lawsuits
-
మస్క్ ‘ఫోరమ్ షాపింగ్’! ట్రంప్‌తో దోస్తీ ఇందుకేనా..?
ఇలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (గతంలో ట్విటర్)కు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాలను పరిష్కరించుకోనున్నారు. ఇలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి సంస్థపై న్యాయపరంగా కొన్ని కంపెనీలు వ్యాజ్యాలు దాఖలు చేశాయి. ఎక్స్ నిబంధనలకు తగ్గట్లు వ్యవహరించడంలేదని అందులో పేర్కొన్నారు. వాటిని త్వరలో పరిష్కరించుకోనున్నట్లు మస్క్ నిర్ణయం తీసుకున్నారని వాషింగ్టన్పోస్ట్ తెలిపింది.సమస్యలేంటి..ఎక్స్‌లో వెలువరించే యాడ్స్‌కు సంబంధించి సంస్థ యాజమాన్యం వెండర్లకు సరైన విధంగా రెవెన్యూలో షేర్ ఇవ్వడంలేదని కొన్ని కంపెనీలు గతంలో ఫిర్యాదు చేశాయి.కార్పొరేట్ యాడ్ తర్వాత వెంటనే వీక్షకులకు కాంట్రవర్సీ యాడ్ కనిపించేలా ఎక్స్‌లో ఆల్గారిథమ్ను క్రియేట్ చేశారని కొన్ని సంస్థలు గతంలో కోర్టును ఆశ్రయించాయి.ఎక్స్ యాజమాన్యం లేఆఫ్స్ ప్రకటించిన దాదాపు 2,200 మంది మాజీ ఉద్యోగుల నుంచి ఆర్బిట్రేషన్ కేసు ఎదుర్కొంటోంది. వీటితోపాటు మరిన్ని న్యాయపరమైన వ్యాజ్యాలు కంపెనీపై దాఖలయ్యాయి.నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ టెక్సాస్‌లో వ్యాజ్యాలుకంపెనీపై నమోదైన వ్యాజ్యాలను పరిష్కరించుకునేందుకు నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ టెక్సాస్‌లో కౌంటర్ వ్యాజ్యాలను దాఖలు చేయాలని మస్క్ నిర్ణయించుకున్నారు. ఈ వ్యవహారాన్ని నిపుణులు ‘ఫోరమ్ షాపింగ్’(అనుకూలమైన తీర్పులు పొందడం)గా అభివర్ణిస్తున్నారు. సాధారణంగా కార్పొరేట్ కంపెనీలు న్యాయపరమైన చిక్కులను పరిష్కరించుకునేందుకు తమ ప్రధాన కార్యాలయానికి అనుసంధానించబడిన జిల్లా కోర్టును ఎంచుకుంటాయి. కానీ ఎక్స్ మాత్రం ట్రంప్‌నకు స్పష్టమైన మెజారిటీ వచ్చాక టెక్సాస్‌లోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కౌంటర్ వ్యాజ్యాలు దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో రిపబ్లికన్ పార్టీ నియమించిన న్యాయమూర్తులు అధికంగా ఉన్నారనే వాదనలున్నాయి. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌నకు మస్క్ మద్దతిచ్చారు.ఇదీ చదవండి: పన్ను ఎగవేత.. పలు రకాలు.. వీటి జోలికి పోవద్దుఎక్స్ను రక్షించే వ్యూహంమస్క్ నిర్ణయం ఎక్స్‌ను రక్షించే వ్యూహంగా నిపుణులు భావిస్తున్నారు. నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ టెక్సాస్‌లోని 11 మంది న్యాయమూర్తుల్లో 10 మందిని రిపబ్లికన్ అధ్యక్షులు నియమించారని జార్జ్‌టౌన్ న్యాయశాస్త్ర ప్రొఫెసర్ స్టీవ్ వ్లాడెక్ తెలిపారు. ఇది మస్క్‌కు అనుకూలంగా తీర్పులను మార్చగలదని అభిప్రాయపడుతున్నారు. -
భారీ షాక్.. ఒక్కో యూజర్‌కు 4 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమైన గూగుల్!
సాధారణంగా మనం మన గురించి ఆలోచించకుండా పక్కనోడి గురించి ఆలోచిస్తుంటాం. వాళ్లేం చేస్తున్నారు? వీళ్లేం చేస్తున్నారు? ఫలానా వాళ్ల పిల్లలు ఏం చేస్తున్నారు’ అని తెలుసుకునేందుకు అత్యుత్సాహం చూపిస్తుంటాం. ఇప్పుడు అలాంటి అత్యుత్సాహమే ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కొంప ముంచింది. బదులుగా రూ.41 వేల కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. సెర్చింజిన్ విభాగంలో గూగుల్ పెత్తనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇతర కంపెనీలు ఎదగనీయకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తుందంటూ గూగుల్‌పై ఇప్పటికే మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ సంస్థలు కోర్టు మెట్లక్కిన దాఖలాలు అనేకం ఉన్నాయి. 2020లో గూగుల్‌పై కేసు వాటిల్లో 2020లో అమెరికా న్యూయార్క్ కేంద్రంగా సేవలందించే బోయిస్ షిల్లర్ ఫ్లెక్స్నర్ ఎల్ఎల్పీ (Boies Schiller Flexner LLP) అనే న్యాయ సంస్థ గూగుల్‌పై కోర్టులో కేసు వేసింది. ‘‘ గూగుల్ బ్రౌజర్ ఇన్‌కాగ్నటోమోడ్‌తో పాటు ఇతర ప్రైవేట్ బ్రౌజర్లు ఉపయోగించే యూజర్లు వాటిల్లో ఏం వెతుకుతున్నారు అని సమాచారం తెలుసుకుంటుంది. ఆయా విభాగాలకు చెందిన సైట్లను వీక్షించే యూజర్లకు అనుగుణంగా యాడ్స్‌ను ప్రసారం చేస్తుంది. తద్వారా భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటుంది’’ అంటూ ఫిర్యాదులో పేర్కొంది. అయితే సుధీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ కేసు నుంచి బయట పడేందుకు గూగుల్ భారీ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధమైంది. విచారణలో క్లాస్ యాక్షన్ పిటిషన్ పై పరిష్కారం కోసం గూగుల్ ప్రాథమికంగా ఓ ఒప్పందానికి వచ్చిందని కాలిఫోర్నియా కోర్టు న్యాయవాదులు ధృవీకరించారు ఒక్కో యూజర్‌కు ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్‌లో ఉన్నప్పుడు, వారి గూగుల్ ఖాతాలోకి లాగిన్ చేయనప్పటికీ, సంస్థ గూగుల్ అనలటిక్స్ ద్వారా ట్రాఫిక్ ఎంత వస్తుందని గూగుల్ ట్రాక్ చేస్తుంది. గూగుల్ ఈ తరహా వ్యాపార కార్యకలాపాలు చేసినందుకుగాను ఒక్కో యూజర్‌కు 5 వేల డాలర్లు చెల్లించాలి. అలా ఎంపిక చేసిన యూజర్లకు చెల్లించాల్సిన మొత్తం సుమారు రూ.41వేల కోట్లని తేలింది. అయితే, గూగుల్ ఈ కేసులో ఎలాంటి ముందుస్తు చెల్లింపులు చేయలేదని సమాచారం. ముందు తిరస్కరించినా.. చివరికి దారికొచ్చిన గూగుల్ ఈ కేసును న్యాయమూర్తి ద్వారా పరిష్కరించాలన్న గూగుల్ అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది. ఆ పిమ్మట వారం రోజుల వ్యవధిలో గూగుల్ కేసును సెటిల్మెంట్ చేసేందుకు మొగ్గు చూపినట్లు పలు నివేదికలు హైలెట్ చేశాయి. తదుపరి విచారణ ఫిబ్రవరి 24, 2024లో జరగనుంది. అప్పుడే 41వేల కోట్లు చెల్లిస్తామని ముందుకొచ్చిన గూగుల్ నిర్ణయంపై న్యాయస్థానం ఆమోదం తెలపనుంది. -
పార్లమెంటులో లాయర్లు తగ్గుతున్నారు
న్యూఢిల్లీ: ‘‘పార్లమెంటులో గతంలో న్యాయ కోవిదులు ఎక్కువగా ఉండేవారు. రాజ్యాంగ పరిషత్తులోనూ, స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో కొలువుదీరిన పలు పార్లమెంటుల్లోనూ చాలామంది వాళ్లే. ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యంగాన్ని, తిరుగులేని చట్టాలను మనకందించారు. కానీ కొంతకాలంగా పార్లమెంటులో న్యాయ కోవిదుల సంఖ్య బాగా తగ్గుతోంది. ఆ స్థానాన్ని ఇతరులు భర్తీ చేస్తున్నారు. ఇంతకు మించి మాట్లాడబోను’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఉపరాష్ట్రపతిగా ఇటీవలే పదవీ బాధ్యతలు స్వీకరించిన జగ్దీప్ ధన్‌ఖడ్ గౌరవార్థం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయవాదిగా అపార అనుభవం ధన్‌ఖడ్ సొంతమన్నారు. ‘‘గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఆయన ఎలాంటి రాజకీయ గాడ్‌ఫాదర్లూ లేకుండానే దేశ రెండో అత్యున్నత రాజ్యాంగ పదవిలో కొలువుదీరే స్థాయికి ఎదిగారు. ఇది మన ప్రజాస్వామ్య గొప్పదనానికి, ఉన్నత రాజ్యాంగ విలువలకు తార్కాణం’’ అన్నారు. ‘‘ప్రతి సభ్యుడినీ సంతృప్తి పరచడం తేలిక కాదు. కానీ ధన్‌ఖడ్ తన అపార అనుభవం సాయంతో రాజ్యసభ చైర్మన్‌గా రాణిస్తారని, అందరినీ కలుపుకునిపోతారని నాకు నమ్మకముంది. న్యాయవాదిగా అపార అనుభవం, గతంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖను నిర్వహించి ఉండటం ఆయనకెంతో ఉపయోగపడతాయి. అతి త్వరలో రిటైరవుతున్న నేను ధన్‌ఖడ్ పర్యవేక్షణలో రాజ్యసభలో జరిగే నాణ్యమైన చర్చలను టీవీలో చూస్తానని ఆశిస్తున్నా’’ అన్నారు. ధన్‌ఖడ్‌ను ఆయన సన్మానించారు. న్యాయ మంత్రి కిరెన్ రిజిజు, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీంబార్ అసోసియేసన్ అధ్యక్షుడు వికాస్‌సింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంతకాలంగా పార్లమెంటులో చర్చల కంటే అంతరాయాలే ఎక్కువయ్యాయని రిజిజు ఆవేదన వెలిబుచ్చారు. ‘‘చర్చల నాణ్యత బాగా పడిపోయింది. ఇటీవలి దాకా లోక్‌సభతో పోలిస్తే రాజ్యసభ కాస్త ప్రశాంతంగా ఉండేది. ఈ మధ్య అక్కడా గలాభా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సభను అదుపు చేసేందుకు ధన్‌ఖడ్ అనుభవం పనికొస్తుంది’’ అని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసిన ఓ లాయర్ ఉపరాష్ట్రపతి కావడం ఇదే తొలిసారని తుషార్ మెహతా అన్నారు. ధన్‌ఖడ్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ -
ఎలన్‌మస్క్ కొంపముంచిన ట్వీట్..! తిరగబడ్డ ఇన్వెస్టర్లు..!
Tesla Investor Files Lawsuit Over Elon Musk: కొద్దిరోజుల క్రితం టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ టెస్లాకు చెందిన 10 శాతం షేర్లను అమ్మే విషయంపై తన ట్విటర్లో ఖాతాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారమే ఇప్పుడు ఎలన్ మస్క్ కొంపముంచనుంది. ఎలన్ వేసిన ట్విట్‌పై విచారణ జరపాలని పలువురు ఇన్వెస్టర్లు కోర్టులో దావాలను వేసినట్లు తెలుస్తోంది. టెస్లా షేర్ ధరలను తగ్గించే విషయంలో డేవిడ్ వాగ్నెర్ అనే షేర్ హోల్డర్, టెస్లా, ఎలన్ మస్క్‌పై అమెరికా సెక్యూరిటీస్ రెగ్యులేటర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా టెస్లాబోర్డు సభ్యులు వారి విశ్వసనీయ విధులను పాటించడంలో విఫలమయ్యారనే విషయంపై దర్యాప్తు చేయాలని కోర్టులో దావా వేశారు. ఈ దావా అమెరికాలోని డెలావేర్ కోర్ట్ ఆఫ్ ఛాన్సరీలో వ్యాజ్యం దాఖలు చేశారు. స్టాక్ విక్రయాలపై ఎలన్ వేసిన ట్విట్స్పై సమీక్ష జరపాలని ఇన్వెస్టర్లు కోరుతున్నారు. 2018లో ఇదే రకమైన ట్విట్స్‌ను ఎలన్ వేయగా...వీటిపై కూడా దావాలు నమోదైనాయి. ఈ ట్వీట్‌పై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ దావాలను పరిష్కరించింది. చదవండి: సీఈవో పదవులకు గుడ్‌బై.. కొత్త అవతారం! తాజా ట్వీట్‌తో కలకలం -
వ్యాజ్యాలపై హెచ్డీఎఫ్సీ వివరణ
సాక్షి,ముంబై: ప్రైవేటురంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ అమెరికాకు చెందిన న్యాయ సంస్థల వ్యాజ్యాలపై వివరణ ఇచ్చింది. అమెరికాకు చెందిన న్యాయ సంస్థ రోసన్ లా కంపెనీ దాఖలు చేసిన క్లాస్ యాక్షన్ వ్యాజ్యంతోపాటు, తమ బ్యాంకు ఉద్యోగులపై దాఖలైన ఫిర్యాదుపై స్పందించింది. వీటిపై తాము న్యాయ పోరాటం చేయనున్నామని స్పష్టం చేసింది. నిజాలను దాచిపెట్టి, తప్పుడు ప్రకటనలతో వాటాదారుల నష్టాలకు కారణమైందన్న ఆరోపణలను బ్యాంకు తీవ్రంగా ఖండించింది. దీనిపై 2021 ప్రారంభంలో తమ స్పందన తెలియజేయాలని భావిస్తున్నట్టు రెగ్యులేటరీ సమాచారంలో తెలిపింది. సెబీ నిబంధనల ప్రకారం ఇంతకుమించి వివరాలను అందించలేమని పేర్కొంది. (హెచ్‌డీఎఫ్‌సీకు భారీ షాక్) కాగా పొటెన్షియల్ సెక్యూరిటీ క్లెయిమ్స్‌పై షేరు హోల్డర్స్ తరపున విచారణ ప్రారంభించినట్లు రోసన్ లా గత నెలలో తెలిపింది. వాహన రుణాల టార్గెట్‌ను రీచ్ అయ్యేందుకు తప్పుడు విధానాలు అవలంబించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపింది. 2015 నుండి 2019 బ్యాంకు నుంచి లోన్లు తీసుకున్న లక్షల మంది కస్టమర్ల వివరాలతో పాటు వారి పేమెంట్ హిస్టరీ కూడా ఆలస్యంగా ఇస్తుందని తన ఫిర్యాదులో పేర్కొంది. ఈనేపథ్యంలో బ్యాంకు సెక్యూరిటీలను కొనుగోలు చేసిన వాటాదారులు దీనికి మద్దతు పలకాలని కోరింది. మరోవైపు న్యూయార్క్ లోని మరో లా సంస్థ పోమెరాంట్జ్ కూడా హెచ్డీఎఫ్సీ అవుట్గోయింగ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య పూరి, సీఈఓగా బాధ్యతలను చేపట్టనున్న శశిధర్ జగదీషన్, కంపెనీ కార్యదర్శి సంతోష్ హల్దంకర్పై లా సూట్ ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. -
శాంసంగ్‌కు చుక్కెదురు
బీజింగ్: టెక్ దిగ్గజం శాంసంగ్ కు చైనా టెక్నాలజీ ఉత్పత్తుల తయారీ కంపెనీ హువాయి సవాల్ విసిరింది. తన ప్రత్యర్థి మొబైల్ ఫోన్ తయారీ సంస్థలో అగ్రగామిగా నిలిచిన శాంసంగ్ కు వ్యతిరేకంగా ఓ పిటిషన్ దాఖలు చేసింది. పేటెంట్ నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ అమెరికా, చైనాలలో వ్యాజ్యాలు దాఖలు చేసింది. తన ముఖ్యమైన టెక్నాలజీ విషయంలో పేటెంట్ ను ఉల్లంఘించినట్లు ఆరోపిస్తోంది. హువాయి టెక్నాలజీస్ లిమిటెడ్ బుధవారం ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ మేరకు శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తనకు రీజనబుల్ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. అయితే ఎంత చెల్లించాలని అనేది మాత్రం స్పష్టం చేయలేదు. స్మార్ట్ఫోన్ల విభాగంలో అంచెలంచెలుగా విస్తరిస్తోన్న బ్రాండ్లలో హువాయి ఒకటి. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అత్యుత్తమ స్మార్ట్ఫోన్లను అందిస్తూ తన మార్కెట్ షేర్ ను పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో హువాయి ప్రకటన ప్రపం వ్యాప్తంగా విస్తరిస్తున్న మొబైల్ ఫోన్ పరిశ్రమలో సాంకేతిక సృష్టికర్తలు , పోటీదారుల మధ్య నెలకొన్న పోటీని హైలైట్ చేసింది. మరోవైపు మొబైల్ అమ్మకాల్లో శాంసంగ్ యాపిల్ ను వెనక్కి నెట్టి ముందుకు దూసుకు వచ్చింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో మొబైల్ అమ్మకాల్లో 24.5 వృద్ధిని సాధించి నెం.1 స్థానాన్ని కొట్టేసింది. ఆపిల్ 15.3 శాతం అమ్మకాలతో రెండవస్థానంతో సరిపెట్టుకోగా హువాయి 8.2 శాతం అమ్మకాలతో మూడో స్థానంలో నిలిచి, దిగ్గజ కంపెనీలతో పోటీకి సై అంటోంది. ఈ నేపథ్యంలో హువాయి, శాంసంగ్ ను సవాల్ చేయడం విశేషం.