గ్సెత్‌పైనా ట్రంప్ పునరాలోచన!
రక్షణ మంత్రిగా డిశాంటిస్ పేరు
ఫ్లోరిడా: అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ) అధిపతి పదవి చేపట్టబోవడం లేదని చాడ్ క్రోనిస్టర్ ప్రకటించారు. ఫ్లోరిడాలోని హిల్స్‌బరో కౌంటీ షెరీఫ్ పదవిలోనే కొనసాగుతానని పేర్కొన్నారు. ‘‘షెరీఫ్‌గా చేయాల్సింది చాలా ఉంది. అందుకే డీఈఏ పదవి చేపట్టొద్దని నిర్ణయించుకున్నా’’అంటూ తాజాగా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిపై కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గానీ, ఆయన బృందం గానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
మెక్సికో సరిహద్దు వెంబడి ఫెంటానిల్ అక్రమ ప్రవాహాన్ని నిరోధించేందుకు డీఈఏ చీఫ్‌గా క్రోనిస్టర్‌ను నామినేట్ చేస్తున్నట్టు ట్రంప్ ఆదివారమే ప్రకటించారు. న్యాయ శాఖలో స్టిస్‌లో భాగంగా పనిచేసే డీఈఏ డ్రగ్ చట్టాలను అమలు చేస్తుంది. 2020 కోవిడ్ సమయంలో ప్రజారోగ్య ఆదేశాలను విస్మరించారనే అభియోగంపై ఒక పాస్టర్‌ను అక్రమంగా అరెస్టు చేయడం వంటి పలు అభియోగాలు, విమర్శలు క్రోనిస్టర్‌పై ఉన్నాయి. అటార్నీ జనరల్‌గా ట్రంప్ నామినేట్ చేసిన మాట్ గేట్జ్ కూడా తనకా పదవి వద్దని ఇటీవలే ప్రకటించడం తెలిసిందే.
రక్షణ మంత్రిగా నామినేట్ చేసిన పీట్ హెగ్సెత్ విషయంలో కూడా ట్రంప్ తాజాగా పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. లైంగిక వేధింపులతో పాటు ఆయనపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతుండటం తెలిసిందే. తాజాగా హెగ్సెత్ తల్లి కూడా ఆయనపై పలు ఆరోపణలు చేశారు! ఈ నేపథ్యంలో ఆయన నియామకానికి సెనేట్ ఆమోదం కష్టమేనని ట్రంప్ బృందం భావిస్తోంది. అందుకే హెగ్సెత్ స్థానంలో రక్షణ మంత్రిగా ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష ఎన్నికల అభ్యరి్థత్వం కోసం ఆయన ట్రంప్‌తో పోటీ పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment