వాహన ధరలు తగ్గించిన సుజుకీ మోటార్‌సైకిల్‌ | Suzuki Motorcycle India Cuts Prices by Up to ₹18,024 After GST Revision | Sakshi
Sakshi News home page

వాహన ధరలు తగ్గించిన సుజుకీ మోటార్‌సైకిల్‌

Sep 20 2025 8:54 AM | Updated on Sep 20 2025 11:32 AM

Suzuki Motorcycle announced price cuts across its two wheeler gst cut

ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా’ తన వాహన ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కస్టమర్లు ఎంపిక చేసుకున్న మోడల్‌ను బట్టి రూ.18,024 వరకు తగ్గింపు ఉంటుందని తెలిపింది. కొత్త ధరలు సెప్టెంబర్‌ 22 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.

ఆటోమొబైల్స్‌పై జీఎస్టీ తగ్గించిన నేపథ్యంలో ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వివరించింది. ‘జీఎస్‌టీ 2.0 సంస్కరణలను స్వాగతిస్తున్నాము. పండుగ సీజన్‌లో టూవీలర్స్‌కు డిమాండ్‌ మరింత ఊపందుకోవచ్చు’’ అని కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ దీపక్‌ ముత్రేజా అన్నారు.

ఇదీ చదవండి: మారుతీ కార్ల ధరలు తగ్గాయ్‌!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement