Dea
-
డీఈఏ చీఫ్ పదవి నాకొద్దు: క్రోనిస్టర్
ఫ్లోరిడా: అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ) అధిపతి పదవి చేపట్టబోవడం లేదని చాడ్ క్రోనిస్టర్ ప్రకటించారు. ఫ్లోరిడాలోని హిల్స్‌బరో కౌంటీ షెరీఫ్ పదవిలోనే కొనసాగుతానని పేర్కొన్నారు. ‘‘షెరీఫ్గా చేయాల్సింది చాలా ఉంది. అందుకే డీఈఏ పదవి చేపట్టొద్దని నిర్ణయించుకున్నా’’అంటూ తాజాగా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిపై కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గానీ, ఆయన బృందం గానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. మెక్సికో సరిహద్దు వెంబడి ఫెంటానిల్ అక్రమ ప్రవాహాన్ని నిరోధించేందుకు డీఈఏ చీఫ్‌గా క్రోనిస్టర్ను నామినేట్ చేస్తున్నట్టు ట్రంప్ ఆదివారమే ప్రకటించారు. న్యాయ శాఖలో స్టిస్లో భాగంగా పనిచేసే డీఈఏ డ్రగ్ చట్టాలను అమలు చేస్తుంది. 2020 కోవిడ్ సమయంలో ప్రజారోగ్య ఆదేశాలను విస్మరించారనే అభియోగంపై ఒక పాస్టర్‌ను అక్రమంగా అరెస్టు చేయడం వంటి పలు అభియోగాలు, విమర్శలు క్రోనిస్టర్పై ఉన్నాయి. అటార్నీ జనరల్‌గా ట్రంప్ నామినేట్ చేసిన మాట్ గేట్జ్ కూడా తనకా పదవి వద్దని ఇటీవలే ప్రకటించడం తెలిసిందే. రక్షణ మంత్రిగా నామినేట్ చేసిన పీట్ హెగ్సెత్ విషయంలో కూడా ట్రంప్ తాజాగా పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. లైంగిక వేధింపులతో పాటు ఆయనపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతుండటం తెలిసిందే. తాజాగా హెగ్సెత్ తల్లి కూడా ఆయనపై పలు ఆరోపణలు చేశారు! ఈ నేపథ్యంలో ఆయన నియామకానికి సెనేట్ ఆమోదం కష్టమేనని ట్రంప్ బృందం భావిస్తోంది. అందుకే హెగ్సెత్ స్థానంలో రక్షణ మంత్రిగా ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష ఎన్నికల అభ్యరి్థత్వం కోసం ఆయన ట్రంప్‌తో పోటీ పడ్డారు. -
విదేశీ భోజనంబు.. వింతైన వంటకంబు...
పొరుగింటి పుల్లకూర రుచి అంటారు. ముంబైకి చెందిన హేమ తన బిడ్డలు దియా, ఓజస్వీ శర్మలతో కలిసి ‘చిల్జో’ పుడ్బ్రాండ్ ద్వారా మన పొరుగుదేశాలతో పాటు ఇటలీ, ఆఫ్రికా, అమెరికా, చైనా... మొదలైన దేశాల వంటకాలను రుచి చూపిస్తూ ‘వావ్’ అనిపిస్తోంది... చైనా వంటకాలు చైనాకు వెళ్లే తిననక్కర్లేదు. ఇటలీ వంటకాలకు అక్కడికే వెళ్లనక్కర్లేదు. ముంబైలోని ‘చిల్జో’లోకి అడుగుపెడితే చాలు ఎన్నో దేశాలకు సంబంధించిన నోరూరించే వంటకాలు స్వాగతం పలుకుతాయి. గత సంవత్సరం హేమ తన కూతుళ్లు దియా, ఓజస్వీలతో కలిసి ఈ ఫుడ్రెస్టారెంట్ను ప్రారంభించింది. ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే సూపర్‌హిట్ టాక్ సొంతం చేసుకుంది. ముంబైవాసులు మాత్రమే కాదు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడకు రావడం మొదలైంది. ‘ఇతర దేశాల ఆహార సంస్కృతిని అందిపుచ్చుకొని ఆస్వాదించడం మనకేమీ కొత్త కాదు. అయితే అక్కడి రుచిని ఇక్కడికి తీసుకు వచ్చినప్పుడే విజయవంతం అవుతాం’ అంటుంది దియా. చదువు పూర్తయిన తరువాత అమెరికాలోని ఒక మార్కెటింగ్ కంపెనీలో పనిచేసింది దియా. ఉద్యోగ కాలంలో ఎన్నో ప్రాంతాలు తిరిగింది. ఆ సమయంలో రకరకాల రుచులతో పరిచయం అయింది. వంటల రుచికి మాత్రమే పరిమితమై పోకుండా ఎందరో చెఫ్‌లు, ఫుడ్ ఇండస్ట్రీలోని ప్రొఫెషనల్స్‌తో మాట్లాడింది. కోవిడ్ కల్లోల కాలంలో స్వదేశానికి తిరిగివచ్చిన దియా ఇంటి నుంచి పనిచేయడం ప్రారంభించింది. లాక్డౌన్ సమయంలో బయటికి వెళ్లి తినే పరిస్థితి లేదు. దాల్, రోటీ తినడం తప్ప మరోదారి లేదు. మరోవైపు రకరకాల వంటకాల రుచులు గుర్తుకొచ్చి నోరూరించేవి. ఆ సమయంలో వివిధ దేశాలకు చెందిన వంటకాల గురించి తెలుసుకునే పనిలో పడింది దియా. ‘ఎన్నో సంవత్సరాలు హాస్టల్ ఫుడ్ తిన్న నాకు కొత్త రుచి కావాలనిపించేది. నేను పాస్తాకు వీరాభిమానిని. దీంతో ఇంట్లో వంటల ప్రయోగాలు మొదలు పెట్టాం. చాలాసార్లు విఫలం అయిన తరువాతగానీ సక్సెస్ కాలేకపోయేవాళ్లం. మేము ప్రొఫెషనల్స్ కాకపోయినా యూట్యూబ్ వీడియోలు చూసుకుంటూ నేర్చుకున్నాం. ఇప్పుడు ‘చాలాబావుంది... అని మాకు అనిపించే వరకు వెనక్కి తగ్గలేదు’ అంటోంది బీటెక్ చదివిన ఓజస్వీ. ప్రయోగాల్లో భాగంగా తాము తయారుచేసిన రెండు వందల సాస్‌లను బంధువులు, స్నేహితులకు పంపిణీ చేశారు. వారి నుంచి మంచి స్పందన లభించింది. ఆ సమయంలోనే ఈ తల్లీకూతుళ్ల మదిలో ‘చిల్జో’ ఐడియా వచ్చింది. ఒక సంవత్సరం రీసెర్చ్, డెవలప్మెంట్ తరువాత ప్రాజెక్ట్ పట్టాలకెక్కింది. తమ పొదుపు మొత్తాల నుంచి 40 లక్షల రూపాయలు తీశారు. 30 మందికి ఉపాధి కల్పించారు. ‘ఇంట్లో వంటలతో ఎన్ని ప్రయోగాలైనా చేయవచ్చు. డబ్బులతో చేయవద్దు. ఫుడ్ ఇండస్ట్రీలో మీకు ఎలాంటి అనుభవం లేదు. రిస్క్ తీసుకుంటున్నారు’ అన్నవారే ఎక్కువ మంది ఉన్నారు. ‘యూనిట్ మొదలైన తరువాత నేను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఎన్నో సంవత్సరాలు చేసిన ఉద్యోగానికి దూరం కావడం బాధగా అనిపించినా, సొంత వ్యాపారం మొదలుపెట్టాం అనేది ఉత్సాహాన్ని ఇచ్చింది. ఉత్సాహం అయితే ఉంది కానీ ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి నేపథ్యం లేని మాకు మార్జిన్స్, రిటైల్, ఎలాంటి డిస్ట్రిబ్యూటర్లను సంప్రదించాలి అనే విషయాలు తెలియదు. జీటీ–జనరల్ ట్రేడ్, ఎంటీ–మార్కెట్ ట్రేడ్లాంటి పదాలు తెలియవు. సక్సెస్ అవుతామా, లేదా అనేది తెలియదు. అయినా ఉత్సాహంతో ముందుకు వెళ్లాం. మంచి ఫలితాన్ని సాధించాం’ అంటుంది దియా. అయినా సరే... ‘ఏమవుతుందో ఏమో!’ అనే సంశయం ఎక్కువైతే ఉన్నచోటే ఉండిపోతాం. కంఫర్ట్ జోన్‌కు అలవాటు పడిపోతాం. దీంతో విజయానికి దూరం అవుతాం. ‘పెద్ద రిస్క్ ఏమిటంటే ఎలాంటి రిస్క్ తీసుకోకపోవడమే’ అనే ప్రసిద్ధ మాటను దృష్టిలో పెట్టుకొని రంగంలోకి దిగాను. ఫుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి అనుభవం లేకపోయినా మా మీద మేము నమ్మకం కోల్పోలేదు. ఆశావాదంతో ముందుకు వెళ్లాం. అద్భుత ఫలితాన్ని సాధించాం. – హేమ, ఫౌండర్, చిల్జో -
మరింత వేగంగా వీసీఐసీ అభివృద్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి మరో ముందడుగు పడింది. విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ) అభివృద్ధి మరింత వేగం కానుంది. ఈ కారిడార్‌లో ఇప్పటికే తొలి దశ కింద రూ.2,900 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఇప్పుడు రెండో దశ అభివృద్ధికి మార్గం సుగమమైంది. తొలి దశ అంచనా వ్యయంలో కొంత భాగం రుణంగా సమకూర్చిన ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) రెండో దశకు కూడా రుణం రూపంలో నిధులు సమకూర్చడానికి అంగీకరించింది. రెండో దశకు రూ. 1,632.82 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా అందులో రూ.1130 కోట్లు (141.12 మిలియన్ డాలర్లు) ఏడీబీ రుణంగా అందించనుంది. ఈ రుణంపై సాధ్యమైనంత త్వరగా ఒప్పందం కుదుర్చుకోవడానికి అనుమతి కోరుతూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎఫైర్స్ (డీఈఏ)తో పాటు రాష్ట్ర అధికారులకు ఏడీబీ కంట్రీ డైరెక్టర్ టకియో కొనిషి లేఖ రాశారు. రెండో దశలో చిత్తూరు సౌత్ క్లస్టర్, రాంబల్లి, నక్కపల్లి క్లస్టర్స్‌లో స్టార్టప్ ఏరియాకు సంబంధించి ఏడు ప్రాజెక్టులను చేపడతారు. కేంద్రం నుంచి అనుమతిరాగానే ఈ పనులు ప్రారంభిస్తామని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 23,046 ఎకరాలు అభివృద్ధి వీసీఐసీ రెండో దశలో చిత్తూరు సౌత్ క్లస్టర్లో రూ.462.96 కోట్లతో 2,770 ఎకరాలు, నక్కపల్లి క్లస్టర్లో రూ.399.03 కోట్లతో 1,120 ఎకరాలు, రాంబల్లిలో రూ.149 కోట్లతో 396 ఎకరాలు అభివృద్ధి చేస్తారు. ఈ మూడు క్లస్టర్లను సమీపంలోని ప్రధాన రహదారులకు అనుసంధానిస్తారు. ఇందులో భాగంగా అనకాపల్లి – అచ్యుతాపురం రోడ్డును రూ.243.02 కోట్లతో జాతీయ రహదారికి అనుసంధానిస్తారు. అదే విధంగా నాయుడుపేట క్లస్టర్‌ను రూ 120.78 కోట్లతో, రౌతు సురమాల క్లస్టర్‌ను రూ.67.42 కోట్లతో, నక్కపల్లి క్లస్టర్‌ను రూ.25.91 కోట్లతో ప్రధాన రహదారులకు అనుసంధానిస్తారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో రూ.164.70 కోట్లు భూ సేకరణకు ఖర్చవుతుంది. మిగిలిన మొత్తంతో ఈ ఏడు ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తారు. రెండో దశలో మొత్తం 4,143.92 ఎకరాలను అభివృద్ధి చేస్తుండగా ఇప్పటికే 3,399.43 ఎకరాల సేకరణ పూర్తయింది. ఇంకా 744.49 ఎకరాలను సేకరించాల్సి ఉంది. ఈ రెండు దశలు పూర్తయితే పారిశ్రామిక అవసరాల కోసం 23,046 ఎకరాలు అందుబాటులోకి వస్తాయి. (చదవండి: థాంక్యూ సీఎం సార్ ! సీఎం జగన్ చిత్రపటానికి డీఎస్సీ 1998 ఉద్యోగుల క్షీరాభిషేకం ) -
మైక్రో ఏటీఎంలు, 1.3 లక్షల పోస్టాఫీసులు
న్యూఢిల్లీ: పెద్ద నోట్లు రద్దు అనంతరం దేశంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తి కాంత్ దాస్ సోమవారం ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించారు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర తగినంత నగదు అందుబాటులో ఉందని భరోసా ఇచ్చిన ఆయన రాబోయే రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పరిస్థితిని అంచనా వేస్తున్నారని, పెద్ద నోట్ల రద్దు వల్ల తలెత్తిన పరిస్థితిని తాము సమీక్షిస్తున్నామన్నారు. దేశ ప్రజలకు నగదును నేరుగా అందించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశామని, నగదును వేగంగా ఆందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు శక్తికాంత్ దాస్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని తపాల కార్యాలయాల్లోనూ నగదు డిపాజిట్ కు ఇబ్బందులు ఉండబోవని తెలిపారు. ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా నోట్ల మార్పిడి, విత్ డ్రా పరిమితిని పెంచామన్నారు. బ్యాంకుల్లో వారానికి నగదు విత్ డ్రా పరిమితిని రూ.24 వేలకు పెంచామని, ఈ నగదును ఖాతాదారుడు ఒకేరోజైనా లేదా వారంలో ఎప్పుడైనా సరే తీసుకోవచ్చని స్పష్టం చేశారు. ఏటీఎంల వద్ద భద్రత పెంచేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 1.3లక్షల పోస్టాఫీసులను సిద్ధంగా ఉంచనున్నట్టు ప్రకటించారు. మరోవైపు రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శుల సమన్వయంతో ప్రత్యేక బృందాల ద్వారా నిఘాను మరింత కట్టుదిట్టం చేశామని ఆయన చెప్పారు. ప్రజలకు సులువుగా నగదు చేర్చే విధానాలను అన్వేషిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో రూ. 500 నోట్ల పంపణీని నిన్ననే ప్రారంభించామని, త్వరలోనే (రేపు లేదా నేడు) రూ.2వేల నోట్లను ఏటీంలలో అందుబాటులోఉంచుతామని చెప్పారు. అలాగే బ్యాంకింగ్ కరస్పాండెట్స్ విత్ డ్రా పరిమితి రూ. 50వేలకు, రోజువారి పరిమితి.2.5 లక్షలకు పెంచుతున్నట్టు వెల్లడించారు. పెద్దనోట్ల రద్దు తర్వాత 18 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆయన వెల్లడించారు. -
మైక్రో ఏటీఎంలు, 1.3 లక్షల పోస్టాఫీసులు
-
యూరియాకు కృత్రిమ కొరత.. బ్లాక్ మార్కెట్లో విక్రయం
యలమంచిలి, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర బంద్‌లు, నిరసనలతో వ్యాపారులు ఎరువులను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ ఆఖరులో ముదురునారుతో ఆలస్యంగా వరినాట్లు పడ్డాయి. కనీసం తిండిగింజలైనా దక్కించుకోవాలనే ఆశతో అన్నదాతలు ఎరువులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ వరి సాధారణ విస్తీర్ణం 92,885 హెక్టార్లు. దాదాపు 30 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదయింది. అదీ సీజన్ ఆఖరులోనే. దీంతో మొత్తంగా 56వేల హెక్టార్లలో మాత్రమే నాట్లు పడినట్టు వ్యవసాయాధికారులు లెక్కలు తేల్చారు. యలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం, మునగపాక మండలాల్లో పరి స్థితి దయనీయంగా ఉంది. ఎలాగైనా పంటను దక్కించుకోవాలన్న ఆరాటంలో రైతులు ప్రస్తుతం డీఏపీ, గ్రోమోర్, ఎంవోపీ ఎరువులకంటే యూరియానే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఎరువుల సబ్సిడీపై పోషకాధారిత విధానం ప్రవేశపెట్టిన తర్వాత డీఏపీ, కాంప్లెక్స్‌ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇది యూరియాకు వర్తించకపోవడంతో రైతులు దానివైపే మొగ్గు చూపుతున్నారు. కేటాయింపుల మేరకు కేంద్రం నుంచి తెప్పించడంలో రాష్ట్రం విఫలం కావడంతో యూరియాకు కొరత ఏర్పడుతోంది. దీనిని ఆసరాగా చేసుకుని వ్యాపారులు రెచ్చిపోతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో దుకాణాలు మూ తపడటం, రవాణాకు ఇబ్బందులను సాకుగా చూపి ఎరువులను ఎక్కువ ధరలకు వ్యాపారులు అమ్ముతున్నారన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. మార్కెట్ ధరకంటే రు.80-100ల వరకు పెంచి విక్రయిస్తున్నారు. ఇక ఎక్కువ డిమాండ్ ఉన్న యూరియాకు కృత్రిమ కొరత సృష్టించి రైతుల నుంచి ఎక్కువగా గుంజుతున్నారన్న వాదన ఉంది. అధికారులు సమ్మెలో ఉండటంతో వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్టవేసేవారు లేకుండా పోయారు. ప్రైవేట్ వ్యాపారులు, పీఏసీఎస్‌ల్లో 28-28-0 రకం ఎరువును రూ.1150లకు, 20-20-13ను రూ.919లకు, ఎస్ఎస్పీ రూ.352లకు అమ్ముతున్నారు. ఎంవోపీ రూ.915లు, డీఏపీ రూ.1181లు, యూరియా రూ.284 నుంచి రూ.298లకు అమ్ముతున్నారు. దీంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పంటను దక్కించుకోవాలన్న ఆత్రంతో రైతులు తుని, అనకాపల్లి తదితర పట్టణాలకు వెళ్లి ఎంత ధరకైనా అన్నట్టు ఎరువులు కొనుగోలు చేసి ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో తెచ్చుకుంటున్నారు.