Tesla: ఒక్కరోజులోనే రూ.1.30లక్షల కోట్ల సంపద ఆవిరి | Elon Musk Just Lost $16 Billion In A Day. Here's Why - Sakshi
Sakshi News home page

Tesla: ఒక్కరోజులోనే రూ.1.30లక్షల కోట్ల సంపద ఆవిరి

Published Fri, Oct 20 2023 6:20 PM | Last Updated on Fri, Oct 20 2023 6:33 PM

Elon Musk Wealth Evaporated In A Single Day - Sakshi

ప్రపంచ కుబేరుడు, టెస్లా, ఎక్స్‌(ట్విటర్‌) అధినేత ఎలాన్‌ మస్క్‌ సంపద ఒక్కరోజులోనే భారీగా రూ.1.30లక్షల కోట్లు ఆవిరైంది. 2023-24 రెండో త్రైమాసికం జులై-సెప్టెంబర్‌కు సంబంధించి టెస్లా సంస్థ బలహీన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలు మదుపర్లను నిరాశపర్చాయి. దీంతో అక్టోబర్​ 19న కంపెనీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా కంపెనీ షేర్లు భారీగా పతనం అయ్యాయి. దీనితో ఈ సంస్థలో 13 శాతం వాటాలున్న ఎలాన్​ మస్క్​ కూడా భారీగా నష్టపోవాల్సి వచ్చింది. 

టెస్లా షేర్​ విలువ అక్టోబరు 19న ఏకంగా 9 శాతం నష్టపోయింది. దాంతో మస్క్‌ సంపద కూడా అదే రీతిలో 16.1 బిలియన్‌ డాలర్లు(రూ.1.30 లక్షల కోట్లు) నష్టం వాటిల్లింది. బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ నివేదిక ప్రకారం ఎలాన్ మస్క్​ ఇప్పటికి 210 బిలియన్‌ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు.

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మస్క్‌ సంపద దాదాపు 70 బిలియన్‌ డాలర్లు పెరిగింది. ప్రత్యర్థి సంస్థల నుంచి వస్తున్న పోటీని తట్టుకొని రాణించేందుకు టెస్లా గత కొన్ని నెలలుగా కార్ల ధరలను భారీగా తగ్గిస్తూ వచ్చింది. దీంతో జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ నికర లాభంలో ఏకంగా 44 శాతం మేర క్షీణత నమోదైంది. ఈ నేపథ్యంలోనే టెస్లా షేర్లు భారీగా పతనానికి గురయ్యాయి.

వడ్డీరేట్ల పెంపు వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని మస్క్‌ వ్యాఖ్యానించారు. ఈ కారణంతోనే విక్రయాలు నెమ్మదించాయని పేర్కొన్నారు. అయితే సంస్థకు ఎలాంటి సవాళ్లు ఎదురైనా సరే.. తమ కస్టమర్లకు అందించాల్సిన 18లక్షల కార్లను నిర్ణీత గడువులోగా డెలివరీ చేస్తామని టెస్లా ప్రకటించింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement