సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి నేటి యువత ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే గత కొన్ని రోజులుగా ఖరీదైన బైకుల ద్వారా జొమాటో ఫుడ్ డెలివరీ చేయడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
హెచ్‌ఎస్‌బీ అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కనిపించిన వీడియోలో ఒక వ్యక్తి ఖరీదైన 'సుజుకి హయబుసా' (Suzuki Hayabusa) బైక్ రైడ్ చేస్తున్నాడు. ఇందులో రైడర్ జొమాటో డెలివరీ బాయ్ వేషధారణలో ఉండటం గమనించవచ్చు.
వీడియోలో కనిపించే ఖరీదైన సూపర్ బైక్ ధర రూ. 13 లక్షల నుంచి రూ. 17 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. బైక్ రైడర్ నిజంగా డెలివరీ బాయ్ అవునా? కాదా? అనేది తెలియదు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చాలామంది సోషల్ మీడియాలో ఫెమస్ అవ్వడానికి ఇలాంటి వీడియోలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఉద్యోగుల పనిగంటల రిపోర్ట్ - భారత్ ప్రపంచంలోనే..
ఇలాంటి వీడియోలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు, గత వారం ఇండోర్‌లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఇందులో రోడ్డుపై జొమాటో బ్రాండింగ్ టీ-షర్ట్ వేసుకున్న ఒక అమ్మాయి యమహా ఆర్15 మోటార్‌సైకిల్ రైడ్ చేసింది. ఈ వీడియో అతి తక్కువ కాలంలోనే వైరల్ అయింది. దీనిపై స్పందించిన జొమాటో సీఈవో దీపిందర్ గోయల్.. ఆ సంఘటనకు, జొమాటోకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment