ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ఏడాది 'కుల్ జా సిమ్ సిమ్' థీమ్‌తో కళా ఉత్సవ్ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా మానవత్వ విలువలపై దృష్టిసారించారు. నిజాయితీ, ధైర్యం, నిజం, ప్రేమ, క్షమాగుణం, అధికారం, శాంతి, ఆనందం, గౌరవం, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛల వంటి అంశాలు ఇతివృత్తంగా ప్రదర్శనలు ఇచ్చారు. కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా నీతా భూషణ్ కళా ఉత్సవ్ 2018 ని ప్రారంభించారు. ఛైర్మన్ ఆఫ్ ఢిల్లీ కమిటీ ఆఫ్ చికాగో సిస్టర్ సిటీస్ ఇంటర్నేషనల్ స్మితా షా, ఛైర్మన్ ఆఫ్ రెడ్ బెర్రీ ఫౌండేషన్ దీపక్ కాంత్ వ్యాస్, ఎఫ్ఐఏ వ్యవస్థాపక అధ్యక్షులు రోహిత్ జోషి, యూనైటెడ్ సీనియర్ పరివార్, కీర్తి రావూరిలతో పలువురు ఈ వేడుకలకు హాజరయ్యారు. హెల్త్ కన్సల్టింగ్ సంస్థ డైరెక్టర్ ఆఫ్ టెక్నాలజీ జిగర్ షా 2018 కళా ఉత్సవ్ కి కల్చరల్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆయనతో పాటూ డా. ప్రేరణ ఆర్య వేడుకల సన్నదంలో తన వంతు కృషి చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు వేయి మందికి పైగా ఎన్‌ఆర్‌ఐలతోపాటూ అమెరికన్లు పాల్గొన్నారు. మొత్తం 19 గ్రూపులు పాల్గొన్న పోటీల్లో నాట్యా డ్యాన్స్ థియేటర్ వారి త్రిశక్తి భరతనాట్యం గ్రూప్ మొదటి బహుమతి, కళాపద్మ డ్యాన్స్ అకాడమీ వారి నిర్భయ కాళీ గ్రూప్‌కు రెండో బహుమతి, ఐ రాధా గ్రూప్, రాస్ గార్బా గ్రూప్‌కు మూడో బహుమతి దక్కింది. -
షికాగో సెక్స్ రాకెట్ కేసుతో తానాలో కలకలం
-
సీఏఏ ఆధ్వర్యంలో వనభోజనాలు
చికాగో : చికాగో ఆంధ్రా అసోసియేషన్(సీఏఏ) ఆధ్వర్యంలో వేసవి వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. రుచికరమైన తెలుగు వంటకాలతో ఆట పాటలతో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ కలిసి మేలిసి ఈ వనభోజన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చికాగోలో శాంబర్గ్ లోని బస్సే పార్క్‌లో ఉదయం 11 గంటల నుంచి, సాయంత్రం 6 వరకు జరిగిన ఈ వనభోజనాల్లో తెలుగు వారందరు ఆత్మీయంగా కలుసుకొని విందు భోజనాలని ఆరగించారు. డా. ఉమ కటికి అధ్యక్షతన చికాగో ఆంధ్రా సంఘం వారు, వారి సాంప్రదాయాన్ని కొనసాగిస్తు, ఈ ఏడాది కూడా అరిటాకులలో వడ్డించడం అందరిని ఆకట్టుకుంది. చికాగోలోని తమ పిల్లలతో గడపాలని ఆంధ్ర నుంచి వచ్చిన తల్లిదండ్రులు సీఏఏ వారి ఆత్మీయతకి అబ్బురపడ్డారు. ఆంధ్రాలోనే బఫెట్ పద్ధతికి అలవాటు పడుతున్న రోజుల్లో అగ్ర రాజ్యంలో సీఏఏ వారి కృషి అభినందనీయమని పలువురు అభిప్రాయపడ్డారు.ఆంధ్రా రుచులైన పులిహోరతో పాటు ఊరగాయ, ముక్కల పులుసు, బెండకాయ వేపుడు, పెరుగువడలు వడ్డించారు. రుచికరమైన పెరుగువడ కోసం ఆంధ్ర అయినా వెళ్లాలి లేదా చికాగో ఆంధ్ర సంఘం వన భోజనాలకి రావాలి అని ఫుడ్ కమిటీ చైర్ సాయి రవి సూరిభోట్ల అనడంతో నవ్వుల పూయించింది. 500 మందికిపైగా అతిథులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ ఎలా చేయాలి అన్న అంశంపై సీఏఏ కార్యదర్శి డా. భార్గవి నెట్టం అవగాహన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పిల్లలకి పెద్దలకి ఆటలని నిర్వహించారు. తండ్రులతో కలిసి పిల్లలు ఆడిన మూడు కాళ్ల పరుగు అందరిని ఆకట్టుకుంది. ఫాధర్స్ డేను పురస్కరించుకొని చివర్లో కేక్ కట్ చెయ్యడంతో పాటు వేసవి తాకిడిని ఎదుర్కోడానికి రోజంతా మజ్జిగ, పుచ్చకాయ ముక్కల్ని అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో సీఏఏ అధ్యక్షురాలు డా. ఉమ కటికి, ఉపాధ్యక్షులు పద్మారావు అప్పలనేని, కార్యదర్శి భార్గవి నెట్టం, ఫౌండర్స్ ఛైర్మన్ దినకర్ కారుమురితో పాటు గత ఫౌండర్స్ సభ్యులు సుందర్ దిట్టకవి, శ్రీనివాస్ పెదమల్లు, రాఘవ జట్ల, రమేష్ గారపాటి సహా బోర్డు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరిలో అధ్యక్షురాలు ఉమ కటికి మాట్లాడుతూ ఈ వనభోజనాలని జయప్రదం చేసిన అతిథులు, బోర్డు సభ్యులు, వాలంటీర్లకి ధన్యవాదాలు తెలిపారు. చికాగో వాసులని అలరించటానికి ఈ సంవత్సరం సీఏఏ ఇలాంటి మరెన్నో కార్యక్రమలని నిర్వహించబోతోందన్నారు. -
షికాగో సెక్స్ రాకెట్ : హెచ్ఆర్సీలో పిటిషన్
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్లో కలకలం రేపుతున్న షికాగో సెక్స్ రాకెట్ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)లో పిటిషన్ దాఖలైంది. తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు మహిళలను అక్రమంగా తరలిస్తున్న ఘటనపై విచారణ చేపట్టాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించాలని న్యాయవాది అరుణ్ హెచ్ఆర్సీలో పిటిషన్ వేశారు. సెక్స్‌రాకెట్‌లో సినీ ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నందున సమాజంపై అది ప్రభావం చూపే అవకాశం ఉందని పిటిషన్లో తెలిపారు. షికాగో సెక్స్‌రాకెట్ లాంటి వ్యవహారాలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని న్యాయవాది అరుణ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇది చదవండి : షికాగో సెక్స్‌రాకెట్: గుట్టువిప్పిన సినీతారలు -
షికాగో దెబ్బ అమెరికా వీసాల తిరస్కరణ
-
షికాగో సెక్స్ రాకెట్ దెబ్బ : వీసాల తిరస్కరణ
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : మేక మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఉత్తర అమెరికా తెలంగాణ తెలుగు మహాసభలకు ఆహ్వానం అందడంతో ఇటీవల యూఎస్ కాన్సులేట్‌లో బీ1బీ2 వీసా ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అమెరికా ఎందుకు వెళుతున్నారని అడిగితే.. ఉత్తర అమెరికా తెలుగుసభల కోసమని సమాధానమిచ్చారు.. ఆ మరుక్షణమే ఆయన చేతికి వీసా తిరస్కరణ పత్రం అందింది. సురేఖరాణి, డ్యాన్సర్, టీవీ ఆర్టిస్టు. అమెరికా తెలుగు అసోసియేషన్ సదస్సులో పాల్గొనడానికి ఆహ్వానం అందడంతో బీ1బీ2(పర్యాటక వీసా) కోసం దరఖాస్తు చేశారు. ఈ నెల 22న వీసా ఇంటర్వ్యూకు వెళ్లారు. ఆమెకు ఎదురైన ప్రశ్న కూడా ఎందుకు వెళుతున్నారనేదే.. ఆటా సదస్సులో పాల్గొనడానికని సమాధానం చెప్పడంతో ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైంది. అమెరికాలో తెలుగు సదస్సులకు అధికారిక బృందాలు వెళుతుంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి 24 మందితో కూడిన బృందం అమెరికా తెలంగాణ సదస్సుకు వెళ్లడానికి వీసా ఇవ్వాలని అభ్యర్థిస్తూ లేఖ రాసింది. ఆ దరఖాస్తులను పరిశీలించిన కాన్సులేట్ ప్రతినిధి నలుగురికే వీసా ఇస్తామని ముందస్తు సమాచారం ఇచ్చి మిగిలిన దరఖాస్తులన్నీ తిరస్కరించింది. ..ఇలా అమెరికా వీసాలను తిరస్కరించడం గతంలో ఎన్నడూలేదు. తానా, ఆటా, నాటా ఇలా ఏ సదస్సుకు హాజరవుతామని దరఖాస్తు చేసినా 60 శాతం నుంచి 75 శాతం మందికి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి వీసాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ సదస్సులకు వెళతామని అంటున్న వారికి ఏ ప్రశ్నలూ లేకుండానే వీసా తిరస్కరిస్తున్నారు. గత 15 రోజుల్లో ఇలా వెళ్లిన వారిలో 90 శాతం మందికి వీసా ఇవ్వడానికి యూఎస్ కాన్సులేట్ తిరస్కరించింది. సెక్స్ రాకెట్ వెలుగు చూడటంతోనే.. షికాగోలో సెక్స్ రాకెట్ వెలుగు చూడటం, ఆ మొత్తం వ్యవహారంలో తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా(తానా) ప్రతినిధుల ప్రమేయం ఉంటడమే దీనికి కారణం. షికాగోలోని ఓ తెలుగు చిత్రాల సహా నిర్మాత సినిమా అవకాశాలు లేని హీరోయిన్లను వ్యభిచారానికి ప్రోత్సహించిన ఘటన సంచలనం సృష్టించింది. తానా పేరుతో అమెరికాకు రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్లు వెల్లడి కావడం, దాని వెనుక తానా ప్రతినిధులు కొందరు ఉన్నారని తేలడంతో తెలుగు సదస్సులకు వెళ్లేవారి దరఖాస్తులను కాన్సులేట్ కుణ్ణంగా పరిశీలిస్తోంది. ఏ మాత్రం అనుమానం వచ్చినా రెడ్ మార్క్ పెడుతోంది. వీసా కోసం ఆన్లైన్లో డీఎస్ 160 ఫామ్ సమర్పించాలి. ఆ ఫామ్‌లో పేర్కొన్న వివరాల ఆధారంగా వీసా ఇవ్వాలా? లేదా? అన్న నిర్ణయానికి వస్తారు. అందులో దరఖాస్తుదారుడి ఆర్థిక పరిస్థితి.. ఆస్తులు తదితర వివరాలు చూస్తారు. తిరిగి వస్తాడా? లేదా? అన్నదానికే పరిమితమవుతారు. కానీ షికాగో ఘటన తర్వాత తెలుగు సదస్సులకు వెళ్లే 90 శాతం మంది వీసా దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. మే–జూన్‌కు ఎంత తేడా.. మే నెలలో యూఎస్ వీసా కోసం వచ్చిన (బీ1బీ2) దరఖాస్తుల్లో 65 శాతం మందికి వీసాలు మంజూరయ్యాయి. అదే జూన్ మధ్యకు వచ్చేసరికి వీసా తిరస్కరణలు 70 శాతానికి పెరిగాయి. మే 12వ తేదీ–28వ తేదీ మధ్య మూడు వేల మంది వీసా ఇంటర్వ్యూకు హాజరైతే.. 1,950 మందికి(65 శాతం) వీసా మంజూరైంది. అదే మే 29వ తేదీ–జూన్ 22వ తేదీ వరకూ సుమారు 4 వేల మంది వీసా ఇంటర్వ్యూకు హాజరైతే 1,350 మందికే వీసాలు దక్కాయి(కన్సల్టెన్సీ సంస్థల లెక్కల ఆధారంగా). తెలుగు సదస్సు పేరుతో అమెరికా వెళుతున్న వారు అక్కడకు వెళ్లి ఆరు నెలలు ఉండటం, కొంత మంది మరో మూడు మాసాలు పొడిగించాలని దరఖాస్తు చేయడం వంటివి లెక్కకు మించి ఉంటున్నాయి. షికాగోలో సెక్స్ రాకెట్ వెలుగు చూడటంతో యూఎస్ ఇమ్మిగ్రేషన్ విభాగం అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని కట్టడి చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ‘వీసా ఇవ్వాలా? లేదా? అన్న అధికారం కాన్సులేట్ అధికారికి ఉంటుంది. ఇందులో ఎలాంటి మతులబూ ఉండదు’అని యూఎస్ కాన్సులేట్ అధికారి ఒకరు పేర్కొన్నారు. తల్లిదండ్రులకూ తప్పని తిప్పలు.. అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న తమ పిల్లల గ్రాడ్యుయేషన్‌కు వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసిన తల్లిదండ్రులకూ తిప్పలు తప్పడం లేదు. గ్రాడ్యుయేషన్ కోసం వెళతామన్న తల్లిదండ్రులు, బంధువుల్లో 90 శాతం మందికి వీసాలు మంజూరవుతాయి. కానీ, ఇటీవల ఆ దరఖాస్తులనూ క్షుణ్ణంగా పరిశీలించి నో చెబుతున్నారు. రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేస్తున్న అధికారి, అతని భార్యకు వీసా ఇవ్వడానికి యూఎస్ కాన్సులేట్ నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌పీసీఎల్ సీనియర్ అధికారి కుమారుడి గ్రాడ్యుయేషన్‌కు వెళ్లడానికి వీసా చేసుకున్న దరఖాస్తునూ కాన్సులేట్ అధికారి గత గురువారం తిరస్కరించారు. గతంలో ఇలా లేదు.. గతంలో దరఖాస్తు చేసిన వారిలో 90 శాతం మందికి వీసాలు వచ్చేవి. ఈ పదిహేను రోజుల్లో మంజూరైన వీసాల సంఖ్య 35 నుంచి 40 శాతానికి పడిపోయింది. గత 15 రోజుల్లో మా సంస్థ 220 దరఖాస్తులను ఫార్వర్డ్ చేయగా 34 మందికే వీసాలు వచ్చాయి. గతంలో మా సంస్థ ద్వారా వెళ్లిన 90 శాతం మందికి వీసాలు వచ్చేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. – ఓ కన్సల్టెన్సీ ప్రతినిధి -
ఎన్ఆర్ఐ మృతదేహ తరలింపుకోసం విరాళాలు
షికాగో : అమెరికాలోని షికాగోలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంబారిపేట కృష్ణప్రసాద్ (33) మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణప్రసాద్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసేందుకు మానవతావాదులు ముందుకొస్తున్నారు. కృష్ణప్రసాద్‌తో కలసి పనిచేసిన వారు, స్నేహితులు, ఆయన సోదరుడు విరాళాల కోసం గోఫండ్‌మీ పేజీని రూపొందించారు. 20 వేల డాలర్ల కోసం ఈ పేజీని ఏర్పాటుచేశారు. మృతదేహాన్ని భారత్‌కు పంపడానికి ఆయన కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ డబ్బును ఉపయోగించనున్నారు. హైదరాబాద్‌లోని రామంతాపూర్ శాంతినగర్‌కు చెందిన కృష్ణప్రసాద్ ఆరేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. షికాగోలోని హంటర్‌డ్రైవ్ అపార్ట్మెంట్–2ఏలో ఉంటూ విటెక్ కంప్యూటర్స్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అమెరికాలో పని చేస్తూ కుటుంబానికి కృష్ణప్రసాదే పెద్ద దిక్కు ఉండేవారు. గురువారం అతని గది తలుపులు ఎంతకూ తెరుచుకోకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు గది తలుపులు తెరచి చూడగా కృష్ణప్రసాద్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అతనికి భార్య మైథిలి, కూతురు సాహితి(6), కుమారుడు అర్జున్(3) ఉన్నారు. భార్యాపిల్లలు హైదరాబాద్‌లోనే ఉండగా.. కృష్ణప్రసాద్ ఒక్కడే షికాగోలో ఉంటున్నాడు. కృష్ణప్రసాద్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. విరాళాలు ఇవ్వాలనుకునే వారు గోఫండ్‌మీ పేజీ కోసం కింది లింక్ క్లిక్ చేయగలరు. https://www.gofundme.com/funeral-expenses-for-krishna -
హైదరాబాదీ అనుమానాస్పద మృతి
హైదరాబాద్: అమెరికాలోని షికాగోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న హైదరాబాద్‌వాసి అంబారిపేట కృష్ణప్రసాద్ (33) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ మేరకు అక్కడి పోలీసులు శుక్రవారం అతని తండ్రి రాంప్రసాద్‌కు సమాచారం అందించారు. అనంతరం రాంప్రసాద్ మీడియాకు వివరాలు వెల్లడించారు. రామంతాపూర్ శాంతినగర్‌కు చెందిన కృష్ణప్రసాద్ ఆరేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. షికాగోలోని హంటర్‌డ్రైవ్ అపార్ట్మెంట్–2ఏలో ఉంటూ విటెక్ కంప్యూటర్స్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం అతని గది తలుపులు ఎంతకూ తెరుచుకోకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు గది తలుపులు తెరచి చూడగా కృష్ణప్రసాద్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని రాంప్రసాద్ వివరించారు. అతనికి భార్య మైథిలి, కూతురు సాహితి, కుమారుడు అర్జున్ ఉన్నారు. భార్యాపిల్లలు ఇక్కడే ఉండగా.. కృష్ణప్రసాద్ ఒక్కడే షికాగోలో ఉంటున్నాడు. అతని మృతదేహాన్ని నగరానికి తరలించడానికి రెండుమూడు రోజులు పట్టవచ్చని బంధువులు తెలిపారు. కృష్ణప్రసాద్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
షికాగో కేసులో వెనకున్న పెద్దలెవరు?
