ఇలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (గతంలో ట్విటర్)కు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాలను పరిష్కరించుకోనున్నారు. ఇలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి సంస్థపై న్యాయపరంగా కొన్ని కంపెనీలు వ్యాజ్యాలు దాఖలు చేశాయి. ఎక్స్ నిబంధనలకు తగ్గట్లు వ్యవహరించడంలేదని అందులో పేర్కొన్నారు. వాటిని త్వరలో పరిష్కరించుకోనున్నట్లు మస్క్ నిర్ణయం తీసుకున్నారని వాషింగ్టన్‌పోస్ట్ తెలిపింది.
సమస్యలేంటి..
ఎక్స్‌లో వెలువరించే యాడ్స్‌కు సంబంధించి సంస్థ యాజమాన్యం వెండర్లకు సరైన విధంగా రెవెన్యూలో షేర్ ఇవ్వడంలేదని కొన్ని కంపెనీలు గతంలో ఫిర్యాదు చేశాయి.
కార్పొరేట్ యాడ్ తర్వాత వెంటనే వీక్షకులకు కాంట్రవర్సీ యాడ్ కనిపించేలా ఎక్స్‌లో ఆల్‌గారిథమ్‌ను క్రియేట్ చేశారని కొన్ని సంస్థలు గతంలో కోర్టును ఆశ్రయించాయి.
ఎక్స్ యాజమాన్యం లేఆఫ్స్ ప్రకటించిన దాదాపు 2,200 మంది మాజీ ఉద్యోగుల నుంచి ఆర్బిట్రేషన్ కేసు ఎదుర్కొంటోంది. వీటితోపాటు మరిన్ని న్యాయపరమైన వ్యాజ్యాలు కంపెనీపై దాఖలయ్యాయి.
నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ టెక్సాస్‌లో వ్యాజ్యాలు
కంపెనీపై నమోదైన వ్యాజ్యాలను పరిష్కరించుకునేందుకు నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ టెక్సాస్‌లో కౌంటర్ వ్యాజ్యాలను దాఖలు చేయాలని మస్క్ నిర్ణయించుకున్నారు. ఈ వ్యవహారాన్ని నిపుణులు ‘ఫోరమ్ షాపింగ్’(అనుకూలమైన తీర్పులు పొందడం)గా అభివర్ణిస్తున్నారు. సాధారణంగా కార్పొరేట్ కంపెనీలు న్యాయపరమైన చిక్కులను పరిష్కరించుకునేందుకు తమ ప్రధాన కార్యాలయానికి అనుసంధానించబడిన జిల్లా కోర్టును ఎంచుకుంటాయి. కానీ ఎక్స్ మాత్రం ట్రంప్‌నకు స్పష్టమైన మెజారిటీ వచ్చాక టెక్సాస్‌లోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కౌంటర్ వ్యాజ్యాలు దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో రిపబ్లికన్ పార్టీ నియమించిన న్యాయమూర్తులు అధికంగా ఉన్నారనే వాదనలున్నాయి. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌నకు మస్క్ మద్దతిచ్చారు.
ఇదీ చదవండి: పన్ను ఎగవేత.. పలు రకాలు.. వీటి జోలికి పోవద్దు
ఎక్స్‌ను రక్షించే వ్యూహం
మస్క్ నిర్ణయం ఎక్స్‌ను రక్షించే వ్యూహంగా నిపుణులు భావిస్తున్నారు. నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ టెక్సాస్‌లోని 11 మంది న్యాయమూర్తుల్లో 10 మందిని రిపబ్లికన్ అధ్యక్షులు నియమించారని జార్జ్‌టౌన్ న్యాయశాస్త్ర ప్రొఫెసర్ స్టీవ్ వ్లాడెక్ తెలిపారు. ఇది మస్క్‌కు అనుకూలంగా తీర్పులను మార్చగలదని అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment