Suzuki Motorcycle
-
సుజుకి హయబుసాకు రీకాల్: కారణం ఇదే..
భారతదేశంలో సుజుకి మోటార్‌సైకిల్ విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన బైక్ 'హయబుసా'కు రీకాల్ ప్రకటించింది. రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన బైకుకు కంపెనీ ఎందుకు రీకాల్ ప్రకటించింది, సమస్యను పరిష్కరించడానికి డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉందా? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.మూడవ తరం హయబుసాలలో బ్రేక్ సమస్య ఉన్నట్లు గుర్తించిన సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ స్వచ్ఛందంగానే రీకాల్ ప్రకటించింది. 2021 మార్చి - 2024 సెప్టెంబర్ మధ్య తయారైన సుమారు 1,056 బైకులలో ఈ సమస్య ఉన్నట్లు సమాచారం. ఇది బైక్ రైడర్లను ప్రమాదంలోకి నెడుతుంది.ఇప్పటి వరకు ఈ సమస్యకు సంబంధించిన పిర్యాదులు నమోదు కాలేదు. కానీ భవిష్యత్తులో ఈ సమస్య వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భావించిన కంపెనీ ముందుగానే రీకాల్ ప్రకటించింది. త్వరలోనే దీనిని పరిష్కరిస్తుందని సమాచారం. దీనికోసం కస్టమర్ల నుంచి డబ్బు వసూలు చేయదు. ఈ సర్వీస్ పూర్తిగా ఉచితం. -
వారికి ఉచితం.. వరద బాధితులకు సుజుకీ ఆఫర్
మిచాంగ్ (Michaung) తుపాన్ ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నై జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదలతో అక్కడి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఇక వర్షపు నీటితో వాహనాలన్నీ పాడైపోయాయి. ఈ క్రమంలో వీరికి అండగా జపనీస్ వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్‌కు భారతీయ అనుబంధ సంస్థ అయిన సుజుకీ మోటర్‌సైకిల్ ముందుకు వచ్చింది. చెన్నైతోపాటు పొరుగు జిల్లాల్లో వరద ప్రభావిత వినియోగదారులకు ఉచిత సర్వీస్‌ను ప్రారంభించినట్లు సుజుకీ మోటర్‌సైకిల్ సంస్థ శనివారం తెలిపింది. వరద బాధితులపై వాహన మరమ్మతుల ఆర్థిక భారాన్ని తగ్గించడం దీని లక్ష్యం. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరులో డీలర్ నెట్‌వర్క్‌లను యాక్టివేట్ చేసి వినియోగదారులకు ఉచిత సమగ్ర చెకప్‌లతో సర్వీస్ అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతోపాటు డిసెంబర్ చివరి వరకు ఇంజిన్ ఆయిల్, ఇంజన్ ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ఫ్యూయల్ ఫిల్టర్లను ఉచితంగా రీప్లేస్మెంట్ చేస్తున్నట్లు తెలిపింది. మిచాంగ్ తుఫాను పలు నగరాల్లోని ప్రజల జీవితాలు, వారి వస్తువులపై తీవ్ర ప్రభావం చూపిందని, ఈ నేపథ్యంలో వారి కోసం ప్రత్యేక సహాయ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సుజుకీ మోటర్‌సైకిల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి ఉమెడ తెలిపారు. దీని కింద వాహనాల సర్వీస్‌తో పాటు అవసరమైన విడిభాగాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చొరవ వాహన మరమ్మతుల ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా తమ కస్టమర్ల కోసం మొబిలిటీని త్వరగా పునరుద్ధరించడాన్ని వేగవంతం చేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇది కూడా చదవండి: ఏకంగా రూ.91 వేల కోట్ల ఆస్తి.. పనివాడే వారసుడు! -
రూ.16 లక్షల బైకుపై ఫుడ్ డెలివరీ - వీడియో వైరల్
సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి నేటి యువత ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే గత కొన్ని రోజులుగా ఖరీదైన బైకుల ద్వారా జొమాటో ఫుడ్ డెలివరీ చేయడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హెచ్ఎస్బీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజీలో కనిపించిన వీడియోలో ఒక వ్యక్తి ఖరీదైన 'సుజుకి హయబుసా' (Suzuki Hayabusa) బైక్ రైడ్ చేస్తున్నాడు. ఇందులో రైడర్ జొమాటో డెలివరీ బాయ్ వేషధారణలో ఉండటం గమనించవచ్చు. వీడియోలో కనిపించే ఖరీదైన సూపర్ బైక్ ధర రూ. 13 లక్షల నుంచి రూ. 17 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. బైక్ రైడర్ నిజంగా డెలివరీ బాయ్ అవునా? కాదా? అనేది తెలియదు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చాలామంది సోషల్ మీడియాలో ఫెమస్ అవ్వడానికి ఇలాంటి వీడియోలు చేస్తున్నారు. ఇదీ చదవండి: ఉద్యోగుల పనిగంటల రిపోర్ట్ - భారత్ ప్రపంచంలోనే.. ఇలాంటి వీడియోలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు, గత వారం ఇండోర్‌లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఇందులో రోడ్డుపై జొమాటో బ్రాండింగ్ టీ-షర్ట్ వేసుకున్న ఒక అమ్మాయి యమహా ఆర్15 మోటార్‌సైకిల్ రైడ్ చేసింది. ఈ వీడియో అతి తక్కువ కాలంలోనే వైరల్ అయింది. దీనిపై స్పందించిన జొమాటో సీఈవో దీపిందర్ గోయల్.. ఆ సంఘటనకు, జొమాటోకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. View this post on Instagram A post shared by HARPREET SINGH (@hsbofficial) -
సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీపై సైబర్ అటాక్ - నిలిచిపోయిన ఉత్పత్తి
Cyber Attack: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా' గత కొంత కాలంగా ఫ్యాక్టరీలలో ఉత్పత్తిని నిలిపివేసింది. సైబర్ దాడుల కారణంగానే ఉత్పత్తి నిలిచిపోయినట్లు కంపెనీ ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిలిచిపోయిన ఉత్పత్తి.. నివేదికల ప్రకారం, 2023 మే 10 నుంచి సుజుకి మోటార్‌సైకిల్ ఉత్పత్తిని నిలిపివేసింది. ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిచిపోవడంతో ఈ కాలంలో దాదాపు 20,000 వాహనాల ఉత్పత్తి నిలిచిపోయినట్లు సమాచారం. అంతే కాకుండా వచ్చే వారం జరగాల్సిన వార్షిక సరఫరాదారుల సమావేశాన్ని కూడా సంస్థ వాయిదా వేసింది. దీని గురించి సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే సంబంధిత ప్రభుత్వ విభాగానికి నివేదించామని, ప్రస్తుతం దీనిపైనా విచారణ జరుగుతోంది, భద్రతా ప్రయోజనాల దృష్ట్యా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందించలేమని అన్నారు. అయితే మళ్ళీ ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయం కూడా ప్రస్తావించలేదు. కానీ త్వరలోనే ఉత్పత్తి ప్రారంభమవుతుందని భావిస్తున్నాము. (ఇదీ చదవండి: ఉద్యోగం పోతుందని భయమా? ఈ టిప్స్ మీకోసమే..!) భారతదేశంలో అతిపెద్ద వాహన తయారీ సంస్థగా కీర్తి పొందిన సుజుకి మోటార్‌సైకిల్ ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మిలియన్ యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. అంతే కాకుండా కంపెనీకి భారత్ మాత్రమే కాకుండా జపాన్ కూడా అతిపెద్ద మార్కెట్ కావడం విశేషం. సుజుకి మోటార్ కార్పొరేషన్ గ్లోబల్ అవుట్‌పుట్‌లో భారతదేశం 50% వాటాను కలిగి ఉంది. అంతే కాకుండా గత ఆర్థిక సంవత్సరం కూడా అమ్మకాల్లో మంచి వృద్ధిని సాధించగలిగింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
భారత్‌లో 2023 హయబుసా లాంచ్: ధర వింటే దడ పుట్టాల్సిందే..
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్స్ దేశీయ మార్కెట్లో '2023 హయబుసా' లాంచ్ చేసింది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా కొంత ఎక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దా.. ధరలు & బుకింగ్స్: భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త సుజుకి హయబుసా ధర రూ. 16.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధర దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 49,000 ఎక్కువ. కంపెనీ ఈ బైక్ కోసం దేశ వ్యాప్తంగా బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. డిజైన్ & ఫీచర్స్: 2023 హయబుసాలో ఆల్‌రౌండ్ ఎల్ఇడి లైటింగ్స్ ఉన్నాయి. అయితే టర్న్-ఇండికేటర్స్ ఎయిర్ డ్యామ్ పక్కన ఉన్న ఫెయిరింగ్ పైన ఉంచారు. ఫెయిరింగ్ డిజైన్ కూడా అప్డేట్ చేయబడింది. ఇప్పుడు ఫ్రంట్ ఫెయిరింగ్ చివరిలో క్రోమ్ యాక్సెంట్స్ కూడా ఉన్నాయి. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో టిఎఫ్టి డిస్ప్లే ఉంటుంది. దీని ద్వారా యాంటీ-లిఫ్ట్ కంట్రోల్ సిస్టమ్, యాక్టివ్ స్పీడ్ లిమిటర్, కంబైన్డ్ బ్రేక్ సిస్టమ్, మోషన్ ట్రాక్ బ్రేక్ సిస్టమ్ వంటి వాటిని కంట్రోల్ చేయవచ్చు. కలర్ ఆప్షన్స్: 2023 హయబుసాలో చెప్పుకోదగ్గ అప్డేట్ కలర్ ఆప్షన్స్. ఈ బైక్ ఇప్పుడు మెటాలిక్ గ్రే, గ్రే లెటర్రింగ్ అండ్ సైడ్‌లో క్రోమ్ స్ట్రిప్‌తో ఫుల్-బ్లాక్ పెయింట్ ఆప్షన్లో లభిస్తుంది. అంతే కాకుండా దీని ఫ్రంట్, రియర్, సైడ్ ఫెయిరింగ్‌లో క్యాండీ రెడ్ హైలైట్లు ఉంటాయి. ఇంజిన్ & పర్ఫామెన్స్: లేటెస్ట్ హయబుసా ఇంజిన్ ఎటువంటి అప్డేట్స్ పొందలేదు, కావున ఇందులో అదే 1,340 సిసి లిక్విడ్-కూల్డ్ ఇన్లైన్ ఫోర్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 190 బిహెచ్పి పవర్, 142 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ స్లిప్, అసిస్ట్ క్లచ్ & ద్విబై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో పాటు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది, కావున ఉత్తమ పనితీరుని అందిస్తుంది. (ఇదీ చదవండి: మనవడితో ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్.. ఫోటోలు వైరల్) సుజుకి హయాబుసా అదే అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి భాగంలో పూర్తిగా అడ్జస్టబుల్ USD ఫోర్క్ & వెనుక భాగంలో మోనో-షాక్ యూనిట్ పొందుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో డ్యూయల్ 320 మి.మీ ఫ్లోటింగ్ డిస్క్ బ్రేక్ ద్వారా బ్రెంబో స్టైల్మా 4-పాట్ కాలిపర్, వెనుకవైపు నిస్సిన్ సింగిల్-పాట్ కాలిపర్‌తో ఒకే 260 మిమీ డిస్క్ బ్రేక్ కలిగి ఉంటుంది. -
భారత్‌లో సుజుకీ కటానా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీలో ఉన్న సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా దేశీయ మార్కెట్లో కటానా స్పోర్ట్స్ బైక్‌ను ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.13.61 లక్షలు. పూర్తిగా తయారైన బైక్‌ను భారత్‌కు దిగుమతి చేసుకుంటారు. 999సీఎం3 ఫోర్ స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్, డీవోహెచ్సీ, ఇన్లైన్–ఫోర్ ఇంజన్, ఫ్లోటింగ్ టెయిల్ సెక్షన్, మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, అత్యాధునిక ఎలక్ట్రానిక్ కంట్రోల్స్‌తో కూడిన సుజుకీ ఇంటెలిజెంట్ రైడ్ సిస్టమ్ వంటి హంగులు ఉన్నాయి. -
దేశంలో ఖరీదైన స్పోర్ట్స్ బైక్స్: ధోని ఫేవరెట్ ఏంటో తెలుసా?
యువతకు స్పోర్ట్స్ బైక్స్ అంటే యమా క్రేజ్. రోడ్లపై రయ్.. రయ్ దూసుకుపోవడం అంటే వారికి భలే సరదా. బైక్స్ కంపెనీలు కూడా కొత్త మోడల్స్‌ను మార్కెట్లో దించుతూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. భారతదేశంలో అందుబాటులో ఉన్న ఖరీదైన కొన్ని స్పోర్ట్స్ బైక్స్ వివరాలు ఇక్కడ చూద్దాం.. బ్రాండ్ ధోని మన దేశంలో స్పోర్ట్స్ బైక్స్ లవర్స్ పేర్లు చెప్పాల్సి వస్తే మొదటి గుర్తొచ్చేది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనినే. ఖాళీ సమయాల్లో రాంచీ వీధుల్లో బైక్స్పైన చక్కర్లు కొట్టడం ధోనికి ఇష్టం. ఖరీదైన కార్లకు తోడు ఖరీదైన బైక్స్ కూడా అతని గారేజీలో కొలువై ఉంటాయి. కవాసకి నింజా హెచ్2, కాన్ఫిడరేట్ ఎక్స్ 132 హెల్‌క్యాట్, హార్లీ డేవిడ్సన్ ఫ్యాట్‌బాయ్, డుకాటి 1098, సుజుకి హయబుస తదితర బైక్‌లు ధోని కలెక్షన్లో ఉన్నాయి. (చదవండి: బైక్ కొనుగోలుదారులకు హీరో మోటోకార్ప్ షాక్!) ఇక బాలీవుడ్ విషయానికి వస్తే జాన్ అబ్రహం పెద్ద బైక్ లవర్ అని చెప్పవచ్చు. అతని వద్ద ఉన్న బైక్స్ విలువ కోటిన్నర రూపాయల వరకూ ఉంటుందని చెబుతారు. కవాసకి నింజా జెడ్ఎక్స్-14 ఆర్, అప్రిల్లా ఆర్ఎస్వీ 4 తదితర బైక్‌లు అతని వద్ద ఉన్నాయి. షాహిద్ కపూర్ కూడా బైక్స్ లవరే. షూటింగ్ లేని సమయాల్లో అతను బైక్స్‌పైనే లాంగ్ డ్రైవ్స్‌కు వెళతాడు. షాహిద్ వద్ద బీఎండబ్ల్యూ 310 ఆర్, హార్లీ డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ లాంటి ఖరీదైన మోటార్‌సైకిల్స్ ఉన్నాయి. ఇక బైక్స్ లవర్స్ లిస్ట్‌లో మాధవన్, సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్, సైఫ్ అలీఖాన్ తదితరులు ఉన్నారు. కవాసకి నింజా హెచ్2ఆర్ ఇంజిన్ కెపాసిటి : 998 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 216 కిలోలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 17 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 305.75 బీహెచ్పీ, 14,000 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 79,90,000 బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్ ఇంజిన్ కెపాసిటీ : 999 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 192 కిలోలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 16.5 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 209.19 బీహెచ్పీ, 14,500 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 42,00,000 హోండా గోల్డ్‌వింగ్ ఇంజిన్ కెపాసిటి : 1,833 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 385 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 21.1 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 124.7 బీహెచ్పీ, 5,500 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 37,75,000 హార్లీడేవిడ్సన్ రోడ్ కింగ్ ఇంజిన్ కెపాసిటి : 1,746 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 375 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 22.7 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : - మన దేశంలో ధర (సుమారు) : రూ. 30,00,000 అప్రిల్లా ఆర్ఎస్వీ4 1100 ఫ్యాక్టరీ ఇంజిన్ కెపాసిటి : 1099 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 202 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 17.9 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 213.89 బీహెచ్పీ, 13,000ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 26,50,000 డుకాటీ పనిగేల్ వీ4 ఇంజిన్ కెపాసిటి : 1,103 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 198 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 16 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 211.21 బీహెచ్పీ, 13,000 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 26,27,000 బీఎండబ్ల్యూ ఆర్ 1250 అడ్వెంచర్ ఇంజిన్ కెపాసిటి : 1,254 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 268 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 30 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 134.1 బీహెచ్పీ, 7,700 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 25,00,000 ట్రయంప్ రాకెట్ 3 ఇంజిన్ కెపాసిటి : 2,458 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 304 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 18 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 165 బీహెచ్పీ మన దేశంలో ధర (సుమారు) : రూ. 22,27,000 ఇండియన్ చీఫ్ బాబెర్ డార్క్‌హార్స్ ఇంజిన్ కెపాసిటి : 1890 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 352 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 15.1 లీటర్లు మన దేశంలో ధర (సుమారు) : రూ. 21,40,000 సుజుకి హయబుస ఇంజిన్ కెపాసిటి : 1,340 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 266 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 20 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 187.3 బీహెచ్పీ మన దేశంలో ధర (సుమారు) : రూ. 18,47,000 -
సుజుకీ.. రెండు ఆఫ్‌రోడ్ బైక్‌లు
న్యూఢిల్లీ: సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా భారత మార్కెట్లో రెండు గ్లోబల్ ఫ్లాగ్షిప్ బైక్‌లను విడుదలచేసింది. ఆర్ఎం–జెడ్ 250 పేరిట విడుదలైన బైక్ ధర రూ.7.10 లక్షలు కాగా, ఆర్ఎం–జెడ్ 450 మోడల్ ధర రూ.8.31 లక్షలుగా నిర్ణయించినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సతోషి ఉచిదా మాట్లాడుతూ.. ‘గత కొంత కాలంగా భారత్‌లో ఆఫ్–రోడింగ్ విభాగానికి చెందిన బైక్‌లకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. సాహసోపేతమైన రైడింగ్ కోరుకునేవారి సంఖ్య ఊపందుకుంటోంది. ఈ కారణంగానే నేటితరం యువత అభిరుచులకు తగినట్లుగా రూపుదిద్దుకున్న ఈ బైక్‌లను విడుదలచేశాం.’ అని వ్యాఖ్యానించారు. -
సుజుకీ.. బర్గ్మాన్ స్ట్రీట్ స్కూటర్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా కొత్తగా ‘బర్గ్మాన్ స్ట్రీట్’ పేరిట స్కూటర్ ను ఆవిష్కరించింది. 125 సీసీ ఇంజిన్ సామర్థ్యం గల ఈ స్కూటర్ ధర రూ. 68,000 (ఎక్స్ షోరూం). ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయాలను 40 శాతం మేర పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ ఎండీ సతోషి ఉచిడా తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం(2017–18)లో 5 లక్షల వాహనాలు విక్రయించగా.. ఈసారి 7 లక్షల వాహనాల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. 2020 నాటికల్లా అమ్మకాలను 10 లక్షల స్థాయికి పెంచుకోనున్నట్లు సతోషి చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై మాతృసంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ)తో కలిసి పనిచేస్తున్నామని, 2020 నాటికల్లా ఎలక్ట్రిక్ స్కూటర్ తరహా వాహనం ఒకదాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని వివరించారు. -
సుజుకీ జీఎస్ఎక్స్–ఎస్750@ రూ.7.45 లక్షలు
సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా తొలి 750 సీసీ సూపర్ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చింది. జీఎస్ఎక్స్–ఎస్750 పేరుతో అందిస్తున్న ఈ బైక్ ధర రూ.7.45 లక్షలు(ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) అని కంపెనీ తెలిపింది. భారత మార్కెట్ కోసం ప్రతి ఏడాది కొత్త బైక్‌లను, ప్రీమియమ్ బైక్‌లను అందించే కట్టుబడిలో భాగంగా ఈ సూపర్ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చామని సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా ఎండీ, సతోషి యుచిడా పేర్కొన్నారు. ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో తామందిస్తున్న తొలి కొత్త బైక్ ఇదని, అంతేకాకుండా 1,000 సీసీ కంటే తక్కువగా ఉండే కేటగిరీలో కూడా ఇదే తొలి మోటార్‌సైకిల్ అని వివరించారు. ఈ బైక్‌ను 749 సీసీ ఫోర్ సిలిండర్ ఫ్యూయల్–ఇంజెక్షన్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో రూపొందించామని తెలిపారు. యాంటీ–లాక్ బ్రేక్స్‌తో కూడిన డిస్క్ బ్రేక్‌లు, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్ తదితర ఫీచర్లున్నాయని పేర్కొన్నారు. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 320 కి.మీ. కాగా, మైలేజీ లీటర్‌కు 20 కి.మీ. ఇస్తుందని అంచనా. ఈ బైక్ కవాసకి జెడ్900, ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్, అప్రిలియా షివర్ 900 తదితర సూపర్ బైక్‌లకు గట్టి పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. -
కొత్త జిక్సర్ వచ్చేసింది
ధర రూ.83,439 జూన్‌లో రెండు సూపర్ బైక్‌లు సుజుకీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ గుప్తా న్యూఢిల్లీ: సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా కంపెనీ జిక్సర్ బైక్‌లో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్, జిక్సర్ ఎస్ఎఫ్ బైక్ ధర రూ.83,439(ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ)గా నిర్ణయించామని సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ గుప్తా చెప్పారు. ఈ కొత్త వేరియంట్ కూడా యువ వినియోగదారులను ఆకట్టుకోగలదని ఆశిస్తున్నామని చెప్పారు. గత ఏడాది అక్టోబర్‌లో జిక్సర్ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చామని, నెలకు 8,000 వరకూ విక్రయిస్తున్నామని వివరించారు. జూన్‌లో సూపర్ బైక్‌లు: 150 సీసీ, అంతకు మించిన ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్‌లపై దృష్టి సారిస్తున్నామని అతుల్ గుప్తా చెప్పారు. ఈ ఏడాది జూన్‌లో 800 సీసీ బైక్‌లు ఎస్1000, ఎస్1000 ఎఫ్లను మార్కెట్లోకి తేవాలని యోచిస్తున్నామని పేర్కొన్నారు. ప్రపంచ మార్కెట్లో, ఇక్కడా వాటిని ఒకేసారి అందిస్తామని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో హయబూసా, జీఎస్ఎక్స్-ఆర్ వంటి సూపర్ బైక్‌లను 280 వరకూ విక్రయించామని, ఈ ఆర్థిక సంవత్సరంలో 400 బైక్‌లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. మాస్ సెగ్మెంట్ బైక్‌ల్లో తీవ్రమైన పోటీ ఉందని, ఈ సెగ్మెంట్ మోటార్‌సైకిల్ హయతెను కొనసాగిస్తామని వివరించారు. ఎదురు గాలిని తట్టుకునేలా.. జిక్సర్ ఎస్ఎఫ్బైక్ నడిపే వ్యక్తికి ఎదురు గాలి నుంచి సాధ్యమైనంతగా రక్షణ నిచ్చేలా ఫుల్ ఫెయిరింగ్ ఫీచర్‌తో ఈ బైక్ సిద్ధమైంది. ముందు వైపు ఫెయిరింగ్ మినహా మిగిలిన అన్ని అంశాల్లో ఈ కొత్త వేరియంట్ జిక్సర్‌ను పోలి ఉంది. ఈ బైక్‌లో ఐదు గేర్లు, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, క్లియర్లెన్స్ ఇండికేటర్లు, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనక వైపు 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ తదితర ఫీచర్లున్నాయి.. నలుపు, తెలుపు, నీలం మూడు రంగుల్లో ఈ బైక్ లభ్యమవుతుంది. దేశంలో అత్యంత చౌకగా లభించే పూర్తి ఫెయిర్డ్ మోటార్ సైకిల్ ఇదే అవుతుంది. ఫెయిరింగ్ బైక్ అంటే.. ఇంజిన్ ఉన్న ఫ్రేమ్‌ను కప్పి ఉంచేలా డిజైన్ చేసిన బైక్. గాలి ఒత్తిడిని తట్టుకోవడం దీని ఉద్దేశం. -
మూడేళ్లలో అయిదు కొత్త మోడళ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన సంస్థ సుజుకి మోటార్ సైకిల్ ఇండియా వచ్చే మూడేళ్లలో మరో ఐదు మోడళ్లను పరిచయం చేయనుంది. వీటిలో మూడు బైక్‌లు, రెండు స్కూటర్లు రానున్నాయి. 2014లో కంపెనీ నాలుగు కొత్త వాహనాలను ప్రవేశపెట్టింది. భారతీయ మార్కెట్లో వాటా పెంచుకోవాలంటే నూతన మోడళ్లు, పంపిణీపై దృష్టిపెట్టడమే మార్గమని సుజుకి మోటార్ సైకిల్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ గుప్త తెలిపారు. హైదరాబాద్ మార్కెట్లో 155 సీసీ స్ట్రీట్ స్పోర్ట్ బైక్ జిక్సర్‌ను బుధవారం ప్రవేశపెట్టిన సందర్భంగా అతుల్ గుప్త సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. భారతీయ మార్కెట్ కోసం వివిధ మోడళ్లను జపాన్‌లోని సుజుకి పరిశోధన, అభివృద్ధి(ఆర్ అండ్ డీ) కేంద్రంలో డిజైన్ చేస్తున్నారని చెప్పారు. జిక్సర్తోపాటు ఇటీవల విడుదలైన లెట్స్ స్కూటర్ జపాన్ ఆర్అండ్డీ కేంద్రంలో డిజైన్ చేసినవే. రెండేళ్లలో 10 లక్షలు: హర్యానాలోని గుర్గావ్ వద్ద ఉన్న కంపెనీ ప్లాంటు వార్షిక తయారీ సామర్థ్యం 5.4 లక్షల ద్విచక్ర వాహనాలు. ప్లాంటు విస్తీర్ణం 37 ఎక రాలు. ప్రస్తుతం 10 ఎకరాలను మాత్రమే వినియోగించారు. భవిష్యత్ విస్తరణ ఈ ప్లాంటు వద్దే ఉంటుందని, రెండేళ్లలో తయారీ సామర్థ్యాన్ని 10 లక్షలకు చేరుస్తామని అతుల్ గుప్త పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 4 లక్షల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 5 వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా చేసుకుంది. నెలకు 2 వేల యూనిట్లు ఎగుమతి చేస్తోంది. కంపెనీ అమ్మకాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాటా 10 శాతంగా ఉంది. 50,000 జిక్సర్ బైక్‌లు.. సుజుకి ఎకో పెర్ఫార్మెన్స్(ఎస్ఈపీ) సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా జిక్సర్ బైక్‌ను రూపొందిం చారు. వాహన సామర్థ్యంతో సంబంధం లేకుండా అధిక మైలేజీ ఇవ్వడం ఎస్ఈపీ టెక్నాలజీ ప్రత్యేకత. సుజుకి తొలిసారిగా ఎస్ఈపీని భారతీయ మార్కెట్ కోసం అభివృద్ధి చేసిందని కంపెనీ మార్కెటింగ్ నేషనల్ హెడ్ అను అనామిక తెలిపారు. 18-22 ఏళ్ల వయసున్న యువతను దృష్టిలో పెట్టుకుని జిక్సర్ బైక్‌కు రూపకల్పన చేశామన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 50 వేల జిక్సర్ బైక్‌లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ద్విచక్ర వాహన రంగంలో కంపెనీకి ప్రస్తుతం 3 శాతం వాటా ఉంది. 6-12 నెలల్లో ఇది 5 శాతానికి ఎగబాకుతుందని సుజుకి అంచనా వేస్తోంది.