Kawasaki
-
ఈ బైక్స్ కొనుగోలుపై గొప్ప బెనిఫీట్స్
కవాసకి తన నింజా లైనప్‌లోని మూడు మోడళ్లపై గొప్ప డిస్కౌంట్స్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్స్ ఆన్-రోడ్ ధరకు వర్తించే వోచర్ల రూపంలో లేదా డీలర్‌షిప్‌ల వద్ద యాక్ససరీస్, సర్వీస్ ప్యాకేజీలను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు.నింజా 300, నింజా 500 కొనుగోలుపైన వినియోగదారుడు రూ. 10000 వోచర్ పొందవచ్చు. అయితే నింజా 650 కొనుగోలుపైన రూ. 25000 వోచర్ పొందవచ్చు. కవాసకి తన బైకులపై డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ అందించడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో కూడా ఇలాబీటి ఆఫర్స్ ప్రకటించింది.కవాసకి నింజా 650 బైక్ ధర రూ.7.16 లక్షలు. నింజా 300, నింజా 500 ధరలు వరుసగా రూ.3.43 లక్షలు, రూ.5.24 లక్షలు. ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఈ బైక్స్.. అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతాయి. పర్ఫామెన్స్ పరంగా కూడా ఇవి చాలా ఉత్తమంగా ఉంటాయని తెలుస్తోంది. కవాసకి అందిస్తున్న ఈ ఆఫర్స్ సెప్టెంబర్ 1 నుండి 30 వరకు మాత్రమే చెల్లుతాయి. -
భారత్‌లో లాంచ్ అయిన కొత్త బైకులు ఇవే..
గత కొన్ని రోజులుగా కొత్త వాహనాలు దేశీయ మార్కెట్లో లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో బైకులు, కార్లు ఉన్నాయి. ఈ కథనంలో ఈ మధ్య కాలంలో భారతీయ విఫణిలో లాంచ్ అయిన బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.కవాసకి జెడ్650ఆర్ఎస్జపాన్ బైక్ తయారీ సంస్థ కవాసకి దేశీయ మార్కెట్లో జెడ్650ఆర్ఎస్ బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 6.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీని ధర మునుపటి మోడల్ కంటే కూడా రూ. 7000 ఎక్కువ కావడం గమనార్హం. ఇది 649 సీసీ ఇంజిన్ కలిగి, 68 హార్స్ పవర్, 64 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.హీరో మావ్రిక్ 440హీరో మోటోకార్ప్ కూడా ఇటీవల మార్కెట్లో మావ్రిక్ 440 అనే కొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర 1.99 లక్షల నుంచి రూ. 2.24 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది. ఈ బైక్ 440 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 27 హార్స్ పవర్, 36 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ను పొందుతుంది.కవాసకి జెడ్900కవాసకి లాంచ్ చేసిన మరో బైక్ జెడ్900. దీని ధర రూ. 9.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ధర మాత్రం దాని కంటే రూ. 9000 ఎక్కువ. ఈ బైక్ 948 సీసీ ఇంజిన్ కలిగి, 125 హార్స్ పవర్, 98.6 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.కవాసకి నింజా 500మార్కెట్లో లాంచ్ అయిన మరో బైక్ కవాసకి నింజా 500. దీని ధర రూ. 5.24 లక్షలు (ఎక్స్ షోరూమ్). 451 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 45 హార్స్ పవర్, 42.6 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది భారతదేశానికి కంప్లైట్ బిల్డ్ (CBU) ద్వారా దిగుమతి అవుతుంది. -
మార్కెట్లో రూ.9.29 లక్షల బైక్ లాంచ్ - వివరాలు
కవాసకి కంపెనీ ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో జెడ్900 బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ.9.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 9000 ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంది. కవాసకి జెడ్900 బైక్ 948 సీసీ ఇంజిన్ కలిగి 125 హార్స్ పవర్, 98.6 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. డిజైన్ పరంగా చూడటానికి 2023 మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. ఈ బైకులో USD ఫోర్క్, మోనోషాక్ వంటివి ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ముందు భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్స్, వెనుకవైపు 250 మిమీ డిస్క్ ఉంటుంది. జెడ్900 బైక్ రెండు పవర్ మోడ్లు, మూడు రైడింగ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటి వాటితో పాటు నాన్ స్విచ్బుల్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఉంటుంది. ఇది దేశీయ మార్కెట్లో ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైకుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
రూ.1.32 లక్షల కవాసకి బైక్ - వివరాలు
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జపనీస్ బైక్ తయారీ సంస్థ కవాసకి.. ఎట్టకేలకు దేశీయ విఫణిలో ఓ సరికొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే తక్కువ ధర వద్ద అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త కవాసకి బైక్ పేరు 'డబ్ల్యూ175 స్టీట్'. దీని ధర రూ. 1.35 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 12000 తక్కువ ధరకే లభిస్తుంది. బుకింగ్స్, డెలివరీలకు సంబంధించిన వివరాలు కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. సింపుల్ డిజైన్ కలిగిన ఈ బైక్ బ్లాక్-అవుట్ ఫినిషింగ్‌లతో చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో 177 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 13 హార్స్ పవర్, 13.2 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పనితీరు పరంగా అద్భుతంగా ఉండవచ్చని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఈ బైక్ కొనుగోలుపై రూ.60,000 డిస్కౌంట్.. కవాసకి డబ్ల్యూ175 స్టీట్ బైక్ హాలోజన్ హెడ్‌లైట్, అనలాగ్ ఇన్స్ట్రుమెంటేషన్ వంటివి పొందుతుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ బైక్ తక్కువ ధర వద్ద విడులవడంతో మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నారు. -
ఈ బైక్ కొనుగోలుపై రూ.60,000 డిస్కౌంట్..
జపనీస్ బైక్ తయారీ సంస్థ కవాసకి భారతీయ మార్కెట్లో అమ్మకాలను పెంచుకోవడానికి, కొత్త కస్టమర్లను ఆకర్శించడానికి ఇయర్ ఎండ్ ఆఫర్స్ ప్రకటించింది. ఎంపిక చేసిన కొన్ని బైక్స్ మీద కంపెనీ రూ. 20,000 నుంచి రూ. 60,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 👉 కవాసకి వెర్సిస్ 650 అడ్వెంచర్ టూరర్ కొనుగోలుపై సంస్థ రూ. 20,000 తగ్గింపుని అందిస్తోంది. రూ. 7.77 లక్షల ధర వద్ద లభించే ఈ బైక్ డిస్కౌంట్ తరవాత రూ. 7.57 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. 👉 నింజా 650 స్పోర్ట్‌బైక్ కొనుగోలుపైన కవాసకి రూ. 35,000 తగ్గింపుని అందిస్తోంది. దీంతో రూ. 7.16 లక్షల ధర వద్ద ఉన్న ఈ బైకుని రూ. 6.81 లక్షలకు సొంతం చేసుకోవచ్చు. 👉 కంపెనీ అందించే గరిష్ట మొత్తం రూ. 60,000. ఈ డిస్కౌంట్ కేవలం వల్కన్ S క్రూయిజర్‌పై మాత్రమే లభిస్తుంది. రూ. 7.10 లక్షల ఖరీదైన ఈ బైకుని డిస్కౌంట్ తరువాత రూ. 6.50 లక్షలకు కొనుగోలు చేసుకోవచ్చు. 👉 కంపెనీ ప్రస్తుతం ట్విన్ సిలిండర్ మోడళ్లపై మాత్రమే డిస్కౌంట్లను అందిస్తోంది. రానున్న రోజుల్లో సింగిల్ సిలిండర్ మోడల్స్ మీద కూడా మంచి తగ్గింపులను అందించే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
మార్కెట్లో విడుదలైన కొత్త బైకులు ఇవే!
భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. ఈ తరుణంలో చాలామంది కొత్త వాహనాలను కొనుగోలు చేయాలని చాలా ఆసక్తి కనపరుస్తారు. అలాంటి వారికోసం ఈ కథనంలో ఈ వారంలో మార్కెట్లో అడుగుపెట్టిన బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హోండా సీబీ300ఎఫ్ (Honda CB300F) హోండా మోటార్‌సైకిల్ ఇండియా పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని అప్డేటెడ్ 'సీబీ300ఎఫ్' బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 1.70 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ దేశవ్యాప్తంగా ఉన్న బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటాయి. ఈ బైక్ 293 సీసీ ఆయిల్-కూల్డ్ SOHC ఇంజన్ కలిగి 24 హార్స్ పవర్ అండ్ 25.6 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ సీక్వెన్షియల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. 14.1 లీటర్ల ఫ్యూయెల్ కెపాసిటీ కలిగిన ఈ బైక్ లాంగ్ రైడ్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది కేవలం 7.94 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. కవాసకి నింజా జెడ్ఎక్స్-4ఆర్ (Kawasaki Ninja ZX-4R) ఇప్పటికే మార్కెట్లో మంచి ప్రజాదరణతో ముందుకు సాగుతున్న కవాసకి ఇప్పుడు ఎట్టకేలకు 'నింజా జెడ్ఎక్స్-4ఆర్' లాంచ్ చేసింది. దీని ధర రూ. 8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ధర ఎక్కువైనా అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. కవాసకి నింజా జెడ్ఎక్స్-4ఆర్ 399 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇన్లైన్-ఫోర్ ఇంజిన్ కలిగి సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్లిప్పర్ క్లచ్‌తో లభిస్తుంది. ఈ ఇంజిన్ 14,500 ఆర్పీఎమ్ వద్ద 76 బీహెచ్పీ పవర్ & 13,000 ఆర్పీఎమ్ వద్ద 39 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇదీ చదవండి: మహిళలకు శుభవార్త! గ్యాస్ స్టవ్‌తో పాటు ఫ్రీ సిలిండర్ పొందండిలా.. న్యూ కేటిఎమ్ 390 డ్యూక్ (New KTM 390 Duke) యువ రైడర్లకు ఎంతగానో ఇష్టమైన కేటిఎమ్ ఇప్పుడు మరో కొత్త బైక్ రూపంలో (న్యూ కేటిఎమ్ 390 డ్యూక్) దేశీయ మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ బైక్ ధర రూ. 3,10,520 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా పెద్ద ఇంజిన్ పొందుతుంది. కావున ఇందులో 399 సీసీ ఉంటుంది. ఇది 45 హార్స్ పవర్, 39 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కంపెనీ ఈ బైక్ కోసం ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం మొదలుపెట్టింది. డెలివరీలు ఈ నెల చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
కవాసాకి కొత్త బైక్ వచ్చేసింది: ధర వింటే షాకవుతారు!
2024 Kawasaki Z900RS: కవాసాకి ఇండియా Z900RS 2024 బైక్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధరను రూ. 16.80 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. జెడ్ 900ఆర్ఎస్ 2024 మోడల్ మెటాలిక్ డయాబ్లో బ్లాక్ పెయింట్ థీమ్‌లో లభిస్తుంది. 2024 మోడల్ బైక్లోదాదాపు పాత ఫీచర్లనే అందించింది.ముందు భాగంలో రౌండ్ హెడ్‌లైట్, ట్విన్-పాడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టియర్-డ్రాప్-ఆకారపు ఇంధన ట్యాంక్, సింగిల్-పీస్ సాడిల్, సైడ్-స్లంగ్ ఎగ్జాస్ట్,, రెండు చివర్లలో స్పోక్-స్టైల్ కాస్ట్ వీల్స్. 2024 మోడల్బైక్లో ఫుల్-LED లైటింగ్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్-ఛానల్ ABS, కవాసకి ట్రాక్షన్ కంట్రోల్ , అసిస్ట్ , స్లిప్పర్ క్లచ్ మెకానిజంతో తీసుకొచ్చింది. హార్డ్‌వేర్‌లో ట్విన్ 300mm ఫ్రంట్ డిస్క్‌లు, సింగిల్ 250mm రియర్ రోటర్, అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ ,రియర్ మోనోషాక్ ఉన్నాయి. ఇంజీన్ 948cc, ఇన్లైన్ ఫోర్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటి. సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించబడిన ఈ మోటార్ గరిష్టంగా 8,500rpm వద్ద 107bhp , 6,500rpm వద్ద 95Nm గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ముఖ్యంగా, ఈ ఇంజన్ సరికొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.భారత మార్కెట్లో ట్రయంఫ్ బోన్నెవిల్లే T100 ,స్పీడ్ ట్విన్ వంటి వాటికి గట్టిపోటి ఇవ్వనుందని మార్కెట్ అంచనాలు. -
AP: కవాసకీ వ్యాధి బాధితుడికి రూ.లక్ష ఆర్థిక సాయం
ఒంగోలు అర్బన్: అరుదైన మల్టీసిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్(కవాసకీ వ్యాధి)తో బాధపడుతున్న బాలుడి తల్లిదండ్రులకు సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్ గురువారం రూ.లక్ష చెక్కు అందజేశారు. ఐదో విడత వైఎస్సార్ మత్స్యకార భరోసా నగదు జమ కార్యక్రమానికి సీఎం జగన్ ఈనెల 16న బాపట్ల జిల్లా నిజాంపట్నానికి వచ్చారు. ఆ సమయంలో ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన హృదయరంజన్, ఉషారాణి దంపతులు సీఎంను కలిసి తమ కుమారుడి అనారోగ్య పరిస్థితిని వివరించారు. సీఎం జగన్ స్పందిస్తూ.. ప్రభుత్వం తరఫున తగిన వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. తక్షణ ఆర్థిక సాయంగా రూ.లక్ష అందించాలని అధికారులను ఆదేశించారు. చదవండి: ప్రతిభ చూపిన విద్యార్థులు.. ‘జగనన్న ఆణిముత్యాలు’ -
2023 కవాసకి వల్కాన్-ఎస్ లాంచ్, ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే
సాక్షి, ముంబై: కవాసకి ఇండియా భారత మార్కెట్లో వినియోగదారుల కోసం 2023 వల్కన్ ఎస్ బైక్‌ను లాంచ్ చేసింది. మిడిల్‌వెయిట్ క్రూజర్ బైక్ వల్కన్ ఎస్ మోడల్‌తో పోలిస్తే 2023 వెర్షన్ బైక్‌ను కొన్ని అప్గ్రేడ్లతో విడుదల చేసింది. (2023 ఈవీ 6: కియా కస్టమర్లకు గుడ్ న్యూస్!) 2023 కవాసకి వల్కాన్ ఎస్ ఇంజీన్ 659 సీసీ ప్యార్లల్ ట్విన్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను అందించింది. ఇది 7500rpm వద్ద 59.9bhp శక్తిని , 6600rpm వద్ద 62.4Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను కూడా జతచేసింది. 14 లీటర్ ఇంధన ట్యాంక్, 705 మిమీ సీట్ ఎత్తు, 18 అంగుళాల ఫ్రంట్వీల్స్, 17 అంగుళాల రియర్వీల్స్, 130 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, డ్యూయల్ ఛానల్ ABS (ప్రామాణికం)తో ఈ బైక్‌ను అందిస్తోంది. అయితే బైక్ డిజైన్‌లో పెద్దగా మార్పులేవీలేవు. ఈ క్రూయిజర్ బైక్‌లో సింగిల్ పాడ్ హెడ్ ల్యాంప్, టియర్ డ్రాప్ షేప్ ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నాయి. 2023 కవాసకి వల్కాన్ ఎస్ ధర ఇండియాలో దీని రూ.7.10లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. మెటాలిక్ మ్యాక్ కార్బన్ గ్రే కలర్ స్కీమ్‌లో మాత్రమే ఈ 2023 వెర్షన్ బైక్ అందుబాటులోకి వచ్చింది. రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 , బెనెల్లీ 502C ఈ సరికొత్త బైక్‌కి గట్టి పోటీ అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. (ఇదీ కూడా చదవండి: వామ్మో..పసిడి పరుగు, వెండి హై జంప్!) -
రూ. 16.47 లక్షల కొత్త కవాసకి బైక్
భారతీయ మార్కెట్లో కవాసకి ఇండియా కొత్త జెడ్900ఆర్ఎస్ (Z900RS) బైక్ విడుదల చేసింది. ఈ లేటెస్ట్ బైక్ ధర రూ. 16.47 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది మన దేశానికీ కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) రూపంలో వస్తుంది. కావున ధర దాని మునుపటి మోడల్ ఏజ్ఎక్స్-ఆర్ కంటే ఎక్కువగా ఉంటుంది. 2023 కవాసకి జెడ్900ఆర్ఎస్ బైక్ 948 సీసీ ఇన్లైన్ ఫోర్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ పొందుతుంది. ఇది 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 107 బీహెచ్పీ పవర్ 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 95 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కొత్త జెడ్900ఆర్ఎస్ మంచి డిజైన్ కలిగి చూడగానే ఆకర్షించేవిధంగా ఉంటుంది. ఇందులో రౌండ్ హెడ్‌ల్యాంప్, టియర్‌డ్రాప్ ఆకారపు ఫ్యూయెల్ ట్యాంక్, క్రోమ్ ఫినిష్డ్ వీల్ రిమ్స్, క్రోమ్ ఎగ్జాస్ట్‌తో కూడిన మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఈ బైక్ మెటాలిక్ డయాబ్లో బ్లాక్/మెటాలిక్ ఇంపీరియల్ రెడ్ & క్యాండీ టోన్ బ్లూ అనే రెండు కలర్స్‌లో లభిస్తుంది. (ఇదీ చదవండి: Oscar Natu Natu-Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ అక్షరాలా..!) ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఫుల్ కలర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంటుంది. స్లిప్పర్ క్లచ్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి వాటితో సింగిల్ పీస్ సీటు పొందుతుంది. ఈ బైకులో ట్విన్ 300 మిమీ ఫ్రంట్ డిస్క్‌లు 250 మిమీ సింగిల్ రియర్ డిస్క్‌లు అమర్చబడి ఉంటాయి. డ్యూయల్-ఛానల్ ABS స్టాండర్డ్‌గా లభిస్తుంది. (ఇదీ చదవండి: ఆర్ఆర్ఆర్ స్టార్ 'రామ్ చరణ్' ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?) -
భారత్‌లో రూ. 27.22 లక్షల కవాసకి బైక్ విడుదల: పూర్తి వివరాలు
జపనీస్ బైక్ తయారీ సంస్థ కవాసకి భారత మార్కెట్లో రెండు కొత్త బైకులను విడుదల చేసింది. ఇందులో ఒకటి ZH2 కాగా, మరొకటి ZH2 SE. వీటి ధరలు వరుసగా రూ. 23 లక్షలు, రూ. 27.22 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధరలు వాటి మునుపటి మోడల్స్ కంటే రూ. 30,000 ఎక్కువ. బుకింగ్‌లు డీలర్‌షిప్‌లో లేదా ఆన్లైన్లో చేయవచ్చు. కవాసకి ఈ రెండు కొత్త బైకులను ఒకే మెటాలిక్ మ్యాట్ గ్రాఫేన్ స్టీల్ గ్రే కలర్ ఆప్షన్లో అందిస్తుంది. ఇంజిన్ విషయానికి వస్తే.. జెడ్హెచ్2, జెడ్హెచ్2 ఎస్ రెండూ కూడా 998 సీసీ ఇన్లైన్, ఫోర్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ సూపర్ చార్జ్డ్ ఇంజిన్ కలిగి 197 బీహెచ్‌పి పవర్, 137 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. (ఇదీ చదవండి: రూ. 1,299కే కొత్త ఇయర్‌ఫోన్స్.. ఒక్క ఛార్జ్‌తో 40 గంటలు) కవాసకి లేటెస్ట్ బైక్స్ ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్, డిజిటల్ TFT కలర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఇంటిగ్రేటెడ్ రైడింగ్ మోడ్లు, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్స్ పొందుతాయి. అంతే కాకుండా స్కైహుక్ టెక్నాలజీతో కవాసకి క్విక్ షిఫ్టర్ (KQS), కవాసకి ఎలక్ట్రానిక్ కంట్రోల్ సస్పెన్షన్ (KECS), కవాసాకి ఎలక్ట్రానిక్ కంట్రోల్ సస్పెన్షన్ (KECS) వంటివి కూడా ఇందులో ఉన్నాయి. -
కవాసాకి రోబో మేక.. బరువులు ఎత్తడంలో, ఎత్తులను ఎక్కడంలోనూ దిట్ట!
ఈ చిత్రం చూశారా? చిన్న పిల్లలు ఎక్కి ఆడుకునే కొయ్యగుర్రంలా కనిపిస్తోంది కదూ..! కానీ ఇదో రోబో మేక. జపనీస్ టెక్ దిగ్గజం కవాసాకి తయారు చేసిన ఈ మేక మీద మీరూ ప్రయాణించొచ్చు. దాని విశేషాలేంటో తెలుసుకుందామా! కృత్రిమ మేథ నానాటికీ పురోగతి చెందుతోంది. మొదట మానవ రూపంలో రోబోలు, యంత్రాలను తయారు చేశారు. ఆ తరువాత జంతువులను పోలిన రోబోలు కూడా వచ్చాయి. ఇటీవల టోక్యోలో జరిగిన అంతర్జాతీయ రోబో ఎగ్జిబిషన్లో అద్భుతమైన ఆవిష్కరణలున్నాయి. కానీ అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం ఈ రోబోమేక బెక్స్. దీని తయారీ కోసం కవాసాకి. యూరప్, ఆసియా, అఫ్రికా ప్రాంతాల్లోని అడవిమేక ఐబెక్స్‌ను స్ఫూర్తిగా తీసుకున్నది. పర్వత ప్రాంతాల్లో సులభంగా తిరిగే ఈ మేక బరువులనూ సునాయాసంగా మోయగలదు. ఎత్తులను ఎక్కడంలో, వాలు ప్రాంతాలను చాకచక్యంగా దిగడంలో దిట్ట. ఐబెక్స్ మేకకున్న అన్ని విశేషాలను ఈ రోబోమేకకు యాడ్ చేశారు తయారీ దారులు. ఐబెక్స్ అతి చురుకైనది. మన బెక్స్ మాత్రం అంత చురుకుగా కదలలేదు. కానీ సాధారణ మేక కంటే బలమైనది. మైదాన ప్రాంతంలో మోకాళ్లపై వేగంగా వెళ్లగలుగుతుంది. మోకాళ్లలో ఏర్పాటు చేసిన చక్రాలు అందుకు ఉపయోగపడతాయి. ఎత్తుపల్లాల్లో తన పొడవైన కాళ్లతో ఈజీగా ఎక్కగలుగుతుంది. ఇది కదులుతున్నప్పుడు పొడవైన మెడ, కొమ్ములు వెలుగుతూ ఉంటాయి. బెక్స్ 100 కిలోల బరువును మోయగలదు. మనుషులతోపాటు వివిధ రకాల వస్తువులను రవాణా చేయగలదు. ఈ రోబోలో ఇంకా ఎన్నో సాంకేతిక మార్పులు చేయాల్సి ఉందని కవాసాకి చెబుతోంది. ఏదేమైనా బెక్స్.. మొట్టమొదటి రోబో మేకగా అందరి ప్రశంసలు అందుకుంటోంది. -
స్పోర్ట్స్ బైక్ లవర్స్‌కి షాక్ ! భారీగా బైకుల ధరలు పెంచిన ప్రముఖ కంపెనీ
ఆటోమొబైల్ సెక్టార్లో చిన్నా పెద్దా, దేశీ, విదేశీ తేడా లేకుండా వరుసగా ఒక్కో కంపెనీ తమ ఉత్పత్తుల ధర పెంచుతూ పోతున్నాయి. తాజాగా ఈ జాబితాలో జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం కవాసాకి చేరింది. స్పోర్ట్స్‌లో స్పెషల్ ఒకప్పుడు బజాజ్‌తో జత కట్టి ఇండియాలో బైకుల మార్కెట్లో అడుగు పెట్టింది కవాసాకి. ఆ తర్వాత ఇండియన్ మార్కెట్ ఇక్కడి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సింగిల్‌గా స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్లోకి అడుగు పెట్టింది. ముఖ్యంగా కవాసాకిలో నింజా సిరీస్ బైకులు చాలా పాపులర్. స్టైలింగ్ లుక్, పవర్ఫుల్ ఇంజన్‌తో ఇండియాలో మార్కెట్లో తనదైన ముద్ర వేసింది కవాసాకి. పాపులర్ మోడళ్లపై స్పోర్ట్స్ బైక్ లవర్స్‌కి చక్కని ప్రత్యామ్నాయంగా మారిన కవాసాకి తాజాగా తన ప్రొఫైల్‌లో ఉన్న పాపులర్ మోడల్ బైకుల ధరలను పెంచాలని నిర్ణయించింది. 2022 జనవరి 1 నుంచి తమ కంపెనీ నుంచి మార్కెట్లో ఉన్న అన్ని రకాల బైకుల ధరలను పెంచుతున్నట్టు కవాసాకి ప్రకటించింది. రూ.23,000 పెంపు కవాసాకిలో తక్కువ ధర బైకుగా నింజా 300 మోడల్ ఉంది. ఈ బైకు ధర ప్రస్తుతం రూ.3,24,00 (ఎక్స్‌షోరూం)గా ఉంది. ఈ మోడల్‌పై కనిష్టంగా రూ.6000 వంతున ధర పెరిగింది. ఇక హైఎండ్ మోడల్ నింజా జెడ్ఎక్స్ -10ఆర్ ధర రూ. 15,37,000లు ఉండగా ఈ మోడల్‌పై రూ.23,000 వంతున ధర పెరిగింది. ఇక లేటెస్ట్ మోడల్ జెడ్ 650 ఆర్ఎక్స్ ధర రూ.13,000 పెరిగి జనవరి 1 నుంచి రూ.6,72,000లు కానుంది. ముందుగా బుక్ చేసుకుంటే డిసెంబరు 31లోపు బైకులను కొనుగోలు చేసిన వారికి పాత ధరలే వర్తిస్తాయని, అయితే బుక్ చేసిన తర్వాత 45 రోజుల్లోగా డెలివరీ ఇస్తామని కవాసాకి అంటోంది. ఇక ధరల పెంపు నుంచి వెర్సేస్ 650, జెడ్ 650, జెడ్ హెచ్2, జెడ్ హెచ్2 ఎస్ఈ మోడళ్లకు ధరల పెంపు నుంచి మినహాయింపు ఇచ్చింది. చదవండి:పాత కార్లలో యూత్ రైడ్ -
కవాసాకి నింజా స్పోర్ట్స్ బైక్ సూపర్ : ధర ఎంతంటే?
సాక్షి, ముంబై: జపాన్‌కు చెందిన ప్రముఖ బైక్స్ తయారీదారు సరికొత్త అప్డేట్స కవాసాకి మరో సూపర్‌బైక్‌ను లాంచ్ చేసింది. సరికొత్త, డిజైన్, అప్డేట్స్తో ఈ సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. కవాసాకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ 2021 పేరుతో తీసుకొచ్చిన దీని ధరను అక్షరాలా 15 లక్షలుగా నిర్ణయించింది. తద్వారా మరో సూపర్‌బైక్ వరల్డ్ ఛాంపియన్షిప్ (వరల్డ్ఎస్బికె) టైటిల్ రేసులో దూసుకుపోనుంది. లైమ్ గ్రీన్, ఫ్లాట్ ఎబోనీ టైప్ 2 అనే 2 రంగులలో ఇది లభిస్తుంది. (ఆల్న్యూ క్రెటా అమ్మకాల జోరు) 2021 కవాసాకి నింజా జెడ్ఎక్స్ -10 ఆర్ ఫీచర్లు 998 సిసి, లిక్విడ్-కూల్డ్ ఇంజీన్ ( ఇన్-లైన్ 4 మోటారు) 13,200 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 203 పవర్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. 11,400 ఆర్పీఎం వద్ద 114.9 ఎన్ఎం గరిష్ట టార్క్ ను అందిస్తుంది . 6 స్పీడ్ గేర్‌బాక్స్ అప్డేటెడ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఆల్-ఎల్ఇడి లైటింగ్, షోవా బిఎఫ్ఎఫ్ (బ్యాలెన్స్ ఫ్రీ ఫ్రంట్ ఫోర్క్), షోవా బిఎఫ్ఆర్సి లైట్ (బ్యాలెన్స్ ఫ్రీ రియర్ కుషన్) వెనుక మోనోషాక్, ఎలక్ట్రానిక్ థొరెటల్ వాల్వ్స్, కొత్త ఎయిర్-కూల్డ్ ఆయిల్ కూలర్, క్లోజ్-రేషియోను కలిగి ఉంది. ఇంకా టిఎఫ్టి డిస్ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్, 3 పవర్ మోడ్స్ (ఫుల్,మీడియం, లో), మూడు రైడింగ్ మోడ్స్ (స్పోర్ట్ / రోడ్ /రైన్ /రైడర్ (మాన్యువల్) ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, కార్నరింగ్ మేనేజ్మెంట్ ఫంక్షన్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ అనే 5 మోడ్స్ ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. విండ్స్క్రీన్తోపాటు సైడ్ ప్యానెల్స్‌తో పాటు అప్డేట్ చేసింది. అలాగే హ్యాండిల్ బార్ అండ్ ఫుట్ పెగ్ పొజిషన్లను కూడా ఇచ్చింది. రియర్ సీటును సౌకర్యవంతంగా రూపొందించింది. -
ఢిల్లీలో ‘కవాసాకి’ కలకలం
న్యూఢిల్లీ: రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో సతమతమవుతోన్న దేశరాజధానిని తాజాగా ‘కవాసాకి’ కలవరపెడుతోంది. గత కొన్ని నెలలుగా ఢిల్లీలో కరోనాతో బాధపడుతున్న పిల్లల్లో ‘కవాసాకి’ అనే అరుదైన వ్యాధి లక్షణాలు బయటపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రధానంగా ఐదేళ్లలోపు పిల్లలు ఈ వ్యాధికి అధికంగా గురవుతారు. ఏ కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుందో ఇంతవరకు తెలయలేదు. అయితే ఈ వ్యాధి బారిన పడిన పిల్లల్లో జ్వరం, శరీరమంతా రక్తనాళాలు ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం ఐదు రోజుల కన్నా ఎక్కువ ఉండటమే కాక సాధారణ మందులకు తగ్గదని వైద్యులు తెలుపుతున్నారు. ఢిల్లీలోని కళావతి సరన్ అనే పిల్లల ఆస్పత్రిలో కవాసాకి లక్షణాలున్న కేసులు ఆరు ఉన్నాయి. అయితే వీరంతా కరోనాతో బాధపడుతున్నారు. ఈ పిల్లలందరు జ్వరం, జీర్ణకోశ, శ్వాసకోశ సమస్యలు, దద్దుర్లతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. (కరోనా: అవి వాడాకా ఒక్కరు కూడా చనిపోలేదు) ఈ క్రమంలో కళావతి సరన్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ఇవి ప్రపంచవ్యాప్తంగా కనిపించే అత్యంత సాధారణ లక్షణాలని తెలిపారు. ఇది కరోనాకు సంబంధించిన వ్యాధి కూడా అయ్యే అవకాశం ఉందన్నారు. అందువల్లే ఈ చిన్నారులంతా కవాసాకి బారిన పడ్డారని స్పష్టంగా చెప్పలేక పోతున్నామన్నారు. కానీ ఈ పిల్లలో కనిపించే లక్షణాలు మాత్రం కవాసాకి వ్యాధిలో కనిపించే లక్షణాలే అని కుమార్ తెలిపారు. పిల్లలంతా షాక్‌లో ఉన్నారని.. తమ అనారోగ్యం గురించి సరిగా చెప్పలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ పాజిటివ్ కేసులన్నింటిని కోవిడ్ కేర్ ఏరియాలో జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు తెలిపారు. వీరిలో ఇప్పటికే ఒకరు మరణించారని డాక్టర్ వెల్లడించారు. గతంలో న్యూ ఇంగ్లాండ్ జర్నల్ మెడిసిన్ రెండు అధ్యయనాలు ప్రచురించింది. వీటిల్లో ఎమ్ఐఎస్-సీ అనే వ్యాధి గురించి చర్చించారు. మూడు వందల మంది అమెరికా టీనేజ్ పిల్లల్లో ప్రాణాంతకమైన ‘మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరి సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్’(ఎమ్ఐఎస్-సీ) లక్షణాలు కనిపించాయని ఈ అధ్యయనాలు వెల్లడించాయి. ఈ ఎమ్ఐఎస్-సీ వ్యాధిలో కూడా జ్వరం, దద్దుర్లు, గ్రంథులు వాయడం.. కొన్ని సందర్భాల్లో గుండె మంటతో సహా కవాసాకిలో కనిపించే షాక్‌కు కూడా గురవుతారు. అయితే ఈ లక్షణాలను కనిపించిన వెంటనే చికిత్స అందించకపోతే.. పిల్లలు చనిపోయే ప్రమాదం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. (ఆ వ్యాక్సిన్‌పై సంతృప్తికర ఫలితాలు) సర్ గంగా రామ్ ఆస్పత్రిలో కూడా ఇలాంటి ఆరు కేసులు వెలుగు చూశాయన్నారు వైద్యులు. వీరిలో నలుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మిగతా ఇద్దరిలో ఈ వ్యాధికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రతిరోధకాలను అభివృద్ధి కాలేదని తెలిపారు. మరోకేసులో కొద్ది రోజుల క్రితం అధిక జ్వరం, దద్దుర్లతో బాధపడుతున్న 13 ఏళ్ల బాలుడిని బీఎల్కే ఆస్పత్రికి తీసుకువచ్చారు. అతడికి కరోనా పాజిటివ్‌గా తెలిసింది. ఆ తర్వాత ఆ పిల్లాడు పొత్తికడుపులో నొప్పి, వాంతులు, నోటి ద్వారా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటమే కాక జ్వరం అధికమయ్యింది. చివరకు అతడి కాళ్లు, చేతులు చల్లగా, నీలం రంగులోకి మారిపోయాయి. ఈ వ్యాధి అతడి గుండె, మూత్రపిండాల మీద కూడా ప్రభావం చూపింది. ఫలితంగా ఆ పిల్లాడి కండీషన్ సీరియస్‌గా మారిందని వైద్యులు తెలిపారు. -
జపాన్‌లో విద్యార్థినులపై కత్తులతో దాడి
కవాసకీ: జపాన్‌లోని కవాసకీ నగరంలో మంగళవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. స్కూల్ విద్యార్థినులే లక్ష్యంగా ఓ వ్యక్తి కత్తులతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఘటనలో ఓ విద్యార్థిని సహా ప్రభుత్వ ఉద్యోగి మరణించారు. 17 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన నోబోరిటో పార్క్ సమీపంలో ఉన్న బస్టాప్‌లో చోటుచేసుకుంది. గాయాలైన వారిలో 6 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న బాలికలే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది కారిటాస్ గాక్వెన్ అనే పాఠశాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులంతా బస్ కోసం వేచి చూస్తున్న క్రమంలో ఓ వ్యక్తి రెండు చేతులతో కత్తులు పట్టుకుని దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఘటనకు కారణమైన వ్యక్తి గొంతు కోసుకుని మరణించాడని పోలీసులు వెల్లడించారు. దాడికి గల కారణాలు తెలియరాలేదు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కవాసాకి కొత్త బైక్స్ లాంచ్..ధరలు?
న్యూఢిల్లీ: కవాసాకి తన ఫ్లాగ్ షిప్ మోడల్ బైక్‌లను భారతదేశంలో లాంచ్ చేసింది. జెడ్ 1000, జెడ్ 1000ఆర్ ఎడిషన్లను విడుదల చేసింది. వీటి ధర ధర రూ .14 లక్షల వద్ద ప్రారంభమవుతుంది. కొత్త బీఎస్-2 ప్రమాణాలతో రూపొందించిన ఈ సరికొత్త బైక్స్ అమ్మకాలను ప్రారంభించింది. జపాన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన స్పోర్ట్స్ బైక్ కవాసకీ 2017 మోడల్స్‌ను ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వీటి ధరలను వరసగా రూ 14.49 లక్షల (ఎక్స్ షోరూమ్, న్యూ ఢిల్లీ) మరియు రూ. 15.49 లక్షల (ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ) ప్రారంభ ధరలుగా ప్రకటించింది. కొత్త కవాసకీ జెడ్ 1000 లోఒక సున్నితమైన విద్యుత్ సరఫరా కోసం సవరించిన ఈసీయుని అమర్చింది. ఈ రెండింటిలో ముందువైపు డ్యూయల్ 310 మిమీ డిస్క్ బ్రేక్ , వెనుకవైపు 250 ఎంఎం డిస్క్ పొందుపర్చింది.. అంతేకాకుండా 41 మిల్లీమీటర్ల సైడ్ డౌన్ ఫోర్క్, ముందు ఓహ్లిన్స్ వెనుక షాక్‌తో పాటు బ్రమ్బో ఎం50 మోనోబ్లోక్ బ్రేక్ కాలిపర్స్ ప్రధాన ఆకర్షణ. జె 1000 ఇంజీన్ 104 సీసీ ఇంజీన్, లిక్విడ్ కూల్డ్ బీఎస్ -4 ఇంజీన్ 142 మాగ్జిమం పవర్, 111 ఎన్ఎం గరిష్ట టార్క్, విత్ సిక్స్ స్పీడ్ గేర్ బ్యాక్స్ సవరించిన ఫ్రంట్ ఫోర్క్ సెట్టింగులు, రివైజ్డ్ వెనుక బ్రేక్ ప్యాడ్, మెరుగైన షాక్అబ్జార్బర్స్ 1435, 2045 వీల్ బేస్, 17 లీటర్ల ఇంధన సామర్ధ్యం జెడ్1000 మెటాలిక్ స్పార్క్ బ్లాక్ , గోల్డెన్ బ్లేజ్ గ్రీన్ లోనూ,జెడ్1000ఆర్ ఎడిషన్ మెటాలిక్ స్పార్క్ బ్లాక్ అండ్ మెటాలిక్ గ్రాఫైట్ గ్రే కలర్స్లోను లభ్యంకానుంది. -
ఎనిమిదేళ్ల బంధానికి తెగదెంపులు
కవసాకి, బజాజ్ తమ ఎనిమిదేళ్ల బంధానికి స్వస్తి చెప్పబోతున్నాయి. సేల్స్, మార్కెటింగ్ పొత్తులో ఏడేళ్లుగా సేవలందిస్తున్న కవసాకి, బజాజ్ ల బంధాన్ని 2017 ఏప్రిల్ 1 నుంచి ఆపివేయాలని కీలకనిర్ణయం తీసుకున్నట్టు కంపెనీలు ప్రకటించాయి. ఏప్రిల్ 1 అనంతరం నుంచి కవసాకి మోటార్ సైకిళ్లు విక్రయాలు, సేల్స్ సర్వీసు కూడా ఇండియా కవసాకి మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచే అందిస్తారని తెలిసింది. కవసాకి హెవీ ఇండస్ట్రీస్ జపాన్‌కు ఇది సబ్సిడరీ. 2009లో విక్రయాలు, విక్రయనాంతరం సర్వీసుల కోసం బజాజ్ ఆటో, కవసాకిలు పొత్తు ఏర్పరుచుకున్నాయి. అప్పటి నుంచి పొత్తులో ఇవి సేవలందిస్తున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా బజాజ్, కవసాకిల సహకార బంధాన్ని అలానే కొనసాగిస్తామని కంపెనీలు చెప్పాయి. ఇండియన్ సిటీల్లో విస్తరిస్తున్న కవసాకి ప్రస్తుతం 12 షోరూంలని కలిగిఉంది. 14 కవసాకి ఉత్పత్తులను విక్రయిస్తోంది. పరస్పర అంగీకారంతోనే తాము ఈ నిర్ణయానికి వచ్చామని బజాజ్ ఆటో తెలిపింది. 2017 ఏప్రిల్ 1కి ముందు, తర్వాత కవసాకి మోటార్ సైకిళ్లను కొన్నవారు ఇక నుంచి సేల్స్ సర్వీసు కూడా కవసాకిలోనే అందించనున్నారు. అయితే కేటీఎం బ్రాండుపై బజాజ్ ఎక్కువగా ఫోకస్ చేస్తుందని తెలిసింది. కేటీఎం బ్రాండులో బజాజ్ కి 48 శాతం స్టాక్ ఉంది. -
కవాసాకి బైక్ @ 8 లక్షలు
న్యూఢిల్లీ: జపాన్ టూవీలర్ కంపెనీ కవాసాకి కొత్త బైక్ మోడల్, జడ్800ను భారత మార్కెట్లోకి సోమవారం విడుదల చేసింది. ఈ బైక్ ధరను రూ.8.05 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించామని ఇండియా కవాసాకి మోటార్స్ డిప్యూటీ ఎండీ షిగెతో నిషికవ పేర్కొన్నారు. ఈ మోడల్బైక్ను పూర్తిగా తయారైన బైక్(సీబీయూ-కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూపంలో దిగుమతి చేసుకొని విక్రయిస్తామని వివరించారు. ఇప్పటికే ఇలాంటి సీబీయూ మోడళ్లు నాలుగు (14ఆర్, 10ఆర్, జడ్1000, నింజా 1000)ఉన్నాయని, ఇది ఐదవదని, ఈ ఐదు సీబీయూ మోడళ్లను ఈ ఏడాదికి 400 వరకూ విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. స్థానికంగా అసెంబుల్ చేసే సీకేడీ మోడళ్లు నింజా 300, నింజా 650 మోడళ్లను 1,400 వరకూ అమ్మడం లక్ష్యమని పేర్కొన్నారు. తాజా మోడల్‌తో కలుపుకుంటే ప్రస్తుతం ఈ కంపెనీ భారత్‌లో మొత్తం ఏడు మోడళ్లను విక్రయిస్తోంది. ప్రస్తుతం తమకు భారత్‌లో గతేడాది ఈ కంపెనీ రూ. 12 లక్షల విలువైన జడ్1000, నింజా 1000 బైక్‌లను మార్కెట్లోకి తెచ్చింది. ప్రత్యేకతలు జడ్ ఫ్యామిలీలో రెండో బైక్ ఇది. 806 సీసీ 4 స్ట్రోక్ లిక్విడ్ కూల్ ఇంజిన్, 6 గేర్లు. గరిష్ట వేగం గంటకు 233 కిమీ.