పెద్ద నోట్లు రద్దు అనంతరం దేశంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తి కాంత్ దాస్ సోమవారం ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించారు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర తగినంత నగదు అందుబాటులో ఉందని భరోసా ఇచ్చిన ఆయన రాబోయే రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందని హామీ ఇచ్చారు.