భారతీయ విఫణిలో బీఎండబ్ల్యూ మోటోరాడ్ తన 'ఆర్ 1300 జీఎస్' బైకును లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధర రూ. 20.95 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ కంటే రూ. 40000 ఎక్కువ.
కొత్త బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ 1300 సీసీ లిక్విడ్ కూల్డ్ బాక్సర్ ట్విన్ ఇంజన్ పొందుతుంది. ఇది 7750 rpm వద్ద 143.5 Bhp పవర్, 6500 rpm వద్ద 149 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. పవర్, టార్క్ అనేవి దాని మునుపటి మోడల్ కంటే ఎక్కువ.
బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ చూడటానికి దాని ఆర్ 1300 జీఎస్ మాదిరిగానే ఉంటుంది. కానీ కొన్ని అప్డేటెడ్ మార్పులను చూడవచ్చు. ఇందులో రీడిజైన్ ఫ్రంట్, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, స్టీల్ షీట్-మెటల్ ఫ్రేమ్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు ఈ బైకులో 6.5 ఇంచెస్ ఫుల్ కలర్ TFT స్క్రీన్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ పొందుతుంది.
సుమారు 237 కేజీల బరువున్న ఈ ఆర్ 1300 జీఎస్.. తక్కువ హైట్ ఉన్న సీటును పొందుతుంది. పొట్టిగా ఉన్న రైడర్లకు కూడా ఇది ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇది ట్రయంఫ్ టైగర్ 1200 జిటి ప్రో, హార్లీ-డేవిడ్‌సన్ పాన్ అమెరికా 1250 వంటి బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
Let's set the pace together. The all-new BMW R 1300 GS starts at an introductory price of INR 20.95 Lakhs*.
Have you booked yours? ⬇️https://t.co/NIhvPAPFXK#r1300gs #1300gs #bmw1300gs #pricelaunch #adventurebike #kingofadventure #bmwmotorradlndia #makelifearide pic.twitter.com/Pl9KOODGs0— BMWMotorrad_IN (@BMWMotorrad_IN) June 13, 2024
Comments
Please login to add a commentAdd a comment