
విస్కాన్సిన్: టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ అమెరికా పట్ల తన తిరుగులేని నిబద్ధతను ప్రకటించారు. ‘నేను ఎక్కడికీ వెళ్లను. అమెరికాలోనే ఉంటా. ఇక్కడే చచ్చిపోతా. అంగారక గ్రహం మీదికి నేను వెళ్లినా అది కూడా అమెరికాలో భాగంగానే ఉండిపోతుంది’అంటూ ఆదివారం విస్కాన్సిన్ టౌన్‌హాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా మస్క్ ఇద్దరు విస్కాన్సిన్ ఓటర్లకు పది లక్షల విలువైన చెక్కులను అందజేశారు. తన రాజకీయ గ్రూపునకు వీరిద్దరినీ ప్రతినిధులుగా ప్రకటించారు. త్వరలో జరగనున్న విస్కాన్సిన్ సుప్రీంకోర్టు ఎన్నికలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అజెండాకు, నాగరికత భవిష్యత్తుకు కీలకమైనవని పేర్కొన్నార