Tesla Investor Files Lawsuit Over Elon Musk: కొద్దిరోజుల క్రితం టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ టెస్లాకు చెందిన 10 శాతం షేర్లను అమ్మే విషయంపై తన ట్విటర్‌లో ఖాతాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారమే ఇప్పుడు ఎలన్ మస్క్ కొంపముంచనుంది. ఎలన్ వేసిన ట్విట్‌పై విచారణ జరపాలని పలువురు ఇన్వెస్టర్లు కోర్టులో దావాలను వేసినట్లు తెలుస్తోంది.
టెస్లా షేర్ ధరలను తగ్గించే విషయంలో డేవిడ్ వాగ్నెర్ అనే షేర్ హోల్డర్, టెస్లా, ఎలన్ మస్క్‌పై అమెరికా సెక్యూరిటీస్ రెగ్యులేటర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా టెస్లాబోర్డు సభ్యులు వారి విశ్వసనీయ విధులను పాటించడంలో విఫలమయ్యారనే విషయంపై దర్యాప్తు చేయాలని కోర్టులో దావా వేశారు. ఈ దావా అమెరికాలోని డెలావేర్ కోర్ట్ ఆఫ్ ఛాన్సరీలో వ్యాజ్యం దాఖలు చేశారు.
స్టాక్ విక్రయాలపై ఎలన్ వేసిన ట్విట్స్‌పై సమీక్ష జరపాలని ఇన్వెస్టర్లు కోరుతున్నారు. 2018లో ఇదే రకమైన ట్విట్స్‌ను ఎలన్ వేయగా...వీటిపై కూడా దావాలు నమోదైనాయి. ఈ ట్వీట్‌పై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ దావాలను పరిష్కరించింది.
చదవండి: సీఈవో పదవులకు గుడ్‌బై.. కొత్త అవతారం! తాజా ట్వీట్‌తో కలకలం
Comments
Please login to add a commentAdd a comment