X Platform
-
మస్క్ కీలక నిర్ణయం.. ఏఐ స్టార్టప్‌కు X అమ్మకం!
టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్‌ఫారమ్ Xను అమ్మకానికి ఉంచారు. అయితే ఆ కొనుగోలు చేస్తున్న కంపెనీ కూడా ఆయనదే కావడం గమనార్హం. మస్క్ ఆధీనంలోని కంపెనీలలో ఒకటైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ 'ఎక్స్ఏఐ'.. సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌ను సొంతం చేసుకుంది. రెండు కంపెనీలు ఏకీకృతమైనట్లు.. మస్క్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.రెండు సంవత్సరాల క్రితం స్థాపించినప్పటి నుంచి.. xAI వేగంగా ప్రపంచంలోని ప్రముఖ AIలలో ఒకటిగా మారింది. X అనేది సోషల్ మీడియా దిగ్గజం. ఇక్కడ 600 మిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉన్నారు. ఇది కూడా ప్రపంచంలోని అత్యంత సమర్థవంతమైన కంపెనీలలో ఒకటిగా రూపాంతరం చెందింది. కాగా ఇప్పడు ఈ సంస్థను ఎక్స్ఏఐ సొంతం చేసుకుంది. ఎక్స్ఏఐ, ఎక్స్ భవిష్యత్తులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని మస్క్ పేర్కొన్నారు.ఎక్స్ఏఐ, ఎక్స్ కలయిక ఏఐ సామర్థ్యం పెంపొందించడానికి దోహదపడుతుంది. వినియోపగదారులకు గొప్ప అనుభవాలను అందించడానికి సంస్థ కృషి చేస్తోందని మస్క్ అన్నారు. ఇది ప్రపంచాన్ని ప్రతిబింబించడమే కాకుండా మానవ పురోగతిని కూడా వేగవంతం చేయడానికి ఉపయోగపడే వేదికను నిర్మించడానికి వీలు కల్పిస్తుందని వెల్లడించారు.ఈ కంపెనీలు అన్నీ స్టాక్‌లతో కూడిన ఒప్పందంలో విలీనం చేయబడుతున్నాయి. ఎక్స్ఏఐ విలువ 80 బిలియన్ డాలర్లు కాగా.. ఎక్స్ విలువ 33 బిలియన్ డాలర్లు. రెండు కంపెనీ కలయికతో 113 బిలియన్ డాలర్ల సంస్థ అవతరించింది.ఇదీ చదవండి: పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్లు ప్రకటించిన కేంద్రంనిజానికి 2022 చివరలో మస్క్ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన లావాదేవీల్లో అప్పు కూడా ఉందని తెలుస్తోంది. ఆ మరుసటి సంవత్సరమే ఎక్స్ఏఐ ప్రారంభమైంది. ఇప్పుడు ఏఐలో ఆధిపత్యాన్ని చెలాయించడాన్ని ఎలాన్ మస్క్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు.@xAI has acquired @X in an all-stock transaction. The combination values xAI at $80 billion and X at $33 billion ($45B less $12B debt). Since its founding two years ago, xAI has rapidly become one of the leading AI labs in the world, building models and data centers at…— Elon Musk (@elonmusk) March 28, 2025 -
భారత ప్రభుత్వంపై X దావా.. స్పందించిన కేంద్రం
న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్‌ఫారమ్ ఎక్స్(X Plat Form) భారత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలకు దిగింది. చట్టాలకు విరుద్ధంగా తమ కంటెంట్‌ను నియంత్రించాలని చూస్తోందని, ఏకపక్షంగా సెన్షార్‌షిఫ్‌నకు పాల్పడుతోందని.. ఇది యూజర్ల స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని కోర్టుకెక్కింది. అయితే ఈ పరిణామంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది.ఈ వ్యవహారంలో ప్రభుత్వం తగిన రీతిలో స్పందిస్తుంది.. అలాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ తప్పనిసరిగా చట్టాన్ని గౌరవించాల్సిందే అని కేంద్ర వర్గాలు స్పష్టం చేశాయి. ఇదిలా ఉంటే.. భారత ప్రభుత్వం(Indian Government)పై కర్ణాటక హైకోర్టులో ఎక్స్(పూర్వపు ట్విట్టర్) రిట్ పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ ఎం నాగప్రసన్న బెంచ్ ఈ పిటిషన్‌ను విచారణ జరుపుతోంది.ఐటీ యాక్ట్-2000 సెక్షన్ 79(3)(b) ప్రకారం.. కేంద్రం సేఫ్ హార్బర్ (Safe Harbor Provision) అనే నిబంధన తీసుకొచ్చింది. దీని ప్రకారం.. ప్రభుత్వం కోరిన సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌లు తప్పనిసరిగా బ్లాక్ చేయడమో లేదంటే తొలగించడమో చేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో సదరు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ న్యాయపరమైన రక్షణ కోల్పోతుంది. అయితే.. ఈ సెక్షన్‌ను సవాల్ చేస్తూ ‘ఎక్స్’ కర్ణాటక ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.భారతదేశంలో సరైన చట్టపరమైన విధానాలతో కాకుండా.. ఆన్లైన్లో కంటెంట్‌ను బ్లాక్ చేయడానికి చట్టవిరుద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని X ఆ రిట్ పిటిషన్లో ఆరోపించింది. కంటెంట్‌ను బ్లాక్ చేసే అంశంపై ఐటీ యాక్ట్‌లోని 69(A) సెక్షన్ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని, అది ఏయే సందర్భాల్లో అనే అంశంపైనా శ్రేయా సింఘాల్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు(2015లో)ను సైతం ఎక్స్ గుర్తు చేసింది. అయితే.. 69(A) సెక్షన్ కింద కాకుండా.. స్పష్టమైన నిబంధనలు లేని సెక్షన్ 79(3)(b)తో కంటెంట్‌ను నియంత్రించాలని ప్రభుత్వం చూస్తోందని.. ఈ సెక్షన్ ద్వారా కంటెంట్ బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని ఎక్స్ అంటోంది. సాక్ష్యాలుగా 2024 ఫిబ్రవరిలో రైల్వే శాఖ పంపిన ‘బ్లాకింగ్ ఆదేశాలను’ కోర్టుకు చూపించింది. ఇది తమ వ్యాపార లావాదేవీలను దెబ్బ తీయడమే అవుతుందన్న ఎక్స్.. పైగా ఇలాంటి చర్యలు యూజర్ల స్వేచ్ఛను హరించడం అవుతుందని వాదించింది. అంతేకాదు.. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నడిపించే సహయోగ్ పోర్ట్‌లో తమను చేరాలంటూ ప్రభుత్వం బలవంత పెడుతోందని ఆరోపించింది. అయితే.. తాము 2021 భారత ప్రభుత్వం తప్పనిసరి చేసిన ఐటీ మార్గదర్శకాలను పాటిస్తున్నామన్న ఎక్స్.. ఇప్పటివరకైతే ప్రభుత్వం తమపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోలేదని కోర్టుకు తెలిపింది. శ్రేయా సింఘాల్ కేసులో..సోషల్‌మీడియా వేదికల్లో చట్టవిరుద్ధ, ప్రమాదకర కంటెంట్‌ను పోస్ట్ చేసిన వారిని సెక్షన్ 66ఏ కింద అరెస్టు చేసేందుకు వీలుండేది. ఈ సెక్షన్ ప్రకారం.. నిందితులకు మూడేళ్ల వరకు జైలుశిక్ష విధించొచ్చు. అయితే పలు రాష్ట్రాల్లో ఈ సెక్షన్‌ను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. 2015లో దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ విచారణ సందర్భంగా సెక్షన్ 66ఏను రద్దు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. -
Comment X: ఎవర్రా బాబూ ఇది ఎడిట్ చేసింది!
వైట్‌హౌజ్ ఓవెల్ ఆఫీస్‌లో జరిగిన పరిణామాలు.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అనుసరిస్తున్న వైఖరిని.. తమ సమక్షంలో చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump_, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌లు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో ఖనిజ సంపద ఒప్పందాల సంతకం చేయకుండానే జెలెన్స్కీ అమెరికా నుంచి వెనుదిరిగారు. ట్రంప్‌నకు ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పనని జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు వైట్‌హౌజ్(White House) తలుపులు మూసుకుపోయినట్లేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మధ్యకాలంలో ఏఐ ఎడిట్లు ఎంతగా వైరల్ అవుతున్నాయో తెలిసిందే. గాజా విషయంలో అలాంటి ఓ వీడియోను ఎడిట్ చేసే.. ట్రంప్ విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో తాజా భేటీని.. దాదాపుగా తన్నుకున్నంత పనిగా మార్చేయగా.. అది చక్కర్లు కొడుతోంది.LMAO! Who created this video?😂 pic.twitter.com/Gr8Pnl2Nz6— War Intel (@warintel4u) February 28, 2025ఏరా బుడ్డి.. ఇలాగైతే ఎలా?బరువు తగ్గేందుకు చాలామంది రకరకాల మార్గాలను అనుసరిస్తుంటారు. అందులో చిత్తశుద్ధి ప్రదర్శించేది కొందరే. మరి మిగతా వారు?. ఓవైపు డైట్లు గట్రా అంటూనే.. ఇంకోవైపు నోటికి పని చెబుతుంటారు. పైగా ఏం చేసినా బరువు తగ్గడం లేదంటూ తెగ ఫీలైపోతుంటారు. అలాంటి వాళ్లను ప్రతిబింబించేలా ఈ బుడ్డోడి వీడియో అనే కామెంట్ వినిపిస్తోంది ఇప్పుడు. “I can't lose weight no matter what i do”Also me after 8 pm: pic.twitter.com/OpNxn3vKjB— NO CONTEXT HUMANS (@HumansNoContext) March 1, 2025 -
Comment In X: అసెంబ్లీలో కునుకు తీస్తే.. ఆ కిక్కే వేరబ్బా!
సాధారణంగా.. కీలక సమావేశాల్లో లేదంటే ఉపన్యాసాలు జరుగుతున్న టైంలో మన నేతలు నిద్రపోతూ కనిపించే దృశ్యాలు అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. అయితే నేతలు ఇక మీదట హుషారుగా పని చేసేందుకు కర్ణాటక స్పీకర్ యూటీ ఖాదర్ ఓ నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ(Karnataka Assembly) సమావేశాల టైంలో భోజనం తర్వాత.. సభ్యులు కాసేపు నిద్ర తీసేందుకు ఏర్పాట్లు కలిగించబోతున్నారు. ఈ మేరకు అద్దె ప్రతిపాదిక 15 ‘కునుకు కుర్చీలు’ తెప్పించాలని ఆదేశాలు జారీ చేశారు. తద్వారా నేతలకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, వాళ్ల పని తీరు మెరుగుపడుతుందని, పైగా సభ్యుల హాజరు శాతం పెరుగుతుందని ఆయన భావిస్తున్నారు.#Karnataka MLAs to get recliners in assembly for quick power naps🙂Speaker UT Khader has approved installing 15 recliners in the Assembly lobby on rent, allowing legislators a quick nap post lunch. Idea is to boost productivity ensuring they stay active for rest of the session… pic.twitter.com/OUMNtVxfuf— Nabila Jamal (@nabilajamal_) February 25, 2025సర్ ఇంగ్లీష్ అంతే!సీనియర్ నేత, తిరువంతపురం ఎంపీ శశిథరూర్(Shashi Tharoor) కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ట్రంప్-మోదీ భేటీపై ఆయన సానుకూలంగా మాట్లాడడం, బీజేపీ నేతలతో సెల్ఫీ దిగడంతో ఆయన పార్టీ మారడం ఖాయమని ఊహాజనిత కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఆయన వాటన్నింటినీ ఖండించేశారు. అయితే ఆయన ఆంగ్ల పరిజ్ఞానం అత్యంత అరుదు. పలకడానికి కష్టంగా ఉన్న ఇంగ్లీష్ పదాలు తరచూ ఆయన వాడుతుంటారు. అలాగే.. ఆ ఖరీదైన ఇంగ్లీష్‌కు చాలామంది అభిమానులే ఉన్నారు. ఇక.. హిందీ భాషాభిమానంలో బీజేపీని కొట్టేవారు ఈ దేశంలోనే లేరు. అలా.. అమిత్ షా-శశి మధ్య పార్టీ మారడం గురించి చర్చ జరిగితే ఇలా ఉంటుందనే సరదా ప్రయత్నం.. ఈ ఎక్స్ కామెంట్.What say you Shashi T, my old friend? pic.twitter.com/a8sjohnZ71— ParanjoyGuhaThakurta (@paranjoygt) February 25, 2025 సొంత దేశంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో పాకిస్థాన్ జట్టుకు ఘోర పరాభవమే ఎదురవుతోంది. తీవ్ర స్థాయిలో ఆ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే టైంలో జట్టు పేలవమైన ప్రదర్శన కారణంగా.. సోషల్ మీడియాలో జోకులు సైతం పేలుతున్నాయి. ఇక సొంతదేశంలోనే మీమ్ మెటీరియల్‌గా పేరున్న షాహిన్ అఫ్రిదీ(Shaheen Afridi)ని ఇలా.. భారత్‌లోని భాగేశ్వర్ ధామ్‌లో పూరీలు అమ్ముకునేవాడిలా చేసేశారు. Shaheen Afridi Bageshwar Dham mai pooriya nikaal raha 😸 pic.twitter.com/BeTMsC1Lzf— Sachya (@sachya2002) February 25, 2025 Note: ఈ పోస్టులు ఎవరినీ కించపరిచడానికో లేదంటే విమర్శించడానికో కాదు. కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని తెలియజేయడం కోసమే.. -
#HBDYSJAGAN: ట్రెండ్ సెట్ చేసిన అభిమానం
Jagan Birthday Shakes Social Media: వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం నేడు. అయితే.. ముందు నుంచే ఈ కోలాహలం నడిచింది. మొన్నా.. నిన్నంతా.. అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే జగనన్న అంటూ సోషల్ మీడియా హోరెత్తగా.. ఇవాళ హ్యాపీ బర్త్ డే వైఎస్ జగన్ తో ఊగిపోతోంది. ఇవాళ జననేత పుట్టిన రోజు సందర్భంగా.. వైఎస్సార్సీపీ తరఫున, అలాగే అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలకు, ఇతర కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. కానీ, ఈలోపే సోషల్ మీడియా దద్దరిల్లడం మొదలైంది. జగన్ బర్త్‌డే హ్యాష్ ట్యాగ్ దుమ్మురేపేస్తోంది. ఎక్స్(మాజీ ట్విటర్)లో ఇండియా వైడ్‌గా టాప్ ట్రెండింగ్‌లో వైయస్ జగన్ బర్త్‌డే కొనసాగుతోంది.#HBDYSJagan#HBDYSJagananna#HbdysJagansir200K Tweets Done & Dusted✅🔥#HBDYSJagan pic.twitter.com/mrLVHcdqTr— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) December 21, 2024తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలలా, విదేశాల నుంచి కూడా #HBDYSJagan తో పాటు అనుబంధ హ్యాష్ ట్యాగ్‌తో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఈ దెబ్బకు హేటర్స్ సైతం పోటాపోటీ పోస్టులు వేయలేక చల్లబడ్డారు. ఇంకోపక్క.. ఏపీలోనే కాదు తెలంగాణలోనూ జగన్.. వైఎస్సార్సీపీ అభిమానులు రాత్రి నుంచే సంబురాలు చేస్తున్నారు. రాజధాని హైదరాబాద్‌లో కూకట్పల్లి, పంజాగుట్టలో వేడుకలు అంటూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. శివమెత్తి లేచిన అభిమానం 🔥🔥@ysjagan #HBDYSJagan #YSJagan pic.twitter.com/5gl8NZwhUT— 𝐑𝐚𝐠𝐮𝐥𝐮𝐭𝐮𝐧𝐧𝐚 𝐘𝐮𝐯𝐚𝐭𝐚𝐫𝐚𝐦 (@karnareddy4512) December 20, 2024ఏ యేడు కాయేడు సోషల్ మీడియాలో వైఎస్ జగన్ బర్త్‌డే పోస్టుల రూపంలో సరికొత్త రికార్డు నెలకొల్పుతోంది. ఎక్స్‌లో టాప్ త్రీ పొజిషన్లోనే సుమారు 10 గంటలకు పైగా కొనసాగడం.. మామూలు విషయం కాదు. తెల్లవారుజాము నుంచి పోస్ట్ చేసేవాళ్ల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఒక్క ఎక్స్‌లోనే కాదు.. ఇటు వాట్సాప్ స్టేటస్‌ల రూపంలో, మరోవైపు ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్, ఫేస్‌బుక్‌లోనూ జగన్ బర్త్ డే సందర్భంగా అభిమానం ఉప్పొంగుతోంది.ఇదీ చదవండి: ఎవరేమన్నా.. జగన్ విషయంలో ఇదే అక్షర సత్యం! -
డీఈఏ చీఫ్ పదవి నాకొద్దు: క్రోనిస్టర్
ఫ్లోరిడా: అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ) అధిపతి పదవి చేపట్టబోవడం లేదని చాడ్ క్రోనిస్టర్ ప్రకటించారు. ఫ్లోరిడాలోని హిల్స్‌బరో కౌంటీ షెరీఫ్ పదవిలోనే కొనసాగుతానని పేర్కొన్నారు. ‘‘షెరీఫ్గా చేయాల్సింది చాలా ఉంది. అందుకే డీఈఏ పదవి చేపట్టొద్దని నిర్ణయించుకున్నా’’అంటూ తాజాగా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిపై కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గానీ, ఆయన బృందం గానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. మెక్సికో సరిహద్దు వెంబడి ఫెంటానిల్ అక్రమ ప్రవాహాన్ని నిరోధించేందుకు డీఈఏ చీఫ్‌గా క్రోనిస్టర్ను నామినేట్ చేస్తున్నట్టు ట్రంప్ ఆదివారమే ప్రకటించారు. న్యాయ శాఖలో స్టిస్లో భాగంగా పనిచేసే డీఈఏ డ్రగ్ చట్టాలను అమలు చేస్తుంది. 2020 కోవిడ్ సమయంలో ప్రజారోగ్య ఆదేశాలను విస్మరించారనే అభియోగంపై ఒక పాస్టర్‌ను అక్రమంగా అరెస్టు చేయడం వంటి పలు అభియోగాలు, విమర్శలు క్రోనిస్టర్పై ఉన్నాయి. అటార్నీ జనరల్‌గా ట్రంప్ నామినేట్ చేసిన మాట్ గేట్జ్ కూడా తనకా పదవి వద్దని ఇటీవలే ప్రకటించడం తెలిసిందే. రక్షణ మంత్రిగా నామినేట్ చేసిన పీట్ హెగ్సెత్ విషయంలో కూడా ట్రంప్ తాజాగా పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. లైంగిక వేధింపులతో పాటు ఆయనపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతుండటం తెలిసిందే. తాజాగా హెగ్సెత్ తల్లి కూడా ఆయనపై పలు ఆరోపణలు చేశారు! ఈ నేపథ్యంలో ఆయన నియామకానికి సెనేట్ ఆమోదం కష్టమేనని ట్రంప్ బృందం భావిస్తోంది. అందుకే హెగ్సెత్ స్థానంలో రక్షణ మంత్రిగా ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష ఎన్నికల అభ్యరి్థత్వం కోసం ఆయన ట్రంప్‌తో పోటీ పడ్డారు. -
మస్క్ ‘ఫోరమ్ షాపింగ్’! ట్రంప్‌తో దోస్తీ ఇందుకేనా..?
ఇలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (గతంలో ట్విటర్)కు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాలను పరిష్కరించుకోనున్నారు. ఇలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి సంస్థపై న్యాయపరంగా కొన్ని కంపెనీలు వ్యాజ్యాలు దాఖలు చేశాయి. ఎక్స్ నిబంధనలకు తగ్గట్లు వ్యవహరించడంలేదని అందులో పేర్కొన్నారు. వాటిని త్వరలో పరిష్కరించుకోనున్నట్లు మస్క్ నిర్ణయం తీసుకున్నారని వాషింగ్టన్పోస్ట్ తెలిపింది.సమస్యలేంటి..ఎక్స్‌లో వెలువరించే యాడ్స్‌కు సంబంధించి సంస్థ యాజమాన్యం వెండర్లకు సరైన విధంగా రెవెన్యూలో షేర్ ఇవ్వడంలేదని కొన్ని కంపెనీలు గతంలో ఫిర్యాదు చేశాయి.కార్పొరేట్ యాడ్ తర్వాత వెంటనే వీక్షకులకు కాంట్రవర్సీ యాడ్ కనిపించేలా ఎక్స్‌లో ఆల్గారిథమ్ను క్రియేట్ చేశారని కొన్ని సంస్థలు గతంలో కోర్టును ఆశ్రయించాయి.ఎక్స్ యాజమాన్యం లేఆఫ్స్ ప్రకటించిన దాదాపు 2,200 మంది మాజీ ఉద్యోగుల నుంచి ఆర్బిట్రేషన్ కేసు ఎదుర్కొంటోంది. వీటితోపాటు మరిన్ని న్యాయపరమైన వ్యాజ్యాలు కంపెనీపై దాఖలయ్యాయి.నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ టెక్సాస్‌లో వ్యాజ్యాలుకంపెనీపై నమోదైన వ్యాజ్యాలను పరిష్కరించుకునేందుకు నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ టెక్సాస్‌లో కౌంటర్ వ్యాజ్యాలను దాఖలు చేయాలని మస్క్ నిర్ణయించుకున్నారు. ఈ వ్యవహారాన్ని నిపుణులు ‘ఫోరమ్ షాపింగ్’(అనుకూలమైన తీర్పులు పొందడం)గా అభివర్ణిస్తున్నారు. సాధారణంగా కార్పొరేట్ కంపెనీలు న్యాయపరమైన చిక్కులను పరిష్కరించుకునేందుకు తమ ప్రధాన కార్యాలయానికి అనుసంధానించబడిన జిల్లా కోర్టును ఎంచుకుంటాయి. కానీ ఎక్స్ మాత్రం ట్రంప్‌నకు స్పష్టమైన మెజారిటీ వచ్చాక టెక్సాస్‌లోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కౌంటర్ వ్యాజ్యాలు దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో రిపబ్లికన్ పార్టీ నియమించిన న్యాయమూర్తులు అధికంగా ఉన్నారనే వాదనలున్నాయి. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌నకు మస్క్ మద్దతిచ్చారు.ఇదీ చదవండి: పన్ను ఎగవేత.. పలు రకాలు.. వీటి జోలికి పోవద్దుఎక్స్ను రక్షించే వ్యూహంమస్క్ నిర్ణయం ఎక్స్‌ను రక్షించే వ్యూహంగా నిపుణులు భావిస్తున్నారు. నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ టెక్సాస్‌లోని 11 మంది న్యాయమూర్తుల్లో 10 మందిని రిపబ్లికన్ అధ్యక్షులు నియమించారని జార్జ్‌టౌన్ న్యాయశాస్త్ర ప్రొఫెసర్ స్టీవ్ వ్లాడెక్ తెలిపారు. ఇది మస్క్‌కు అనుకూలంగా తీర్పులను మార్చగలదని అభిప్రాయపడుతున్నారు. -
హైదరాబాద్ మెట్రో X అకౌంట్ హ్యాక్
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ‘ఎక్స్’ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. దీనిపై మెట్రో యాజమాన్యం స్పందించింది. ఎలాంటి లింకులపై క్లిక్ చేయొద్దని.. తమ ఎక్స్ అకౌంట్‌ను సంప్రదించేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని కోరింది. త్వరగా ఖాతాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామని తెలిపింది.⚠️ Important Notice: Our official Twitter/X account (@ltmhyd) has been hacked. Please avoid clicking any links or engaging with posts until further notice. We're working on it and will update you soon. Stay safe! #landtmetro #metroride #mycitymymetromypride #hyderabadmetro… pic.twitter.com/NiNyNNlN1M— L&T Hyderabad Metro Rail (@ltmhyd) September 19, 2024 -
వైఎస్సార్‌ను గుర్తు చేసుకుని.. జగన్ భావోద్వేగం
వైఎస్సార్, సాక్షి: మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిన.. వైఎస్ జగన్మోహన్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఈ ఉదయం ఇడుపులపాయకు వెళ్లి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల సమర్పించారు. అనంతరం ఎక్స్ ఖాతాలో ఆయన తండ్రికి గుర్తు చేసుకుంటూ ‘డాడ్.. మిస్ యూ’ అనే ఓ సందేశం ఉంచారు. We miss you, Dad pic.twitter.com/lzNm7wSHJn— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2024 -
బ్రెజిల్లో ‘ఎక్స్’పై నిషేధం
బ్రసీలియా: ఎలాన్ మస్క్ ‘ఎక్స్’(పూర్వపు ట్విట్టర్)పై నిషేధం విధిస్తూ బ్రెజిల్ సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. తమ దేశంలో ఎక్స్ సంస్థ చట్టపరమైన ప్రతినిధిని నియమించాలని బ్రెజిల్ ప్రభుత్వం మస్క్‌ను కోరింది. అయితే ఆ ఉత్తర్వులను ఆయన బేఖాతరు చేశారు. దీంతో.. సేవలు నిలిపివేయాలంటూ అక్కడి అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎక్స్‌లో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోందని, దానిని అరికట్టేందుకు ప్రయత్నాలు చేయాలంటూ మస్క్‌ను బ్రెజిల్ ప్రభుత్వం కోరుతూ వస్తోంది. ఆపై ఈ వ్యవహారం నెలల తరబడి న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం న్యాయమూర్తి అలెగ్జాండ్రే డె మోరాయిస్ ఆదేశాలు వెల్లడించారు. 24 గంటల్లోగా ఆ ఆదేశాలను అమలు చేయాలని టెలికమ్యూనికేషన్ ఏజెన్సీని ఆదేశించారాయన.