ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్స్ దేశీయ మార్కెట్లో '2023 హయబుసా' లాంచ్ చేసింది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా కొంత ఎక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దా..
ధరలు & బుకింగ్స్:
భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త సుజుకి హయబుసా ధర రూ. 16.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధర దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 49,000 ఎక్కువ. కంపెనీ ఈ బైక్ కోసం దేశ వ్యాప్తంగా బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.
డిజైన్ & ఫీచర్స్:
2023 హయబుసాలో ఆల్‌రౌండ్ ఎల్‌ఇడి లైటింగ్స్ ఉన్నాయి. అయితే టర్న్-ఇండికేటర్స్ ఎయిర్ డ్యామ్ పక్కన ఉన్న ఫెయిరింగ్ పైన ఉంచారు. ఫెయిరింగ్ డిజైన్ కూడా అప్డేట్ చేయబడింది. ఇప్పుడు ఫ్రంట్ ఫెయిరింగ్ చివరిలో క్రోమ్ యాక్సెంట్స్ కూడా ఉన్నాయి. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో టిఎఫ్‌టి డిస్ప్లే ఉంటుంది. దీని ద్వారా యాంటీ-లిఫ్ట్ కంట్రోల్ సిస్టమ్, యాక్టివ్ స్పీడ్ లిమిటర్, కంబైన్డ్ బ్రేక్ సిస్టమ్, మోషన్ ట్రాక్ బ్రేక్ సిస్టమ్ వంటి వాటిని కంట్రోల్ చేయవచ్చు.
కలర్ ఆప్షన్స్:
2023 హయబుసాలో చెప్పుకోదగ్గ అప్డేట్ కలర్ ఆప్షన్స్. ఈ బైక్ ఇప్పుడు మెటాలిక్ గ్రే, గ్రే లెటర్రింగ్ అండ్ సైడ్‌లో క్రోమ్ స్ట్రిప్‌తో ఫుల్-బ్లాక్ పెయింట్ ఆప్షన్‌లో లభిస్తుంది. అంతే కాకుండా దీని ఫ్రంట్, రియర్, సైడ్ ఫెయిరింగ్‌లో క్యాండీ రెడ్ హైలైట్‌లు ఉంటాయి.
ఇంజిన్ & పర్ఫామెన్స్:
లేటెస్ట్ హయబుసా ఇంజిన్ ఎటువంటి అప్డేట్స్ పొందలేదు, కావున ఇందులో అదే 1,340 సిసి లిక్విడ్-కూల్డ్ ఇన్లైన్ ఫోర్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 190 బిహెచ్‌పి పవర్, 142 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ స్లిప్, అసిస్ట్ క్లచ్ & ద్విబై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో పాటు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది, కావున ఉత్తమ పనితీరుని అందిస్తుంది.
(ఇదీ చదవండి: మనవడితో ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్.. ఫోటోలు వైరల్)
సుజుకి హయాబుసా అదే అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి భాగంలో పూర్తిగా అడ్జస్టబుల్ USD ఫోర్క్ & వెనుక భాగంలో మోనో-షాక్ యూనిట్ పొందుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో డ్యూయల్ 320 మి.మీ ఫ్లోటింగ్ డిస్క్ బ్రేక్ ద్వారా బ్రెంబో స్టైల్మా 4-పాట్ కాలిపర్, వెనుకవైపు నిస్సిన్ సింగిల్-పాట్ కాలిపర్‌తో ఒకే 260 మిమీ డిస్క్ బ్రేక్ కలిగి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment