ట్రంప్‌ హెచ్చరిక.. వారందరికీ 20 ఏళ్ల జైలు శిక్ష తప్పదు.. | USA Donald Trump Serious On Tesla Vehicles Vandalism | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ హెచ్చరిక.. వారందరికీ 20 ఏళ్ల జైలు శిక్ష తప్పదు..

Mar 21 2025 12:00 PM | Updated on Mar 21 2025 12:07 PM

USA Donald Trump Serious On Tesla Vehicles Vandalism

సియాటెల్‌: అమెరికాలో ప్రముక కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ యాజమాన్యంలోని టెస్లా విద్యుత్‌ కార్ల సంస్థకు చెందిన ఆస్తులపై దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దాడులు చేసే వారికి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వార్నింగ్‌ ఇచ్చారు. టెస్లాపై దాడులు చేస్తే 20 ఏళ్ల జైలు విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

అధ్యక్షుడు ట్రంప్‌ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎలాన్‌ మస్క్‌ యాజమాన్యంలోని టెస్లా కార్ల సంస్థకు చెందిన ఆస్తులపై దాడులు పెరిగిపోతున్నాయి. అమెరికా, ఇతర దేశాల్లో టెస్లా షోరూమ్‌లు, విద్యుత్‌ చార్జింగ్‌ స్టేషన్లతోపాటు కార్లపైనా ఇటీవల దాడులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. టెస్లా కార్లపై దాడికి పాల్పడేవారికి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. అలాగే, దాడులను ప్రోత్సహిస్తున్న వారికి కూడా శిక్ష తప్పదని హెచ్చరించారు. టెస్లాపై దాడులకు దిగేవారు నరకాన్ని అనుభవించబోతున్నారని వార్నింగ్‌ ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ను ప్రభుత్వ సామర్థ్య పెంపుదల విభాగం (డోజ్‌) అధినేతగా ట్రంప్‌ నియమించినప్పటి నుంచీ టెస్లాపై దాడులు బాగా పెరిగిపోయాయి. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాలన్న మస్క్‌ సలహా మేరకు ట్రంప్‌ ప్రభుత్వం ఎందరో ప్రభుత్వోద్యోగులకు ఉద్వాసన పలకడంతోపాటు అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. మస్క్‌ విధానాలను వ్యతిరేకిస్తున్న వారు.. ఉత్తర అమెరికా, యూరప్‌లలోని ఆయన కార్యాలయాలు, ఫ్యాక్టరీల ఎదుట ఆందోళనలు నిర్వహించారు. మస్క్‌తో విభేదిస్తున్న పలువురు సెనేటర్లు వారికి మద్దతు పలికారు. తాము టెస్లా కార్లను అమ్మేస్తామని తెలిపారు.

 

  • మార్చి 6వ తేదీన ఒరెగాన్‌(Oregon) పోర్ట్‌లాండ్‌ సబర్బ్‌ అయిన టిగార్డ్‌లోని టెస్లా డీలర్‌షిప్‌పై కాల్పులు జరిగాయి. ఈ దాడిలో పలు ఈవీ వాహనాలు ధ్వంసం అయ్యాయి.

  • కొలరాడో లవ్‌ల్యాండ్‌లోని షోరూమ్‌ను ఓ మహిళ ధ్వంసం చేసింది. ఆపై మస్క్‌ వ్యతిరేక రాతలు రాసి.. బొమ్మలు గీసింది

  • బోస్టన్‌లోని టెస్లా ఛార్జింగ్‌ స్టేషన్‌కు దుండగుల నిప్పు

  • సియాటెల్‌లో టెస్లా వాహనాలకు మంట పెట్టిన ఆగంతకులు

  • వాషింగ్టన్‌ లీన్‌వుడ్‌లో టెస్లా సైబర్‌ ట్రక్కులపై స్వస్తిక్‌ గుర్తులతో పాటు మస్క్‌ వ్యతిరేక రాతలు

  • మార్చి 13వ తేదీన.. ఒరెగాన్‌ టిగార్డ్‌ షోరూంపై మరోసారి కాల్పులు.. షోరూం ధ్వంసం

  • వారం వ్యవధిలో రెండుసార్లు ఒరెగాన్‌ షోరూంపై దాడి జరిగింది. దీంతో ఎఫ్‌బీఐ, ఇతర దర్యాప్తు సంస్థల సమన్వయంతో పని చేస్తామని పోలీసులు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement