
జపనీస్ బైక్ తయారీ సంస్థ కవాసకి భారతీయ మార్కెట్లో అమ్మకాలను పెంచుకోవడానికి, కొత్త కస్టమర్లను ఆకర్శించడానికి ఇయర్ ఎండ్ ఆఫర్స్ ప్రకటించింది. ఎంపిక చేసిన కొన్ని బైక్స్ మీద కంపెనీ రూ. 20,000 నుంచి రూ. 60,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
👉 కవాసకి వెర్సిస్ 650 అడ్వెంచర్ టూరర్ కొనుగోలుపై సంస్థ రూ. 20,000 తగ్గింపుని అందిస్తోంది. రూ. 7.77 లక్షల ధర వద్ద లభించే ఈ బైక్ డిస్కౌంట్ తరవాత రూ. 7.57 లక్షలకు కొనుగోలు చేయవచ్చు.
👉 నింజా 650 స్పోర్ట్‌బైక్ కొనుగోలుపైన కవాసకి రూ. 35,000 తగ్గింపుని అందిస్తోంది. దీంతో రూ. 7.16 లక్షల ధర వద్ద ఉన్న ఈ బైకుని రూ. 6.81 లక్షలకు సొంతం చేసుకోవచ్చు.
👉 కంపెనీ అందించే గరిష్ట మొత్తం రూ. 60,000. ఈ డిస్కౌంట్ కేవలం వల్కన్ S క్రూయిజర్‌పై మాత్రమే లభిస్తుంది. రూ. 7.10 లక్షల ఖరీదైన ఈ బైకుని డిస్కౌంట్ తరువాత రూ. 6.50 లక్షలకు కొనుగోలు చేసుకోవచ్చు.
👉 కంపెనీ ప్రస్తుతం ట్విన్ సిలిండర్ మోడళ్లపై మాత్రమే డిస్కౌంట్‌లను అందిస్తోంది. రానున్న రోజుల్లో సింగిల్ సిలిండర్ మోడల్స్ మీద కూడా మంచి తగ్గింపులను అందించే అవకాశం ఉందని భావిస్తున్నాము.