హీరోమోటోకార్ప్ కంపెనీ దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు సరికొత్త స్ప్లెండర్ ప్లస్ XTEC 2.0 లాంచ్ చేసింది. కంపెనీ ఎవర్‌గ్రీన్ కమ్యూటర్ యొక్క 30వ వార్షికోత్సవాన్ని జరుపుకునే సందర్భంగా ఈ బైకును రూ. 82911 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది.
కొత్త హీరో స్ప్లెండర్ ప్లస్ 97.2 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8000 rpm వద్ద 8.02 hp పవర్, 6000 rpm వద్ద 8.05 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది ఒక లీటరుకు ఏకంగా 73 కిమీ మైలేజ్ అందిస్తుంది.
డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్ పొందిన ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా అద్భుతమైన డిజైన్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో డిజిటల్ డిస్‌ప్లే.. బ్లూటూత్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఇందులో USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది.
డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉన్న ఈ బైక్ దాని స్టాండర్డ్ XTEC మోడల్ కంటే కూడా రూ. 3000 ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఇది దేశీయ మార్కెట్లో ఉఇప్పటికే అమ్మకానికి ఉన్న హోండా షైన్ 100, బజాజ్ ప్లాటినా 100 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment