Jagan Birthday Shakes Social Media: వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం నేడు. అయితే.. ముందు నుంచే ఈ కోలాహలం నడిచింది. మొన్నా.. నిన్నంతా.. అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే జగనన్న అంటూ సోషల్ మీడియా హోరెత్తగా.. ఇవాళ హ్యాపీ బర్త్ డే వైఎస్ జగన్ తో ఊగిపోతోంది.
ఇవాళ జననేత పుట్టిన రోజు సందర్భంగా.. వైఎస్సార్‌సీపీ తరఫున, అలాగే అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలకు, ఇతర కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. కానీ, ఈలోపే సోషల్ మీడియా దద్దరిల్లడం మొదలైంది. జగన్ బర్త్‌డే హ్యాష్ ట్యాగ్ దుమ్మురేపేస్తోంది. ఎక్స్(మాజీ ట్విటర్)లో ఇండియా వైడ్‌గా టాప్ ట్రెండింగ్‌లో వైయస్ జగన్ బర్త్‌డే కొనసాగుతోంది.
#HBDYSJagan
#HBDYSJagananna
#HbdysJagansir
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలలా, విదేశాల నుంచి కూడా #HBDYSJagan తో పాటు అనుబంధ హ్యాష్ ట్యాగ్‌తో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఈ దెబ్బకు హేటర్స్ సైతం పోటాపోటీ పోస్టులు వేయలేక చల్లబడ్డారు. ఇంకోపక్క.. ఏపీలోనే కాదు తెలంగాణలోనూ జగన్.. వైఎస్సార్‌సీపీ అభిమానులు రాత్రి నుంచే సంబురాలు చేస్తున్నారు. రాజధాని హైదరాబాద్‌లో కూకట్‌పల్లి, పంజాగుట్టలో వేడుకలు అంటూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.
శివమెత్తి లేచిన అభిమానం 🔥🔥@ysjagan #HBDYSJagan #YSJagan pic.twitter.com/5gl8NZwhUT
— 𝐑𝐚𝐠𝐮𝐥𝐮𝐭𝐮𝐧𝐧𝐚 𝐘𝐮𝐯𝐚𝐭𝐚𝐫𝐚𝐦 (@karnareddy4512) December 20, 2024
ఏ యేడు కాయేడు సోషల్ మీడియాలో వైఎస్ జగన్ బర్త్‌డే పోస్టుల రూపంలో సరికొత్త రికార్డు నెలకొల్పుతోంది. ఎక్స్‌లో టాప్ త్రీ పొజిషన్‌లోనే సుమారు 10 గంటలకు పైగా కొనసాగడం.. మామూలు విషయం కాదు. తెల్లవారుజాము నుంచి పోస్ట్ చేసేవాళ్ల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఒక్క ఎక్స్‌లోనే కాదు.. ఇటు వాట్సాప్ స్టేటస్‌ల రూపంలో, మరోవైపు ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్, ఫేస్‌బుక్‌లోనూ జగన్ బర్త్ డే సందర్భంగా అభిమానం ఉప్పొంగుతోంది.
ఇదీ చదవండి: ఎవరేమన్నా.. జగన్ విషయంలో ఇదే అక్షర సత్యం!
Comments
Please login to add a commentAdd a comment