టెస్లా కారు కొనుగోలు చేసిన ట్రంప్‌! | Donald Trump Buys Tesla Model S to Show Support for Elon Musk | Sakshi
Sakshi News home page

టెస్లా కారు కొనుగోలు చేసిన ట్రంప్‌!

Published Wed, Mar 12 2025 10:53 AM | Last Updated on Wed, Mar 12 2025 11:25 AM

Donald Trump Buys Tesla Model S to Show Support for Elon Musk

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెస్లా మోడల్ ఎస్ కారును కొనుగోలు చేసి ఎలాన్ మస్క్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. దాంతో టెస్లాకు మద్దతుగా నిలిచారు. ట్రంప్‌ కారు కొనుగోలు చేసేందుకు వీలుగా మస్క్‌ వైట్‌హౌజ్‌నే షోరూమ్‌గా మార్చుకున్నారు. ట్రంప్‌ తనకు నచ్చిన కారును ఎంచుకునేందుకు వీలుగా కొన్ని మోడళ్లను వైట్‌హౌజ్‌లో ప్రదర్శించారు. అందులోనుంచి అధ్యక్షుడు ట్రంప్‌ సెడాన్ రెడ్ మోడల్ ఎస్‌ను ఎంచుకున్నారు.

డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్‌)లో మస్క్ ప్రమేయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ అధీనంలో చాలామంది ఉద్యోగులకు లేఆఫ్స్‌ ప్రకటించడంతోపాటు డోజ్‌ తీసుకుంటున్న విభిన్న నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దాంతో మస్క్‌ ఆధ్వర్యంలోని టెస్లా కొనుగోళ్లను బహిష్కరించాలని అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన ట్రంప్‌ టెస్లాకు మద్దతుగా నిలుస్తానని, కంపెనీ కారును తాను కొనుగోలు చేస్తానని మాటిచ్చారు. దాంతో తాజాగా కంపెనీ మోడల్‌ ఎస్‌ను కొనుగోలు చేశారు. ఇటీవల కంపెనీ స్టాక్ ధరలు క్షీణించడం టెస్లాకు సవాలుగా మారింది. బహిరంగంగా ట్రంప్‌ టెస్లా కారు కొనుగోలు చేయడం ద్వారా కంపెనీకి మద్దతుగా నిలవాలని భావించారు.

ఇదీ చదవండి: మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్‌.. స్టార్‌లింక్‌తో జియో ఒప్పందం

ట్రంప్ ఈ కారుపై ఆసక్తిగా ఉన్నప్పటికీ సీక్రెట్ సర్వీస్ ఆంక్షల కారణంగా తాను దాన్ని స్వయంగా నడపలేనని తెలిపారు. సిబ్బంది ఉపయోగించేందుకు వీలుగా వైట్‌హౌజ్‌ వద్ద ఉంటుందని చెప్పారు. కారు కొనుగోలు చేసిన సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ..‘మస్క్ గొప్ప దేశభక్తుడు. ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయం. ఈ కారును నేను పూర్తి ధర వెచ్చింది 80వేల డాలర్ల(రూ.69.7 లక్షలు)కు కొనుగోలు చేశాను. మస్క్‌ దీనిపై డిస్కౌంట్ ఇచ్చేవారే. కానీ, ఒకవేళ నేను రాయితీ తీసుకుంటే ఇతర ప్రయోజనాలు పొందానని కొందరు విమర్శలు చేస్తారు’ అని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement