US Man Killed Wife While Cleaning Gun Turned Weapon On HImself - Sakshi
Sakshi News home page

తుడుస్తుండగా తుపాకీ పేలింది.. భార్య మృతి..  అతనేం చేశాడంటే..

Published Sat, Jul 22 2023 1:49 PM | Last Updated on Sat, Jul 22 2023 2:15 PM

Us Man Killed Wife While Cleaning Gun Turned Weapon On HImself - Sakshi

వాషింగ్టన్: అమెరికాలో ఒకే నెలలో ఒకే తరహా మరణాలు రెండు చోటుచేసుకున్నాయి. ఇదే నెలలో తుపాకీతో ఆడుకుంటూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కి మూడేళ్ళ తన చిట్టి చెల్లిని చేజేతులా చంపుకున్నాడు ఓ బుడతడు. ఆ సంఘటన ఇంకా మరువక ముందే అచ్చంగా అలాగే తన తుపాకీని తుడుచుకుంటూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కి తన భార్యను హతమార్చాడు మరో అభాగ్యుడు. వెంటనే అచేతన స్థితికి వెళ్ళిపోయిన అతడు స్పృహలోకి వచ్చిన తర్వాత తాను ఎంతటి దారుణానికి ఒడిగట్టాడో అర్ధం చేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డాడు.   

చికాగోకు చెందిన సిమియోన్ హెన్డ్రిక్సన్(61) తుపాకులు కాల్చడంలో శిక్షణనిస్తూ ఉంటాడు. జులై 15న తీరిక దొరికడంతో ఇంటిలోని తుపాకులను శుభ్రం చేసే పనికి ఉపక్రమించాడు. కానీ దురదృష్టవశాతూ ఒక తుపాకి తన చేతిలోనే పేలిపోయింది. ఆ తుపాకీ లోంచి వెళ్లిన బుల్లెట్ అక్కడే ఉన్న అతని భార్య లారీ హెన్డ్రిక్సన్(60) తలకు తగలడంతో ఆమె ఉన్నచోటనే కుప్పకూలింది. విభ్రాంతికి గురైన సిమియోన్ కొద్దీ సేపటికి తేరుకుని జరిగిన దారుణాన్ని తలచుకుని కుమిలిపోయి తుపాకిని తనవైపు ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు. 

తుపాకీ పేలుళ్ల చప్పుడుకి చుట్టుపక్కలవారు సమాచారమిచ్చారో లేక స్వయంగా సిమియోనే చెప్పాడో స్పష్టత లేదని చెప్పిన పోలీసులు విషయం తెలియగానే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు. సిమియోన్ అక్కడికక్కడే చనిపోగా అతని భార్య లారీ మాత్రం కోన ఊపిరితో ఉండగా ఆసుపత్రికి తరలించగా ఆమె అక్కడ చికిత్స పొందుతూ చనిపోయినట్లు తెలిపారు చికాగో పోలీసులు. 

తల్లిదండ్రులను ఒకేసారి కోల్పోవంతో వారి ఒక్కగానొక్క కుమారుడు డెరెక్ హెన్డ్రిక్సన్ శోకతప్త హృదయంతో పేస్ బుక్ లో విచారాన్ని వ్యక్తం చేస్తూ.. "వారిని అందరూ ఎంతగానో ప్రేమించి, అభిమానించేవారు. వారు ఎప్పటికీ గొప్ప తల్లిదండ్రులుగా మిగిలిపోతారు." అని రాశాడు. 

ఇది కూడా చదవండి: కంపెనీ డబ్బులు రూ.21 లక్షలు కొట్టేసి ఏం చేశాడో తెలుసా?    
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement