
సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న ఖరీదైన బైకులలో సుజుకి హయబుసా ఒకటి. దీనిని కంపెనీ OBD2B నిబంధనలకు అనుగుణంగా అప్డేట్ చేసింది. అయితే ఈ అప్డేట్ బైక్ ధరలో మాత్రమే ఎలాంటి మార్పు లేదు. అంటే ఈ కొత్త బైక్.. పాత బైక్ ధరకే అందుబాటులో ఉందన్నమాట.
2025 సుజుకి హయబుసా బైక్ ధర రూ. 16.90 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). చూడటానికి మునుపటి బైక్ మాదిరిగా అనిపించినప్పటికీ.. ఉద్గార నియమాలకు అనుగుణంగా అప్డేట్ అయింది. ఈ బైక్ అదే 1340 సీసీ ఇంజిన్ ద్వారా 190 హార్స్ పవర్, 150 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.
ఇదీ చదవండి: దేశీయ మార్కెట్లో ఆస్ట్రియన్ బ్రాండ్ బైక్ లాంచ్: రేటెంతంటే?
కొత్త హయబుసా ఇప్పుడు మెటాలిక్ మ్యాట్ స్టీల్ గ్రీన్/గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, గ్లాస్ స్పార్కిల్ బ్లాక్/మెటాలిక్ మ్యాట్ టైటానియం సిల్వర్, మెటాలిక్ మిస్టిక్ సిల్వర్/పెర్ల్ వైగర్ బ్లూ అనే కొత్త డ్యూయెల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.