-
సెక్స్ రాకెట్ కేసు.. ఏమంటారు చంద్రబాబు?
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన షికాగో సెక్స్ రాకెట్ కేసు వెనుక పలువురు పెద్దల హస్తం ఉందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ప్రెసిడెంట్ సతీష్ వేమన.. చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌కు సన్నిహితుడైనందున ఏపీ ముఖ్యమంత్రి దీనిపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ వాసిరెడ్డి పద్మ షికాగో సెక్స్ రాకెట్ కేసు గురించి పలు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విషయాలతో అమెరికాలో ఉంటున్న తెలుగువారి పరువు తీశారంటూ ఆమె మండిపడ్డారు. గతంలో ఏపీలో కలకలం రేపిన కాల్‌మనీ సెక్స్ రాకెట్‌పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నిస్తే, ఆమెను ఏడాదిపాటు సస్పెండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసులో టీడీపీ నేతలు ఉండటంతో ఆ కేసును ఏపీ ప్రభుత్వం నీరుగార్చిందని విమర్శించారు. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి మహిళ కాల్‌మనీ సీఎం అనే పరిస్థితిని తీసుకొచ్చారని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్‌కు సన్నిహితుడైన తానా అధ్యక్షుడు వేమన సతీష్‌ను అమెరికా పోలీసులు పలుమార్లు విచారించారు. కాగా, టీడీపీలో కూడా సతీష్ క్రియాశీలకంగానే ఉంటారన్న విషయం తెలిసిందే. షికాగో సెక్స్ రాకెట్ కేసులో తానాకు చెందిన పలువురు ప్రముఖుల పేర్లతో పాటు ఇటీవల వెలుగుచూసిన డైరీలో ఓ ఏపీ మంత్రి, ఎంపీ పేర్లు ఉన్నట్లు సమాచారం. అమెరికా పోలీసులు కోర్టులో దాఖలు చేసిన 40 పేజీల అఫిడవిట్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. బాధితుల జాబితాలో 10 మంది హీరోయిన్లు ఉన్నట్లు అమెరికా పోలీసులు అఫిడవిట్లో పేర్కొన్నారు. -
షికాగో సెక్స్‌రాకెట్ .. చంద్రబాబు సమాధానం చెప్పాలి
-
షికాగో సెక్స్‌రాకెట్ .. ఎవరీ ABCDE?
చికాగో : తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించిన షికాగో సెక్స్ రాకెట్ కేసు రోజుకో కొత్తమలుపు తిరుగుతోంది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యురిటీ సాగిస్తున్న దర్యాప్తులో అనేక కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రమేయం ఉన్న మరికొందరిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి అమెరికా పోలీసులు స్థానిక కోర్టులో దాఖలు చేసిన 40 పేజీల అఫిడవిట్ వెలుగులోకి వచ్చింది. ఆ అఫిడవిట్ పరిశీలిస్తే కోసు దర్యాప్తు పురోగతి, ఏ కోణంలో సాగుతోందన్న విషయం అవగతమవుతోంది. ప్రస్తుతం ఆ అఫిడవిట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ హల్ చల్ చేస్తోంది. ఈ సెక్స్ రాకెట్ లో భాగమైన కొందరి పేర్లు సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. ఆ అఫిడవిట్లో అమెరికా దర్యాప్తు అధికారులు పేర్కొన్న ఏ, బీ, సీ, డీ, ఈ ఎవరై ఉంటారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది. వీరితో పాటూ మొత్తం బాధిత 10 మంది హీరోయిన్ల జాబితా కూడా వైరల్ అవుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు కూడా ఈ రాకెట్‌తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా పోలీసులు కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ సెక్స్ రాకెట్ డైరీలో ఏపీ మంత్రి ? ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్‌కు సన్నిహితుడు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ప్రెసిడెంట్ వేమన సతీష్‌ను అమెరికా పోలీసులు పలుమార్లు విచారించారు. వేమన సతీష్ తెలుగుదేశం పార్టీలో కూడా క్రియాశీలకంగానే ఉంటారు. ఈ విషయంలో తానాకు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు కూడా వినిపించాయి. అంతేకాకుండా సెక్స్ రాకెట్‌కు సంబంధించి వెలుగు చూసిన డైరీలో ప్రస్తుతం ఏపీలో అత్యంత కీలక శాఖను నిర్వహిస్తున్న మంత్రి పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ఎంపీ పేరు కూడా అందులో ఉన్నట్టు సమాచారం. తీగలాగితే డొంకంత కదులుతున్నట్లు పలువురు రాజకీయ నాయకుల పేర్లు ఈ జాబితాలో ఉండటంతో అమెరికా తెలుగు సంఘాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. అసోసియేషన్ల పేరుతో వీసాలు.. డబ్బు ఎరగా చూపి సినీతారలతో వ్యభిచారం చేయిస్తున్న కిషన్ మోదుగుమూడి, చంద్రకళ అనే భారతీయ దంపతులను అక్కడి షికాగో ఫెడరల్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సెక్స్ రాకెట్ వ్యవహారంలో ఇప్పటివరకూ పలువురు నటీమణుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. నిందితుల మొబైల్ ఫోన్ సంభాషణల విశ్లేషణ కొనసాగుతున్న నేపథ్యంలో మరింత మంది బాధితుల పేర్లు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారతీయ అసోసియేషన్ల కార్యాక్రమాల్లో పాల్గొనడానికంటూ సినీ తారలకు వీసాలు ఇప్పించి అమెరికాకు రప్పిస్తారని పోలీసుల విచారణలో తేలింది. విచారణ జరిగిందిలా.. గత ఏడాది నవంబర్ 20న ఓ హీరోయిన్ ఢిల్లీ నుంచి షికాగో వెళ్లింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా నవంబర్18న ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఆమె పాల్గొనాలి. కానీ ఆమె రెండు రోజులు ఆసల్యంగా వచ్చి కాలిఫోర్నియా బదులు చికాగోకు వెళ్లింది. దీంతో అనుమానంతో వచ్చి అధికారులు విచారించారు. తను మరో కార్యక్రమానికి హాజరయ్యానని ఆమె బదులిచ్చారు. ఏ ఈవెంట్లో పాల్గొన్నారని ప్రశ్నించగా నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైనట్లు చెప్పుకొచ్చింది. కానీ పోలీసుల విచారణలో ఆమె సంబంధిత ఈవెంట్లో పాల్గొనలేదని తేలింది. దాంతో ఆ నటిని అమెరికాకు రప్పించిన వ్యక్తి గురించి ఆరా తీశారు. ఆ వ్యక్తి పేరు రాజు అని ఉంది. అతని గురించి విచారించగా కిషన్ అనే వ్యక్తే రాజు అనే మారుపేరుతో ఆమెను రప్పించాడని తేలింది. దీంతో ఆ నటి వీసాను రద్దు చేశారు. అలాగే మరో నలుగురి నటీమణులను కూడా విచారించారు. వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులను విచారించిన అధికారులు గత కొన్ని సంవత్సరాలుగా ఆయా సంఘాల కార్యక్రమాలకు హాజరైన వారి వివరాలను మన దేశంలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయాల నుంచి తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు టాప్ హీరోయిన్లకు ఈ వ్యభిచార రాకెట్‌తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టయిన కిషన్, ఆయన భార్య చంద్రకళ వద్ద ఈ హీరోయిన్లతో సంభాషణలు జరిపినట్లు ఆధారాలున్నాయని చెపుతున్నారు. విచారణకు సహకరిస్తాం : సతీష్ వేమన సినీతారల వ్యభిచారం కేసుకు అమెరికాలోని తెలుగు సంఘాల ఆర్గనైజర్లతో సంబంధాలున్నాయని వస్తున్న వార్తలపై తానా ప్రెసిడెంట్ సతీష్ వేమన స్పందించారు. నిందితులతో తానాకు ఎలాంటి సంబంధంలేదని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో నిందితులు డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి, నఖిలీ ఆహ్వాన పత్రికలు సృష్టించినట్టు తెలుస్తోందన్నారు. కొన్నింటిలో తానా పేరును వాడి, అక్రమ మార్గాల్లో అమెరికా వీసా పొందారన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యురిటీ(డీహెచ్ఎస్) ఈ కేసు విచారణ ముమ్మరం చేసిందని, వారికి తానా పూర్తిగా సహకరిస్తున్నట్టు వెల్లడించారు. నిందితులు తానా పేరుతో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించిన తీరును వారికి వివరించినట్టు తెలిపారు. -
షికాగో సెక్స్‌రాకెట్: గుట్టువిప్పిన సినీతారలు
షికాగో : వరుస వివాదాస్పద ఘటనలు టాలీవుడ్‌ను కుదుపేస్తున్నాయి. క్యాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు మరువకముందే షికాగో సెక్స్ రాకెట్ ఉదంతం తెలుగు సినిమా పరిశ్రమలో మరోసారి కలకలం రేపింది. డబ్బు ఎరగా చూపి సినీతారలతో వ్యభిచారం చేయిస్తున్న కిషన్ మోదుగుమూడి, చంద్రకళ అనే భారతీయ దంపతులను అక్కడి షికాగో ఫెడరల్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సెక్స్ రాకెట్ వ్యవహారంలో ఇప్పటివరకూ ఆరుగురు నటీమణుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. నిందితుల మొబైల్ ఫోన్ సంభాషణల విశ్లేషణ కొనసాగుతున్న నేపథ్యంలో మరింత మంది బాధితుల పేర్లు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, పోలీసుల విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సినీతారలతో వ్యభిచారం ఎలా చేయించేవారో నటీమణులు విచారణలో తెలిపారు. భారతీయ అసోసియేషన్ల కార్యాక్రమాల్లో పాల్గొనడానికంటూ సినీ తారలను అమెరికాకు రప్పిస్తారు. డబ్బులు ఎరవేసి వ్యభిచారంలోకి దింపుతారు. తర్వాత తమ గురించి బయటపెడితే చంపుతామని బెదిరిస్తారని వివరించారు. గత ఏడాది నవంబర్ 20న ఓ హీరోయిన్ ఢిల్లీ నుంచి అమెరికాలోని షికాగోకి వెళ్లింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా నవంబర్18న ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఆమె పాల్గొనాలి. కానీ ఆమె రెండు రోజులు ఆసల్యంగా వచ్చి కాలిఫోర్నియా బదులు షికాగోకు వెళ్లింది. దీంతో అనుమానంతో వచ్చి అధికారులు విచారించారు. తను మరో కార్యక్రమానికి హాజరయ్యానని ఆమె బదులిచ్చారు. ఏ ఈవెంట్లో పాల్గొన్నారని ప్రశ్నించగా నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైనట్లు చెప్పుకొచ్చింది. కానీ పోలీసుల విచారణలో ఆమె సంబంధిత ఈవెంట్లో పాల్గొనలేదని తేలింది. దాంతో ఆ నటిని అమెరికాకు రప్పించిన వ్యక్తి గురించి ఆరా తీశారు. ఆ వ్యక్తి పేరు రాజు అని ఉంది. అతని గురించి విచారించగా కిషన్ అనే వ్యక్తే రాజు అనే మారుపేరుతో ఆమెను రప్పించాడని తేలింది. దీంతో ఆ నటి వీసాను రద్దు చేశారు. అలాగే మరో నలుగురి నటీమణులను కూడా విచారించారు. కాగా కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు టాప్ హీరోయిన్లకు ఈ వ్యభిచార రాకెట్‌తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టయిన కిషన్, ఆయన భార్య చంద్రకళ వద్ద ఈ హీరోయిన్లతో సంభాషణలు జరిపినట్లు ఆధారాలున్నాయని చెపుతున్నారు. మరి ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరన్నది తేలాల్సి వుంది. ఈ కేసులో అరెస్టయిన వారిని వచ్చే గురువారం న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు. నెల రోజుల్లోపే ఈ కేసు కొలిక్కి వస్తుందని, శిక్ష పడితే అది పూర్తయిన తర్వాత ఇద్దర్నీ దేశం నుంచి పంపేస్తారని ఓ అధికారి తెలిపారు. -
తమ్మారెడ్డి రిక్వెస్ట్
సాక్షి, హైదరాబాద్: హాట్ టాపిక్‌గా మారిన చికాగో వ్యభిచార రాకెట్ వ్యవహారం.. అందులో టాలీవుడ్ నటీమణులు ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న కథనాలు తెలుగు చలన చిత్రపరిశ్రమను కుదిపేస్తున్నాయి. ఈవెంట్ల పేరుతో నటీమణులను కిషన్-చంద్రకళ దంపతులు విదేశాలకు పిలిపించుకోవటం.. వారితో గుట్టుగా వ్యభిచారం నిర్వహించటం వెలుగుచూసింది. దీంతో కేసు నమోదు చేసిన అక్కడి పోలీసులు పక్కాగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మీడియాకు విజ్ఞప్తి చేస్తూ ఫేస్బుక్లో ఓ వీడియోను ఉంచారు. ‘కిషన్ గతంలో ఏవో సినిమాలు చేసి ఉండొచ్చు. కానీ, ఇపుడు అతడో విటుడిగా మారి ఈ రాకెట్ నడుపుతున్నాడు. అలాంటప్పుడు అతన్ని ఇంకా నిర్మాతగా చూపిస్తూ... తెలుగు చిత్ర పరిశ్రమతో సంబంధాలంటగట్టడం సరికాదు. కిషన్ - చంద్రకళలను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. దాంతోపాటే కొంత మంది బాధితులను కూడా కాపాడారు. ఇందులో కొంతమంది టాలీవుడ్ నటీమణులు పాల్గొని ఉండొచ్చు. అలాగనీ మొత్తం తెలుగు ఇండస్ట్రీకి ఆ రాకెట్‌తో లింకు పెట్టడం బాధాకరం. కిషన్ ఓ వ్యభిచార రాకెట్ ను నడిపిస్తున్నాడు. అతడి చేతిలో కొందరు చిక్కుకుంటే అతన్ని పింప్ అనకుండా... ఓ ప్రొడ్యూసర్ అని, సినిమావాడని సంబోధించడం సరికాదు. టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మంచి చెడులు, రివ్యూలు రాస్తున్నారు. కానీ, ఇండస్ట్రీని డ్యామేజ్ చేసే కథనాలు మాత్రం రాయకండి’ అని తమ్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక నటీమణులు కూడా భవిష్యత్తులో జరిగే ఈవెంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ - ఫిల్మ్ చాంబర్లకు ఓ మాట చెప్పి విదేశీ ఈవెంట్లకు వెళితే మంచిదని సూచించారు. ‘ఈవెంట్ల పేరిట జరుగుతున్న ఈ చీకటి వ్యవహారాల్లో తెలిసో.. తెలీకో తెలుగు సంఘాలు కూడా ఇన్ వాల్వ్ అయ్యాయి. ఆ సంఘాల పేరుమీదే వీసాలు జారీ అవుతున్నాయి. ఇన్విటేషన్స్ పంపుతున్నారు. అలాంటప్పుడు వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత తెలుగు సంఘాలపై కూడా ఉంటుంది’ అని తమ్మారెడ్డి తెలిపారు. -
డర్టీ పిక్చర్
-
చికాగో సెక్స్ రాకెట్: స్పందించిన అనసూయ, శ్రీరెడ్డి
హైదరాబాద్ : టాలీవుడ్లో సంచలనం రేకిత్తించిన చికాగో సెక్స్ రాకెట్ బాధితుల్లో ఇద్దరు టాప్ హీరోయిన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు బయటకు రాకపోయినప్పటికీ సౌత్ స్టార్సేనని ప్రచారం జరుగుతోంది. అమెరికాలో టాలీవుడ్ నటీమణులతో వ్యభిచారం నిర్వహిస్తున్న తెలుగు దంపతులను ఫెడరల్ ఏజెన్సీలు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కొన్ని సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించిన కిషన్ మోదుగుముడి అలియాస్ రాజు అలియాస్ శ్రీరాజు, అతని భార్య చంద్రలు టాలీవుడ్‌కు చెందిన నటీమణులను తాత్కాలిక వీసా మీద అమెరికాకు తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులు అభియోగాలు నమోదుచేశారు. అయితే ఈ వ్యవహారంతో ఉలిక్కిపడ్డ మా అసోసియేషన్ జూన్ 24 సమావేశం కానున్నట్లు ప్రకటించింది. ఈ అమెరికా దంపతులు గతంలో తమను కూడా సంప్రదించారని నటి శ్రీరెడ్డి, యాంకర్ కమ్ నటి అనసూయలు ఓ ఆంగ్ల పత్రికకు తెలిపారు. మాట్లాడే తీరు నచ్చక తిరస్కరించాను: అనసూయ ఈ ఉదంతంపై యాంకర్ అనసూయ భరద్వాజ్ స్పందిస్తూ.. ‘ చాలా రోజులుగా నేను అమెరికా వెళ్లలేదు. 2014లో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్‌లో ఓ ఈవెంట్‌కు హాజరయ్యాను. 2016లో అమెరికా నెంబర్‌తో శ్రీరాజ్ అనే వ్యక్తి నన్ను సంప్రదించాడు. తెలుగు అసోసియేషన్ నిర్వహించే ఓ కార్యక్రమానికి హాజరుకావాలని కోరాడు. అతను మాట్లాడే విధానం నచ్చక నేను తిరస్కరించాను. నేను తిరస్కరించినా కూడా పోస్టర్లో నాఫొటోను ప్రచురించారు. ఆ ఈవెంట్లో పాల్గొనడం లేదని అప్పట్లో నేను ట్విటర్ ద్వారా స్పష్టం చేశాను’ అని అనసూయ తెలిపారు. పాపులారిటీని బట్టి ధర: శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్‌పై ఉద్యమిస్తూ వార్తాల్లో నిలిచిన నటి శ్రీరైడ్డి సైతం.. ఆ అమెరికా దంపతులు తనను కూడా సంప్రందించారని తెలిపారు. ‘అవకాశాల్లేని హీరోయిన్లను ఈవెంట్స్ కోసం అమెరికాకు రప్పించి.. అక్కడ వారిని మభ్యపెట్టి వ్యభిచారాంలోకి దింపుతున్నారు. అలా వెళ్లిన ఆర్టిస్టులకు సుమారు 1000 అమెరికా డాలర్లు ఆఫర్ చేస్తున్నారు. ఈ ఆఫర్ వారి పాపులారిటీని బట్టి ఉంటుంది.’ అని ఆమె చెప్పుకొచ్చారు. జూన్24 న సమావేశం : శివాజీ ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు ఆర్టిస్టులను హెచ్చరించినట్లు మూవీఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా తెలిపారు. ఆయన ఈ ఘటనపై స్పందిస్తూ.. ‘ కిషన్ మోదుగుముడి నిర్వహించే వ్యవహారలపై మాకు అవగాహన ఉంది. అతను ఓ రెండు సినిమాలకు కో ప్రోడ్యూసర్, ప్రొడక్షన్ మెనేజర్‌గా చేసినట్లున్నాడు. ఈవెంట్స్ ప్రదర్శనల కోసం విదేశాలకు వెళ్లే ఆర్టిస్టులను జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించాం. కొన్నేళ్ల కిత్రం నేను ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇలాంటి వ్యవహారాలను కొన్ని గుర్తించాం. అమెరికా, సింగపూర్, దుబాయ్, ఆస్ట్రేలియాలోని కార్యక్రమాలకు వెళ్లే ఆర్టిస్టులకు వీసా సమస్యల గురించి అవగాహన లేదు. ఈ ఉందంతంపై మా అసోసియేషన్ జూన్ 24న సమావేశం అవుతోంది. విదేశాలకు వెళ్లే ఆర్టిస్టులు అక్కడి కార్యక్రమాల వివరాలను మాకు అందజేయాలి. అప్పుడు ఆర్గనైజర్స్‌తో మాట్లాడి కార్యక్రమాల విషయాన్ని ధృవీకరిస్తామని’ ఆయన తెలిపారు. -
షికాగోలో సెక్స్ రాకెట్
సాక్షి, హైదరాబాద్ : ఆమె ఓ చిన్నస్థాయి సినీ నటి.. ఇటీవలే తాత్కాలిక వీసాపై అమెరికాలోని షికాగో విమానాశ్రయానికి చేరింది.. అక్కడి కస్టమ్స్ అధికారులు ప్రశ్నించగా.. ఓ భారత అసోసియేషన్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు తన మేనేజర్ సాయంతో వచ్చానని, రెండు వారాలు ఉండి వెళ్లిపో తానని చెప్పింది.. కానీ ఆమెను రప్పించింది వ్యభి చారం చేయించడానికి.. ఏదో కార్యక్రమంలో పాల్గొనడానికంటూ టాలీవుడ్ నుంచి చిన్నస్థాయి సినీతారలను అమెరికాకు రప్పించి, భారీగా డబ్బు ఎరగా చూపి వ్యభిచారం చేయిస్తున్న కిషన్ మోదుగుమూడి, చంద్ర అనే భారతీయ దంపతులను అక్కడి షికాగో ఫెడరల్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. క్రిమినల్ కేసు నమోదు చేసి, అక్కడి జిల్లా కోర్టుకు 42 పేజీలతో కూడిన దర్యాప్తు నివేదికను సమర్పించారు. కిషన్ మోదుగుమూడి పలు తెలుగు చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. ఈ వ్యవహారంపై అక్కడి ‘షికాగో ట్రిబ్యూన్’ మీడియా సంస్థ పూర్తి వివరాలతో కథనం ప్రచురించడం సంచలనం సృష్టిస్తోంది. షికాగో ట్రిబ్యూన్ కథనం ప్రకారం.. తాత్కాలిక వీసాలపై రప్పించి.. భారతీయ అసోసియేషన్ల కార్యక్రమాల్లో పాల్గొనడానికంటూ కిషన్ దంపతులు కొందరు చిన్నస్థాయి సినీ తారలను అమెరికాకు రప్పించి, వ్యభిచార రాకెట్‌ను నిర్వహిస్తున్నారు. అవకాశాలు పెద్దగా లేని, ద్వితీయస్థాయి నటీమణులకు భారీగా డబ్బు ఎరగా చూపి ఈ రొంపిలోకి దింపుతున్నారు. హీరోయిన్లు అనగానే అమెరికాలో ఉన్న భారతీయులకు ఉండే ‘మక్కువ’ను సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాగే ఇటీవల ఓ నటిని అమెరికాకు రప్పించినప్పుడు సందేహం వచ్చిన ఫెడరల్ పోలీసులు కూపీ లాగారు. దీంతో షికాగో నగరంలో వెస్ట్బెల్డెన్ అవెన్యూ ప్రాంతంలోని 5700 నంబర్ అపార్ట్మెంట్లో కిషన్ దంపతులు నిర్వహిస్తున్న వ్యభిచార రాకెట్ గుట్టు రట్టయింది. దీనిపై దర్యాప్తు చేసిన ఫెడరల్ పోలీసులు.. వారిని అరెస్టు చేశారు. నటీమణులకు డబ్బులు ఎరవేసి ఆ అపార్ట్మెంట్లో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారని.. ఈ వ్యవహారంలో బాలికలు, మహిళల అక్రమ రవాణా అంశాలూ ఇమిడి ఉన్నాయంటూ కోర్టులో అభియోగాలు దాఖలు చేశారు. చంపుతామని బెదిరించి.. అవకాశాలు రాని చిన్న నటీమణులు, హీరోయిన్లకు కిషన్ దంపతులు డబ్బు ఎరవేసి వ్యభిచారంలోకి దింపుతున్నారని... తర్వాత వారిని బెదిరిస్తున్నారని ఫెడరల్ పోలీసులు కోర్టుకిచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఈ విధంగా ఓ నటిని లోబర్చుకున్నారని, తమ గురించి బయటపెడితే కీడు తలపెడతామంటూ హెచ్చరించారని తెలిపారు. కిషన్ భార్య చంద్ర ఈ వ్యభిచార కార్యకలాపాల వివరాలను, ఎవరెవరితో ‘వ్యాపారం’చేశారు, ఎంత సొమ్ము వచ్చింది.. వంటివాటిని రాసిపెట్టుకుందని వెల్లడించారు. కిషన్ అపార్ట్మెంట్లో జరిపిన సోదాల్లో జిప్‌లాక్ కవర్లలో ఉంచిన 70కి పైగా కండోమ్‌లు లభించాయని వివరించారు. ఈ–మెయిళ్లు.. ఫోన్లలో బేరాలు కిషన్ దంపతులు అటు బాధితులు, ఇటు విటులతో ఈ–మెయిళ్లలో, ఫోన్లలో సంప్రదింపులు జరిపారని.. కిషన్ భార్య చంద్ర నేరుగా విటులతో ఫోన్లో మాట్లాడేదని ఫెడరల్ పోలీసులు పేర్కొన్నారు. ఆమె ఫోన్‌ను పరిశీలించిన విచారణ అధికారులు.. ఆమె విటులతో జరిపిన ఎస్సెమ్మెస్ సంప్రదింపులను గుర్తించారు. ‘ఏ నటి అందుబాటులో ఉంది, ఎంత చెల్లించాల్సి ఉంటుంది’వంటి వివరాలతోపాటు వ్యభిచారానికి సిద్ధంగా ఉన్న నటి ఫోటోలను కూడా పంపింది. ‘ఓ నటి ఫోటోను ఒక క్లయింట్‌కు పంపగా.. అతను నా కోసమేనా? అంటూ సంతోషం వ్యక్తం చేసినట్టు’గా 2016 డిసెంబర్లో పంపిన మెసేజ్‌లో ఉంది. ఇక ‘తాను ఇప్పుడే ఓ క్లయింట్‌తో వ్యభిచరించానని, అతను చాలా సంతృప్తిగా ఉన్నాడ’ని ఓ బాధితురాలు చంద్రకు పంపిన మెసేజీలు కూడా లభించాయని ఫెడరల్ పోలీసులు పేర్కొన్నారు. కిషన్ దంపతులు అమెరికాలోని భారతీయ సంఘాల సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాల వద్దకు వెళ్లి ఇలాంటి వ్యవహారాలపై ఆసక్తి ఉన్న వారి వివరాలను తెలుసుకునేవారని.. వ్యభిచారం కోసం ఒక్కో విటుడి నుంచి 3 వేల డాలర్ల వరకు వసూలు చేశారని తేలిందని నివేదికలో వెల్లడించారు. ‘ప్లీజ్.. నన్ను ఆ కూపంలోకి లాగొద్దు’ కిషన్ ఈ–మెయిళ్లను పరిశీలించిన షికాగో పోలీసులకు ఓ బాధిత మహిళ పంపిన ఈ–మెయిళ్లు లభించాయి. తనను బెదిరించవద్దని, వ్యభిచారం చేయాలని వేధించవద్దని ఆమె కిషన్‌కు మెయిళ్లు పంపింది. ‘నాకు ఇలాంటివి చేయాలనిపించడం లేదు. ఇప్పుడుగానీ, భవిష్యత్తులోగానీ నీతో కలసి నేను అలాంటి పనులు చేయలేను. ఇంకోసారి నాతో మాట్లాడాలని ప్రయత్నిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తా..’’అని ఆమె ఆ మెయిళ్లలో హెచ్చరించింది. భార్యాభర్తలు అరెస్ట్.. రిమాండ్ డబ్బు ఎరవేసి వ్యభిచారం చేయించిన అంశంపై కిషన్ దంపతులను అమెరికా ఫెడరల్ పోలీసులు ఏప్రిల్ చివరి వారంలోనే అరెస్టు చేశారు. కోర్టు వారిని రిమాండ్‌కు పంపింది. అప్పటి నుంచి వారు జైల్లోనే ఉన్నారు. వారి ఇద్దరు పిల్లలను వర్జీనియాలోని శిశు సంక్షేమ అధికారుల సంరక్షణలో ఉంచారు. కిషన్ దంపతులకు బెయిల్ ఇచ్చేందుకు అమెరికా కోర్టు తిరస్కరించింది. వాస్తవానికి అమెరికాలో వ్యభిచారం చట్టవిరుద్ధమేమీ కాదని.. అయితే ఈ వ్యవహారంలో పిల్లలు ఉన్నా, మహిళల అక్రమ రవాణా వంటివి ఉన్నా సీరియస్‌గా పరిగణిస్తారని నిపుణులు చెబుతున్నారు. షికాగో పోలీసులు కిషన్ దంపతులపై తీవ్రమైన అభియోగాలే నమోదు చేశారని వెల్లడిస్తున్నారు. విచారణకు సహకరించని బాధితులు ఈ కేసు విచారణకు బాధితులు సహకరించడం లేదని అమెరికన్ పోలీసులు చెబుతున్నారు. ఓ బాధితురాలిని విచారించగా.. తాను వ్యభిచారం చేయలేదని, కొంతసేపు వారితో సరదాగా మాట్లాడానని, వారు తన ‘సాయం’కోరారని చెప్పింది. ఇక ఓ విటుడు తాను కిషన్ భార్య చంద్రతో మాట్లాడానని.. నటీమణులతో వ్యభిచరించేందుకు ఎంత ఖర్చవుతుందని మాత్రమే అడిగానని, అంతకుమించి ఏమీ లేదని పోలీసులకు వెల్లడించాడు. కానీ అతను షికాగో విమానాశ్రయంలోని ఓ సూట్లో చంద్రను కలసి, ఓ నటితో వ్యభిచరించేందుకు 1,110 డాలర్లు చెల్లించినట్టుగా తేలిందని ఫెడరల్ పోలీసులు కోర్టుకు ఇచ్చిన దర్యాప్తు నివేదికలో వెల్లడించారు. -
అమెరికాలో సెక్స్ రాకెట్.. టాలీవుడ్ నిర్మాత అరెస్టు!
అమెరికాలో టాలీవుడ్ నటీమణులతో వ్యభిచారం నిర్వహిస్తున్న హైలెవల్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. ఈ వ్యవహారంలో షికాగోలో నివసిస్తున్న తెలుగు దంపతులను ఫెడరల్ ఏజెన్సీలు అరెస్టు చేశాయి. ఈ కేసుకు సంబంధించి 42 పేజీల క్రిమినల్ ఫిర్యాదును తాజాగా షికాగో జిల్లా కోర్టులో సమర్పించడంతో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా 34 ఏళ్ల కిషన్ మోదుగుముడి అలియాస్ రాజు అలియాస్ శ్రీరాజు చొన్నుపాటిని గుర్తించారు. భారత వ్యాపారవేత్త అయిన కిషన్ టాలీవుడ్లో పలు సినిమాలకు సహా నిర్మాతగా కూడా వ్యవహరించాడని షికాగో ట్రిబ్యున్ పత్రిక తన కథనంలో తెలిపింది. ఆ పత్రిక కథనం ప్రకారం.. కిషన్, ఆయన భార్య చంద్రలను గత ఏప్రిల్‌లో ఫెడరల్ ఏజెన్సీలు అరెస్టు చేశాయి. వారికి ఇంకా బెయిల్ లభించలేదు. టాలీవుడ్‌కు చెందిన నటీమణులను తాత్కాలిక వీసా మీద అమెరికాకు తీసుకువచ్చి వీరు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. భారతీయ సంస్కాృతిక కార్యక్రమాలు, కాన్ఫరెన్స్‌ల వద్ద నటీమణులతో శృంగారం పేరిట విటులను వీరు ఆకర్షిస్తున్నారు. విటులను ఆకర్షించేందుకు మొబైల్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను వాడుకుంటున్నారు. నటిని అమెరికాకు రప్పించి..! ఒక చిన్నస్థాయి నటిని షోలో పాల్గొనే పేరిట అమెరికాకు రప్పించి.. ఇదేవిధంగా వ్యవహరించడంతో ఈ రాకెట్ గుట్టు రట్టయింది. ఈ కేసులో సదరు నటిని ప్రధాన బాధితురాలిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని బటయపెడితే.. అంతు చూస్తానని ఆ నటిని, ఆమె కుటుంబాన్ని ప్రధాన నిందితుడు కిషన్ హెచ్చరించారని వారు వెల్లడించారు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్తే.. నీ సంగతి చూడటం నాకు పెద్ద విషయం కాదు. నీ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. నువ్వు పెద్ద నటివి కాదు’ అని అతను బెదిరించాడని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు హాని చేకూర్చవద్దంటూ బాధితురాలు రాసిన మెయిల్ ఆధారంగా నిందితులైన దంపతులను అరెస్టు చేశారు. క్లయింట్లతో తదుపరి ‘డేట్’ ముగిసేవరకు ఉండాలంటూ దాదాపు నలుగురు నటీమణులను పాత అపార్ట్మెంట్లలో ఉండేలా నిర్వాహకులు బలవంతపెట్టారని, లైంగిక కలాపాల కోసం ఒక్క క్లయింట్ వద్ద మూడువేల డాలర్ల వరకు వసూలు చేసేవారని పోలీసులు అభియోగాలు నమోదుచేశారు. అమెరికా అంతటా జరిగే భారతీయ సాంస్కృతిక కార్యక్రమాల వద్ద ‘కస్టమర్ల’ను ఆకర్షించేవారని తెలిపారు. బాధిత మహిళకు మంచి ఉద్యోగం కల్పిస్తామని ఆఫర్ ఇచ్చి నిర్వాహకులు సర్దిచెప్పారని తెలుస్తోంది. నిందితుడు కిషన్ భార్య చంద్ర (31) లైంగిక వ్యవహారాలకు సంబంధించిన చిట్టాపద్దులు రహస్యంగా నిర్వహించేదని, ఒక్కో నటి ఎన్నిసార్లు పాల్గొన్నది. ఎంత డబ్బు చేతులు మారింది తదితర వివరాలు ఆమె నమోదు చేసేదని దర్యాప్తు అధికారులు తెలిపారు. దంపతుల ఇంటిపై దాడులు జరిపినప్పుడు వారి ఇంట్లోని మల్టిపుల్ జిప్‌లాక్ బ్యాగుల్లో 70 కండోమ్‌లు లభించాయని చెప్పారు. దంపతులు అరెస్టు కావడంతో వారి పిల్లలను వర్జినియాలోని బాలల సంరక్షణ అధికారుల ఆశ్రయంలో ఉంచారు. -
చికాగోలో క్రైస్తవుల వివాహా పరిచయ వేదిక
చికాగో : అమెరికాలోని భారతీయ క్రైస్తవ యువతి, యువకుల కోసం వివాహా పరిచయ వేదికను ఏర్పాటు చేశారు. ఎలిజర్ మినిస్ట్రి ఆఫ్ మాట్రిమోనీ చికాగో(ఈఎంఎం) ఆధ్వర్యంలో యునైటెడ్ తెలుగు క్రిస్టియన్ కమ్యూనిటీ ఆఫ్ చికాగో, క్లెర్జి కౌన్సిల్ ఆఫ్ చికాగో (సీసీసీ) ల సహకారంతో ఈ నెల 7న ఇల్లినాయిస్లో ఏర్పాటు చేసినట్టు నిర్వాహాకులు తెలిపారు. ఈ పరిచయ వేదికకు పెద్ద సంఖ్యలో యువతి, యువకులు వారి తల్లిదండ్రులు హాజరైయ్యారు. పరివార్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సామ్ జార్జ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈఎంఎం సమన్వయకర్తలైన ప్రభు, జాన్సన్ సుక్కు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన యువతీయువకులకు, తల్లిదండ్రులకు, శ్రేయేభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు. -
టీఏజీసీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
చికాగో: చికాగో మహా నగర తెలుగు సంస్థ(టీఏజీసీ) ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చికాగోలోని స్ట్రీమ్వుడ్ హై స్కూల్ ఆడిటోరియంలో ఏప్రిల్ 14న జరిగిన ఈ వేడుకల్లో దాదాపు 1000మంది తెలుగు వారు పాల్గొన్నారు. 325 మంది స్థానిక కళాకారులు వివిధ కార్యక్రమాలతో అతిథులను అలరించారు. కిడ్స్ కామెడీ స్కిట్, బాల రామాయణం, దివంగత నటి శ్రీదేవికి నివాళి, ఉగాది, శ్రీరామనవమికి సంబంధించి కార్యక్రమాలు, డ్యాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి. టీఏజీసీ అధ్యక్షులు జ్యోతి చింతలపాణి, కల్చరల్ కమిటీ ఛైర్మన్ రంగారెడ్డి లెంకల, కో ఛైర్స్ ఉమా అవదూత, శ్వేత జనమంచి, మాధవి కొనకొల్లలు, కల్చరల్ కమిటీ సభ్యులు, కో ఆర్డినేటర్స్ గత 6 వారాలుగా ఈ వేడుకల కోసం అహర్నిశలు కృషి చేశారు. వేడుకల డెకరేషన్ పనులను వాణి యెంట్రింట్ల దగ్గరుండి చూశారు. టీఏజీసీ మెంబర్షిప్ కమిటీ, ప్రవీణ్ వేములపల్లి, మమత లంకల, విజయ్ బీరం, మమత లంకలలు అతిథులను సాధరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పీఎంఎస్‌ఐకి చెందిన అశోక్ లక్ష్మణన్, టీఏజీసీ అధ్యక్షులు జ్యోతి చింతలపాణి, మాజీ అధ్యక్షులు ప్రదీప్ కందిమళ్ల, యూత్ ఛైర్ అవినాష్ లటుపల్లి ఎంపిక చేసిన యువతకు ప్రెసిడెన్షియల్ వాలంటీర్ సర్వీస్ అవార్డ్(పీవీఎస్ఏ) సర్టిఫికెట్స్ అందజేశారు. ఫుడ్ కమిటీ ఛైర్ శ్రీనివాస్ కంద్రు ఉగాది పచ్చడితోపాటూ, రుచికరమైన వంటకాలను అతిథుల కోసం ఏర్పాటు చేశారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంజి రెడ్డి కందిమల్ల, సంపత్ సప్తగిరిలు ఆహారం సరఫరా, ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వాలంటీర్లకు జ్యోతి చింతలపాణి కృతజ్ఞతలు తెలిపారు. -
బిల్లు 50 వేలు.. టిప్పు లక్ష రూపాయలు..!!
చికాగో, అమెరికా : హోటల్లో సర్వీస్ చేసినందుకు సాధారణంగా అందరం టిప్పు ఇస్తూ ఉంటాం. మరి సర్వీసు ఆహారం కంటే అధికంగా నచ్చి వచ్చిన బిల్లు కంటే ఎక్కువ డబ్బు టిప్పుగా ఇస్తే?. అదే జరిగింది అమెరికాలోని ఓ రెస్టారెంట్లో. భోజనం, సర్వీస్ నచ్చిందని బిల్లు కంటే ఎక్కువ డబ్బును టిప్పుగా ఇచ్చాడు ఓ వ్యక్తి. చికాగోలోని బొకా రెస్టారెంట్‌కి ఓ వ్యక్తి ఫ్యామిలీతో కలిసి డిన్నర్‌కి వెళ్లాడు. మొత్తం బిల్లు 759 డాలర్లు(రూ.49,786/-) అయింది. తొలుత బిల్లుతో పాటు 300 డాలర్లు టిప్పుగా ఇచ్చారు. అనంతరం ఆ వ్యక్తి కిచెన్‌లోకి వెళ్లి అక్కడి పని వాళ్లతో మాట్లాడారు. వారి కష్ట సుఖాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఒక్కరికి 100 డాలర్ల చొప్పున 17 మందికి 1700 వందల డాలర్లు(రూ.1,31,190/-) టిప్పుగా ఇచ్చారు. దీంతో అక్కడి పనివాళ్లు ఒక్కసారిగా షాకయ్యారు. సంతోషంతో ఆ వ్యక్తితో ఫోటో దిగారు. ఇంత మొత్తంలో టిప్పు ఎప్పుడూ రాలేదని, వంటకాలు, సర్వీస్‌లకు మెచ్చి టిప్పు ఇచ్చారని రెస్టారెంట్ యాజమాన్యం పేర్కొంది. -
వేలానికి డైనోసార్ ..!
డైనోసార్ల అస్థిపంజరాలు... పారిస్‌లో వేలానికి సిద్ధమవుతున్నాయి. ఇంత పెద్ద సైజులో ఉన్న ఈ అస్థిపంజరాలు ఎవరైనా కొంటారా? అనుకుంటున్నారా... వీటికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రసిద్ధ హాలీవుడ్ నటులు లియోనార్డో డికాప్రియా, నికోలాస్ కేజ్ వంటి వారు ఇలాంటివి కొనుగోలు చేస్తున్నారు. తాజాగా బుధవారం జరిగే వేలంలో జూరాసిక్,క్రెటాషియస్ కాలానికి చెందిన ‘అలోసౌరుస్’ డైనోసార్, ఆ తర్వాతి కాలానికి చెందిన అతి పొడవైన మెడ, తోకలతో పాటు మొత్తం 12 మీటర్ల మేర శరీరం కలిగిన ‘డిప్లోడోకస్’ డైనోసార్ అస్థిపంజరాలు ఉంచుతారు. ఇలాంటి శిలాజాల మార్కెట్ కేవలం సైంటిస్టులకే పరిమితం కావడం లేదని, పెయింటింగ్స్ మాదిరిగా వస్తువుల అలంకరణకు డైనోసార్ల అస్థిపంజరాలుంచడం ఇప్పుడు ట్రెండీగా మారిందని ఈ వేలాన్ని నిర్వహిస్తున్న సంస్థ ప్రతినిధి ఐయాకొపొ బ్రియానో వెల్లడించారు. గత రెండు,మూడేళ్లుగా డైనోసార్ల నమూనాల కోసం చైనీయులు ఎక్కువ అసక్తి చూపుతున్నారని, తమ మ్యూజియంలతో పాటు వ్యక్తిగత కలెక్షన్ల కోసం వీటిని కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. వీటి కోసం కొత్తగా ముందుకు వస్తున్న కొనుగోలుదారులు బహుళజాతిసంస్థలతో, ఐరోపా, అమెరికాలకు చెందిన అత్యంత సంపన్నులతోనూ పోటిపడుతున్నారని తెలిపారు. బుధవారం జరగనున్న వేలంలో ఒకింత చిన్న సైజుదిగా భావిస్తున్న (12.5 అడుగులు) అలోసౌరోస్కు దాదాపు రూ. 5.22 కోట్లు (ఆర్నునర లక్షల యూరోలు), పెద్ద ముక్కు నుంచి తోక వరకు 12 మీటర్ల సైజు కలిగిన డిప్లోడొకస్కు దాదాపు రూ.4 కోట్ల వరకు (నాలుగున్నర నుంచి అయిదులక్షల యూరోలు ) రావొచ్చునని భావిస్తున్నారు. చికాగో మ్యూజియంలో డైనోసార్‌కు 8.6 మిలియన్ డాలర్లు... 1997లో మెక్‌డొనాల్డ్, వాల్ట్‌డిస్నీ సంస్థలతో సహా ఇతరుల విరాళాలు కలిపి దాదాపు రూ.55.86 కోట్ల (8.36 మిలియన్ డాలర్ల ) తో పూర్తిస్థాయిలోని ‘టెరన్నోసారస్’ అస్థిపంజరాన్ని కొనుగోలు చేసి చికాగోలోని నేషనల్ హిస్టరీ మ్యూజియంలో ఉంచారు. దీనిని చూసేందుకు లక్షలాది మంది వస్తుండడంతో ఈ కంపెనీలకు మంచి పబ్లిసిటీ వస్తోందని ఓ కొనుగోలు కేంద్ర నిపుణుడు ఎరిక్ మికీలర్ చెప్పారు. వీటిని తమ కలెక్షన్లలో పెట్టుకోవాలని అనుకుంటున్న వారిలో వాటి పళ్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారన్నారు.జురాసిక్ కాలాని కంటే పూర్వపు ౖ‘టెరన్నోసారస్’ డైనోసార్ అరుదైన పుర్రెను 2007లో నికోలాస్ కేజ్ కొనుగోలు చేసినా మంగోలియా నుంచి దానిని దొంగిలించి తీసుకొచ్చారని తెలియడంతో తిరిగి అప్పగించేశాడు. ప్రతీ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అయిదు డైనోసార్ల అస్థిపంజరాలను వేలానికి పెడుతున్నారు.ట్రియాసిక్ నుంచి క్రెటాషీయస్ కాలం వరకు జీవించిన ‘దెరోపొడా’ డైనాసారో అస్థిపంజరం వచ్చేజూన్‌లో దాదాపు రూ.12.04 కోట్లకు (1.5 మిలియన్ యూరోలకు) వేలం నిర్వహించనున్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
చికాగోలో అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ సమావేశం
చికాగో : టెక్సాస్‌లోని హోస్టన్‌లో ప్రపంచ తెలంగాణ కన్వెన్షన్ నిర్వహించడానికి అమెరికన్ తెలంగాణ అసోసియేషన్(ఆటా-తెలంగాణ) ఏర్పాట్లను ముమ్మరం చేసింది. జూన్ 29, 30, జులై 1న నిర్వహించే ఈ కార్యక్రమం కోసం చికాగోలో 3,57,200 డాలర్ల విరాళాలను సేకరించారు. విరాళాల సేకరణ కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి 400 మంది ఎన్ఆర్ఐలు హాజరయ్యారు. ఆటా తెలంగాణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నరేందర్ చిమర్ల అతిథులను సాదరంగా ఆహ్వానించారు. ప్రపంచ తెలంగాణ కన్వెన్షన్ ఏర్పాట్లను ఆటా తెలంగాణ అధ్యక్షులు సత్య కందిమల్ల వివరించారు. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ చేపట్టిన చారిటీ కార్యక్రమాలను వివరిస్తూ.. హోస్టన్ వరద బాధితుల కోసం విరాళాల ద్వారా నిధులు సమకూర్చి వారికి తమవంతు సహాయం అందించామని పేర్కొన్నారు. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఆవిర్భావం, లక్ష్యాల గురించి ఛైర్మన్ కరుణాకర్ మాధవరం తెలిపారు. అడ్‌హక్ కమిటీ శ్రీనివాస్ చాడ, బోర్డు మెమర్, క్రిష్ణ రంగరాజు, స్టాండింగ్ కమిటీ ఛైర్స్ రామచంద్రారెడ్డి ఆడె, సాయి గొంగటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడంలో తమవంతు కృషి చేశారు. ప్రపంచ తెలంగాణ కన్వెన్షన్ కోసం విరాళాలు ఇచ్చిన దాతలకు ట్రెజరర్ ప్రతాప్ చింతలపాణి కృతజ్ఞతలు తెలిపారు. రీజినల్ డైరెక్టర్ రంగారెడ్డి లెంకల, పల్లె పాట ఆటా నోటా కోఆర్డినేటర్ బిందు గొంగటి, ఆటా తెలంగాణ చికాగో వాలంటీర్లు, అతిథులను మంచి కార్యక్రమాలతో అలరించిన ప్రవీణ్ జలిగమకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
చికాగోలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
చికాగో : తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేట్ చికాగో(టీఏజీఏసీ) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చికాగోలోని గ్లెన్ డేల్ లో రమడ ఇన్ బాంక్వెట్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి చికాగో ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆఫీస్ కాన్సుల్ రాజేశ్వరి చంద్రశేఖరన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజేశ్వరి చంద్రశేఖరన్, కో స్పాన్సర్ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు జ్యోతి మాధవరామ్, ప్రణిత కందిమళ్లలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీఏజీఏసీ మహిళ ఫోరం ఛైర్పర్సన్ బింధు గంగోటి, టీఏజీఏసీ ప్రెసిడెంట్ జ్యోతి చింతలపాణిలు అతిథులను సాధర ఆహ్వానం పలుకుతూ ప్రసంగించారు. చికాగోలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున మహిళలు ఈ కార్యక్రమాన్ని హాజరై విజయవంతం చేశారు.బింధు గంగోటి, కో ఛైర్పర్సన్స్ నందిని కొండపల్లి, కీర్తి అడ్డుల, శైలజ యెండులూరి, మేఘన లక్కిడి సౌమ్య బొజ్జ, రజిత గోపు, దీప్తి గార్లపాటి, దీప్తి ముత్యం పేట్, క్రాంతి దొండ, శ్వేత జనమంచి, హరిత గునుగాటిలు పలు వినోధ కార్యక్రమాలకు రూప కల్పన చేసి అతిథులను ఆహ్లాద వాతావరణంలో గడిపేలా చేశారు. ఆటా, పాటలతో పాటూ వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. శైలజా మురుగు తన సంగీతంతో అందరిని ఆకట్టుకున్నారు. మమతా శర్మ, గ్రీష్మ వర్గీస్‌లు అతిథులకు విలువైన సూచనలు చేశారు. ప్రముఖ నటి శ్రీదేవి మృతికి సంతాపం తెలిపారు. యూత్ వాలంటీర్లు సునైనా గొంగటి, రియా గునుగంటి, సంజనా గొంగటి, రివా లక్కడి, స్మ్రుతి బెర్రమ్, లహరి బెర్రం, అమెయా, తాన్వి శ్రీవోల్లు చికాగోలోని లా రబిడా పిల్లల ఆసుపత్రికి విరాళాల సేకరణకు తమవంతు సహాయం చేశారు. టీఏజీసీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు మమతా లంకల, విజయ్ బెర్రమ్, వెంకట్ గునుగంటి, శ్వేత జనమంచిలు ఆతిథులను మర్వాదపూర్వకంగా ఆహ్వానించే పనులు చూసుకోగా, వాణి యంత్రింతాల డెకరేషన్ పనులను పర్యవేక్షించారు. కో స్పాన్సర్ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు సత్య కందిమళ్ల, ఛైర్మన్ కరుణాకర్ మాధవరం, మిగతా స్పాన్సర్స్, బోర్డు మెంబర్స్, ఉమా అవదూత, సుజాత కట్ట, మానస లట్టుపల్లి, క్రాంతి బీరం, రుక్మిణి చాడ, వాలంటీర్లకు టీఏజీఏసీ ప్రెసిడెంట్ జ్యోతి చింతలపాణి కృతజ్ఞతలు తెలిపారు. -
మెదడు సైజు పెరిగింది
గత ముప్పయి లక్షల సంవత్సరాల వ్యవధిలో మనిషి మెదడు సైజు మూడు రెట్లు పెరిగిందని ఒక తాజా అధ్యయనంలో తేలింది. మెదడు పరిమాణం పెరగడం వల్లనే నాగరికత, సంస్కృతి, భాషలు, పరికరాలను తయారు చేసుకునే సామర్థ్యం అభివృద్ధి చెందాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు వందకు పైగా మానవ శిలాజాలను నిశితంగా పరీక్షించిన తర్వాత షికాగో వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. షికాగో వర్సిటీకి చెందిన శిలాజ శాస్త్రవేత్త డాక్టర్ ఆండ్రూ డ్యూ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి 13 మానవ జాతులకు చెందిన 94 శిలాజాలను సేకరించి పరీక్షలు జరిపింది. పరిణామ క్రమంలో మానవ జాతికి సమీప బంధువులైన చింపాంజీలతో పోలిస్తే ఇప్పటి ఆధునిక మానవుల మెదడు పరిమాణం మూడు రెట్ల కంటే ఎక్కువగా ఉంటోందని, ఈ స్థాయిలో పరిణామం చెందడానికి ముప్పయి లక్షల ఏళ్ల కాలం పట్టిందని డాక్టర్ ఆండ్రూ డ్యూ తెలిపారు. -
విమానం బాత్రూంలో దాక్కొని..
చికాగో : సాధారణంగా టికెట్ లేని ప్రయాణం బస్సుల్లో మాత్రమే ఎప్పుడో ఒకసారి సాధ్యం అవుతుంది. అది కూడా బాగా మొండి ధైర్యం ఉన్నవాళ్లు, తెగించేవాళ్లతోనే సాధ్యం అవుతుంది. అలా ప్రయాణించేటప్పుడు అధికారులకు దొరికితే జైలుపాలు కావాల్సిందే. దీంతో సహజంగా టికెట్ లేని ప్రయాణం చేసేందుకు ఏ ఒక్కరు కూడా సాహసం చేయబోరు. అలాంటిది విమానాల్లో అలాంటి ప్రయాణం చేసే ఆలోచన ఎవరైనా చేస్తారా! కానీ, బ్రిటన్‌కు చెందిన మార్లిన్ హార్ట్మెన్ (66) అనే మహిళా అలా చేసింది. తన వద్ద కనీసం పాస్‌పోర్ట్, బోర్డింగ్ పాస్ కూడా లేకుండా నిఘా విభాగాన్ని, అధికారులను దాటుకుని విమానంలో అడుగుపెట్టింది. లోపలికి వెళ్లి బాత్ రూంలో దాక్కొని విమానం బయలుదేరిన తర్వాత ఓ ఖాళీ సీటు చూసుకొని అందులో కూర్చుంది. ఇలా చేయడం ఆమెకు షరా మాములేనట. దాదాపు నాలుగుసార్లు ఆమె ఇలాగే చేసిందట. అయితే, ఈసారి మాత్రం అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఓ హేర్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఆమెను బ్రిటన్ కస్టమ్స్ అధికారులు హిత్రూ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించగా గతంలో కూడా ఇలాంటి పనులు చేసినట్లు గుర్తించారు. జనవరి (2018) 14న ఆమెను అదుపులోకి తీసుకొని మూడు రోజులపాటు విచారించి తిరిగి ఆమె వచ్చిన చికాగో ఓ హేర్ ఎయిర్‌పోర్ట్‌కు పంపించారు. అక్కడి అధికారులు ఆమెను అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు. ఇంతకీ ఆమె ఎలా అధికారుల నుంచి తప్పించుకొని విమానంలోకి ప్రవేశించిందని ప్రశ్నించగా నిఘా కెమెరాలను పరిశీలించుకుంటూ తనిఖీ అధికారులను సమీపించే సమయంలో జుట్టుతో తన ముఖాన్ని కవర్ చేసుకొని చాలా వేగంగా అడుగులు వేస్తూ వెళ్లిపోయిందట. పెద్దావిడే కావడంతో కచ్చితంగా ఆమె దగ్గర పాస్‌పోర్ట్, బోర్డింగ్ పాస్ ఉంటాయని అధికారులు తనిఖీ చేయకపోవడంతో తాపీగా లండన్‌లో అడుగుపెట్టి తిరిగి చికాగోలో వచ్చి పడింది. -
పండ్లు కోసే కత్తి
నరేంద్రనాథ్ దత్త తొలిసారి విదేశీయానానికి సిద్ధం అవుతున్నాడు. తల్లికి బెంగ పట్టుకుంది. దేశం కాని దేశంలో ఎవరితో ఎలా ఉంటాడోనని! లోకం తెలియని యువకుడు లోకంతో నెగ్గుకు రాగలడా అని ఆమె చింత. రాత్రి భోజనం అయ్యాక.. పళ్లెంలో పండ్లు, వాటిని కోసుకోడానికి కత్తి పెట్టి కుమారుడికి అందించింది తల్లి. కొద్దిసేపటి తర్వాత వంటింట్లో ఉన్న తల్లికి కత్తి అవసరమై, ‘‘నరేంద్రా.. కొద్దిగా ఆ కత్తి తెచ్చివ్వు నాయనా’’ అని అడిగింది. ‘‘ఇదిగోనమ్మా..’’ అంటూ కత్తిని తెచ్చి ఇచ్చాడు నరేంద్ర. కుమారుడు తనకు కత్తిని ఇచ్చిన విధానం చూసి ఆ తల్లి ముఖంలో నిశ్చింత చోటు చేసుకుంది. కత్తి పదునుగా ఉండే వైపును తన చేతితో పట్టుకుని, కత్తిని పట్టుకోడానికి వీలుగా ఉండే భాగాన్ని తల్లి చేతికి అందించాడు నరేంద్ర. అది గమనించాక, తన కొడుకు ఎవరినీ నొప్పించే స్వభావంగల వాడు కాదని ఆమెకు అర్థమైంది! ఎవరినీ నొప్పించనివాడు ఎన్ని దేశాలనైనా నెగ్గుకు రాగలడు. ఆ నమ్మకంతోనే.. కొడుకు చికాగో బయల్దేరుతుంటే చిరునవ్వుతో వీడ్కోలు చెప్పగలిగింది ఆ తల్లి. ఆమె పేరు భువనేశ్వరీదేవి. ఆ కుమారుడే మనందరికీ తెలిసిన స్వామీ వివేకానంద. అతడి చిన్నప్పటి పేరే నరేంద్రనాథ్ దత్త. సాధారణంగా మనం పక్కవారి గురించి ఆలోచించం. మన సౌకర్యాన్నే చూసుకుంటాం. మనం హాయిగా కూర్చుంటే చాలు. పక్కవాళ్లు చోటు సరిపోక ఇబ్బంది పడుతున్నా పట్టించుకోం. కొంచెం కూడా సర్దుకుని కూర్చోం. కొన్నిసార్లు వాళ్ల వాటాలోకి కూడా వెళ్లిపోయి, వాళ్ల చోటును కూడా ఆక్రమించుకుంటాం. నిత్య జీవితంలో ఇలా మనం ఎందరినో మన చేతలతో ఇబ్బంది పెడుతుంటాం. మన మాటలతో నొప్పిస్తుంటాం. ఇదంతా మనకు తెలియకుండానే చేస్తుండవచ్చు. కానీ మంచి పద్ధతి కాదు. పక్కవారి సౌకర్యం గురించి మొదట ఆలోచించాలి. తర్వాతే మన సౌకర్యం. అప్పుడే ఈ లోకానికి మనతో సఖ్యత కుదురుతుంది. (నేడు స్వామీ వివేకానంద జయంతి. జాతీయ యువజన దినోత్సవం కూడా). -
అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై కాల్పులు
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని షికాగోలో ఉన్నతవిద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అక్బర్ (30) కొందరు గుర్తుతెలియని వ్యక్తుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. అతని కుడి దవడలోకి ఓ తూటా దూసుకుపోవడంతో కుప్పకూలిపోయాడు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు అక్బర్‌ను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. షికాగోలోని డివ్రై యూనివర్సిటీలో మాస్టర్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్స్ నెట్వర్కింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ చదివేందుకు మూడేళ్ల కిందట అమెరికా వెళ్లిన అక్బర్ మరో మూడు నెలల్లో కోర్సు పూర్తి చేసుకొని హైదరాబాద్ రావాల్సి ఉంది. ఈ నెల 5న అక్బర్ తన కారును పార్కింగ్ చేస్తుండగా అతనిపై కాల్పులు జరిగాయి. షికాగోలోనే ఉంటున్న అక్బర్ స్నేహితుడు, హైదరాబాద్‌కే చెందిన అశ్వక్‌కు పోలీసులు ఈ సమాచారం అందించగా అతను ఈ విషయాన్ని అక్బర్ తల్లిదండ్రులకు 6న తెలియజేశాడు. అత్యవసర వీసా ఇప్పించరూ.. హోంమంత్రికి అక్బర్ తండ్రి విజ్ఞప్తి కాల్పుల్లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న తమ కుమారుడిని చూసేందుకు వెంటనే అమెరికా వీసా ఇప్పించాలంటూ అక్బర్ తండ్రి యూసఫ్ ఆదివారం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలసి కన్నీళ్ల పర్యంతమయ్యారు. దీంతో వెంటనే స్పందించిన నాయిని...విదేశాంగశాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. అక్బర్ కుటుంబ సభ్యులకు అత్యవసర వీసా మంజూరు కోసం ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ విషయంలో అవసరమైన సాయం చేస్తామని హోంమంత్రి తమకు హామీ ఇచ్చినట్లు యూసఫ్ మీడియాకు తెలిపారు. మల్లాపూర్ అన్నపూర్ణ కాలనీలోని డైమండ్ ఎన్‌క్లేవ్‌లో యూసఫ్ కుటుంబం నివసిస్తోంది. యూసఫ్ ఆరుగురు కుమారుల్లో అక్బర్ నాలుగోవాడు. -
అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై కాల్పులు
-
టీఏజీసీ ఆధ్వర్యంలో ఘనంగా దసరా, దీపావళి వేడుకలు
చికాగో: చికాగో మహా నగర తెలుగు సంస్థ(టీఏజీసీ) ఆధ్వర్యంలో ఎల్లో బాక్స్ఆడిటోరియంలో దసరా, దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ , వారి బృందం ధనుంజయ్, పృథ్విచంద్ర, రోల్ రిదా, భార్గవి పిళ్ళై, ఉమా నేహా, రినైనా రెడ్డిల గాన కచేరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక ప్రముఖులతో పాటూ దాదాపు 2000మందికి పైగా ఎన్ఆర్ఐలు ఈ కార్యక్రమాన్ని హాజరై విజయవంతం చేశారని సంస్థ కోశాధికారి వెంకట్ గునుగంటి తెలిపారు. సప్త సముద్రాలూ దాటి విదేశాల్లో ఉన్న తెలుగు వారిని తమ సంస్కృతి సంప్రాదాయాలకు టీఏజీసీ ఈ సంబరాల ద్వారా మరింత దగ్గర చేసిందన్నారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా స్వాగత ద్వారం వద్ద టీఏజీసీ బ్యానర్, తోరణాలు కట్టారు. స్టేజి వద్ద టీఏజీసీ లోగోతో చాలా చక్కగా కనిపించేలా కార్యదర్శి దీప్తి ముత్యంపేట, ప్రదీప్ గింగు టీమ్ చక్కగా అలంకరించారు. టీఏజీసీ సంస్థ అధ్యక్షులు రామచంద్రా రెడ్డి ఏడే, సంస్కృతిక కమిటీ సభ్యులు, సంస్థ కార్యవర్గ సభ్యులతో కలిసి దీపావళి ఉత్సవ కార్యక్రమాలను గణపతి ప్రార్ధనతో ప్రారంభించారు. సంస్థ సభ్యులకు అతిథులకు రామచంద్రా రెడ్డి ఏడే దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు జాతి సంస్కృతి, సంప్రదాయాలు, దీపావళి పండుగ ఔన్నత్యాన్ని కొనియాడారు. సంస్కృతిక కమిటీ సభ్యులు, కార్యదర్శి సుజాత కట్ట, కో-ఛైర్మన్ ప్రవీణ్ వేములపల్లి ఈ దీపావళి వేడుకలను పురస్కరించుకొని పలు సాంసకృతిక కార్యాక్రమాలను 330 మంది స్థానిక కళాకారులతో రూపొందించారు. దీపావళి పండుగ విశిష్టతను తెలుపుతూ చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే విధముగా చేసిన నృత్యం అందరిని ఆకట్టుకుంది. నిన్న- మొన్నటి -నేటి తరాల హిందీ నటుల పాటలతో కళాకారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్బంగా కార్యక్రమంలో పాల్గొన్నచిన్నారులకు, కళాకారులకు, అధ్యక్షులు రామచంద్రా రెడ్డి ఏడే, దాతలు & సంస్థ వాలంటీర్లతో సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే ఈ సంవత్సరము ఎలాంటి లాభార్జన లేకుండా సంస్థ కార్యక్రమాలలో సహాయ సహకారాలు అందించిన వాలంటీర్లకు రామచంద్రా రెడ్డి జ్ఞాపికలు ప్రదానం చేశారు. సంస్థ గత సంవత్సర అధ్యక్షులు ప్రదీప్ కందిమళ్లని, వారు చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తుగా రామచంద్ర రెడ్డి ఏడే, కార్యవర్గ సభ్యులతో కలిసి శాలువా కప్పి, జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి కృషి చేసిన సంస్థ సభ్యులకు, అతిథులకు, కార్యవర్గ సభ్యులకు, వాలంటీర్లకి, దాతలకు, కమిటీల కార్యదర్శికి, కమిటీల సభ్యులకు, అన్ని పనులలో చేదోడువాదోడుగా ఉన్న మాజీ అధ్యక్షులు ప్రదీప్ కందిమళ్ల, వచ్చే సంవత్సర అధ్యక్షులు జ్యోతి చింతలపని, చక్కని భోజనాన్ని తక్కువ ధరకు అందించిన స్థానిక రెస్టారెంట్స్ యాజమాన్యానికి, భారతదేశము నుండి విచ్చేసిన అనూప్ రూబెన్స్, వారి బృందానికి రామచంద్రా రెడ్డి ఏడే హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. -
మాతృ రాష్ట్రం రుణం తీర్చుకోండి
-
మాతృ రాష్ట్రం రుణం తీర్చుకోండి
సాక్షి, అమరావతి : అమెరికాలో స్థిరపడిన తెలుగువారంతా పుట్టిన గడ్డకు తిరిగి ఎంతో కొంత ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. మాతృ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రుణం తీర్చుకోవాలని, జన్మభూమికి ఎంతో కొంత చేయాలన్నారు. అదే సమయంలో అమెరికా సమాజానికీ తోడ్పాటివ్వాలని, అవకాశం ఇచ్చిన ఆతిథ్య దేశాన్ని మరవకూడదన్నారు. అమెరికా పర్యటనకు వెళ్లిన ఆయన బుధవారం రాత్రి షికాగోలో తొలుత అక్కడి ఐటీ ప్రతినిధులతో సమావేశమై మాట్లాడారు. ఇక్కడున్న ప్రతి ఐటీ ఉద్యోగి పారిశ్రామికవేత్తగా మారాలని, ఉద్యోగంతోనే సంతృప్తి పడకూడదని చెప్పారు. మంచి జాబ్ ఉందని సరిపె ట్టుకోకుండా మరికొంత మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని చెప్పారు. రెండు దశాబ్దాల క్రితం ఐటీకి ఐకాన్ బిల్డింగ్ నిర్మించానని, అదే తెలుగువారి ఐటీ విప్లవానికి నాందిగా నిలిచిందన్నారు. ఇక్కడి తెలుగు వారిని చూస్తుంటే తాను హైదరాబాద్‌లో ఉన్నానా, లేక విజయవాడలో ఉన్నానా అని ఆశ్చర్యం కలుగుతోందన్నారు. తెలుగు వారు బాగా కష్టపడి సంపద సృష్టించి విశ్వ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. అమెరికా అంతటా ఏపీ నుంచి వచ్చిన చేపలు వినియోగించే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. అమెరికా నుంచి ఏడాదిలో రాష్ట్రానికి 500 సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాలని చెప్పారు. ఈ సందర్భంగా ఐటీ సిటీపై సీఎం, ఐటీ టాస్క్‌ఫోర్స్ చైర్మన్ గారపాటి ప్రసాద్ ప్రజెంటేషన్ ఇచ్చారు. విశాఖను మెగా ఐటీ సిటీగా, అమరావతిని మేజర్ ఐటీ హబ్‌గా మారుస్తామన్నారు. పలు ఒప్పందాలకు అంగీకారం రాష్ట్రంలో ఐటీ పరిశ్రమల స్థాపనకు ఆసక్తి చూపుతున్న ప్రవాస భారతీయులు, వారికి సంబంధించిన కంపెనీలతో ఒప్పందాలకు ముఖ్యమంత్రి అంగీకరించారు. రాష్ట్రంలో 60 కంపెనీలు నెలకొల్పడానికి విశాఖలో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలం కావాలని ఆయా సంస్థలు కోరాయి. తొలుత చంద్రబాబును తానా ప్రతినిధులు కలుసుకున్నారు. అమెరికాలో 20 నగరాలలో 5కె రన్ నిర్వహిస్తున్నామని, వీటి ద్వారా వచ్చిన ఆదాయంతో ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. రెండు మిలియన్ డాలర్లతో అమరావతిలో తానా భవన్ నిర్మిస్తామని, అందుకు అవసరమైన స్థలం కేటాయించాలని కోరగా ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తానన్నారు. షికాగో స్టేట్ వర్సిటీ చైర్మన్, డిపార్ట్మెంట్ ఆఫ్ మేథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్సెస్ ప్రొఫెసర్ రోహన్ అత్తెలెతో బాబు సమావేశమయ్యారు. డైనమిక్ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లో తమకున్న అనుభవం, ప్రావీణ్యాన్ని ఏపీలోని వర్సిటీలకు అందిస్తామని ప్రొఫెసర్ రోహన్ ప్రతిపాదించారు. ఇందుకు అవసరమైన కార్యాలయ వసతిని ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధత వ్యక్తం చేసింది. సీఎం వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్,సీఎం ముఖ్య కార్యదర్శి జి సాయి ప్రసాద్, ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణ కిషోర్ తదితరులున్నారు. షికాగో ఎయిర్‌పోర్టులో ఈ బృందానికి ఏపీఎన్ఆర్టీ, తానా సభ్యులు స్వాగతం పలికారు. షికాగో పర్యటన తర్వాత డెమోయిన్స్ బయలుదేరిన బాబు బృందం ఐయోవా స్టేట్ వర్సిటీని సందర్శించనుంది. ప్రజలకు సీఎం దీపావళి శుభాకాంక్షలు దీపావళి పండుగ ప్రతి ఇంటా ఆనంద దీపావళి కావాలని, అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆకాంక్షించా రు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన దేశ, విదేశాల్లోని తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు లోగిళ్లలో కోటి దీపకాంతులు వెల్లివిరియాలని, అంద రి కళ్లల్లో సంతోషం చూడాలనేది తన ఆకాంక్షని పేర్కొన్నారు. -
టీఏజీసీ ఆధ్వర్యంలో ఘనంగా వాలీబాల్ పోటీలు
చికాగో : తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో (టీఏజీసీ) వాలీబాల్, త్రో బాల్ పోటీలను ఈ నెల 8వ తేదీన బౌలింగ్ బ్రూక్‌లోని పెలికాన్ హార్బర్ ఇండోర్ ఆక్వాటిక్ పార్కులో ఇండ్సాఫ్ట్, హైదరాబాద్ హౌస్, శయంబుర్గ్ సహకారాలతో ఘనంగా నిర్వహించింది. టీఏజీసీ అధ్యక్షులు రామచంద్ర ప్రతిపాదించిన బొబ్బిలి మాధవరెడ్డి జ్ఞాపక వాలీబాల్, త్రో బాల్ పోటీలను పిలవాలని ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనను టీఏజీసీ కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. దివంగత మాధవ రెడ్డి అధ్యక్షుడిగా, టీఏజీసీ స్థాపక సభ్యుడిగా ఉన్నారు. టీఏజీసీ సభ్యులను, తెలుగు వారందరిని సరదాగా ఉండటానికి సాధారణ జీవితాల నుండి ఉపశమనం పొందడానికి, అలాగే కొత్త స్నేహితులను సంపాదించడానికి ప్రోత్సహించడం ఈ పోటీల యొక్క ప్రధాన లక్ష్యమని టీఏజేసీ పేర్కొంది. టీఏజీసీ కార్యవర్గం, క్రీడా విభాగం అంకితభావంతో ఈ సంవత్సరము నమోదు చేసిన జట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. సోషల్ మీడియాను ఉపయోగించడం ద్వారా ఈ కార్యక్రమానికి బాగా ప్రాచుర్యం వచ్చింది. టీఏజీసీ పురుషుల కోసం వాలీబాల్ టోర్నమెంట్‌ను 3 విభాగాలలో నిర్వహించింది. మహిళలకు త్రో బాల్ పోటీలను నిర్వహించారు. వాలీబాల్ విభాగంలో బిగినర్స్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ కేటగీరీల్లో పోటీలు జరిగాయి. మొత్తం ౩౦ వాలీబాల్ జట్లు, 4 గ్రూపులు, 90 పైగా మ్యాచ్‌లు జరిగాయి. 280 మంది పైగా క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. టీఏజీసీ సంస్థ అధ్యక్షులు రామచంద్రారెడ్డి ఏడే, ఆటల పర్యవేక్షణ, విజయాలు, నష్టాలను నమోదు చేయడం, స్కోర్లను నవినీకరించడం, తదుపరి మ్యాచ్‌లకు కచ్చితంగా జట్లు మరియు రిఫరీలు సమకూర్చడము చేయడం వంటివి సమయానుసారంగా అందుబాటులో ఉన్నవాలంటీర్స్, బీఓడీ ప్రవీణ్ వేమలపల్లి, అవినాష్ లట్టుపల్లి, విజయ్ భీరమ్, అంజి కందిమళ్ల, రాము బిల్లకంటి, మమతా లంకల, ప్రదీప్ కందిమళ్ల, జ్యోతి చినాతలాపని, వాలంటీర్స్ శశి, రమణ కాల్వ, రోహిత్ అకులా, సంతోష్ కొండూరి ఇతరులకు ధన్యవాదాలు తెలిపారు. టీఏజీసీ సంస్థ అధ్యక్షులు రామచంద్రారెడ్డి ఏడే, ఇండ్ సాఫ్ట్, హైదరాబాద్ హౌస్, శయంబుర్గ్ సంస్థల యజమాని వినోజ్ చనుమోలు, టీఏజీసీ కార్యవర్గ సభ్యులు, క్రీడా విభాగ సభ్యులతో కలిసి పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. త్రో బాల్ : విజేత: వెస్ట్ మాంట్ ఫ్యూరియస్ సిక్స్ రన్నరప్: రుద్ర జట్టు వాలీబాల్ (అడ్వాన్స్డ్): విజేత : వాలీబాల్ ఆడిక్ట్స్ రన్నరప్ : స్పార్టాన్స్ ఇంటర్మీడియట్ వాలీబాల్: విజేతలు : దేశీ బాయ్స్ -1 రన్నరప్ : చికాగో బుల్స్ పురుషుల వాలీ బాల్: విజేతలు :స్మ్న్-1 రన్నరప్ : దేశీ బాయ్స్ -2 టీఏజీసీ అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి ఏడే, ఇండోర్ త్రో బాల్. వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించిన ఇండ్ సాఫ్ట్ సీఈవో వినోజ్ చనుమోలు, హైదరాబాద్ హౌస్ శంబుర్గ్ వాసు వల్లభనేని, ఆటస్థలం నిర్వహణ యాజమాన్యానికి, వాలంటీర్లకు, రిఫరీలకు, లైన్ మెన్లకు, టీఏజీసీ కార్యవర్గ సభ్యులకు, క్రీడా కమిటీ, జట్టు కెప్టెన్లు అలాగే అన్ని జట్ల సభ్యులకు, మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. -
భారత్‌లో కూడా దుమ్ము రేపిన ‘ప్లేబాయ్’
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలోని చికాగో నుంచి గత 64 సంవత్సరాలుగా వెలువడుతూ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ‘ప్లేబాయ్’ మేగజిన్ గురించి తెలియని వారు దాదాపు లేకపోవచ్చు. భారత్‌లో కూడా ఇది దుమ్మురేపిందని, దాని ప్రభావంతో అచ్చంగా కాక్టెయిల్, డెబనీర్లాంటి పెద్ద వారి పత్రికలు పుట్టుకొచ్చాయనే విషయం ఎందరికి తెలుసో తెలియదు. ప్రపంచంలోని ప్రముఖ నాయకులు, సినీ నటీనటులు, సాహితీవేత్తలు, కళాకారులు, కార్టూనిస్టులు, నోబెల్ అవార్డు గ్రహీతల ఇంటర్వ్యూలు, వారి రచనలు ప్రచురించిన ఘనత కూడా ఈ పత్రిక ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. (సాక్షి ప్రత్యేకం) ఆ కోవలోనే భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఇంటర్వ్యూని ఈ పత్రిక 1963లో ప్రచురించింది. జవహర్ లాల్‌ను ఆయన నివాసమైన ‘తీన్ మూర్తి హౌజ్’లో ఇంటర్వ్యూ చేసినట్లు ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ చెప్పుకున్నారు. నెహ్రూ ఇంటర్వ్యూ ప్లేబాయ్ మేగజిన్‌లో రావడంపట్ల విమర్శలు వెల్లువెత్తడంతో నాటి పీఎంవో కార్యాలయం నెహ్రూ ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదని వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నెహ్రూ వివిధ సందర్భాల్లో, వివిధ సమావేశాల్లో వెల్లడించిన అభిప్రాయలను క్రోడీకరించి తామే ఇంటర్వ్యూ రూపంలో ప్రచురించామని ఆ తర్వాత ప్లేబాయ్ పత్రిక వివరణ ఇచ్చుకుంది. నెహ్రూకు ముందు ప్రముఖ బ్రిటిష్ తత్వవేత్త, మేథమెటీషియన్, రచయిత, రాజకీయవాది బెర్ట్రండ్ రస్సెల్ ఇంటర్వ్యూను ప్రచురించింది. నెహ్రూ ఇంటర్వ్యూతోనే భారత్‌లో ప్లేబాయ్ పత్రిక ఒకటుందనే విషయం తెల్సింది. (సాక్షి ప్రత్యేకం) నగ్న చిత్రాలు, బికినీ భామల ఫొటోలు ఉంటాయన్న కారణంగా భారత్‌లో ఈ పత్రిక విక్రయానికి అనుమతివ్వలేదు. దాంతో దొంగచాటుగా ఈ పత్రిక ప్రతులు భారత్‌కు వచ్చేవి. ప్లేబాయ్ స్ఫూర్తితో అమెరికాలో, లండన్‌లో ప్లేబాయ్ క్లబ్బులు కూడా వచ్చాయి. వీటిని ముద్దుగా క్యాట్స్ ఐ క్లబ్‌లని పిలిచేవారు. ఇదే స్ఫూర్తితో భారత వాణిజ్య రాజధాని ముంబైలో కూడా ‘క్యాట్స్ ఐ క్లబ్’లు వెలిశాయి. ఈ క్లబుల్లో బికినీ భామలు క్లస్టమర్లకు మందు పోసేవారు. సభ్యులకు మాత్రమే ఈ క్లబ్బుల్లోకి ప్రవేశం ఉండేది. ప్రతి సభ్యుడి వద్ద క్లబ్బు డోర్‌ను తీసుకొని రావడానికి ఓ కీ కూడా ఉండేది. కొన్నేళ్లలోనే ఈ క్లబ్బులు మూతపడ్డాయి. అయితే అమెరికా, లండన్‌లోని ప్లేబాయ్ క్లబ్బులు మాత్రం 1960 నుంచి 1988 వరకు కొనసాగాయి. (సాక్షి ప్రత్యేకం) ఈ క్లబ్బుల పేరిట ‘ప్లేబాయ్ బన్నీ’ పోటీలు నిర్వహించేవారు. ఇందులో అందమైన బికినీ భామను ఆ ఏడాది ప్లేబాయ్ బన్నీగా ఎంపిక చేసేవారు. లండన్‌లో జరిగిన ఓ ప్లేబాయ్ బన్నీ పోటీలో భారత్‌కు చెందిన కటీ మీర్జా ఎన్నికయ్యారు. ఆమె భారత్‌కు వచ్చినప్పుడు ప్రజలు ఆమెకు నీరాజనాలందించారు. సన్మాన సత్కారాలు ఏర్పాటు చేశారు. దాంతో ఆమెకు ‘కస్మే వాదే, జైల్ యాత్ర’ తదితర చిత్రాల్లో అవకాశం కూడా వచ్చింది. చికాగో నుంచి వెలువడుతున్న ప్లేబాయ్ మేగజిన్ పత్రిక 1972లో 70 లక్షల కాపీల అమ్మకాలను దాటిపోవడంతో భారత్‌లో కూడా దానికి ప్రాచుర్యం పెరిగింది. భారత్‌లో బహిరంగంగా అమ్మే అవకాశం లేకపోవడంతో అదే తరహాలో ‘కాక్టాయిల్’ అనే పత్రిక ముంబయి నుంచి వెలువడేది. కొన్ని నెలల్లోనే అది మూతపడిపోయింది. అప్పుడు ‘డెబనీర్’ పత్రిక ప్రచురణ ప్రారంభమైంది. ప్లేబాయ్ లాగానే డెబనీర్లో కూడా నగ్న భామల బొమ్మలు, సీరియస్ ఆర్టికల్స్ వచ్చేవి. పయనీర్, ఔట్లుక్లాంటి పత్రికలకు సంపాదకత్వం వహించిన వినోద్ మెహతా డెబనీర్ పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. కాలక్రమంలో నగ్న ఫొటోల ప్రచురణను నిలిపివేయడంతో సర్కులేషన్ బాగా పడిపోయింది. ఇదే విషయాన్ని తోటి జర్నలిస్టులు వినోద్ మెహతాను అడిగినప్పుడు ‘సర్క్యులేషన్ కోసం ప్రచురణకర్తలు నగ్న ఫొటోలు వేయమంటారు. సీరియస్ ఆర్టికల్స్‌ను ప్రచురించడంలో భాగంగానే ఇంతకాలం మేము నగ్న ఫొటోలు వేస్తూ వచ్చాం. (సాక్షి ప్రత్యేకం) సీరియల్ ఆర్టికల్స్‌కు జనాదరణ పెరగడంతో నగ్న ఫొటోలు ఇక అవసరం లేదని నిలిపేశాం. ఇలా నిలిపేసినప్పుడల్లా సర్కులేషన్ పడిపోవడం, మళ్లీ వేసినప్పుడల్లా పెరగడం మామూలై పోయింది’ అని అన్నారు. ఎన్ని సీరియస్ ఆర్టికల్స్‌ను ప్రచురించినప్పటికీ పత్రిక మనుగడ సాగించలేకపోయింది. బెర్ట్రాండ్ రస్సెల్, జాన్ పాల్ సాత్రే, మార్టిన్ లూథర్ కింగ్, ఫిడెల్ క్యాస్ట్రో, జిమ్మీ కార్టర్, సల్మాన్ రష్దీ లాంటి వారి మనస్తత్వాలను విశ్లేషించిన ‘ప్లేబాయ్’ పత్రిక మార్గరెట్ అట్వుడ్, పీజీ వుడౌజ్, హరుకి ముర్కామి, జాన్ లీ కర్రీ, ఆర్థర్ సీ క్లార్క్, జాన్ అప్డైక్, వ్లాదిమీర్ నబకోవ్లాంటి ప్రముఖ రచనలను ప్రచురించారు. (సాక్షి ప్రత్యేకం) భారత మాజీ రాష్ట్రపతి ఆర్కే నారాయణ్ రాసిన ‘గాడ్ అండ్ కాబ్లర్’ కథను కూడా ప్లేబాయ్ ప్రచురించింది. ఈ పత్రిక వ్యవస్థాపకుడు హూ హెఫ్నర్ 91 ఏట బుధవారం మరణించిన విషయం తెల్సిందే. ప్లేబాయ్ పత్రికకు నగ్నంగా ఫోజులిచ్చిన దాదాపు వెయ్యిమంది బికినీ భామలతో శృంగార జీవితాన్ని పంచుకున్న ఆయన భౌతికకాయాన్ని చివరకు అలనాటి శృంగార దేవత మార్లిన్ మన్రో పక్కనే సమాధి చేశారు. -
చికాగోలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
చికాగో: తెలంగాణ పర్యాటక శాఖ, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో చికాగో మహానగర తెలుగు సంస్థ(టీఏజీసీ) దసరా, బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించింది. తెలంగాణ ప్రజల జీవన విధానం, సంస్కృతిని అద్దం పట్టేలా, కులమతాలకు అతీతంగా, ప్రాంతీయ విభేదాలు లేకుండా, ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారిని గుర్తించేలా, ఘనంగా బతుకమ్మ వేడుకలను చికాగోలో టీఏజీసీ నిర్వహించింది. ఈ నెల 24న శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం, పంచవటి కళాప్రాంగణములో సుమారు వెయ్యికి పైగా అతిథులతో బతుకమ్మ, దసరా వేడుకలను చాలా ఘనంగా నిర్వహించారు. గత పదిహేనేళ్ల నుంచి టీఏజీసీ కార్యవర్గం, జాతీయ సంస్థల సహకారంతో దసరా వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నారు. గత ఏడాది నుంచి తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో టీఏజీసీ బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైన సంప్రదాయ గుర్తింపు తెచ్చేందుకు టీఏజీసీ అధ్యక్షురాలు జ్యోతి చింతలపాణి, మహిళా బోర్డు డైరెక్టర్లు విశేష కృషి చేశారు. 125 మంది మహిళలు పోచంపల్లి ప్రత్యేక చీరలు ధరించి టీఏజీసీ బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక వన్నెను తెచ్చారు. టీఏజీసీ అలంకరణ కమిటీ చైర్ శ్వేతా జనమంచి నాయకత్వంలో వాలంటీర్ల సహాయముతో పంచవటి కళాప్రాంగణాన్ని మరియు బతుకమ్మలను పెట్టే ప్రాంతాన్ని రంగుల రంగుల పూలతో అలంకరించారు. టీఏజీసీ బతుకమ్మ తయారుచేయడానికి న్యూ జెర్సీ నుండి పూలను తెప్పించి ఆదివారంనాడు సాంప్రదాయ పద్దతిలో అమర్చారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు దేవాలయములో పార్వతి దేవికి పసుపు, కుంకం, ముక్కు పుడక మరియు పుష్పాలను సమర్పించారు. టీఏజీసీ బతుకమ్మ కమిటీ చైర్ మమతా లంకాల మరియు టీఏజీసీ అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి ఏడే అతిథులను స్వాగతిస్తూ పండుగా విశిష్టతను వివరించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం బతుకమ్మ సాగనంపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యక్ష సాంప్రదాయ సన్నాయి, సంగీత వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్ళి టీఏజీసీ పురుషు వాలంటీర్ల సహాయంతో ఆలయ ప్రాంగణ కొలనులో నిమజ్జనం చేశారు. అనంతరం మహిళలకు బతుకమ్మ పోటీలను నిర్వహించారు. గెలుపొందిన వారికి టీఏజీసీ అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి ఏడే బహుమతులు అందజేశారు. టీఏజీసీ ఫుడ్ కమిటీ చైర్మెన్ అవదూత నాయకత్వంలో తెలంగాణ సాంప్రదాయ పద్దతిలో తయారు చేసిన ఆహార పదార్థాలను అమ్మకానికి ఉంచారు. వాటిద్వారా వచ్చిన డబ్బును వరుస హారికేన్లతో సతమతమైన వరదబాధితుల సహాయర్థం ఉపయోగించనున్నారు. బతుకమ్మలను సాగనంపిన తరువాత, అన్ని కుటుంబాలు టీఏజీసీ నిర్వహించే జమ్మి పూజలో పాల్గొన్నారు, బాలాజీ ఆలయ పూజారి హనుమాన్ ప్రసాద్ పూజ అనంతరము భక్తులందరికి పూజలో కంకణాలను కట్టి జమ్మి ఆకులు, అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. అన్ని కుటుంబాలు జమ్మీని పంచుకోవడం మరియు పెద్దల నుండి అతిథిలు నుండి దీవెనను తీసుకున్నారు. టీఏజీసీ అధ్యక్షులు రామచంద్రా రెడ్డి ఏడే మాట్లాడుతూ, రాబోయే కాలానికి మన సంస్కృతిని కాపాడుకోవటానికి ఈ పండుగ వేడుకలు ఎంతోగానో ఉపయోగపడతాయన్నారు. అంతేకాకుండా ఈ వేడుకలను ఇంత ఘనంగా జరుపుకోవడానికి సహకరించిన మహిళలందరికీ, సంస్థ కార్యవర్గ సభ్యులకు, స్వచ్చంద సేవలను అందించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిత్వశాఖ, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ బృందం, ఎస్వీఎస్ బాలాజీ ఆలయం నిర్వహణ కమిటీ, దాతలు, మీడియాకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
షికాగోలో కాల్పుల కలకలం
షికాగో(అమెరికా): షికాగో నగరంలో మంగళవారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో ఒకరు చనిపోగా ఆరుగురు గాయపడ్డారు. గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పక్కన వెళ్తున్న వారిపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతోపాటు మరో ఆరుగురు గాయపడ్డారు. వారికి ఎటువంటి అపాయం లేదని వైద్యులు తెలిపారు. షికాగో పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. -
సినారెకు చికాగో సాహితీ మిత్రుల ఘన నివాళి
జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, దివంగత డా.సి. నారాయణ రెడ్డికి చికాగో సాహితీ మిత్రులు సంఘం ఆదివారం ఘన నివాళులు అర్పించింది. సుమారు 60 మంది తెలుగు సాహితీ మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెట్టుపల్లి జయదేవ్ కార్యక్రమాన్ని ప్రారంభించి సినారె శిష్యురాలు డా.దామరాజు లక్ష్మీని వేదిక మీదకు ఆహ్వానించారు. సినారె గురించి దాదాపు మూడు గంటల పాటు లక్ష్మీ మాట్లాడారు. యస్వీ రామారావు, డా. శింఠి శారదాపూర్ణ, కందాళ రమానాథ్, డా.బొల్లవరం విశ్వనాథరెడ్డి, డా. పుప్పాల శ్యాంమోహన్, కానూరు జగదీష్, డా.రవీంద్రనాథ్ రెడ్డి, చిమట కమల, నందుల మురళి తదితరులు సినారెతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. -
చికాగోలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
చికాగో : చికాగోలో వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారయణస్వామి ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. చికాగోలోని వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నాటా అధ్యక్షులు గంగసాని రాజేశ్వర రెడ్డి, కందిమల్ల సత్యనారయణరెడ్డి, నాటా బోర్డ్ మెంబర్ కురసపాటి శ్రీధర్ రెడ్ది, చికాగో నాటా వైస్ ప్రెసిడెంట్ వెంకట రెడ్డి, అమెరికా వైఎస్సార్సీపీ ప్రతినిధులు ఆర్వి రెడ్డి, కెఎస్ఎన్ రెడ్డిలు వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వ లక్షణాలను కొనియాడారు. మిమిక్రి ఆర్టిస్ట్ రమేశ్ వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆనుకరిస్తూ చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో ప్రముఖ చిత్రకారుడు పద్మశ్రీ ఎస్ వి రామారావును ఘనంగా సత్కరించారు. రామరావుని చికాగో సాహితీ మిత్రుల ప్రతినిధి మెట్టుపల్లె జయదేవరెడ్డి సభకు పరిచయం చేశారు. ఎస్ వి రామారావు మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్ది ఒక గొప్ప ప్రజానాయకుడని, పేదప్రజలు ఎప్పుడూ ఆయనను తలచుకుంటూ ఉంటారన్నారు. ప్రెసిడెంట్ కెనెడీ లాగే రాజశేఖరరెడ్డికి ప్రత్యేక ఆకర్షణ ఉందని ఆయనను చూడగానే నమస్కరించి గౌరవించాలనిపిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆటా మాజీ అధ్యక్షులు హనుమంత రెడ్డి, గవ్వ సంధ్య, హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగోమాజీ ఆధ్యక్షులు భీమా రెడ్డి, ఐఏజీసీ ప్రతినిధులు సురేష్, గోపిరెడ్డి, రాంభూపాల్ రెడ్డి, టీఏజీసీ ప్రతినిధులు రామచంద్రా రెడ్డి, ప్రదీప్ రెడ్డి, నాటా రీజినల్ వైస్ ప్రెసిడెంట్ లింగారెడ్ది, వెంకటరెడ్డి, హేమ సుందర్రెడ్డిలు పాల్గొన్నారు. -
చికాగోలో తెలంగాణ అవతరణ దినోత్సవం
చికాగో: పదిహేను నెలల క్రితం పురుడు పోసుకున్న అమెరికన్ తెలంగాణ అసోసియేషన్(ఏటీఏ) చికాగో మహా నగరంలోని స్థానిక రామదా ఇన్ బాంకెట్స్ హాల్లో అధికారికంగా మూడవ తెలంగాణ అవతరణ దినోత్సవాలను ఘనంగా జరుపుకుంది. ఇందులో ఆమెరికా నలుమూలల నుంచి వచ్చిన 500 మందికి పైగా సంఘ సభ్యులు, పలు తెలంగాణ సంఘ సభ్యులు, చికాగో నివాసులు పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని గణపతి ప్రార్థనతో ప్రారంభించారు. సంస్థ వ్యవస్థాపక పితామహుడు శ్రీ మాధవ రెడ్డి బొబ్బిలి, తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు శ్రీ విద్యాసాగర్ రావు, రాజ్యసభ సభ్యులు శ్రీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి సంతాపము తెలిపి నివాళులు అర్పించారు. మొదటగా అధ్యక్షులు రామ్మోహన్ కొండా, కన్వీనర్ వినోద్ కుకునూర్, తోటి కార్యవర్గ సభ్యులు గత సంవత్సరము ప్రపంచ తెలంగాణ మహా సభలు నిర్వహించడానికి సహకరినించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సంస్కృతిని/పండుగలను బావి తరాలకు చాటి చెప్పే కొన్ని కార్యక్రమాలను రూపొందించుకొని ప్రతిఏట ప్రపంచ నలుమూలాల నిర్వహించాలని సూచించారు. తరువాత సత్య కందిమళ్ల గారు మాట్లాడుతూ సంఘంలో అందరు కలిసికట్టుగా పని చేయాలనీ, కన్వెన్షన్ తో పాటు సంఘం నిర్వహించే అన్ని కార్యక్రమాలు చాలా ఘనంగా అన్ని నగరాలలో నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత కార్యదర్శి రవి ఉపాధ్యాయ కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులతో మరియు నూతన అధ్యక్షులు సత్య కందిమళ్ల గార్లతో ప్రమాణస్వీకారం చేయించారు. అలాగే నూతన కార్యవర్గ సభ్యులు అందరు ఏకగ్రీవంగా కార్యదర్శిగా విష్ణు మాధవరం , కోశాధికారిగా ప్రతాప్ చింతలపని , సహాయ కార్యదర్శిగా రఘు మరిపెద్ది , సహాయ కోశాధికారిగా మహీధర్ రెడ్డి , 2019-20 అధ్యక్షులుగా వినోద్ కుకునూర్ , చైర్మన్ గా కరుణాకర్ మాధవరంను ఎన్నుకున్నారు. 2018 జూన్ 29 , 30 , జులై 1 జరుపుకునే రెండవ ప్రపంచ తెలంగాణ మహా సభలను మూడు నగరాలను పరిశీలించి చివరగా టెక్సాస్ రాష్ట్రములోని హౌస్టన్ నగరములో జరుపుకోవాడని ఏకగ్రీవంగా నిర్ణయించారు. దానికి కన్వీనర్ గా బంగారు రెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం అట పాటలతో, నృత్య ప్రదర్శనల తో చిన్నారులు అందరిని ఆకట్టుకున్నారు. ప్రవీణ్ జాలిగామ గారి నేతృత్వములో తెలంగాణ పాటలతో జానపద కళాకారుడు జనార్దన్ పన్నెల తమ పాటలతో జనాల్లో జోష్ నింపారు. కార్యక్రమాన్ని ముగిస్తూ ప్రవీణ్ జాలిగామ, జానపద కళాకారుడు జనార్దన్ పన్నెలను గ్యాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ టూరిజం అండ్ కల్చరల్ శాఖ వారికీ కృతజ్ఞతలు తెలియజేసారు. -
అది దారుణమే.. మమ్మల్ని క్షమించండి!
-
ఔను అది దారుణమే.. మమ్మల్ని క్షమించండి!
షికాగో: ప్రయాణికుడిని దారుణంగా విమానం నుంచి ఈడ్చిపారేసిన ఘటనపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఎట్టకేలకు దిగొచ్చింది. జరిగిన ఘటన బాధాకరమే అంటూ బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ఆదివారం షికాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అధికంగా టికెట్లు బుక్ అయిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో సీట్లు ఖాళీగా లేవనే కారణంతో 69 ఏళ్ల డేవిడ్ డావో అనే ప్రయాణికుడిపై విమాన సిబ్బంది దౌర్జన్యపూరితంగా వ్యవహరించారు. ’నన్ను చంపండి.. అంతేకానీ నేను ఇంటికి వెళ్లాలి’ అని ఆసియాకు చెందిన డాక్టర్ అయిన ఆయన ఎంత వేడుకున్నా.. కనికరించని సిబ్బంది ఆయనను అత్యంత కిరాతకంగా విమానం నుంచి ఈడ్చిపారేశారు. ఈ క్రమంలో ఆయన నోటినుంచి రక్తం ధారాళంగా కారినా పట్టించుకోలేదు. ఈ అమానుషాన్ని తోటి ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియోలను చూసి దిగ్భ్రాంతిచెందిన నెటిజన్లు ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటనపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఈసీవో ఆస్కార్ మునోజ్ స్పందించారు. ‘మా విమానంలో జరిగిన ఘటన నన్ను కలత పెడుతున్నది. బలవంతంగా విమానం నుంచి ఈడ్చేసిన ప్రయాణికుడికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ప్రయాణికులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తామని, భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. — Enrico Valenzuela (@enricovalen) 11 April 2017 -
విమానం నుంచి ఈడ్చిపారేశారు!
-
విమానం నుంచి ఈడ్చిపారేశారు!
న్యూయార్క్: ప్రయాణికుడి పట్ల అమానవీయంగా ప్రవర్తించిన అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విమానం నిండిపోయిందన్న సాకుతో ప్రయాణికుడిని ఈడ్చిపడేసిన ఘటన వెలుగుచూడడంతో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ పై మండిపడుతున్నారు. షికాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. షికాగో నుంచి కెంటకీలోని లూయిస్ విల్లే యునైటెడ్ 3411 విమానంలో ఎక్కి కూర్చున్న ప్రయాణికుడిని కిందకు దిగాలని సెక్యురిటీ సిబ్బంది ఆదేశించారు. తాను తప్పనిసరిగా ఇంటికి వెళ్లాల్సివుందని బతిమాలినా సెక్యురిటీ వినిపించుకోలేదు. ప్రయాణికుడి చొక్కా పట్టుకుని బలవంతంగా ఈడ్చుకుపోయారు. కిందపడిపోయినా లెక్కచేయకుండా ఈడ్చుకుంటూపోవడంతో అతడికి గాయాలయ్యాయి. ఇంత జరుగుతున్నా అడ్డుకునేందుకు ప్రయాణికులెవరూ ముందుకు రాలేదు. ఈ దుశ్చర్యను వీడియో తీసి ట్విటర్ లో పోస్ట్ చేశారు. బాధితుడు ఆసియా వాసి అయివుంటాడని భావిస్తున్నారు. తాను వైద్యుడినని ఇంటికి తిరిగివెళుతున్నట్టు విమాన సిబ్బందితో బాధితుడు చెప్పినట్టు ప్రయాణికులు వెల్లడించారు. రక్తమోడుతూ గాయాలతో మళ్లీ విమానంలోకి వచ్చిన బాధితుడు.. 'నన్ను చంపేయండి.. చంపడి. నేను ఇంటికి వెళ్లాల'ని వేడుకున్నా విమాన సిబ్బంది కనికరించలేదని తెలిపారు. ఈ ఘటనపై క్షమాపణ చెప్పేది లేదని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ మొండిగా సమాధానం ఇవ్వడం గమనార్హం. లెగ్గింగ్స్ వేసుకున్నారని ఇద్దరు అమ్మాయిలను గత నెలలో విమానం ఎక్కనీయకపోవడంతో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమర్శలపాలైంది. -
క్యాబ్‌లో దాడి.. ఉబర్‌పై యువతి పిటిషన్
వాషింగ్టన్: ఉబర్ క్యాబ్‌లో ప్రయాణిస్తుండగా తనపై దాడి జరిగిందని ఆరోపిస్తూ అమెరికా యువతి పిటిషన్ దాఖలుచేసింది. ఉబర్ సంస్థతో పాటు దాడి చేసిన ప్యాసింజర్ నుంచి తనకు రూ.32.53 లక్షలు నష్టపరిహారంగా ఇప్పించాలని కోర్టును ఆశ్రయించింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. చికాగోకు చెందిన 25 ఏళ్ల జెన్నిఫర్ కమాచో గత జవనరి 30న ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకుంది. షేరింగ్‌లో మరో ప్యాసింజర్ కూడా క్యాబ్‌లో జర్నీ చేశారు. ఉబర్ క్యాబ్ ఎక్కిన కొంత సమయం తర్వాత ముందు సీట్లో కూర్చున్న ప్యాసింజర్ తనపై దాడికి పాల్పడ్డారని పిటిషన్లో జెన్నిఫర్ పేర్కొంది. తన ముఖంపై పలుమార్లు కొట్టడంతో తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైనట్లు తెలిపింది. ఆస్పత్రి బిల్లులు, తన పడ్డ బాధకు, కోల్పోయిన సమయానికి మొత్తంగా 50 వేల అమెరికన్ డాలర్లు నష్టపరిహారం కోరుతూ కుక్ కౌంటీ సర్క్యూట్ కోర్టును ఆశ్రయించింది. జెన్నిఫర్ పై దాడికి పాల్పడ్డందుకు 34 ఏళ్ల రేమర్ను చికాగో పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాటరీతో రేమర్ దాడిచేసి జెన్నిఫర్‌ను గాయపరిచినట్లు రుజువైంది. అటార్నీ బ్రేయాంత్ గ్రీనింగ్ మాట్లాడుతూ.. ఉబర్ క్యాబ్ వారు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. -
చికాగోలో అకృత్యం: షాకింగ్ నిజాలు
చికాగో: అమెరికాలో కొన్ని రోజుల కిందట చోటుచేసుకున్న మైనర్ గ్యాంగ్ రేప్ ఘటనలో షాకింగ్ నిజాలు బయటకొస్తున్నాయి. చికాగోలో ఇంట్లో నుంచి షాపింగ్ మాల్ కు వెళ్లిన 15 ఏళ్ల బాలిక సామూహిక అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఫేస్ బుక్ లో లైవ్ స్ట్రీమింగ్ అన్ చేసి ఆ అకృత్యానికి ఒడిగట్టిన నిందితులలపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని కోర్టులో హాజరు పరిచారు. గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డ కేసులో ఇద్దరు మైనర్లు 14 ఏళ్లు, 15 ఏళ్లు ఉన్నారు. బాధిత బాలికకు ఈ ఇద్దరు తెలిసిన వాళ్లేనని విచారణలో తేలింది. బాలికపై అఘాయిత్యానికి కొన్ని రోజుల ముందు నుంచే ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డామని ఒప్పుకున్నారు. చైల్డ్ పోర్నోగ్రఫీ, లైంగిక వేధింపులు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్లాన్ ప్రకారమే.. బాలికపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు అసిస్టెంట్ స్టేట్ అటార్నీ మహా గార్డ్ నర్ వెల్లడించారు. బాలిక షాపింగ్ కు వెళ్తుంటే ఆమెను వెంబడించారు. అనంతరం దగ్గర్లోని ఓ ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలుర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా.. తమ వద్ద ఉన్న కుక్కను ఆమె మీదకి వదులుతామని బెదిరించి పారిపోకుండా చేశారని బాధితురాలు కోర్టులో తన ఆవేదన వెల్లగక్కింది. తనను చాలాసార్లు చెంపదెబ్బలు కొట్టారని కన్నీటి పర్యంతమైంది. మైనర్లు ఈ అకృత్యానికి పాల్పడిన సమయంలో ఫేస్ బుక్ లైవ్ పెట్టారని, దాదాపు నలబై మంది వీడియో చూశారని.. అయితే ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదని చికాగో పోలీసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫేస్ బుక్ పేజీ ఆధారంగా బాలురను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. లైవ్ స్ట్రీమింగ్ తర్వాత వీడియోను కొన్ని ఫేస్ బుక్ అకౌంట్లలో పోస్ట్ చేశారని, ఇది చాలా దారుణ విషయమని తప్పుచేసింది మైనర్లు అయినా చర్యలు తప్పవని పేర్కొన్నారు. మైనర్లు అయినందున వారి వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. కూతురిని స్కూలుకు పంపించాలంటే భయంగా ఉందని, ఏం చేయాలో అర్థం కావడం లేదని బాలిక తల్లి వాపోయారు. -
చికాగోలో మహిళా దినోత్సవ వేడుకలు
అమెరికా తెలుగు ఆసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం చికాగోలో ఘనంగా నిర్వహించారు. రాయల్ ప్యాలెస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి 'బీ బోల్డ్ ఫర్ ఏ ఛేంజ్' అనే థీమ్‌తో నిర్వహించారు. దాదాపు 250 మందికి పైగా మహిళలు ఈ వేడుకలకు హాజరయ్యారు. మహిళా దినోత్సవ సందర్భంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు వారు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలపై చర్చ జరిగింది. వేడుకలకు హాజరైన సునీతారెడ్డి, డా.మెహర్ మేడవరంలు స్వాగత ఉపన్యాసాలు ఇచ్చారు. బ్రేస్ట్ క్యాన్సర్‌పై ప్రముఖ డాక్టర్ శీలా కొండా మహిళలకు అవగాహన కల్పించారు. మహిళల్లో మానసిక సమస్యలపై ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ అలయన్స్, ఇండియానాకు చెందిన నిపుణురాలు మేరీ బెడెల్ మాట్లాడారు. ఆ తర్వాత అర్బన్ జస్టిస్‌కు చెందిన అటార్నీ స్వప్నా రెడ్డి ఇమిగ్రేషన్ సమస్యలపై విలువైన సమాచారాన్ని పంచుకున్నారు.కార్యక్రమానికి హాజరైన మహిళలకు క్విజ్, తెలుగు స్పీకింగ్ కాంపిటీషన్ తదితర పోటీలు నిర్వహించారు. ఆయా పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. హరి మాధురి పాడిని పాటలను ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేశారు. -
ఫేస్ బుక్ లైవ్‌లో బాలికపై గ్యాంగ్ రేప్
చికాగో: చికాగోలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నుంచి షాపింగ్ మాల్‌కు బయలుదేరిన ఓ బాలకను కిడ్నాప్ చేసి పలువురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. 15ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ చేయడమే కాకుండా ఫేస్ బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేశారు. 40 మంది వరకు ఈ లైవ్ వీడియోను చూసి కూడా.. 911కు డయల్ చేయకపోవడం చాలా బాధాకరం అని చికాగో పోలీసు విభాగం అధికారప్రతినిధి ఆంటోనీ తెలిపారు. బాలికపై లైంగిక వేధింపులను చూస్తూ కూడా ఒక్కరూ పట్టించుకోలేదు. ఏ మాత్రం బాధ్యతగా ప్రవర్తించలేదని పేర్కొన్నారు. ఫేస్ బుక్ పేజీ ఆధారంగా నేరస్తులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సదరు వీడియోను పోలీసులు ఫేస్ బుక్ యాజమాన్యం సహకారంతో ఆ పేజీనుంచి తొలగించారు. ఐదు నుంచి ఆరుగురు సభ్యులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆదివారం సాయంత్రం షాపుకు వెళ్లిన తన కూతురు ఇంటికి తిరిగి రాలేదని బాలిక తల్లి స్టేసీ ఎల్కిన్స్ ఫిర్యాదులో పేర్కొంది. తమ బంధువులు లైవ్ వీడియో చూసి తనకు సమాచారం ఇచ్చినట్టు స్టేసీ ఎల్కిన్స్ పోలీసుల ఎదుట వాపోయింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు బాలికను గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించారు. అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. వీడియోను పోస్ట్ చేసిన ఫేస్ బుక్ పేజీ వివరాల సేకరణ కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు బాలికను కూడా ప్రశ్నిస్తున్నారు.