గత కొన్ని రోజులుగా కొత్త వాహనాలు దేశీయ మార్కెట్లో లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో బైకులు, కార్లు ఉన్నాయి. ఈ కథనంలో ఈ మధ్య కాలంలో భారతీయ విఫణిలో లాంచ్ అయిన బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
కవాసకి జెడ్650ఆర్ఎస్
జపాన్ బైక్ తయారీ సంస్థ కవాసకి దేశీయ మార్కెట్లో జెడ్650ఆర్ఎస్ బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 6.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీని ధర మునుపటి మోడల్ కంటే కూడా రూ. 7000 ఎక్కువ కావడం గమనార్హం. ఇది 649 సీసీ ఇంజిన్ కలిగి, 68 హార్స్ పవర్, 64 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
హీరో మావ్రిక్ 440
హీరో మోటోకార్ప్ కూడా ఇటీవల మార్కెట్లో మావ్రిక్ 440 అనే కొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర 1.99 లక్షల నుంచి రూ. 2.24 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది. ఈ బైక్ 440 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 27 హార్స్ పవర్, 36 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ను పొందుతుంది.
కవాసకి జెడ్900
కవాసకి లాంచ్ చేసిన మరో బైక్ జెడ్900. దీని ధర రూ. 9.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ధర మాత్రం దాని కంటే రూ. 9000 ఎక్కువ. ఈ బైక్ 948 సీసీ ఇంజిన్ కలిగి, 125 హార్స్ పవర్, 98.6 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.
కవాసకి నింజా 500
మార్కెట్లో లాంచ్ అయిన మరో బైక్ కవాసకి నింజా 500. దీని ధర రూ. 5.24 లక్షలు (ఎక్స్ షోరూమ్). 451 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 45 హార్స్ పవర్, 42.6 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది భారతదేశానికి కంప్లైట్ బిల్డ్ (CBU) ద్వారా దిగుమతి అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment